rama subba reddy
-
మానసిక ఆరోగ్యంతోనే అభివృద్ధి
మానవ సమాజంలో పని అనేది ఒక అంత ర్భాగం. మానవుడు ఆహా రం కోసం చేసే వెదుకు లాట/ వేట మొట్టమొదటి పనిగా చెప్తారు. 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం పని గంటలు, పని ‘సంస్కృతి’లో అనేక మార్పులు తీసుకువచ్చింది. పరిశ్రమలు, కార్మికులు కలసి ఒక సంస్థాగత వ్యవస్థగా ఏర్ప డ్డారు. టెక్నాలజీ అభివృద్ధి చెందడం, ఇంటర్నెట్ ప్రవేశంతో కొత్తకొత్త ఉద్యోగాల రూపకల్పన జరగడం ప్రారంభమయింది. యాంత్రికీకరణ, కృత్రిమ మేధ అభివృద్ధితో ఇది మరింత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక మనిషి తన జీవిత కాలంలో సుమారుగా తొంభైవేల నుండి ఒక లక్ష గంటల పాటు పని ప్రదేశంలోఉంటాడని అంచనా. అంటే యుక్త వయసు నుండి రిటైరయ్యే వరకు ఉన్న జీవిత కాలంలో ఇది సుమారు మూడు వంతుల సమయం. ఒక ఉద్యోగస్థుడు తన సహ చరులతో ఇంతకాలం గడపడం వలన వారితో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకుంటాడు. ఈ బంధాలు, పనిచేసే వాతావరణం, యాజమాన్యంతో ఉండే సంబంధం... ఇవన్నీ ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని చాలావరకు ప్రభావితం చేస్తాయి. కనుకనే ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ‘పని చేసే ప్రదేశంలో మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి’ అనే నినాదంతో ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపు కుంటోంది. పని ప్రదేశాల్లో ఒత్తిడి అనేది అత్యంత సహజ మైన విషయం. అయితే ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే పలు రకాల శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ఒక సర్వే ప్రకారం ప్రతీ పదిమందిలో ఎనిమిది మంది ఏదో ఒక రకమైన ఒత్తిడిని ఎదు ర్కొంటున్నట్లు తేలింది. ప్రతి నలుగురిలో ఒకరు చికిత్స అవసరం అయిన మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలా బాధపడే వారిలో కేవలం నలభై శాతం మంది మాత్రమే సరైన వైద్య సహాయం పొందుతున్నారు. అయితే ఇది ఉద్యోగి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం ద్వారా ఉత్పాదకతను కూడా తగ్గిస్తుంది. ఇది మిగిలిన ఉద్యోగుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ఉద్యోగితో పాటుగా యాజమాన్యాలు / సంస్థలు తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద తగిన జాగ్రత్తలు తీసు కోవలసిన అవసరం ఉంది. సరైన సమయపాలన పాటించడం, ఒత్తిడికి గురైనపుడు సహచరుల, యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళి సహాయం పొందడం; పనికి, వ్యక్తిగత జీవితానికి హద్దులు పెట్టుకొని కొంత సమయం తనకోసం మాత్రమే కేటాయించుకోవడం, వారాంతాల్లో కుటుంబ సభ్యులతో సమయం గడపడం, పనిలో అప్పుడప్పుడు కొంత విరామం తీసుకోవడం లాంటివి చేయడం ద్వారా ఉద్యోగి ఒత్తిడిని కొంత వరకు తగ్గించవచ్చు. విభిన్న షిఫ్ట్ సిస్టవ్ులో పనిచేసే దంపతులు కలిసి ఉండే సమయం తక్కువ అవడంవల్ల కలిసి క్వాలిటీ టైవ్‌ు గడిపే అవకాశాలు సన్నగిల్లి వీరి మధ్య కొన్ని మనస్పర్థలు, అనుమా నాలు తలెత్తే అవకాశముంది. సమర్థంగా పనిచేసే వారిని యాజమాన్యం ఎప్పటికప్పుడు ప్రోత్సహించి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల వీరిలో మానసిక స్థైర్యం పెంపొందుతుంది. మహిళా ఉద్యోగులు, ఒకవైపు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ; మరోవైపు ఉద్యోగ బాధ్యతల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. అలాంటి వారి ఎడల సంస్థలు కొన్ని వెసులుబాట్లు ఇస్తే, వీరు ఒత్తిడికి లోను కాకుండా ఉండగలరు. కంపెనీలు కూడా ఈ మధ్య కాలంలో ‘వర్క్ ఫ్రమ్ హోవ్‌ు’ను ప్రోత్సహించడం వలన ఉద్యో గుల్లో ఉత్పాదకత పెరిగినట్లు గణాంకాలు చెబు తున్నాయి. ప్రతి సంస్థ అర్హత కలిగిన మానసిక వైద్యులు లేదా క్లినికల్ సైకాలజిస్టుల సేవలు తమ ఉద్యోగులకు కల్పించాలి. యోగా, ధ్యానం, ఒత్తిడి గురించి వర్క్‌షాప్స్ వంటి కార్యక్రమాలు తరచుగా తమ సంస్థల్లో జరిగేలా ఏర్పాట్లు చేయాలి. ఒక క్రమ పద్ధతిలో నైపుణ్య పరీక్షలు జరిపి అర్హులైన వారికి ఇంక్రిమెంట్లు, పదోన్న తులు, ఇతర వసతులు కల్పించడం ద్వారా ఉద్యోగస్థుల్లో సంతృప్తి శాతాన్ని పెంచవచ్చు. ఎప్పుడైతే ఉద్యోగస్థులు తమ పనిపట్ల తృప్తితో ఉంటారో వారు మరింత పాజిటివ్ ధృక్పథంతో, సంస్థ అభివృద్ధికి కృషిచేస్తారు. వారు మిగిలిన వారికి ఒక మంచి ఉదాహరణగా నిలిచి, ఒక చక్కని పని సంస్కృతి అనేది సంస్థలో అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని సంస్థలు పని ప్రదేశాల్లో ఉద్యోగుల, కార్మికుల మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. జీవితంలోగాని,వృత్తిలో గాని విజయం సాధించాలంటే మనసును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోవడమనేది చాలా ముఖ్యమని అందరూ గుర్తించాలి. డా‘‘ ఇండ్ల రామసుబ్బారెడ్డి వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్యనిపుణులు(రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
ఆత్మహత్యలను ఆపలేమా?
ప్రపంచంలో జరిగే మొత్తం ఆత్మహత్య లలో 20 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయి. ప్రతి ఏటా సుమారు 2 లక్షల మంది మన దేశంలో ఆత్మహత్యలతో మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు మన దేశంలో మధ్య వయస్కులు, వృద్ధులు ఆత్మహత్యలు చేసుకొంటే, ఇటీవలి కాలంలో యువత, విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడుతున్నారు. కారణాల విషయానికి వస్తే, కుటుంబ సమస్యలు, భార్యా భర్తల మనస్పర్థలు, బలహీన పడుతున్న కుటుంబ బంధాలు మూడింట ఒక వంతు కారణమైతే, డిప్రెషన్, మద్యానికి బానిస కావడం, స్కిజోఫ్రీనియా, దూకుడు, ఆవేశ మనస్తత్వాలు, కేన్సర్, ఎయిడ్స్ లాంటి శారీరక, మాన సిక సమస్యలు కూడా ఆత్మహత్యలకు కారణ భూత మవుతున్నాయి. స్త్రీల కంటే పురుషులే అధికంగా (4:1) ఆత్మ హత్యలతో మరణిస్తుంటే, ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడంలో మాత్రం స్త్రీలదే పైచేయిగా ఉంది. ఎక్కువ ఆత్మహత్యలు ఉదయం 5 గంటల నుండి 10 గంటల మధ్యే ఎక్కువగా జరగడానికి ముఖ్య కారణం మన శరీరంలో ‘కార్టిసాల్’ అనే స్ట్రెస్ హార్మోన్ ఆ సమయంలో అధికంగా ఉత్పత్తి కావడమే! వారసత్వంగా జీన్స్ ప్రభావం వల్ల కూడా కొన్ని కుటుంబాల్లో పలువురు ఆత్మ హత్యలకు పాల్పడటం శాస్త్రీయంగా కూడా రుజువైంది. కోవిడ్ సమయంలో మునుపటి కంటే 10 శాతం ఆత్మహత్యలు పెరిగాయి. అయితే ఇదే సమయంలో పరీక్షలు లేక పోవడం వల్ల విద్యార్థుల ఆత్మహత్యలు 25 శాతం తగ్గిపోవడ మనేది ఆలోచించదగ్గ విషయం! మూడీగా, డల్‌గా, దిగులుగా ఉండటం; కన్నీళ్ళు పెట్టు కోవడం, తిండి, నిద్ర లేకపోవడం, డైరీలో సూసైడ్ నోట్ రాయడం, అప్పగింతలు పెట్టడం, వేదాంత ధోరణితో మాట్లా డటం, విషాద గీతాలు ఎక్కువగా వినడం, వీలునామా రాయడం, మద్యం, మత్తు మందులు అధికంగా తీసుకోవడం వంటి లక్షణాలు ఆత్మహత్య ఆలోచనను మనకు పట్టిస్తాయి. నివారణ చర్యలకొస్తే, ప్రాణాంతకమైన పురుగు మందు లను నిషేధించడం, మద్యాన్ని సాధ్యమైనంత తక్కువ అందు బాటులో ఉండేలా చూడటం కాకుండా 20 ఏళ్ల లోపు వారికి మద్యం విక్రయాలు నిషేధించడం, హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్ల బదులు, గోడ ఫ్యాన్లు వాడటం వల్ల కూడా ఆత్మహత్యలను చాలా వరకు నియంత్రించవచ్చు. అలాగే పేదలకు నగదు బదిలీ చేయడం ద్వారానూ ఆత్మహత్యలను నివారించవచ్చు. బ్రెజిల్లో 60 శాతం, ఇండోనేషియాలో 20 శాతం ఆత్మహత్యలు ఈ నగదు బదిలీ వల్ల తగ్గుముఖం పట్టినట్లు నిర్థారణ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇటీవల ఆత్మహత్యల శాతం తగ్గడానికి ఒక ముఖ్య కారణం ‘నగదు బదిలీ’ పథకాలేనని కూడా చెప్పవచ్చు. మనదేశంలో మొట్టమొదటిసారిగా తమిళనాడు ప్రభుత్వం 18 ఏళ్ల కిందట ప్రవేశపెట్టిన పరీక్షల ఫలితాలు వెలువడిన నెల లోపలే సప్లిమెంటరీ పరీక్షలు పెట్టడమనే విధానం వల్ల విద్యార్ధుల ఆత్మహత్యలు ఆ రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోయాయి. ఈ విధానాన్ని ఇప్పుడు పలు రాష్ట్రాలు అమలు చేయడం ఒక మంచి పరిణామం. ఆత్మహత్యకు పాల్పడే వారికి ‘ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్’ ఇవ్వాలి. అంటే, వారి బాధలను ఓపిగ్గా వినడం, సానుభూతి చూపించడం, ధైర్యం చెప్పడం, ఓదార్చడం, నీకు మేమున్నాం అనే భరోసా కల్పించడం ద్వారా ఆత్మహత్య ప్రయత్నాలను చాలా వరకు తగ్గించవచ్చు. ప్రభుత్వం ‘జాతీయ ఆత్మహత్య నివారణ’ పథకాన్ని తీసుకురావాలి. ఇందులో మానసిక నిపుణులనూ, ఉపాధ్యా యులనూ, స్వచ్ఛంద సంస్థలనూ భాగస్వాములను చేసి సమా జంలో ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి పట్టణంలో ఒక ‘సూసైడ్ హెల్ప్‌లైన్’ ఏర్పాటు చేసి అలాంటి తలంపులున్న వారికి తక్షణ సాంత్వన కల్పించే ఏర్పాటు చేయగల్గితే ఈ ఆత్మహత్యా నివారణ దినోత్స వానికి సార్థకత లభించినట్లవుతుంది. డా‘‘ ఇండ్ల రామసుబ్బారెడ్డి వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్యులు, రచయిత మొబైల్: 93481 14948 (సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం) -
నో డౌట్.. బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రజలు పట్టం కడతారు..
-
రామసుబ్బారెడ్డికి సముచిత స్థానం
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డికి వైఎస్సార్సీపీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రామసుబ్బారెడ్డి సీఎం జగన్‌ను కలిశారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఏడాది క్రితమే రామసుబ్బారెడ్డి పార్టీలోకి వచ్చారని, క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆలోచనలపై చర్చించడానికి కోవిడ్, ఇతర అంశాలు అడ్డం వచ్చాయని తెలిపారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నుంచి 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన వ్యక్తి పార్టీ ఫిరాయించగా, డాక్టర్ సుధీర్‌రెడ్డి కష్టకాలంలో ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి, 2019 ఎన్నికల్లో గెలిచారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కూడా జమ్మలమడుగు నుంచి సుధీర్‌రెడ్డినే మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తానని సీఎం చెప్పారని తెలిపారు. రామసుబ్బారెడ్డి ఆయనతో సమన్వయం చేసుకుని పని చేస్తారన్నారు. శాసనమండలిలో ఆయనకు చోటు కల్పించి ఆయన అనుభవాన్ని వాడుకుంటామని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఒక స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారన్నారు. జగన్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉందని రామసుబ్బారెడ్డి తెలిపారు. -
ఆ వదంతులు అవాస్తవం: రామసుబ్బారెడ్డి
సాక్షి, విజయవాడ: తాను పార్టీ మారుతున్నానన్న వార్తలు అవాస్తవమని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వదంతులను ఆయన ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నాయకత్వంపై విశ్వాసంతోనే పార్టీలో చేరానని, రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్సార్సీపీలోనే ఉంటానని తెలిపారు. పార్టీలో అందరూ మమ్మల్ని గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కోసం ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు కష్టపడ్డారని.. అందరం కలిసి పార్టీ కోసం పనిచేస్తామని చెప్పారు. పార్టీ మారే అవసరం లేదని, రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్ జగన్ వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. (చదవండి: ‘పశ్చిమ’లో టీడీపీకి ఎదురుదెబ్బ..) -
‘అందుకే విలువలు లేని టీడీపీని వీడా’
సాక్షి, వైఎస్సార్ కడప: ఎలక్షన్ కమిషన్ ఒత్తిడికి గురై ఉద్దేశపూర్వకంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు అనుకున్న కాలానికి జరిగితే రాష్ట్రానికి రావలసిన రూ. 5 వేల కోట్ల నిధులు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని చెప్పారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిడుతున్న టీడీపీ నాయకులు.. నాడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిస్తే ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అన్నారు. అందుకే విలువలులేని తెలుగుదేశం పార్టీని వీడి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని వెల్లడించారు.(‘ఎన్నికలు జరగకపోతే ఆ నిధులు ఆగిపోతాయి’) ‘ఆయన్ని దుష్టశక్తులు ఆవహించాయి’ అదే విధంగా సీఎం జగన్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే టీడీపీ మీద నమ్మకం లేకనే మంచి నాయకులంతా పోటీ చేయలేదన్నారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని చెప్పారు. రాష్ట్రం కోసం సీఎం జగన్ చేసే ఆలోచనలు ఎంతో మేలు చేసేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం జగన్ మీద బురద చల్లాలని చూస్తే దేవుడే వారికి బుద్ధి చెబుతాడని పేర్కొన్నారు. గతంతో చంద్రబాబు కుమారుడు లోకేష్.. గతంలో కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డిని ఓడించడానికి అందరినీ డబ్బుతో కొనమని చెప్పాడని, వైఎస్సార్ సీపీకి అత్యధిక మెజారిటీ ఉన్నా డబ్బులతో ఆయనను ఓడించారని రామసుబ్బారెడ్డి తెలిపారు. -
బాబు మాకు అన్యాయం చేశాడు: రామసుబ్బారెడ్డి
సాక్షి, వైఎస్సార్ కడప: అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని భూములతో వ్యాపారం చేశాడని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తన స్వలాభం కోసం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చంద్రబాబు చుశాడన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న తమను కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలను తీసుకుని మంత్రి పదవులు కట్టబెట్టి తమకు, తమ కుటుంబాలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కాగా ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎదురించి సొంతంగా పార్టీ పెట్టిన నైజం ఆయనదన్నారు. తండ్రి దివంగత నేత వైఎస్సార్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను నెరవేర్చాలని, రాష్ట్రం అభివృద్ధి చేయాలని సీఎం జగన్ కసిగా పని చేస్తున్నారని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీలోకి రామసుబ్బారెడ్డి కుటుంబం -
వైఎస్సార్సీపీలోకి రామసుబ్బారెడ్డి కుటుంబం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆ పార్టీని వీడి తన కుటుంబ సభ్యులు, పలువురు నేతలు, కార్యకర్తలతో కలసి వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బుధవారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రామసుబ్బారెడ్డితోపాటు ఆయన కుమారుడు వెంకట శివారెడ్డి, సోదరుడు గిరిధర్‌రెడ్డి, తుంగభద్ర హెచ్ఎల్సీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ నారాయణరెడ్డి, ఆర్ఆర్ క్లబ్ రమణారెడ్డి, న్యాయవాది నందకిషోర్‌రెడ్డి, చిలమకూరు జగన్నాథరెడ్డి, ఉప్పలపాటి సూర్యనారాయణరెడ్డి, ఎం.చక్రపాణిరెడ్డితో పాటు జమ్మలమడుగు నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ వారందరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకు మనస్ఫూర్తిగా చేరా: రామసుబ్బారెడ్డి - టీడీపీ నాయకత్వంపై నమ్మకం లేక పార్టీ మారుతున్నా. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీలో చేరా. ఏమీ ఆశించలేదు. మమ్మల్ని ఎవరూ బెదిరించలేదు. మనస్ఫూర్తిగా వైఎస్సార్సీపీలో చేరా. - సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా డైనమిక్ లీడర్‌షిప్‌తో ముందుకు వెళుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ స్వీప్ చేస్తుంది. శుభపరిణామం: సజ్జల రామకృష్ణారెడ్డి (రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రజా వ్యవహారాలు) - సీఎం వైఎస్ జగన్ నాయకత్వంపై విశ్వాసంతో రామసుబ్బారెడ్డి వైఎస్సార్సీపీలో చేరడం శుభ పరిణామం. - సీఎం జగన్ పాలనను చూసి టీడీపీ ముఖ్యనేతలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. - చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు, ఆ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేత తూముల బొబ్బిలి: విశాఖను కార్య నిర్వాహక రాజధానిగా ప్రకటిస్తూ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం వల్ల ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఆర్థిక మండలి సభ్యుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తూముల భాస్కరరావు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో బుధవారం ఆయన ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆయన సతీమణి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తూముల అచ్యుతవల్లి, మాజీ కౌన్సిలర్లు ఆర్.ఎల్.వి.ప్రసాద్, మరిపి తిరుపతినాయుడు తదితరులు పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలసి వైఎస్సార్సీపీలో చేరారు. -
ఆ ఇద్దరూ నిండా ముంచారు..
సాక్షి, కడప : మైలవరం మండలం గొల్లపల్లె వద్ద 1995లో ఏసీసీ యాజమాన్యం సిమెం టు ఫ్యాక్టరీ నిర్మిస్తామంటూ ఎకరా రూ.50 వేలు వంతున పంట పొలాలను కొనుగోలు చేసింది. గొల్లపల్లె, వద్దిరాల, ఉప్పలపాడు, చిన్నవెంతుర్ల, బెస్తవేముల, జంగాలపల్లె గ్రామాలకు చెందిన దాదాపు వెయ్యి మంది రైతులు విడతల వారీగా మూడు వేల ఎకరాలకు పైగా పంట పొలాలను ఏసీసీకీ అమ్మేశారు. ఫ్యాక్టరీ వస్తే తమ బతుకులు మారతాయని, పిల్లలకు ఉద్యోగాలొస్తాయని ఆశపడ్డారు. వారి ఆశలన్నీ అడియాశలుగానే మిగిలిపోయాయి. పాతికేళ్లు కాలచక్రంలో కరిగిపోయాయి. అప్పటి రైతులు ఇప్పుడు వృద్ధులయ్యారు. వారి కుమారులు సైతం నడివయస్సుకు వచ్చేశారు. ఫ్యాక్టరీ ఊసే కనిపించలేదు. తమను దగా చేసిన ఏసీసీ యాజమాన్యాన్ని నిలదీయాలని రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో ఫ్యాక్టరీ ప్రజాభిప్రా య సేకరణ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిం ది. పార్టీలకు అతీతంగా ఆ ఆరు గ్రామాల రైతులం తా ఒక్కటై సమస్యలు పరిష్కరించేంతవరకు సద స్సు నిర్వహించనిచ్చేది లేదని భీష్మించుకున్నారు. ఆరోజు ఏం జరిగిందంటే.... 2016 సెప్టెంబరు 9న గొల్లపల్లె సమీపాన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎప్పుడో 1995లో పొలాలు 20ఏళ్ల తర్వాత గుర్తొచ్చామా? మా బతుకులను నాశనం చేశారంటూ బాధిత రైతులు ర్యాలీగా వెళ్లి సదస్సు ప్రాంగణం వద్ద ధర్నాకు కూర్చొన్నారు. వీరికి మద్దతుగా మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీతోపాటు వైఎస్సార్సీపీ నేతలు డాక్టర్ సుధీర్‌రెడ్డి, అల్లెప్రభావతి, అల్లెచెన్నారెడ్డి, రామాంజనేయయాదవ్ ధర్నాలో పాల్గొన్నారు. తర్వాత యాజమాన్యానికి మద్దతుగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వచ్చారు. అప్పటికే పోరాటం తారాస్థాయికి చేరడంతో విధిలేని పరిస్థితుల్లో తాను కూడా రైతుల పక్షాన వచ్చానంటూ ఆదినారాయణరెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. రామసుబ్బారెడ్డి ఈ సమస్యలేవీ తనకు పట్టనట్లు ఆ వైపునకే తొంగిచూడలేదు. ఈ నేపథ్యంలో అప్పటి జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ సదస్సులో పాల్గొనడానికి రావడం, రైతులు అడ్డుకోవడం, ఆయన వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆదినారాయణరెడ్డి ఫ్యాక్టరీ యాజమాన్యం తరుపున వకాల్తా పుచ్చుకున్నారు. తాను ముందుండి నష్టపరిహారం ఇప్పిస్తానని, ఫ్యాక్టరీని త్వరలోనే నిర్మిస్తామని, సదస్సును జరగనీయాలంటూ రైతులకు కల్లిబొల్లి కబుర్లు చెప్పారు. అయినా ఆరోజు రైతులెవరూ ఆయన మాట వినలేదు. ఆది, పీఆర్లు ఇద్దరూ ఏకమై..: అప్పటికే ఆది నారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు అధికార టీడీపీలో ఉన్నారు. రైతులపై ప్రత్యక్షంగా కక్ష తీర్చుకో కుండా, అధికార యంత్రాంగం పోలీసుశాఖను ఉసిగొల్పారు. 2016 అక్టోబరు 20న వందలాది మంది పోలీసు బందోబస్తును తెప్పించి, ప్రజాభిప్రాయ సేకరణను మమ అనిపించారు. ఏసీసీ యాజమాన్యానికి మద్దతు పలికి రైతుల నోట్లో మ న్ను వేశారు. ఇకపై ఇలా పోరాటాలు చేయకుండా 57 మంది రైతులపై నాన్‌బెయిలబుల్ కేసులు న మోదు చేయించారు. సాక్షాత్తూ అప్పటి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అంతకుముందు రైతులపై పె ట్టిన కేసులు ఎత్తి వేస్తున్నామని ప్రకటించారు. ఈ ఇద్దరు నేతలు మాత్రం రైతులపై కేసులు కొనసాగేలా పోలీసుశాఖపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా 57 మంది రైతులు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 24న కూడా జమ్మలమడుగు కోర్టులో వాయిదా ఉంది. కోర్టు చుట్టూ తిరుగుతున్నా.... రైతులకు మద్దతుగా ధర్నాలో కూర్చొన్న నేరానికి అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి నాపై కూడా కేసు పెట్టించారు. నాతోపాటు 57 మంది రైతులు రెండున్నరేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?" – రామాంజనేయ యాదవ్, రైతు, వద్దిరాల గ్రామం, మైలవరం మండలం రైతులను దగా చేశారు... 2016లో ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు సందర్బంగా రైతులమంతా ఏకతాటిపై నిలిచాం. ఏ రాజకీయ నాయకుని ఆశ్రయించలేదు. అయినా వాళ్లంతట వాళ్లు వచ్చి ఏసీసీ యాజమాన్యానికి మేలు చేసి మమ్మల్ని మాత్రం నిలువునా మోసం చేశారు. – లక్ష్మినారాయణ, రైతు, గొల్లపల్లె, మైలవరం మండలం అంతా ఉత్తిదే.... మా ప్రాంతంలో సిమెంటు ఫ్యాక్టరీ వస్తే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎంతగానో ఆశపడ్డాం. 2016వ సంవత్సరంలో పోలీసు పహారా మధ్య ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు జరపడం చూసి ఇప్పుడైనా ఫ్యాక్టరీ నిర్మిస్తారేమోనని బలంగా నమ్మాను. తీరా చూస్తే అంతా ఒత్తిదేనని తేలిపోయింది. – మహమ్మద్, రైతు, చిన్నవెంతుర్ల, మైలవరం మండలం -
పచ్చ పార్టీ ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగి..!
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా పార్టీల ప్రచారంలో పాల్గొనడం, సామాజిక మాధ్యమాల్లో ఓపార్టీకి అనుకూలంగానైనా, వ్యతిరేకంగానైనా పోస్టు చేయడం, చర్చలు పెట్టడం ఎన్నికల నియమావళికి విరుద్ధం. వార్డు సభ్యుడి నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల వెంట ప్రచారాలకు వెళ్లడం, వారితో తిరగడం చేస్తే కోడ్‌ను ఉల్లంఘించినట్టే. కానీ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తే ఏమీ కాదనే నిర్ధారణకు వచ్చిన ఓ ఘనుడు ఏకంగా ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యాడు. మైనర్ ఇరిగేషన్‌శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న కటిక మదుసూధన్‌రెడ్డి నిబంధనలకు నీళ్లు వదిలి జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డి ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. మంగళవారం సైతం ముద్దనూరు గ్రామంలో అధికార పార్టీ నాయకుల సేవలో తరించాడు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఇటువంటి ఉల్లంఘనులపై జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపడుతుందో చూడాలి. -
మంత్రి ఆదికి ఊహించని షాక్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీని వీడుతున్న నాయకుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. తాజాగా వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన కీలక నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వీరంతా వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. పార్టీ కండువాలతో వీరిని వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. కొండాపురం, ముద్దనూరు, పెద్దముడియం మండలాలకు చెందిన మాజీ ఎంపీటీసీలు, ఎంపీపీలు, ముని రాజారెడ్డి, బొందల గుంట సుబ్బయ్య, స్టాల్ పిరా సోదరులు, పెద్దముడియం ఈశ్వర్ రెడ్డి, దస్తగిరి రెడ్డి, తదిరులు వైఎస్సార్ సీపీలో చేరారు. కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. -
‘దమ్ము, ధైర్యం ఉంటే వారు పోటీ చేసి గెలవాలి’
సాక్షి, వైఎస్సార్ కడప : దమ్ము, ధైర్యం ఉంటే జమ్మల మడుగు అసెంబ్లీ స్థానం నుంచి .. రామ సుబ్బారెడ్డి, ఆది నారాయణ రెడ్డిలు పోటీ చేసి గెలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఇద్దరు నేతలు కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని విమర్శించారు. వారు వృద్ధాప్యంలో ఉన్నారని, విశ్రాంతి తీసుకోవాలని హితపు పలికారు. గత ఎన్నికల్లో ఏడువందల హామీలిచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఓట్లను డబ్బులతో కొంటామని చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. డెబ్బై ఏళ్ల చంద్రబాబు కంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనే ప్రజల ఆదరాభిమానులున్నాయని, ఈసారి వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందన్నారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టికెట్ తమకే కేటాయించాలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. -
చంద్రబాబు వద్దకు జమ్మలమడుగు పంచాయతీ
సాక్షి, అమరావతి: తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన టీడీపీకి.. ప్రస్తుత పరిణామాలు మింగుడు పడటం లేదు. వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని, రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి పదవులు సైతం అప్పగించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు.. వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది. తాజాగా చంద్రబాబు వద్దకు జమ్మలమడుగు పంచాయతీ చేరింది. చంద్రబాబు జమ్మలమడుగు అసెంబ్లీ సీటు ఎవరికి కేటాయిస్తారనే దానిపై గత కొంతకాలంగా అయోమయం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై చర్చించడానికి జమ్మలమడుగు టీడీపీ నేతలు బుధవారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కడప పార్లమెంట్ స్థానంతోపాటు, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు వారితో చర్చలు జరిపారు. మంత్రి ఆదినారయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలో ఒకరిని ఎంపీ స్థానానికి, మరోకరిని అసెంబ్లీ స్థానానికి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం ఈ నెలఖారున జమ్మలమడుగులో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఇరువురు నేతలకు సూచించారు. అయితే ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఇరువులు నేతలు విముఖత చూపుతున్నట్టుగా తెలుస్తోంది. పైకి చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్న ఇరువురు నేతలు.. ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేపట్టారు. కాగా, గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గెలుపొందిన ఆదినారాయణ రెడ్డిని.. చంద్రబాబు అక్రమంగా పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. -
టీడీపీలో పెరుగుతున్న ఆధిపత్య పోరు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : అధికార పార్టీలో ఆధిపత్య పోరు రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇటీవల మంత్రి అఖిలప్రియ- ఏవీ సుబ్బారెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుగజేసుకుని వారికి సర్ది చెప్పారు. మినీ మహానాడు సమావేశంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్ అయిన విషయం విదితమే. అయితే జమ్మలమడుగులో మరోమారు టీడీపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. వైఎస్సార్ జిల్లాలో రామసుబ్బారెడ్డి- మంత్రి ఆదినారాయణ రెడ్డిల మధ్య వివాదాలు తలెత్తాయి. నేతలు పోటా పోటీగా మినీ మహానాడు సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. శనివారం రామసుబ్బారెడ్డి మినీ మహానాడును ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఆదినారాయణ రెడ్డిల విడిగా మినీ మహానాడు ఏర్పాటు చేశారు. దీంతో నేతల మధ్య అధిపత్య పోరు మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ విధమైన సమస్యలు టీడీపీకి ఎదురు దెబ్బని చెప్పవచ్చు. -
టీడీపీలో వర్గపోరు.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ
-
టీడీపీలో వర్గపోరు.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ
సాక్షి, జమ్మలమడుగు : అధికార టీడీపీలో వివాదాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాలపై రాష్ట్రంలో జోరుగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో అధికారపార్టీ నేతల మధ్య మాటల యుద్దం చోటుచేసుకంది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో ఎమ్మెల్యే టికెట్స్ ప్రకటించడానికి ఆదినారాయణ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. ‘జమ్మలమడుగులో పోటీ చేసేది తానే అని ఆదినారాయణరెడ్డి ఎలా ప్రకటిస్తారు? ఎమ్మెల్సీ ఇచ్చే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీలో టికెట్స్ ప్రకటించే హక్కు మంత్రులకు, జిల్లా అధ్యక్షులకు లేదు. పార్టీ క్రమశిక్షణకు తూట్లు పొడుస్తున్నారు. లేని పోనీ ప్రకటనలు చేసి నియోజకవర్గంలో వర్గపోరు పెంచుతున్నారు’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. -
చంద్రబాబే చెప్పారు.. చెరి సగం పంచుకోమని..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో అవినీతి వైరస్‌లా ఊరూరా విస్తరించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే అవినీతిని కేంద్రీకృతం చేసి అక్రమాలకు ద్వారాలు బార్లా తెరిచారు. తాను రారాజు అయినట్లు, మంత్రులు, పార్టీ నేతలు సామంతులైనట్లు... భారీగా కొల్లగొడుతూ పార్టీ మంత్రులు, ముఖ్య నాయకులు, శ్రేణులను కూడా పంచుకుతినండంటూ అనుమతులు ఇచ్చేశారు. ముఖ్యమంత్రి తన ముఖ్య కోటరీతో పాటు అత్యంత నమ్మకమైన ఉన్నతాధికారుల సహకారంతో భారీ డీల్స్ ద్వారా మూడున్నరేళ్లలో దాదాపు రూ.నాలుగు లక్షల కోట్లకు పైగా ఆర్జించారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.ఇవన్నీ నిజమేనని మంత్రి ఆదినారాయణరెడ్డి మాటలతో స్పష్టమైంది. వైఎస్సార్సీపీ తరఫున జమ్మలమడుగు నుంచి పోటీచేసి గెలుపొంది, పార్టీ ఫిరాయించి టీడీపీ కండువా కప్పుకుని, రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ప్రభుత్వ అవినీతి విశ్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ‘‘రామసుబ్బారెడ్డి గారికి కూడా ప్రతి రూపాయిలో అర్ధ రూపాయి భాగం ఉంది ఈడ. అర్థ రూపాయి భాగం ఇవ్వమని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను మాతోపాటు కూర్చోబెట్టి పంచాయతీ చేశారు.ఆయన అడిగిన దాంట్లో మనకు సగం వస్తాది. మనం అడిగిన దాంట్లో ఆయనకు సగం వస్తాది. వాళ్లు నన్ను ఏమి విమర్శించినా నేను అయితే పట్టించుకోను’’అంటూ ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది. గండికోట పునరావాస కాలనీల టెండర్లు దక్కించుకోవడంలోనూ వీళ్లిద్దరూ ఏకమయ్యారు. అయితే అదే పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ టెండర్లు తెరవకుండా అడ్డుకున్నారని ఆగ్రహించిన మంత్రి, రామసుబ్బారెడ్డి వర్గీయులు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ స్థానిక కార్యాలయంపై దాడి చేయడం గమనార్హం. ఒకే పార్టీకి చెందిన నేతలు కాంట్రాక్టులకోసం బరితెగించడం, వారి మధ్య పంపకాలు జరిపేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడాన్ని బట్టి ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అవినీతి సొమ్ముతో కొనుగోళ్లు ప్రాజెక్టు పనుల అంచనాలను ఆకాశానికంటేలా పెంచి, తద్వారా అందుకున్న వాటాల సొమ్ముతోనే చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడ్డారని విమర్శలున్నాయి. ఇలా అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్ముతో చంద్రబాబు 23మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఏకంగా రూ.30 కోట్ల వరకు నజరానాగా ముట్టచెప్పడంతోపాటు భారీగా కాంట్రాక్టులు అప్పజెప్పారని తెలుస్తోంది. దీనిపై సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు వ్యతిరేకించడంతో... అందరికీ న్యాయం చేస్తానంటూ చంద్రబాబు నేరుగా పంచాయతీలు చేసినట్లు మంత్రి మాటలతో వెల్లడవుతోంది. అందులో ఐఏఎస్ అధికారులను కూడా భాగస్వాములను చేయడం బరితెగింపునకు పరాకాష్టగా నిలుస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించడం గమనార్హం. తాజాగా మంత్రి ఆది చేసిన వ్యాఖ్యలు సైతం కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల పనితీరుకు అద్దం పడుతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి విజయవాడలో నిర్వహించిన తొలి కలెక్టర్ల సమావేశంలోనే తమ పార్టీ కార్యకర్తలు, నేతలకు సహకరించాల్సిందేనని విస్పష్టంగా చెప్పారు. అంతేకాదు తన భారీ అవినీతి ప్రణాళికలకు అంగీకరించని సీనియర్ ఐఏఎస్ అధికారులను ఢిల్లీ బాట పట్టించారు. అవినీతికి సహకరిస్తున్న అధికారులపై ఈగ కూడా వాలనీయడంలేదు. దోచుకున్న సొమ్మును ఫిïఫ్టీ.. ఫిïఫ్టీ వాటాలు పంచుకోండంటూ ప్రజాప్రతినిధులకు సూచనలిచ్చిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఉండరని విశ్లేషకులు దుయ్యబడుతున్నారు. తాము అన్ని విషయాలపై నోరు విప్పితే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవని మిత్రపక్షం బీజేపీ నాయకులు అంటున్నారంటే ఆయన అవినీతి, అక్రమాలు వ్యవహారాలు ఏ రీతిలో ఉండి ఉంటాయో అంచనా వేసుకోవచ్చు. -
జమ్మలమడుగు టీడీపీలో వర్గపోరు
జమ్మలమడుగు: వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు టీడీపీలో వర్గపోరు మరోమారు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి ప్రాబల్యం ఉన్న పెదదండ్లూరులో రామసుబ్బారెడ్డి ఆదివారం విందుకు హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యే ఆది అగ్గిమీద గుగ్గిలమయ్యారు. రామసుబ్బారెడ్డిని విందుకు ఎందుకు పిలిచారని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటుచేశారు. నేతల ఆధిపత్య పోరుతో ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఎమ్మెల్యే ఆది టీడీపీలో చేరికను మొదటి నుంచి రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. -
'ప్రస్తుతానికి టీడీపీలోనే కొనసాగుతా'
వైఎస్సార్ జిల్లా: ప్రస్తుతానికి టీడీపీలోనే కొనసాగుతానని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు రామసుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ఆయన జమ్మలమడుగులో విలేకరులతో మాట్లాడుతూ... భవిష్యత్ పరిణామాలను బట్టి, కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ మారే అంశంపై నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీని వ్యతిరేకించడం లేదని....ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాకను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని రామసుబ్బారెడ్డి చెప్పారు. -
షాద్‌నగర్ జంట హత్యల కేసు విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: షాద్‌నగర్ జంట హత్యల కేసు విచార ణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ బస్టాండ్‌లో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తల హత్యోదంతంలో నిందితుడు, టీడీపీకి చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి దిగువ కోర్టు 2004లో విధించిన శిక్షను 2006లో హైకోర్టు కొట్టివేయగా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ 2008లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ తాజాగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ సి.నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు రాగా దీన్ని విచారించేందుకు ధర్మాసనం నిరాకరించడంతో ఈ కేసు మరో ధర్మాసనం ముందుకు వెళ్లనుంది.