develoment
-
సికింద్రాబాద్ స్టేషన్‌కు.. ఎయిర్‌పోర్టు లుక్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో, విమానా శ్రయాల స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఎట్టకేలకు పట్టాలెక్కబోతోంది. కేంద్రం గతంలోనే ఈ ప్రతిపాదన చేసినా.. ఇండియన్ రైల్వేస్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్ఎస్ డీసీ)ని ఏర్పాటు చేసినా కార్యరూపంలోకి రాలేదు. ఐఆర్ఎస్డీసీని రద్దు చేసి ఈ బాధ్యతను రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ)కు అప్పగించినా అడుగు ముందుకు పడలేదు. చివరికి బాధ్య తను జోన్ల అధికారులకు కట్టబెట్టారు. తాజా బడ్జెట్లో దక్షిణ మధ్యరైల్వే పరిధిలో స్టేషన్ల అభివృ ద్ధికి రూ.325 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో రాష్ట్రంలోని సికింద్రాబాద్ స్టేషన్‌తోపాటు ఏపీలోని నెల్లూరు, తిరుపతి స్టేషన్లను తీర్చిదిద్దనున్నారు. త్వరలోనే టెండర్లు.. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి కోసం దక్షిణమధ్య రైల్వే త్వరలోనే ఈపీసీ టెండర్లు పిలవనుంది. స్టేషన్లో పార్కింగ్ మొదలు, రైలు ఎక్కేవరకు అడుగడుగునా అంతర్జాతీయ స్థాయి వసతులను ఏర్పాటు చేస్తారు. విమానాశ్రయంలో ఉన్న తరహాలో ఆధునిక ఏర్పాట్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు వంటివీ ఉంటాయి. ఈ మేరకు భవనాన్ని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతారు. ఈ పనులకు నెల రోజుల్లో టెండర్లు పిలిచి, మూడు నెలల్లోపు వర్క్ ఆర్డర్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ వెంటనే పనులు మొదలుకానున్నాయి. -
‘కే’ తరహా అభివృద్ధి మంచిది కాదు..ఎందుకంటే ?
ముంబై: దేశానికి ‘సమ సమాజ’ వృద్ధి చాలా అవసరమని, అసమానతలు పెంచే వృద్ధి రేటు సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. వృద్ధి ఫలాలు సమాజంలో కొందరికే లభించి, మెజారిటీ వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమయ్యే ధోరణియే ‘కే’ (K) తరహా వృద్ధి మనకు వద్దన్నారు. గతంలో తరహాలో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ‘కే’ (K) తరహా వృద్ధిని అనుమతించబోదని అన్నారు. బాంబే చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... - భారతదేశంలో పెరుగుతున్న అసమానతలు మన సమాజంలో ఉద్రిక్తతలు, సమస్యలను సృష్టిస్తుంది. వాటిని మనం భరించలేము. మన వృద్ధిని మరింత విస్తృతపరిచి అందరికీ ఫలాలు లభించేలా సమానమైనదిగా చేయడానికి మనం ఇప్పుడు మార్గాలను కనుగొనాలి. - సమానమైన వృద్ధి అనేది ప్రజలను శక్తివంతం చేస్తుంది. వారు రాణించడానికి సరైన అవకాశాన్ని కల్పిస్తుంది. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22)ఆర్థిక వ్యవస్థ 9.2 శాతం, 2022–23 ఆర్థిక సంవత్సరంలో 8.5 లేదా 8.7 శాతం, 2023–24 ఆర్థిక సంవత్సరం 7.5 శాతం వృద్ధిని భారత్ నమోదుచేసే అవకాశం ఉంది. తద్వారా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుంది. - అయితే మన యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈ స్థాయి వృద్ధి రేట్లు సరిపోతాయా అన్నది మనం సంధించుకోవాల్సిన ప్రశ్న. అందుకు ఈ స్థాయి వృద్ధి రేటు సరిపోదన్నది సుస్పష్టం. భారీ వృద్ధి దిశలో ఉన్న అడ్డంకులను మనం తక్షణం తొలగించాల్సి ఉంది. ఇది అంత తేలికకాదు. అయితే అసాధ్యమే కాదు. - రాబోయే రెండు లేదా మూడు దశాబ్దాల పాటు మనం స్థిరమైన, వేగవంతమైన, రెండంకెల వృద్ధిని సాధించాలి. ఈ స్థాయి వృద్ధి రేటు వల్ల యువత సామర్థ్యం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉండదు. - కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనడానికి రెండంకెల స్థాయి వృద్ధి రేటు సాధన దోహదపడుతుంది. అయితే, దేశం సాధించాలనుకునే అభివృద్ధి పర్యావరణాన్ని పణంగా పెట్టకూడదన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా మన వృద్ధి ప్రణాళికలు ఉండాలి. అంతర్జాతీయ నియమ నిబంధనలు, ప్రమాణాలను పరిరక్షించడానికి కూడా ఇది ఎంతో అవసరం. - ఇక దేశంలో ప్రైవేటు రంగం పెట్టుబడులు ఎంతో కీలకం. ప్రైవేటు రంగ పెట్టుబడులు భవిష్యత్తులో దేశంలో వృద్ధికి చోదకశక్తిని అందిస్తాయి. -
బీసీ జనాభా లెక్కలు తేల్చాల్సిందే!
గణాంకాలు లేకుండా ఓబీసీల అభివృద్ధి ప్రణాళికలు ఎలా సాధ్యం? స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలో ఓబీసీల కుల గణాంకాల అవసరం గురించి చర్చ జరుగుతూనే ఉంది. వివిధ సామాజిక వర్గాలు ఏ రంగాల్లో, ఎంత స్థాయిలో వెనుకబడి ఉన్నారు? వారి ప్రధానమైన సమస్యలేమిటి? గత కాలంలో వారి జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా? ప్రభుత్వం ఏ విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి? అన్న ప్రశ్నలకు సమాధానం గణాంకాల ద్వారా వెతకడానికి సాధ్యమవుతుంది. 50 శాతం పైగా ఉన్న జనాభా విషయంలో మొదటి నుండి ఆధిపత్య కులాల ఆధ్వర్యంలో నడిచే అన్ని ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కావాలని నిర్లక్ష్యం చేయడం దారుణం. మన దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో 1872 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి చేపట్టిన కుల గణాంకాలలో కుల అంశం కూడా చేర్చారు. అది 1931 వరకు కొనసాగింది. 1941లో గణాంకాలు సేకరించినప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధంవల్ల ఆ ప్రక్రియలను మధ్యలోనే నిలిపివేశారు. 1951 నుంచి భారత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గణాంకాలు తప్ప ఓబీసీలు కుల గణాంకాలు చేపట్టడం కావాలనే మానివేసింది. మొదటి ఓబీసీ కమిషన్ 1953 (కాకా కలేల్కర్), రెండవ కమిషన్ (మండల్) 1979, తప్పనిసరిగా కుల గణాంకాలు చేపట్టాలని సిఫారసు చేశాయి. మండల్ కమిషన్ ఓబీసీల రిజర్వేషన్లను నిర్ధారించటానికి 1931 కుల గణాంకాలను ప్రాతిపదికగా తీసుకొన్నది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుచేసిన అన్ని బీసీ కమిషన్లు కులగణాంకాలు చేపట్టాలని పదేపదే చెబుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు కూడా శాస్త్రీయమైన గణాంకాలు లేకుండా ఏ సామాజిక వర్గానికి ఎంత శాతం ఎలా ఇయ్యాలి అన్న విషయంలో నిర్ణయం తీసుకోవడం అహేతుకమని చేప్తూనే ఉన్నాయి. 2010 సంవత్సరం పార్లమెంట్లో దాదాపు అన్ని పార్టీలు ఈ విషయంలో పట్టుపట్టగా యూపీఏ ప్రభుత్వం మొదటగా అంగీ కరించి, ఆ తర్వాత మాటమార్చి 2011లో సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ) చేపట్టటానికి ప్రభుత్వశాఖల ద్వారా దేశవ్యాప్త గణాంకాలను చేపట్టింది. అయితే అందులో తప్పులు దొర్లాయని గణాంకాల వివరాలు బయటపెట్టలేదు. ఆ తర్వాత 2014లో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం గణాంకాల వివరాలను బయట పెడతామని వాగ్దానం చేసి, జరిగిన తప్పులు సవరించలేని స్థాయిలో ఉన్నాయని, వాటిని అక్కడితో ఆపేసింది. కేవలం 20 శాతం కూడా లేని కులాలు 80 శాతం పైగా దేశ వనరులను, ప్రభుత్వ వ్యవస్థలను, పరిశ్రమలను, వ్యాపారాన్ని, ఉద్యోగాలను, ఇంకా అధికారాన్ని తమ గుప్పిట్లో ఉంచుకున్నట్లు, 50 శాతం పైగా ఉన్న వేలాది కులాలు కింది స్థాయిలో కనీస అభివృద్ధికి నోచుకోకుండా అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైనట్లు బయటపడింది. అందువల్ల ఆ సమాచారాన్ని తొక్కిపెట్టించి ఉంచడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2021 సెన్సెస్‌లో కుల అంశాన్ని చేర్చాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. గణాంకాల అవసరం గురించి దాదాపు అన్ని పార్టీలవారు ప్రస్తావించి, సమాచారం లేకుండా కొత్త కులాలను చేర్చడానికి, అభివృద్ధి చెందిన కులాలను జాబితాల నుండి తొలగించటానికి ఎలా సాధ్యమని ప్రశ్నించాయి. సమాచారం లేకుండానే కులాలను వర్గీకరిస్తే భవిష్యత్తు పరిణామాలు అసంబద్ధంగా ఉండే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి 2021 సెన్సెస్‌లో భాగంగా కుల గణాంకాలను చేపట్టాల్సిందే. వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి సుదమల్ల వెంకటస్వామి తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మొబైల్ : 93470 15154 -
సంక్షేమానికి దీటుగా అభివృద్ధి
-
ప్రత్యేక హోదా కోసం పోరాడదాం
పత్తికొండ టౌన్ : ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాడదామని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పత్తికొండలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 7వ రోజు కొనసాగాయి. నిరాహార దీక్షల్లో వైఎస్సార్సీపీ వెల్దుర్తి మండల కన్వీనర్ రవిరెడ్డి, నాయకులు శ్రీరాంరెడ్డి, చక్రపాణిరెడ్డి, స్వామినాయక్, వెంకటనాయుడు, లక్ష్మినారాయణ, తేజేశ్వరరెడ్డి, జగన్మోహన్రెడ్డి, సంజీవరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రామదాసు, రమేశ్, నాగిరెడ్డి, కృష్ణమూర్తి, శ్రావణ్, కృష్ణుడు కూర్చున్నారు. ఈ సందర్భంగా కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని నాలుగేళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడుతున్నారన్నారు. అనేక ఉద్యమాలు, దీక్షలు చేసి హోదా ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు. స్వార్థ రాజకీయాలు చేసే సీఎం చంద్రబాబు ఏనాడు హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదన్నారు. అధికారం కోసం బీజేపీతో అంటకాగి, ఉద్యమం ఉద్ధృతమైన సమయంలో మళ్లీ డ్రామాలు మొదలుపెట్టారన్నారు. అయినా చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రత్యేకహోదాతోనే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. అన్నివర్గాలు పోరాడితే కేంద్రం దిగివస్తుందన్నారు. సాయంత్రం సీపీఐ రాష్ట్ర నాయకుడు రామచంద్రయ్యతో కలిసి దీక్షల్లో కూర్చున్నవాళ్లకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, పత్తికొండ మాజీ సర్పంచ్ జి.సోమశేఖర్, మండల కన్వీనర్ జూటూరు బజారప్ప, జిల్లా కమిటీ సభ్యులు మద్దికెర రాజశేఖర్‌రావు, ఎర్రగుడి రామచంద్రారెడ్డి, నాయకులు కారం నాగరాజు, రవికుమార్ నాయుడు, నజీర్, లాలు, షరీఫ్, బురుజుల భరత్‌రెడ్డి, కారుమంచి, దేవన్న, పెద్దహుల్తి నాగరాజు, బనగాని శీను, వడ్డే లక్ష్మన్న, పోతుగల్లు వెంకటేశ్, మల్లికార్జునరెడ్డి, తిప్పన్న పాల్గొన్నారు. -
సుడా.. ఏదీ ప్రగతి జాడ!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఇప్పటివరకు హైదరాబాద్, వరంగల్‌కు మాత్రమే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి. తెలంగాణలో మూడో పెద్ద నగరంగా పేరొందిన కరీంనగర్ అభివృద్ధి కోసం ‘సుడా’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ప్రగతి జాడలు కన్పిస్తాయని అందరూ ఆశించారు. ‘సుడా’ ప్రకటించిన ప్రభుత్వం అదేరోజూ తాత్కాలిక కమిటీని కూడా నియమించింది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, కార్పొరేషన్ కమిషనర్ వైస్‌చైర్మన్‌గా, కరీంనగర్ ఎమ్మెల్యే, సీడీఎంఏ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీటీసీపీలు మెంబర్లుగా కమిటీ వేశారు. సుడా పరిధిలోకి వచ్చే మరో ఎమ్మెల్యేలను కూడా కమిటీలోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. నగర పాలక సంస్థ 50 డివిజన్లతో పాటు 580 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 8 మండలాల పరిధిలోని 71 గ్రామాలను పట్టణాభివృద్ధి సుడాలో చేర్చారు. ప్రసుత్తం నగర జనాభా 3.15 లక్షలుగా ఉంది. సుడా పరిదిలోకి 71 గ్రామాలను కలిపితే జనాభా 6.12 లక్షల పైచిలుకుకు చేరింది. ఈ వివరాలన్నింటితో ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయగా.. ఇప్పటివరకు కనీసం ‘సుడా’ కార్యాలయం ఏర్పాటు చేయలేదు. ప్రగతిజాడ కనిపించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. ‘సుడా’ వేగం పెరిగితేనే అభివృద్ధి.. పక్కాగా ‘మాస్టర్‌ప్లాన్’ శాతవాహన అర్బన్ అథారిటీ ఏర్పాటుతో గ్రామాల అభివృద్ధి వేగంగా జరగనుంది. ఇప్పటివరకు గ్రామ, నగరస్థాయిలో ఎవరికి తగినట్లు వారికి మాస్టర్ ప్లాన్ అమలులో ఉంది. సుడాతో నగరానికి ధీటుగా అన్ని గ్రామాలకు సైతం సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. 30 ఏళ్ల జనాభాకు తగ్గట్టుగా మాస్టర్‌ప్లాన్ తయారు చేసి ఆ దిశగా అభివృద్ధి చేపట్టనున్నారు. ఇప్పటివరకు నగరపాలక సంస్థ, గ్రామీణ ప్రాంతాల్లో ఆయా గ్రామపంచాయితీలు అనుమతులు జారీ చేసేవి. నగరం, గ్రామాలకు మధ్య వ్యత్యాసాలు ఉండేవి. సుడా ఏర్పాటుతో మాస్టర్‌ప్లాన్ ప్రకారం గ్రామాల్లో సైతం 60 ఫీట్లరోడ్లు, పక్కా డ్రైనేజీలు, వాటర్పైపులైన్లు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, భౌతికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. అర్బన్ అథారిటీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది. నగరం, గ్రామాలు ఒకేప్లానింగ్ ప్రకారం అభివృద్ధి చెందనున్నాయి. అర్బన్ అథారిటీ అభివృద్ధికి ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేస్తారు. చైర్మన్, అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం భవనాలు, కళాశాలలు, ఆసుపత్రులు, శ్మశానాలు, మార్కెట్లు, హరితస్థలాలు, జలవనరులు, పార్కులు, వ్యాపార కేంద్రాలు, ఎలగందుల ఖిల్లా, భవిష్యత్తుల్లో నిర్వహించనున్న మానేరు రివర్‌ఫ్రంట్ నిర్వహణ బాధ్యతలు సైతం సుడాకే దక్కనున్నాయి. పాలకవర్గం ఏర్పాటుకూ రాజకీయ గ్రహణం ముఖ్యమంత్రి కేసీఆర్ సుడా ఏర్పాటుకు ఆమోదముద్ర వేసి.. అక్టోబర్ 24న జీవో ప్రతులను వెలువరించారు. ‘సుడా’ పీఠం కీలకమైందిగా మారడం.. చైర్మన్ పదవిని టీఆర్ఎస్ నాయకుల్లో చాలామంది ఆశించడంతో పోటీ మొదలైంది. టీఆర్ఎస్లో పార్టీ ప్రారంభం నుంచి ఉంటున్న జీవీ.రామక్రిష్ణారావు పేరు ఖరారైనట్లు వినిపించింది. కట్ల సతీష్, వై.సునీల్‌రావు కూడా ఎవరి స్థాయిలో వారు రాజధానిలో తమ పలుకుబడిని ఉపయోగించి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం కూడా జరిగింది. మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన జీవీ.రామక్రిష్ణారావు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. ఇప్పటివరకు పార్టీ పదవులు తప్ప ఎలాంటి నామినేటెడ్ పదవులూ వరించలేదు. ఆ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో ఎన్నికల్లో పాల్గొనే అవకాశాలు కూడా లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. అధిష్టానంతో చనువుగా ఉండడం, పార్టీలో అగ్రనాయకత్వంతో కూడా సంబంధాలు, బంధుత్వాలు ఉండడంతో సుడా చైర్మన్ ఆయననే వరించే అవకాశం మెండుగా ఉందని ప్రచారం జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభల హడావుడి అయిపోగానే రామక్రిష్ణారావు చైర్మన్‌గా తొమ్మిదిమందితో కమిటీ వేసే అవకాశం ఉందని పార్టీవర్గాలు కూడా భావించాయి. కానీ.. రెండు నెలలు కావస్తున్నా రాజకీయ జోక్యం కారణంగా ఇప్పటికీ ‘సుడా పాలకవర్గంపై మాత్రం సాగుతున్న సస్పెన్స్ తొలగడం లేదు. ‘సుడా’ పరిధిలోకి వచ్చే గ్రామాలు.. మండలాలవారీగా కరీంనగర్ అర్బన్ మండలం: కరీంనగర్ పట్టణం కొత్తపల్లి: సీతారాంపూర్, రేకుర్తి, మల్కాపూర్, చింతకుంట, పద్మనగర్, కమాన్‌పూర్, కొత్తపల్లి(హవేలి), లక్ష్మిపూర్, బద్దిపల్లి, నాగులమల్యాల, ఆసిఫ్‌నగర్, ఖాజీపూర్, ఎలగందుల. కరీంనగర్ రూరల్: వల్లంపహాడ్, దుర్శేడ్, నగునూరు, చేగుర్తి, బొమ్మకల్, ఆరెపల్లి, ఇరుకుల్ల, మగ్దుంపూర్, చెర్లబూత్కూర్, చామన్‌పల్లి, తాహెర్ కొండాపూర్, పకీర్‌పేట్, జూబ్లీనగర్, ఎలబోతారం. మానకొండూర్: మానకొండూర్, సదాశివపల్లి, జగ్గయ్యపల్లి, శ్రీనివాస్‌నగర్, ముంజంపల్లి, ఈదులగట్టెపల్లి, అన్నారం, చెంజర్ల, లింగాపూర్. తిమ్మాపూర్: తిమ్మాపూర్, అల్గునూరు, పొరండ్ల, రేణికుంట, కొత్తపల్లి (పీఎన్), నుస్తులాపూర్, నేదునూర్, పచ్చునూర్, మన్నెంపల్లి. గన్నేరువరం: చెర్లాపూర్, సంగెం, గోపాల్పూర్, పంతులుకొండాపూర్, పోత్గల్, హస్నాపూర్, యాశ్వాడ, గునుకుల కొండాపూర్, గన్నేరువరం, పారువెల్ల, కాశీంపెట, మైలారం, మాదాపూర్, జంగపల్లి. రామడుగు: వన్నారం, కొక్కెరకుంట, దేశ్రాజ్పల్లి, కిష్టాపూర్, వెదిర, వెలిచాల. చొప్పదండి: కోనేరుపల్లి, రుక్మాపూర్, కొలిమికుంట, చాకుంట, ఒద్యారం. ప్రభుత్వానికి ప్రతిపాదనలు కరీంనగర్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ‘సుడా’ను ప్రకటించింది. ఈ మేరకు కార్యాలయం ఏర్పాటు, సిబ్బంది వివరాలతో ప్రభుత్వానికి లేఖ రాశాం. అక్కడినుంచి వచ్చిన ఉత్తర్వుల ఆధారంగా కార్యాచరణ చేపడతాం. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సుడా కార్యకలాపాలు సాగుతాయి. – కె.శశాంక, కార్పొరేషన్ కమిషనర్ సుడా కమిటీ ఏర్పాటు చేయాలి అక్టోబర్ 24 సుడాను ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకూ కమిటీని ప్రకటించలేదు. మానకొండూర్ మండలంలోని సదాశివపల్లి, శ్రీనివాస్‌నగర్, జగ్గయ్యపల్లి, ఈదులగట్టెపల్లి, చెంజర్ల, ముంజంపల్లి గ్రామాలు సుడా పరిధిలోకి వెళ్లాయి. సుడా పరిధిలోకి వెళ్లడంతో ఈ గ్రామాల్లో మరింత అభివృద్ధి జరుగనుంది. సుడా కమిటీని ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలి. - జక్కం రామలింగం, రిటైర్డు ఉపాధ్యాయుడు, మానకొండూర్ అమలు చేస్తే బాగుంటుంది ప్రభుత్వం కరీంనగర్ నగరంతోపాటు శివారు గ్రామాలను కలుపుతూ సుడాగా ఎంపిక చేయడం హర్షణీయం. అయితే మూడునెలలు గడుస్తున్నా ఓ రూపం తేవకపోవడం విచారకరం. తక్షణమే పాలకవర్గాన్ని నియమించి అధికారాలు బదలాయించి అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేస్తే బాగుంటుంది. –శాతర్ల క్రిష్ణయ్య, రిటైర్డు ఉద్యోగి అభివృద్ది వేగవంతం సుడా ఎంపిక సబబే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల కేటాయింపు ఉంటుంది. తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుంది. ప్రభుత్వం సుడా ఏర్పాటుపై దృష్టిసారించి ప్రత్యేక కార్యాలయం, పాలకవర్గాన్ని నియమించాలి. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తే ఫలితాలు బాగుంటాయి. – మండల రాజలింగం,రిటైర్డు తహసీల్దార్ -
స్త్రీపెన్నిధి
సంగారెడ్డిజోన్ : పేద, నిరుపేదలకు స్వల్పకాలంలో అతి తక్కువ వడ్డీతో అవసరానికి అప్పు అందించడానికి మహిళలకు పెన్నిధిలా స్త్రీనిధి చేయూతనిస్తోంది. దీన్ని మహిళా సంఘాల సభ్యుల కోసం 2011 సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామీణ ప్రజలు వివిధ ఆర్థిక అవసరాలు, పెట్టుబడుల కోసం మైక్రో ఫైనాన్స్‌లను ఆశ్రయించి అధిక వడ్డీతో పాటు విలువైన ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్‌లను అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నియంత్రించి మహిళలకు ఊరట కలిగించారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2011లో ఏడాదికి 12.5శాతం వడ్డీతో ఎలాంటి డాక్యుమెంట్లు, ఇతర ఖర్చులు లేకుండా రుణాలు నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ అయ్యేలా స్త్రీ నిధి పథకం రూపొందించారు. సంఘంలోని సభ్యులు స్త్రీనిధి రుణం కోసం ఐవీఆర్ఎస్ పద్ధతిలో ఫోన్ ద్వారా నేరుగా సమాచారం అందించిన 48 గంటల్లోగా వారి ఖాతాల్లో రుణం సొమ్ములు జమ అవుతాయి. ఈ వ్యవస్థలో నగదు లావాదేవీలు ఉండకపోవడం వల్ల అవినీతికి చోటులేకుండా నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. ఈ ఏడాది స్త్రీ నిధి రుణాలు 60 నుంచి 70శాతం ఆదాయం ఉత్పత్తికి వాడాల్సిందిగా లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. రూ. 25 వేల వరకు ఫోన్ ద్వారా ఆపైన రూ. లక్ష వరకు ఎన్ఆర్ఎల్ఎం ద్వారా దరఖాస్తు చేసిన వారంలోగా రుణాలు అందిస్తారు. మన రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం ఇటీవల 4వ సర్వసభ్య సమావేశం నిర్వహించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిన సంగారెడ్డి జిల్లాకు మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా అవార్డు అందజేశారు. జిల్లాలోని 26 మండలాల్లో, మూడు మున్సిపాలిటీల (సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్) పరిధిలో 21,309 ఎస్ఎన్జీ సంఘాలు నమోదు కాగా 2,32,115 మంది సభ్యులు ఉన్నారు. మొదటి ఏడాది స్త్రీ నిధి కింద సభ్యులకు రూ. లక్ష 50 వేల వరకు రుణం మంజూరు చేయగా వారు తిరిగి 24 నెలల గడువులో చెల్లించాల్సి ఉంటుంది. జీవనోపాధి పెంపుకోసం, వ్యాపారాల విస్తరణ కోసం సంఘంలోని మరో ఇద్దరు సభ్యులకు రూ.50 వేల వరకు రుణం ఇచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 2017 మార్చి 31 నాటికి రూ. 67.62 కోట్ల రుణాల వితరణ ప్రణాళిక లక్ష్యం కాగా రూ. 64.21 కోట్లను సంఘ సభ్యులకు పంపిణీ చేశారు. వీటి వల్ల 6వేల 6 సంఘాలకు లబ్ది చేకూరింది. అత్యధికంగా నారాయణఖేడ్, హత్నూర, గుమ్మడిదల, కొండాపూర్ మండలాల పరిధిలోని ఎస్‌హెచ్‌జీ సంఘాలు స్త్రీ నిధి రుణాలు లక్ష్యాన్ని అధిగమించి పొందగా అత్యల్పంగా మొగుడంపల్లి, కల్హెర్, నాగల్గిద్ద మండలాలు నిర్ణయించుకున్న లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోయాయి. మూడో స్థానంతో సరి.. జిల్లా గతంలో రుణాల పంపిణీ, రికవరీలో ప్రథమ, ద్వితీయస్థానంలో ఉండేది. కానీ వెనుకబడిన ప్రాంతాల్లో సకాలంలో రుణాల రికవరీని ఆన్లైన్లో అప్లోడ్ చేయలేకపోయారు. దీంతో నిర్ధేశించిన సమయానికి రికవరీలో వెనుకబడడం వల్ల సాంకేతికంగా జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సమన్వయంతో సాధించాం కలెక్టర్, డీఆర్డీఓ, క్షేత్రస్థాయి సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ సమీక్షలు నిర్వహించాం. క్లస్టర్లవారీగా డీపీఎంలతో కలిసి సమావేశాలు, ఆర్ఎం అనంతకిశోర్ ప్రోత్సాహం వల్ల రుణాల పంపిణీ, రికవరీలోనూ మెరుగైన ఫలితాలను సాధించాం. గతంలో ఉన్న నంబర్ వన్ స్థానానికి చేరుకునేలా మరింత కృషి చేస్తాం. – ఏపీడీ సిద్ధారెడ్డి ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడతాయి స్త్రీనిధి రుణాలు సకాలంలో అందించడంతోపాటు తిరిగి రికవరీ చేయడంలో సిబ్బంది, సభ్యుల పాత్ర చాలా కీలకమైంది. ఈ రుణాలను ఆదాయ ఉత్పత్తికి వినియోగిస్తే కుటుంబాలు పురోభివృద్ధి సాధిస్తాయి. నిరుపేదలు, పేదలు, గేదెలు, పశువులు, మేకల కొనుగోలుకు వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. – చంద్రకళ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు -
మహిళల అభ్యున్నతే ధ్యేయం
జైనథ్(ఆదిలాబాద్): మహిళల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల్లోని 260 మంది మహిళలకు దళితబస్తీ పెట్టుబడి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద దళితులను రైతులుగా మార్చడమే లక్ష్యంగా దళితబస్తీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మొదటి సంవత్సరం పెట్టుబడి ఖర్చుతోపాటు భూమి అభివృద్ధి, సాగునీటి సౌకర్యాల కల్పనకు నిధులు అందిస్తున్నామని అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 1500 ఎకరాలు అందించామని, త్వరలో మరో వెయ్యి ఎకరాల భూమిని లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. వచ్చే ఖరీఫ్ కంటే ముందు మే 15 వరకు ఖరీఫ్ కోసం ఎకరానికి రూ.4వేలు రూపాయల పెట్టుబడి ఖర్చును ప్రభుత్వం చెక్కుల రూపంలో అందిస్తుందని తెలిపారు. రబీలో పంటలు వేసుకున్న రైతులకు సైతం ఎకరానికి రూ.4 వేల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం ప్రతి 5 వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించామని, గ్రామాల్లో క్లస్టర్ వారీగా మట్టి పరీక్షలు చేసే మినీ ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. త్వరలో క్లస్టర్‌కు ఒక రైతు భవనం నిర్మించి, రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు శాశ్వత వేదికలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఇరవై ఏళ్లు కొనసాగుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అనంతరం దళితబస్తీ లబ్ధిదారులకు పెట్టుబడి ఖర్చు చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, బేల ఎంపీపీ రఘుకుల్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు అడ్డి భోజారెడ్డి, తల్లెల చంద్రయ్య, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సర్సన్ లింగారెడ్డి, మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ ఎల్టి భూమారెడ్డి, వైస్ ఎంపీపీ రోకండ్ల సురేశ్రావు, నాయకులు గంబీర్ ఠాక్రే, గడ్డ పోతరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎడ్లబండెక్కిన మంత్రి మంత్రి జోగు రామన్న గురువారం ఎడ్లబండిపై మార్కుట్‌యార్డుకు చేరుకున్నారు. ఎప్పుడూ కారులో తిరిగే మంత్రి బండెక్కి నడపడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. తాను ఒకప్పుడు స్వయంగా తన భార్యతో కలిసి చేనులో పని చేసిన రైతు బిడ్డనని, చాలా రోజుల తర్వాత ఎడ్లబండి నడపడం సంతోషంగా ఉందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఘనంగా సన్మానం మంత్రి రామన్నను ఆయా మండలాల్లోని దళితబస్తీ లబ్ధిదారులు, మహిళలు ఘనంగా సన్మానించారు. తమ భూముల్లో బోర్లు, బావులు వేసుకునేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరారు. భూమి చదును చేసుకోవడానికి డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు. -
గ్రామాలభివృద్ధికి కృషి
చిలుకూరు: గ్రామాలాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతి అన్నారు. బుధవారం చిలుకూరులో తన నిధులు నుంచి రూ. 3 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో ప్రాధాన్యత ప్రకారం పనులు చేస్తామన్నారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకుడు కొల్లు స్వామి ఇంట్లో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. అంతకు ముందు రూ. 6 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్, మాజీ ఎంపీపీలు దొడ్డా నారాయణరావు, కొండా అన్నపూర్ణ, సర్పంచ్ సుల్తాన్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ పుట్టపాక శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాగా శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానపరిచిందని స్థానిక ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పిలిచి తాను రాకముందుకే శంకుస్థాపన చేశారన్నారు. తాను బీసీ ఎంపీపీననే ఉద్దేశంతో కావలని అవమానపరిచిందని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. ఎమ్మెల్యే వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు.