బెస్ట్ పవర్ లిఫ్టర్‌గా సాయిరేవతి
మంగళగిరి : జిల్లాకు చెందిన పవర్‌లిఫ్టర్ ఘట్టమనేని సాయిరేవతి బెస్ట్ లిఫ్టర్ ప్రైజ్‌మని అవార్డు అందుకోవడం అభినందనీయమని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టర్ అసోసియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు అన్నారు. పట్టణంలోని జిమ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సాయిరేవతిని అభినందించారు. జెంషెడ్‌పూర్‌లో జరిగిన సుబ్రత క్లాసిక్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో సాయిరేవతి చూపిన ప్రతిభ కారణంగా అవార్డుకు ఎంపికయ్యారన్నారు. సాయిరేవతిని అభినందించిన వారిలో కోచ్ ఎన్. శేషగిరిరావు, అధ్యక్షులు షేక్ మహ్మద్ రఫీ, కోచ్‌లు సంధాని, ఖమురుద్దీన్ తదితరులున్నారు.