రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న కంగాటి శ్రీదేవి
పత్తికొండ టౌన్ : ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాడదామని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పత్తికొండలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 7వ రోజు కొనసాగాయి. నిరాహార దీక్షల్లో వైఎస్సార్‌సీపీ వెల్దుర్తి మండల కన్వీనర్ రవిరెడ్డి, నాయకులు శ్రీరాంరెడ్డి, చక్రపాణిరెడ్డి, స్వామినాయక్, వెంకటనాయుడు, లక్ష్మినారాయణ, తేజేశ్వరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, సంజీవరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రామదాసు, రమేశ్, నాగిరెడ్డి, కృష్ణమూర్తి, శ్రావణ్, కృష్ణుడు కూర్చున్నారు. ఈ సందర్భంగా కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని నాలుగేళ్లుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నారన్నారు. అనేక ఉద్యమాలు, దీక్షలు చేసి హోదా ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు.
స్వార్థ రాజకీయాలు చేసే సీఎం చంద్రబాబు ఏనాడు హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదన్నారు. అధికారం కోసం బీజేపీతో అంటకాగి, ఉద్యమం ఉద్ధృతమైన సమయంలో మళ్లీ డ్రామాలు మొదలుపెట్టారన్నారు. అయినా చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రత్యేకహోదాతోనే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. అన్నివర్గాలు పోరాడితే కేంద్రం దిగివస్తుందన్నారు. సాయంత్రం సీపీఐ రాష్ట్ర నాయకుడు రామచంద్రయ్యతో కలిసి దీక్షల్లో కూర్చున్నవాళ్లకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, పత్తికొండ మాజీ సర్పంచ్ జి.సోమశేఖర్, మండల కన్వీనర్ జూటూరు బజారప్ప, జిల్లా కమిటీ సభ్యులు మద్దికెర రాజశేఖర్‌రావు, ఎర్రగుడి రామచంద్రారెడ్డి, నాయకులు కారం నాగరాజు, రవికుమార్ నాయుడు, నజీర్, లాలు, షరీఫ్, బురుజుల భరత్‌రెడ్డి, కారుమంచి, దేవన్న, పెద్దహుల్తి నాగరాజు, బనగాని శీను, వడ్డే లక్ష్మన్న, పోతుగల్లు వెంకటేశ్, మల్లికార్జునరెడ్డి, తిప్పన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment