vote for note
-
సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జనవరి 13 నుంచి 23వ తేదీ వరకు సీఎం విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తన పాస్‌పోర్టును ఏసీబీ కోర్టుకు అప్పగించిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్, దావోస్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లాల్సి ఉందని, ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టును రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. ఇందుకు ఆరు నెలల పాటు తన పాస్‌పోర్టు ఇవ్వాలని కోర్టును రేవంత్ రెడ్డి కోరారు. రేవంత్ రెడ్డి అభ్యర్థనను అంగీకరించిన కోర్టు.. జులై 6వ తేదీలోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది. -
ఓటుకు నోటు కేసు... విచారణ వాయిదా ఈ సారి కోర్టుకు రేవంత్
-
బాబు పై గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు
-
పల్లెల్లో ఓట్ల కొనుగోలుకు టీడీపీ భారీ కుట్రలు
-
ఓటుకు నోటు కేసు: ఆ స్వరం చంద్రబాబుదే..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే మన వాళ్లు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని చంద్రబాబు నాయుడు తనకు హామీ ఇచ్చారని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. టీడీపీ క్రిస్టియన్ సెల్ నేత హ్యారీ సెబాస్టియన్ ఫోన్లో చంద్రబాబుతో మాట్లాడించారని స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ‘‘మన వాళ్లు అంతా బ్రీఫ్ మీ’’వాళ్లు ఇచ్చిన హామీ నెరవేరుస్తా అంటూ.. చంద్రబాబు తనను ప్రలోభపెట్టారని వివరించారు. ఓటుకు కోట్లు కేసు విచారణలో భాగంగా సోమవారం స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు నమోదు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియోను కోర్టులో ప్లే చేయగా విని స్టీఫెన్సన్ ధ్రువీకరించారు. అలాగే రూ.50 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రికార్డు చేసిన వీడియో, ఆడియో దృశ్యాలను కూడా చూసి ధ్రువీకరించారు. లంచం ఇచ్చేందుకు వచ్చిన సమయంలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయ సింహలు ఉన్నారంటూ వారిని కోర్టు హాల్లో (ఐడెంటిఫికేషన్ సందర్భంగా) గుర్తించారు. మా ఇంట్లోనే కలిశారు.. ‘‘స్టీఫెన్సన్ను ఆయన ఇంట్లో కలవడానికి టీడీపీ నేతలు సిద్ధపడకపోవడంతో మా ఇంట్లో కలిసేందుకు ఏర్పాటు చేశాం. ఆ రోజు డబ్బు ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి తదితరులు మా ఇంటికి వచ్చారు. రేవంత్‌రెడ్డి సూచన మేరకు రూ.50 లక్షలు బ్యాగ్ నుంచి తీసి రుద్ర ఉదయ సింహ టేబుల్ మీద పెట్టారు. ఓటింగ్ తర్వాత రూ.4.5 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ ఘటన మొత్తం వీడియోలో రికార్డయింది. డబ్బు ఇచ్చేందుకు వచ్చింది రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయ సింహలే’’అని మరో ప్రత్యక్ష సాక్షి మార్కం టేలర్ ఓటుకు కోట్లు కుట్రను కళ్లకు కట్టినట్లు వివరించారు. లంచం ఇస్తున్న సమయంలో ప్రత్యక్షంగా చూసిన మరో ప్రత్యక్ష సాక్షి మార్కం టేలర్ కుమార్తెను హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశిస్తూ కోర్టు సమన్లు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది. -
‘ఓటుకు కోట్లు’ విచారించే పరిధి మాకుంది: ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ ప్రత్యేక కోర్టులో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసును విచారించే పరిధి తమకుందని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును విచారించే పరిధి ఎన్నికల ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందని, ఏసీబీ ప్రత్యేక కోర్టుకు లేదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు శుక్రవారం కొట్టివేశారు. నిందితులపై అభియోగాల నమోదు కోసం తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేశారు. ‘నిందితులపై నమోదు చేసిన అభియోగాలను విచారించే పరిధి ప్రత్యేక కోర్టుకు ఉంది. చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి) అవినీతి నిరోధక చట్టం కింద ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన అభియోగాలను విచారించే పరిధి ప్రత్యేక కోర్టుకు ఉందని సుప్రీంకోర్టు పీవీ నరసింహారావు కేసులో స్పష్టమైన తీర్పును ఇచ్చింది. తమ పేర్లను ఈ కేసు నుంచి తొలగించాలంటూ ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, హ్యారీ సెబాస్టియన్లు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను ఇదే న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కోర్టు తీర్పును హైకోర్టు కూడా సమర్థ్ధించింది. ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను 2017లో కోర్టు విచారణకు స్వీకరించి నిందితులకు సమన్లు జారీచేసింది. దాదాపు నాలుగేళ్లు మౌనంగా ఉండి.. ఇప్పుడు ఈ తరహా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. ప్రత్యేక కోర్టులో తుది విచారణ జాప్యం చేసేందుకే నిందితులు ఒకరి తర్వాత మరొకరు ఈ తరహా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు’అని ఏసీబీ స్పెషల్ పీపీ సురేందర్‌రావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. చదవండి: (బాబే మాస్టర్ మైండ్.. అంతా ఆ గదిలోనే..) -
చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ అభ్యర్థించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు డబ్బులు ఇవ్వజూపారని, దీనిపై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ త్వరితగతిన విచారణ చేయాలంటూ ఎమ్మెల్యే ఆళ్ల దాఖలు చేసిన ఎర్లీ హియరింగ్ అప్లికేషన్‌ను గురువారం జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, న్యాయవాది అల్లంకి రమేశ్‌లు వాదనలు వినిపించారు. ‘2017 మార్చిలో పిటిషన్ దాఖలు చేయగా 2018 నవంబరులో పిటిషన్ ధర్మాసనం ముందుకొచ్చింది. నాడు జస్టిస్ మదన్ బి లోకూర్ ధర్మాసనం ముందుకు రాగా 2019 ఫిబ్రవరిలో విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. 2019లో విచారణ చేయాల్సిన కేసు నెలలు గడుస్తున్నా బెంచ్‌మీదకు రాకపోవడంతో నవంబర్ 23, 2019న మరొక ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ దాఖలు చేశాం. అయినప్పటికీ విచారణ జాబితాలోకి రాకపోవడంతో ఈ నెల మొదటి వారంలో మరో డైరెక్షన్ అప్లికేషన్ దాఖలు చేశాం’ అని ధర్మాసనానికి వివరించారు. పిటిషన్ వచ్చే ఏడాది వేసవి సెలవులు అనంతరం జులైలో విచారణ చేస్తామని జస్టిస్ ఎస్ఏ బోబ్డే పేర్కొన్నారు. వచ్చే ఏడాది జులైలో విచారణకు ఏమీ అభ్యంతరం లేదని కానీ విచారణ తేదీని ఖరారు చేయాలని ప్రశాంత్ భూషణ్ కోరారు. రాజకీయనేతల ప్రమేయం ఉన్న కేసులు వీలైనంత త్వరగా విచారణచేయాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన అంశాన్ని ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రస్తావించారు. ఈ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని, కానీ తెలంగాణ ఏసీబీ ఆ పేరు చేర్చడంలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రశాంత్ భూషణ్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రధాన కేసు జూలైలో విచాస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ‘ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ పై విచారణ ముగిస్తున్నాం. ప్రధాన కేసు జూలై 14, 2021న తగిన ధర్మాసనం విచారిస్తుంది’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. -
ఓటుకు మూడువేలు అంటున్న టీడీపీ
సాక్షి, కృష్ణా : రాజకీయాలకు రాజ ధానిగా పేరున్న కృష్ణా జిల్లాలో ప్రజాస్వామ్యం చిన్నబోయే రీతిలో ఓట్ల కొనుగోలుకు అధికారపార్టీ సిద్ధమైంది. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్లుగా ఏకంగా వేలం పద్ధతిన ఓట్లు కొనుగోలుకు తెగపడుతున్నారు. చివరకు ఒక్కో ఓటుకు రూ.3000 చొప్పున చెల్లించి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు. ప్రత్యేక దళాల నిశిత పర్యవేక్షణలో టీడీపీ నాయకులు పంపిణీ కొనసాగిస్తున్నారు. పోలింగ్‌కు చివరి రోజైన బుధవారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులు రూ. కోట్లుకుమ్మరించారు. నియోజకవర్గంలోని ఓట్లలో 60 నుంచి 70 శాతం కొనుగోలు చేయాలనేది లక్ష్యంగా డబ్బు పంపిణీ చేసినట్లు సమాచారం. వ్యూహాలు మార్చి డబ్బు పంపిణీ.. జిల్లా వ్యాప్తంగా పంపకాల పర్వానికి తెరలేపిన టీడీపీ అభ్యర్థులు మద్యాన్ని సైతం ఏరులై పారిస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్లను పెంచేలా టీడీపీ పార్టీ నాయకులు గ్రామస్థాయి నాయకులతో ఒప్పందాలు చేసుకుని రూ. లక్షల్లో డబ్బు అందజేశారు. మాజీ పోలీసు ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఈ డబ్బును గ్రామీణ ప్రాంతాలకు చేర్చారు. డబ్బు పెద్ద మొత్తంలో ఉంటే అధికారులకు పట్టుబడితే కేసుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుందని బృందాలు ఏర్పడి రూ.49 వేల చొప్పున తీసుకెళ్లి ఓటర్లకు పంపిణీ చేయడం కనిపించింది. డబ్బు పంపిణీ విచ్చలవిడిగా జరుగుతున్నా అడ్డుకోటానికి అధికారులకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం గమనార్హం. ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఎన్ని కోట్లు వెచ్చించైనా ఓట్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ అభ్యర్థులు ఒక్కో నియోజకవర్గంలో రూ.50 కోట్లపైగానే ఖర్చు చేసినట్లు సమాచారం. విజయవాడ ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 లక్షల ఓట్లు కొనుగోలుకు సిద్ధమయ్యారనేది సమాచారం. ఒక్కో ఓటుకు సగటున రూ.1000 నుంచి రూ.2000 చొప్పున చెల్లించినట్లు తెలిసింది. నగారానికి ఆనుకునే ఉన్న గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఓటుకు రూ. 2వేలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి కంటే వైఎస్సార్సీపీ అభ్యర్థి ముందంజలో ఉండటంతో ఓటర్లకు ప్రలోభాలకు టీడీపీ నాయకులు గురిచేస్తున్నారు. విజయవాడ లోక్‌సభకు పోటీ చేసే ఓ అభ్యర్థి వర్గాల వారీగా సమావేశాలు పెట్టి వారికి అవసరమైన వనరులు సమకూర్చారు. తన నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు భారీగా వనరులు సమకూర్చారు. గుడివాడలో ఎలాగైనా పాగా వేయాలనే లక్ష్యంతో టీడీపీ భారీ ఎత్తున ప్రలోభాలకు తెరతీసింది. ఓటుకు ఎంత ధరైనా చెల్లించడానికి వెనుకాడటం లేదు. ఇప్పటి వరకు ఓటుకు రూ.3 వేలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. -
బరి తెగించిన టీడీపీ నాయకులు
సాక్షి, గుంటూరు : ఎన్నికల సంగ్రామం చివరి దశకు చేరింది. మరి కొద్ది గంటల్లో జరిగే పోలింగ్‌కు ఇటు ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల అభ్యర్థులు సర్వం సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు పోటా పోటీగా ప్రచారం చేసిన అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి జరిగే పోలింగ్‌లో ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కొందరు డబ్బు, మద్యం, చీరలు, క్రీడా సామగ్రి, ఇతర వస్తువులతో ఓటర్లను ఆకట్టుకున్నారు. మరి కొందరు సాధారణ ఓట్లతో పాటు కులాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలకు చెందిన ఓట్లను గుంపగుత్తుగా పొందేందుకు పకడ్బందీగా ముందుకు సాగారు. ఈ మేరకు ఆయా వర్గాలకు వారం రోజుల ముందే అన్ని వనరులను సమకూర్చారు. పోలింగ్ రోజున ఎక్కువ మొత్తంలో ఓట్లను సంపాదించుకునేందుకు వ్యూహరచనలు పన్నారు. అయితే ఎన్నికల వేళ ఓటర్లకు పలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. అభ్యర్ధులు ఇచ్చే నోటు(డబ్బు)తీసుకుంటే భవిష్యత్‌లో పరిస్థితి ఎలా ఉంటుంది..తీసుకోకుండా నిజాయితీగా ఓటేస్తే ఏ విధంగా వ్యవహరించవచ్చు.. అనే అంశాలు ఓటర్లలో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండింటి మధ్య తేడా, స్వార్థ, నిస్వార్థపరులను గమనించి ఓటేస్తే బాగుంటుందని మేధావులు చెబుతున్నారు. టీడీపీ కుయుక్తులు స్వార్ధ రాజకీయాలతో.. ధనార్జనే ధ్యేయంగా రాష్ట్రంలో టీడీపీ పాలన సాగించింది. ఐదేళ్ల టీడీపీ పాలనలో భూకబ్జాలు, వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడింది. 2014 ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన 630 హామీలను నెరవేర్చక పోవడంతో టీడీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో అధికారంలో ఉంటేనే ఏదైనా సాధ్యమని, ఏదైనా చేయగలమని గురువారం జరగనున్న సాధారణ ఎన్నికలలో ఎలాగైనా గెలిచేందుకు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గ అభ్యర్థులతో రూ.1500 నుంచి రూ.10 వేల వరకు ఓటుకు వెలకడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంది. మాట వినకుంటే బెదిరింపులకు పాల్పడుతోంది. ప్రశ్నించే హక్కు ఉండదు ఎన్నికల సందర్భంగా జిల్లాలోని నియోజకవర్గాల్లో అభ్యర్థులు నోట్లు వెదజల్లుతున్నారు. ప్రత్యర్థి పార్టీకి ధీటుగా డబ్బు మూటలను ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశారు. అయితే ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీల నేతలు ఇచ్చే రూ.500, రూ.1000 డబ్బును తీసుకుంటే తర్వాత మన సమస్యలను వారికి చెప్పే పరిస్థితి ఉండదు. నిజాయితీ పాలకులు అరుదు శాసన సభ ఎన్నికలు అంటేనే రూ.లక్షలు, కోట్లు ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి పోటీకి సాధారణ వ్యక్తులు రావడం అరుదుగా ఉంటుంది. అయితే ఆర్థికంగా స్థిరపడిన వారే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో రూ.కోట్లు కుమ్మరించిన వారు తర్వాత ప్రజల కోసం నిజాయితీగా పని చేస్తారనే విషయంలో నమ్మకం తక్కువ. కొంతమంది మాత్రం ఎన్నికల ఖర్చుతో సంబంధం లేకుండా ప్రజా సేవ కోసం ముందుకు సాగుతారు. చులకనభావం ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గెలిచిన వారిలో కొంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటర్లను చులకనభావంగా చూసే అవకాశముంది. ఎన్నికల్లో మీరు నోటు తీసుకుని ఓటు వేశారు కదా.. అనే భావనతో ఓటర్లను పట్టించుకోరు. దీనిపై అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాల్సిన అవసరముంది. సమస్యలతో సహజీవనం.. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో కొందరు మంచి వారుంటారు. మరి కొందరు పదవిని అడ్డుపెట్టుకుని పెత్తనం చెలాయించేవారుంటారు. అయితే డబ్బులు తీసుకుని ఓటేస్తే తమ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను గట్టిగా అడగే పరిస్థితి ఉండదు. తద్వారా సమస్యలతో సహజీవనం చేయాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి సాధ్యం ఓటర్లకు డబ్బులు పంచకుండా గెలిచిన వారు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపుతారు. అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. మరోసారి గెలవాలనే తాపత్రయంతో సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతారు. -
బాబు బ్రాండ్ రాజకీయం
-
టీడీపీ దిగజారుడు రాజకీయానికి ఇది పరాకాష్ట
-
ఓటుకు కోట్లు ముగిసిన కథేనా?
కొమ్మినేని శ్రీనివాసరావుతో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మీడియా కోడై కూసిన ఓటుకు కోట్లు కేసు ఇక ముగిసిన చరిత్రేనని తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ కేసుతో ప్రళయం వస్తుందన్నంతగా ఆర్భాటం చేసిన కేసీఆర్ ప్రభుత్వం చివరకు చార్జిషీట్ కూడా పెట్టలేకపోయిందని విమర్శించారు. నా గురించి నువ్వు, నీ గురించి నేను మాట్లాడొద్దు. ఒకరి వ్యవహరాల్లో మరొకరు జోక్యం చేసుకోవద్దని ఏపీ, తెలంగాణ సీఎంలిద్దరూ సర్దుబాటు చేసుకున్నారని, ఈ సర్దుబాటుకు మూలకారకులు రాష్ట్రంలో గవర్నర్, కేంద్రంలో వెంకయ్యనాయుడులే అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి రావడం కల్లే అంటున్న పొన్నం ప్రభాకర్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... మీ దీక్ష ఉద్దేశం ఏమిటి? ఏమేరకు విజయవంతమైంది? ఉత్తర తెలంగాణలో కరీనంగర్ ఒక ముఖ్యమైన జిల్లా. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి కూడా వైద్యంకోసం ప్రజలు ఇక్కడికే వస్తారు. జిల్లా కేంద్రంలో 500 పడకలతో ప్రభుత్వాసుపత్రి ఉందంటే దీని ప్రాధాన్యత అర్థమవుతుంది. నేను ఎంపీగా ఉన్నప్పుడే మా జిల్లాకు మెడికల్ కాలేజీ కావాలని అడిగాను. నేను తెలంగాణ ఇవ్వలేను కానీ మెడికల్ కాలేజీ మాత్రం ఇస్తాను అని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. తర్వాత తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైన దశలో అది అటకెక్కేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఆగస్టు 5న కేసీఆర్ కరీంనగర్‌కు వచ్చారు. మేం అడగకముందే ప్రభుత్వ మెడికల్ కాలేజీని కరీంనగర్‌కు, గోదావరి ఖనికి కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బిడ్డ కదా.. గుర్తుపెట్టుకుని మరీ ప్రకటించారు అని అందరం చాలా సంతోషపడ్డాం. కానీ 2017 వచ్చింది అయినా దాని ఊసులేదు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత స్థాయి ఎంత? నిజంగానే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం పట్ల విసిగి వేసారిపోయారు. కాంగ్రెస్ పార్టీగా మే ఇంకా అనుకున్నంత గట్టిగా పోరాడలేదని జనం అనుకుంటున్నారు. ప్రజల నుంచి ఆ మాట రావడం కోసమే గత మూడేళ్లుగా మేం ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం కూడా మూడేళ్లపాటు హనీమూన్‌లో గడిపేసింది. మీరు ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పారు, ఏం చేశారో చెప్పండి. డబుల్ బెడ్ రూంలు ఎన్ని కడతామన్నారు, ఎన్ని కట్టారో చెప్పండి. ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారో చెప్పండి అని అడుగుతున్నాం. లక్షరూపా యల వరకు రుణమాఫీ ఇస్తామన్నారు 6 సార్లుగా ఇస్తూనే ఉన్నామని చెప్పండి సిగ్గు లేకుంటే. తెలంగాణ ప్రజలకు ఇళ్లు వచ్చాయో లేదో కానీ సీఎంకి మాత్రం ప్రగతి భవన్ వచ్చింది. పది కార్ల కాన్వాయ్ వచ్చింది. నేరెళ్ల దళితులపై దాడి పెద్ద సమస్య అయి కూర్చుంది కదా? ఇసుక లారీల వెనుక దోపిడీ గురించి ప్రశ్నిస్తే నేరెళ్ల బాధితుల కులం పేరు చెప్పి మరీ కొట్టారు. లారీలు కాలిస్తే పోలీసులు కొట్టకుండా ఊరికే ఉంటారా అని కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్సులో ప్రకటించారు. మేం దళితులం అని వాళ్లేమన్నా బిళ్ల గట్టుకున్నారా అని ఎద్దేవా చేశారు. ఇకపై రాష్ట్రంలో వీళ్లు గౌళ్లు, సాలెవాళ్లు, కోమటోళ్లు, కాపోళ్లు, కమ్మోళ్లు అని జనం ముఖంపై బిళ్లలు కూడా కొట్టిస్తారేమో అనుకున్నాం మేం. నీ బంధువులకు చెందిన లారీలు కాలిపోతే అంత పెద్ద ఇష్యూ అవుతుంది. ఇసుక లారీల వల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయి ఇంతవరకు. ఇవ్వాళ్టికి కూడా ఇసుక దోపిడీ ఆగటం లేదు. ఎంపీ జితేందర్‌రెడ్డితో రాజీనామా సాహస కృత్యమేనా? నిజంగా కేసీఆర్‌కు అంత దమ్ము ఉంటే ఫిరాయింపులకు దిగి మా పార్టీనుంచి, ఇతర పార్టీల నుంచి లాక్కున్న ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయించి మరీ ఉపఎన్నికలకు సిద్ధం కావాలి. ఫిరాయించిన ముగ్గురు ఎంపీలచేత, 15 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలు పెట్టించు. అప్పుడు తెలుస్తుంది ఎవరి సత్తా ఏమిటో? చంద్రబాబు, కేసీఆర్ పాలనపై మీ అభిప్రాయం? ఇద్దరి మధ్యలో అనుసంధానంలా మన పెద్దమనిషి గౌరవనీయులైన గవర్నర్ నరసింహన్ ఉన్నారు కదా. రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి ఆయనకు ఒక భజన శాఖ క్రియేట్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. ఎవరో ఒక సంస్థ పెట్టుకుని అగ్రికల్చర్ అవార్డు కేసీఆర్‌కి ఇస్తే గవర్నర్ ప్రశంసలు గుప్పించేస్తారు. కనీస నైతిక ప్రమాణాలు ఉండాలి కదా. అంతకుముందు మా ఎన్డీ తివారి రాసలీలలు చేసి రాజభవన్ విలువను నాశనం చేస్తే.. వేరే పార్టీమీద గెలిచిన ఎమ్మెల్యేతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి రాజ్‌భవన్ ఎథిక్స్ పోగొట్టాడాయన. ఈ ముగ్గురి గురించి ఏం మాట్లాడతాం మనం. ఓటుకు కోట్లు కేసు ఏమౌతుందని అనుకుంటున్నారు? ఏమవుతుంది? మధ్యలో భజనశాఖ మంత్రి ఉన్నారు కదా సర్దుబాటు చేయడానికి. ఇక్కడేమో గవర్నరు, అక్కడేమో వెంకయ్య వంటి పెద్దలు ఉన్నారు కదా. ఇంకేమవుతుంది? ఏదో ప్రళయం వస్తుంది అన్నంతగా మీడియా ఈ కేసుపై కవర్ చేసింది. అంత ఆర్భాటం చేసిన కేసీఆర్ ప్రభుత్వం చివరకు చార్జిషీట్ కూడా పెట్టలేకపోయింది. ఓటుకు కోట్లు కేసులో ఎవరిది పై చేయి అయింది? దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు.. కేసీఆర్, బాబు ఇద్దరూ సర్దుబాటు చేసేసుకున్నారు. నాగురించి నువ్వు మాట్లాడొదు, నీగురించి నేను మాట్లాడను. ఒకరి ఇంట్లో మరొకరు జోక్యం చేసుకోవద్దు. అనుకున్నారు. అంతే.. కేసు ముగిసిపోయింది. ఎంతగా రాజీపడ్డారంటే తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తే బాబు నుంచి కనీసం ఖండన లేదు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడొద్దని అగ్రిమెంటు మరి. (పొన్నం ప్రభాకర్‌తో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/VqrL3V https://goo.gl/ps6JPF -
ఓటుకు కోట్లు కేసులో శిక్ష ఖాయం
కొమ్మినేని శ్రీనివాసరావుతో తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేకాదు.. ఓటుకు కోట్లు కేసులో భాగమై ఉన్న ప్రతి ఒక్కరికి ఏ విధమైన శిక్ష పడాలో అది పడే తీరుతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి, తెరాస సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. ఈ కేసులో ప్రభుత్వానికి భాగస్వామ్యం లేదని, అధికారులు వారి పనివారు చేసుకుపోతున్నారని, విచారణ ముగిసేసరికి ఎవరూ శిక్షనుంచి తప్పించుకోలేరని మంత్రి స్పష్టం చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అని కేసీఆర్ అన్నప్పటికీ బాబు నింపాదిగా ఉన్నారు కదా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ నేరం చేసిన వారిపై అధికారులు చట్టపరిధిలో ఏ చర్య తీసుకోవాలో ఆ చర్యను తప్పకుండా తీసుకుంటారంటున్న పోచారం శ్రీనివాసరెడ్డి అభిప్రాయాలను ఆయన మాటల్లోనే.. ఎరువులను పూర్తిగా ఫ్రీగా ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది? రైతుపట్ల కేసీఆర్‌కి ఉన్న అభిమానమే దానికి కారణం. పూర్తిగా కేసీఆర్ ఆలోచనే ఇది. వేసవిలో, వర్షాకాలంలో ఎంత పరిమాణంలో అంటే ఎన్ని లక్షల టన్నుల ఎరువులు అవసరం అవుతాయి అని మమ్మల్ని అడిగారు. దీనిపై ఎవరూ సూచనలు, సలహాలు ఇవ్వలేదు. కేసీఆర్ మనసులోంచి వచ్చిన ఆలోచన ఇది. దాన్నే విధానంగా ప్రకటించారు. ఉచిత ఎరువుల ఆలోచనను కేసీఆర్ వాడుకున్నారన్న కాంగ్రెస్ ఆరోపణ? కేసీఆర్ రైతు పక్షపాతి అనేది అందరికీ తెలుసు. రైతుల పరిస్థితిని బాగు చేయాలని, బంగారు తెలంగాణలో వారిని భాగస్వాములను చేయాలని, ఈ అప్పులనుంచి బయటకు రావాలని ఆలోచించే వ్యక్తి కాబట్టి ఎవరో చెబితే ఆ పాఠాలు తీసుకోవలసిన అవసరం లేదు. రైతులకు ఉచిత ఎరువులందిస్తామని దేశ చరిత్రలో ఇంతవరకు ఏప్రభుత్వమూ ప్రకటించలేదు. మొత్తం పంట పండించే భూమి విస్తీర్ణానికి ఎరువులు అందించే బాధ్యత నాది.. ఒక రూపాయి కూడా రైతు ఎరువుల కోసం పెట్టాల్సిన పనిలేదు అని దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులందరికీ ఉచిత ఎరువులు ఇస్తారా? గ్రామ రైతుసభలను ఏర్పాటు చేస్తాం. గ్రామ రైతు సంఘం అధ్వర్యంలో మా అధికారులు కలిసి గ్రామంలో ఉన్న రైతుల వివరాలను సేకరిస్తారు. రైతులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఎకరాలు ఉన్నాయి అని లెక్కపెడతారు. రైతుల భూమి పెరగదు. చేతులు మారుతుంది. భూమి రికార్డులను కంప్యూటర్లో ఎక్కించి ఏ గ్రామంలో ఎంతమంది రైతులున్నారో డేటా తీసుకుంటాం. ఉదా: ఒక గ్రామంలో రెండు వేల ఎకరాలుంది. ఒక ఎకరాకు నాలుగు వేల చొప్పున మొత్తం 80 లక్షల రూపాయలు వారికి ఆన్లైన్లో పంపిస్తాం. పదెకరాలు, వందెకరాలు ఉన్న రైతుకు కూడా ఉచితంగా ఇస్తారా? తెలంగాణలో మొత్తం 55 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ కలిపి ఒక కోటీ 5 లక్షల ఎకరాల భూమి ఉంది. అంటే తెలంగాణలో ఎకరం నుంచి రెండెకరాల భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు రైతులే 95 శాతం పైగా ఉన్నారు. 5 శాతం మంది మాత్రమే పెద్ద రైతులున్నారు. చిన్నా, పెద్దా అందరికీ ఈ ప్రయోజనం వస్తుంది. రైతుల్లో మెజారిటీ చిన్నకారు, సన్నకారు కాబట్టి చిన్నా పెద్దా తారతమ్యాల్లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకీ ఈ విధానం అమలు చేస్తాం. రైతుకు నాలుగెకరాలు ఉంటే 16 వేల రూపాయలను మే నెలకు ముందే అతడి ఖాతాలో వేస్తాం. రుణమాఫీ ఫెయిలైనందుకే ఈ ఎరువుల స్కీమ్ తెస్తున్నారని విమర్శపై? భారతదేశంలో 17 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ పైకంతో రైతులకు రుణమాఫీ చేసిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. రుణ మాఫీ వైఫల్యం కానే కాదు. 10 శాతం బ్యాంకులు సకాలంలో మద్ధతు ఇవ్వకపోవడమే మొదట్లో కాస్త ఇబ్బంది పెట్టిందంతే. నిజంగా తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారు. ఒక సంవత్సరం కొంత ఆలస్యమై బాధపడ్డారు. తొలి సంవత్సరం అనుకున్న ప్రకారం వారి ఖాతాలోకి జమ చేశాం. తెలంగాణలో రాజకీయ నాయకులు సంతోషంగా లేరు కానీ రైతులయితే ప్రభుత్వంపట్ల సంతోషంగానే ఉన్నారు. రాజకీయంగా వీక్ అవుతున్నందుకే ఉచిత ఎరువులు ఇస్తున్నారా? రాజకీయంగా మేం వీక్ అవుతున్నామా? ఈ మధ్య కాలంలో జరిగిన ఏ ఎన్నికల్లో అయినా సరే డిపాజిట్లు రాకుండా పోయింది ఎవరికి? ప్రజల తీర్పు ఏవిధంగా ఉందనేది స్పష్టమైపోయింది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాగేసుకోవడం అనైతికం కాదా? శాసనసభలో హోదా ఉన్న వ్యక్తులు బలవంతంగా ఫిరాయింపులకు రారు. ప్రభుత్వ పరిపాలనకు ఆకర్షితులయ్యే వస్తారు. పార్టీ పట్ల ప్రేమ, నాయకుడి పట్ల విశ్వాసం, అభిమానం ఇవే ఇతరులు టీఆర్ఎస్లోకి రావడానికి కారణం. ప్రభుత్వ పరిపాలన ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంది. ప్రజల సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా చేస్తుంది అనే నమ్మకమే ఇతర పార్టీ నేతలను ఆకర్షిస్తోంది. తెలంగాణలో విస్తరణకు బీజేపీ ప్రయత్నిస్తోంది కదా? హైదరాబాద్‌లో వారికున్న ఆ అయిదు సీట్లు దక్కించుకుంటే వాళ్లకంటే గొప్పవాళ్లు ఉండరు. బీజేపీ కేంద్రనాయకులే వచ్చి ఊరూరా తిరిగినా ఇక్కడ వారికి ఒరిగేదేమీ ఉండదు. గ్రామగ్రామానా గట్టిగా పునాదిని పెంచుకున్న పార్టీ టీఆర్ఎస్. ప్రస్తుతం అసెంబ్లీలో 119 స్థానాలు ఉన్నాయికదా. వచ్చే ఎన్నికల్లో రెండు మూడు స్థానాలు తప్పితే 110 సీట్లను ఢంకా మోగించి మరీ మేమే గెలుస్తామని చెబుతున్నాను. నేను చెబుతున్న సంఖ్యను ఈరోజు మీరు రాసుకోండి. అంత విశ్వాసం మాకు ప్రజలపై ఉంది. తెలంగాణను పాకిస్తాన్ చేస్తారా అని వెంకయ్యనాయుడే అనేశారు? కులాల మీద, మతాలమీద రిజర్వేషన్ చేయవద్దు, సామాజిక ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయనే అన్నారు. తాను చెప్పిందే మేం చేస్తున్నాం. తేడా ఎక్కడుంది? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి? ఇప్పుడున్న సీట్లలో సగం సీట్లు కాపాడుకుంటే చాలు. అదే గొప్ప వారికి. మాకు 110 సీట్లు వస్తాయన్నాను. మిగతా పది స్థానాల్లో రెండు, మూడు మజ్లిస్‌కి వెళితే ఆ మిగిలిన ఆరేడు స్థానాలే కాంగ్రెస్‌కు వస్తాయి. హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడితే కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వద్దకు వెళ్లి చూస్తేనే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని కోదండరామ్ అంటున్నారు? పాదయాత్ర చేసినంత మాత్రాన, నాలుగూళ్లు తిరిగినంత మాత్రాన ప్రజ లకు విశ్వాసం కలగాలి కదా. నాయకుడి పట్ల, ప్రభుత్వం పట్ల, పరిపాలన పట్ల ప్రజలకు విశ్వాసం కలిగితే మీకు ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదు. ప్రజలకు టీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ పట్ల అచంచల విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలో ఎవ్వరూ ఏమీ చేయలేరు. మాకు జరిగే నష్టమూ లేదు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అని కేసీఅర్ అన్నారు. కానీ బాబు నింపాదిగా పనిచేసుకుంటున్నారు.? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దీంట్లో ప్రభుత్వం భాగస్వామ్యం లేదు. అధికారులు వారి పని వారు చేసుకుని పోతున్నారు. ఈ కేసులో ఎవరికి ఏ విధమైన శిక్ష పడాలో అది పడే తీరుతుంది. ఇంతకుమించి నేను వివరించలేను కూడా. ప్రతినిత్యమూ తెలంగాణ బిడ్డలు 15మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణ వ్యక్తులుగా మేం దీన్ని భరించలేకపోతున్నాం. దయచేసి మీ నోటి నుంచి జై తెలంగాణ అని ఒక్క మాట అనండి చాలు. నేను ఎక్కడికీ పోను టీడీపీలోనే ఉంటాను అని చంద్రబాబుతో అన్నాను. ఆమాట అనడానికి బాబు ఒప్పుకోలేదు. బిడ్డల ఆత్మబలిదానం భరించలేకపోతున్నాను. నేను పార్టీ మారతాను అని చెప్పి రాజీనామా లేఖ రాసి మరీ 2010లో బయటకు వచ్చాను. (పోచారం శ్రీనివాసరెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/5o46Xk https://goo.gl/0UDV02 -
ఓటుకు నోటు కేసులో బాబు అడ్డంగా దొరికినా..
మధిర(ఖమ్మం జిల్లా): ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ, ఏపీ సీఎంలు, కేసీఆర్-చంద్రబాబులు మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా మధిరలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికినప్పటికీ, కేసు విషయమై తెలంగాణ సీఎం స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల్లో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఎవరని టీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని, తమ పార్టీలో కేసీఆర్ కంటే సమర్థులైన నాయకులు 30 మందికిపైగా ఉన్నారని తెలిపారు. బంగారు తెలంగాణ పేరుతో బంగారు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. -
ఓటుకు కోట్లు కేసుపై ఆన్లైన్ ఉద్యమం
-
ఓటుకు కోట్లు కేసులో విచారణ వాయిదా
-
ఓటుకు కోట్లు కేసులో విచారణ వాయిదా
వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని మత్తయ్యకు సుప్రీం ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో అభియోగపత్రం నుంచి జెరూసలేం మత్తయ్య పేరును తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ రెండు వారాలపాటు వాయిదా పడింది. సోమవారం ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంగా మరో 4 వారాలు గడువు కావాలని మత్తయ్య తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో మత్తయ్య పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయని, రూ.50 లక్షల నగదును మత్తయ్య చేరేవేసేందుకు ప్రయత్నించారని తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది హరీన్ రావల్ కోర్టుకు తెలిపారు. సుప్రీం కోర్టులో విచారణ ఆలస్యమైతే దాని ప్రభావం హైకోర్టు విచారణపై పడుతుందని విన్నవించారు. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని మత్తయ్యను కోర్టు ఆదేశించింది. -
ఇంత దిగజారుడా?!
‘నాపైన ఎన్నో కేసులు పెట్టారు. ఇబ్బందులు పెట్టాలని చూశారు. ఏదీ నిరూపించ లేకపోయారు. నేను నిప్పులాంటివాడినని రుజువైంది’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తరచు చెబుతుంటారు. ఈమధ్య పెద్ద నోట్లు రద్దయిన దగ్గర నుంచి అది తన ఘనతేనని ఆయన వీలు దొరికినప్పుడల్లా చెప్పుకుంటున్నారు. అందుకు రుజువుగా గత నెలలో కేంద్రానికి రాసిన లేఖను సైతం గుర్తుచేస్తున్నారు. అలాంటి వ్యక్తి తరఫున ఉమ్మడి హైకోర్టు ముందు ‘ఓటుకు కోట్లు’ కేసులో సాగుతున్న వాదనలు అందరికీ విస్మయం కలిగిస్తున్నాయి. ఓటేయడం ప్రజా విధుల్లో భాగం కాదని, అది కేవలం రాజ్యాంగ బాధ్యత మాత్రమేనని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. రాష్ట్రపతి పదవికి, రాజ్య సభ స్థానానికి లేదా ఎమ్మెల్సీ పదవికి ఎవరినైనా ఎన్నుకునేందుకు ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఇవ్వడంలో ఉద్దేశం ఆ ఓటు ద్వారా ప్రజాభిప్రాయం ప్రతిబింబిస్తుందనే. పార్లమెంటు, అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లాగే ఆ ఎన్నికలు కూడా ప్రజా స్వామ్య ప్రక్రియలో భాగమే. ప్రజాప్రతినిధులుగా ఉంటున్నవారు ఓటేయడం రాజ్యాంగ బాధ్యతే తప్ప అది ప్రజా విధుల్లో భాగం కాదని బాబు తరఫు న్యాయవాది వాదిస్తున్నారు. ప్రజావిధిలో భాగం కానప్పుడు ఓటుకు డబ్బు తీసుకున్నా నేరం కాదన్నది ఆ వాదన సారాంశం. మరో విధంగా చెప్పాలంటే ఆయన దృష్టిలో ఓటును కొనడం, అమ్మడం నేరం కానే కాదు! న్యాయస్థానం వెలుపల బాబు చెప్పే కబుర్లు వేరు. వివిధ వేదికలపై ఇందుకు సంబంధించి ఆయన వల్లించే నీతులకు హద్దూ పద్దూ ఉండదు. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఉదంతం జరగడానికి మూడు రోజుల ముందు జరిగిన మహానాడులో తెలంగాణలో తమ ఎమ్మెల్యేలను ‘సంతలో పశువుల్లా’ కొంటున్నారని చంద్రబాబు తెగ బాధపడ్డారు. తీరా అదే పని చేయ బోతూ తాను దొరికిపోయారు. ఓటు హక్కు అన్నది రాజ్యాంగంలోని 19(1)(ఏ) అధికరణం హామీ ఇస్తున్న భావ ప్రకటనాస్వేచ్ఛలోనూ, 21వ అధికరణం హామీ ఇస్తున్న వ్యక్తి స్వేచ్ఛలోనూ అంతర్భాగమని మూడేళ్లక్రితం సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పునిస్తూ స్పష్టంచేసింది. ప్రజాస్వామిక ప్రక్రియలో భాగంగా జరిగే ఒక ఎన్నికలో పాల్గొనే ఎమ్మెల్యేలకు ఆ సూత్రం వర్తించదా? ఆ ఎమ్మెల్యేలకు డబ్బు కట్టలు ఎర చూపడం ఆ ఎమ్మెల్యేల భావప్రకటనాస్వేచ్ఛకూ, వారి వ్యక్తి స్వేచ్ఛకూ ముప్పు కలగజేయడంతో సమానం కాదా? ఆ నేరానికి పాల్పడ్డవారికి శిక్ష ఉండొద్దా? ఒకపక్క ఎన్నికల్లో డబ్బు ప్రభావం, ప్రలోభాలకు గురిచేయడం పెరిగిపోయిందని బాబు తరచు ఆవేదన పడుతుంటారు. పెద్ద నోట్లు రద్దు చేస్తే ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవడం తగ్గుతుందని మొన్నటికి మొన్న మీడియా సమావేశంలో చెప్పారు. తీరా ఇప్పుడు ఎన్నికల్లో ఓటేయడానికి డబ్బు తీసుకోవడం అవినీతి కాదని న్యాయస్థానంలో వాదించడం సిగ్గుచేటు కాదా? ఒకపక్క సాధారణ పౌరులకు ఓటు హక్కును తప్పనిసరి చేయా లన్న వాదనలు వస్తున్నాయి. అందుకు సంబంధించి ఒకటి రెండు రాష్ట్రాలు చట్టాలు కూడా తీసుకొచ్చాయి. వాటి రాజ్యాంగ బద్ధత సంగతలా ఉంచి ప్రజాస్వామ్యంలో ఉంటూ దాని ఫలాలు అనుభవిస్తూ ఓటింగ్‌లో పాల్గొనకపోతే ఎలా అన్నది ‘తప్పని సరి ఓటు’ అనుకూలుర వాదన. అలాంటి సమయంలో ప్రజాప్రతినిధులు మాత్రం ఓటు అమ్ముకోవచ్చని చెప్పడం ఎలాంటి నీతి?‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు వాదనలన్నీ సాంకేతిక కారణాల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రజాప్రతినిధిగా ఎన్నికైనవారు అన్నివేళలా నిజాయితీగా ఉండాలా, లేక కొన్ని సందర్భాల్లో ఉంటే చాలా అన్న తర్కం ఇందులో నడుస్తోంది. మరి ప్రజాప్రతినిధికి ఉండాల్సిన నైతిక విలువల సంగతి, ఉన్నత వ్యక్తిత్వం వగైరాలు ఏమైనట్టు? పోటీలో ఉన్నవారిలో మెరుగైన వ్యక్తి అని మాత్రమే కాదు... నైతికంగా దిగజారిన వ్యక్తి కాదన్న విశ్వాసంతోనే ఓటర్లు తమ ప్రతినిధిగా ఎంచు కుంటారు. అలాంటివారు ఓటుకు అమ్ముడుపోవడం లేదా వారిని కొనుక్కోవడానికి ప్రయత్నించడం నీతిబాహ్యమైన చర్య కాదనడం హాస్యాస్పదం కాదా? పైగా ఎఫ్ఐఆర్ నమోదై ఉన్న కేసులో దర్యాప్తునకు ఆదేశించడం వల్ల మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వస్తుంది గనుక ఆ చర్య చెల్లదని బాబు తరఫు న్యాయవాది వాదించారు. తన వరకూ వచ్చేసరికి ఇన్ని రకాల సాంకేతిక లోపాలను వెదికే బాబు... రేవంత్‌రెడ్డిని తాను పంపలేదని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో గొంతు తనది కాదని ఒక్క సందర్భంలో కూడా అనలేదు. పైగా ఆడియో, వీడియో టేపులు బయటికొచ్చిన వెంటనే ‘నా ఫోన్ ట్యాప్ చేయిస్తారా...’ అని ఉగ్రుడయ్యారు. ‘నాకూ ఏసీబీ ఉంది. నాకూ పోలీసులున్నారు...’అంటూ హుంకరించారు. ఈ పోకడలన్నీ నిజానికి ఏ న్యాయస్థానం విచారణా, ఏ ఫోరెన్సిక్ నిపుణుడి ధ్రువీకరణా అవసరం లేకుండానే ఆయన ప్రమేయాన్ని నిర్ద్వంద్వంగా నిరూపించాయి. అయినా సరే ఆయన గాంభీర్యం ఏమాత్రం తగ్గలేదు. ఈ కేసు విషయంలో స్వీయ రక్షణకు చంద్రబాబు అవలంబిస్తున్న పద్ధతులు, వాదనల సంగతలా ఉంచి కేసు దర్యాప్తులో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరైనా, పట్టనట్టు ఉంటున్న కేంద్ర ప్రభుత్వ పోకడైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. మరో రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఆరోపణలు వచ్చిన కేసులో దర్యాప్తు ఇంత నత్త నడకన సాగడం తనకు పరువు తక్కువని తెలంగాణ ప్రభుత్వం అనుకోవడం లేదు. తమ కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న పార్టీ అధినేత ఒకరు పబ్లిగ్గా దొరికినా వారితో చెలిమి కొనసాగించడం తనకు అపకీర్తి తెస్తుందని కేంద్రంలోని ఎన్డీఏ పెద్దలు అనుకోవడం లేదు. పైగా ఈ కేసులో తామే రాయబారం నడిపి రాజీ చేశామన్న ఆరోపణలు వస్తున్న సంగతిని గ్రహించినట్టు కనబడదు. ‘ఓటుకు కోట్లు’ కేసు దర్యాప్తు ఒత్తిళ్లు లేకుండా సాగి ఉంటే ఈపాటికే అది ఒక కొలిక్కి వచ్చేది. ఈ కేసును ఏదో విధంగా నీరుగార్చాలని చూస్తున్న చంద్ర బాబు పోకడలు వింతగొలుపుతాయి. ఇది సాధ్యమైనంత త్వరగా తేలాలని, దోషు లకు శిక్ష పడాలని ఆశిద్దాం. -
'తెలంగాణపై కేంద్రం పక్షపాతంగా వ్యవహరిస్తోంది'
విజయవాడ: తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన విజయవాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినట్టుగానే తెలంగాణకు కూడా కేంద్రం ఆర్థిక చేయూత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి మినహా అన్ని జిల్లాలు వెనకబడి ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని నాయిని తెలిపారు. -
ఓటుకు నోటులో ఎవరినీ వదిలిపెట్టద్దు
హిమాయత్‌నగర్: ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో చర్యలు తీసుకుంటే అందరిపైనా తీసుకోవాలని ఈ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య అన్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో దళిత క్రైస్తవుడైన తనపై రాజకీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఏసీబీ దాడులకు ముందు కానీ, తర్వాత కానీ తాను సంబంధిత వ్యక్తులెవరితోనూ ఫోన్లో మాట్లాడలేదన్నారు. ఎవరో ఒకరిని బలి చేయాలనే తనను వేధిస్తున్నారని ఆయన అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆ ఫోన్ మాట్లాడింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలితే అతడిపైనా... ఆ ఫోన్‌ను ట్యాపింగ్ చేయించిన కేసీఆర్‌లపై కూడా చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు ముద్దాయి కాదు: సోమిరెడ్డి
► ఓటుకు నోటు కేసు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టంలోకి రాదు ►ఎఫ్ఐఆర్, చార్జిషీట్లో బాబు పేరు లేదు ►న్యాయస్థానాలు రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి ►దాసరికి బొగ్గుపై ఉన్న ప్రేమ కులంపై లేదు ►చిరంజీవి కాపులైన ఏఒక్కరికీ న్యాయం చేయలేదు అమరావతి: ఓటుకు నోటు కేసు ఎఫ్ఐఆర్లో గాని, చార్టిషీట్లో గాని ఎక్కడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పేరు లేనప్పుడు ఏసీబీ న్యాయస్థానం విచారణకు ఎలా ఆదేశిస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. న్యాయస్థానాలు కూడా రాజ్యంగానికి లోబడే పనిచేయాలని హితవు పలికారు. బుధవారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు నోటు కేసు ఎల క్ట్రల్ మాల్ ప్రాక్టీసెస్ (ఎన్నికల్లో జరిగే అవకతవకలు)గా పరిగణించాల్సి ఉందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అవినీతి బయటపెట్టారనే కారణంతో రేవంత్‌రెడ్డిని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం సెక్షన్ 12 కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించడం వెనుకు కుట్ర ఉందన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన సెక్షన్ 171 కింద ఈ కేసు నమోదు చేయాల్సిఉన్నా.. అలా చేయకుండా కుట్రతో టీడీపీ నేతలను తెలంగాణ ప్రభుత్వం ఇరికించిందన్నారు. 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నాయకులు రూ.18 లక్షలు తీసుకుని ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వెళ్తుండగా పోలీసులకు పట్టుబడితే వారిపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చిఉన్నారని తెలిపారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఎన్నికల సమయంలో నగదు దొరికితే సెక్షన్ 171 కింద నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కక్షతోనే ఇలాంటి కేసులు నమోదు చేయించిందన్నారు. హైకోర్టులో ముత్తయ్య కేసు విషయంలో ఇచ్చిన జడ్జిమెంట్‌లో కూడా సాధారణ ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందనే పరిగణించడమే కాక మిగిలిన నిందితులందరికీ అదే విధంగా వర్తిస్తుందని ఆదేశించిదన్నారు. ఈ కేసు హైకోర్టులో కొట్టేసినా టీఆర్ ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లిందని, అక్కడ పెండింగ్‌లో ఉండగానే ఏసీబీ కోర్టు విచారణకు ఎలా ఆదేశిస్తుందని సోమిరెడ్డి మండిపడ్డారు. ఏ న్యాయస్థాన మైనా పరిధి దాటి పనిచేయకూడదన్నారు. ముద్రగడకు జాతికీ కులానికీ తేడా తెలియదు జాతికి, కులానికి తేడా తెలియని ముద్రగడ పద్మనాభం కులచిచ్చు రేపుతున్నాడని సోమిరెడ్డి విమర్శించారు.దాసరి నారాయణరావు, చిరంజీవిలను చెరోపక్క కూర్చోపెట్టుకుని సమావేశాలు పెట్టి కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలకు పావుగా మారాడని ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రిగా బొగ్గు కుంభకోణంలో కూరుకుపోయిన దాసరి నారాయణరావు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. ఆయనకు బొగ్గుపై ఉన్న ప్రేమ కులంపై లేదన్నారు. హీరోగా ఉన్న చిరంజీవి ఏనాడైనా కాపులకు న్యాయం చేశాడా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో కాపులకు జరిగిన న్యాయం ఏ ప్రభుత్వంలోనూ జరగలేదన్నారు. కాపుల కోసం కమిషన్ ఏర్పాటుచేసి వెయ్యి కోట్లు నిధులు మంజారుచేశామని గుర్తుచేశారు. -
మెడకు చుట్టుకుంటుందా?
-
మెడకు చుట్టుకుంటుందా?
హైదరాబాద్: అంతా సజావుగా సర్దుకుపోయిందనుకుంటున్న ఓటుకు నోట్ల కేసు మరోసారి తెరమీదకు రావడంతో తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కేసును పునర్విచారణ చేయాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖంగుతిన్నారు. వెంటనే సన్నిహిత అధికారులను పిలిచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సన్నిహిత న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. అంతా అయిపోయిందనుకున్న సమయంలో కోర్టు నుంచి ఇలాంటి ఆదేశాలు వెలువడటం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది. చివరకు ఈ కేసు మెడకు చుట్టుకుంటుందా అన్న భయం కూడా ఉందని ఆ పార్టీ నేతల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటుకు నోట్ల కేసులో ఏసీబీ చార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో ఇక ఎలాంటి సమస్యలు రావని భావిస్తున్న తరుణంలో కోర్టు కేసును పునర్విచారణకు ఆదేశించడం చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టింది. నిజానికి ఓటుకు నోట్లు కేసులో మొదట్లో విచారణ చురుకుగా సాగినప్పటికీ ఆ తర్వాత కాలంలో వేగం బాగా తగ్గింది. దానికి తోడు ఈ కేసులో చంద్రబాబు ముద్దాయిగా తేల్చడానికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక చాలా కాలం బయటకు రాలేదు. ఫోరెన్సిక్ నివేదిక పేరుతో ఇంతవరకు ఈ కేసులో చంద్రబాబు నాయుడిని అధికారులు ప్రశ్నించలేకపోయారు. అయితే ఫోరెన్సిక్ నివేదిక కోర్టు ముందుంచిన తర్వాత కూడా కేసులో ఎలాంటి ముందడుగు పడలేదు. దానిపై అప్పట్లోనే రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఫోరెన్సిక్ నివేదికపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆయన వాదనతో ఏకీభవించి కేసు పునర్విచారణకు ఆదేశించడంతో చంద్రబాబు వర్గీయుల్లో గుబులు మొదలైంది. అందులోనూ ఫోరెన్సిక్ నివేదికను పరిగణలోకి తీసుకుని విచారణ జరగాలని కోర్టు కోరడం చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం మింగుడు పడటం లేదని తెలిసింది. ఈ విషయంలో తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్న దానిపై ఆయన న్యాయకోవిదులతో సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. ఏసీబీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తే చంద్రబాబు విచారణకు సిద్ధపడటం లేదని తెలిసిపోతుంది. అలాగని పై కోర్టులను ఆశ్రయించని పక్షంలో కేసు మెడకు చుట్టుకునే ఆస్కారం ఉంది... ఏ కోణంలో చూసినా చంద్రబాబుకు ఇబ్బందికరమైన పరిస్థితే తలెత్తిందని సీనియర్ టీడీపీ నేత ఒకరు చెప్పారు. ఓటుకు కోట్ల కేసులో తనకేమాత్రం సంబంధం లేదని, ఈ కేసులో తాను దోషి కాదని చంద్రబాబు నిజాయితీగా నిరూపించుకోవలసిన అవసరం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. కోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం ఉంటుందని ముఖ్యమంత్రి సన్నిహిత అధికారి ఒకరు చెప్పారు. -
'2019 తో టీడీపీ ఆయుష్షు ఖతం'
విజయవాడ: 2019 తో తెలుగుదేశం పార్టీ ఆయుష్షు ముగిసిపోతుందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. 2050 వరకు తానే సీఎం అంటూ చంద్రబాబు నాయుడు కలలు కంటున్నారని విమర్శించారు. సోమవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. రెండేళ్లలో టీడీపీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. దీనిపై జూన్‌లో సీఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని రఘువీరా విమర్శించారు. -
ఒట్టేసి చెబుతున్నా..
ఓటుకు నోటు నో..నో 10న కోటి మందితో ప్రతిజ్ఞ చెన్నై: ఓటు హక్కు అనే మాటకు అర్థం మారి పోయి ఓటుకు నోటు హక్కు అనే మనస్తత్వాల్లో మార్పు తెచ్చేం దుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. అవును ఒట్టేసిచెబుతున్నా..‘ఓటుకు నోటు తీసుకోను, ఇవ్వను’ అని ఈనెల 10వ తేదీన కోటి మందితో ప్రమాణం చేయిస్తోంది. ఓటు వేసేందుకు డబ్బు పుచ్చుకోవడం, ఇచ్చుకోవడం కూ డా నేరమే. ఈ నేరాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని, నేర తీవ్రతను బట్టి ఏడాది జైలు శిక్ష కూడా తప్పదని ఈసీ ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించింది. అయినా రాష్ట్రంలో విచ్చలవిడిగా నగదు పంచే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. కోట్లాది రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో నోట్లు పంచడమే కాదు, నగదు అందని ఓటర్లు ఆయా పార్టీల అభ్యర్థుల వద్దకు వెళ్లి డిమాండ్ చేసిన సంద ర్భాలు ఉ న్నాయి. ఓటుకు నోటు లేదా, పంచెలు, చీరలు, మద్యం బాటి ళ్లు, బిరియానీ పొట్లాలు పంచడం నేతలు అలవాటుగా మార్చుకున్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో పంచముఖ పోటీ నెలకొని ఉంది. పార్టీల నేతలు, అభ్యర్థులంతా అధికారంలోకి వచ్చేది నువ్వా నేనా అని సవాళ్లు విసురుకుంటున్న దశలో ఎన్నికల నిర్వహణ కఠినతరమైంది. ఎ న్నికల్లో అన్ని ఏర్పాట్ల కంటే నగదు పంపిణీ కాకుండా చేయడం ఈసీకి సవాలుగా మారింది. నగదు చలామణికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నడూ లేని విధంగా ఆదాయపు పన్నుశాఖ అధికారులను సైతం రంగంలోకి దించింది. ఈ పరిస్థితిలో ఓటర్లు, నేతల్లో మార్పు తెచ్చేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రజలు, వివిధ పార్టీల నేత ల చేత ఓటు వేసేందుకు నోటు తీసుకోం, ఇవ్వం అంటూ ప్రతి జ్ఞ చేయిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 66 పోలింగ్ బూతుల వద్ద సుమారు కోటి మందితో ఈ ప్రతిజ్ఞ చే యించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. క నీసం 50 వేల మందైనా వస్తారని ఆశిస్తున్నామని అన్నారు. అలాగే పంచాయతీ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, ఎ న్నికల కార్యాలయాల్లో సైతం సిబ్బం ది చేత ప్రతిజ్ఞలు చేయిస్తున్నామని తె లిపారు. పార్టీల నేతలు తమ ప్రచా రం ప్రారంభించేటప్పుడు ప్రతిజ్ఞ చే యవచ్చని అన్నారు. రోటరీ, లయన్స్క్లబ్బులు, ఎన్జీవో సంఘాలు, నివాసగృహాల అసోసియేషన్లు, గుడిసెవాసులు సైతం ప్రతిజ్ఞలో పాల్గొనేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించామని అన్నారు. ఒట్టు తీసి చెరువు గట్టుమీద పెట్టకుండా కనీసం ప్రతిజ్ఞ చేసినవారైనా కట్టుబడి ఉంటారని ఆశిద్దాం. -
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మత్తయ్య
గుంటూరు: ఉభయ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడు మత్తయ్య అనారోగ్యంతో నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం అతనిని పలు సంఘాల నాయకులు పరామర్శించి, ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణా ఎమ్ఎల్సి ఎన్నికల్లో సీట్ల కొనుగోలుకు కోట్ల రూపాయలు డీల్ కుదురుస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా టీడీపీ నేతలు చిక్కిన విషయం విధితమే. ఆ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్తయ్య నరసరావుపేట మీదుగా 2 రోజుల క్రితం ప్రయాణిస్తూ అస్వస్తతకు లోనయ్యాడు. సన్నిహితులు అతన్ని పట్టణంలోని మదర్‌థెరీసా మల్టీ స్పెషాలిటీ హాస్పటల్లో చేర్చారు. అప్పటి నుంచి అతను అక్కడే చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య ముస్లిం క్రైస్తవ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణా ఏసీబీ మత్తయ్యకు నోటీసులు ఇచ్చిన కారణంగా ఆందోళన చెందిన అతను హైబీపీ, షుగర్, హార్ట్ ప్రెజర్‌తో అస్వస్థతకు గురయ్యాడన్నారు. మత్తయ్యకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే తెలంగాణా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. కేసీఆర్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, దళితనాయకుడు మత్తయ్యపై పెట్టిన కేసును బేషరతుగా ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మత్తయ్య ఆరోగ్య విషయంపై స్పందించి సత్వరమే వైద్యసహాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆందోళన కలిగించింది
-
ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆందోళన కలిగించింది: మత్తయ్య
గుంటూరు: ఓటుకు కోట్లు కేసు విచారణకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియడం లేదని, ఆ కేసులో నాలుగో నిందితుడు జెరూసలేం మత్తయ్య అన్నారు. ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు హ్యారీ సెబాస్టియన్‌ను కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రానివ్వడం లేదని మత్తయ్య పేర్కొన్నారు. వాయిస్ శాంపిల్స్‌కు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరి (ఎఫ్ఎస్ఎల్) రిపోర్ట్ రావడం మాకు ఆందోళన కలిగించిందని తెలిపారు. ఏకంగా ఒక మంత్రే మమ్మల్ని అవమానిస్తున్నారని మత్తయ్య గుంటూరులో అన్నారు. ఇక భవిష్యత్తులో విపరీత పరిణామాలు ఎదురైతే ఏం చేయాలో తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
హైకోర్టులో మత్తయ్య క్వాష్ పిటిషన్
-
బాబు మానసిక స్థితిపై అనుమానం: చెవిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతున్నదని, జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మేధావుల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై చర్చించకుండా సభాసమయాన్ని వృథాచేస్తూ అధికారపక్షం అడ్డుపడుతోందని, దొంగే.. దొంగ దొంగ అన్నట్టుగా ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. సైకో పార్టీ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు విపక్షంపై అగౌరవంగా మాట్లాడటాన్ని చూస్తే చంద్రబాబే ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మంత్రి అచ్చెన్నాయుడ్ని బర్తరఫ్ చేయాలన్నారు. -
'ఓటుకు నోటు'లో కరీంనగర్‌వాసికి నోటీసు
సిరిసిల్ల: ఓటుకు నోటు కేసులో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం సారంపల్లికి చెందిన పాలకుర్తి రాములుకు సోమవారం ఏసీబీ అధికారులు నోటీసు జారీ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో హాజరు కావాలంటూ ఏసీబీ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫీస్ పోలీసు ఎం.మల్లారెడ్డి నోటీసులో పేర్కొన్నారు. పాలకుర్తి రాములు టెక్స్టైల్ పార్క్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల కిందట ఆయన సెల్‌ఫోన్ పోయింది. రాములు సెల్‌నంబర్ నుంచి ఓటుకు నోటు కేసులో సంభాషణలు జరిగినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. రాములు పేరిట ఉన్న ఫోన్ నంబర్ కేసులో ఉండడంతో ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసు జారీ చేశారు. నోటీసులతో ఆందోళనకు గురైన రాములు ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయూడు. ఈ కేసుతో తమకు సంబంధం లేదని, తమ సెల్‌ఫోన్ రెండేళ్ల కింద పోయిందని రాములు భార్య ఇందిర తెలిపారు. -
సండ్ర అరెస్టయ్యారా?
తనకు తెలియదన్న దేవాదాయ మంత్రి సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టయిన విషయం తనకు తెలియదని దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకవర్గ సభ్యుడిగా వీరయ్యను కొనసాగించ టంపై న్యాయ సలహా తీసుకుంటామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. -
విచారణ పేరుతో పిలిచి హింసిస్తున్నారు..
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఏసీబీ అధికారులు తనను సాక్షిగా పదే పదే విచారణకు పిలుస్తూ హింసిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం నేత వి.ప్రదీప్ చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో తనను పదే పదే పిలవకుండా, వేధింపులకు గురి చేయకుండా ఏసీబీ అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆయన శుక్రవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి విచారించారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతోనే ఏసీబీ అధికారులు వేధిస్తున్నారని వివరించారు. ఏసీబీ అధికారులు విచారణకు పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెడుతున్నారని, కొన్ని సందర్భాల్లో దురుసుగా వ్యహరిస్తున్నారని తెలిపారు. ఓటుకు కోట్లు కేసుతో పిటిషనర్ సంబంధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు చూపకుండా వేధిస్తున్నారని ఆయన కోర్టుకు విన్నవించారు. ఫలానా వారి పేర్లు చెప్పాలంటూ పిటిషనర్లపై ఏసీబీ అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారన్నారు చెప్పారు. అయితే ఈ వాదనలను ఏసీబీ స్పెషల్ స్టాండింగ్ కౌన్సిల్ వి.రవికిరణ్‌రావు తోసిపుచ్చారు. సాక్షిగా ఓ వ్యక్తిని ఎన్నిసార్లయినా విచారణకు పిలిచే అధికారం దర్యాప్తు సంస్థకు ఉందన్నారు. పలువురిని విచారించినప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తుంటాయని, వాటిని నిర్ధారించుకునేందుకు గతంలోని పిలిచిన వ్యక్తిని మరోసారి పిలిచి విచారించాల్సి ఉంటుందని, ఇది దర్యాప్తులో భాగం మాత్రమేనని ఆయన తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలను తెలుసుకుని కోర్టుకు వెల్లడించాలని రవి కిరణ్‌రావుకు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు. -
ఉనికి కోసం టీటీడీపీ పాట్లు!
'ఓటుకు కోట్లు'పై నష్ట నియంత్రణ చర్యల్లో నేతల పిల్లిమొగ్గలు జిల్లాల పర్యటనలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం పర్యటనలకు దూరంగా కొందరు నేతలు సాక్షి, హైదరాబాద్: వలసలతో చిక్కి శల్యమైన తెలంగాణ టీడీపీ ఉనికి కోసం నానా తంటాలు పడుతోంది. 'ఓటుకు కోట్లు' కేసుతో పార్టీ పరువు బజారున పడటం, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికార టీఆర్ఎస్లోకి వరుస కట్టడంతో క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతినడం వంటి పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు టీటీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదంటూ జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టింది. తద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆయా సమస్యలపై జిల్లాల పర్యటనలు మొదలు పెట్టారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించడం లేదని, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించడంలేదని వరంగల్‌లో టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ఒక రోజు దీక్ష చేశారు. తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలో సైతం పర్యటించారు. తోట పల్లి రిజర్వాయరు నిర్మాణం రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ముగ్గురు నాయకులే యాత్ర చేసి వచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మించతలపెట్టిన ‘ పాలమూరు - రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకానికి అభ్యంతరం చెబుతూ ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖపై టీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో తమ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల గురించి టీడీపీ ఊదరగొట్టింది. అయినా పాలమూరు జిల్లా ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయం ఏర్పడిందని భావించిన టీటీడీపీ నాయకులు గురువారం ఆ జిల్లాలో కూడా పర్యటించారు. ఒక వైపు ప్రభుత్వ తీరును విమర్శిస్తూనే, తాము చేపట్టిన ప్రాజెక్టులు, వెచ్చిం చిన నిధుల వివరాలను వల్లెవేయడం మొదలు పెట్టారు. అయితే ఇంతా చేస్తున్నా, తెలంగాణ నాయకత్వానికి సొంత పార్టీలోని సీనియర్ల నుంచే ఆదరణ కరువైంది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నేత మోత్కుపల్లి నర్సింహులు , ఇతర నేతలు వీరి పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. త్వరలో తెలంగాణకు కొత్త రాష్ట్ర కమిటీ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఈ నేతలు వేస్తున్న పిల్లిమొగ్గలు ఆసక్తి కలిగిస్తున్నాయని అభిప్రాయ పడుతున్నారు. -
'వారిద్దరూ దొరికిన దొంగలే '
వరంగల్: ' ఓటుకు కోట్లు' లో చంద్రబాబు, 'ట్యాపింగ్' లో కేసీఆర్..ఇద్దరూ దొరికిన దొంగలే అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. కేంద్రం మందలించడంతో ఇద్దరూ మాట్లాడటంలేదన్నారు. త్వరలో ప్రజలే వీరికి తగిన బుద్ధి చేబుతారన్నారు. ఆయన శనివారం వరంగల్ లో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. కాగా అవసరమైతే కార్మికులకు మద్దతుగా 48 గంటల దీక్షను చేపడతానని మందకృష్ణ అన్నారు. -
ఏసీబీ కోర్టుకు హాజరైన సండ్ర
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గోదావరి పుష్కరాలకు హాజరయ్యేందుకు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో భాగంగా మంగళవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన సండ్ర వెంకట వీరయ్యకు గత వారం షరతులతో కూడిన బెయిల్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు మంజూరు చేసింది. ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని , నియోజకవర్గం వదిలి వెళ్లకూడదని కోర్టు షరతులు విధించింది.కాగా, పుష్కరాలకు హాజరు కావడానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల సండ్ర కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషన్ పై తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది. -
'సెబాస్టియన్ ను ఏ మతం, ఏ దేవుడూ క్షమించడు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ ను ఏ మతం, ఏ దేవుడూ క్షమించడని రెవరెండ్ జార్జ్ కె హర్బట్ విమర్శించారు. సెబాస్టియన్ చరిత్ర క్రైస్తవులందరికీ తెలుసని.. బోరబండలో అద్దెకుంటూ ఇంటిని కబ్జా చేశారని హర్బట్ ఆరోపించారు. నీతిమాలిన పనులకు పాల్పడి అనైతిక చర్యలకు సెబాస్టియన్ దిగారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తిని ఏ మతం, ఏ దేవుడూ కూడా క్షమించడన్నారు. సెబాస్టియన్ ను చూసి క్రైస్తవ సమాజం అసహ్యించుకుంటోందని హర్బట్ పేర్కొన్నారు. -
ముగిసిన సండ్ర తొలిరోజు విచారణ
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కస్టడీలో భాగంగా ఏసీబీ తొలిరోజు విచారణ ముగిసింది. శుక్రవారం నాడు కూడా సండ్రను ఏసీబీ విచారించనుంది. ఈ రోజు పలు కీలక అంశాలపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఏసీబీ అడిగిన దానికి తనకు ఏమీ తెలియదంటూనే సండ్ర సమాధానాల్ని దాటవేసినట్లు సమాచారం. ఉదయం గం.10 నుంచి సాయంత్రం గం.5 ల వరకూ సండ్రను ఏసీబీ అధికారులు విచారించారు. దాదాపు 70 నుంచి 80 ప్రశ్నల వరకూ ఏసీబీ సంధించినట్లు తెలుస్తోంది. సండ్రను న్యాయవాదుల సమక్షంలో ఏసీబీ విచారించింది. ఓటుకు కోట్లు కేసులో సండ్రను ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. -
ఏసీబీ కస్టడీకి ఎమ్మెల్యే సండ్ర
-
విచారణకు రండి..
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ‘ఓటుకు నోటు కేసు’లో సోమవారం సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ రెండోసారి నోటీసులు జారీ చేసింది. అనారోగ్య కారణం చూపుతూ ఏసీబీ మొదటి నోటీస్‌కు సండ్ర విచారణకు హాజరుకాని విషయం విదితమే. అయితే ప్రస్తుత నోటీస్‌తో ఏసీబీ సండ్రను ఏం ప్రశ్నిస్తుంది?, ఆయన ఏం సమాధానం చెబుతారనే దానిపై సందిగ్ధత నెలకొంది. రెండోసారి నోటీసులు జారీ హైదరాబాద్‌లోని సండ్ర నివాసానికి విచారణకు హాజరు కావాలని ఏసీబీ శనివారం నోటీసులు అంటించింది. మొదటి నోటీసు జారీతోనే ఏసీబీ విచారణ తప్పదని భావించిన సండ్ర వారి ముందు ఏం చెప్పాలో సమాయత్తం అయినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయ న రాజమండ్రిలో చికిత్స తీసుకుంటూ ఈ విషయమై పార్టీ అధినేతలు, న్యాయనిపుణులతో చర్చించినట్లు తెలిసింది. తన ఆరోగ్యం కుదుటపడిందని, ఏసీబీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతానని సండ్ర తిరిగి లేఖ రాయడంతో ఆయనకు మరోదఫా నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో ప్రధా న నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డికి బెయిల్ రావడం, ప్రస్తుతం సండ్రను ఏసీబీ విచారణకు పిలవడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. సండ్ర విషయంలో ఏసీబీ ఎలా అడుగులు వేస్తుందోనని జిల్లాలోని రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. టీడీపీలో తీవ్ర ఉత్కంఠ రేవంత్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని ఓవైపు ఏసీబీ సుప్రీంకోర్టులో పిటీషన్ వేయడం, అది తిరస్కరణకు గురికావడంతో సండ్ర విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. విచారణతోనే వదిలి పెడతారా..లేక అరెస్ట్ చేస్తారా..? అన్న విషయంపై టీడీపీ శ్రేణుల్లో కూడా టెన్షన్ మొదలైంది. గత రెండు రోజులుగా జిల్లాలోనే ఉన్న ఆయన సత్తుపల్లి, ఖమ్మం ప్రాంతాల్లో పర్యటించారు. ఏసీబీ రెండోసారి నోటీసులతో ఖమ్మంలోని క్యాంపు కార్యాలయం వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకుని సండ్రతో చర్చించారు. ఏసీబీ విచారణతో సండ్ర భవితవ్యం ఏమవుతుందోనని పార్టీ శ్రేణులు చర్చించుకున్నాయి. ఏసీబీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతా ఏసీబీ రెండోసారి నోటీసుల విషయమై ‘సాక్షి’ తో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. ‘ఏసీబీ ఇచ్చిన గడువులోగా విచారణకు హాజరవుతాను. ఏసీబీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతాను. అనారోగ్య కారణంతోనే తొలివిడత విచారణకు హాజరుకాలేకపోయూను’ అన్నారు. -
రాష్ట్రంలో పాలన గాలికి వదిలేశారు
గిద్దలూరు : రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు ఓటుకు కోట్లు కుమ్మరించే పనిలో ఉన్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, సంతనూతలపాడు, అద్దంకి ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. కర్నూలు జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణ కోసం వెళుతున్న ఎమ్మెల్యేలు గిద్దలూరులోని లక్ష్మీ డెయిరీలో భోజనం చేశారు. అనంతరం విలేకర్ల సమావేశం నిర్వహించిన వారు మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పూర్తిగా నిలిచిపోయాయని, ఏ ఒక్కపథకం అమలు కావడం లేదన్నారు. పాఠశాలలు ప్రారంభమై 20 రోజులైనా నేటికీ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏ ఒక్క పాఠశాలను ప్రారంభించలేదన్నారు. రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్టడం లేదని, రైతులను గాలికి వదిలేసి ఇబ్బందుల్లోకి నెట్టేశారన్నారు. పొగాకు, పత్తి పండించిన రైతులకు గిట్టుబాటు ధరల్లేక పంటను అమ్ముకోలేక, నిల్వలు ఉంచుకునే పరిస్థితి లేకపోవడంతో ఆందోళనలు చేస్తున్నారన్నారు. శనగ పంటకు ధరల్లేక గృహాల్లోనే నిల్వలు ఉన్నాయన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రయత్నించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడి మంత్రులతో మాట్లాడించారన్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి బయ్యర్లకు చెప్పినా పొగాకు ధరల్లో కదలికలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పొగాకు పండించే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం పంటను ఎందుకు కొనుగోలు చేయడం లేదని వారు ప్రశ్నించారు. పొగాకు కొనుగోళ్ల విషయంలో వైఎస్సార్సీపీ అనేక సలహాలు, సూచనలు చేసిందని అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వం పొగాకును ముందుగా కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధరలు వస్తాయని, వ్యాపారులు సైతం అదే ధరలకు కొనుగోలు చేస్తారన్నారు. 192 మిలియన్ క్వింటాళ్ల పప్పు శనగలు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అసలు కొనుగోళ్లు చేపట్టలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఓటుకు కోట్లు పోస్తున్నారని, ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని వారు ప్రశ్నించారు. ఎంపీటీసీలను తీసుకెళ్లి నెల్లూరులోని లాడ్జిలో దించారని, వారికి ఎంత ఇచ్చి తీసుకెళ్లారని ప్రశ్నించారు. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ప్రజలు టీడీపీకి ఎన్ని సీట్లు ఇచ్చారు...నైతికంగా గెలిచే అవకాశం లేకున్నా ఓటుకు కోట్లు గుమ్మరించి రాజకీయాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. రాష్ర్టంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, ఎంపీటీసీలను కొనుగోలు చేస్తున్నారంటూ గవర్నరును నాలుగు పర్యాయాలు కలిసినా ఎలాంటి స్పందన లేదన్నారు. కేసులు తప్పించుకునేందుకు కృష్ణా జలాల తాకట్టు కృష్ణా నదిపై తెలంగాణ లో పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారని, దాని వలన రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో కృష్ణాజలాల కొరత ఏర్పడుతుందన్నారు. ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ వద్ద కృష్ణా జలాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ ఆయన రాష్ర్ట ప్రజల సంక్షేమం కోసం కృష్ణా జలాలను ఇస్తున్నారని, కానీ చంద్రబాబు కృష్ణా జలాలను ఏకంగా తాకట్టు పెట్టి కేసు నుంచి తప్పించుకునేందుకు చూస్తున్నాడన్నారు. మహిళా సంక్షేమం, రైతుల సంక్షేమం విస్మరించారని, రైతులకు రుణమాఫీ చేయమంటే పరిశ్రమలకు రుణమాఫీ చేసి కోట్ల రూపాయలు కమీషన్ల రూపంలో దండుకున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని, అందుకు ప్రజలు మద్దతు పలుకుతున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనరు మోపూరి బ్రహ్మం, నాయకులు దప్పిలి విజయభాస్కర్‌రెడ్డి, దమ్మాల జనార్ధన్, పూలి బాలంకిరెడ్డి, రాజేశ్వరరెడ్డి, కటకం శ్రీనివాసులు, సీవిఎన్.ప్రసాద్, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
టీటీడీపీ నేతలు.. గప్‌చుప్
-
తప్పుకోను.. నేనే విచారిస్తా
'మత్తయ్య పిటిషన్' విచారణ నుంచి తప్పుకోవాలని కోరడంపై జస్టిస్ శివశంకరరావు ఎవరో ఏదో చెప్పారని న్యాయమూర్తిపైనే ఆరోపణలా? ఆధారాల్లేకుండా విచారణ నుంచి తప్పుకోవాలని అంటారా?.. ఇలాంటివి వ్యవస్థ మనుగడకే ముప్పు స్టీఫెన్సన్ తీరు కోర్టు ధిక్కారమే.. ఆయనపై చర్యలు చేపట్టాలంటూ రిజిస్ట్రీకి ఆదేశం అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తి అవసరమైతే మత్తయ్య పిటిషన్‌పై విచారణను వీడియో ద్వారా చిత్రీకరిస్తామని వెల్లడి సీజే నుంచి అనుమతులు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశం... ఆ తర్వాతే విచారణ చేపడతామని స్పష్టం సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు'వ్యవహారంలో తనపై కేసును కొట్టివేయాలంటూ నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను తానే విచారిస్తానని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బులుసు శివశంకరరావు స్పష్టం చేశారు. ఈ పిటిషన్ విచారణ నుంచి తప్పుకోవాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చారు. ఈ మేరకు స్టీఫెన్సన్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేశారు. అంతేకాక స్టీఫెన్‌సన్‌పై కోర్టు ధిక్కారం కింద చర్యలకు ఆదేశించారు. మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 18న జరిగిన విచారణ తీరును, ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను బట్టి ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావుపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ.. కేసు విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని అభ్యర్థిస్తూ స్టీఫెన్సన్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గతవారం వాదనలు విన్న జస్టిస్ శివశంకరరావు సోమవారం ఉదయం తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా స్టీఫెన్సన్ తీరుపై జస్టిస్ శివశంకరరావు మండిపడ్డారు. ప్రజాప్రతినిధిననే విషయం మర్చిపోయి, న్యాయమూర్తిపైనే తీవ్ర ఆరోపణలు చేశారని తప్పుపట్టారు. విచారణ జరిగినప్పుడు కోర్టులో లేకుండానే, ఎవరో ఏదో చెప్పారని ఆందోళన వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టులో జరిగింది ఎవరు చెప్పారు, వారితో తనకున్న సంబంధం ఏమిటి? తదితర వివరాలను స్టీఫెన్సన్ ఎక్కడా తన పిటిషన్లో పేర్కొనకపోవడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. కోర్టులో ఏదో జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తూ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరడం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఇలా విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం, న్యాయమూర్తులను తప్పించుకుంటూ వెళ్లడమేనని తీర్పులో పేర్కొన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మొత్తం వ్యవస్థ మనుగడకే ప్రమాదమని వ్యాఖ్యానించారు. పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేసేందుకు తగిన కారణాలుండాలని... ఒకవేళ కారణమున్నా కూడా న్యాయమూర్తిని కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరే హక్కు లేదని స్పష్టం చేశారు. ఆరోపణలకు ఆధారాలు చూపకుండా కేసు విచారణ నుంచి తప్పుకోవాలనడం గదమాయింపు తప్ప మరొకటి కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు ధిక్కారమే.. కోర్టు హాలులో నుంచి తాను న్యాయవాదులందరినీ వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశాన నడంలో ఎటువంటి వాస్తవం లేదని, ఇటువంటి ఆరోపణ కచ్చితంగా కోర్టు ధిక్కారమే అవుతుందని న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు తన తీర్పులో పేర్కొన్నారు. కోర్టు ధిక్కార చట్టంలోని సెక్షన్-14 కింద నిర్దేశించిన విధివిధానాలకు, దీనిపై హైకోర్టు రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. చర్యలు చేపట్టే ముందు అవసరమైతే నిబంధనల మేరకు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకోవాలని రిజిస్ట్రీకి సూచించారు. కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవడమంటే... న్యాయమూర్తిగా తాను చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లేనంటూ సుబ్రతారాయ్-సహారా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ శివశంకరరావు తీర్పులో ప్రస్తావించారు. విచారణ నుంచి తప్పుకోవాలని అడిగినంత మాత్రాన తప్పుకోవాల్సిన అవసరం లేదని, ఈ కేసులో తదుపరి విచారణను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నిష్పక్షపాత విచారణకు ఇరుపక్షాలూ సహకరించాలన్నారు. సీజే అనుమతిస్తే ప్రొసీడింగ్స్ చిత్రీకరణ ప్రధాన న్యాయమూర్తి అనుమతిస్తే ఈ కేసులో పారదర్శకత కోసం కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్‌ను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేయాలని నిర్ణయించామని జస్టిస్ శివశంకరరావు తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో ఆన్ రికార్డ్ ఉన్న న్యాయవాదులు, కేసుతో సంబంధమున్న సీనియర్ న్యాయవాదులు, అడ్వొకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు తప్ప ఇతరులకు ప్రవేశం ఉండబోదని స్పష్టం చేశారు. హైకోర్టులో మొదటిసారిగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నప్పటికీ, ఇది కొత్తేమీ కాదని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి నుంచి తగిన అనుమతులు తీసుకుని.. ఆడియో, వీడియో రికార్డింగ్ కోసం తగిన ఏర్పాటు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఆ తరువాతే మత్తయ్య పిటిషన్‌ను విచారణకు వేయాలని స్పష్టం చేశారు. -
టీటీడీపీ నేతలు.. గప్‌చుప్
తాజా పరిణామాలపై ఆందోళన ఏపీ మంత్రుల తీరుపై అసంతృప్తి అధినేత చంద్రబాబుతో భేటీ అంతర్మథనంలో తెలంగాణ టీడీపీ నేతలు సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' వ్యవహారం బయటపడినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలకు ఎటూ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గెలుపు అవకాశమే లేని మండలి ఎన్నికల బరిలోకి దిగి బొక్కాబోర్లా పడిన ఆ పార్టీ నేతలు దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సైతం తెలంగాణ టీడీపీని బలోపేతం చేయడంపై కాకుండా.. తన ఇమేజ్ను కాపాడుకునేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తుండడం వారికి మింగుడు పడడం లేదు. దీంతో వారు తమ రాజకీయ భవిష్యత్‌పై బెంగ పెట్టుకున్నారు. 'ఓటుకు కోట్లు' వ్యవహారం, తాజా రాజకీయ పరిణామాలపై తమ అనుమానాలను నివృత్తి చే సుకునేందుకు పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు టీటీడీపీ నేతలు కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నా అపాయింట్మెంట్ రాలేదు. చివరకు మరోసారి గట్టిగా ప్రయత్నించి సోమవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తారస్థాయికి అసంతృప్తి..! బాబుతో పాటు, ఏపీ మంత్రులెవరూ కూడా తెలంగాణ టీడీపీ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరిస్తుండడంపై టీటీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'ఓటుకు కోట్లు' కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు చేస్తున్న పనులు, లేవనెత్తుతున్న అంశాలు తమకు సమస్యగా మారాయన్న అభిప్రాయం వారిలో నాటుకుపోయింది. అసలు ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారుచేసే సమయంలోనే తెలంగాణ టీడీపీలోని రెండు వర్గాలు ఎలా గెలుస్తామంటూ వాదులాడుకున్నాయని ప్రచారంలో ఉంది. అలాంటిది గెలవని సీటు కోసం అభ్యర్థిని పెట్టడం, బాబు స్టీఫెన్ సన్తో ఫోన్లో మాట్లాడి దొరికిపోవడంతో టీ టీడీపీ నేతలు ఇరకాటంలో పడిపోయారు. ఈ పరిణామాలపై నోరు విప్పలేక మౌనం పాటిస్తున్నారు. దీనికితోడు బాబు సెక్షన్-8 వివాదాన్ని లేవనెత్తడంతో దాన్ని సమర్థించాలో, వ్యతిరేకించాలో తెలియక ఆత్మరక్షణలో పడిపోయారు. ఏమంటే ఏమవుతుందో? తెలంగాణకు వ్యతిరేకంగా ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనలు, ఇష్టానుసారం మాట్లాడుతున్న తీరు తమకు ఇబ్బందికరంగా మారిందని టీటీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇక్కడ తెలంగాణలో తమ పరిస్థితి, పార్టీ భవిష్యత్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా వారు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు 'ఓటుకు కోట్లు' కేసులో రేవంత్‌ను, బాబును వెనకేసుకొచ్చేందుకు టీటీడీపీ నాయకులు కొంత ప్రయత్నించారు. తమను పార్టీ మారాల్సిందిగా టీఆర్ఎస్ నాయకత్వం బెదిరించిందంటూ ఏసీబీకి ఫిర్యాదు చేశారు కూడా. కానీ ఈ కేసులో ఎమ్మెల్యేను ఏపీ ప్రభుత్వం రక్షిస్తున్న తీరు, నిందితుడు మత్తయ్యకు ఏపీలో షెల్టర్ ఇవ్వడం వంటి చర్యలతో తామేమీ మాట్లాడలేకపోతున్నామని తెలంగాణ టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ కేసులో పరిణామాలు తమకు చుట్టుకుంటాయేమోనన్న ఆందోళనలోనూ కొంద రు నేతలు ఉన్నారు. ఇలా మొత్తంగా తెలంగాణ టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్‌పై బెంగ పెట్టుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబుతో టీ టీడీపీ నేతల భేటీ తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఆ పార్టీ తెలంగాణ నేతలు సోమవారం భేటీ అయ్యారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇతర నేతలు బాబుతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. వీరి మధ్య ప్రధానంగా 'ఓటుకు కోట్లు' కేసుతో పాటు ప్రస్తుత పరిణామాలు, వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ లోక్‌సభ స్థానం ఎన్నికపై టీ టీడీపీ నేతలు ఇప్పటికే తమ మిత్రపక్షం బీజేపీ నేతలతో చర్చించిన నేపథ్యంలో.. ఆ చర్చల సారాంశాన్ని సోమవారం బాబుకు వివరించినట్లు సమాచారం. అయితే ఆదివారమే వారు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో సోమవారం కలసి వివిధ అంశాలపై చర్చించారు. -
నేడు వైఎస్సార్ సీపీ భారీ ధర్నా
-
నోటుకు నోటు
కదిరి : ‘ఓటుకు నోటు’ అన్నది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న చర్చ. కదిరి ప్రాంతంలో మాత్రం ‘నోటుకు నోటు’ అన్నది ప్రస్తుత హాట్ టాపిక్. ఇప్పటికే ఎంతో మంది అమాయకులు ‘నోటుకు నోటు’ ముఠా సభ్యుల బారిన పడి రూ. లక్షల్లో మోసపోయారు. ఒకటి కొంటే ఒకటి ఉచితం అనే వ్యాపార సూత్రం లాగే ఈ ముఠా తమ నోటుకు నోటు స్కీంను ప్రచారంలో పెట్టింది. ఆశ పడ్డ వారికి చుక్కలు చూపించి నోట్లు పంచుకుంటున్నారు. కదిరి ప్రాంతంలోనే కాకుండా కర్ణాటక రాష్ట్రంలోనూ ఈ ముఠా దందా సాగించినట్లు సమాచారం. ఈ ముఠా సభ్యులకు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడితో పాటు ఓ పోలీస్ అధికారి మద్దతు కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోసగిస్తున్నది ఇలా.. కదిరి పట్టణానికి చెందిన 15 మంది సభ్యులు ఓ ముఠాగా ఏర్పడి నోటుకు నోటు పేరుతో ఆశపడ్డ వారిని దోచుకుంటున్నారు. రూ 50 వేలు తీసుకెళ్లి ఆ ముఠా సభ్యులను కలిస్తే.. అదే రోజు ఆ డబ్బు తీసుకెళ్లిన రూ.లక్ష ఇస్తామని ఆశ చూపుతున్నారు. ఒక వ్యక్తి ఆ ముఠా సభ్యులను రహస్య ప్రదేశంలో కలిసి తాను తెచ్చిన డబ్బును వారి ముందు పెడితే దానికి పూజలు చేసి, మంత్రాలు చదివి నాలుగైదు గంటలు గడిచిన తర్వాత అక్కడ ముందే ఏర్పాటు చేసిన మరో నోట్ల కట్టను అతనికి అదనంగా ఇవ్వబోతారు. అదే సమయంలో అదే ముఠా సభ్యులు కొందరు సైరన్ మోగించుకుంటూ పోలీస్ వేషంలో అక్కడికి చేరుకుంటారు. డబ్బు తెచ్చిన వ్యక్తితో పాటు అక్కడ పూజలు చేస్తున్న ముఠా సభ్యులకు సైతం లాఠీలతో కొడతారు. పోలీస్ స్టైల్లోనే ‘జీప్ ఎక్కండ్రా స్టేషన్‌కు పోదాం’ అంటారు. ‘సార్, ఈసారికి వదిలేయండి. ఇంకెప్పుడూ ఇలా చేయమని ప్రాధేయపడి ఆడబ్బు ముట్టజెబుతారు. డబ్బు తీసుకెళ్లిన వ్యక్తి సైతం పరువుదక్కిందని అక్కడి నుంచి బయటపడతారు. మరి కొద్ది సేపటికే దొంగ, పోలీస్ ఒక్కటైనట్లు ఆ ముఠా సభ్యులు కలిసి ఆ డబ్బును పంచుకుంటారు. వీరి బారిన పడిన వారు పరిస్థితి మాత్రం దయనీయం. ‘పోలీసులే రాకపోయి ఉంటేనా.. నా పంట పండేది’ అని ఆనందపడేవారు కొందరైతే, మోసపోయామని గ్రహించి బయటకు చెబితే పోలీసులు తమనెక్కడ అరెస్ట్ చేస్తారో నని లోలోపలే నలిగి పోతున్న వారు ఇంకొందరు. ఇలాంటి వారి ఆశలను భయాల మాటున నోటుకు నోటు వ్యాపారం అడ్డూ అదుపులేకుండా సాగిపోతోంది. ఈ విషయం డీఎస్పీ రామాంజనేయులు దృష్టికి తీసుకెళ్తే వెంటనే నిఘా పెట్టి అలాంటి ఉంటే ముఠా గుట్టు రట్టు చేస్తామన్నారు. దీని వెనుక ఎవరున్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. -
ఓటుకు కోట్లు కేసులో కీలకఘట్టానికి ఏసీబీ!
-
శనివారమే ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిన సండ్ర..
రాజమండ్రి : ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసులు అందుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (రాజమండ్రిలో సండ్ర కలకలం) ఆచూకీ ప్రస్తుతం మిస్టరీగా మారింది. చికిత్స నిమిత్తం రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో చేరిన ఆయన ప్రస్తుతం అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత అక్కడ నుంచి సండ్ర అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. కేవలం పడకకే పరిమితమై విశ్రాంతి తీసుకోవాలంటూ వైద్యులు చెప్పారని ఏసీబీకి లేఖ రాసిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానంటూ రోజుకో నగరాన్ని మార్చుతున్నారు. ఆస్పత్రిలో విచారణకైనా సిద్ధమంటూనే ఎక్కడ ఉన్నారో మాత్రం సండ్ర...ఏసీబీకి చెప్పడం లేదు. మరోవైపు ఎమ్మెల్యే సండ్రకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తుందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. -
రాజమండ్రిలో ఎమ్మెల్యే సండ్ర కలకలం
ట్రీట్మెంటా.. ట్రైనింగా..? * బొల్లినేని ఆసుపత్రిలో హైడ్రామా * ఏసీబీకి జవాబిచ్చేందుకు తర్ఫీదు! కంబాలచెరువు (రాజమండ్రి): చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ విచారణ నుంచి తప్పిం చుకు తిరుగుతున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రికి రావడం.. మళ్లీ మాయమవడం చర్చనీయాంశమైంది. తెలంగాణ ఏసీబీ అధికారుల కళ్లుగప్పి తిరుగుతున్న ఆయన... ఆరోగ్యం బాగా లేదం టూ శనివారం రాత్రే బొల్లినేని ఆసుపత్రిలో చేరారు. ఈ విషయూన్ని ఆసుపత్రి వర్గాలు రహస్యంగా ఉంచాయి. అందుకే ఎవరికీ అనుమానం రాకుండే ఉండేందుకు ఆసుపత్రి వద్ద కనీసం ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చేశారు. విషయం తెలిసిన ‘సాక్షి’ ఆదివారం అక్కడకు వెళ్లింది. సండ్రను ఆసుపత్రి మూడో అంతస్తులోని 306 రూములో ఉంచినట్టు తెలియడంతో అక్కడకు చేరుకుంది. అయితే, అక్కడ ఆయన లేరు. దీనిపై సిబ్బందిని అడగ్గా, సండ్రను స్కానింగ్‌కు తీసుకెళ్లినట్టు తెలిపారు. కొద్ది గంటల తరువాత అడిగినా అదే సమాధానం చెప్పారు. ఆయన జ్వరం, గుండె సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేరారని చెప్పారు. మరొకరైతే ఆ విషయూలేవీ తమకు తెలియవంటూ తప్పించుకున్నారు. అయితే, సండ్రకు రాజమండ్రి సేఫ్‌జోన్‌గా ఉంటుందనే ఆలోచనతో బొల్లినేని ఆసుపత్రిని వేదికగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసులో సండ్రకు ఇప్పటికే తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఈ నెల 19న ఏసీబీ ముందు హాజరు కావాల్సి ఉంది. అనారోగ్య కారణంగా విచారణకు హాజరుకాలేనంటూ ఆయన ఏసీబీకి లేఖ రాసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయూరు. ఏసీబీ అధికారులు ఆస్పత్రికి వస్తే విచారణకు సహకరిస్తానని చెప్పిన ఆయన.. ఏ ఆస్పత్రిలో ఉన్నదీ ఆ లేఖలో పేర్కొనలేదు. పైగా, ఫోనుకు అందుబాటులో లేకుండా పోయూరు. ఈ నేపథ్యంలో ఆయన రాజమండ్రి వచ్చారంటూ వచ్చిన వార్తలు నగరంలో కలకలం రేపాయి. తెలంగాణ ఏసీబీ అధికారుల ప్రశ్నలకు ఎలా జవాబివ్వాలనే దానిపై సండ్రకు తర్ఫీదు ఇచ్చేందుకే రాజమండ్రి వేదికగా చేసుకుని టీడీపీ అధిష్టానం ఈ హైడ్రామా నడిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సండ్రను రహస్య ప్రదేశంలో ఉంచి నట్టు తెలుస్తోంది. కానీ, ఆయన ఆసుపత్రిలోనే ఉన్నట్టు, అక్కడ చికిత్స పొందుతున్నట్టు కేస్ షీట్ నడవడం గమనార్హం. -
'ఓటుకు నోటు కేసు తుఫానులా వ్యాపించింది'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు దేశవ్యాప్తంగా తుఫానులా వ్యాపించిందని తెలంగాణ శాసన మండలి సభ్యుడు కె.యాదవ్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో విపత్కర పరిస్థితులు సృష్టించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని యాదవ్ రెడ్డి ఆరోపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన సంభాషణలు బయటకు వచ్చిన తర్వాత కూడా సిగ్గుతో తల దించుకోకుండా, అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ..ఈ కేసులో ఉన్న ప్రతీ ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీటీడీపీనేతలు హద్దులు మీరి మాట్లాడుతున్నారని, ఏసీబీ కాదు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని వితండవాదం చేస్తున్నారని, అవినీతి వ్యవహారాలను ఏసీబీ విచారిస్తుందని వివరించారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు తమ మూర్ఖత్వం మానుకోవాలని యాదవరెడ్డి హితవు పలికారు. -
'ఓటుకు కోట్లు'పై నిశితంగా పరిశీలిస్తున్న కేంద్రం
-
'ఓటుకు కోట్లు'పై నిశితంగా పరిశీలిస్తున్న కేంద్రం
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న ఓటుకు కోట్ల కుంభకోణాన్ని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందా? ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ సమాచారం సేకరిస్తోందా? అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. అటు చంద్రబాబు నాయుడు, ఇటు కేసీఆర్ ప్రభుత్వాలు పోటాపోటీగా నివేదికలు ఇవ్వడం, గవర్నర్ నరసింహన్ కూడా నివేదిక ఇచ్చినప్పటికీ కేంద్రం తన సొంత మార్గాల ద్వారా వాస్తవ విషయాలను సేకరిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ఈ విషయం బయటపడినట్లు చెబుతున్నారు. హస్తిన పర్యటనలో చంద్రబాబు ప్రధాని మోదీని కలసి ఫోన్ ట్యాంపిగ్పై ఫిర్యాదు చేశారు. అయితే చంద్రబాబును కలవడానికి ముందే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో మోదీ సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన వివరాలను మోదీ ఈ సందర్భంగా అజిత్‌దోవల్ ను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ నుంచి అజిత్ దోవల్ పూర్తి సమాచారం సేకరించి, ఆ వివరాలను ప్రధానికి తెలిపారని తెలుస్తోంది. అజిత్ దోవల్ నుంచి వివరాలు సేకరించిన తర్వాతే చంద్రబాబుతో మోదీ సమావేశం అయినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
గవర్నర్‌తో ఘర్షణ
-
ఇకనైనా మారండి
ఓటుకు నోటుపై తమిళుడిపై విమర్శలు సాక్షి, చెన్నై : ‘ తమిళుడు అంటే ఓటుకు నోటు’ తీసుకునే వాడు. అన్న ముద్ర పడిందని, ఎగతాళి కూడా చేస్తున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు సంప్రదాయం అవసరమా..? అని ప్రశ్నిస్తూ, ఇకనైనా మారండంటూ తమిళులకు హితవు పలికారు. శివగంగై లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, కోల్పోయిన తన వైభవాన్ని, హవాను చేజిక్కించుకోవడం లక్ష్యంగా పి. చిదంబరం ముందుకు సాగుతున్నారు. ఆదివారం, లేదా సెలవు దినాల్లో అయితే చాలు అన్ని పనుల్ని పక్కన పెట్టి నియోజకవర్గంలో పర్యటించే పనిలో పడ్డారు. అన్ని గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించడం లక్ష్యంగా, ఆయా గ్రామాల్లోని పార్టీ వర్గాలు, ముఖ్యులతో మంతనాల దిశగా తన పయనం సాగిస్తున్నారు. తాజాగా ముదునన్దిడల్లో పర్యటించిన ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈసందర్భంగా అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేయడంతో పాటు తమిళుడి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు : యూపీఏ తీసుకొచ్చిన పథకాలను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని మండిపడ్డారు. వంద రోజుల పనికి ఆహారం పథకం ద్వారా పేద కూలీలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వ తీరుతో పేదల కూలీలతో పాటుగా కా ర్మిక, వ్యవసాయ తదితర వర్గాల వారు కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదే నినాదం, కుట్రలతో అనేక పంది కొక్కులు వచ్చాయని, కాంగ్రెస్ దెబ్బకు పారి పోయాయని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు విద్యా సంవత్సరం ఆరంభమవుతున్నా, ఇంత వరకు విద్యా రుణాలకు సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరంగా పేర్కొన్నారు. రుణాలు లేవు, ఉద్యోగాలు లేవు, రాను రాను, దేశంలో ఏమీ లేకుండా చేస్తారేమోనని మండి పడ్డారు. ఇక, ఓటుకు నోటు సంప్రదాయమా..? అని ప్రశ్నిస్తూ, తీవ్రంగా మండి పడ్డారు. ఎక్కడికైనా వెళ్లి తమిళుడు అని పరిచయం చేసుకుంటే చాలు ఎగతాళి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చటుక్కున ఓటుకు నోటు తీసుకునే వాళ్లే కదా..? అని ఎద్దేవా చేస్తున్నారని పేర్కొన్నారు. నోటు తీసుకుని ఓట్లు వేయబట్టే చులకనకు గురి అవుతున్నామని, ఇకనైనా ఆ పద్దతికి స్వస్థి పలకండని హితవు పలికారు. -
గవర్నర్‌తో ఘర్షణ
► చంద్రబాబు కొత్త ఎత్తు ► నరసింహన్‌ను కాదని సలహాదారులతో భేటీ ► ఓటుకు నోటు వ్యవహారం పక్కదారి పట్టించే ప్లాన్ ► కేంద్రానికి గవర్నర్ ఇచ్చిన నివేదికను జీర్ణించుకోలేని బాబు ►అసహనంతోనే సలహాదారులను ఇంటికి పిలిపించుకున్న వైనం ► ఈ సమయంలో కలవడంపై అధికార వర్గాల్లో విస్మయం సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వింత చర్యలతో ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో ఘర్షణ వాతావరణానికి దారులు తీస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కున్న చంద్రబాబు ఆ విషయాన్ని పక్కదారి పట్టిస్తూ, గవర్నర్ నరసింహన్ తమకు సహకరించడం లేదంటూ ఆయనతో ఘర్షణకు దిగుతున్నారు. గవర్నర్ నరసింహన్ ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్‌లపై కేంద్రానికి వాస్తవ నివేదికను సమర్పించడాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ఆయనను కాదని ఆయన సలహాదారులతో భేటీ కావడం ఆదివారం సంచలనం కలిగించింది. సలహాదారులు కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లి కలడంపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సలహాదారులు ఇటు గవర్నర్‌కు, అటు కేంద్రానికి జవాబుదారీగా ఉండాల్సి ఉంది. వాస్తవ నివేదికల వల్లనే ఫోన్ ట్యాపింగ్ అభియోగాలతో పాటు ఓటుకు నోటు వ్యవహారంపైన వాస్తవ పరిస్థితులను గవర్నర్ నరసింహన్ రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రులను కలిసి నివేదికలను సమర్పించిన విషయం తెలిసిందే. ఏపీ మంత్రులు శనివారం గవర్నర్‌ను కలిసిన సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో చెప్పలేనని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్- 8 అమలు అవసరం కానీ, చట్టం అమలుకొచ్చిన భంగమేమీ లేదని అటు రాజకీయ, ఇటు అధికార వర్గాల్లో జరుగుతున్న ప్రచారం చంద్రబాబును మానసికంగా కొంత కుంగదీసి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలన్నిటితో తీవ్ర అసహనంతో ఉన్న చంద్రబాబు ఆదివారం గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతిని తన ఇంటికి రావాల్సిందిగా కోరారు. దీంతో ఏమి చేయాలో పాలుపోని సలహాదారులు, వ్యక్తిగత హోదాలో పిలిచారని గవర్నర్‌కు తెలియజేసి నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, ఓటుకు నోటు విషయంలో రేవంతరెడ్డి బేరసారాలు, ఆ తరువాత చంద్రబాబు ఫోన్ సంభాషణలు వాస్తవమేనని గవర్నర్ నరసింహన్ కేంద్రానికి నివేదికలను సమర్పించినట్టు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయం తెలిసి చంద్రబాబు గవర్నర్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఓటుకు నోటు వ్యవహారంలో పూర్తిగా కూరుకుపోయి ఉన్న చంద్రబాబు ప్రస్తుతం గవర్నర్‌ను కలవడానికి వెనుకాడుతున్నారు. ఏ ముఖం పెట్టుకుని ఆయనను కలవాలో తెలియకే చంద్రబాబు గవర్నర్ సలహాదారులతో సమావేశం అయినట్టుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సలహాదారులతో చంద్రబాబు భేటీ సందర్భంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్- 8 ప్రకారం ఏమి జరగాలి?, ఇప్పుడు ఏమి జరుగుతోందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సెక్షన్- 8 ప్రకారం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను, నియమ నిబంధనలను జారీ చేయాల్సి ఉందని సలహాదారులు చంద్రబాబుకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తే గానీ సెక్షన్- 8 అమలు చేయడం గవర్నర్‌కు సాధ్యం కాదని సలహాదారులు వివరించినట్లు తెలిసింది. సెక్షన్- 8 అమల్లోకి వస్తే జంటనగరాల్లో పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు, శాంతిభద్రతలు గవర్నర్‌కు తెలిసి జరుగుతాయని, సెక్షన్ అమల్లోకి రానందున ఆ విషయాల్లో గవర్నర్ పాత్ర ఉండదని సలహాదారులు వివరించినట్లు తెలిసింది. వ్యక్తిగత హోదాలో వెళ్లొచ్చా? గవర్నర్ సలహాదారులుగా ఉన్న ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు అత్యంత సన్నిహితులు, ఆ సాన్నిహిత్యం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను కాదని సలహాదారులను పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడటంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. -
బాబు విచారణకు సిద్ధపడాలి
ఓటుకు నోటు వ్యవహారంలో తన తప్పు ఒప్పుకోవాలి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన తప్పును పాక్షికంగా ఒప్పుకుని విచారణకు సిద్ధపడాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంగ్ల టీవీ చానల్ ప్రతినిధి రాజ్‌దీప్ సర్దేశాయ్ కిచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు స్పష్టంగా తన నేరాన్ని అంగీకరించారనేది అర్థం అవుతోందన్నారు. తెలంగాణ ఏసీబీ అధికారులు మరిన్ని ఆధారాలు బయట పెట్టక ముందే అభాసు పాలు కాకుండా విచారణకు సిద్ధమై ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. విచారణకు సిద్ధపడటానికి భయపడే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగుతారని ఆయన ప్రశ్నించారు. ఆడియో టేపుల్లోని స్వరం మీదా? కాదా?, టేపులను విన్న వారికి ఆ స్వరం మీదే (చంద్రబాబుదే) అని విశ్వసించాల్సి వస్తోంది, దీనికేమంటారు? వంటి ప్రశ్నలకు జవాబులు చెప్పలేదన్నారు. విలేకరులకు చంద్రబాబుతో సర్దేశాయ్ ఇంటర్వ్యూ క్లిప్పింగ్‌ను అంబటి ప్రదర్శిస్తూ దీనిని అన్ని టీవీ చానెళ్లు ప్రసారం చేయాలని, అప్పుడే చంద్రబాబు నేరం చేశారో లేదో ఇట్టే తెలుసుకునే అవకాశం రాష్ట్ర ప్రజలందరికీ కలుగుతుందని విజ్ఞప్తి చేశారు. తాము ఎమ్మెల్యేను ప్రలోభ పెడితే తెలంగాణ పోలీసులెవరు త మను పట్టుకోవడానికి అనే విచిత్రమైన వాదనను చంద్రబాబు చేశారని ఆయన అన్నారు. ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించింది కానే కాదని, టీడీపీ అధ్యక్షుడికీ, చట్టబద్ధమైన తెలంగాణ ఏసీబీకి మధ్య సాగుతున్న అంశమని అంబటి అన్నారు. తన టేపుల వ్యవహారం బయట పడినపుడే 8వ షెడ్యూలు అమలు జరగాలని చంద్రబాబు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని, ఏడాది కాలంగా ఈ విషయం ఎందుకు గుర్తుకు రాలేదని అంబటి సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్ల ఇళ్లను కూలగొట్టారని చెబుతున్న చంద్రబాబు ఇళ్లను పడగొట్టేటపుడు ఎందుకు నోరు మెదపకుండా ఉండి పోయారని ప్రశ్నించారు. -
'టీఆర్ఎస్ ఏజెంటులా వ్యవహరిస్తున్నారు'
హైదరాబాద్: టీడీపీ ఓటుకు నోటు వ్యవహారం, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 29, 30 తేదీల్లో రాహుల్ గాంధీ రెండు రాష్ట్రాల్లో పర్యటించే అవకాశముందని చెప్పారు. తమ పార్టీ నాయకులతో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... గ్రేటర్ హైదరాబాద్ వార్డుల విభజనలో జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, అధికార పార్టీ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సోమేశ్ కుమార్ టీఆర్ఎస్ ఏజెంటులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎంఐఎం, టీఆర్ఎస్ లకు అనుకూలంగా వార్డుల విభజన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్ కుమార్ టీఆర్ఎస్ కు లబ్ధి చేకూరేలా రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వార్డుల విభజనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయకపోగా నిర్వహించినట్టు అబద్దాలు చెబుతున్నారని ఉత్తమ్ కుమార్ విమర్శించారు. -
'చంద్రబాబు నేరం అంగీకరించారు'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు తన తప్పు ఒప్పుకుని హుందాగా వ్యవహరించాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. 'ఒక ఓటు- 5 కోట్లు' కేసులో రోజుకో ఆధారాలు దొరుకుతున్నాయని అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబుకు ప్రత్యేకంగా లై డిటెక్టర్ పరీక్షలు అవసరం లేదని చెప్పారు. నేరాన్ని ఆయన అంగీకరించినట్టు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన ఫోన్ ట్యాప్ చేయలేదని చంద్రబాబు చెప్పారని తెలిపారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నేరాన్ని అంగీకరించి జ్యుడీషియల్ విచారణకు కోర్టు ముందుకు వెళ్లాలని అన్నారు. 5 కోట్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి చంద్రబాబుకు విచారణకు అంగీకరించాలని కోరారు. ఈ కేసు రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాప్ అయిందని, సెక్షన్ 8 అంటూ ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఒక వర్గం మీడియా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏపీలోని 13 జిల్లాల్లో దోచి తెలంగాణలో తన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏపీలో భూమిపూజ, తెలంగాణలో ధనపూజ చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తెలంగాణలో పౌరుడు, ఏపీకి ముఖ్యమంత్రి అని అన్నారు. ఇప్పటివరకు చంద్రబాబుకు సెక్షన్ 8 ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. -
'చంద్రబాబు నేరాన్ని అంగీకరించారు'
-
ఫోరెన్సిక్‌తో గుట్టురట్టు!
-
ట్యాపింగ్‌కు ఆధారాల్లేవట
-
ట్యాపింగ్‌కు ఆధారాల్లేవట
- అనుమానాలున్నాయని మాత్రమే కేంద్రానికి ఫిర్యాదు - మీడియాలో వచ్చిన వార్తలే ఆధారాలుగా సమర్పణ - ఫోన్ ట్యాపింగ్‌పై టీడీపీ సర్కారు తీరిది... సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందంటూ ఢిల్లీకి వెళ్లి అందరినీ కలసి ఫిర్యాదు చేసిన టీడీపీ ప్రభుత్వం.. ట్యాపింగ్‌పై ఆధారాలేవీ కేంద్రానికి సమర్పించలేదు. తామిచ్చిన ఫిర్యాదులో కూడా ట్యాపింగ్ జరిగిందన్న అనుమానాలున్నాయనే చెప్పి సరిపెట్టేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బులిస్తూ రేవంత్‌రెడ్డి దొరికిపోయిన కేసులో బాబు ప్రమేయం ఉంద న్న ఆడియో టేపులు వెల్లడైన నేపథ్యంలో ఆ వ్యవహారాన్ని ఫోన్ ట్యాపింగ్ వైపు మళ్లించిన విషయం తెలిసిందే. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ చంద్రబాబు ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో ఫిర్యాదు చేశారు. అందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆరోపణలతోపాటు బలం లేనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసిన వైనాన్ని పేర్కొన్నారు. ఒక టీడీపీ ఎమ్మెల్యేను బలవంతంగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారని, పలు పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకొని కేసీఆర్ చట్టవ్యతిరేకచర్యలకు పాల్పడుతున్నారని వివరించారు. విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం గవర్నర్ విధుల నిర్వహణతో పాటు ఫోన్ల ట్యాపింగ్‌పైనా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిపై ఆధారాలే వీ సమర్పించలేదని ఒక సీనియర్ మంత్రి చెప్పారు. తమ మంత్రులు, ఇతరులకు సంబంధించి 120 ఫోన్లు ట్యాపింగ్ జరిగాయనడానికి తమ వద్ద ఆధారాలేవీ లేవని తెలిపారు. స్టీఫెన్‌సన్‌తో బాబు జరిపిన బేరసారాల టేపులు తమ వద్ద ఉన్నాయని తెలంగాణ హోం మంత్రి నాయిని చేసిన వార్తలనే ఆధారాలుగా చూపి స్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు ఆ మంత్రి శుక్రవారం సచివాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. ఫోన్లు ట్యాప్ చేసే పరిజ్ఞానాన్ని చట్ట విరుద్ధంగా సమకూర్చుకున్న ప్రైవేటు సంస్థలకు ఔట్సోర్సింగ్ ఇచ్చి టీ సర్కార్ ట్యాపింగ్ చేసిందని బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మేరకే మే 24 నుంచి 31 వరకు నామినేటెడ్ ఎమ్మెల్యే ఫోన్‌కు అంతరాయం కలిగించారని తెలిపారు. -
చంద్రబాబూ అదే జైలుకు వెళతారు..
కాకినాడ: భారతదేశంలో ఫోన్ ట్యాపింగ్ పరికరాల డీలర్లు ఇద్దరే ఉన్నారని వైఎస్ఆర్ సీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఒకరు పాతూరి రామారావు, మరొకరు కేంద్రమంత్రి సుజనా చౌదరి అని... వాళ్లిద్దరు టీడీపీ నాయకులే అని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని, అవునో కాదో చంద్రబాబు నాయుడు చెప్పాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి విషయంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పటికీ చంద్రబాబును అరెస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వేచి చూస్తోందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు కచ్చితంగా జైలుకు వెళతారని అన్నారు. తమను రాజకీయ దురుద్దేశంతో జైలుకు పంపిన చంద్రబాబు కూడా అదే జైలుకు వెళతారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. -
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆడియో టేపులు
-
'అది ట్యాపింగ్ కాదు.. వాయిస్ మాత్రం బాబుదే'
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో బయటపడిన ఆడియో టేపులు చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేసినవి కావని, అయితే స్టీఫెన్ సన్తో ఉన్న ఫోన్ సంభాషణలోని వాయిస్ మాత్రం చంద్రబాబునాయుడిదేనని కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఇంకా మరిన్ని తప్పులు చేయోద్దని సూచించారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు, కేసీఆర్ ఫిరాయింపులతో అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వ్యక్తిగత ప్రతిష్ఠ ఆదిపత్యం కోసం రెండు రాష్ట్రాల మధ్య అగాధం సృష్టిస్తున్నారని చెప్పారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని అన్నారు. కేసీఆర్ వాటిని త్వరగా పూర్తి చేయాలని, వాటికి ఏపీ మంత్రులు అడ్డుపడాలని చూడటం సరికాదని అన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు సమైక్య రాష్ట్రంలో రూపొందినవేనని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమై తుదిదశకు చేరిన ప్రాజెక్టులను కేసీఆర్ త్వరగా పూర్తి చేయాలని కోరారు. -
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు 14 ఆడియో, వీడియో టేపులు
ఓటుకు కోట్లు కేసు కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలను మరింత నిర్ధారణ కోసం ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది. రెండు సెల్ఫోన్లు, కెమెరాలు, రేవంత్ రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న సీపీయూలను ల్యాబ్‌కు పంపారు. అలాగే మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను కూడా ల్యాబ్‌కు పంపారు. ఆడియోలో ఉన్నది తన గొంతు కాదంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న వాదనల నేపథ్యంలో ఆధారాలను ల్యాబ్‌కు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ 14 ఆడియోలో, వీడియో టేపుల్లో ఉన్న వాస్తవ అంశాలను ల్యాబ్ శాస్త్రీయ రీతిలో నిర్ధారణ చేయనుంది. రెండు రోజుల్లో ల్యాబ్ నిర్ధారించిన అంశాలు ఏసీబీకి, కోర్టుకు చేరనున్నాయి. మరోవైపు ఈ కేసులో కీలక సాక్షి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతి కోరింది. శనివారం స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశాలున్నాయి. సెక్షన్ 164 కింద తీసుకునే ఈ వాంగ్మూలం కేసు దర్యాప్తులో అత్యంత కీలకం కానుంది. తనను ఎవరెవరు ప్రలోభ పెట్టారో, తనతో ఎవరు, ఎన్నిసార్లు మాట్లాడారో, డబ్బు ముట్టజెప్పింది ఎవరో అనే అంశాలను స్టీఫెన్సన్ తన వాంగ్మూలంలో వెల్లడించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి స్టీఫెన్‌సనే ఫిర్యాదు దారు కాబట్టి, ఆయన వాంగ్మూలం కేసుకు అత్యంత కీలకమైనదని న్యాయనిపుణులు చెబుతున్నారు. -
అవినీతి సీఎంను జైలుకు పంపాల్సిందే
హోంమంత్రి, ఆర్థికమంత్రితో భేటీ అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ * కేంద్రంపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది * చంద్రబాబు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు * ప్రతిపక్షనేతగా బాబు అక్రమాలపై ప్రశ్నించే హక్కుంది... హోం మంత్రి, ఆర్థిక మంత్రితో భేటీ అనంతరం వై.ఎస్. జగన్ * అవినీతి సీఎంను కేంద్రం కాపాడుతుందని భావించడంలేదు * రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రిస్తున్నారు * కుంభకోణాల్లో తీసుకున్న లంచాలను * మరోచోట లంచమిస్తూ పట్టుబడ్డారు * ఆడియో, వీడియో సాక్ష్యాధారాలు రెండూ ఉన్నాయి * ముఖ్యమంత్రి కాబట్టి వదిలేయడం ఎంతవరకు ధర్మం? * అదే సామాన్యుడు చేసుంటే వదిలిపెట్టేవారా? * సామాన్యుడికి ఒక న్యాయం.. సీఎంకు ఒక న్యాయమా? * చంద్రబాబును ఏ-1గా చేర్చాలని కోరాం * స్పెషల్ స్టేటస్, విభజన హామీల అమలుకు అడిగాం సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు నోటు వ్యవహారంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జైలుకు పంపాల్సిందేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. దొంగలు ఎక్కడ ఉండాలో ఆయనను కూడా అక్కడ ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, అవినీతి సీఎంను కాపాడుతుందని భావించడంలేదని చెప్పారు. ప్రతిపక్షనేతగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై, చంద్రబాబు అక్రమాలపై ప్రశ్నించే హక్కు తనకు ఉందని స్పష్టంచేశారు. చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై, విభజన చట్టంలోని పెండింగ్ హామీలపై ఆయన గురువారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇంతకుముందు భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి చెప్పిన విషయాలను హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి కూడా వివరించాం. స్పెషల్ స్టేటస్, విభజన హామీలపై ఒక వినతిపత్రం అందించాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏ రకంగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారో, వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నారో తెలిపాం. ఒక ముఖ్యమంత్రి తాను తీసుకున్న లంచాలను విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ, లంచం ఇస్తూ దొరికిపోయి, దాన్ని పక్కదారి పట్టించేందుకు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రిస్తున్న వైనాన్ని వివరించాం. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వివిధ కుంభకోణాల్లో తీసుకున్న లంచాలను మళ్లీ ఇంకొక చోట లంచంగా ఇస్తూ, వందల కోట్లు ఉన్న ఇలాంటి వ్యవహారంలో పట్టుబడితే ఎందుకు కేసు పెట్టడం లేదు? ఆడియో, వీడియో సాక్ష్యాధారాలు రెండూ ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వదిలేయడం ఎంతవరకు ధర్మం? అదే సామాన్యుడు చేసుంటే ఇదే మాదిరిగా వదిలిపెట్టేవారా? సామాన్యుడికి ఒక న్యాయం.. ముఖ్యమంత్రికి ఒక న్యాయమా? ఇదెక్కడి ధర్మం? చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరాం. తప్పనిసరిగా ఈ కేసులో మొదటి నిందితుడిగా చేర్చాలని కోరాం. దీనిపై వినతిపత్రం కూడా ఇచ్చాం. గత 12 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఏమేం స్కాములు చేశారో.. స్కామాంధ్రప్రదేశ్‌గా మార్చిన పరిస్థితిని వివరించాం. దాదాపుగా ఒక 10 స్కాములను.. ముఖ్యంగా పట్టిసీమ, జీవో 22, కొన్ని ఎంపిక చేసిన డిస్టిలరీలకు అనుమతులు, కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టు, ఆర్టీపీపీ స్కామ్.. ఇలా అన్నింటిపై లోతైన విచారణ జరగాలి. చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ-1గా చేర్చాలని కోరాం..’’ అని తెలిపారు. ప్రతిపక్షనేతగా ప్రశ్నించే హక్కుంది ప్రతిపక్షనేతగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై, చంద్రబాబు అక్రమాలపై ప్రశ్నించే హక్కు తనకు ఉందని జగన్ స్పష్టంచేశారు. తన వ్యవహారంపై మాట్లాడేందుకు మీకు అర్హత లేదని చంద్రబాబు అంటున్నారని మీడియా ప్రస్తావించగా... రాజకీయంగా తనను అంతమొందించేందుకు గతంలో చంద్రబాబు, కాంగ్రెస్ ఒక్కటై కుట్ర చేశారని చెప్పారు. ‘‘రాజశేఖరరెడ్డి బతికున్నంతవరకు జగన్ మంచివాడే. చనిపోయిన తరువాతా జగన్ మంచివాడే. కాంగ్రెస్‌లో ఉన్నంతవరకూ మంచివాడే. కాంగ్రెస్‌ను వదిలిపోయిన తరువాత... చంద్రబాబు , కాంగ్రెస్ ఏకమై జగన్‌ను భయపెట్టారు. కానీ జగన్ భయపడలేదు. ఆనాడు సోనియాగాంధీ అధికారంలో ఉన్నా జగన్ భయపడలేదు. ముందుకే పోయాడు. అదీ జగన్‌కు, చంద్రబాబు నాయుడుకు ఉన్న తేడా. నేను ఏరోజూ ముఖ్యమంత్రిని కాదు. ఏ ఒక్క సంతకమూ పెట్టలేదు. కనీసం ఎమ్మెల్యే లేదా ఎంపీ కూడా కాదు. ఒక మంత్రి లేదా ఐఏఎస్‌తో ఏరోజూ ఫోన్ చేసి మాట్లాడలేదు. కనీసం సచివాలయంలో అడుగుపెట్టలేదు. అసలు హైదరాబాద్‌లోనే ఉండేవాడ్ని కాదు. బెంగళూరులో ఉండేవాడిని. నా పిల్లలు కూడా అక్కడ చదివేవారు. కానీ రాజకీయంగా నన్ను అంతమొందించేందుకు చంద్రబాబు, కాంగ్రెస్ ఒక్కటయ్యారు, కేసులుపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు అవినీతితో రాజ్యమేలుతున్నారు. నేను ప్రతిపక్ష నేతగా ఉన్నా. కేవలం వారికన్నా రెండు శాతం కంటే తక్కువ ఓట్లు రావడంతో ప్రతిపక్షంలో ఉన్నాం. దేశంలోనే అత్యంత అధిక ఓటు షేరు సాధించిన ప్రాంతీయ పార్టీగా నిలిచాం. అందువల్ల ప్రతిపక్ష నేతగా అడిగే హక్కు నాకు ఉంది’’ అని చెప్పారు. సెక్షన్-8పై మీరేమంటారని ప్రశ్నించగా ఘాటు గా స్పందించారు. ‘‘ఒక ముఖ్యమంత్రి లంచాలు తీసుకుని లంచాలు ఇస్తూ పట్టుబడిన తరువాత ఈ వాదనలెందుకు? ముందు చంద్రబాబును జైల్లో పెట్టండి. తర్వాత ఇష్టమొచ్చినట్టు చేసుకోండి. దీన్నుంచి బయటపడేందుకు ఆయన రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రిస్తున్నారు. మీడియాకూడా సెక్షన్-8 ఏమంటోంది.. ఇంకొకటి ఏమంటోందని అడగడం అన్యాయం. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ముఖ్యమంత్రిని జైల్లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించకుండా.. ఆయనకు వంతపాడడం సరికాదు. అందరం కలిసి కట్టుగా కృషిచేయాలి. దొంగలు ఎక్కడ ఉండాలో ఆయనను కూడా అక్కడ ఉంచాలి’’ అని బదులిచ్చారు. -
'రేవంత్ కు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టైన తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు గురువారం విలేకరులతో చెప్పారు. హైదరాబాద్ పై కేసీఆర్ కు ఎంత హక్కు ఉందో తమకు అంతే హక్కు ఉందని సోమిరెడ్డి అన్నారు. -
మౌనమే నీ భాష ఓ....
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ప్రచ్ఛన్న మాటల యుద్ధానికి దారితీసిన 'ఓటుకు నోటు' కుంభకోణంపై కేంద్రం ఎందుకు మౌనం పాటిస్తోంది? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆయన మంత్రివర్గ సభ్యులతో సమావేశమైన తర్వాత కూడా ఎందుకు మౌనం వీడడం లేదు? నకిలీ డిగ్రీ పట్టాల కేసులో ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్‌ను అరెస్టు చేయడంలో వేగంగా స్పందించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అయినా ఎందుకు స్పందించడం లేదు? కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్య పక్షంగా కొనసాగుతుండడం వల్ల ఆ మకిలి జోలికి వెళ్లిక పోవడమే తక్షణ కర్తవ్యంగా భావిస్తోందా? మౌనమే మన భాష అనుకుంటుందా, వేచి చూస్తే బెటర్ అనుకుంటోందా? అవినీతి స్టింగ్ ఆపరేషన్‌లో ఉత్త పుణ్యానికి దొరికిపోయిన అలనాటి పార్టీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కే ఉద్వాసన పలికిన చరిత్ర కలిగిన బీజేపీ.. ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదన్నది ప్రస్తుతం సామాన్యులను, అవినీతి మయమైన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కోరుకుంటున్న తెలుగు ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలు. తెలుగు ముఖ్యమంత్రుల పరస్పరారోపణలు, దూషణలతో తమకు సంబంధం లేదని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై వచ్చిన ఆరోపణల మీద అసలు విచారణ జరుగుతుందా, జరిగితే అది అర్ధవంతంగా ముగుస్తుందా? అన్న ప్రశ్నలకు కేంద్రం వైఖరి కారణం అవుతోంది. రాజకీయాల్లో 'అంటు' ఉండదని, కేంద్రం పెద్దన్న పాత్ర నిర్వహించి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదిర్చి 'ఓటుకు నోటు' కుంభకోణాన్ని ఓ రాజకీయ నాటకంగా చూసి దానికి తెరదించుతారా? అన్న అనుమానాలు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల అంతో ఇంతో విశ్వాసం కలిగిన మధ్యతరగతి మనుషుల మెదడులను తొలుస్తున్నాయి. 'ఏ కేసులోనైనా న్యాయం చేకూర్చడమే కాదు. న్యాయం జరిగినట్టు ప్రజలకు కనిపించాలి' అనే సుప్రీంకోర్టు సహజ న్యాయ సూత్రం ఈ కేసులో నిజమవుతుందా? -
కేంద్ర హోంమంత్రితో వైఎస్ జగన్ భేటీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. టీడీపీ ఓటుకు నోటు వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ముడుపుల కేసులో సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మొదటి నిందితుడిగా చేర్చాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. -
బాబు మదిలో చెలరేగుతున్న అనుమానాలు
-
బాబు మదిలో చెలరేగుతున్న అనుమానాలు
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి తన నీడను కూడా నమ్మలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓటుకు కోట్లు వ్యవహారం వెలుగు చూసిన తర్వాత ఎవరిని చూసినా.. చంద్రబాబుకు అనుమానం కలుగుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీ నాయకులందరిని అనుమానంతో చూస్తున్న బాబు ఇప్పుడు తన ఇంట్లో పనిచేస్తున్న వారని కూడా వదలడం లేదు. తన ఇంట్లో పని చేస్తున్న అందర్ని ఆయన తొలగించినట్టు తెలుస్తోంది. సెక్యూరిటీ సిబ్బందిని తొలగించిన వారి స్థానంలో కొత్తవారిని, అందునా నమ్మకస్థులని భావించే వారిని మాత్రమే నియమించుకున్నట్లు సమాచారం. తొలగించిన వారి జాబితాలో పని మనుషులు నుంచి కారు డ్రైవర్లు వరకూ ఉన్నారు. కొందరైతే 20 ఏళ్లుగా చంద్రబాబు ఇంట్లో పని చేస్తున్నారు. సమాచారం లీకవుతుందనే అనుమానంతో కింది స్థాయి సిబ్బంది అందర్ని ఆయన మార్చినట్టు తెలుస్తోంది. మరో వైపు చంద్రబాబు అనుమానంపై సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో చేసిన తప్పులకు తమను బాధ్యులు చేయడమేంటనే భావన సిబ్బందిలో వ్యక్తమవుతోంది. -
చంద్రబాబు సినిమా ఇంకా ఉంది: కేసీఆర్
-
చంద్రబాబు సినిమా ఇంకా ఉంది: కేసీఆర్
హైదరాబాద్ : 'ఓటుకు నోటు' వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రూ.150 కోట్లతో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహరంలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయని... ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధించి సినిమా ఇంకా వుందని ఆయన అనటం రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహరంలో చంద్రబాబుకు సంబంధించి మరికొన్ని కీలక ఆధారాలు వెలుగుచేసే అవకాశం వుందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబే సూత్రధారి అని కేసీఆర్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. మరోవైపు ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఎప్పుడు నోటీసులు ఇస్తారనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. మొత్తానికి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలనే దానిపై ఏసీబీ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. -
కేసీఆర్, బాబుల ఫ్లెక్సీ దహనం
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఓటుకు నోటు కేసులో అవినీతి ఆ రోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికార దాహంతో ఎమ్మెల్యేలను చేర్చుకుంటు న్న తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను బుధవా రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దహనం చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో ఈ కా ర్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యదర్శి నరేష్‌జాదవ్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలను ఇద్దరు చం ద్రులు అవినీతితో భ్రస్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాసమస్యలను విస్మరిస్తూ.. అధికారమే బలంగా ఎదిగేం దుకు నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదన్నారు. మిషన్ కాకతీయ కమీషన్ దందాగా మారిందన్నారు. ఇష్టానుసారంగా డబ్బులు వెదజల్లుతూ ఆంధ్రా సీఎం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి. పట్టణ అధ్యక్షుడు సాజీద్‌ఖాన్, నాయకులు దిగంబర్రావుపాటిల్, నర్సిహారావు, సలీం, సుఖందర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
'కేసీఆర్, చంద్రబాబులను అరెస్ట్ చేయాల్సిందే'
వరంగల్: తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయాలని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ నగరంలోని మహేశ్వరీ గార్డెన్స్‌లో నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలుపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యులు, జడ్పీటీసీ, ఎంపీటీసీలను ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నారని... అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీ టీడీపీ చెందిన ఎమ్మెల్యే రేవంత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బేరసారాలు చేశారని భట్టి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరిని అరెస్ట్ చేయాలన్నారు. వీరిద్దరి అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. నిబద్ధతతో కూడిన విచారణ జరగాలంటే ఇద్దరు ముఖ్యమంత్రులను పదవుల నుంచి తొలగించాల్సిందేనని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. -
ఓటుకు నోటు సిగ్గు చేటు
ప్రకాశం : ఓటుకు నోటు సిగ్గు చేటని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు ధర్నా చేపట్టారు. మంగళవారం ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఈ ధర్నాలో పార్టీ నాయకులతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఓటుకు నోటు సిగ్గుచేటని అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొని ప్రసంగించారు. -
పట్టిసీమ సొమ్ముతోనే ఎమ్మెల్యేల కొనుగోలు!
-
రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా
-
రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఎల్లుండికి వాయిదా
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షల ముడుపులు ఇవ్వజూపుతూ అరెస్టైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. విచారణ సమయంలో అన్ని సౌకర్యాలు కల్సిస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులకు గురిచేయడం లేదని ఏసీబీ కోర్టుకు తెలిపింది. మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదనడంలో వాస్తవం లేదని ఏసీబీ కోర్టుకు విన్నవించింది. దీంతో మంచినీళ్లు ఇవ్వకుండా ఉంటారా? అని రేవంత్ తరఫు న్యాయవాదులను కోర్టు ప్రశ్రించింది.