ఆసక్తి చూపిస్తున్న నగర యువత
సాహిత్యం, పెయింటింగ్, పాటరీ, యాక్టింగ్
తదితరాల్లో శిక్షణకు కేంద్రాలు..
ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు
పాటరీ వర్క్‌షాప్స్: ఈ మధ్య కాలంలో పాటరీ వర్క్‌షాప్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి. మొత్తని మట్టితో చిన్న చిన్న కళాకృతమైన కుండలు, బొమ్మలు, ఇంట్లో అలంకార వస్తువులను తయారు చేయడంపై శిక్షణ అందిస్తారు. గ్రామీణ మూలాల్లోంచి కొనసాగుతున్న కళ కావడం, అంతేగాకుండా ఈ పాటరీకి ప్రస్తుతం మార్కెట్‌లో మంచి ఆదరణ ఉండటంతో ఈ వర్క్‌షాప్స్‌కు ఔత్సాహికులు నిండిపోతున్నారు. తయారు చేసే సామాగ్రి, పనిముట్లు తదితరాలను నిర్వాహకులే సమకూరుస్తున్నారు.
మ్యూజిక్ సైన్స్..
సంగీతాన్ని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదేమో.. అయితే.. ఈ సంగీతాన్ని ఆస్వాదించడం పోయి వాయించడం అభిరుచిగా మార్చుకుంటున్నారు నగరవాసులు. గిటార్, వయోలిన్, డ్రమ్స్, ఫ్లూట్ ఇలా ఏదో ఒక సంగీత వాయిద్యంపై పట్టు పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఓ వైపు ఐటీ జాబ్స్ చేస్తూనే ఇలాంటి ఆర్ట్స్‌పై అవగాహన పెంచుకుంటూ మ్యూజిక్ బ్యాండ్స్‌లో సైతం సభ్యులుగా మారుతున్నారు. వీటి శిక్షణ కోసం పలు సంగీత శిక్షణ కేంద్రాలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖా ఆధ్వర్యంలోని కేంద్రాలు సైతం ఉన్నాయి.
థియేటర్ ఆర్ట్స్..
కొంతకాలంగా సిటీలో థియేటర్ ఆర్ట్స్‌కు ఔత్సాహికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నటనలో, నాటకాల్లో శిక్షణ పొందుతూ.. థియేటర్ ప్లేలు ప్రదర్శిస్తూ వినూత్న ఒరవడికి నాంది పలుకుతున్నారు. వీటి కోసం రవీంద్రభారతి, తెలుగు యూనివర్సిటీ కళాప్రాంగణం, రంగభూమి వంటి వేదికలు ఆవకాశాలను కలి్పస్తున్నాయి. రంగస్థలంపై రాణించిన యువతకు సినిమాల్లో అవకాశాలు సైతం వస్తుండటంతో థియేటర్ ఆర్ట్స్ మోడ్రన్ యాక్టివిటీగా మారింది. అన్ని రంగాల్లో జాబ్స్ చేస్తున్న వారు ఇందులో భాగస్వామ్యం అవుతుండటం విశేషం.
గార్డెనింగ్.. మోడ్రన్ ఆర్ట్..
ఈ మధ్య మొక్కలు పెంచడం కూడా ఓ కళగా మారింది. ఇందులో ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్, టెర్రస్ గార్డెనింగ్ అంటూ విభిన్న రకాలుగా ఉన్నాయి. నగరంలోని కొందరు మొక్కల ప్రేమికులు సోషల్ యాప్స్‌లో గ్రూపులుగా మారి ఈ గార్డెనింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా నగర జీవనశైలి దృష్ట్యా టెర్రస్ గార్డెనింగ్ ఔత్సాహికలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ప్రత్యేకంగా మీట్స్ ఏర్పాటు చేసుకుని మొక్కలను, వాటి విత్తనాలను ఒకరికొకరు పంచుకుంటున్నారు. ఇదే వేదికలుగా ప్లాంటేషన్‌పై అనుభవజు్ఞలు, నిపుణులచే అవగాహన పొందుతున్నారు.
నిత్యం ఒత్తిడి పెంచే సిటీ లైఫ్‌లో గార్డెనింగ్ అనేది వినూత్న కళగా అవతరించింది. ఇవేకాకుండా పెయింటింగ్, రెసిన్ ఆర్ట్స్, హ్యండ్ క్రాఫ్ట్, పేపర్ క్రాఫ్ట్, మైక్రో ఆర్ట్స్, జుంబా వంటి విభిన్న కళా అంశాలపై శిక్షణ పొందుతూ తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. వారి కళాత్మకతను సోషల్ మీడియా వేదికగా రీల్స్, షేర్లు, పోస్టులతో ప్రమోట్ చేసుకుంటూ సోసల్ సెలబ్స్‌గా మారుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment