ఆదరణ పొందుతున్న బ్యాండ్స్..
రెస్టో బార్స్, కేఫ్స్, పబ్స్.. వేదిక ఏదైనా..
వారాంతంలో లైవ్ షోల జోరు...
కెరీర్‌పై మ్యూజిక్ ఆర్టిస్టుల ఫోకస్..
మ్యూజిక్.. గత కొంతకాలంగా నగరంలో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్‌కు ఆదరణ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా వారాంతాల్లో రెస్టో బార్స్, కేఫ్, పబ్స్‌లో ఈ లైవ్ మ్యూజిక్ సందడి కనిపిస్తోంది. గతంలో ఫేమస్ దేశీయ, విదేశీ బ్యాండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించే లైవ్ మ్యూజిక్ కన్సర్ట్‌ల కోసం నగర వాసులు, సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురు చూసేవారు. కానీ ప్రస్తుతం నగర యువత నుంచి పెద్దల వరకూ స్థానిక మ్యూజిక్ బ్యాండ్స్‌ను ఆదరిస్తున్నారు.
వారి మ్యూజిక్‌ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో వారాంతాల్లో సాయంకాలం డైనింగ్‌కు వెళ్లడం నగరంలో పస్తుతం ట్రెండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో నగరంలో కూడా అధిక సంఖ్యలో మ్యూజిక్ బ్యాండ్స్ పుట్టుకొస్తున్నాయి. సింగర్లు, గిటారిస్టులు, కీ బోర్డ్ ప్లేయర్లు ఇలా సంగీతంతో ప్రయాణం చేస్తున్న ఆరి్టస్టులకు ఇదొక కెరీర్‌గా మారింది.
లైవ్ మ్యూజిక్.. ట్రెండీ కన్సర్ట్స్..
ప్రస్తుత యువతరానికి లైవ్‌లో మ్యూజిక్ వినడం అనేది ఓ వ్యాపకంలా మారింది. ఎప్పటికప్పుడు మారుతున్న అధునాతన ట్రెండ్స్‌ను అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ నగరం ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇలాంటి పలు కారణాలతో నగరంలో మ్యూజిక్ కన్సర్ట్‌ల నిర్వహణ విపరీతంగా పెరిగింది. వీటికి అనుగుణంగానే దాదాపు 50 నుంచి 60 మ్యూజిక్ బ్యాండ్స్ రూపుదిద్దుకున్నాయి. ఒక్కో బృందంలో ఐదు నుంచి ఏడుగురు సభ్యులతో ఆరి్టస్టులు ఉండగా కొన్ని బృందాల్లో పది మంది వరకూ తమ సంగీత కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.
సినిమాల్లో సైతం...
ఒక అంచనా ప్రకారం నగరంలో దాదాపు 1500 మంది సంగీత కళాకారులు ఈ మ్యూజిక్ కన్సర్ట్‌లతో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. సింగర్లు, వయోలిన్ నిపుణులు, గిటారిస్ట్స్, వోకల్ ఆరి్టస్టులు, కీ బోర్డ్ ప్లేయర్లు, ఉత్సాహాన్ని పెంచే డ్రమ్ ఆరి్టస్టులు ఇలా పలువురికి ఇదొక ప్రత్యామ్నాయ కెరీర్‌గా మారింది. ఇందులోని సభ్యుల్లో చాలా మంది సినిమాలకు సైతం పనిచేస్తున్నారు. అంతేకాకుండా సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్లుగా, మ్యుజీషియన్లుగా ప్రసిద్ధి చెందిన వారు సైతం ఈ లైవ్ కన్సర్ట్‌లు నిర్వహిస్తుండడం విశేషం. ఒక్కో ఈవెంట్‌కు లక్ష నుంచి 2 లక్షల వరకూ డిమాండ్ ఉండగా.. ఫేమస్‌గా నిలిచిన బ్యాండ్‌లు, ఇప్పటికే ఇండస్ట్రీలో నిలిచిన బ్యాండ్స్‌కు 4, 5 లక్షల వరకూ పేమెంట్‌లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సొంత బ్యాండ్‌లను తయారు చేసుకున్నారు పలువురు స్టార్ సింగర్లు, మ్యుజీషియన్లు.
సోషల్ సెలబ్రిటీలుగా బ్యాండ్స్..
మాకు.. సంగీత ప్రియులను సంతృప్తి పరచడం కన్నా మించిన లక్ష్యం మరొకటి ఉండదు. ఈ మధ్య కాలంలో ఈ మినీ మ్యూజిక్ కన్సర్ట్స్‌కు ఆదరణ పెరగడం చాల సంతోషంగా ఉంది. స్వతహాగా దాదాపు పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఎన్నో సినిమాల్లో పాటలు పాడాను, పాడుతున్నాను. ఇలా మా రుద్ర బ్యాండ్‌లో ఉన్న పలువురు సినిమాలకు పనిచేస్తున్నారు. వీటితో పాటుగానే మ్యూజిక్ కన్సర్ట్స్‌లో మా ప్రతిభను ప్రదర్శిస్తున్నాం. నెలలో కనీసం 10, 12 ఈవెంట్లలో మా మ్యూజిక్ ప్రేక్షకులను అలరిస్తుంది.
రెస్టో బార్‌లు, క్లబ్స్, ప్రైవేటు ఫంక్షన్‌ల నుంచి మాకు ఆహ్వానం అందుతుంది. సినిమాల్లోని పాటలనే అధునాతన ట్రాక్‌లకు అన్వయిస్తూ, విభిన్నంగా సంగీతాన్ని ప్రదర్శిస్తుంటాం. 9 వందల షోలలో నేను పాటలు పాడాను. ఈ అనుభవంతోనే గతేడాది రుద్ర బ్యాండ్ నా మిత్రుడు జయంత్‌తో కలిసి ప్రారంభించాం. సీజన్‌లో ప్రతి నెలా 15 వరకూ ఈవెంట్లను చేయగలుగుతున్నాం. మమ్మల్ని సోషల్ సెలబ్రిటీలుగా గుర్తిస్తుండటం సంతోషాన్నిస్తుంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు వంటి పలు నగరాల్లో కూడా ప్రదర్శనలు చేశాం. – రాఘవేంద్ర, రుద్ర బ్యాండ్ వ్యవస్థాపకులు, ప్రముఖ సింగర్
Comments
Please login to add a commentAdd a comment