workshop
-
ప్రతిపక్షంగానే కాదు.. ప్రజాపక్షంగా పోరుకు సిద్ధం
సాక్షి, తాడేపల్లి: వర్క్‌షాప్ సక్సెస్‌తో వైఎస్సార్సీపీలో మరింత జోష్ పెరిగింది. ప్రతిపక్షంగానే కాదు.. ప్రజాపక్షంగా పోరుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు సర్కార్‌పై పోరాటానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడీ అయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భదత్రలు అదుపు తప్పగా, బాధితులకు అండగా నిలిచేందుకు ఎక్కడిక్కడ ప్రత్యేక టీములు ఏర్పాటు చేశారు.రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి దశలోనూ పార్టీ పటిష్ట నిర్మాణం దిశగా, గ్రామ, బూత్ కమిటీలతో పాటు అనుబంధ విభాగాల ఏర్పాటు చేశారు. ప్రజల కోసం పార్టీ పిలుపునిస్తే ఉవ్వెత్తున స్పందించేలా బలోపేతం చేశారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు.‘‘మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. మనం చొరవ తీసుకుని అన్ని అంశాలపై స్పందించాలి. గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలపై స్పందించాలి. అన్యాయాలపై స్పందించాలి. బాధితులకు అండగా నిలవాలి. మనవైపు నుంచి స్పందన లేకపోతే ఆ అంశం మరుగున పడుతుంది. ప్రజలకు న్యాయం జరగదంటూ నిన్న(గురువారం) జరిగిన వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌లో వైఎస్ జగన్ స్పష్టం చేశారు.మరోవైపు, చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో చర్చ మొదలైంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిగిన మంచిని జనం గుర్తు చేసుకుంటున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వంపై కనిపిస్తోంది. ఒకవైపు హామీల అమలు లేకపోగా, మరోవైపు రాష్ట్రంలో పాలన దారుణంగా తయారైంది. దాదాపు రూ.2,400 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఆస్పత్రులు నిర్వీర్యం అయ్యాయి. ఎక్కడ చూసినా స్కాంలే కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: బలంగా ఎదుగుదాం.. పార్టీని పటిష్టంగా నిర్మిద్దాం: వైఎస్ జగన్ -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్ధాయి వర్క్ షాప్ (ఫొటోలు)
-
వీకెండ్ ఆర్ట్.. వారాంతాల్లో కళాత్మకతకు పదును!
పాటరీ వర్క్‌షాప్స్: ఈ మధ్య కాలంలో పాటరీ వర్క్‌షాప్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి. మొత్తని మట్టితో చిన్న చిన్న కళాకృతమైన కుండలు, బొమ్మలు, ఇంట్లో అలంకార వస్తువులను తయారు చేయడంపై శిక్షణ అందిస్తారు. గ్రామీణ మూలాల్లోంచి కొనసాగుతున్న కళ కావడం, అంతేగాకుండా ఈ పాటరీకి ప్రస్తుతం మార్కెట్లో మంచి ఆదరణ ఉండటంతో ఈ వర్క్‌షాప్స్‌కు ఔత్సాహికులు నిండిపోతున్నారు. తయారు చేసే సామాగ్రి, పనిముట్లు తదితరాలను నిర్వాహకులే సమకూరుస్తున్నారు.మ్యూజిక్ సైన్స్..సంగీతాన్ని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదేమో.. అయితే.. ఈ సంగీతాన్ని ఆస్వాదించడం పోయి వాయించడం అభిరుచిగా మార్చుకుంటున్నారు నగరవాసులు. గిటార్, వయోలిన్, డ్రమ్స్, ఫ్లూట్ ఇలా ఏదో ఒక సంగీత వాయిద్యంపై పట్టు పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఓ వైపు ఐటీ జాబ్స్ చేస్తూనే ఇలాంటి ఆర్ట్స్‌పై అవగాహన పెంచుకుంటూ మ్యూజిక్ బ్యాండ్స్‌లో సైతం సభ్యులుగా మారుతున్నారు. వీటి శిక్షణ కోసం పలు సంగీత శిక్షణ కేంద్రాలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖా ఆధ్వర్యంలోని కేంద్రాలు సైతం ఉన్నాయి.థియేటర్ ఆర్ట్స్..కొంతకాలంగా సిటీలో థియేటర్ ఆర్ట్స్‌కు ఔత్సాహికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నటనలో, నాటకాల్లో శిక్షణ పొందుతూ.. థియేటర్ ప్లేలు ప్రదర్శిస్తూ వినూత్న ఒరవడికి నాంది పలుకుతున్నారు. వీటి కోసం రవీంద్రభారతి, తెలుగు యూనివర్సిటీ కళాప్రాంగణం, రంగభూమి వంటి వేదికలు ఆవకాశాలను కలి్పస్తున్నాయి. రంగస్థలంపై రాణించిన యువతకు సినిమాల్లో అవకాశాలు సైతం వస్తుండటంతో థియేటర్ ఆర్ట్స్ మోడ్రన్ యాక్టివిటీగా మారింది. అన్ని రంగాల్లో జాబ్స్ చేస్తున్న వారు ఇందులో భాగస్వామ్యం అవుతుండటం విశేషం.గార్డెనింగ్.. మోడ్రన్ ఆర్ట్..ఈ మధ్య మొక్కలు పెంచడం కూడా ఓ కళగా మారింది. ఇందులో ఇంటీరియర్, ఎక్స్టీరియర్, టెర్రస్ గార్డెనింగ్ అంటూ విభిన్న రకాలుగా ఉన్నాయి. నగరంలోని కొందరు మొక్కల ప్రేమికులు సోషల్ యాప్స్‌లో గ్రూపులుగా మారి ఈ గార్డెనింగ్పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా నగర జీవనశైలి దృష్ట్యా టెర్రస్ గార్డెనింగ్ ఔత్సాహికలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ప్రత్యేకంగా మీట్స్ ఏర్పాటు చేసుకుని మొక్కలను, వాటి విత్తనాలను ఒకరికొకరు పంచుకుంటున్నారు. ఇదే వేదికలుగా ప్లాంటేషన్‌పై అనుభవజు్ఞలు, నిపుణులచే అవగాహన పొందుతున్నారు.నిత్యం ఒత్తిడి పెంచే సిటీ లైఫ్‌లో గార్డెనింగ్ అనేది వినూత్న కళగా అవతరించింది. ఇవేకాకుండా పెయింటింగ్, రెసిన్ ఆర్ట్స్, హ్యండ్ క్రాఫ్ట్, పేపర్ క్రాఫ్ట్, మైక్రో ఆర్ట్స్, జుంబా వంటి విభిన్న కళా అంశాలపై శిక్షణ పొందుతూ తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. వారి కళాత్మకతను సోషల్ మీడియా వేదికగా రీల్స్, షేర్లు, పోస్టులతో ప్రమోట్ చేసుకుంటూ సోసల్ సెలబ్స్గా మారుతున్నారు. -
'మనం' చాక్లెట్ తిన్నామంటే.. మైమరిచిపోవాలంతే!
సాక్షి, సిటీబ్యూరో: మీకు చాక్లెట్లంటే ఇష్టమా..? అసలు చాక్లెట్లు చూస్తేనే నోరూరుతుందా..? డిఫరెంట్ చాక్లెట్లను టేస్ట్ చేయడం మీకు అలవాటా? అయితే మీరు తప్పకుండా నగరంలోని ‘మనం’ చాక్లెట్ కార్ఖానాను ఒక్కసారైనా సందర్శించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ దాదాపు 60కి పైగా వెరైటీ చాక్లెట్లు నోరూరిస్తుంటాయి. ఒకే దగ్గర పెరిగిన కోకో చెట్ల నుంచి తయారైన చాక్లెట్లను వీరు విక్రయిస్తున్నారు.టైమ్ మ్యాగజైన్ జాబితాలో చోటు..ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల’ జాబితాను ప్రచురించింది. ఆయా రంగాలతో పాటు ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిచే 100 అద్భుతమైన ప్రదేశాలు, కంపెనీలను ఇందులో చేర్చింది. హోటళ్లు, క్రూజ్‌లు, రెస్టారెంట్స్, పర్యాటక స్థలాలు, మ్యూజియాలు, పార్క్‌లను గుర్తించింది. పలు మార్గాల్లో స్వదేశీ పదార్థాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు మనం చాక్లెట్ కార్ఖానా పనిచేస్తోందని కొనియాడింది.అంతర్జాతీయ గుర్తింపు..భారత్‌లో పండించిన కోకోతో చాక్లెట్ల తయారీకి ‘మనం చాక్లెట్’ ప్రసిద్ధి పొందింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఈ సంస్థ ఉత్పత్తులకు ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఇక్కడ తయారైన చాక్లెట్లకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. 2023 ఆగస్టులో మనం చాక్లెట్ కార్ఖానాను ముప్పల చైతన్య స్థాపించారు. ఆల్మండ్ హౌజ్ మిఠాయి దుకాణం వీరి కుటుంబానికి చెందినది కావడం విశేషం.ఎన్నో రకాల వెరైటీలు.. డార్క్ చాక్లెట్లు, చాక్లెట్ ట్యాబ్లెట్స్, స్నాక్స్, ఒకే ప్రదేశంలో పండించినవి, అంతర్జాతీయంగా పండించిన కోకో నుంచి తయారైనవి, పాల మిశ్రమంతో చేసినవి ఇలా ఎన్నో రకాల వెరైటీ చాక్లెట్లు ఈ కార్ఖానాలో లభిస్తుంటాయి. పండ్లు, ప్లేన్, వీగన్ వంటి చాక్లెట్ల రకాలు కూడా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన పది రకాల చాక్లెట్లను అవార్డులు కూడా వరించాయి.వర్క్‌షాప్స్‌తో పిల్లలకు నేరి్పస్తూ..చాక్లెట్ల తయారీలో మనం చాక్లెట్ కార్ఖానా అప్పుడప్పుడూ వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటుంది. సొంతంగా క్లస్టర్లు, కేక్ పాప్స్ తయారు చేసే విషయంలో పిల్లలకు శిక్షణ కూడా ఇస్తుంటుంది. కొన్నిసార్లు అసలు చాక్లెట్లు ఎలా తయారు చేస్తారో తెలుసుకునేలా టూర్ కూడా ఏర్పాటు చేస్తుంటారు. చాక్లెట్ కుకీస్, చాక్లెట్ ఇంక్లూజన్ స్లాబ్స్ తయారీలో 5–10 ఏళ్ల పిల్లలకు మెళకువలు నేర్పిస్తుంటారు.ఇవి చదవండి: అంతా స్మార్ట్.. ఆరోగ్యంపై ముందస్తు సమాచారం! -
మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో.. ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్..
ఇంటి పనులతోనే రోజంతా గడిచిపోతుంటుంది. అభిరుచిని మెరుగుపరుచుకోవాలన్నా సమయమే సరిపోదనిపిస్తుంది. కానీ, కొందరు మాత్రమే ఉన్న కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమతోపాటు మరికొందరికి ఉపాధి అవకాశాలను అందిస్తుంటారు. ఈ కోవకే చెందుతారు సవిత ఆలంపల్లి. తెలంగాణలోని జహీరాబాద్ వాసి అయిన సవిత కాటన్ ఫ్యాబ్రిక్‌పైన సహజసిద్ధమైన పువ్వులు, ఆకులతో సహజమైన ప్రింట్లను తీసుకువస్తుంది. అదే ఫ్యాబ్రిక్‌ని ఉపయోగిస్తూ మోడ్రన్ డ్రెస్సులను డిజైన్ చేస్తోంది. వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ, బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేసి, సెల్ఫ్ మేడ్ బిజినెస్ ఉమన్‌గా తనని తాను నిరూపించుకుంటుంది. ఆసక్తిని ఉపాధిగా మలుచుకునేందుకు చేసిన ప్రయాణంలో తాను వేసిన అడుగుల గురించి ఆనందంగా వివరించింది.‘‘డిగ్రీ వరకు చదువుకున్న నేను పెళ్లయ్యాక మావారు రామకృష్ణతో కలిసి అమెరికాకు వెళ్లాను. గృహిణిగానే కొన్నాళ్లు ఉండిపోయాను. న్యూయార్క్ ఎఫ్ఐటిలో ఫ్యాషన్ డిజైనింగ్‌కి సంబంధించిన కోర్స్ చేశాను. పదేళ్ల క్రితం ఇండియా వచ్చి బెంగళూరులో స్థిరపడ్డాం. రోజంతా ఇంటిపనులు, పిల్లల పనులు ఉన్నా నా కోసం కొంత సమయాన్ని కేటాయించుకునేదాన్ని.ఫాస్ట్ ఫ్యాషన్‌లో ఉపయోగించే ఫ్యాబ్రిక్ తీవ్రమైన కాలుష్యానికి గురి చేస్తుందని తెలుసుకున్నాను. అప్పటినుంచి నా వంతుగా ఏదైనా చేయాలనుకుని ప్రయత్నాలు చేస్తుండేదాన్ని. ఫ్లోర్ క్లీనర్స్, సుగంధ ద్రవ్యాలు వంటివి ఇంట్లో తయారు చేస్తుండేదాన్ని. వాటివల్ల ఇంట్లో వాళ్లు కూడా చాలా మెచ్చుకునేవారు. ఎకో ప్రింటింగ్, సస్టెయిన్‌బుల్ ఫ్యాబ్రిక్స్ పైన వర్క్ చేయడం మొదలుపెట్టాను. ప్రకృతి ద్వారా లభించే వస్తువులతో రోజూ ఏదో ఒక ప్రయోగం చేస్తుండేదాన్ని. ఆకులు – పువ్వులు..పూజలు, ఇతర సంప్రదాయ వేడుకలలో పువ్వులు, ఆకులను కూడా ఉపయోగిస్తుంటాం. సాధారణంగా వాటిని ఉడకబెట్టి, టై అండ్ డై చేస్తుంటారు. నేను వాటిని ఎండబెట్టి, కొన్నింటిని తాజాగా ఉన్నప్పుడే ఫ్యాబ్రిక్ మీద చల్లి, దగ్గరగా చుట్టి, కొన్ని రోజులు అలాగే ఉంచి ప్రయోగాలు చేసేదాన్ని. ప్రయత్నాలు చేయగా చేయగా ఫ్యాబ్రిక్‌పైన రకరకాల డిజైన్స్ అమితంగా నన్ను ఆకట్టుకున్నాయి. మోదుగ, శంఖపుష్ప, పారిజాత.. వంటివే కాదు అరుదుగా పూసే పువ్వులనూ సేకరిస్తాను. వాటిని ఎండబెట్టి నిల్వ ఉంచుతాను. మామిడి, జామ, మందార ఆకులనూ డిజైన్‌కు వాడుతుంటాను. ఏ మాత్రం రసాయనాలు లేని ప్రయోగం ఇది.ఇంటి నుంచి స్టూడియో వరకు..రసాయనాలతో పండించే పత్తి కాకుండా వర్షాధార పంటద్వారా వచ్చే కాటన్ ఫ్యాబ్రిక్‌ను కలెక్ట్ చేసి, నా ప్రయత్నాలను ఇంకా విరివిగా చేయడం మొదలుపెట్టాను. సస్టెయిన్‌బుల్ డ్రెస్సులు అంటే చాలావరకు వదులుగా ఉండే దుస్తులు అనుకుంటారు. కానీ, మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్ చేయాలనుకున్నాను.కార్పొరేట్ ఉమెన్‌కు నప్పే విధంగా, అలాగే టీనేజ్ కలెక్షన్స్ కూడా ప్రిపేర్ చేస్తుంటాను. ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్, ప్రింటింగ్.. డ్రెస్సులు ధరిస్తే ఒంటికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉన్నామన్న అనుభూతి సొంతం అవుతుంది. ఏడెనిమిదేళ్లుగా సస్టెయినబిలిటీ మీద రకరకాల ప్రయోగాలు చేసి, ఐదేళ్ల క్రితం ‘టింక్టోరియా’ పేరుతో బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేశాను. ఆకులలో ఉండే జీవాన్ని టింక్టోరియా అంటారు.దానిని ఫ్యాబ్రిక్ మీదకు తీసుకురావాలని చేసిన ప్రయత్నం కాబట్టి అదే పేరును నా డిజైన్స్‌కు పెట్టాను. ఇంటినుంచి స్టూడియోదాకా మారేందుకు చేసిన రకరకాల ప్రయోగాల వల్ల ఇప్పుడు నాతోపాటు మరో ఐదుగురు మహిళలకు ఉపాధి అవకాశాలు లభించాయి. మేమంతా కలిసి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌కు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం పని చేస్తుంటాం.అవగాహనకు వర్క్‌షాప్స్..ఎకోప్రింటింగ్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి హైదరాబాద్, బెంగళూరు ఇతర క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్లలో ఉచితంగా వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాను. స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటాను. అక్కడి వచ్చి, ఆసక్తితో నేర్చుకుంటాను అనేవారు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ప్రింటింగ్ ్రపాసెస్ అడుగుతుంటారు. చాలా మందికి ఆకులతోనూ, పువ్వులతోనూ డిజైన్ చేస్తారని తెలియదు. ఈ డిజైన్ ఉతికితే పోతుందేమో అనుకుంటారు. కానీ, సరైన విధంగా చేస్తే రంగు ఏ మాత్రం పోదు.ముందు కుంకుడుకాయ రసంతో ఫ్యాబ్రిక్‌ను శుభ్రం చేస్తాం. ఆ తర్వాత ఆకులను, పువ్వులను అనుకున్న డిజైన్స్‌లో అమర్చి, దగ్గరగా చుట్టి, ఆవిరిమీద ఉంచుతాం. ఆ తర్వాత బయటకు తీసి, ఒకరోజంతా అలాగే ఉంచుతాం. ఆ తర్వాత పూర్తిగా విప్పి, క్లాత్‌ని శుభ్రం చేస్తాం. సరైన డిజైన్ రావడానికి 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. షిబోరి, టై అండ్ డై, కలంకారీ డిజైన్స్‌తోపాటు నేతకారులతో ముందే మాట్లాడి ఫ్యాబ్రిక్ డిజైన్‌లో మోటిఫ్ ప్రింట్స్ వచ్చేలా గైడెన్స్ ఇస్తుంటాను.కొన్ని రకాల ఆకులు, పువ్వుల ప్రింటింగ్‌లో థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది. ప్రకృతిపైన ప్రేమ, ఇష్టంతో నన్ను నేను కొత్తగా మార్చుకునే క్రమంలో ఎంచుకున్న మార్గం ఇది. ఇంట్లో వాడాల్సిన కెమికల్స్ స్థానంలో ఏ మాత్రం రసాయనాలు లేని వస్తువులను తయారు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాను. ఈ విధానం వల్ల ఐదారేళ్లలో నాదైన ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నాను అనిపిస్తుంది’ అని ఆనందంగా వివరిస్తారు సవిత. – నిర్మలారెడ్డిఇవి చదవండి: Devika Manchandani: పాకశాస్త్ర ప్రవీణ! వంటలపై ఇష్టం ఎక్కడిదాకా వెళ్లిందంటే? -
నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించండి
సంగారెడ్డి అర్బన్: విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ ఐఐటీలో బీవీఆర్ మోహన్‌రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫౌండేషన్ వీక్ సెలబ్రేషన్లో భాగంగా 3 రోజుల వర్క్‌షాప్‌ను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ ఇలాంటి ఆసక్తికరమైన కార్యక్రమాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు పొందడమే కాక ఇతరులకు ఉద్యోగాలు కల్పించేస్థాయికి ఎదగాలన్నారు. ప్రస్తుత తరం విద్యార్థులు చాలా ప్రతిభావంతులైన, వినూత్నమైన ఆలోచనలు, సాంకేతికతను కలిగి ఉన్నారని, ఇది గొప్ప శుభపరిణామమన్నారు. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో బీవీఆర్ మోహన్‌రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ కీలకపాత్ర పోషిస్తోందని అభినందించారు. కార్యక్రమంలో సైంట్ డెవలప్మెంట్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఐఐటీ–హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం.ఎల్ల, భారతదేశంలోని ప్రముఖ సాంకేతిక సంస్థల నుంచి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నాణ్యతతోనే ఉన్నత స్థానానికి
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు అత్యుత్తమ నాణ్యతా ఉత్పత్తులు, సేవలు సాయపడతాయని కేంద్ర వాణిజ్య, ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రమాణాలు అనేవి పటిష్టమైన వ్యవస్థకు మద్దతుగా నిలవాలన్నారు. వీటిని భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల తర్వాతే అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వర్క్‌షాప్‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. దేశ వాణిజ్యం, ఎగుమతులకు ప్రమాణాలు అనేవి మూలస్తంభంగా పేర్కొన్నారు. ఆవిష్కరణలు, సామర్థ్యం జాతీయ వృద్ధికి మద్దతుగా నిలుస్తాయన్నారు. సుస్థిరత, నకిలీ ఉత్పత్తుల కట్టడి, ఎంఎస్ఎంఈలకు మద్దతు, స్టార్టప్‌లు మరింత పోటీనిచ్చేందుకు వీలుగా.. ప్రమాణాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత బీఐఎస్ సాంకేతిక కమిటీ సభ్యులపై ఉందన్నారు. భారతీయ ప్రమాణాలు ఆధునిక టెక్నాలజీ పురోగతికి అనుగుణంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు ఉండేలా చూడాలని కోరారు. అప్పుడే ప్రపంచానికి తయారీ కేంద్రంగా, స్వావలంబన భారత్‌గా మారాలన్న స్వప్నం సాకారమవుతుందన్నారు. బీఐఎస్‌లో 400 స్టాండింగ్ కమిటీలు భారత ప్రమాణాల రూపకల్పన బాధ్యతను చూస్తుంటాయి. -
ఎగుమతుల ప్రోత్సాహకానికి సమావేశాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే మార్గాలపై అవగాహన పెంచేందుకు నెలవారీ వర్క్‌షాప్‌లను నిర్వహించాలని నిర్ణయించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. వర్క్‌షాప్‌ల ద్వారా విదేశాలకు సరుకు రవాణా, పోస్టల్, కస్టమ్స్ సమ్మతి, చెల్లింపులకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతిపాదిత వర్క్‌షాప్‌లు ప్రతి నెల మొదటి వారంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారు. సాధ్యమయ్యే చోట వ్యక్తిగతంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అనుభవాలను పంచుకోవడానికి, కొత్త వ్యవస్థాపకులకు సలహా ఇవ్వడానికి ప్రముఖ ఈ–కామర్స్ ఎగుమతిదారులను ఆహా్వనించినట్టు వెల్లడించింది. -
వ్యర్థాల ద్వారా ఏటా 65 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి!
న్యూఢిల్లీ: భారీ మొత్తంలో వెలువడుతున్న వ్యర్థాలను వినియోగించుకుని భారత్ వార్షికంగా 65 గిగావాట్ల (జీడబ్ల్యూ) విద్యుత్ ఉత్పత్తిని సాధించగలదని ఈ రంగంలో నిపుణులు అంచనావేస్తున్నారు. ఇది 2030 నాటికి 165 గిగావాట్లకు, 2050 నాటికి 436 గిగావాట్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా వారు విశ్లేషించారు. వేస్టేజ్ నిర్వహణపై ఇక్కడ రెండు రోజుల వర్క్‌షాపు జరిగింది. వర్క్‌షాపులో వెల్లడైన అంశాల ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం 65 మిలియన్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ పరిమాణం 2030 నాటికి 165 మిలియన్ టన్నులకు, 2050 నాటికి 436 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. మునిసిపల్ చెత్తలో 75–80 శాతమే సమీకరణ జరుగుతోంది. ఇందులో 22 నుండి 28 శాతం మాత్రమే ప్రాసెస్ జరిగి, శుద్ధి అవుతోంది. తగిన రీతిన వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి జరిగే వ్యవస్థ రూపొందితే.. పర్యావరణ పరిరక్షణలో ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. -
జెడ్పీ చైర్మన్, ఎంపీపీ పదవులకు ప్రత్యక్ష ఎన్నిక!
సాక్షి, అమరావతి : జెడ్పీ చైర్పర్సన్, మండలాధ్యక్ష పదవులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికల నిర్వహణపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. అవసరమైతే రాజ్యాంగంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఉద్దేశించిన ఆర్టికల్ 243 (సీ) క్లాజ్ 5 (బీ)కి సవరణలు చేయాలని ఆలోచన చేస్తోంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం ఉండే అన్ని వర్గాల ప్రతినిధులతో చర్చించేందుకు వచ్చే నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని జాతీయ పంచాయతీరాజ్ శిక్షణ సంస్థలో ఈ ప్రత్యేక వర్క్‌షాప్ జరుగుతుంది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ సెక్రటరీ చంద్రశేఖర్‌కుమార్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌లు), పంచాయతీరాజ్ శాఖ విభాగాధిపతులకు ఇటీవల లేఖలు కూడా రాశారు. కేంద్రం సవరణ చేసినా, సగం రాష్ట్రాలు ఆమోదం తర్వాతే అమల్లోకి ఒకవేళ.. కేంద్రం ఇప్పుడు దేశమంతటా జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ పదవులకు ప్రత్యక్ష విధానంలో ఎన్నుకొనేలా రాజ్యాంగ సవరణ చేసినా.., అది అమలులోకి రావాలంటే సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాలని పంచాయతీరాజ్ శాఖ అదికారులు చెప్పారు. అన్ని దశల ప్రక్రియ పూర్తవడానికి చాలా కాలం పడుతుందని తెలిపారు. రాష్ట్రం నుంచి 9 మంది.. అన్ని రాష్ట్రాల నుంచి 261 మంది.. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని సూచనలు చేసేందుకు అన్ని రాష్ట్రాల నుంచి జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ, గ్రామ పంచాయతీ సర్పంచుల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేయాలని కేంద్రం లేఖలో పేర్కొంది. వీరితో పాటు రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖ అధికారులు, జెడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలు (చాలా రాష్ట్రాల్లో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ – బీడీవోలు అంటారు), రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ శాఖ శిక్షణ సంస్థ ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం 9 మంది హాజరవనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మొత్తం 261 మంది పాల్గొనాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 1995కి ముందు ఆ పదవులకు రాష్ట్రంలోనూ ప్రత్యక్ష ఎన్నికలే.. రాష్ట్రంలో ప్రస్తుతం జెడ్పీ చైర్మన్, మండలాధ్యక్షులను పరోక్ష పద్ధతిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎన్నుకొంటున్నారు. 1995కి ముందు కొంతకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పదవులకు ప్రత్యక్ష పద్దతిలోనే నేరుగా ప్రజలే ఎన్నుకొనేవారు. స్థానిక సంస్థలకు ప్రత్యేకాధికారాలు కల్పిస్తూ 1994లో కేంద్రం తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఈ ఎన్నికల విధివిధానాల్లో మార్పులు చేశారు. దాని ప్రకారం పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని నిర్దేశించారు. గ్రామ పంచాయతీలలో సర్పంచి పదవులకు మాత్రం రాష్ట్రాల ఇష్టానుసారం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకోవచ్చని కేంద్రం ఆ సవరణల్లో పేర్కొంది. ఈ సవరణల మేరకు అన్ని రాష్ట్రాలు రాష్ట్రస్థాయిలో కొత్త పంచాయతీరాజ్ చట్టాలను తీసుకొచ్చాయి. ఆ మేరకు మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచిని ప్రత్యక్ష విధానంలో, జెడ్పీ చైర్పర్సన్, మండలాధ్యక్షులను పరోక్ష పద్ధతిలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ద్వారా ఎన్నుకొనేలా 1995లో కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిం ది. -
పంచాయతీ రాజ్ ప్రాముఖ్యాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోలేదు
చండీగఢ్: దేశానికి పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎంత అవసరమైందో స్వాతంత్య్రం వచి్చన నాలుగు దశాబ్ధాల తర్వాత కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోయిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థల బలోపేతానికి అప్పటి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. జిల్లా పంచాయతీ వ్యవస్థను సైతం కాంగ్రెస్ పాలకులు గాలికి వదిలేశారని మండిపడ్డారు. ‘ఫలితంగా దేశ జనాభాలో గ్రామాల్లో నివసించే మూడింట రెండొంతుల మంది కనీస సౌకర్యాలైన రహదారులు, విద్యుత్, మంచినీరు, పక్కా ఇళ్లు వంటి వాటికి కూడా నోచుకోలేకపోయారు. ఈ నిర్లక్ష్యం ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిన ఏడు దశాబ్దాలకు కూడా దేశంలోని సుమారు 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం సమకూరలేదు’ అని ఆయన అన్నారు. ఇందుకు జమ్మూకశీ్మరే ప్రత్యక్ష సాక్ష్యమని చెప్పారు. ఫరీదాబాద్‌లోని సూరజ్‌కుండ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘హరియాణా క్షేత్రీయ పంచాయతీ రాజ్ పరిషత్’ రెండు రోజుల వర్క్‌షాప్‌ను సోమవారం ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించి ప్రసంగించారు. అమృత్ కాల్ తీర్మానాల సాధనకు, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం దిశగా నేడు భారత్ ఐక్యంగా ముందుకు సాగుతోందని ప్రధాని చెప్పారు. ఆగస్ట్ 9వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం రోజున యావత్ దేశం ‘అవినీతి..ఆశ్రిత పక్షపాతం.. బుజ్జగింపు రాజకీయాలు క్విట్ ఇండియా’ అని ఐక్యంగా నినదించాలన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి ఇంటికీ చేరేందుకు జిల్లా పరిషత్ సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష కూటమిపై ప్రధాని విసుర్లు ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి భారత్ ప్రగతికి ప్రతిబంధకంగా, ప్రమాదకరంగా మారిందని ప్రధాని అన్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో సోమవారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవాలనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. -
AP: ముగిసిన జీ20 సదస్సు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా మార్చి 28 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించిన జీ 20 దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సదస్సు శుక్రవారంతో ముగిసింది. ఇండియా ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో ‘రేపటి ఆర్థిక నగరాలు – అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన అవకాశాలు’పై ప్రధానంగా సదస్సు జరిగింది. 14 సభ్య దేశాలు, ఎనిమిది అతిథి దేశాలు, పది అంతర్జాతీయ సంస్థలకు చెందిన 57 మంది ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. యూఎన్డీపీ, ఓఈసీడీ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు, ఏడీబీ, ఈబీఆర్డీ లాంటి అంతర్జాతీయ సంస్థల నిపుణులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ సదస్సుకు అధ్యక్షత వహించారు. నగరాలను ఆర్థిక కేంద్రాలుగా తీర్చిదిద్దడం, పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను పెంచడంపై సదస్సులో చర్చించారు. రెండో రోజు సాగర తీరంలో యోగా, ధ్యానంతో పాటు పౌష్టికాహార వినియోగంపై నిపుణులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ (క్యూఐఐ) సూచికల అన్వేషణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయంపై డేటాను క్రోడీకరించడంపై సమగ్రంగా చర్చించారు. మూడో రోజు కెపాసిటీ బిల్డింగ్‌పై వర్క్‌షాపు నిర్వహించారు. కొరియా, సింగపూర్‌లకు చెందిన నిపుణులు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్‌లో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు, పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన జీవన విధానంపై చర్చించారు. నాలుగో రోజు శుక్రవారం దేశంలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఆఖరి రోజు ‘జన్ భగీదారి’.. జీ 20 సదస్సు చివరి రోజు జన్ భగీదారీ కార్యక్రమం ఏర్పాటు చేయడం రివాజు. ఇందులో భాగంగా ఆతిథ్య దేశంలోని స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాల వీసీలు, విద్యార్థులతో వర్క్‌షాపు నిర్వహిస్తారు. శుక్రవారం వర్క్‌షాపులో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ, హర్యానా, మణిపూర్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్, తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలి, డామన్ డయ్యూలకు చెందిన మున్సిపల్ కమిషనర్లు, పట్టణాభివృద్ధి శాఖల డైరెక్టర్లు 80 మంది పాల్గొన్నారు. వీరితో పాటు వీసీలు, ఫ్రొఫెసర్లు, విద్యావేత్తలు, విద్యార్థులు కూడా హాజరయ్యారు. సుస్థిరాభివృద్ధి దిశగా.. తొలిరోజు సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జీ 20 దేశాల ప్రతినిధులతో సమావేశమై పలు సూచనలు చేశారు. మౌలిక సదుపాయాల రంగంపై చర్చించడం మంచి పరిణామమని చెప్పారు. సుస్థిరాభివృద్ధి దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేస్తున్నామని, లక్షలాది గృహాలను నిర్మిస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. ఆత్మీయ ఆతిథ్యం.. విశాఖలో తొలిసారిగా జరిగిన జీ 20 సదస్సును రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. దేశ విదేశాల నుంచి అతిథులు హాజరైన నేపథ్యంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దింది. 2,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు కల్పించింది. ఆంధ్రా, భారతీయ వంటకాలను వడ్డించడంతోపాటు తెలుగు సంప్రదాయ పద్ధతుల్లో ఆత్మీయ స్వాగతం పలికింది. తెలుగు వైభవాన్ని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. -
స్థిరమైన ఆర్థిక నగరాల నిర్మాణం..విశాఖలో క్షేత్రస్థాయి పరిశీలన
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్తులో స్థిరమైన ఆర్థిక నగరాల నిర్మాణంపై జీ–20 దేశాల ప్రతినిధులు తమతమ వ్యూహాలను సమర్పించారు. విశాఖపట్నంలో జరుగుతున్న జీ–20 దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సమావేశాల్లో మూడోరోజైన గురువారం ‘సామర్థ్య నిర్మాణం’పై వర్క్‌షాపును ఇండియన్ ప్రెసిడెన్సీ, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సదస్సులో జీ–20 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఫైనాన్సింగ్‌లలో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను చర్చించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానిక ప్రభుత్వాలు సమగ్ర, స్థిరమైన నగరాల కోసం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఆర్థిక సాయం చేయడానికి అవసరమైన సామర్థ్యాలపై దృష్టిసారించారు. వర్క్‌షాపు మొదటి సెషన్లో భారత్ సహా సింగపూర్, దక్షిణ కొరియా, రష్యా, చైనా, యూరోపియన్ కమిషన్ నిపుణులు తమ దేశాల్లో అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను ప్రదర్శించారు. సింగపూర్‌లోని నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ మాజీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డైరెక్టర్ జనరల్ అహ్ తువాన్‌లోహ్.. సింగపూర్ విధానాలు, సమ్మిళిత, స్థిర నగరాలను నిర్మించే వ్యూహాలను సమర్పించారు. ఇందులో డైనమిక్ అర్బన్ గవర్నెన్స్ సిస్టంతో సహా జీవించడం, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లానింగ్, అభివృద్ధి, వ్యర్థాలు, నీటి నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ, విద్య తదితర అంశాలపై వివరించారు. సెషన్ అనంతరం దక్షిణ కొరియా ప్రతినిధులు పట్టణాభివృద్ధి.. ఫైనాన్సింగ్‌లపై సవాళ్లు, ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడంపై మాట్లాడారు. తమ దేశంలోని సియోల్ నగరం ఎదుర్కొన్న నిర్దిష్ట సవాళ్లను, వాటిని తగ్గించడానికి అనుసరించిన విధానాలను, పునరాభివృద్ధికి సంబంధించిన అంశాలను సియోల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్లు ఇన్హీ కిమ్, హుయ్ షిన్లు సమర్పించారు. చైనా, రష్యా, యూరోపియన్ కమిషన్‌తో పాటు భారతదేశ ప్రతినిధులు పట్టణ మౌలిక సదుపాయాలకు ఫైనాన్సింగ్‌ను పెంచడానికి చేపట్టిన చర్యలను ఫోకస్ చేయడానికి కేస్ స్టడీస్‌ను అందజేశారు. విశాఖలో క్షేత్రస్థాయి పరిశీలన వర్క్‌షాపు అనంతరం జీ–20 దేశాల ప్రతినిధులు విశాఖ నగరంలో విజయవంతంగా నడుస్తున్న మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (వీసీఐసీడీపీ)లోని స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ పథకం, ముడసర్లోవ రిజర్వాయరులోని రెండు మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్న మెగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, జిందాల్ సంస్థ నిర్వహిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ మేనేజ్మెంట్ ప్లాంట్లను వీరు సందర్శించారు. 2023 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎజెండా కింద జరుగుతున్న చర్చలను పూర్తిచేయడానికి, ప్రాక్టికల్ లెర్నింగ్‌ను ప్రారంభించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జీ–20 దేశాల ప్రతినిధులు స్వాగతించి అభినందించారు. ఇక చివరిరోజు శుక్రవారం జరిగే సమావేశంలో దేశంలోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొంటారు. ఇందులో వీరు తమ సంస్థల్లో చేపట్టిన ప్రాజెక్టుల అనుభవాలను, విజయాలను వివరిస్తారు. అలాగే, విశాఖ పరిధిలోకి వచ్చే వీసీలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. -
రేపటి ఆర్థిక నగరాలపై సమగ్ర చర్చ
సాక్షి, విశాఖపట్నం: పట్టణాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు అందుకవసరమైన నిధుల సమీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై జీ–20 దేశాల ప్రతినిధుల బృందం సమగ్రంగా చర్చించింది. జీ–20 దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన చర్చల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ మీడియాకు వెల్లడించారు. రేపటి ఆర్థిక నగరాలు మరింత వృద్ధి చెందేందుకు తీసుకోవలసిన చర్యలు, ప్రైవేటు రంగంలోనూ పెట్టుబడులను పెంచడం వంటి అంశాలపైనా ప్రతినిధులు విస్తృతంగా చర్చించారన్నారు. ఈ సదస్సుకు 14 జీ–20 సభ్యదేశాల నుంచి 57 మంది ప్రతినిధులు, ఎనిమిది మంది ఆహ్వానితులు, పది అంతర్జాతీయ సంస్థల నుంచి మరికొంతమంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు. మిగిలిన ఆరు సభ్య దేశాల ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారని ఆయన చెప్పారు. పట్టణాలు/నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆర్థిక వనరుల కోసం వినూత్న మార్గాలను గుర్తించడం వంటి వాటిపై చర్చ జరిగిందని తెలిపారు. సమావేశాల్లో భాగంగా ఇప్పటివరకు ఏడు సెషన్లు, ఒక వర్క్‌షాపు నిర్వహించారన్నారు. అర్బన్ ప్రాంతాల్లో మౌలిక వసతులపై.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ (క్యూఐఐ) సూచికలను అన్వేషించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయంపై డేటాను క్రోడీకరించడం, ప్రైవేటు రంగానికి ఆ డేటా ఉపయోగపడేలా చేయడంపై కూడా ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారని, వీటిపై కొన్ని ప్రెజెంటేషన్లు ఇచ్చారని ఆరోఖ్యరాజ్ వివరించారు. అర్బన్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సంస్థల రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగిందన్నారు. సుపరిపాలనకు ఏ రకమైన నైపుణ్యం అవసరమవుతుందో నిపుణులు సూచనలు చేశారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో యూఎన్డీపీ, ఓఈసీడీ, ఐఎంఎఫ్, ఏడీబీ, ఈబీఆర్డీ వంటి కీలక అంతర్జాతీయ సంస్థలకు చెందిన 13 మంది నిపుణులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. గత జనవరిలో పూణేలో జరిగిన జీ–20 ఐడబ్ల్యూజీ సదస్సులో చర్చకు వచ్చిన అంశాలపై విశాఖలో బ్లూప్రింట్ ఇచ్చామన్నారు. బీచ్‌లో యోగా, ధ్యానం.. రెండో రోజు బుధవారం ఉదయం సదస్సు నిర్వహిస్తున్న రాడిసన్ బ్లూ హోటల్ సమీపంలో ఉన్న బీచ్‌లో జీ–20 దేశాల ప్రతినిధులకు యోగా, «ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై సంబంధిత నిపుణులతో నిర్వహించిన కార్యక్రమంలో సాత్విక ఆహారాన్ని పరిచయం చేశారు. రుషీకేష్‌లో మూడో సదస్సు.. జూన్ ఆఖరులో ఈ జీ–20 మూడో ఐడబ్ల్యూజీ సదస్సు రుషికేష్‌లో జరుగుతుందని ఆరోఖ్యరాజ్ వెల్లడించారు. విశాఖ సదస్సులో చర్చించిన అంశాలను పైలట్ స్టడీస్ కింద అక్కడ సమర్పిస్తారన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యం ఎంతో బాగుందని అతిథులు ప్రశంసించారని ఆరోఖ్యరాజ్ తెలిపారు. అంతేకాదు.. సదస్సు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వారి మనసు దోచుకున్నాయన్నారు. ముఖ్యంగా విశాఖ నగరంలోని తొట్లకొండ, కైలాసగిరి వ్యూపాయింట్, ఆర్కేబీచ్, సీహారియర్ మ్యూజియం, వీఎంఆర్డీఏ బీచ్‌లు అతిథులను కట్టిపడేశాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఏపీలో గృహనిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యత గురించి మంగళవారం రాత్రి అతిథులకు ఇచ్చిన గాలా డిన్నర్లో వివరించారన్నారు. నేడు, రేపు ఇలా.. ఇక గురువారం జీ–20 దేశాల ప్రతినిధుల కోసం కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాపు జరుగుతుందని ఆరోఖ్యరాజ్ చెప్పారు. కొరియా, సింగపూర్‌లకు చెందిన నిపుణులు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్‌లో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులపైన, పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన జీవన విధానంపైన చర్చిస్తారన్నారు. విశాఖ నగరంపై కూడా ఈ సమావేశంలో ప్రెజెంటేషన్ ఉంటుందని తెలిపారు. అలాగే, శుక్రవారం జరిగే సమావేశానికి దేశంలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు హాజరవుతారని చెప్పారు. -
కాజీపేటలో రైల్ వ్యాగన్ల తయారీ
సాక్షి, హైదరాబాద్: కాజీపేటకు మంజూరు కావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం ఎగ్గొట్టిందని రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతున్న సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కాజీపేటకు మంజూరై పనులు ప్రారంభించుకున్న పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ (పీఓహెచ్) స్థాయి పెంచి వ్యాగన్ల తయారీ యూనిట్‌గా మార్చాలని నిర్ణయించింది. వర్క్‌షాప్ అంచనా వ్యయం రూ.269 కోట్లు కాగా, తాజా నిర్ణయంతో దానిని రూ.521 కోట్లకు పెంచారు. ఐదు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన వార్షిక బడ్జెట్లో దీని ఊసు లేకపోవటం గమనార్హం. దీంతో బడ్జెట్ తయారీ తర్వాత కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు గూడ్స్ రైళ్లకు సంబంధించిన వ్యాగన్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు రైల్వే బోర్డు చర్యలు ప్రారంభించిందని ఓ సీనియర్ రైల్వే అధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఆ వివాదంతోనేనా.. కాజీపేటకు 1980లలో కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. దాని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న సమయంలో నాటి ప్రధాని ఇందిర హత్య జరిగింది. అప్పుడే సిక్కులపై ప్రతీకార దాడులు తీవ్రం కావటంతో పంజాబ్‌లో పరిస్థితి చేయిదాటింది. సిక్కులను చల్లార్చే క్రమంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాకు తరలించే నిర్ణయం తీసుకున్నారు. అప్పటినుంచి ఈ డిమాండ్ పెండింగులో ఉండిపోయింది. రాష్ట్ర విభజన సమయంలో దాని ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ వేస్తామన్న కేంద్రం ఆ మేరకు కమిటీ వేసింది. కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదన్న ఆ కమిటీ అభిప్రాయం మేరకు కాజీపేటకు పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ మంజూరు చేశారు. ఇది వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. రైల్వేకు ఇది రెండో యూనిట్.. దేశవ్యాప్తంగా రైల్వేకు కోచ్ ఫ్యాక్టరీలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ గూడ్సు వ్యాగన్ల తయారీకి ప్రభుత్వరంగ కేంద్రం ఒక్కటే ఉంది. కాగా కాజీపేటలో వ్యాగన్ తయారీ కేంద్రం ఏర్పాటైతే ప్రభుత్వ పరంగా రెండో యూనిట్ అవుతుంది. రైల్వే సొంత యూనిట్‌గా మారుతుంది. పవర్ మెక్–టైకిషా జేవీ అన్న సంస్థ కాజీపేట పీఓహెచ్ టెండర్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దానికి కావాల్సిన 160 ఎకరాల భూమికి గాను ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం 150 ఎకరాలను రైల్వేకు అందజేసింది. దీంతో అక్కడ వర్క్‌షాప్ ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర బడ్జెట్లో దానికి రూ.160 కోట్లు కేటాయించారు. -
గడప గడపపై వర్క్ షాప్
-
ప్రతీ గడపకూ టైం కేటాయించాల్సిందే!: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. ప్రతీ గడపకు సమయం కేటాయించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సూచించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలతో బుధవారం ఆయన నేతృత్వాన జరిగిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తీరుపై ఆయన సమీక్షించారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో మరింత సమయం గడపాలని సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ప్రజల వినతులను వెంటనే పరిష్కరించాలని, ఎక్కడా నిర్లక్ష్యం చేయొద్దని ఆయన ఆదేశించారు. ఈ క్రమంలో గడప గపడకు.. పై గత సమీక్ష కన్నా ఇప్పుడు ఫలితం మెరుగ్గా ఉందని, మరికొందరు మాత్రం తీరు మార్చుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. 175 సీట్లకు 175 కొట్టాలి. ఒక్క సీటు మిస్ కావొద్దు. ప్రతి ఇంటికి వెళ్లాలి. నెలలో కనీసం పదహారు రోజులు గ్రామాల్లో ఉండాలి. వంద శాతం ఇళ్లను కవర్ చేయాలి. ఎమ్మెల్యేగా ఓడితే గౌరవం తగ్గుతుంది. కష్టపడితే గెలుపు దక్కుతుంది. అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయగలం. ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్‌ను రీచ్ కావాలి అని ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయ కార్యకర్తలతో సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. జరుగుతున్న సంక్షేమం ప్రజలకు వివరించడంతో పాటు సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ తరుణంలో.. కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఇంకేమి చేయాలి? అనే అంశాలపై సీఎం జగన్ ప్రజా ప్రతినిధులకు ఇవాళ్టి సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఇదీ చదవండి: వలస వచ్చి మామీద పెత్తనమా.. ఎచ్చర్లలో ఎల్లో ఫైట్! -
టీపీసీసీ ’మేధో మథనం’
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ తరహాలోనే టీపీసీసీ కూడా ‘మేధో మథనం’కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వచ్చే నెల 1, 2 తేదీల్లో టీపీసీసీ కార్యవర్గం, పీఏసీ సభ్యులు, మాజీ మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో వర్క్‌షాప్ నిర్వహించాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఏఐసీసీ రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన ‘చింతన్ శిబిర్’లో చేసిన తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలుపుతారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. కుటుంబానికి ఓ టికెట్, పదవుల్లో యువకులకు పెద్దపీట, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యం అంశాలపై ఈ వర్క్ షాప్‌లో చర్చించనున్నట్టు తెలిపాయి. కాగా, ఈ వర్క్‌షాప్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరుకావట్లేదని తెలుస్తోంది. అమెరికాలో జరగనున్న ఆటా మహాసభల్లో పాల్గొనేందుకు ఆయన గురువారం అక్కడకు వెళ్తున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఈ సభల కోసం అమెరికాకు బయలుదేరనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన లేకుండానే తొలిసారి రాష్ట్రస్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ వర్క్‌షాప్‌కు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌తోపాటు రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఏఐసీసీ సూచన మేరకు అన్ని రాష్ట్రాల పీసీసీల ఆధ్వర్యంలో ఇలాంటి వర్క్‌షాప్‌లు నిర్వహించి ఉదయ్‌పూర్ తీర్మానాలకు ఆమోదం తెలిపే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్రంలోనూ నిర్వహిస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ వర్క్‌షాప్‌ను గాంధీభవన్‌లో నిర్వహించాలా లేక వేరే ప్రదేశంలోనా అన్న దానిపై టీపీసీసీ నేతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. -
మహిళా జర్నలిస్టులపై ‘టెక్ ఫాక్స్’ వేధింపులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న వేధింపులు దాడిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తమ గళం వినిపించిన మహిళా జర్నలిస్టులపై ‘టెక్ ఫాక్స్’ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది ఎవరో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. రాణా, స్వాతి లాంటి ప్రముఖ జర్నలిస్టులకు వ్యతిరేకంగా లక్షల కొద్దీ ట్వీట్స్ చేసి వేధింపులకు పాల్పడ్డారంటూ కొన్ని గణాంకాలను సభాముఖంగా చదివి వినిపించారు. ప్రశ్నించేవారిని అణచి వేసే ధోరణి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.. ఈ సందర్భంగా ముఖ్య అతిధులుగా వచ్చిన సీనియర్ జర్నలిస్టులు ధన్యా రాజేంద్రన్ (న్యూస్ మినిట్), మాలిని సుబ్రహ్మణ్యంకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టులు ‘కోర్’ విలువలు పాటించాలని . బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యూస్ రాసే జర్నలిస్టులు కోర్ (క్రెడిబిలిటీ, ఆబ్జెక్టివిటీ, రెస్పాన్సిబిలిటీ,ఎథిక్స్) విలువలను పాటించడం ద్వారానే వార్తకు సంపూర్ణత చేకూరుతుందని, సమాజంలోవారికి గౌరవం పెరుగుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మనం తక్కువోల్లం కాదు.. సానా గొప్పోల్లం ఇంతమంది జర్నలిస్టులు ఒక్క చోటికి రావడం అద్భుతం. ఏ రంగమైనా మహిళలకు ఇబ్బందులు తప్పవు. అయినా ఏ మాత్రం వెరవకుండా నిబద్ధతగా ఉండాలన్నారు. మగవారి కన్న మనం 100 శాతం ఎ క్కువ శ్రమ చేయాల్సిందే అన్నారు. మనం తక్కువోల్లం కాదు..సానా గొప్పోల్లం..ఇదే స్ఫూర్తితో పట్టుదలగా విధి నిర్వహణలో సెన్సిటివిటీగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి కొత్తగా నిర్మాణమవుతున్న సెక్రటేరియట్లో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గదిని కేటాయించేలా కృషి చేస్తానని కవిత హామీనిచ్చారు. అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌తో మాట్లాడి మీడియా సంస్థల్లో మహిళలపై వేధింపులు, వివక్షను నిరోధించే కమిటీలు వేయించేందుకు ప్రయత్నిస్తా అన్నారు. అంతేకాదు జర్నలిస్టులకు సంబంధించిన కమిటీలలో ఆడవారి ప్రాతినిధ్యం లేదని అర్థమవుతోందని, ఇకపై వారి ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తపడాలని అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణకు సూచించారు. ఏప్రిల్ 23, 24 తేదీల్లో ఈ వర్క్‌షాప్‌లో ముగింపు సమావేశంలో విద్యావేత్త, ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ జనాన్ని జాగృతం చేయగలిగే సత్తా ఒక్క జర్నలిస్టులకే ఉందని, ఆ వైపుగా మహిళా జర్నలిస్టులు చేస్తున్న కృషి సంతోషంగా ఉందని కొనియాడారు. -
విలువలు పాటించినప్పుడే జర్నలిస్టులకు గౌరవం
సాక్షి,సనత్‌నగర్: న్యూస్ రాసే జర్నలిస్టులు కోర్ (క్రెడిబిలిటీ, ఆబ్జెక్టివిటీ, రెస్పాన్సిబిలిటీ, ఎథిక్స్) విలువలను పాటించడం ద్వారానే వార్తకు సంపూర్ణత చేకూరుతుందని, సమాజంలో వారికి గౌరవం పెరుగుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి కొత్తగా నిర్మించే సెక్రటేరియట్లో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గదిని కేటాయించేలా కృషి చేస్తానని ఆమె హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో రెండు రోజుల పాటు జరిగిన మహిళా జర్నలిస్టుల వర్క్‌షాప్ ఆదివారం ముగిసింది. సమావేశానికి ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌తో మాట్లాడి మీడియా సంస్థల్లో మహిళలపై వేధింపులు, వివక్షను నిరోధించే కమిటీలు వేయించేందుకు ప్రయత్నిస్తానన్నారు. మహిళా జర్నలిస్టులు ఎవరైనా గొంతెత్తితే ఆపేందుకు ‘టెక్ ఫాక్స్’ద్వారా వ్యతిరేకంగా లక్షల కొద్దీ ట్వీట్స్ చేసి వారిని అణచడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది దురదృష్టకరమని అన్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ పత్రిక రంగంలోని అన్ని పాత్రలను తానే పోషించి కాకతీయ అనే పత్రికను నడిపారని ఎమ్మెల్సీ వాణీదేవి గుర్తు చేశారు. జనాన్ని జాగృతం చేయగలిగే సత్తా ఒక్క జర్నలిస్టులకే ఉందన్నారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే నాయకులు మారుతీసాగర్, రమణ, తదితరులు పాల్గొన్నారు. -
మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: బేగంపేటలోని టూరిజం ప్లాజాలో 'మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్' కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ వర్క్ షాప్ ప్రారంభ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఛైర్మన్లు, శాసనమండలి, శాసనసభ సభ్యులు పాల్గొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ శని, ఆదివారం రెండు రోజులు నిర్వహించనున్నారు. దాదాపు 400 మంది మహిళా జర్నలిస్టులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టుల కొరకు ఒక ప్రత్యేక మీడియా సెంటర్, మీడియా కిట్ సాధించుకోవడంతో పాటు, మహిళా జర్నలిస్టుల సమస్యలు వాటి పరిష్కారాల కొరకు ప్రత్యేక చర్చ ఉంటుందని అల్లం నారాయణ తెలిపారు. ఏప్రిల్ 24వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత, వాణి దేవి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పాల్గొంటారు. ఈ సెషన్ లో జాతీయ స్థాయి మహిళా జర్నలిస్టులు ధన్యా రాజేంద్రన్, మాలిని సుబ్రహ్మణ్యం, 'మీడియా ధోరణులు, జాతీయ పరిస్థితులు' అనే అంశంపై ప్రసంగించనున్నారు. -
హోలి హోలీల రంగ హోలీ... మంచి రంగులే మంచిది చమ్మకేళీ!
హోలీ పండగరోజు ‘రంగు పడుద్ది’ అని అరవడం, రంగు ఇష్టంగా పడిపించుకోవడం బాగానే ఉంటుంది గానీ అది ఏ ‘రంగు’ అనేది ముఖ్యం. ఎందుకంటే అన్ని రంగులు ఒక్కటి కాదు! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే హోలి రోజు రంగుల రూపంలో చెడు రసాయనాలు చేటు చేస్తున్నాయి. చర్మం, కళ్లు...మొదలైన వాటికి హాని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, థానే జిల్లాలోని ముర్బాద్, సరగామ్ ప్రాంతాలకు చెందిన ఆదివాసీల కోసం అగ్రికల్చరల్ సైన్స్డిపార్ట్మెంట్ వర్క్‌షాప్ నిర్వహించింది. హోలీ సందర్భంగా వాడే రంగులలోని కెమికల్స్ వల్ల జరిగే హాని గురించి వివరించారు. ‘అలా అని పండగ సంతోషం దూరం చేసుకోనక్కర్లేదు’ అని చెబుతూ... మందారం, టొమాటో, క్యారట్లతో ఎరుపు రంగు, గోరింటాకుతో పచ్చని రంగు, బీట్రూట్తో గులాబీ రంగు, పసువు కొమ్ములతో పసుపు రంగు... ఎలా తయారు చేయాలో నేర్పించారు. మరిచిపోయిన మోదుగుపూల రసాన్ని మళ్లీ రంగం మీదికి తీసుకువచ్చారు. ‘మీ ఇంటి దగ్గర ఏ చెట్టు ఉంది?’ అని అడిగారు. చింతచెట్టు, నిమ్మచెట్టు, నీలగిరి చెట్టు... ఇలా రకరకాల సమాధానాలు వినిపించాయి. ఆ చెట్ల ఆకులతోనూ, పరిసరాలలో ఉన్న ప్రకృతి వనరులతోనూ సహజమైన రంగులు తయారు చేసుకోవడం, ఆ రంగులను అందంగా ఎలా ప్యాక్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి?.. మొదలైన విషయాలు నేర్పించారు. దీనిద్వారా వారికి ఉపాధి అవకాశం దొరికింది. ‘మేము పచ్చటి చెట్ల మధ్య నివసిస్తున్నాం. అయితే హోలీ పండగ రాగానే రంగుల కోసం పట్టణం వెళ్లేవాళ్లం. ఎదుటి వ్యక్తిని ఎంతగా రంగుల్లో ముంచెత్తితే పండగ అంత ఘనంగా జరిగింది అనుకునేవాళ్లం. ఇక్కడికి వచ్చిన తరువాత నా దృష్టి మారింది. రసాయన రంగులను ఉపయోగించడం వల్ల జరిగే హాని గురించి తెలుసుకున్నాను. నేను ఇక్కడ విన్న విషయాలను మా కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వాళ్లకు కూడా చెబుతాను’ అంటుంది వర్క్‌షాప్‌కు హాజరైన శాంతి పవార్. ‘ఈసారి పండగ కొత్తగా జరుపుకుందాం. ఆరోగ్యకరంగా జరుపుకుందాం’ అనే నినాదంతో ముందుకు కదిలారు వర్క్‌షాప్‌కు హాజరైన మహిళలందరూ తాము తయారు చేసిన సహజమైన రంగులను ఇంటింటికి పరిచయం చేస్తున్నారు. వర్క్‌షాప్ లో విన్న విషయాలను చెబుతున్నారు. తాము తయారు చేసిన రంగులు అమ్ముడుపోతున్నాయనే సంతోషం కంటే, తమ ద్వారా మంచి సందేశం చేరుతుందనే తృప్తి వారి కళ్లలో కలర్ఫుల్గా కనిపిస్తుంది. -
రైతులు ఫ్రంట్‌లైన్ వారియర్లు కాదా
సాక్షి, హైదరాబాద్: వరి ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భారతీయ రైతు సంఘాల కూటమి (సిఫా) ఆరోపించింది. తెలంగాణలో యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పడం... రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ను వరి వేయొద్దని చెప్పడంతో సమస్య మొదలైం దని స్పష్టం చేసింది. ఒకప్పుడు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కరువు కాటకాలు ఉండగా ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల వల్ల నీటి వసతి ఏర్పడిందని వెల్లడించింది. దీంతో వరివైపు రైతులు మళ్లారని సిఫా వివరించింది. కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లు అంటూ వైద్య సిబ్బంది, పోలీసులు తదితరులను గుర్తించారే కానీ రైతులను ఆ కేటగిరీలో చూపించలేదని విమర్శించింది. సిఫా ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ‘అగ్రికల్చర్ యాజ్ ఫోకస్ ఏరియా ఆఫ్ రీజినల్ అప్రోచెస్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా’ అంశంపై జాతీయ వర్క్‌షాప్ జరిగింది. ఈ వర్క్‌షాప్‌కు సిఫా ముఖ్య సలహాదారు పి.చెంగల్‌రెడ్డి, ప్రొఫెసర్ దేవీప్రసాద్ జువ్వాడి సంధానకర్తలుగా వ్యవహరించారు. సాగుకు మద్దతేదీ..? వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉన్నా ధాన్యం సేకరణ, ఎగుమతులు కేంద్రం చేతిలో ఉన్నాయని చెంగల్‌రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు. కేంద్రం కరోనా సమయంలో పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకాలు ఇచ్చిందే తప్ప వ్యవసాయానికి మద్దతివ్వలేదన్నారు. డాక్టర్లు, శాస్త్రవేత్తలకు ఉన్న గౌరవం వ్యవసాయాధికారులకు లేదన్నారు. కేంద్రం వ్యవసాయ విధానాల్లో విఫలమైందన్నారు. తెలంగాణ రైతులకు సంబంధించి కేంద్రం బాధ్యత వహించాలన్నారు. రైతు సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వరిపై కేంద్రం వైఖరి సరికాదు: బి. వినోద్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ ఫోన్ ద్వారా తన సందేశం వినిపిస్తూ కేంద్రం వరి కొనుగోలు విషయంలో అనుసరిస్తున్న వైఖరి సరైంది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనేక రంగాల్లో ముందుకు సాగుతోందని, వైద్య రంగంలో కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో బ్యాంకులు ప్రైవేటీకరణ బాటపడితే రైతులకు రుణాలు కలగానే మిగులుతుందన్నారు. సంప్రదాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేస్తేనే వ్యవసాయ రంగం బాగుంటుందన్నారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలన్న తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. పాలీహౌస్ పద్ధతిలో వ్యవసాయం చేసినా ప్రభత్వం రుణాలు, వడ్డీ రాయితీ కల్పించకపోవడంతో సమస్యలు వస్తున్నాయని రైతు రఘురాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వర్క్‌షాప్‌లో వార్త ఎడిటర్ సాయిబాబా, ఆలిండియా అగ్రికల్చర్ స్టూడెంట్ అసోసియేషన్ నేత సాయికాంత్, సిఫా తెలంగాణ అధ్యక్షుడు సోమశేఖర్‌రావు ప్రసంగించారు. -
లవ్లీ ఫ్లవర్స్...
-
పారిశ్రామికాభివృద్దే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం