
సాక్షి, గుంటూరు: ‘ఈనాడు’ తప్పుడు రాతలను వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ముంబై నటికి వేధింపుల కేసులో తన పేరు ప్రస్తావనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు.
‘మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న హత్యలు, దౌర్జన్యాలు, దాడులు, ఆస్తుల విధ్వంసంతో అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం కూటమి ప్రభుత్వం, దానికి సంబంధించిన మీడియా కొత్త పన్నాగం మొదలు పెట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయడం, ఆ పార్టీ నాయకుల వ్యక్తిత్వ హననం లక్ష్యంగా అవాస్తవ కథనాలు రాస్తున్నారు. ఆ తర్వాత వాటిని పట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు.’’ అని సజ్జల మండిపడ్డారు.
‘‘ముంబై నటికి వేధింపులు. సజ్జల సహాయం’.. ‘అంటూ ఈనాడు పత్రిక రాసిన కథనం కూడా ఆ కోవలోనిదే. ఆ పత్రిక రాసిన కథనాన్ని పట్టుకుని టీడీపీ, ఆపార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, మరికొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ కథనం పూర్తిగా అవాస్తవం. అసంబద్ధం. అన్యాయంగా, అడ్డగోలుగా రాశారు. నా ప్రతిష్టను దెబ్బ తీసేలా ఇలాంటి కథనం రాసినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాను’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment