
'ప్రస్తుతానికి టీడీపీలోనే కొనసాగుతా'
వైఎస్సార్ జిల్లా: ప్రస్తుతానికి టీడీపీలోనే కొనసాగుతానని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు రామసుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ఆయన జమ్మలమడుగులో విలేకరులతో మాట్లాడుతూ... భవిష్యత్ పరిణామాలను బట్టి, కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ మారే అంశంపై నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీని వ్యతిరేకించడం లేదని....ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాకను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని రామసుబ్బారెడ్డి చెప్పారు.