Somireddy Chandramohan Reddy
-
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి మండిపడ్డారు.
-
సోమిరెడ్డి నోరు డ్రైనేజీ కంటే అధ్వాన్నం: కాకాణి
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి పనుల్లో అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు రిటైర్ అయినా సరే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. పాత కేసులు తోడి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు.. ఉడుత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు అంటూ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి కాకాణి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరును ఖండిస్తున్నాం. ఇరిగేషన్లో అవినీతి ఆరోపణలు చేస్తున్న సోమిరెడ్డి నోరు డ్రైనేజీ కంటే అధ్వాన్నంగా ఉంది. తూ.తూ మంత్రంగా పనులు ముగించి నీళ్ళు వదిలితే ఆ పనుల్లో నాణ్యత ఎలా ఉంటుంది. టెండర్ల కంటే ముందే పనులు ముగించిన అవినీతి ఘనత సోమిరెడ్డిది. పూడికతీత పనులు ఎంత నాణ్యతగా ఉన్నాయో ఇవే సాక్ష్యాలు (ఫోటో ప్రూఫ్).నవంబర్ ఏడో తేదీన నీళ్ళు వదిలిన ఘనతను దినపత్రికలే సాక్షిగా చెబుతున్నాయి. నీకు అనుకూలంగా వున్న కొద్ది మంది రైతుల దగ్గర పనులు జరగలేదని చెప్పించడం కాదు. మొత్తం కనుపూరు కాలువ మీద 30 కోట్ల అవినీతి జరిగింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు రిటైర్ అయినా సరే జైలుకు వెళ్లక తప్పదు. సోమిరెడ్డి చేస్తున్న పనుల్లో అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. విచారణలో అవకతవకలు జరిగినట్లు తేలితే దాని మీద మళ్ళీ విచారణ చేయిస్తాం.పాత కేసులు తోడి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు.. ఉడుత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. స్టేట్మెంట్తో మీరు స్ట్రిక్ట్ ఆఫీసర్లు కాలేరు. చిత్తశుద్ధితో పని చేయాలి. మద్యం షాపుల్లో ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువ విక్రయిస్తే జరిమానాలు అన్నారు. సోషల్ మీడియాలో విమర్శలు చేశామని రెండు కేసులు నమోదు చేశారు. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిపై క్యాష్ కొట్టు.. షాప్ పట్టు అని ఇప్పుడు కూడా చెబుతున్నాను. మీ అవినీతిని ఎప్పటికప్పుడు బయటకు చెబుతూనే ఉంటాం’ అని హెచ్చరించారు. -
సోమిరెడ్డి పై కాకాని ఫైర్
-
కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ సిబ్బందిపై సోమిరెడ్డి దాడి
-
పోర్టు సిబ్బందిపై సోమిరెడ్డి దాడి
సాక్షి ప్రతినిధి నెల్లూరు/ముత్తుకూరు: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో సెక్యూరిటీ డీజీఎం, సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దాడికి తెగబడిన వైనం కలకలం రేపింది. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునద్ధరణ పనులపై యాజమాన్యంతో చర్చించేందుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి సోమవారం తన అనుచరులతో వెళ్లారు. పోర్టు ప్రధానద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ డీజీఎం ఎమ్మెల్యే కారుతోపాటు కొన్ని వాహనాలను లోనికి అనుమతించారు. మిగిలిన వాహనాలను తనిఖీచేయాలని నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన సోమిరెడ్డి కారునుంచి దిగివచ్చి కోపంతో ఊగిపోతూ అసభ్య పదజాలంతో తిట్లదండకం అందుకున్నారు. సెక్యూరిటీ డీజీఎంపై దాడికి తెగబడి ఆయన్ని వెనక్కి నెట్టివేశారు. తనకు జరిగిన అవమానాన్ని పోర్టు ఉన్నతాధికారుల దృష్టికి తీసకువెళ్లే క్రమంలో పోలీసులు, నాయకులు డీజీఎంను వారించారు. ఇదే అంశంపై పోర్టు అడ్మిన్ భవనం వద్ద కూడా సోమిరెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.సీఈఓతోనూ దురుసు ప్రవర్తనఎన్నికలముందు పోర్టు కంటైనర్ టెర్మినల్ సేవలను పునరుద్ధరిస్తామని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటివరకు పోర్టు యాజమాన్యంతో చర్చలు జరపకపోవడం, కార్యాచరణ చేపట్టకపోవడంతో సీఐటీయూ నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి అఖిలపక్షం పేరుతో పోర్టు అధికారులతో మాట్లాడేందుకు సోమవారం వెళ్లిన సోమిరెడ్డి పోర్టు కార్యాలయంలోకి వెళ్లి సీఈఓతోనూ వాగ్వాదానికి దిగారు. ఆయనతో దురుసుగా ప్రవర్తిస్తూ కేకలు వేశారు. ఖండించిన కాకాణి కృష్ణపట్నం పోర్టులో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేయిచేసుకోవడాన్ని మాజీమంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమిరెడ్డి అఖిలపక్షం పేరిట డ్రామాలు ఆడుతూ, కూటమి పార్టీల నేతలను పోర్టుకు తీసుకెళ్లడం ఏమిటని నిలదీశారు. అత్యంత భద్రత ఉండే ప్రధానమైన పోర్టులో తనిఖీచేసి వాహనాలను అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా వినకుండా దాడి చేశారన్నారు. పోర్టు కార్యాలయంలోనూ సోమిరెడ్డి కేకలు వేసి సీఈఓతో దురుసుగా ప్రవర్తించడం తగదన్నారు. ఎమ్మెల్యే వీధిరౌడీలా మారి నేరుగా దాడులకు తెగబడటం దుర్మార్గమన్నారు. -
వీడియో: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దౌర్జన్యం..
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెచ్చిపోయారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సోమిరెడ్డి ప్రతీ చోటా దుసురుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా సోమిరెడ్డి కృష్ణ పోర్టు వద్ద ఓవరాక్షన్ చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని నెట్టేసి కొట్టేందుకు ప్రయత్నించారు.వివరాల ప్రకారం.. కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి దురుసుగా ప్రవర్తించారు. సోమవారం పోర్టు వద్దకు వెళ్లిన సోమిరెడ్డి.. తనతో వచ్చిన ఓ కారును అనుమతించకపోవడంతో ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో, వెంటనే కారు దిగి.. సెక్యూరిటీపై తన ఆధిపత్యం చూపించారు. సెక్యూరిటీని నెట్టేసి.. అతడికి కొట్టబోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రౌడియిజంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. అదాని పోర్టుకు వెళ్లిన సోమిరెడ్డి అక్కడి సెక్యూరిటీపై దౌర్జన్యం చేయడం సిగ్గుచేటు. రౌడీయిజం చేసి పరిశ్రమలను వెళ్లగొట్టాలని సోమిరెడ్డి కుట్రలు చేస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలను బెదరగొట్టి సోమిరెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారు. గత పది ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. రౌడీ ఎమ్మెల్యే సోమిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
సోమిరెడ్డి పై కాకాణి సెటైర్లు ..
-
కరప్షన్‌కి సోమిరెడ్డి బ్రాండ్ అంబాసిడర్: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: ఏపీ సర్కార్ లిక్కర్ పాలసీపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ నేతల పేరుతో ఒక్కో లిక్కర్ షాపుకి ఐదు లక్షల చొప్పున వసూలు చేశారని ఆయన మండిపడ్డారు. 30 శాతం వాటా కార్యకర్తల పేరిట వసూళ్లు చేశారని.. బెల్ట్ షాపుల వేలం సోమిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని కాకాణి ధ్వజమెత్తారు.నియోజకవర్గంలో 300 బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చారు. నెలకు ఒక్కో షాప్‌కు పదిహేను వేలు వసూలు చేస్తున్నారు. కూల్ డ్రింక్ షాపుల వాళ్లు నెలకు రూ.30 వేలు ఇవ్వాలని ఫిక్స్ చేశారు. కరప్షన్‌కి సోమిరెడ్డి బ్రాండ్ అంబాసిడర్’’ అంటూ కాకాణి ఎద్దేవా చేశారు.బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులపై ఉన్న ధ్యాస, సోమిరెడ్డికి ప్రజల మీద లేదు. నా ఆరోపణలపై దమ్ముంటే సోమిరెడ్డి విచారణకు సిద్ధమా..?’’ అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్ విసిరారు. -
సీబీఐ విచారణ కోరే దమ్ముందా: కాకాణి సవాల్
సాక్షి,నెల్లూరు:సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఇసుక అక్రమ రవాణాలో తనకు సంబంధం ఉందని నిరూపించే ధైర్యం సోమిరెడ్డికి ఉందా అని కాకాణి ప్రశ్నించారు.శనివారం(అక్టోబర్5) ఈ విషయమై కాకాణి మీడియాతో మాట్లాడారు.‘తాను చెప్పిన పనులు అధికారులు చెయ్యడం లేదనే ఫ్రస్టేషన్లో సోమిరెడ్డి ఉన్నారు.తాను చెప్పిన వారిని కేసుల్లో ఇరికించడం లేదని సోమిరెడ్డి బాధపడుతున్నారు.సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయం.కేసులు,అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు. దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడితే మా ప్రభుత్వం వచిన తర్వాత మంచంలో పడుకుని ఉన్నాలాక్కొస్తాం. నా పై చేస్తున్న అవినీతి ఆరోపణలలో ఒక్క దానినైనా రుజువు చెయ్యగలవా?నీకు దమ్ము దైర్యం ఉంటే నేను అవినీతి చేసినట్టు నిరూపించు. సూరాయి పాలేం ఇసుక రీచ్‌లో జరుగుతున్న తవ్వకాల మీద గ్రీన్ ట్రిబ్యునల్‌కి వెళ్తున్నాం. నీరు చెట్టులో జరిగిన అవినీతి మీద విచారణకి అదేశిస్తే అధికారుల ఉద్యోగాలు పోతాయని మానవత్వంతో వెనక్కి తగ్గాను. మైనింగ్ కాంట్రాక్టర్లతో చంద్రబాబు వద్దకు సోమిరెడ్డి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.సోమిరెడ్డి అవినీతి మీద విచారణ వేయాలి.ఆయన చేసిన అవినీతి బయటడుతుంది’అని కాకాణి అన్నారు. ఇదీ చదవండి: సిగ్గూ ఎగ్గూ లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణ -
సోమిరెడ్డి నీ చిలక్కొట్టుడు ఆపేయ్... కాకాణి మాస్ ర్యాగింగ్
-
సోమిరెడ్డికి YSRCP నేతలు వార్నింగ్
-
MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి బట్టబయలు
-
సోమిరెడ్డి అవినీతి బట్టబయలు.. రూ.100 కోట్ల దోపిడీకి స్కెచ్!
సాక్షి, నెల్లూరు జిల్లా: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవినీతి బట్టబయలైంది. రీచ్ టు రిచ్‌కు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి భారీగానే ప్లాన్ వేశారని స్పష్టమవుతోంది. ఇసుక అక్రమ రవాణా ద్వారా రూ.వందల కోట్లు సంపాదించాలని టార్గెట్‌గా పెట్టుకున్న ఆయన మనుషులు సూరాయపాళెం ఇసుక రీచ్‌లో సాగించిన హెచ్చరికలు, దూషణల పర్వం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డ్రెడ్జింగ్ విధానంలో ఇసుక వెలికి తీసేందుకు వచ్చిన గుంటూరుకు చెందిన శ్రీకృష్ణ శాండ్ అండ్ ఫెర్రీ బోర్డ్ వర్కర్స్ అండ్ అదర్ వర్క్స్ లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కాంట్రాక్టర్లను సోమిరెడ్డి మనుషులు బెదిరించారు. పొదలకూరు మండలం సూరాయపాళెం ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుకను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సోమిరెడ్డి తన మనుషులను రీచ్ వద్దకు పంపి డ్రెడ్జింగ్ వినియోగించే పడవలను వెనుక్కు పంపే ప్రయత్నం చేశారు. సాక్షాత్తు కలెక్టర్‌నే తూలనాడారు. స్థానిక శాసన సభ్యుడిని కాదని మీరు ఏమి చేయలేరని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు.చంద్రబాబునాయుడు స్థానిక ఎమ్మెల్యేలకు ఇసుక రీచ్‌లను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టాలని చూస్తున్నారని చెప్పా రు. మధ్యలో కలెక్టర్ ఓవరాక్షన్ చేస్తున్నాడంటూ బూతుపురాణం అందుకున్నాడు. కలెక్టర్ నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్లు పద్ధతి ప్రకారం డ్రెడ్జింగ్ చేసేందుకు వచ్చారు. అయితే సోమిరెడ్డి అనుచరులు డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను వెలికి తీస్తే ఎలాంటి ఆదాయం ఉండదని, మధ్యలో ఇసుక దిబ్బలను ఎత్తాలని సూచించారు.ఇదీ చదవండి: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు టీడీపీ నాయకుల దాడిఇందు కోసం తాము 300 ట్రిప్పుల గ్రావెల్ తోలి రీచ్‌కు దారులు ఏర్పాటు చేస్తున్నామని, రూ.కోట్లు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు. ఆయన (సోమిరెడ్డి) ఇంత చేస్తుంటే.. మీరు ఆయనకు తెలియకుండా ఏమైనా చేసినట్లు తెలిస్తే చాలా గొడవలు అవుతాయంటూ కంఠస్వరం పెంచుతూ మాట్లాడారు. ఈ మాటలను బట్టి చూస్తే ఉచిత ఇసుక పాలసీ డొల్లతనం ఇట్టే అర్థం అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, తమ్ముళ్లు ఇసుక ద్వారా సొమ్ము చేసుకోవాలని ఎంతగా పరితపిస్తున్నారో తెలుస్తోంది. ఓ పక్కన రైతులు ఇసుక తోడేస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని, పర్యావరణకే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు ఇసుక ద్వారా అక్రమ సంపాదనకు తమ లక్ష్యాలను నిర్ధేశించుకుని వెనుక్కు తగ్గడమే లేదు. -
హైకోర్టు తీర్పు.. సోమిరెడ్డికి చెంపపెట్టు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం కనుపూరు గ్రామానికి చెందిన జ్యోతి న్యాయ పోరాటం ఫలించింది. జ్యోతినే కనుపూరు ఉన్నత పాఠశాలలో వంట, సహాయకురాలిగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి చెంప పెట్టుగా మారింది. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం చిరు ఉద్యోగుల పొట్టకొట్టే చర్యలకు సిద్ధపడింది. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఏళ్ల తరబడి వివిధ వ్యవస్థల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులను ఎడాపెడా తీసిపడేసి.. ఆయా స్థానాల్లో తమకు కావాల్సిన వారిని నియమించే విధంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఓఏలు, పాఠశాలల్లో వంట, సహాయకురాళ్లుగా పనిచేసే వారిని నిబంధనలకు విరుద్ధంగా తొలగించి, ఆయా పోస్టుల్లో కొత్త వారిని నియమించి ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోస్టును బట్టి లక్షలాది రూపాయలు డిమాండ్ చేసి మరీ వసూళ్లకు పాల్పడినట్లు ఇటీవల బీజేపీ నేత బహిరంగంగా ఆరోపించిన విషయం విదితమే. ఈ క్రమంలో కనుపూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో వంట సహాయకురాలిగా పని చేస్తున్న జ్యోతిని విధుల నుంచి స్వచ్ఛందంగా మానుకోవాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తీసుకువచ్చారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లను జ్యోతి లెక్క చేయకపోవడంతో ఆ పోస్టు నుంచి జ్యోతిని తొలగించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఒక లేఖ ఇచ్చారు. దాని ఆధారంగా అధికారులు ఆమెను విధుల నుంచి తొలగించారు. తనకు జరిగిన అన్యాయంపై జ్యోతి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి లేఖతో వంట సహాయకురాలిగా తొలగించడం అన్యాయమని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జ్యోతి వాదనలు విన్న న్యాయస్థానం ఎమ్మెల్యే లేఖతో జ్యోతిని తొలగించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ, జ్యోతిని తిరిగి యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ పరిణామం సోమిరెడ్డికి చెంపపెట్టులాందటని స్థానిక ప్రజలు అభిప్రాయపడ్డారు. న్యాయస్థానం ఆదేశాలతోనైనా సోమిరెడ్డి కనువిప్పుతో వ్యవహరించాలని సర్వేపల్లి నియోజవర్గ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
సోమిరెడ్డి అక్రమాలపై విచారించండి
నెల్లూరు (బారకాసు): సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవినీతి, ఆక్రమాలపై సీఎం చంద్రబాబు విచారణ జరిపించాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమిరెడ్డి అవినీతి, అక్రమాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమ వారం మీడియాతో మాట్లాడుతూ.. వంద రోజుల్లో సోమిరెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై తాను త్వరలోనే నివేదిక విడుదల చేస్తానని చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.3 లక్షలు ఇవ్వాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారని బీజేపీ వెంకటాచల మండల ప్రధాన కార్యదర్శి పిల్లిపోకుల పెంచలయ్య ఇటీవల వెల్లడించారని గుర్తు చేశారు.ఆ విషయాలతో కాని, అతనితో కాని తనMý ు ఎటువంటి సంబంధం లేదన్నారు. కానీ.. ఆయనతో తానే మాట్లాడించినట్టు సోమిరెడ్డి చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశి్నంచారు. ‘అధికారం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి పెంచలయ్య మాతో మాట్లాడినట్లుగా నిరూపించాలి. అందుకోసం విచారణ కూడా చేయించుకోవాలి’ అని కాకాణి సూచించారు. తనపై కేసులు పెడితే భయపడేది లేదని, పోలీసులు, కేసులు, జైళ్లకు తాము భయపడేవాళ్లం కాదని అన్నారు. పోస్టులు అమ్మకునే బుద్ధి ఆయనకు గతంలోనే ఉందన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు, వీఓఏ పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, రేషన్ డీలర్ పోస్టులు అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిదన్నారు. -
సోమిరెడ్డి అవినీతిపై కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్
-
కట్టాల్సిందే ‘ఎస్’ ట్యాక్స్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న సర్వేపల్లి నియోజకవర్గానికి ‘ఎస్’ ట్యాక్స్ గుదిబండగా మారింది. దినసరి కూలీల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కప్పం కట్టాల్సిందే. లేదంటే భౌతిక దాడులతో ఆయన దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఇక ఆయన తనయుడు (షాడో ఎమ్మెల్యే).. కాదేదీ కమీషన్లకు అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. ఆయన కప్పాలు కట్టలేక పారిశ్రామికుల నుంచి లేబర్ ఏజెన్సీల వరకు తలలు పట్టుకుంటున్నారు. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్రాజెక్టులో విడుదలయ్యే బూడిదను కూడా అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ ప్లాంట్‌లో విడుదలయ్యే ఫ్లయాష్లో 20 శాతం ఉచితంగా సిమెంట్ కంపెనీలకు ఇవ్వాలి. మరో 80 శాతం విక్రయించవచ్చు. దీన్ని అవకాశంగా తీసుకున్న షాడో ఎమ్మెల్యే ఉచితంగా ఇచ్చే 20 శాతం బూడిదను తనకే ఇవ్వాలని పట్టుబట్టి చేజిక్కించుకున్నాడు. దానిని సిమెంట్ కంపెనీలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రతి నెలా రూ. 32 లక్షల ఆర్జించే ప్లాన్ ఇది అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తోటపల్లి గూడూరు మండలం అనంతపురంలో రొయ్యల ఫీడ్‌తో పాటు మేత తయారు చేసే వాటర్‌బేస్ లిమిటెడ్ కంపెనీలో 150 మంది వరకు రోజువారీ లేబర్‌గా పనిచేస్తున్నారు. ఆ కంపెనీ లేబర్ కాంట్రాక్టుపై టీడీపీ నేతల కన్నుపడింది. తమకే ఆ కాంట్రాక్టు ఇవ్వాలని ఆ కంపెనీ ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగారు. దీనితో భయపడ్డ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా జంకింది. లేబర్ కాంట్రాక్ట్‌ను వెంటనే టీడీపీ నేతలకు అప్పగించింది. వెంకటాచలం మండలం కాకర్లవారిపాళెం ప్రాంతంలోని బేవరేజస్ పరిశ్రమలో పనిచేసే కార్మికులను తొలగించి టీడీపీ కార్యకర్తల్ని పెట్టుకోమని డిమాండ్ పెట్టారు. అలాగే ఆ పరిశ్రమల్లో మెస్ నిర్వహణ కూడా తన అనుచరుడికే ఇవ్వాలని పట్టుబట్టి యాజమాన్యాన్ని వేధిస్తున్నారు.కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా ఏర్పాటయిన ఫ్యాక్టరీలలో తయారయ్యే పామాయిల్‌ను తరలించే ట్యాంకర్ల నుంచి ‘ఎస్’ ట్యాక్స్ వసూళ్లకు తెరలేపారు. గత కొన్నేళ్లుగా పామాయిల్ ట్యాంకర్ల యజమానులు అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ అసోసియేషన్ నిర్వహణ కోసం ప్రతి లోడ్ ట్యాంకర్ నుంచి రూ. 300 వంతున వసూళ్లు చేసుకొనేవారు. షాడో ఎమ్మెల్యే కన్ను ఆయిల్ ట్యాంకర్లపై పడింది. ఆ అసోసియేషన్ పాలకవర్గాన్ని మార్చేసి వెంటనే తన అధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రతి ఆయిల్ ట్యాంకర్ నుంచి అదనంగా రూ. 800 వంతున వసూళ్లు చేసుకునేలా ప్లానింగ్ చేసుకున్నాడు. దీంతో ప్రతిరోజు దాదాపు 150 వరకు ట్యాంకర్లు రూ. 1.2 లక్షలు వరకు ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. బయట రాష్ట్రాల నుంచి వచ్చే ట్యాంకర్ల వద్ద అదనంగా రూ.4 వేలు వంతున వసూళ్లు చేస్తున్నారు. -
ఇసుక దోపిడీలో సోమిరెడ్డిదే ఫస్ట్ ర్యాంక్..
-
సోమిరెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్
-
ఆధారాలు ఇస్తాం విచారణ చేసే దమ్ముందా ప్రభుత్వానికి
-
ఏ విచారణకైనా సిద్ధం.. సోమిరెడ్డికి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్
సాక్షి, నెల్లూరు జిల్లా: తనను రాజకీయంగా ఎదుర్కొనలేక తనపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ లే అవుట్లు వేశారు. సోమిరెడ్డి అనుచరుడు పోలేరమ్మ ఆలయ భూములను కూడా ఆక్రమించారని.. అక్రమ అక్రమ లే అవుట్లపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారని కాకాణి తెలిపారు.‘‘40 లే అవుట్లు ఉన్నాయని డివిజనల్ పంచాయతీ అధికారి నివేదిక ఇచ్చారు. 25 లే అవుట్లకు ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయలేదని వెల్లడించారు. టీడీపీ హయాంలోనే విజిలెన్స్ విచారణ చేసి రూ.6.5 కోట్లు జరిమానా విధించారు. కానీ అప్పట్లో సోమిరెడ్డి జోక్యం చేసుకుని డబ్బు కట్టకుండా చేశారు. ఈ వ్యవహారమంతా టీడీపీ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని’’ కాకాణి వివరించారు.‘‘నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దమ్ముంటే విచారణ చేయండి. పొదలకూరులోని లేఅవుట్ దారులతో నెల రోజుల నుంచి సోమిరెడ్డి లావాదేవీలు జరుపుతున్నారు. అది కుదరకపోవడంతో నుడా అధికారుల వద్ద పోలీసులకు ఫిర్యాదు చేయించారు. నేను ఏ విచారణకైనా సిద్ధం. సోమిరెడ్డి అవినీతిపై ఆధారాలు ఇస్తాం.. విచారణ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా?’’ అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్ విసిరారు. -
నీకు నిజంగా దమ్ముంటే.. సోమిరెడ్డికి కాకాని సవాల్
-
సోమిరెడ్డిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్
-
సోమిరెడ్డిపై కేసు నమోదు
పొదలకూరు: ఎన్నికల వేళ ప్రచారంలో సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మహిళలకు నగదు పంపిణీ చేసిన వ్యవహారంపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అప్పట్లోనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా.. మానవతా దృక్పథంతో సాయం చేశారంటూ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి తోసిపుచ్చారు. వీడియో విజువల్స్‌లో స్పష్టంగా సోమిరెడ్డి మహిళలకు నోట్లు ఇవ్వడం కనిపిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు.దీనిపై కాకాణి పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో మూడు రోజుల క్రితం కాకాణి మీడియా సమావేశం నిర్వహించి సోమిరెడ్డి ప్రలోభాల పర్వంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు. దీంతో ఎట్టకేలకు జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా సర్వేపల్లి రిటర్నింగ్ అధికారి చినఓబులేసు పొదలకూరు పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.ఏప్రిల్ 12వ తేదీన శుక్రవారం సోమిరెడ్డి, ఆయన కుమారుడు రాజగోపాల్‌రెడ్డి పొదలకూరు మండలం చెర్లోపల్లి గిరిజన కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సోమిరెడ్డి గిరిజన మహిళలకు నగదు పంపిణీ చేశారు. సోమిరెడ్డి అనుచరులు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అప్పట్లో ఎన్నికల అధికారులు దీనిపై మండలస్థాయి అధికారులతో విచారణ జరిపించి.. మానవతా దృక్పథంతో సోమిరెడ్డి గిరిజన మహిళలకు నగదు అందజేసినట్టు నివేదిక సమర్పించి మమ అనిపించారు. ఎట్టకేలకు కాకాణి హెచ్చరికలతో ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు సోమిరెడ్డిపై ఐపీసీ 173–ఈ, ఆర్పీ యాక్ట్ 123 క్లాజ్–1 సెక్షన్ల కింద పోలీసులు సోమిరెడ్డిపై కేసు నమోదు చేశారు. -
టీడీపీ సోమిరెడ్డి వీడియో లైవ్ లో బయటపెట్టిన మంత్రి కాకాణి