సిటీలో పెరుగుతున్న బాలీవుడ్ కల్చర్
డ్యాన్సింగ్ ఈవెంట్స్‌కు పెరుగుతున్న ఆదరణ
ప్రొఫెషనల్ డ్యాన్సర్లకు ఫుల్ డిమాండ్
పార్టీలు, సినిమా షోలు, కార్పొరేట్ ఈవెంట్స్‌లో సందడి
సాక్షి, సిటీబ్యూరో: అధునాతన జీవన శైలి, మోడ్రన్ ఫ్యాషన్ హంగులను అందిపుచ్చుకోవడంలో నగరం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిసిందే.. ముఖ్యంగా మోడ్రన్ ఆర్ట్స్‌కు నగరంలో విపరీతంగా క్రేజ్ పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే సిటీలో ట్రెండీ డ్యాన్స్ స్టెప్పులను ఆహ్వానిస్తున్నారు.. ఆస్వాదిస్తున్నారు. దశాబ్ద కాలం క్రితంతో పోలిస్తే ప్రస్తుతం నగరంలో డ్యాన్సింగ్‌లో ఎన్నో మార్పులు, విభిన్న టెక్నిక్స్ రూపుదిద్దుకున్నాయి. డ్యాన్స్‌లో వెస్ట్రన్ స్టైల్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుత తరుణంలో వేడుక ఏదైనా సరే.., అందులో స్టెప్పు లేనిదే కిక్కు రాదు. కార్పొరేట్ ఈవెంట్స్ మొదలు సినిమా ఫంక్షన్ల వరకు హిప్‌హాప్, జాజ్ వంటి ట్రెండీ స్టెప్పులతో నగరం నృత్యం చేస్తోంది. నృత్యాన్నే కెరీర్‌గా మార్చుకున్న ఎంతో మంది డ్యాన్సర్లకు ఈవెంట్స్ ఉపాధిగా మారాయి. ప్రైవేటు పార్టీలు మొదలు కొత్త సంవత్సర వేడుకల వరకు ఈ డ్యాన్స్ బృందాలకు డిమాండ్ పెరిగిపోయింది.
టాలీవుడ్ టూ బాలీవుడ్..
నగరం వేదికగా నిర్వహించే పలు ఈవెంట్లలో వెస్ట్రన్, బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు ఎలక్ట్రిక్ జాజ్, లాకింగ్ వంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కావాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు. ఈ డ్యాన్స్ స్టెప్పులకు నగరవాసుల నుంచి వస్తున్న ఆదరణ అలా పెరిగిపోతుండటం విశేషం. ఇలాంటి డ్యాన్స్ నేరి్పంచడానికి నగరంలో ప్రత్యేకంగా డ్యాన్సింగ్ స్టూడియోలు సైతం నిర్వహిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు, హోలీ వంటి సంబరాల్లో భాగంగా పలు క్లబ్స్‌లో నిర్వహించే వేడుకల్లో, మ్యూజిక్ కన్సర్ట్స్ ముఖ్యంగా సినిమా ఆడియో ఫంక్షన్లు ఇతర కార్పొరేట్ కార్యక్రమాలకు ఈ డ్యాన్సర్లను ఆహా్వనిస్తున్నారు. స్థానికంగానే కాకుండా సీజన్లలో ముంబై, ఢిల్లీ వంటి నగరాల నుంచి ప్రత్యేకంగా ఈ నృత్యకారులను నగరానికి ఆహా్వనిస్తున్నారు. అంతేగాకుండా ఈ మధ్యకాలంలో ప్లాష్ మాబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. నగరంలోని పెద్ద పెద్ద మాల్స్‌లో విరివిగా ప్లాష్‌మాబ్స్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నారు. పేజ్ త్రీ పీపుల్ నిర్వహించే ప్రైవేట్ పార్టీల్లో సాల్సా వంటి డ్యాన్సులను ఆస్వాదిస్తున్నారు.
సిటీ నుంచి.. గోవా ఫెస్టివల్స్‌కు..
సినిమాల్లో సైడ్ డ్యాన్సర్లుగా చేస్తూనే మిగతా సమయాల్లో ఇలాంటి ఈవెంట్స్‌లో బిజీగా ఉంటున్నారు డ్యాన్స్ ప్రేమికులు. ఇదో ఉపాధిగానూ, అవకాశాలు కల్పించే ప్రత్యామ్నాయ వేదికగానూ డ్యాన్సర్లకు ఉపయోగపడుతుందని పలువురు డ్యాన్సర్లు పేర్కొన్నారు. నగరం నుంచి గోవా ఫిల్మ్ ఫెస్టివల్స్, నూతన సంవత్సర వేడుకలు తదితర కార్యక్రమాలకు వెళ్తున్నామని వారు తెలిపారు. నగరంలో ప్రత్యేకంగా నిర్వహించే మ్యూజిక్ కన్సర్ట్స్, నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే దాండియా ఈవెంట్స్‌లో ఈ డ్యాన్సర్లను ముందస్తుగానే బుక్ చేసుకోవడం విశేషం. ఈ మధ్య కాలంలో సంగీత్స్‌లో డ్యాన్సర్లకు బాగా డిమాండ్ పెరిగింది. ప్రతీ సంగీత్‌లో కనీసం ఒక కొరియోగ్రాఫర్, తనతో పాటు నృత్య బృందం పాల్గొనడమే కాకుండా నిర్వాహకులకు శిక్షణ అందించి సంగీత్‌లో సందడి చేస్తున్నారు.
అవకాశాలెన్నో..
గతంతో పోలిస్తే ప్రస్తుతం డ్యాన్సర్లకు విభిన్న వేదికల్లో అవకాశాలు పెరిగాయి. మోడ్రన్ స్టెప్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే చాలు.., స్ట్రీట్ డ్యాన్సింగ్ నుంచి సినిమా ఫంక్షన్ల వరకు ఎన్నో అవకాశాలు. నగరం వేదికగా పలు సినిమా ఆడియో ఫంక్షన్లు, కార్పొరేట్ నైట్ ఈవెంట్స్‌తో పాటు తదితర లైఫ్ స్టైల్ ఈవెంట్లలో డ్యాన్సర్‌గా పాల్గొన్నారు. అంతేగాకుండా గోవా వేదికగా జరిగే డ్యాన్స్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్నారు. ఇలాంటి వేదికలు మారుతున్న డ్యాన్స్ కల్చర్‌పైన అవగాహన పెంచుతాయి. ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్‌కు ఆదరణ బాగా పెరిగింది. ఎలక్ట్రిక్ జాజ్, లాకింగ్ వంటి అధునాతన డ్యాన్సింగ్ స్టెప్పులు నగరానికి ఈ మధ్య వస్తున్నాయి. – శ్రీకాంత్, కొరియోగ్రాఫర్, శ్రీస్ డ్యాన్స్ స్టూడియోస్
సాల్సా సైతం..
20 ఏళ్లుగా నగరం వేదికగా డ్యాన్స్‌లో వస్తున్న మార్పులను గమనిస్తున్నాను. సిటీలో ఎక్కువగా టాలీవుడ్, బాలీవుడ్, హిప్‌హాప్‌కు క్రేజ్ ఉంది. నగరంతో పాటు బెంగళూరు వంటి నగరాల్లో అప్పుడప్పుడూ జాజ్, ఫ్రీక్ స్టైల్ వంటివి సందడి చేస్తున్నాయి. ఇవే కాకుండా ప్రత్యేకంగా సాల్సా, బచ్చాటా వంటి డ్యాన్సులను ఆస్వాదించే నగరవాసులున్నారు. కొంత కాలం పాటు క్లాసికల్ సమ్మిళితమైన బిబాయింగ్ వంటి డ్యాన్సులనూ నగరవాసులు చేసేవారు. డ్యాన్స్ లేకుండా ఈవెంట్స్ లేవు అనేంతలా డ్యాన్స్ పరిణామ క్రమం మారింది. ఈవెంట్స్‌తో పాటు ఫ్రీక్, హిప్ హాప్ వంటి డ్యాన్స్ ఫెస్టివల్స్ సైతం నిర్వహిస్తుంటారు. – నాగేంద్ర, కొరియోగ్రాఫర్, డ్యాన్సర్
ఇవి చదవండి: మునుపటి కాలం కాదు ఇది, కానీ..
Comments
Please login to add a commentAdd a comment