ప్రతిభను తీసేందుకే యువ మహోత్సవ్
Published Fri, Jan 20 2017 11:02 PM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM
కర్నూలు(హాస్పిటల్): యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే యువ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమాధికారి(సెట్కూరు) ముఖ్య కార్యనిర్వహణాధికారి మస్తాన్‌వలీ చెప్పారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని సెట్కూరు ఆధ్వర్యంలో స్థానిక సిల్వర్‌జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువ మహోత్సవ్ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మస్తాన్‌వలీ మాట్లాడుతూ.. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు గల యువతీయువకులు యువ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. పోటీల్లో పాల్గొన్న విజేతలకు 22వ తేదీ సాయంత్రం జరిగే కార్యక్రమంలో బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తామని తెలిపారు. సెట్కూరు మేనేజర్ పీవీ రమణ మాట్లాడుతూ.. 21వ తేదీన ఖోకో , కబడ్డీ టగ్ ఆఫ్ వార్, వాలీబాల్, బ్యాట్మింటన్, క్యారమ్స్, చెస్ వంటి క్రీడల పోటీలతో పాటు యువజన సాధికారత, అభివృద్ధి కార్యక్రమాలపై సెమినార్ నిర్వహిస్తామన్నారు. అదే రోజు మార్షల్ ఆర్ట్స్/సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమంతో పాటు గ్రాండ్‌సిటి ట్రెషర్ హంట్ నిర్వహిస్తామని తెలిపారు. 22వ తేదీన 5కె రన్, 10 కె సైకిల్ రేస్, లెమన్ అండ్ స్పూన్ రేస్, స్యాక్ రేస్(గోనెసంచి) పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, మిమిక్రీ, మ్యాజిక్, నృత్యప్రదర్శనలు పోటీలు ఉంటాయన్నారు. సిల్వర్‌జూబ్లీ కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్‌ఖాదర్ మాట్లాడుతూ.. యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.5కోట్లతో నిర్మించే యువభవన్ కోసం సిల్వర్‌జూబ్లీ కళాశాల స్థలం కేటాయించామన్నారు. అనంతరం పలు అంశాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు పి. విజయకుమార్, జగన్, లలితాకుమారి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారి, సెట్కూరు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement