ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆందోళన కలిగించింది: మత్తయ్య | fsl report worried me vote for note case accused Mutthaiah | Sakshi
Sakshi News home page

ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆందోళన కలిగించింది: మత్తయ్య

Published Mon, Nov 30 2015 5:13 PM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM

ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆందోళన కలిగించింది: మత్తయ్య

ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆందోళన కలిగించింది: మత్తయ్య

ఓటుకు కోట్లు కేసు విచారణకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియడం లేదని, ఆ కేసులో నాలుగో నిందితుడు జెరూసలేం మత్తయ్య అన్నారు.

గుంటూరు: ఓటుకు కోట్లు కేసు విచారణకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియడం లేదని, ఆ కేసులో నాలుగో నిందితుడు జెరూసలేం మత్తయ్య అన్నారు. ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు హ్యారీ సెబాస్టియన్ను కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రానివ్వడం లేదని మత్తయ్య పేర్కొన్నారు.

వాయిస్ శాంపిల్స్కు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరి (ఎఫ్ఎస్ఎల్) రిపోర్ట్ రావడం మాకు ఆందోళన కలిగించిందని తెలిపారు. ఏకంగా ఒక మంత్రే మమ్మల్ని అవమానిస్తున్నారని మత్తయ్య గుంటూరులో అన్నారు. ఇక భవిష్యత్తులో విపరీత పరిణామాలు ఎదురైతే ఏం చేయాలో తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement