జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్న మదుసూధన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా పార్టీల ప్రచారంలో పాల్గొనడం, సామాజిక మాధ్యమాల్లో ఓపార్టీకి అనుకూలంగానైనా, వ్యతిరేకంగానైనా పోస్టు చేయడం, చర్చలు పెట్టడం ఎన్నికల నియమావళికి విరుద్ధం. వార్డు సభ్యుడి నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల వెంట ప్రచారాలకు వెళ్లడం, వారితో తిరగడం చేస్తే కోడ్‌ను ఉల్లంఘించినట్టే.
కానీ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తే ఏమీ కాదనే నిర్ధారణకు వచ్చిన ఓ ఘనుడు ఏకంగా ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యాడు. మైనర్ ఇరిగేషన్‌శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న కటిక మదుసూధన్‌రెడ్డి నిబంధనలకు నీళ్లు వదిలి జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డి ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. మంగళవారం సైతం ముద్దనూరు గ్రామంలో అధికార పార్టీ నాయకుల సేవలో తరించాడు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఇటువంటి ఉల్లంఘనులపై జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపడుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment