
సాక్షి, వైఎస్సార్ కడప : దమ్ము, ధైర్యం ఉంటే జమ్మల మడుగు అసెంబ్లీ స్థానం నుంచి .. రామ సుబ్బారెడ్డి, ఆది నారాయణ రెడ్డిలు పోటీ చేసి గెలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఇద్దరు నేతలు కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని విమర్శించారు. వారు వృద్ధాప్యంలో ఉన్నారని, విశ్రాంతి తీసుకోవాలని హితపు పలికారు. గత ఎన్నికల్లో ఏడువందల హామీలిచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఓట్లను డబ్బులతో కొంటామని చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. డెబ్బై ఏళ్ల చంద్రబాబు కంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనే ప్రజల ఆదరాభిమానులున్నాయని, ఈసారి వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందన్నారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టికెట్ తమకే కేటాయించాలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టుకున్న సంగతి తెలిసిందే.