కడప కోటిరెడ్డి సర్కిల్ :
ఈ నెల 29వ తేదీ నుంచి 30 వరకు కడప నగరం చిన్నచౌకులోని సప్తగిరి కళ్యాణ మండపంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహించనున్నట్లు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.రామసుబ్బారెడ్డి, ప్రదాన కార్యదర్శి జి.చంద్ర తెలిపారు. మంగళవారం స్థానిక ఎద్దుల ఈశ్వర్‌రెడి హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే వర్క్‌షాపులో వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు – ప్రభుత్వ పాత్ర , సమస్యలు పరిష్కార మార్గాలు, కరువు, నీటి పారుదల (ఆవశ్యకత), రుణమాఫీ ఆవశ్యకత, ప్రభుత్వం, కౌలుదారి వ్యవస్థ వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తారన్నారు. ఈ వర్క్‌షాపునకు అఖిల భారత కిసాన్ సభ ఉపా«ధ్యక్షుడు రావుల వెంకయ్య, రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి కె.బి.వి. ప్రసాద్, సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య హాజరవుతారన్నారు.
29 నుంచి రైతు సంఘం వర్క్‌షాపు
Published Wed, Jul 27 2016 1:02 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM
Advertisement
Advertisement