
స్లోవేనియా వేదికగా జరగనున్న వరల్డ్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కప్ పోటీల్లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మస్ పాల్గోనుంది. కాగా అల్మస్ 57 కేజీ విభాగంలో పోటీ పడనుంది. ఈ ఈవెంట్ కోసం ఆమె ఆదివారం(ఆక్టోబర్29) స్లోవేనియాకు పయనం కానుంది. ఈ విషయాన్ని అల్మస్ కోచ్ ఎస్కే సందాని తెలియజేశారు. ఈ ఛాంపియన్ షిప్‌లో అల్మస్ కచ్చితంగా పతకం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.
కాగా ఈ వరల్డ్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కప్ పోటీలలో భారత్ నుంచి నలుగురు లిఫ్టర్స్ పాల్గోనున్నారు. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు వెళ్తున్న సాదియా అల్మస్‌కు ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మద్ది ప్రభాకారరావు, కార్యదర్శి సకల సూర్యనారాయణ ఆల్‌ది బెస్ట్ తెలియజేశారు.
ఈ సందర్భంగా షేక్ సాదియా మాట్లాడుతూ..వరల్డ్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొనటానికి అర్హత సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. అవకాశం కల్పించిన పవర్ లిఫ్టింగ్ ఇండియా అధ్యక్షులు సతీష్ కుమార్ గారికి , కార్యదర్శి పీజీ జోసప్, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారికి, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పోటీలో పతకం సాధించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తానని ఆమె పేర్కొంది.
చదవండి: World Cup 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. సిరాజ్‌కు నో ఛాన్స్! జట్టులోకి సీనియర్ ఆటగాడు