adi narayana reddy
-
తప్పుడు ఫిర్యాదు చేసిన వారిని చెప్పు తో కొడతా: ఆది
-
చంద్రబాబును చూసి టీడీపీ సీనియర్లలో జాలి!
‘అనగనగా ఒక ఊరిలో ఒక నాగుపాము ఉండేది. తనకు ఎవరు కనిపిస్తే వారిని కాటేసి చంపేసేది. లేదా, చిన్న జీవులైతే తినేసేది. అదంటే అందరికీ చాలా భయం. కొన్నాళ్లకు ఆ నాగుపాము బాగా ముసలిది అయిపోయింది. ఈలోగా ఒక వేటగాడు దానిని పట్టుకుని కోరలు పీకి మళ్లీ అడవిలో వదిలేశాడు. ఇక కదలలేని పరిస్థితి వచ్చింది. జనం గానీ, మిగిలిన జీవులు గానీ దాన్ని పట్టించుకోవడమే మానేశాయి. దానికి పొట్టగడవడం కూడా కష్టమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఆ దారిలో ఒక సన్యాసి వెళుతూ ఉంటే ఆయనను తనకో దారి చూపించమని ప్రాధేయపడింది. ఆయన దానితో.. ‘నువ్వు కదలలేని, కరవలేని ముసలి పామువి అయిపోయావు గానీ కనీసం బుసకొట్టగలవు కదా.. కాబట్టి బుస కొడుతూ ఉండు.. అందరూ నిన్ను చూసి భయపడతారు’ అని సలహా చెప్పి వెళ్లాడు.ఈ ఐడియా భలే ఉందని ఆ పాముకు అనిపించింది. అప్పటి నుంచి బుస కొట్టడం ప్రారంభించింది. కొన్ని జీవులు భయపడేవి కూడా! కొన్నాళ్లకు వాటన్నింటికీ అసలు విషయం అర్థమైంది. ‘ఈ పాము బుసకొడుతుందే తప్ప.. కాటు వేయలేదు’ అని తెలుసుకున్నాయి. పిల్లి గుడ్డిదైతే ఎలుక దాని ఎదుట బ్రేక్ డ్యాన్స్ చేసినట్టుగా.. చిట్టెలుకలు, చిట్టి కుందేళ్లు కూడా ఆ పాము ఎదుట డిస్కో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాయి. ఆ పాము గట్టిగా బుస కొడుతుంది. కానీ మిగిలిన జీవులు కనీసంగా కూడా పట్టించుకోవడం మానేశాయి. పాపం.. ఆ పాము ముసలి బతుకు అలాగే గడిచిపోయింది’ ఇదీ కథ.ఈ కథకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలకు చిన్న సామ్యం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తానంటే అందరికీ హడల్ అని, తనను చూసి అందరూ జడుసుకుంటూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. తాను రంకె వేస్తే భూకంపం వస్తుందని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆయన పార్టీలోని సీనియర్లలోనే చంద్రబాబు పట్ల భయం కాదు కదా.. జాలి కలుగుతోంది.దేశంలోనే నన్ను మించిన సీనియారిటీ ఉన్న నాయకుడు లేరని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా తనను మించిన మహానుభావులు లేరని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ, సొంత పార్టీలో ఆయనకు ఒకప్పుడు ఉన్నంత విలువ, గౌరవం, ఆయన పట్ల భయం ఇప్పుడు లేవు. తాజాగా ఆర్టీపీపీ తడి బూడిద గొడవ ఇందుకు పెద్ద ఉదాహరణ.ఆర్టీపీపీ నుంచి వచ్చే తడి బూడిదను అమ్ముకోవడంలో రోజుకు దాదాపుగా రెండు లక్షల రూపాయల దందా తెలుగుదేశం నేతలు సాగిస్తున్నట్టుగా గుసగుసలున్నాయి. దీనికోసం కూటమి పార్టీల నాయకులే కొట్టుకుంటున్నారు. లోకల్ టీడీపీ భూపేష్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి మధ్య తగాదాలు ముదిరాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్, నారా లోకేష్ రాజీ చర్చలు చేసినా.. వారు దిగిరాలేదు. అప్పుడు బుస కొట్టడానికి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. అందరినీ తన ఎదుట హాజరుకావాలని పురమాయించారు.ఆయన మాటలను జేసీ ప్రభాకర రెడ్డి బేఖాతర్ అన్నారు. బీజేపీ ఆదినారాయణ రెడ్డి వచ్చి తన వాదన చెప్పుకుని వెళ్లిపోయారు. బాబు ‘బుస’లను సొంత పార్టీ వారు కూడా పట్టించుకోవడం లేదు. సొంత పార్టీలోని సీనియర్లు మాత్రమే కాదు, పార్టీలో బొడ్డూడని నాయకులు, తొలిసారి ఎమ్మెల్యే అయిన అప్రెంటిసులు కూడా చంద్రబాబు బుసలను పట్టించుకోవడం లేదు. లోకల్‌గా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే దందాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. దందాలు చేస్తే తాటతీస్తా అని చంద్రబాబు హెచ్చరిస్తుంటారు. బహుశా ఈ అప్రెంటిస్ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు హూంకరింపులు చూసి జాలిగా నవ్వుకుంటూ ఉంటారేమో! ఒకప్పట్లో ఎడాపెడా పార్టీ నేతల మీద చర్యలు తీసుకుంటూ మీడియాలో ప్రచారం కోరుకుంటూ తమ మీద రెచ్చిపోతూ వచ్చిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు అప్రెంటీసులకు కూడా లెక్కలేకుండా అయిపోయారని ఇప్పుడు సీనియర్లు బాబు పరిస్థితి మీద జాలిపడుతున్నారు.-ఎం.రాజేశ్వరి -
జమ్మలమడుగులో టెన్షన్ టెన్షన్
-
బద్వేలులో టీడీపీ.. బీజేపీకి ఓట్లు వేస్తామంటోంది
కలసపాడు: బద్వేలు ఉప ఎన్నికలో టీడీపీ వారు బీజేపీకి ఓట్లు వేస్తామని ముం దుకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆది నారాయణరెడ్డి చెప్పారు. ఈ ఉప ఎన్నికలో టీడీపీ వారు తమకు సహకరిస్తారని ఇంతకుముందే చెప్పిన ఆయన వారు తమకు ఓట్లు వేస్తారని మరోసారి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేష్ కలిసి ఆదినారాయణరెడ్డి కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెంకటరెడ్డితో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం రెడ్డిపల్లెలో సోమవారం బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహిం చింది. ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల ఎంపీటీసీ సభ్యులతో తన అన్న నారాయణరెడ్డికి ఓట్లు వేయించుకున్నామని, గెలిచిన తర్వా త వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అని ప్రకటించుకున్నారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి 2014లో ఎందుకు సీఎం కాలేదని, వైజాగ్‌లో విజయమ్మ ఎంపీగా ఎందుకు గెలవలేదని అడిగారు. ఎంపీ అవి నాష్‌రెడ్డి రాజకీయాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. వివేకా హత్యకేసును మాఫీ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు ఎక్కువయ్యాయని, అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగడాలు ఆపకపోతే శంకరగిరి మాన్యాలేనని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను వినియోగించుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో దాదాపు 80 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులేనని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఓటు వేయకుంటే పింఛన్లు తీసేస్తామని వలంటీర్ల ద్వారా ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు. కేం ద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉపాధి జాబ్‌కార్డులు, కేంద్రం నిర్మించిన రోడ్లలో తిరగొద్దు అని మేం అన్నామా.. ఇలా ఓటర్లను బెదిరించి ఓట్లు వేయిం చుకోవడం మంచి పద్ధతికాదు అని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జయరాములు, బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దౌర్జన్యం
జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లాలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తిరిగి ఫ్యాక్షన్‌ను ప్రొత్సహించే విధంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మూలె సుధీర్‌రెడ్డి అనుచరులపై వీరంగం సృష్టించారు. శనివారం రాత్రి సుధీర్‌రెడ్డి అనుచరుడైన రెడ్డయ్యపై దగ్గరుండి మరీ దాడి చేయించారు. ఆదినారాయణరెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా రౌడీయిజం చెలాయించి రాజకీయాలు చేస్తున్నారని, ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. శనివారం రాత్రి మండల పరిధిలోని సుగుమంచిపల్లె వద్ద వాహనం నిలబెట్టి మరో మనిషి కోసం వేచి ఉన్న రెడ్డయ్యను ఆదినారాయణరెడ్డి తన అనుచరులతో కొట్టించడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధీర్‌రెడ్డి కథ చూస్తామంటూ బెదిరించారు అంకాలమ్మ గూడురుకు వెళ్లడం కోసం వాహనంలో సుగుమంచిపల్లె మీద వెళ్లామని, అయితే మరో వ్యక్తి వస్తుండటంతో వేచి ఉన్నామని, ఇంతలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి నీవు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరుడైన చిలంకూరు మోహన్‌రెడ్డి మనిషివి కదా అంటూ తనపై దాడి చేశారని బాధితుడు రెడ్డయ్య తెలిపారు. ఎమ్మెల్యే మనుషులం కాదని, వేరే వ్యక్తి కోసం వేచి ఉన్నామని చెప్పినా వినకుండా కొట్టారని వాపోయారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కథ కూడా చూస్తామంటూ బెదిరించారని బాధితుడు రెడ్డయ్య చెప్పారు. -
రూ.400 కోట్ల దేవుడి భూమికి ఎసరు!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహా మంత్రులు ప్రభుత్వ కీలక నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఇలాంటి సమయంలోనే గుంటూరు రెవెన్యూ పట్టణ పరిధిలో 89, 90, 135, 151 సర్వే నెంబర్లలోని 43.05 ఎకరాల అత్యంత విలువైన భూమిని కాజేయడానికి అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలు సిద్ధమయ్యారు. గుంటూరు నగరంలోని ఫీవర్ ఆసుపత్రిని (గుంటూరు– అమరావతి ప్రధాన మార్గం) ఆనుకుని ఈ భూమి ఉంది. దీని మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.400 కోట్ల పైమాటే. ఈ భూమి గుంటూరులోని సీతారామస్వామి ఆలయానికి చెందినదని దేవాదాయ శాఖ వద్ద స్పష్టమైన రికార్డులు ఉన్నాయి. ఆ భూమి దేవదాయ శాఖకు చెందినది కాదంటూ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) జారీ చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌పై ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)తో పాటు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కార్యాలయం నుంచి కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. దేవాదాయ శాఖలో పనిచేసే కొందరు కీలక అధికారులు తెలుగుదేశం పార్టీ పెద్దలకే వత్తాసు పలుకుతున్నారు. ఒత్తిళ్లను తట్టుకోలేక దేవాదాయ శాఖ కమిషనర్ మరో వారం, పది రోజుల్లోనే ఎన్వోసీ జారీ చేయబోతున్నట్లు సమాచారం. దేవాదాయ శాఖ రికార్డుల్లో మార్పులు చేయాలట! చల్లపల్లి జమీందార్‌గా పిలిచే పాత గుంటూరు జమీందార్ రాజా మానూరి వెంకట నారాయణ 19వ దశకంలో గుంటూరు నగరంలో 128 ఎకరాలు, జిల్లాలోని చిలకలూరిపేట పట్టణం సమీపంలో మరో 31.12 ఎకరాల భూమిని సీతారామస్వామి ఆలయం పేరిట దానంగా ఇచ్చినట్టు దేవాదాయ శాఖ రికార్డుల్లో ఉంది. ఆ ఆలయంలో పనిచేసే కొందరు పూజారులు గుంటూరులోని భూమిని తమకు అమ్మారని.. ఆ భూమి తమదంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో వివాదాలు కొనసాగుతున్న సమయంలోనే ఆలయానికి చెందిన 128 ఎకరాల భూమిలో ఫీవర్ ఆసుపత్రి వెనుక ఉండే 43.05 ఎకరాలను గుంటూరుకు చెందిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి కుమారుడి వద్ద నుంచి తాము కొనుగోలు చేశామని పేర్కొంటూ కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన టీడీపీ సానుభూతిపరుల రియల్ ఎస్టేట్ కంపెనీ తెరపైకి వచ్చింది. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు 2011లో ప్రయత్నించింది. స్థానికులు ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గింది. తాజాగా అదే భూమిని తాము కొనుగోలు చేశామంటూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాస ఎస్టేట్స్ యజమాని సుధీర్ కుమార్ తెరపైకి వచ్చారు. పట్టాభి సీతారామస్వామి ఆలయ భూమిగా పేర్కొంటూ దేవాదాయ శాఖ రికార్డుల్లోని వివరాల్లో మార్పులు చేయాలని, తనకు ఎన్వోసీ జారీ చేయాలని కోరుతూ సుధీర్ కుమార్ 2018లో దేవాదాయ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఆలయ రికార్డుల్లో ఆ భూమి స్వామి వారిదేనని స్పష్టంగా ఉండడంతో సుధీర్ కుమార్ చేసుకున్న ఎన్వోసీ దరఖాస్తును 2018 అక్టోబరులో దేవాదాయ శాఖ కమిషనర్ తిరస్కరించారు. మంత్రుల రంగ ప్రవేశం గతేడాది అక్టోబరులో ఎన్వోసీ దరఖాస్తును దేవాదాయ శాఖ కమిషనర్ తిరస్కరించిన తర్వాత కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబీకులు రంగ ప్రవేశం చేశారని, దాంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని దేవాదాయ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కార్యాలయంతో పాటు సీఎం కార్యాలయ పెద్దలు ఇప్పుడు తెరవెనుక ఉండి.. ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకున్న సుధీర్ కుమార్ పేరుతో ఆ 43.05 ఎకరాలను కొట్టేయడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 2018 అక్టోబర్‌లో దేవాదాయ శాఖ కమిషనర్ మొదట ఎన్వోసీ దరఖాస్తును తిరస్కరించిన తర్వాత శ్రీనివాస ఎస్టేట్స్ యజమాని సుధీర్‌కుమార్ ఉపముఖ్యమంత్రి కేఈ కార్యాలయానికి పున:పరిశీలన కోసం దరఖాస్తు చేసుకోవడం.. తిరస్కరించిన ఎన్వోసీ దరఖాస్తుపై పున:పరిశీలన చేయాలంటూ కమిషనర్ కార్యాలయానికి ఉపముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందడం ఒకదాని వెంట ఒకటి వేగంగా జరిగిపోయాయి. 43.05 ఎకరాల భూమిపై ప్రొద్దుటూరు శ్రీనివాస ఎస్టేట్స్ పేరిట ఎన్వోసీ జారీకి నాలుగు రోజుల క్రితం దేవాదాయ శాఖ కమిషనర్ పున:విచారణ ప్రారంభించారు. పదోన్నతులు అందుకోసమేనా? ఒకసారి తిరస్కరించిన ఎన్వోసీ దరఖాస్తుపై సానుకూల నిర్ణయం తీసుకునేందుకు గుంటూరు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసే అధికారికి డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి ఇచ్చి గుంటూరులోనే నియమించారని దేవాదాయ శాఖలో ప్రచారం సాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఈ తతంగం జరగడం గమనార్హం. 43.05 ఎకరాల భూమిపై ముందుగా నిర్ణయించుకున్న మేరకు నివేదికలు ఇవ్వడం కోసమే పదోన్నతులు కొనసాగాయని చెబుతున్నారు. -
ఫ్యాక్షన్ రాజకీయాల్లో బడుగులే సమిధలు!
సాక్షి, అనంతపురం : పది మంది బతుకు కోరేవాడు నాయకుడు.. తాను నాయకుడిగా ఎదగడం కోసం పది మిందిని సమిధలు చేసే వాడు స్వార్థపరుడు.. మరి ఈ నేతలను ఏమంటారో జనమే చెప్పాలి.. తమ నాయకుడి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వారు కొందరు.. ప్రాణాలు కోల్పోయిన వారు మరికొందరు.. మనిషే కనిపించక, ఏమైపోయారో తెలియక కనుమరుగైన వారు ఇంకొందరు.. వీరంతా ఇల్లు, ఇల్లాలు, పిల్లలను వదిలి నేతల బాగు కోసం ప్రాణాలే ధారపోశారు. మంచో.. చెడో, తెలిసో.. తెలియకో వారి వెంట నడిచారు. ఇలాంటి తరుణంలో ఆ నేతలు వారి స్వార్థానికి జైకొట్టి.. ఇన్నాళ్లూ ఎవరితోనైతే ఫ్యాక్షన్ నడిపారో ఇప్పుడు వారితోనే కలిసి రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో గుల్లకుంట(బాంబుల) శివారెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి కుటుంబాల రాజకీయ మనుగడ కోసం ఇరువైపులా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 1990లో ఆది పెద్దనాన్న దేవగుడి శంకర్‌రెడ్డి, బీమగుండం గోపాల్‌రెడ్డి హైదరాబాద్ నుంచి జమ్మలమడుగుకు వస్తుంటే.. షాద్‌నగర్ వద్ద బస్సు నిలిపేసి వారిద్దరినీ చంపారు. ఈ జంట హత్యలతో ఫ్యాక్షన్‌కు బీజం పడింది. ఈ కేసులో ఇప్పటి టీడీపీ జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి రామసుబ్బా రెడ్డి రెండేళ్లు శిక్ష అనుభవించారు. ఈ హత్యకు ప్రతీకారంగా 1993లో శివారెడ్డిని.. ఆది వర్గం చంపింది. ఈ రెండు కుటుంబాల మధ్య నడిచిన ఫ్యాక్షన్‌లో కనీసం 300 మంది బలయ్యారు. రాజకీయంగా రెండు కుటుంబాలు బలపడిన తర్వాత పెద్దముడియం, కొండాపురం, ముద్దనూరు, మైలవరం మండలాల్లో జరిగిన హత్యలు కోకొల్లలు. మైలవరం మండలం కల్లుట్ల గ్రామాన్ని రామసుబ్బారెడ్డి వర్గీయులు పూర్తిగా తగలబెట్టారు. కొండాపురం మండలం కోడిగాండ్లపల్లి కూడా దహనమైంది. ఈ కేసుల్లో వందల మంది జైలు జీవితం గడిపారు. కర్నూలు, అనంతలో ఇదే తీరు.. కర్నూలు జిల్లాలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి, గౌరు వెంకటరెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ కొనసాగింది. బైరెడ్డి తండ్రి శేషశయనారెడ్డి, గౌరు బంధువు మద్దూరు సుబ్బారెడ్డి హత్యకు గురయ్యారు. తర్వాత ఇరు కుటుంబాల మధ్య రాజకీయానికి కనీసం 30 మంది బలై ఉంటారు. ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం ఇద్దరూ ఏకమై టీడీపీలో చేరారు. కేఈ కృష్ణ్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబాల మధ్య మూడు తరాలుగా పోరు నడుస్తోంది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కేఈ మాదన్న కుటుంబాల మధ్య మొదలైన ఆధిపత్య పోరులో కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడుతో సహా చాలామంది బలయ్యారు. అనంతపురం జిల్లాలో కలకలం రేపిన పరిటాల రవీంద్ర హత్య కేసులో జేసీ దివాకర్‌రెడ్డి పేరు కూడా ఉంది. జేసీ కనుసన్నల్లోనే హత్య జరిగిందని మొన్నటి వరకూ పరిటాల కుటుంబం ఆరోపించింది. ఇపుడు జేసీ టీడీపీతో జట్టు కట్టడంతో పరిటాల శ్రీరాం, జేసీ పవన్‌కుమార్‌రెడ్డి చెట్టాపట్టాలేసుకుని తిరిగే పరిస్థితి. కృష్ణా జిల్లాలో కలకం రేపిన ఘటన వంగవీటి రంగా హత్య. దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా కుటుంబాల మధ్య ‘ఫ్యాక్షన్’ తరహాలో ‘రౌడీయిజం’ నడిచింది. ఈ రెండు కుటుంబాల రాజకీయ మనుగడ కోసం ఇక్కడ కూడా అనేక మంది బలయ్యారు. ఇప్పుడు వీరు కూడా గతం మరిచి టీడీపీలో కొనసాగుతున్నారు. కేఈ–కోట్ల, ఆది–రామసుబ్బారెడ్డిని ఒకే వేదికపై తెచ్చిన ఘనత టీడీపీది అని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. నిజానికి వీరంతా నిజంగా శాంతి కోసమో, తమ వర్గీయుల కోసమో రాజీ అయి ఉంటే నిస్వార్థంగా రాజీ కావాలి. కలిసిన ప్రతి కుటుంబం వెనుక స్వార్థ రాజకీయ కాంక్ష ఉంది. కేవలం ఎంపీగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు రాజకీయ సమీకరణల నేపథ్యంలో చేతులు కలిపారు. ఈ కలయికను ఆయా నాయకుల వెంట ఉండి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల వారు చీదరించుకుంటున్నారు. తిరిగి ఇలాంటి వారికి అండగా నిలిస్తే మళ్లీ వారి రాజకీయ ఎదుగుదల కోసం మళ్లీ ఫ్యాక్షన్ భూతాన్ని ఉసిగొల్పుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి ఈనెల 11న ఏం చేయాలో అది చేస్తామని చెబుతున్నారు. హత్య జరినప్పుడు ఒకరిద్దరు నాయకులపై కేసు కడతారు. తర్వాత కోర్టులో కొట్టేస్తారు. కానీ నాయకుల వెంట తిరిగిన బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై మాత్రం రౌడీషీట్లు తెరిచారు. ఈ పరిస్థితిలో ‘మా కోసం బలైన కుటుంబాల పరిస్థితి ఏంటి? అని నేతలు ఆలోచించలేదు. స్వార్థం కోసం మా త్యాగాలను కాదన్నారు. ఇలాంటి వారి కోసమా.. మేము ఇంతకాలం త్యాగాలు చేసింది?’ అని ఆయా వర్గాల ప్రజలు రగిలిపోతున్నారు. -
ఆ ఇద్దరూ నిండా ముంచారు..
సాక్షి, కడప : మైలవరం మండలం గొల్లపల్లె వద్ద 1995లో ఏసీసీ యాజమాన్యం సిమెం టు ఫ్యాక్టరీ నిర్మిస్తామంటూ ఎకరా రూ.50 వేలు వంతున పంట పొలాలను కొనుగోలు చేసింది. గొల్లపల్లె, వద్దిరాల, ఉప్పలపాడు, చిన్నవెంతుర్ల, బెస్తవేముల, జంగాలపల్లె గ్రామాలకు చెందిన దాదాపు వెయ్యి మంది రైతులు విడతల వారీగా మూడు వేల ఎకరాలకు పైగా పంట పొలాలను ఏసీసీకీ అమ్మేశారు. ఫ్యాక్టరీ వస్తే తమ బతుకులు మారతాయని, పిల్లలకు ఉద్యోగాలొస్తాయని ఆశపడ్డారు. వారి ఆశలన్నీ అడియాశలుగానే మిగిలిపోయాయి. పాతికేళ్లు కాలచక్రంలో కరిగిపోయాయి. అప్పటి రైతులు ఇప్పుడు వృద్ధులయ్యారు. వారి కుమారులు సైతం నడివయస్సుకు వచ్చేశారు. ఫ్యాక్టరీ ఊసే కనిపించలేదు. తమను దగా చేసిన ఏసీసీ యాజమాన్యాన్ని నిలదీయాలని రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో ఫ్యాక్టరీ ప్రజాభిప్రా య సేకరణ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిం ది. పార్టీలకు అతీతంగా ఆ ఆరు గ్రామాల రైతులం తా ఒక్కటై సమస్యలు పరిష్కరించేంతవరకు సద స్సు నిర్వహించనిచ్చేది లేదని భీష్మించుకున్నారు. ఆరోజు ఏం జరిగిందంటే.... 2016 సెప్టెంబరు 9న గొల్లపల్లె సమీపాన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎప్పుడో 1995లో పొలాలు 20ఏళ్ల తర్వాత గుర్తొచ్చామా? మా బతుకులను నాశనం చేశారంటూ బాధిత రైతులు ర్యాలీగా వెళ్లి సదస్సు ప్రాంగణం వద్ద ధర్నాకు కూర్చొన్నారు. వీరికి మద్దతుగా మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీతోపాటు వైఎస్సార్సీపీ నేతలు డాక్టర్ సుధీర్‌రెడ్డి, అల్లెప్రభావతి, అల్లెచెన్నారెడ్డి, రామాంజనేయయాదవ్ ధర్నాలో పాల్గొన్నారు. తర్వాత యాజమాన్యానికి మద్దతుగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వచ్చారు. అప్పటికే పోరాటం తారాస్థాయికి చేరడంతో విధిలేని పరిస్థితుల్లో తాను కూడా రైతుల పక్షాన వచ్చానంటూ ఆదినారాయణరెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. రామసుబ్బారెడ్డి ఈ సమస్యలేవీ తనకు పట్టనట్లు ఆ వైపునకే తొంగిచూడలేదు. ఈ నేపథ్యంలో అప్పటి జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ సదస్సులో పాల్గొనడానికి రావడం, రైతులు అడ్డుకోవడం, ఆయన వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆదినారాయణరెడ్డి ఫ్యాక్టరీ యాజమాన్యం తరుపున వకాల్తా పుచ్చుకున్నారు. తాను ముందుండి నష్టపరిహారం ఇప్పిస్తానని, ఫ్యాక్టరీని త్వరలోనే నిర్మిస్తామని, సదస్సును జరగనీయాలంటూ రైతులకు కల్లిబొల్లి కబుర్లు చెప్పారు. అయినా ఆరోజు రైతులెవరూ ఆయన మాట వినలేదు. ఆది, పీఆర్లు ఇద్దరూ ఏకమై..: అప్పటికే ఆది నారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు అధికార టీడీపీలో ఉన్నారు. రైతులపై ప్రత్యక్షంగా కక్ష తీర్చుకో కుండా, అధికార యంత్రాంగం పోలీసుశాఖను ఉసిగొల్పారు. 2016 అక్టోబరు 20న వందలాది మంది పోలీసు బందోబస్తును తెప్పించి, ప్రజాభిప్రాయ సేకరణను మమ అనిపించారు. ఏసీసీ యాజమాన్యానికి మద్దతు పలికి రైతుల నోట్లో మ న్ను వేశారు. ఇకపై ఇలా పోరాటాలు చేయకుండా 57 మంది రైతులపై నాన్‌బెయిలబుల్ కేసులు న మోదు చేయించారు. సాక్షాత్తూ అప్పటి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అంతకుముందు రైతులపై పె ట్టిన కేసులు ఎత్తి వేస్తున్నామని ప్రకటించారు. ఈ ఇద్దరు నేతలు మాత్రం రైతులపై కేసులు కొనసాగేలా పోలీసుశాఖపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా 57 మంది రైతులు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 24న కూడా జమ్మలమడుగు కోర్టులో వాయిదా ఉంది. కోర్టు చుట్టూ తిరుగుతున్నా.... రైతులకు మద్దతుగా ధర్నాలో కూర్చొన్న నేరానికి అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి నాపై కూడా కేసు పెట్టించారు. నాతోపాటు 57 మంది రైతులు రెండున్నరేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?" – రామాంజనేయ యాదవ్, రైతు, వద్దిరాల గ్రామం, మైలవరం మండలం రైతులను దగా చేశారు... 2016లో ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు సందర్బంగా రైతులమంతా ఏకతాటిపై నిలిచాం. ఏ రాజకీయ నాయకుని ఆశ్రయించలేదు. అయినా వాళ్లంతట వాళ్లు వచ్చి ఏసీసీ యాజమాన్యానికి మేలు చేసి మమ్మల్ని మాత్రం నిలువునా మోసం చేశారు. – లక్ష్మినారాయణ, రైతు, గొల్లపల్లె, మైలవరం మండలం అంతా ఉత్తిదే.... మా ప్రాంతంలో సిమెంటు ఫ్యాక్టరీ వస్తే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎంతగానో ఆశపడ్డాం. 2016వ సంవత్సరంలో పోలీసు పహారా మధ్య ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు జరపడం చూసి ఇప్పుడైనా ఫ్యాక్టరీ నిర్మిస్తారేమోనని బలంగా నమ్మాను. తీరా చూస్తే అంతా ఒత్తిదేనని తేలిపోయింది. – మహమ్మద్, రైతు, చిన్నవెంతుర్ల, మైలవరం మండలం -
జమ్మలమడుగులో.. అంతులేని అభిమానం..
సాక్షి, జమ్మలమడుగు: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మించిన ఊరు..అందుకే జమ్మలమడుగంటే ఆయనకు అంత అభిమానం.. తాను సీఎం అయిన తరువాత జమ్మలమడుగు అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారు. అందుకే ఆ నియోజకవర్గ ప్రజలు కూడా వైఎస్సార్ అన్నా.. ఆయన కుటుంబమన్నా అంత అభిమానం చూపిస్తారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేస్తున్న డాక్టర్ మూలే సుధీర్‌ను అసెంబ్లీకి పంపి మహానేత కుటుంబంపై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి పుట్టింది కడప జిల్లా జమ్మలమడుగులోని క్యాంబెల్ ఆసుపత్రిలో... అందుకే ఆయన వైద్య వృత్తిని పూర్తి చేసుకున్న అనంతరం ఏడాది పాటు ఇదే ఆసుపత్రిలో వైద్యసేవలను అందించారు. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తనదైన శైలిలో వివిధ కార్యక్రమాలు ప్రారంభించి ప్రజా మన్నన పొందారు. మండల పరిధిలోని గూడెంచెరువు సమీపంలో దాదాపు 2వేల మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మించి తానే స్వయంగా ప్రారంభించారు. కరువుజిల్లాగా ఉన్న రాయలసీమ ప్రాంతాన్ని గాలేరు–నగరి ప్రాజెక్టు అంతర్భాగమైన గండికోట ప్రాజెక్టును నిర్మించి జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలగుండెల్లో శాశ్వత ముద్ర వేసుకున్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాత.. 1983లో మొదటి సారిగా టీడీపీ తరపున జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి పి.శివారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన టి.నరసింహారెడ్డిపై 12,894 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1985, 1989లో శివారెడ్డి టీడీపీ తరపున పొటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు.ఆయన వారసుడిగా పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి టీడీపీ తరఫున 1994, 1999లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సి.నారాయణరెడ్డిపై గెలుపొందారు. అయితే 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సి. ఆదినారాయణరెడ్డి టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై 22వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో పులివెందులతోపాటు, జమ్మలమడుగు నియోజకవర్గాన్ని తనదైన శైలిలో అభివృద్ధివైపు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఆదినారాయణరెడ్డి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. వైఎస్సార్సీపీ తరఫున గెలుపొందిన ఆదినారాయణరెడ్డి 2016లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎర్రగుంట్లకు చెందిన డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సౌమ్యుడు సుధీర్ రెడ్డివైపే ఓటర్ల చూపు.. నాలుగు దశాబ్దాలుగా ఫ్యాక్షన్ రాజకీయాలను చూసిన నియోజకవర్గ ప్రజలు కొత్తవాడైన డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి వైపు మొగ్గుచూపుతున్నారు. ఎప్పుడూ బద్ధ శత్రువులుగా ఉండే పొన్నపురెడ్డి కుటుంబం, దేవగుడి కుటుంబాలు ఇపుడు ప్రచారంలో కలిసి తిరుగుతున్నా సరైన స్పందన కనిపించడంలేదని టీడీపీకి చెందిన నాయకులే పేర్కొంటున్నారు. కొత్తగా వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మూలే సుధీర్‌రెడ్డికే ప్రజలనుంచి మంచి స్పందన వస్తోంది. ఇంత కాలం టీడీపీ నేతలు పనులు పంచుకుంటూ ప్రజల గురించి పట్టించుకోకపోవడంతో నియోజకవర్గ వాసులు వైఎస్కుటుంబంపై ఉన్న అభిమానంతో డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి వైపు చూస్తున్నారు. స్థానికులను పట్టించుకోని రామసుబ్బారెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డి కార్యకర్తలను, స్థానిక నాయకులను పట్టించుకోపోవడంతో కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. దేవగుడి కుటుంబంతో కలిసి పనిచేయడంతో చాలా గ్రామాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గం చాలా వరకు రామసుబ్బారెడ్డికి మద్దతూ ఇవ్వకపోవచ్చు అనే వాదన ప్రజల్లో బలంగా ఉంది. ఓటర్ల వివరాలు మొత్తం 2,23,913 పురుషులు 1,10,000 మహిళలు 1,13,893 ఇతరులు: 20 -
మళ్లీ అదే తరహా కుట్ర..
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం నుంచి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వరకు అధికార టీడీపీ, పోలీసుల తీరులో అదే తొందరపాటు, కలవరపాటు కనిపించింది. వివేకానందరెడ్డి హత్య అనంతరం పోలీసులు, రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించిన తీరును గమనించిన రాష్ట్ర ప్రజలు విశాఖలో వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్రను గుర్తు చేసుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో జగన్‌ను హత్య చేసేందుకు కత్తితో దాడి చేసిన ఘటన టీడీపీ ప్రభుత్వ పెద్దల కుట్రేననే అనుమానాలు వ్యక్తమవడం తెలిసిందే. అప్పట్లో డీజీపీ ఠాకూర్, సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించాయి. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న డీజీపీ, సీఎంలు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యవహరించారనే విమర్శలొచ్చాయి. రాజకీయ కోణంలోనే జగన్మోహన్రెడ్డిని మట్టుబెట్టే ప్రయత్నం జరిగిందని, దీనిపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయగా.. ప్రభుత్వం రాష్ట్ర పోలీసులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ పోలీసులు తొలుత అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేయడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒంటిపై గాయాలు కనబడుతుంటే ఐపీసీ సెక్షన్ 302 (హత్య కేసు) కింద కేసు నమోదు చేయకుండా ఐపీసీ సెక్షన్ 174 (అనుమానస్పదం) కేసు అనడం ఏమిటనే అనుమానాలు తలెత్తాయి. చివరకు పోస్టుమార్టం అనంతరం వివేకానందరెడ్డి శరీరంపై ఏడు పదునైన ఆయుధంతో పొడిచిన గాయాలున్నాయని నిర్ధారణ కావడంతో హత్య కేసుగా మార్చినట్టు ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ప్రకటించారు. వివేకానందరెడ్డి తల వెనుక, నుదుటిపైన, తొడ, చేతిపైన గాయాలున్నట్టు గుర్తించారు. ఈ కేసులో తమకు కొన్ని క్లూస్ దొరికాయని, వేలిముద్రలు (ఫింగర్ ప్రింట్స్) సేకరించామని, వాటి ఆధారంగా విచారణ కొనసాగిస్తామని ఎస్పీ ప్రకటించారు. ‘ఉత్త’రాయుధం.. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం మొదలుకుని వివేకానందరెడ్డి హత్యలోనూ పోలీసుల దర్యాప్తులో బయటపెట్టిన ‘ఉత్త’రాయుధం (లెటర్)లపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు 11 పేజీల లేఖ రాసి జేబులో పెట్టుకున్నాడంటూ పోలీసులు అల్లిన కథ వాస్తవానికి విరుద్ధంగా ఉందనే విమర్శలొచ్చాయి. పథకం ప్రకారమే కేసును నీరుగార్చేందుకు ఇంటెలిజెన్స్ ఏడీజీ డైరెక్షన్లోనే లేఖను సృష్టించినట్టు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. తాజాగా వివేకానందరెడ్డి చనిపోతూ లెటర్ రాసినట్టు పోలీసులు చెప్పారు. కేసును నీరుగార్చేందుకే ఈ లేఖను సృష్టించారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ హత్యే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యను రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేని జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ చేపడితే రాజకీయ కోణం వెలుగు చూస్తుందనే డిమాండ్ వినిపిస్తోంది. వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ విజయం కోసం శక్తివంచనలేకుండా పనిచేస్తున్న వివేకానందరెడ్డి.. మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. రాజారెడ్డి హంతకులకు క్షమాభిక్ష.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డిని దారుణంగా హత్య చేసిన వారికి చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల క్షమాభిక్ష పెట్టింది. ఆ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న వారికి టీడీపీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది. విడుదలైన వారిలో ఉన్న సుధాకర్‌రెడ్డిని అనుమానిస్తున్నట్టు పోలీసు వర్గాలు లీకులిచ్చాయి. రాజారెడ్డి హత్య కేసులో సుధాకర్‌రెడ్డి ముద్దాయిగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. రాజకీయ కోణంలో జరిగిన ఈ హత్యలో ప్రభుత్వ పెద్దలపైనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో వాస్తవాల్ని నిగ్గుతేల్చేలా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలనే డిమాండ్ బలంగా విన్పిస్తోంది. అప్పుడే వివేకానందరెడ్డిపై దాడి చేసి హత్య చేసిన కుట్రలో నిందితులెవరు? దాని వెనుక ఉన్నది ఎవరు? చేసిందెవరు? తదితర విషయాలు వెలుగుచూస్తాయని ప్రజలు భావిస్తున్నారు. మంత్రి ఆది తీరుపై సందేహాలు.. వివేకా హత్య విషయంలో అదే జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించిన తీరును ప్రజలు తప్పుబడుతున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ తనపై ఆరోపణలు, అనుమానాలు వస్తున్నాయని ఖండించుకోవడం గమనార్హం. వివేకా హత్య విషయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పోలీసులు తొలుత అనుమానాస్పద మృతి అని ప్రకటించి నాలుక కరుచుకుని హత్య కేసుగా మార్పుచేశారు. -
కేశవరెడ్డి విద్యాసంస్థల స్కాం లో కొత్త ట్విస్ట్
-
కేశవరెడ్డి విద్యాసంస్థల స్కాం లో కొత్త ట్విస్ట్
సాక్షి, అనంతపురం : విద్యార్థుల వద్ద డిపాజిట్ల పేరుతో కోట్ల స్కాంతో సంచలనం సృష్టించిన కేశవరెడ్డి విద్యాసంస్థల కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. మంత్రి ఆదినారాయణ రెడ్డి సమీప బంధువును కాపాడేందుకు టీడీపీ సర్కార్ పావులు కదుపుతోంది. జిల్లాలో మొత్తం 1428మంది బాధితులు ఉండగా.. కేవలం 13 మందినే సాక్ష్యులుగా ఏపీ సీఐడీ చేర్చింది. కేశవరెడ్డికి అనుకూలంగా సీఐడీ వ్యవహరిస్తోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమనూ సాక్ష్యులుగా చేర్చాలని పలువురు బాధితులు కోర్టును ఆశ్రయించారు. కేశవరెడ్డి బాధితులుకు న్యాయవాదులు హరినాథ రెడ్డి, విజయ కుమార్, సీపీఎం నేత రాంభూపాల్ అండగా నిలిచారు. కేశవరెడ్డి బాధితుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని కేశవరెడ్డి బాధితులు, ప్రజా సంఘాలు నిర్ణయించాయి. -
కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి
సాక్షి, అమరావతి : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి ఆది టీడీపీలో చేరింది మొదలు అనేక సందర్భాల్లో రామసుబ్బారెడ్డి ఆయన్ను బాహాటంగానే వ్యతిరేకిస్తూ వచ్చారు. శుక్రవారం చంద్రబాబు కడప ఎంపీ స్థానానికి ఆది, జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానానికి రామసుబ్బారెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఈ సందర్భంలో ఆది, రామసుబ్బారెడ్డిల మధ్య కొంత వివాదం జరిగినట్లు సమాచారం. కడప ఎంపీ స్థానానికి తాను వెళ్తున్నందున ఎమ్మెల్సీ స్థానానికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేయాలని మంత్రి షరతు విధించారు. ఎంపీగా పోటీచేస్తున్న ఆది ఓడిపోతే ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాల్సి ఉంటుందని వీరి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. మంత్రి షరతుతో మధ్యాహ్నమే రామసుబ్బారెడ్డి తన రాజీనామా లేఖను సీఎంకు అందించారు. జమ్మలమడుగు అభ్యర్థిగా రామసుబ్బారెడ్డిని ఖరారు చేయడంతో మంత్రి ఆది వర్గీయులు అలకబూని వెళ్లిపోయారు. వీరిమధ్య వివాదం సర్దుమణిగినట్లు పైకి కనబడుతున్నా.. ఒకరిని ఒకరు ఓడించుకుంటారనే భయంతో సీఎం చంద్రబాబు వీరిద్దరిని పిలిపించి మీడియా సమావేశం కలిసి నిర్వహించాలని ఆదేశించారు. దీంతో రాత్రికి వీరిరువురు కలిసి.. పార్టీని గెలిపించేందుకు కృషిచేస్తామని మీడియాతో చెప్పారు. ►జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి.. ►ఇద్దరి పేర్లను ఖరారుచేసిన సీఎం చంద్రబాబు ►మంత్రి షరతుతో ఎమ్మెల్సీ పదవికి రామసుబ్బారెడ్డి రాజీనామా! ►ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల మంత్రి వర్గీయుల అలక -
‘దమ్ము, ధైర్యం ఉంటే వారు పోటీ చేసి గెలవాలి’
సాక్షి, వైఎస్సార్ కడప : దమ్ము, ధైర్యం ఉంటే జమ్మల మడుగు అసెంబ్లీ స్థానం నుంచి .. రామ సుబ్బారెడ్డి, ఆది నారాయణ రెడ్డిలు పోటీ చేసి గెలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఇద్దరు నేతలు కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని విమర్శించారు. వారు వృద్ధాప్యంలో ఉన్నారని, విశ్రాంతి తీసుకోవాలని హితపు పలికారు. గత ఎన్నికల్లో ఏడువందల హామీలిచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఓట్లను డబ్బులతో కొంటామని చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. డెబ్బై ఏళ్ల చంద్రబాబు కంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనే ప్రజల ఆదరాభిమానులున్నాయని, ఈసారి వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందన్నారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టికెట్ తమకే కేటాయించాలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. -
ఎమ్మెల్యే టిక్కెట్ పీఆర్కే!
సాక్షి ప్రతినిధి కడప : ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జమ్మలమడుగు పంచాయతీకి తెరపడినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు అసెంబ్లీ టిక్కెట్ నాకు కావాలంటే నాకు కావాలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పట్టుపట్టారు. దీంతో పంచాయతీ అధిష్టానం వద్దకు చేరింది. ఇద్దరితో మాట్లాడాలని మధ్యవర్తిగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఇద్దరికి మూడురోజులు గడుపు ఇచ్చి పంపారు. మూడు రోజులు పూర్తికావడంతో శుక్రవారం తిరిగి విజయవాడలో సీఎంతో భేటీ అయ్యేందుకు నాయకులు గురువారం రాత్రి వెళ్లారు. ఒకదశలో తమకే అసెంబ్లీ టిక్కెట్ కావాలని భీష్మించుకున్నారు. చివరకు సీఎం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిపైనే మొగ్గుచూపినట్లు తెలిసింది. దీంతో మంత్రి వర్గీయులు డైలమాలో పడ్డారు. దశాబ్దాలుగా కడప పార్లమెంట్ స్థానం వైఎస్ కుటుంబీకులకే జిల్లావాసులు కట్టబెడుతూ వస్తున్నారు.వారిని ఢీకొనేందుకు మంత్రి ఆది ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డిని, ఆయన కుమారుడు భూపేష్‌రెడ్డిలను ఎంపీ స్థానానికి పోటీ చేయాలంటూ కోరారు. ఓడిపోయే స్థానంలో తాము పోటీ చేయలేమంటూ నిర్మొహమాటంగా చెప్పడంతో మంత్రి డైలమాలో పడ్డారు. ప్రొద్దుటూరు టిక్కెట్ తనకుమారుడు సుధీర్‌రెడ్డికి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రిని అడిగినట్లు తెలుస్తోంది. డైలమాలో మంత్రి ఆది అనుచరులు... ఇంతకాలం దేవగుడి కుటుంబాన్ని నమ్ముకుంటూ వచ్చిన మంత్రి అనుచరులు ఇప్పుడు డైలమాలో పడ్డారు. వైఎస్సార్సీపీని వదిలి టీడీపీలోకి వెళ్లిన మంత్రి బాటలోనే నాయకులు, కార్యకర్తలు నడిచారు.ప్రస్తుతం భిన్నపరిస్థితులు తలెత్తాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా రామసుబ్బారెడ్డిని గెలిపించాలంటూ ఎలా ప్రచారం చేయాలని మదనపడుతున్నారు. ఇలా అయితే భవిష్యత్తులో తమ ఉనికి కొల్పోవాల్సి వస్తుందని నాయకులు చర్చించుకుంటున్నట్లు సమాచారం. -
గందరగోళంగా టీడీపీ సమన్వయ సమావేశం!
సాక్షి, వైఎస్సార్ జిల్లా : టీడీపీలో వర్గ విభేదాలపై ఏర్పాటు చేసిన సమావేశం గందరగోళంగా మారింది. ప్రొద్దుటూరులో టీడీపీ వర్గ విబేధాలపై ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జిల్లా ఇంఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్, జిల్లా మంత్రి ఆది నారాయణ రెడ్డి హాజరయ్యారు. కమిటీ సమావేశంలో వర్గ విబేధాలపై మంత్రులు నోరు మెదపలేదని సమాచారం. తాడో పేడో తేల్చుకోవాలని సమావేశానికి వచ్చిన నేతలు చివరకి ప్రొద్దుటూరు రగడపై ఎలాంటి ప్రకటన చేసే సాహసం చేయలేక వెనుదిరిగిపోయారు. ధర్మ పోరాట దీక్షపైనే సమీక్ష అన్నట్టుగా ప్రసంగించి.. పనిలో పనిగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నాలుగు విమర్శలు చేసి సమావేశాన్ని ముగించారు. సమావేశం సారాంశం అర్థంకాక ప్రొద్దుటూరు టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు. ఇంచార్జ్ పదవి పోయిందని ముక్తీయర్ వర్గం, ఉందంటూ వరద వర్గం పరస్పరం వాదోపవాదాలు చేసుకున్నారు. -
మంత్రిని నిలదీసిన ప్రజలు
సాక్షి, కలసపాడు : గ్రామదర్శిని పేరుతో వైఎస్సార్ కడప కలసపాడులో టీడీపీ చేపట్టిన ప్రచారంలో ప్రజల నుంచి ఆందోళన వచ్చింది.మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతున్న సమయంలో ప్రజలు సమస్యలు లేవనెత్తారు.మండంలో భూ సమస్యలు పేరుకుపోయాయని వాటిని పరిష్కరించేందుకు తహసీల్దార్ చర్యలు తీసుకోవడంలేదని మంత్రికి తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే ఆన్లైన్ చేయడం లేదని, ఒకరి భూమిని మరొకరి పేరుతో ఆన్‌లైన్‌చేసి దానిని సవరించేందుకు వేల రూపాయలు గుంజుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ రేషన్‌కార్డులు అర్హులకు అందిస్తున్నామని చెప్పగా మహిళలు లేచి ఎక్కడ ఇస్తున్నారని మంత్రి ఆదిని ప్రశ్నించారు. వెంటనే మంత్రి తహసిల్దార్‌ను పిలిచి సమాధానం చెప్పమని ఆదేశించారు. మీరు చేసే తప్పులకు మేం ప్రజలతో మాటలు పడాలా అంటూ తహసీల్దార్ రాజేంద్రపై ఆగ్రహంవ్యక్తంచేశారు.ఈ సందర్భంగా మంత్రి ఆది మాట్లాడుతూ వారం రోజుల్లో ఆన్లైన్ సమస్యలు పరిష్కరిం చకపోతే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అంతకుముందు చెత్త నుంచి సంపద చేసే కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ∙కలసపాడులో ప్రవహిస్తున్న తెలుగు గంగ ఎడమ ప్రధాన కాలువకు మాజీ మంత్రి బిజవేములు వీరారెడ్డి పేరును పెట్టారు. దీనిపై విమర్శలు Ðð వెళ్లువెత్తాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి తెలుగుగంగ కాలువ త్వవించి గంగనీరు విడుదల చేస్తే ఆయన పేరు పెట్టకపోవడంపై పలువరు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మార్కెటు యార్డు చైర్మెన్ రంతు, టీడీపీ నాయకులు రెడ్డెం వెంకటసుబ్బారెడ్డి తదిరులు పాల్గొన్నారు. -
నేను మీ పల్లెలకు వస్తా.. నువ్వు మా పల్లెలకు రా
ఎర్రగుంట్ల : ‘మంత్రి ఆదినారాయణరెడ్డి ఊళ్లకు నేను ఒంటరిగా వస్తాను.. ఇంటింటికి తిప్పమను, అదే మంత్రి ఆదినారాయణరెడ్డిని మా పల్లెలకు రమ్మనండి.. నేను ఒక్కడిని తిప్పుతాను.. మంత్రి మంచి చేయలేదనే ఆ పల్లెలకు చెందిన వాళ్లు మమ్మల్ని మంచితనంతో పిలిచారు. రాజకీయంగా 15 ఏళ్ల నుంచి ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్నావే... ఆ పల్లెల్లోని యువతకు ఉద్యోగాలు ఇచ్చావా.. నీవు మంచి చేయకపోతేనే వారు మమ్మల్ని పిలుస్తున్నారు’.. అని వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన నిడుజివ్వి గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. మా నిడుజివ్వి గ్రామంలో నీటి సమస్యలేదు. మంత్రి మా గ్రామానికి ట్యాంక్ కట్టించానని చెబుతున్నారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో కట్టారు. మా ఊరిలో గత 50 ఏళ్ల నుంచి నీటి సమస్యలేదు. మా కుటుంబం స్వాతంత్య్రం కాలం నుంచి రాజకీయంలో ఉంది. మా తాత రామిరెడ్డి అప్పట్లోనే ఎంపీగా పోటీ చేశారు. తర్వాత పెద్దనాన్న మైసురారెడి,్డ ఆ తర్వాత మేం రాజకీయంలోకి వచ్చాం. మాకంటూ ఒక రాజకీయ చరిత్ర ఉంది. నన్ను కొత్త బిచ్చగాడు అని సంబోధిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి శివారెడ్డి హత్య జరిగిన తర్వాత వీరందరు వచ్చి మా ఇంటి వద్ద కాపలాగా కూర్చునేవారు. ఇలాంటి పరిస్థితి వారిది. నేను వైద్యుడిగా సేవ చేసి గుర్తింపు పొందాను. ఆదినారాయణరెడ్డికి ఏం గుర్తింపు ఉంది. మీ నాన్న ఫ్యాక్షన్‌లో చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ భిక్ష పెట్టాడు. తర్వాత మీ నారాయణరెడ్డి మా ఇళ్ల చుట్టు తిరిగాడు. 2004 వరకు రాజకీయాల్లో లేవు. ఎక్కడో బడి పంతులుగా ఉన్నావు. లేదా క్లబ్‌ల్లో పేకాట ఆడుతు ఉండేవాడివి. 2004లో వైఎస్సార్ పుణ్యంతో మీ అన్నను బెదిరించి టిక్కెట్ తెచ్చుకున్నావు అని పేర్కొన్నారు. నాకు నిధుల గురించి తెలియదు అంటున్నావు. నీవు మామూళ్ల కోసమే నిధులు తెచ్చుకున్నావు. మా పెద్దనాన్న నిధులు తెచ్చి అభివృద్ధి పనులు ఎన్నో చేశారు. నీకేం ఘనత ఉంది. 1996 ఎన్నికలలో మా ఊర్లో రిగ్గింగ్ జరిపినారు అని చెబుతున్నావే.. ఆ రోజు వైఎస్సార్ కోసమే ప్రజలు ఓట్లు వేశారు. ఆ రోజు స్వయాన అల్లుడైన రాజమోహన్‌రెడ్డికి కాకుండా వైఎస్సార్ కు మద్దతు తెలిపిన ఘనత పేర్ల శివారెడ్డికి దక్కిందన్నారు. మీరేం చేశారు అని ప్రశ్నించారు. 1990లో మీ అన్న నారాయణరెడ్డికి మా పెద్దనాన్న మైసురారెడ్డి డీసీసీ చైర్మన్ పదవి ఇప్పించారని, దీనిని గుర్తుంచుకోవాలన్నారు. నీ ట్రస్టు ద్వారా రూ.2500 కట్టించుకొని కుట్టుమిషన్లు ఇచ్చావు. ఆ రోజు తెల్లరేషన్ కార్డులు కల్గిన వారికి రూ.1200లకే ఇస్తున్నారు. నీవేమైనా ఉచితంగా ఇచ్చావా అని నిలదీశారు. రిజర్వాయర్ల ఏర్పాటు.. పాదయాత్ర చేసిన ఘనత వైఎస్సార్, మైసూరారెడ్డిలదే.. రిజర్వాయర్లు కట్టించామని చెబుతున్నావు. ఆరోజు గండికోట, వామికొండ రిజర్వాయర్ల కోసం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి, మా పెద్దనాన్న మైసూరారెడ్డిలు పాద యాత్ర చేశారు. నీవేం చేశావు. వైఎస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమీషన్లు మేసినావు. నేను ఊర్ల పేర్లు చెప్పలేనని అంటున్నావు. నేను నీ పల్లెలకు వస్తాను, నీవు నా పల్లెలకు రా తిప్పుతాను అన్నారు. ఎర్రగుంట్ల అభివృద్ధి వైఎస్సార్ హయాంలోనే జరిగింది ఎర్రగుంట్లలో ఏమి చేశావు..? ఎర్రగుంట్లకు ఓవర్ బ్రిడ్జి, కళాశాలలు ఎప్పుడు వచ్చింది తెలుసు. 2008కు ముందు ఆదినారాయణరెడ్డి ఎవరో తెలియదు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇంటర్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలు వచ్చాయి. ఎర్రగుంట్లను ఎవరు మున్సిపాలిటీ చేయమని అడిగారు. దీనిపై నాలుగు రోడ్ల కూడలిలో ఓటింగ్ పెడదాం.. చర్చకు రండి మేం సిద్ధం. అతని లాభం కోసం, వ్యాపార వేత్తలకోసం మున్సిపాల్టీ చేశారు. పన్నులు పెరిగాయి అని తెలిపారు. పెద్దదండ్లూరు గ్రామంలో మంత్రి భార్య.. ఆయన కుమారుడు ఘర్షణలకు ఆజ్యం పోశారన్నారు. 2014లో ఎర్రగుంట్ల మండల ప్రజలు వేసిన ఓట్లతోనే ఆ ఎన్నికల్లో బయటపడ్డావన్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి మైసురారెడ్డి తనయుడు హర్షవర్దన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు సురేంద్రనాథ్‌రెడ్డి, కౌన్సిలర్ డి. సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి జయరామకృష్ణారెడ్డి, పట్టణ, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షర్పుద్దీన్, మహబూబ్ వలి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, పట్టణ, మండల యూత్ ప్రెసిడెంట్లు దివాకర్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డిలు, స్థానిక నాయకులు మల్లు నాగార్జునరెడ్డి, వర్రా డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. -
పేదవారిపై కాదు నీబలం..మాపై చూపించు
జమ్మలమడుగు/జమ్మలమడుగురూరల్: పేదవారిపై నీ బలం చూపడం కాదు..తమపై చూపించు..ఏదైనా ఉంటే పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద చూసుకుందాం అంటూ వైఎస్సార్సీపీ జమ్మలమడుగు నియోజకవర్గసమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డికి సవాల్ విసిరారు. మా కార్యకర్తలను ఏమైనా జరిగితే చూస్తూ ఉరుకునేది లేదన్నారు. సోమవారం స్థానిక డీఎస్పీ బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్దదండ్లూరు గ్రామంలో సంపత్ తమ గ్రామానికి రావాలని పిలిస్తే.. ఎందుకు పిలిచావంటూ మంత్రి వర్గీయులు దళితుడైన సంపత్‌పై దాడి చేయడం దారుణం అన్నారు. ఏమైనా ఉంటే తమపైన ప్రతాపం చూపించాలే తప్ప పేద ప్రజలపై కాదన్నారు. మంత్రి ఆది చర్చకు వచ్చినా ఇంకేదానికి వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎక్కడో కూర్చొని తమ కుటుంబ సభ్యులు, కుమారుడి చేత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. నీవే రంగంలోకి దిగితే తాము కూడా దిగుతామని ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా తిరిగే హక్కు ఉంది. కానీ పోలీసులు ఎంపీ వైఎస్ ఆవినాష్రెడ్డిని, తనను పెద్దదండ్లూరు గ్రామంలో పర్యటించకుండా అడ్డుకోవడం మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకున్నట్లు ఉందన్నారు. ఆది మంత్రి పదవికి అనర్హుడు. క్లబ్బులు, పేకాటలకు పరిమితమైన ఆయనను మంత్రి పదవి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తొలగించాలన్నారు. ఆదివారం జరిగిన సంఘటన ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్‌డేగా మిగిలిపోతుందన్నారు. తమ వారికి ఏమైనా జరిగితే మంత్రి కుటుంబ సభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. గ్రామంలో మంత్రి ఆదినారాయణరెడ్డి సతీమణి అరుణ దగ్గరుండి దాడులు చేయించడం ఆమెకు తగదన్నారు.కుమారుడు ఇప్పటికే చెడుదారిలో పయనిస్తున్నాడని, అతన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత తల్లిపై ఉందని సూచించారు. మహిళలంటే తమకు గౌరవం అన్నారు.అరుణమ్మ మంచి తల్లిగా గుర్తింపు తెచ్చుకోవాలే తప్ప ఇలా గూండాయిజం చేయించడం మంచిది కాదన్నారు. -
బహిరంగ వేదికపై..తమ్ముళ్ల తగవు
పులివెందుల/రూరల్ : పులివెందుల పట్టణంలోని శిల్పారామంలో జరిగిన టీడీపీ జిల్లా మినీ మహానాడులో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సోమవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆధ్యక్షతన జిల్లా మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జమ్మలమడుగు టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ పరోక్షంగా మంత్రి ఆదినారాయణరెడ్డిపై విరుచుకుపడ్డారు. రాజకీయాలు అనేవి.. ప్రజలకు సేవ చేసేందుకే కానీ.. పెత్తనం చెలాయించేందుకు కాదని మంత్రి ఆదిపై పరోక్షంగా విమర్శలు చేశారు. అలాగే తాము పార్టీ స్థాపించినప్పటినుంచి ఉన్నామని.. వీరారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తాను జిల్లా అధ్యక్షునిగా పనిచేశానని తెలిపారు. ఇటీవల కొంతమంది స్టేట్మెంట్లు చూస్తే తనకు బాధగా ఉందని.. మహానాడును ఒక పండుగగా జరుపుకుంటున్నామని.. ఇక్కడ కొన్ని విషయాలు తాను మాట్లాడాలనుకుంటున్నా.. పార్టీ మీద ఉన్న గౌరవంతో మాట్లాడలేకపోతున్నానని పేర్కొన్నారు. ఒకవేళ మాట్లాడితే చంద్రబాబుకు మచ్చ తెచ్చే విధంగా ఉంటుందన్నారు. పదేళ్లపాటు ప్రభుత్వం లేకున్నా.. ఎన్నో అవాంతరాలు ఎదురైనా ప్రాణాలను ఫణంగా పెట్టి ఎదుర్కొన్నామేతప్ప.. పార్టీని వీడలేదన్నారు. పార్టీ అధికారంలో లేకున్నా.. ఎన్నో త్యాగాలు చేసి నష్టాలను ఎదుర్కొని.. పార్టీకి, ప్రజలకు సేవ చేశామన్నారు. ఇప్పటికి కూడా తమ పార్టీ నాయకులు కొంతమంది జైళ్లలోనే ఉన్నారన్నారు. తాను కూడా రెండేళ్లపాటు జైలులో ఉన్నా కూడా.. తమ ఇంటిలోని ఆడవాళ్లు రాజకీయం నడిపారన్నారు. ముఖ్యమంత్రి చెప్పడంతోనే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని గౌరవిస్తున్నామన్నారు. వారు పార్టీలో ఉన్నవాళ్లను కించపరిచే విధంగా విమర్శలు చేస్తే పార్టీకి నష్టం కలుగుతుందని ఆదినారాయణరెడ్డిని ఉద్దేశించి అన్నారు. రామ సుబ్బారెడ్డి ఆదినారాయణరెడ్డిపై వ్యాఖ్యలు చేస్తుంటే పెద్ద ఎత్తున ఈలలు, కేకలతో సభా ప్రాంగణం మారుమోగింది. అంతకుముందు వేదికపై ఉన్న నాయకుల పేర్లు చెబుతున్నప్పుడు మంత్రి ఆది పేరు ప్రస్తావించకపోవడం కొసమెరుపు. ఎన్ని పుంగనూర్లు అయితే ఒక బెంగళూరవుతుంది.. : సీఎం రమేష్ నాయుడు టీడీపీ మినీ మహానాడులో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు కూడా మంత్రి ఆదిపై పరోక్ష విమర్శలు చేశారు. తనను రెండవసారి ముఖ్యమంత్రి రాజ్యసభకు ఎంపిక చేశారన్నారు. రాజ్యసభకు ఎంపిక చేయడమంటే.. 45మంది ఎమ్మెల్యేలు బలపరచాలన్నారు. 45మంది ఎమ్మెల్యేలంటే.. 7మంది పార్లమెంటు సభ్యులతో సమానమన్నారు. అంటే దీని అర్థం ఎన్ని పుంగనూర్లు అయితే ఒక బెంగళూరవుతుందో తెలుసుకోవాలని మంత్రి ఆదిని ఉద్దేశించి పరోక్షంగా పేర్కొన్నారు. ఇటీవల ఆదినారాయణరెడ్డి సీఎం రమేష్‌పై విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అక్కడి కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. సీఎం నన్ను ఆహ్వానించారు : ఆది టీడీపీ మినీ మహానాడులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యడు సీఎం రమేష్‌నాయుడుల ప్రసంగాలు ముగిసిన తర్వాత మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ నేను ఎవరిని పార్టీలో చేర్చుకోమని అడగలేదని.. ముఖ్యమంత్రే స్వయంగా తనను పిలిపించుకుని 45నిమిషాలు మాట్లాడి పార్టీలో చేర్చుకున్నారన్నారు. అనంతరం ఆయనే తనకు మంత్రి పదవి ఇచ్చారని వారు చేసిన విమర్శలకు సభాముఖంగా సమాధానం చెప్పారు. పార్టీ నేతలు ఈ విధంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో అక్కడ ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహపడ్డారు. రక్తదాన శిబిరానికి స్పందన కరువు : పులివెందుల శిల్పారామంలో సోమవారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో తెలుగుదేశం పార్టీ నేతలు సభా ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి తెలుగు తమ్ముళ్ల నుంచి స్పందన కరువైంది. మధ్యాహ్నం 1గంట సమయానికి కూడా ఒకరు కూడా రక్తదానం చేయకపోవడంతో రక్తదాన నిర్వాహకులు స్థానిక పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. తూ తూ మంత్రంగా కేవలం పది మంది మాత్రమే రక్తదానం చేసినట్లు తెలిసింది. -
మంత్రి ఆది X సీఎం రమేశ్
సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడిగా రెండో మారు ఎన్నిక కావడంతో అధికార పార్టీకి సంబంధించి జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి.ఎన్నికల ఏడాదిలో మళ్లీ పదవి దక్కించుకున్న సీఎం రమేశ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి మంత్రి ఆదికి విభేదాలు ఉన్నాయి. తాను నివాసం ఉంటున్న పోట్లదుర్తి గ్రామం మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఉండటం గమనార్హం. సీఎం రమేశ్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని ప్రోత్సహిస్తుండటంతోపాటు తన క్యాడర్‌ను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవల జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రత్యేకించి ఎర్రగుంట్ల మండలంలో అనేక సందర్భాల్లో ఇరువర్గాల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. మంత్రి పదవి ఏడాదితో ముగియనుంది. సీఎం రమేశ్ ఆరేళ్లు పదవిలో ఉండనున్నారు. అదేసందర్భంలో మంత్రి ఆదికి చెక్ పెట్టడానికి పావులు కదుపుతున్నారు. ప్రొద్దుటూరు : జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేశ్ మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది.. వీరి మధ్య ఆది నుంచి విభేదాలు ఉన్నాయి.. రెండో సారి రాజ్యసభ సభ్యుడి పదవీ కోసం సీఎం రమేశ్ ఇటీవల తీవ్రంగా ప్రయత్నించారు.. ఆయనకు మోకాలొడ్డడానికి ఆదినారాయణరెడ్డి ప్రయత్నించారు.. రమేశ్‌కు ప్రత్యామ్నాయంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేరును సీఎం చంద్రబాబు వద్ద ఆయన ప్రతిపాదించారు. అయితే ఎట్టకేలకు రమేశే ఆ పదవి దక్కించుకున్నాడు. ఆయన ప్రతివ్యూహంగా ఆదినారాయణరెడ్డికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నేడు స్వగ్రామానికి ఎంపీ రాక: ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి గ్రామానికి చెందిన సీఎం రమేశ్ రాజ్యసభ సభ్యుడిగా రెండో సారి ఎన్నికైన అనంతరం తొలిమారు స్వగ్రామానికి శనివారం వస్తున్నారు. ఈ సందర్భంగా కడప ఎయిర్‌పోర్టు నుంచి పోట్లదుర్తి వరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రమేశ్ ఎంపికతో అటు జమ్మలమడుగు, ఇటు ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాల్లో రాజకీయం వేడెక్కింది. భవిష్యత్తులో రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, సీఎం రమేశ్.. వీరిద్దరిదీ ఒకే నియోజకవర్గం (జమ్మలమడుగు) కావడంతో.. వారి వర్గాల మధ్య తొలి నుంచి విభేదాలు ఉన్నాయి. ఆదినారాయణరెడ్డి వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు సీఎం రమేశ్‌తో పోటీ పడే వారు. 2014 ఎన్నికలు పూర్తవుతూనే ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి చెందిన 8 మంది కౌన్సిలర్లను సీఎం రమేశ్ తీసుకెళ్లడం.. అదే సందర్భంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఆది ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో తీవ్ర స్థాయిలో పోట్లదుర్తి సోదరులపై విమర్శలు చేయడం జరిగింది. ఎర్రగుంట్ల పరిధిలోని సుందరయ్య నగర్లో ఏడాది క్రితం సబ్‌స్టేషన్ నిర్మించగా.. ఇద్దరి పోటీ కారణంగా ఇప్పటి వరకు సిబ్బందిని నియమించలేదు. ఎర్రగుంట్ల నగర పంచా యతీకి సంబంధించి ఓ చౌకదుకాణం విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆ సందర్భంగా ఆదినారాయణరెడ్డి పోట్లదుర్తి సోదరులనుద్దేశించి బహిరంగంగా విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. గండికోట ప్రాజెక్టు పునరావాస పనులు తమకు దక్కలేదన్న ఉద్దేశంతో ఇటీవల ఆది, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గీయులు.. కొండాపురంలోని సీఎం రమేశ్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. శ్రీనివాసరెడ్డిని ప్రతిపాదించిన ఆది సీఎం రమేశ్ రాజ్యసభ సభ్యునిగా రెండో మారు పోటీ చేసేందుకు ఇటీవల తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సభ్యుడి పదవి ఇవ్వాలని ఆది సీఎం చంద్రబాబు వద్ద ప్రతిపాదన పెట్టారు. సీఎం రమేశ్‌ను అడ్డు తొలగించుకోవాలన్న కారణంతోనే.. మంత్రి ఇలా చేశారనే విమర్శలు ఉన్నాయి. ఎట్టకేలకు సీఎం రమేశ్‌ను ఎంపీ పదవి వరించింది. ఏర్పాట్లలో ముందున్న నేతలు సీఎం రమేశ్ శనివారం స్వగ్రామానికి వస్తున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. ఇందులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఎర్రగుంట్ల వరకు అక్కడక్కడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ర్యాలీకి వాహనాలు సమకూర్చడంతోపాటు అన్ని పనుల్లో ముందున్నారు. తొలి నుంచి సీఎం రమేశ్ రామసుబ్బారెడ్డిని బలపరుస్తున్నారు. కమలాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డి టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే తాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వీరశివారెడ్డి ఇటీవల ప్రకటించడంతో కమలాపురం రాజకీయం రసకందాయంగా మారింది. టికెట్ కోసమే వీరశివారెడ్డి సీఎం రమేశ్‌తో ఎక్కువగా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. పుత్తా నరసింహారెడ్డికే టికెట్ వస్తుందని జనవరిలో జరిగిన జన్మభూమి గ్రామ సభలో మంత్రి ఆది ప్రకటించడం గమనార్హం. ప్రొద్దుటూరులో వరదతో... ప్రొద్దుటూరు నియోజకవర్గ రాజకీయాలకు సంబంధించి వరదరాజులరెడ్డికి సీఎం రమేశ్‌తో పూర్తి స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం జరిగిన మైదుకూరు – బద్వేలు హైవే రోడ్డు టెండర్ నుంచి సీఎం రమేశ్ నామినేషన్ రోజు జరిగిన ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు టెండర్ల వరకు ఇరువురు నేతలు పోటీ పడుతున్నారు. సీఎం రమేశ్ రాక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గీయులైన వీఎస్ ముక్తియార్, ఈవీ సుధాకర్‌రెడ్డితోపాటు పలువురు కౌన్సిలర్లు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముక్తియార్ సీఎం రమేశ్‌కు 60 వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. వరద మాత్రం వీటికి దూరంగా ఉన్నారు. తొలి నుంచి సీఎం రమేశ్ ప్రొద్దుటూరుపై దృష్టి సారిస్తున్నారు. అదే నేపథ్యంలో వరద వారిని వ్యతిరేకిస్తున్నారు. -
జేబులు నింపుకోవడమే వారి లక్ష్యం
కొండాపురం : ముంపు గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా పునారవాస కేంద్రాల్లో సిమెంట్‌రోడ్ల పనుల టెండర్లలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఫిఫ్టీ–ఫిప్టీ పనులు పంచుకొని వారు జేబులు నింపుకొవడానికికే తప్ప ప్రజలకు మేలు చేయలేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాళ్లప్రొద్దుటూరులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సుధీర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శంకర్‌రెడ్డితో కలసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయంలో రూ.32 లక్షల ఎకరాలను భూమి లేని నిరుపేదలకు పంచారన్నారు. మహానేత ð మరణించిన తర్వాత ఎవ్వరూ పేదలకు భూమిని పంచలేదన్నారు. ఇవ్వాల భూమిలేని ప్రతి పేదవాడికి భూమి ఇస్తామని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నారని వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. రాజశేఖర్‌రెడ్డి హయంలో నియోజక వర్గంలో 42 వేల గృహాలు మంజూరు చేశారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న నియోజకవర్గానికి 50 వేలు గృహలు కట్టిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో బంగారుతల్లి పథకం కింద రూ. 20 వేలు ఇస్తామని చెప్పి ఏ ఒక్క హామీ నేరవేర్చలేదన్నారు. రేషన్ షాపులో 9 వస్తువులు ఇచ్చేవాళ్లు టీడీపీ ప్రభుత్వంలో బియ్యం కూడా సక్రమంగా ఇవ్వలేదన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క రైతుకు కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదని, బంగారు ఇంటికి రాకపోగా బంగారు వేలం నోటీసులు ఇంటి కొస్తున్నాయని ఆయన విమర్శించారు. చంద్రబాబు 13 ఏళ్ల పాలనలో ఒక్క పథకం కూడా ప్రజలకు గుర్తుకురాలేదన్నారు. వైఎస్సార్ పేరు చెబితే ఆరోగ్యశ్రీ,, 108 సేవలు, ఉచిత విద్యుత్, జలయజ్ఞం లాంటి పథకాలు గుర్తుకొస్తాయన్నారు. ఏడాదిలోపే వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతుందని, రైతులకు గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణతో పాటు రచ్చబండలో తలెత్తిన సమస్యలన్నీంటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సురేష్‌బాబు మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమం అంటేనే మహానేత దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గుర్తుకొస్తున్నారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అందించాలని సంకల్పంతో రచ్చబండ కార్యక్రమం ప్రవేశపెట్టాడన్నారు. కాబట్టి రచ్చబండలో సమస్యలన్ని రాబోతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిష్కరిస్తామన్నారు. పి.రామసుబ్బారెడ్డి తొమ్మిదేళ్లు గృహనిర్మాణ మంత్రిగా పనిచేసినప్పుడు 9 వేలు గృహాలు కట్టించారన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని ఆయన ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. జమ్మలమడుగులో అభివృద్ధి చేస్తా అన్న మంత్రి ఆదినారాయణరెడ్డి ముంపు గ్రామాల్లోకి వచ్చి ఒక్కరోజైనా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాడా అంటూ ఆయన విమర్శించారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని వర్గాలవారికి న్యాయం జరుగుతుందన్నారు. 30 ఏళ్ల నుంచి ఆది, రామసుబ్బారెడ్డిలకు బుద్దిచెప్పే రోజులు దగ్గరపడ్డాన్నారు. సర్వేలో అన్యాయం.. డాక్టర్ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ముంపుగ్రామాల ప్రజలకు తప్పకుండా 10 నుంచి 13 లక్షలు ఫ్యాకేజీ పెంచుతామని రచ్చబండలో ముంపువాసులకు హామీ ఇచ్చారు. రెండో విడత సర్వేలో అన్యాయం జరిగిందని నాదృష్టికి తీసుకొచ్చారని మన ప్రభుత్వం రాగానే రీ సర్వే చేయించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. గండికోట ప్రాజెక్టు కింద ముంపు నిర్వాసితులు యువకులు, యువతకు 18 ఏళ్లకు రెండు నెలలు తక్కువ ఉన్నా పరిహారం వర్థింప చేయలేదన్నారు. మన ప్రభుత్వం రాగానే 10 ఏళ్లు, 15 ఏళ్లు వయస్సును బట్టి పరిహారం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ల ప్రొద్దుటూరు ఎస్. రామసుబ్బారెడ్డి, హరినారాయణరెడ్డి, విజయ్‌కుమార్, గొందిశివ, మండల కన్వీనర్ నిరంజన్‌రెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్‌బాషా, జిల్లా కార్యదర్శి రామముని రెడ్డి, కొండాపురం పట్టణ అ««ధ్యక్షుడు వాసుదేవరెడ్డి, మండల యూత్ కన్వీనర్ లక్ష్మీకాంత్‌రెడ్డి, రైతు విభాగ అధ్యక్షుడు రామనాథరెడ్డి, కోడూరు రామసుబ్బారెడ్డి, రామిరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, సత్యనారాయణరెడ్డి, చింతా రాజారెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చంద్రబాబు చరిత్ర అంతా వెన్నుపోట్లే
-
రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబంపైనే విమర్శలు
-
'ఆదినారాయణ రెడ్డిని బర్తరఫ్ చేయాలి’
-
దళితులను కించపరిస్తే ఉప్పెనలా ఉద్యమిస్తాం
► మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై దళితులు ఆగ్రహం ► మంత్రినిబర్తరఫ్చేసి, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ ► అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు కైకలూరు : దళిత జాతిని అవమానిస్తూ మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ౖకైకలూరు నియోజకవర్గంలో దళితులు భగ్గుమన్నారు. దళితులను కించపరిస్తే ఉప్పెనలా ఉద్యమిస్తామని హెచ్చరించారు. నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన కైకలూరులోని తాలూకా సెంటర్ వద్ద వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మేరుగు విక్టర్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం విక్టర్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నారాయణరెడ్డిని భర్తరఫ్ చేసి, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సాధు కొండయ్య మాట్లాడుతూ దళితులను దగా చేస్తున్న నాయకులను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబును దళిత, గిరిజన, బలహీన వర్గాల ప్రజలు వ్యతిరేకించాలన్నారు. జిల్లా సేవాదళ్ కార్యదర్శి సోమల శ్యామ్‌సుందర్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ తరఫున గెలిచి, టీడీపీలో చేరిన మంత్రి నారాయణరెడ్డికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని విమర్శించారు. వైఎస్సార్ సీసీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి దండే రవిప్రకాష్, నాయకులు ఈదా పండుబాబు, కోనాల జయరాజు, పిల్లనగ్రోవి రఫయేలు, మద్దా ఏసురత్నం, వరిగంజి రాజారత్నం, ఎరిచర్ల శేఖర్‌బాబు, మేరుగు తంబిరాజు, అందుగుల శేషగిరి రావు కొరపాటి పరుశురాముడు పాల్గొన్నారు. దళిత సత్తా ఏంటో చూపిస్తాం.. మంత్రి నారాయణరెడ్డికి దళిత సత్తా ఏంటో చూపిస్తామని కలిదిండి మండల వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శావా రాజ్‌కుమార్ (దాసు) అన్నారు. ఆయన ఆధ్వర్యంలో కలిదిండి సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి శుక్రవారం క్షీరాభిషేకం జరి గింది. దళితులను అవమానించి ఆది నారాయణరెడ్డిని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చే యాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ యూత్ నాయకుడు అబ్రహం లింకన్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దళితులకు ఎటువంటి గౌరవముందో ఈ సంఘటన రుజువు చేస్తోందన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు నీలపాల వెంకటేశ్వరరావు, నాయకులు పంతగాని విజయ్‌బాబు, కందుల వెంకటేశ్వరరావు, యాళ్ల జీవరత్నం, యలవర్తి శ్రీనివాసరావు, నేతల మెకాయేలు, బొడ్డు దావీదు పాల్గొన్నారు. టీడీపీకి ఎస్సీల చేతిలో పరాభవం తప్పదు ముదినేపల్లి రూరల్ : టీడీపీ నేతలు, మంత్రులకు భవిష్యత్‌లో ఎస్సీల చేతిలో రాజకీయ పరాభవం తప్పదని వైఎస్సార్ సీపీ ఎస్సీ నేతలు హెచ్చరించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ఎస్సీలను కించపరుస్తూ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక బస్టాండ్ ఎదురుగా అంబేడ్కర్ విగ్రహానికి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నిమ్మగడ్డ భిక్షాలు మాట్లాడుతూ ఎస్సీలపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మంత్రులు, నేతలు అదేబాటన నడుస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన కారంచేడు ఘటనకు కారణమైన టీడీపీని తదుపరి ఎన్నికల్లో ఎస్సీలు శంకరగిరి మాన్యాలు పట్టిం చారని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో చరిత్ర పునరావృతం అవుతుందని పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలకు మంత్రి ఆదినారాయణరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల నిరసనోద్యమాలు వెల్లువెత్తుతా యని హెచ్చరించారు. పార్టీ కార్మిక విభాగం జిల్లా కార్యదర్శి దాసరి శ్రీనివాసరావు, చేవూరు సర్పంచి బల్లవరపు హరిబాబు, నేతలు గొరుముచ్చు సామియేలు,నేతల రాజేష్,సాలెం అబ్రహం, అబ్దుల్ జానీ పాల్గొన్నారు. -
మంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం
-
మంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం
► ఆదినారాయణ రెడ్డి దళితులకు క్షమాపణలు చెప్పాలి ► అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆది నారాయణరెడ్డి క్షమాపణ చెప్పాలని అంబేడ్కర్ మనవడు, భారతీయ రిపబ్లికన్ పక్షాల బహుజన్ మహాసంఘ్ (బీబీఎం) పార్టీ జాతీయ నేత ప్రకాశ్ అంబేడ్కర్ డిమాండ్ చేశారు. దళితులను ఉద్దేశించి మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ఇండియన్ ఎకనమిక్స్ అసోసియేషన్ సభ్యుడు బోరుగడ్డ అనిల్‌కుమార్ గురువారం ప్రకాశ్ అంబేడ్కర్‌ను ఢిల్లీలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరు తెలుగు రాష్ట్రాల్లో దళితుల సంక్షేమం గురించి చర్చించుకున్నారు. గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు గ్రామ దళితులను సామూహికంగా బహిష్కరించడం, దళితులపై రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి అనిల్ వివరించారు. దీనిపై ప్రకాశ్ అంబేడ్కర్ స్పందిస్తూ.. ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలను, అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు దళితులను సామూహికంగా బహిష్కరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. గరగపర్రు దళితులను తాను త్వరలోనే పరామర్శిస్తానని, సెప్టెంబర్ 24 తరువాత గరగపర్రులో పర్యటిస్తానని తెలిపారు. రాజ్యాంగాన్ని రచిం చిన అంబేడ్కర్ ఒక దళితుడని, భారత రాష్ట్రపతి ఒక దళితుడని గుర్తు చేస్తూ.. మంత్రి వ్యాఖ్యల ఉద్దేశమేంటని ప్రశ్నించారు. దళితులు నిద్రపోతున్న సింహాలు దళితులు నిద్రపోతున్న సింహాలని, వారిని రెచ్చగొడితే ప్రభుత్వాలే కూలిపోతాయని అనిల్ అన్నారు. దళితుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మంత్రిని హెచ్చరించారు. దళితులపై చేసిన వాఖ్యలను ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లండన్‌లో విద్యనభ్యసించిన అనిల్ ఇండియన్ ఎకనమిక్స్ అసోసియేషన్ సభ్యుడిగా ఇటీవలే ఎన్నికయ్యారు. ఈ అసోసియేషన్‌లో మాజీ, ప్రస్తుత రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, కేంద్ర ఆర్థిక మంత్రులు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. దళితులు, మైనారిటీల సంక్షేమం కోసం అనిల్ వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టారు. -
దళితుల కన్నెర్ర
ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన రాస్తారోకోలు, ధర్నాలు దిష్టిబొమ్మల దహనం పలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎస్సీల పట్ల అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి అదినారాయణరెడ్డిపై దళితులు కన్నెర్ర చేశారు. ఆదినారాయణరెడ్డికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. దళితులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. రాస్తారోకోలు, ధర్నాలు, వినతిపత్రాలు, పలు స్టేషన్లలో మంత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదులతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. అత్తిలి, చింతలపూడి పోలీసు స్టేషన్లలో మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఫిర్యాదులు చేశారు. ఆచంటలో మంత్రి ఆదినారాయణరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు మానుకొండ ప్రదీప్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ దళిత విభాగం ఆధ్వర్యంలో అత్తిలి బస్ స్టేషన్ సెంటర్లో ధర్నా చేసి మంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. అచంటలో వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. నిడదవోలు పట్టణంలో సంతమార్కెట్ వద్ద, అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం కేవీపీఎస్, చర్చిపేట యూత్ ఆధ్వర్యంలో దళితులు నిరసన వ్యక్తం చేసారు. రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మంత్రి దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిష్టి బొమ్మను దహనం చేసారు. అక్కడ నుంచి తహసిల్దారు కార్యాలయం వద్దకు వెళ్లి కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసారు. సమిశ్రగూడెంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి దిష్టిబొమ్మ దహనం ప్రయత్నాన్ని ఎస్ఐ అడ్డుకున్నారు. టి.నర్సాపురంలో బీఎస్పీ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. పోలవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ డిమాండ్ చేసింది. వెఎస్సార్సీపీ మహిళా నాయకురాలు, జిల్లా సర్పంచ్ల ఛాంబర్ ఉపాధ్యక్షురాలు దేవీ గంజిమాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మంత్రి నోరు అదుపులో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ దెందులూరు బస్టాండ్ సెంటర్లో దళితులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కొవ్వలిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన, మౌన ప్రదర్శన నిర్వహించారు. ఏలూరులో ఫైర్‌స్టేషన్ సెంటరులో దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మంత్రి ఆదినారాయణ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. -
మాట తప్పిన ‘ఆది’ సవాల్ విసరడమా !
ప్రొద్దుటూరు: మాట మీద నిలబడని ఆదినారాయణరెడ్డి సవాల్ విసరడం ఏమిటని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మట్లాడారు. ఆది మాట మీద నిలబడే మనిషి కాదని అన్నారు. అధికార అంచుల మీద నిలబడ్డ ఆయన ఏనాటికైనా జారిపోక తప్పదని పేర్కొన్నారు. నాటి సవాళ్లు ఏమయ్యాయి.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది మాట మీద నిలబడే వ్యక్తి కాదని చెప్పడానికి చాలా సంఘటనలు ఉన్నప్పటికీ రెండు మాత్రం ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నానని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. 2005 మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 3 కౌన్సిల్ సీట్లు వస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆది సవాల్ విసిరారన్నారు. అయితే టీడీపీ 3 కౌన్సిలర్ స్థానాలు గెలిచిన తర్వాత రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీని వీడి టీడీపీలోకి వెళ్లేటప్పుడు కూడా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానని అన్నారు. ఇంత వరకూ పార్టీకి, పదవికి రాజీనామా చేయలేదని తెలిపారు. డబ్బుతో రాజ్యసభ పదవిని కొన్న రమేష్‌నాయుడు రాజకీయ నాయకుడే కాదన్నారు. ఆయన ఏనాడూ ప్రజా విశ్వాసం పొందలేదని, రూ. 10కి కొని రూ.15కు విక్రయించే వ్యాపరస్తుడని ఎమ్మెల్యే తెలిపారు. వక్రీకరణలు వద్దు.. తాను మాట్లాడిన మాటలను టీడీపీ నాయక త్రయం వక్రీకరిస్తోందని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ‘మీరు గెలిస్తే ఊడిగం చేస్తాననే’ మాట చెప్పలేదన్నారు. 60 ఓట్లు మా వద్ద ఎక్కువగా ఉన్నాయి..మరో 40 ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నాం.. వెరసి 100 ఓట్లతో గెలవబోతున్నాం అని టీడీపీ నాయకులు అన్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. దానికి సమాధానంగానే 60 ఓట్ల సంఖ్యాబలం చూపిస్తే ఊడిగం చేస్తానని చెప్పానన్నారు. ఆ సవాల్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు. తాను జమ్మలమడుగులో చేయడం వల్లనే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 6 వేల ఓట్లతో బయట పడగలిగారని ఆది చెప్పడం ఆయన అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. వైఎస్ బొమ్మతో గెలిచిన వ్యక్తి ఇలా మాట్లాడటం బాధగా ఉందన్నారు. వైఎస్‌ను విపరీతంగా అభిమానించే ప్రజాప్రతినిధులారా ఆయన పట్ల మరోసారి ప్రేమను వ్యక్త పరచాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. పార్టీ పట్టణాధ్యక్షులు చిప్పగిరి ప్రసాద్, గజ్జల కళావతి, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, జింకా విజయలక్ష్మి, దేవిప్రసాదరెడ్డి పాల్గొన్నారు.