బాబు మానసిక స్థితిపై అనుమానం: చెవిరెడ్డి | suspect on babu mental status says chevi reddy | Sakshi
Sakshi News home page

బాబు మానసిక స్థితిపై అనుమానం: చెవిరెడ్డి

Published Fri, Sep 4 2015 3:46 AM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM

suspect on babu mental status says chevi reddy

సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతున్నదని, జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మేధావుల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై చర్చించకుండా సభాసమయాన్ని వృథాచేస్తూ అధికారపక్షం అడ్డుపడుతోందని, దొంగే.. దొంగ దొంగ అన్నట్టుగా ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. సైకో పార్టీ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు విపక్షంపై అగౌరవంగా మాట్లాడటాన్ని చూస్తే చంద్రబాబే ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మంత్రి అచ్చెన్నాయుడ్ని బర్తరఫ్ చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement