
సాక్షి, విజయవాడ: తాను పార్టీ మారుతున్నానన్న వార్తలు అవాస్తవమని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వదంతులను ఆయన ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నాయకత్వంపై విశ్వాసంతోనే పార్టీలో చేరానని, రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్సార్‌సీపీలోనే ఉంటానని తెలిపారు. పార్టీలో అందరూ మమ్మల్ని గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ కోసం ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు కష్టపడ్డారని.. అందరం కలిసి పార్టీ కోసం పనిచేస్తామని చెప్పారు. పార్టీ మారే అవసరం లేదని, రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్ జగన్ వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. (చదవండి: ‘పశ్చిమ’లో టీడీపీకి ఎదురుదెబ్బ..)