ప్రత్యర్థుల విష ప్రచారాన్ని గట్టిగా ఎదుర్కోవాలి: సజ్జల | Sajjala Ramakrishna Reddy: YSRCP Workshop On Media Communications | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థుల విష ప్రచారాన్ని గట్టిగా ఎదుర్కోవాలి: సజ్జల

Published Fri, Jan 24 2025 7:21 PM | Last Updated on Fri, Jan 24 2025 7:34 PM

Sajjala Ramakrishna Reddy: YSRCP Workshop On Media Communications

సాక్షి, తాడేపల్లి: ఆత్మవిశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం.. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా కమ్యూనికేషన్‌పై వర్క్‌షాపు నిర్వహించారు. మీడియా అంశాలపై పార్టీ క్రియాశీల కార్యకర్తలు, నేతలకు శిక్షణ ఇచ్చారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యక్తిత్వ వికాస నిపుణులు వంగీపురం శ్రీనాధాచారి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, తాజా పరిణామాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని.. సమర్థ వాదనతో ప్రజల్లో సానుకూలత సాధించాలన్నారు. ప్రత్యర్థులు చేసే విషప్రచారాన్ని గట్టిగా ఎదుర్కోవాలని సజ్జల చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement