tallent
-
వీకెండ్ ఆర్ట్.. వారాంతాల్లో కళాత్మకతకు పదును!
పాటరీ వర్క్‌షాప్స్: ఈ మధ్య కాలంలో పాటరీ వర్క్‌షాప్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి. మొత్తని మట్టితో చిన్న చిన్న కళాకృతమైన కుండలు, బొమ్మలు, ఇంట్లో అలంకార వస్తువులను తయారు చేయడంపై శిక్షణ అందిస్తారు. గ్రామీణ మూలాల్లోంచి కొనసాగుతున్న కళ కావడం, అంతేగాకుండా ఈ పాటరీకి ప్రస్తుతం మార్కెట్లో మంచి ఆదరణ ఉండటంతో ఈ వర్క్‌షాప్స్‌కు ఔత్సాహికులు నిండిపోతున్నారు. తయారు చేసే సామాగ్రి, పనిముట్లు తదితరాలను నిర్వాహకులే సమకూరుస్తున్నారు.మ్యూజిక్ సైన్స్..సంగీతాన్ని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదేమో.. అయితే.. ఈ సంగీతాన్ని ఆస్వాదించడం పోయి వాయించడం అభిరుచిగా మార్చుకుంటున్నారు నగరవాసులు. గిటార్, వయోలిన్, డ్రమ్స్, ఫ్లూట్ ఇలా ఏదో ఒక సంగీత వాయిద్యంపై పట్టు పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఓ వైపు ఐటీ జాబ్స్ చేస్తూనే ఇలాంటి ఆర్ట్స్‌పై అవగాహన పెంచుకుంటూ మ్యూజిక్ బ్యాండ్స్‌లో సైతం సభ్యులుగా మారుతున్నారు. వీటి శిక్షణ కోసం పలు సంగీత శిక్షణ కేంద్రాలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖా ఆధ్వర్యంలోని కేంద్రాలు సైతం ఉన్నాయి.థియేటర్ ఆర్ట్స్..కొంతకాలంగా సిటీలో థియేటర్ ఆర్ట్స్‌కు ఔత్సాహికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నటనలో, నాటకాల్లో శిక్షణ పొందుతూ.. థియేటర్ ప్లేలు ప్రదర్శిస్తూ వినూత్న ఒరవడికి నాంది పలుకుతున్నారు. వీటి కోసం రవీంద్రభారతి, తెలుగు యూనివర్సిటీ కళాప్రాంగణం, రంగభూమి వంటి వేదికలు ఆవకాశాలను కలి్పస్తున్నాయి. రంగస్థలంపై రాణించిన యువతకు సినిమాల్లో అవకాశాలు సైతం వస్తుండటంతో థియేటర్ ఆర్ట్స్ మోడ్రన్ యాక్టివిటీగా మారింది. అన్ని రంగాల్లో జాబ్స్ చేస్తున్న వారు ఇందులో భాగస్వామ్యం అవుతుండటం విశేషం.గార్డెనింగ్.. మోడ్రన్ ఆర్ట్..ఈ మధ్య మొక్కలు పెంచడం కూడా ఓ కళగా మారింది. ఇందులో ఇంటీరియర్, ఎక్స్టీరియర్, టెర్రస్ గార్డెనింగ్ అంటూ విభిన్న రకాలుగా ఉన్నాయి. నగరంలోని కొందరు మొక్కల ప్రేమికులు సోషల్ యాప్స్‌లో గ్రూపులుగా మారి ఈ గార్డెనింగ్పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా నగర జీవనశైలి దృష్ట్యా టెర్రస్ గార్డెనింగ్ ఔత్సాహికలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ప్రత్యేకంగా మీట్స్ ఏర్పాటు చేసుకుని మొక్కలను, వాటి విత్తనాలను ఒకరికొకరు పంచుకుంటున్నారు. ఇదే వేదికలుగా ప్లాంటేషన్‌పై అనుభవజు్ఞలు, నిపుణులచే అవగాహన పొందుతున్నారు.నిత్యం ఒత్తిడి పెంచే సిటీ లైఫ్‌లో గార్డెనింగ్ అనేది వినూత్న కళగా అవతరించింది. ఇవేకాకుండా పెయింటింగ్, రెసిన్ ఆర్ట్స్, హ్యండ్ క్రాఫ్ట్, పేపర్ క్రాఫ్ట్, మైక్రో ఆర్ట్స్, జుంబా వంటి విభిన్న కళా అంశాలపై శిక్షణ పొందుతూ తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. వారి కళాత్మకతను సోషల్ మీడియా వేదికగా రీల్స్, షేర్లు, పోస్టులతో ప్రమోట్ చేసుకుంటూ సోసల్ సెలబ్స్గా మారుతున్నారు. -
Veena Srivani Latest Photos: వాగ్దేవి వరపుత్రిక శ్రీవాణి శ్రావ్యంగా మీటితే..! (ఫొటోలు)
-
ఘనాపాటీలు! అసామాన్యమైన కళతో మతాబుల్లా వెలిగిపోతున్న చిచ్చరపిడుగులు!
సాధారణంగా పిల్లలు.. రేపటి కలలను కంటూ పెరుగుతారు. కానీ కొందరు పిల్లలు మాత్రం తమలోని కళలను బయపెడుతూ నేడే ఆ కలలను నిజం చేసుకుంటున్నారు. లక్ష్యాలు, విజయాలతో మతాబుల్లా వెలిగిపోతున్న ఆ చిచ్చరపిడుగులను పరిచయం చేసుకుందాం.. వాళ్లు సాధించిన ఘనతలేంటో తెలుసుకుందాం.. లిసిప్రియ కంగుజంమణిపూర్, బషిఖోంగ్ గ్రామంలో.. 2011లో పుట్టిన లిసిప్రియ.. ప్రపంచంలోనే అతి పిన్న పర్యావరణవేత్తల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తన ఐదేళ్ల వయసు నుంచే గ్లోబల్ వార్మింగ్, నిరక్షరాస్యత వంటి సమస్యలపై గొంతెత్తింది. 2019లో స్పెయిన్ లోని మాడ్రిడ్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి ‘వాతావరణ మార్పు సదస్సు’లో ప్రపంచ నాయకులతో మాట్లాడి మెప్పించింది. లిడియన్ నాదస్వరం తమిళ సంగీత దర్శకుడు వర్షన్ సతీష్ రెండో కుమారుడే ఈ లిడియన్ నాదస్వరం. సంగీతకారుడిగా, పియానిస్ట్‌గా, కీబోర్డ్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న లిడియన్.. తన రెండేళ్ల వయసు నుంచి డ్రమ్స్ వాయించడం మొదలుపెట్టాడు. 8 సంవత్సరాల వయస్సులో పియానో నేర్చుకున్నాడు. 2019లో తన 14వ ఏట.. అమెరికన్ టెలివిజన్ íసీబీఎస్ నిర్వహించిన టాలెంట్ షోలో రెండు పియానోలను ఒకేసారి అద్భుతంగా వాయించాడు. దానిలో విజేతగా నిలిచి.. 1 మిలియన్ ఫ్రైజ్ మనీ సాధించాడు. మొన్నటికి మొన్న కడప వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన 6 నెలల బాబు ప్రజ్వల్.. పలు జంతువులు, పండ్లు, వాహనాలు, నంబర్లు ఇలా చాలావాటిని గుర్తుపట్టి.. ఆశ్చర్యపరిచాడు. తన గ్రాహక శక్తితో ‘నోబుల్ వరల్డ్ రికార్డ్’ సాధించాడు. అలాగే హైదరాబాద్, మల్కాజిగిరికి చెందిన 8 నెలల పాప ఆద్యశ్రీ.. తన గ్రాహక శక్తితో నోబుల్æవరల్డ్ రికార్డ్‌లో తన పేరు నమోదు చేసుకుంది. సుమారు 300 ఫొటోలను, వస్తువులను గుర్తించగల ఆధ్య.. 30 దేశాల జాతీయ జెండాలను గుర్తించి ఈ రికార్డ్ సాధించింది. ఇలా ఎందరో పిల్లలు వయసుకు మించిన విజయాలతో దూసుకుపోతున్నారు. చరిత్ర సృష్టిస్తున్నారు. తనిష్క భూపతిరాజు ఆంధ్రప్రదేశ్, భీమవరానికి చెందిన తనిష్క.. తన ఆరేళ్ల వయసులోనే విల్లును ఎక్కుపెట్టి.. ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు సంపాదించింది. 16 నిమిషాల 50 సెకన్ల వ్యవధిలో 100 బాణాలను 40 సెంటీమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తాకేలా ఆర్చరీలో అద్భుతమైన ప్రతిభను చాటుకుంది. హర్పిత పాండియన్ వీరు చెన్నైకి చెందిన కవలలు. చిన్న వయసులోనే వ్యాపారవేత్తలుగా ఎదిగి ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. వీరు ‘స్పెల్లింగ్ బీ ట్విన్స్ ్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. క్లాస్మైండ్స్ అనే ఉఛీఖ్ఛీఛిజి కంపెనీని స్థాపించి.. ఎందరో విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఇది ఆన్ లైన్ మౌఖిక స్పెల్లింగ్ బీ పోటీ. విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, వారి స్పెల్లింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి తర్ఫీదునిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో ఈ ట్విన్స్.. తాము చేసిన విశేషకృషికి ఎన్నో అవార్డులు అందుకున్నారు. 10కి పైగా దేశాల నుంచి వేల మంది విద్యార్థులు ఇందులో రిజిస్టర్ అవుతుంటారు. విజేతలుగా నిలుస్తుంటారు. అద్వైత్ కోలార్కర్ పుణేకి చెందిన అద్వైత్.. 8 నెలల వయసులోనే పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టాడు. రెండేళ్లకే పుణేలోని ఆర్ట్2డే గ్యాలరీలో తన మొదటి సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించాడు. ఇటీవల తను వేసిన ఒక పెయింటింగ్ 16,800 డాలర్లకు అమ్ముడు పోయింది. ఇప్పటి వరకూ అతడు వేసిన పెయింటింగ్స్ అన్నీ కలిపి.. 3,00,000 డాలర్లకు మించి అమ్ముడుపోయాయి. ఇప్పటికే 19కి పైగా సోలో ప్రదర్శనలు ఇచ్చి.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. (చదవండి: చిన్నారులే నడుపుతున్న న్యూస్ చానెల్! వాళ్లే రిపోర్టింగ్, యాంకరింగ్..) -
ఎన్ని ప్లాప్ వచ్చిన టాలీవుడ్ ని వదిలేదే లే ....
-
కుంగ్‌ఫూ, కరాటేలో జిల్లా ప్రతిభ
గుంటూరు స్పోర్ట్స్: విజయవాడలో ఈనెల 29వ తేదీన నిస్కిన్ మంక్ కుంగ్‌ఫూ అకాడమి ఆ«ధ్వర్యంలో జరిగిన రాష్టస్థాయి కుంగ్‌ఫూ, కరాటే పోటీలలో తమ క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబర్చి రెండు బంగారు, ఒక రజత, నాలుగు కాంస్య పతకాలు సాధించారని ఉషూ కుంగ్ ఫూ అకాడమి చీఫ్ ఇన్స్ట్రక్టర్ షేక్ సంధాని తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం బ్రాడీపేట మహిమ గార్డెన్స్‌లోని అకాడమిలో ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అండర్–12 స్పారింగ్ విభాగంలో ఎం.థామస్ బంగారు, ఎం.తరుణ్య కాంస్య పతకాలు సాధించారని తెలిపారు. 50 నుంచి 65 కేజీల స్పారింగ్ విభాగంలో కె.సాయిమౌళి బంగారు, ఎ.శేషసాయి కిరణ్ రజత, ఎస్.సాయి శాండిల్య, ప్రవీణ్ ఫ్రాన్సిస్, పీఎన్ఎస్ తేజస్వి కాంస్య పతకాలు సాధించారని చెప్పారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో క్రీడాకారులు, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభను తీసేందుకే యువ మహోత్సవ్
కర్నూలు(హాస్పిటల్): యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే యువ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమాధికారి(సెట్కూరు) ముఖ్య కార్యనిర్వహణాధికారి మస్తాన్‌వలీ చెప్పారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని సెట్కూరు ఆధ్వర్యంలో స్థానిక సిల్వర్‌జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువ మహోత్సవ్ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మస్తాన్‌వలీ మాట్లాడుతూ.. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు గల యువతీయువకులు యువ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. పోటీల్లో పాల్గొన్న విజేతలకు 22వ తేదీ సాయంత్రం జరిగే కార్యక్రమంలో బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తామని తెలిపారు. సెట్కూరు మేనేజర్ పీవీ రమణ మాట్లాడుతూ.. 21వ తేదీన ఖోకో , కబడ్డీ టగ్ ఆఫ్ వార్, వాలీబాల్, బ్యాట్మింటన్, క్యారమ్స్, చెస్ వంటి క్రీడల పోటీలతో పాటు యువజన సాధికారత, అభివృద్ధి కార్యక్రమాలపై సెమినార్ నిర్వహిస్తామన్నారు. అదే రోజు మార్షల్ ఆర్ట్స్/సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమంతో పాటు గ్రాండ్సిటి ట్రెషర్ హంట్ నిర్వహిస్తామని తెలిపారు. 22వ తేదీన 5కె రన్, 10 కె సైకిల్ రేస్, లెమన్ అండ్ స్పూన్ రేస్, స్యాక్ రేస్(గోనెసంచి) పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, మిమిక్రీ, మ్యాజిక్, నృత్యప్రదర్శనలు పోటీలు ఉంటాయన్నారు. సిల్వర్‌జూబ్లీ కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్‌ఖాదర్ మాట్లాడుతూ.. యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.5కోట్లతో నిర్మించే యువభవన్ కోసం సిల్వర్‌జూబ్లీ కళాశాల స్థలం కేటాయించామన్నారు. అనంతరం పలు అంశాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు పి. విజయకుమార్, జగన్, లలితాకుమారి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి, సెట్కూరు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
బెస్ట్ పవర్ లిఫ్టర్‌గా సాయిరేవతి
మంగళగిరి : జిల్లాకు చెందిన పవర్‌లిఫ్టర్ ఘట్టమనేని సాయిరేవతి బెస్ట్ లిఫ్టర్ ప్రైజ్‌మని అవార్డు అందుకోవడం అభినందనీయమని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టర్ అసోసియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు అన్నారు. పట్టణంలోని జిమ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సాయిరేవతిని అభినందించారు. జెంషెడ్‌పూర్‌లో జరిగిన సుబ్రత క్లాసిక్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో సాయిరేవతి చూపిన ప్రతిభ కారణంగా అవార్డుకు ఎంపికయ్యారన్నారు. సాయిరేవతిని అభినందించిన వారిలో కోచ్ ఎన్. శేషగిరిరావు, అధ్యక్షులు షేక్ మహ్మద్ రఫీ, కోచ్‌లు సంధాని, ఖమురుద్దీన్ తదితరులున్నారు. -
సత్తాచాటిన మంగళగిరి ఎడ్లజత
ముగిసిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు కారంపూడి: పల్నాటి వీరారాధనోత్సాల సందర్భంగా కారంపూడిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎడ్ల పందేలు బుధవారం రాత్రి ముగిశాయి. పాల పళ్ల( (నాలుగుపళ్ల))విభాగం పోటీలను వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, నాయకులు డాక్టర్ గజ్జెల బ్రహ్మారెడ్డి ప్రారంభించారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన రైతు సంఘం ప్రతినిధి బొమ్మిన అల్లయ్య, హనుమయ్యలను అభినందించారు. దాతలు పాతూరి రామిరెడ్డి, షేక్ షఫీ, కంపా శిర్రయ్య, కొంగర సుబ్రమణ్యం, మేకల శ్రీనివాసరెడ్డి, క్రిష్టపాటి అంకిరెడ్డి, బండ్ల వెంకటేశ్వర్లు(బుల్లోడు) చేతులమీదగా బహుమతులు అందించారు. విజేతలు.. మంగళగిరికి చెందిన బత్తుల సరోజినీదేవి ఎడ్ల జత, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన జక్కుల రాజశేఖరయాదవ్, మేడికొండూరు మండలం పాలడుగుకు చెందిన తెనగాల అచ్చెయ్య కంబైన్డ్ జత 4,600 అడుగుల దూరం లాగాయి. ఈ రెండు జత్లకు ప్రథమ, ద్వితీయ బహుమతులను సమానంగా అందించారు. తృతీయ బహుమతి దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన తోట వీరబ్రహ్మనాయుడు జత, నాలుగో బహుమతి బొల్లాపల్లి మండలం హనుమాపురంతండాకు చెందిన కేతావత్ బద్యానాయక్ జత, ఐదో బహుమతి కొల్లూరు మండలం దోనేపూడికి చెందిన వెనిగండ్ల విఘ్నేశ్వరి జత కైవసం చేసుకున్నాయి. -
స్పీడ్ స్కేటింగ్‌లో నజ్మా ప్రతిభ
ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం అరండల్‌పేట(గుంటూరు): స్పీడ్ స్కేటింగ్‌లో సిమ్స్ మై స్కూల్ విద్యార్థిని ఎం.డి.నజ్మా ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించినట్లు సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్‌రెడ్డి తెలిపారు. విద్యార్థిని అభినందన కార్యక్రమం సోమవారం పాఠశాలలో నిర్వహించారు. భరత్‌రెడ్డి మాట్లాడుతూ తమిళనాడులోని తిరుపుర్‌లో ఈ నెల 14వ తేదీ నుంచి యాంటి టెర్రరిజమ్, గ్లోబల్ వార్నింగ్ సదస్సు నిర్వహణ సందర్భంగా స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీలకు సిమ్స్ విద్యార్థిని ఎం.డి.నజ్మా హాజరై వరల్డ్ రికార్డు సాధించిందని పేర్కొన్నారు. ఎం.డి.నజ్మా ఆరో∙తరగతి చదువుతుందని, చిన్ననాటి నుంచి ఆటల్లో చురుగ్గా పాల్గొని జాతీయస్థాయిలో నగరానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం గర్వకారణమన్నారు. సిమ్స్ సంస్థల కరస్పాండెంట్ డాక్టర్ బి.శివశిరీష మాట్లాడుతూ స్కూల్ ప్రాంగణంలో అనుభవం కలిగిన శిక్షకులతో స్కేటింగ్ శిక్షణ ఇప్పించినట్లు చెప్పారు. డీన్.ఎల్.శ్రీనివాసరావు, స్కేటింగ్కోచ్ షేక్.సలాం తదితరులు పాల్గొన్నారు -
కుంగ్ ఫూలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
గుంటూరు స్పోర్ట్స్: జాతీయ స్థాయి ఉషూ కుంగ్ ఫూ పోటీలలో తమ అకాడమి క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించారని ది షావలిన్ కుంగ్ ఫూ అకాడమి మాస్టర్ సి.హెచ్ మస్తాన్ చెప్పారు. జాతీయ స్థాయి కుంగ్ ఫూ పోటీలలో బంగారు పతకాలు సాధించిన బి.దినేష్, ఎస్.సాయి శాండిల్య, కె.సాయి మౌళిలను గురువార స్థానిక లాడ్జి సెంటర్లోని ఏఎల్ బీఈడీ కళాశాల ఆవరణలోఅభినందించారు. ఈ సందర్భంగా కుంగ్ ఫూ మాస్టార్ మస్తాన్ మాట్లాడుతూ సెప్టెంబర్ 24, 25 తేదీలలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన ఉషూ కుంగ్ ఫూ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలలో రాష్ట్ర జట్టులో పాల్గొన్న వీరు బంగారు పతకాలు సాధించారని వివరించారు. విజేతలను కుంగ్ ఫూ మాస్టర్ షేక్ సంధాని, క్రీడాకారులు తదితరులు అభినందించారు.