
సాక్షి, వైఎస్సార్ జిల్లా : టీడీపీలో వర్గ విభేదాలపై ఏర్పాటు చేసిన సమావేశం గందరగోళంగా మారింది. ప్రొద్దుటూరులో టీడీపీ వర్గ విబేధాలపై ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జిల్లా ఇంఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్, జిల్లా మంత్రి ఆది నారాయణ రెడ్డి హాజరయ్యారు. కమిటీ సమావేశంలో వర్గ విబేధాలపై మంత్రులు నోరు మెదపలేదని సమాచారం. తాడో పేడో తేల్చుకోవాలని సమావేశానికి వచ్చిన నేతలు చివరకి ప్రొద్దుటూరు రగడపై ఎలాంటి ప్రకటన చేసే సాహసం చేయలేక వెనుదిరిగిపోయారు. ధర్మ పోరాట దీక్షపైనే సమీక్ష అన్నట్టుగా ప్రసంగించి.. పనిలో పనిగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై నాలుగు విమర్శలు చేసి సమావేశాన్ని ముగించారు. సమావేశం సారాంశం అర్థంకాక ప్రొద్దుటూరు టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు. ఇంచార్జ్ పదవి పోయిందని ముక్తీయర్ వర్గం, ఉందంటూ వరద వర్గం పరస్పరం వాదోపవాదాలు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment