
'రేవంత్ కు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టైన తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు గురువారం విలేకరులతో చెప్పారు. హైదరాబాద్ పై కేసీఆర్ కు ఎంత హక్కు ఉందో తమకు అంతే హక్కు ఉందని సోమిరెడ్డి అన్నారు.