fsl report
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. కీలకం కానున్న ఎఫ్ఎస్ఎల్ నివేదిక!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో భాగంగా నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, సింహయాజి స్వామి, నందకుమార్‌ను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మొదటిరోజు విచారణలో భాగంగా పలు కీలక ప్రశ్నలకు సంధించారు సిట్ అధికారులు. ఇక, నిందితుల కస్టడీలో రెండో రోజు కూడా విచారణ జరుగుతోంది. కాగా, రెండో రోజు కస్టడీలో భాగంగా పోలీసులు.. నిందితుల వాయిస్ రికార్డ్ చేయనున్నారు. ఎఫ్ఎస్ఎల్లో నిందితుల వాయిస్ పరిశీలన పరీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకం కానుంది. కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు సూత్రధారులు, పాత్రధారులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కస్టడీ అనంతరం నిందితులను కోర్టులో కోర్టులో హాజరపర్చనున్నారు పోలీసులు. -
అంకిత్ శర్మ హత్య కేసులో తాహీర్‌పై ఆరోపణలు
-
రాసలీలల వీడియోలో ఉన్నది నిత్యానందే....
సాక్షి, న్యూఢిల్లీ : వివాదస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. తన అనుంగు శిష్యురాలు రంజితతో కలిసి సన్నిహితంగా... వీడియో టేపులలో ఉన్నది స్వామి నిత్యానందేనని ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ స్పష్టం చేసింది. దీంతో ఈ సాములోరు మరోసారి వార్తల్లో నిలిచారు. కాగా నటి రంజితతో కలిసి ఉన్న రాసలీలల వీడియోల్లో ఉన్నది తాను కాదని, మార్ఫింగ్ జరిగిందంటూ ఇప్పటివరకూ నిత్యానంద వాదిస్తూ వచ్చారు. అయితే సీడీల్లో ఉన్నది నిత్యానందేనని ధ్రువీకరిస్తూ... ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన ఓ నివేదిక బుధవారం వెలుగులోకి వచ్చింది. 2010లో స్వామి నిత్యానంద రాసలీలల సీడీని ఆయన కారు డ్రైవర్ లీక్ చేయడంతో... ఆ దృశ్యాలు మీడియాతో పాటు, సోషల్ మీడియాలోనూ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తనను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రపన్నారని ఆయన ఆరోపణలు కూడా చేశారు. కాగా ఇప్పటికే నిత్యానందపై పలు కేసులు నమోదు అయిన విషయం విదితమే. అంతేకాకుండా నిత్యానంద తనపై అత్యాచారం చేశారంటూ ఆరతీరావ్ అనే శిష్యురాలు కోర్టును ఆశ్రయించారు. దీంతో 2010 సంవత్సరంలో ఆయనపై రేప్ కేసు నమోదు అయింది. తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవని, అందువల్ల తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించకూడదన్న నిత్యానందకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. అంతేకాకుండా లింగ సామర్ధ్య నిర్దారణ పరీక్షలకు ఆయన అంగీకరించకపోవడంపై ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా మందలించింది కూడా. -
కల్తీ మద్యంపై సిట్ ఏర్పాటు
విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం ఘటనపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జెవి రాముడు తెలిపారు. సీనియర్ ఐపీఎస్ అధికారి, డీఐజీ లడ్హా నేతృత్వంలో 9 మంది కమిటీ విజయవాడ కల్తీ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. కల్తీ మద్యం ఘటనకు బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చిన తరువాత కల్తీ మద్యం కేసులో స్పష్టత వస్తుందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కల్తీ మద్యం మరణాల కేసులు కూడా సిట్ దర్యాప్తులో పరిగణనలోకి తీసుకుంటుందని రాముడు చెప్పారు. ఇక ఈ కేసులో తొమ్మిది మంది బార్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆందోళన కలిగించింది
-
ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆందోళన కలిగించింది: మత్తయ్య
గుంటూరు: ఓటుకు కోట్లు కేసు విచారణకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియడం లేదని, ఆ కేసులో నాలుగో నిందితుడు జెరూసలేం మత్తయ్య అన్నారు. ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు హ్యారీ సెబాస్టియన్‌ను కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రానివ్వడం లేదని మత్తయ్య పేర్కొన్నారు. వాయిస్ శాంపిల్స్‌కు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరి (ఎఫ్ఎస్ఎల్) రిపోర్ట్ రావడం మాకు ఆందోళన కలిగించిందని తెలిపారు. ఏకంగా ఒక మంత్రే మమ్మల్ని అవమానిస్తున్నారని మత్తయ్య గుంటూరులో అన్నారు. ఇక భవిష్యత్తులో విపరీత పరిణామాలు ఎదురైతే ఏం చేయాలో తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
రేవంత్, సండ్ర స్వర నివేదికలివ్వండి
-
ఓటుకు కోట్లు కేసులో కీలక నివేదిక
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు కీలక దశకు చేరుకుంది. స్టింగ్ ఆపరేషన్ లో ఉన్న వీడియో టేపులు నిజమైనవేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నిర్ధారించింది. ఆడియో, వీడియో టేపుల్లో ఉన్న వాయిస్ నిందితులదేనని తేల్చింది. టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, టీడీపీ నేత జెరూసలెం మత్తయ్య వాయిస్ తో సరిపోలినట్టు నిర్ధారించింది. ఇక ఎఫ్ఎస్ఎల్ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాయిస్ నమూనాను సేకరించాలని భావిస్తున్నామని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయడానికంటే ముందు చంద్రబాబు స్వర నమూనా తీసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. అసెంబ్లీ, మీడియా చానల్స్ ద్వారా నిందితుల స్వర నమూనాలను సేకరించి ఎఫ్ఎస్ఎల్ పరీక్షకు పంపారు. స్టింగ్ ఆపరేషన్ ఆడియో, వీడియోల్లోని వాయిస్ తో నిందితుల వాయిస్ సరిపోలినట్టు ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. ఎఫ్ఎస్ఎల్ నివేదికను కోర్టుకు ఫోరెన్సిక్ అధికారులు సమర్పించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికను తమకు ఇవ్వాలని కోర్టును ఏసీబీ కోరనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెసన్ సన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. మే 30న బోయిగుడాలోని బిషప్ హ్యారీ సెబాస్టియన్ నివాసంలో రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా మాటలను ఐఫోన్, డిజిటల్ రికార్ల ద్వారా రహస్యంగా రికార్డు చేయించారు. మే 31న విక్రంపురి కాలనీలోని తన మిత్రుడు మాల్కమ్ టేలర్ నివాసంలోనూ టీడీపీ నాయకుల మాటలను రికార్డు చేశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ. 50 లక్షలు ఇస్తూ ఏసీబీకి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఈ సందర్భంగా సెబాస్టియన్ ఫోన్ లో రికార్డైన వాటిని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక యాప్ ద్వారా ఆయన రికార్డు చేసినట్టు గుర్తించారు. దీంతో ఏసీబీ అధికారులకు అదనంగా మరో సాక్ష్యం దొరికినట్టైంది. ఇందులో 516 కాల్స్ రికార్డు కాగా అందులో 102 కాల్స్ ఓటుకు కోటుకు కేసుకు సంబంధించినవే అని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఫోన్ ద్వారానే స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎఫ్ఎస్ఎల్ నివేదికతో ఈ కేసులో ఏసీసీ దర్యాప్తు వేగం పుంజుకోనుంది. -
సారిక కేసులో ఆ రిపోర్టే కీలకం
వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల మృతి కేసు విచారణను శాస్త్రీయంగా చేస్తున్నామని ఏసీపీ శోభన్ కుమార్ తెలిపారు. ఈ కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) రిపోర్టే కీలకంగా మారనుందని అన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు ఆస్కారం లేదన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కేసును విశ్లేషిస్తుందని... ఈ నివేదికను బట్టే హత్యా లేదా ఆత్మహత్యా అనే దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. ప్రస్తుతం రాజయ్య కుటుంబసభ్యులు పోలీసులు అదుపులో ఉన్నారు. కేసు నమోదు చేశామని.. విచారణ తర్వాతే ఏం జరిగిందనేది తెలుస్తుందని ఏసీపీ తెలిపారు. -
డబ్బు సమకూర్చిన బడాబాబుల కోసం వేట
-
’వీడియో, ఆడియో టేపులన్నీ వాస్తవాలే’
-
'సాక్షి' చేతికి ఫోరెన్సిక్ నివేదిక
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో వాస్తవాలు బయటపడుతున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక 'సాక్షి' సంపాదించింది. ఓటుకు కోట్లు కేసులో నడిచిన వ్యవహారమంతా వాస్తవాలేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. ఏసీబీ దాడులు చేసిన సమయంలో రెడ్హాండెడ్గా పట్టుకున్న వీడియో, ఆడియో టేపులపై ఫోరెన్సిక్ ల్యాబ్ విశ్లేషించింది. దాదాపు 12 రోజులపాటు నిశితంగా విశ్లేషించి... అవన్నీ వాస్తవాలేనని నిర్ధారించింది. వీడియో, ఆడియో టేపులను ఎవరూ ఎడిట్ చేయలేదని, కల్పితాలు కాదని కూడా ల్యాబ్ విస్పష్టంగా ప్రకటించింది. ఈ ఫోరెన్సిక్ నివేదిక ఓటుకు కోటు కేసులో కీలకంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ...నగదు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలను మరింత నిర్ధారణ కోసం ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన విషయం తెలిసిందే. రెండు సెల్ఫోన్లు, కెమెరాలు, రేవంత్ రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న సీపీయూలను ల్యాబ్‌కు పంపారు. అలాగే మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను కూడా ల్యాబ్‌కు పంపారు. ఆడియోలో ఉన్నది తన గొంతు కాదంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న వాదనల నేపథ్యంలో ఆధారాలను ల్యాబ్‌కు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ 14 ఆడియోలో, వీడియో టేపుల్లో ఉన్న వాస్తవ అంశాలను ల్యాబ్ శాస్త్రీయ రీతిలో నిర్ధారణ చేశారు. *మొత్తం మూడు ఫైల్స్‌లో వీడియో దృశ్యాలు * మొదటి వీడియో ఫైల్ నిడివి 86 నిమిషాల 21 సెకండ్లు *రెండో వీడియో ఫైల్ నిడివి 10 నిమిషాల 38 సెకండ్లు *మూడో వీడియో ఫైల్ నిడివి 43 నిమిషాల 9 సెకన్లు * తొలి ఆడియో ఫైల్ నిడివి 45 నిమిషాల 12 సెకన్లు * రెండో ఆడియో ఫైల్ నిడివి 44 నిమిషాల 52 సెకన్లు *మూడో ఆడియో ఫైల్ నిడివి 47 నిమిషాల 18 సెకన్లు ఎవరు ఎవరితో ఏం మాట్లాడారో మొత్తం విపులంగా రిపోర్టులో పేర్కొన్న ఎఫ్ఎస్ఎల్ ఏసీబీ నుంచి జులై 14న టేపులు అందుకున్న ఎఫ్ఎస్ఎల్, జులై 24న నివేదిక ఇచ్చిన ఎఫ్ఎస్ఎల్ -
'సాక్షి' చేతికి ఫోరెన్సిక్ నివేదిక
-
ఏసీబీ చేతికి ఎఫ్ఎస్ఎల్ నివేదిక
-
ఏసీబీ చేతికి ఎఫ్ఎస్ఎల్ నివేదిక
- కీలక దశకు ‘ఓటుకు కోట్లు’ కేసు దర్యాప్తు - నివేదిక పరిశీలించి నోటీసులు జారీ చేయనున్న అధికారులు - కీలక నేతలను విచారించేందుకు రంగం సిద్ధం - నేటి నుంచి పూర్తిస్థాయిలో కార్యాచరణకు దిగాలని నిర్ణయం - నోటీసులివ్వకుండానే నేతలను అదుపులోకి తీసుకునే యోచన సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో ముఖ్య ఆధారాలైన ఆడియో, వీడియో రికార్డులను విశ్లేషించి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదిక శుక్రవారం ఏసీబీ చేతికి అందింది. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా చర్యలు చేపట్టడానికి ఏసీబీ సిద్ధమవుతోంది. నిందితులు, సాక్షుల నుంచి సేకరించిన సమాచారం, వారి ఇళ్లల్లో జరిపిన సోదాల్లో లభించిన ఆధారాలతో పాటు టీడీపీ ముఖ్య నేతలు నడిపిన కొనుగోళ్ల బాగోతంపై దృష్టి పెట్టింది. వీటన్నింటి ఆధారంగా కేసులో కీలకమైన వ్యక్తులను విచారించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. నోటీసులిచ్చినా హాజరుకాకుండా తప్పించుకుంటున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉదంతం నేపథ్యంలో.. ఇక ముందు నోటీసులతో సంబంధం లేకుండా నేరుగా ఆయా నేతల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకొని విచారించాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం నుంచి పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రారంభించాలని ఏసీబీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. మంగళవారం రేవంత్ బెయిల్‌కు సంబంధించి తీర్పు వెలువడనున్న నేపథ్యంలో.. ఆలోగానే కేసుతో సంబంధమున్న మరికొందరిని విచారించి, మరిన్ని ఆధారాలతో కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా పకడ్బందీగా.. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో సూత్రధారి అయిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి ఎలాంటి న్యాయ, చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా కార్యాచరణకు దిగాలని ఏసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించిన ఏసీబీ అధికారులు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది నిజమో కాదో వెల్లడించేందుకు వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా తొలుత చంద్రబాబుకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ విచారణకు చంద్రబాబు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.. ఆయా పరిణామాలకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. చంద్రబాబును స్వర (వాయిస్) పరీక్ష కోసం పిలిపించేందుకు గల అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఒక కేంద్ర మంత్రి, ఇద్దరు ఎంపీలు, మరికొందరు నాయకులను విచారించేందుకు ఏసీబీ వేగంగా చర్యలు చేపడుతోంది. కీలక సాక్షిగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరిన 10 రోజుల గడువు ఈ నెల 29వ తేదీతో ముగియనుంది. గడువులోగా సండ్ర విచారణకు హాజరుకాని పక్షంలో ఆయనను అరెస్టు చేయాలని ఏసీబీ యోచిస్తోంది. -
ఆ నివేదిక వస్తే సంచలనాలే!
ఓటుకు కోట్లు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కోసం తెలంగాణ ఏసీబీ వర్గాలు వేచి చూస్తున్నాయి. ఇప్పటి వరకు సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన ఏసీబీ, త్వరలోనే మరి కొంతమందికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని పరిశీలిస్తున్న ఏసీబీ వర్గాలు.. మరో రెండు రోజుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు కూడా తమ చేతికి అందుతుందని భావిస్తున్నాయి. స్టీఫెన్సన్ ఇప్పటికే తన వాంగ్మూలంలో చంద్రబాబే కుట్రకు సూత్రధారుడని చెప్పటంతో బాబుకు నోటీసులు ఇచ్చే అంశంపై న్యాయ నిపుణులతో ఏసీబీ సంప్రదిస్తోంది. అయితే చంద్రబాబు, స్టీఫెన్సన్ ఆడియో టేపులకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత, వాటిని పరిశీలించి.. వాటి ఆధారంగానే నోటీసులు ఇస్తే బాగుంటుందని న్యాయ నిపుణులు ఏసీబీకి సూచించినట్లు తెలుస్తోంది.. దీంతో ఇప్పటికే స్తబ్దుగా ఉన్న ఏసీబీ మరో రెండు రోజులపాటు ఇదే నిశ్శబ్దాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఆ తర్వాత సంచలనాలే ఉంటాయని ఏసీబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.