సాక్షి, తాడేపల్లి: వర్క్‌షాప్ సక్సెస్‌తో వైఎస్సార్‌సీపీలో మరింత జోష్ పెరిగింది. ప్రతిపక్షంగానే కాదు.. ప్రజాపక్షంగా పోరుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు సర్కార్‌పై పోరాటానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెడీ అయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భదత్రలు అదుపు తప్పగా, బాధితులకు అండగా నిలిచేందుకు ఎక్కడిక్కడ ప్రత్యేక టీములు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి దశలోనూ పార్టీ పటిష్ట నిర్మాణం దిశగా, గ్రామ, బూత్ కమిటీలతో పాటు అనుబంధ విభాగాల ఏర్పాటు చేశారు. ప్రజల కోసం పార్టీ పిలుపునిస్తే ఉవ్వెత్తున స్పందించేలా బలోపేతం చేశారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు.
‘‘మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. మనం చొరవ తీసుకుని అన్ని అంశాలపై స్పందించాలి. గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలపై స్పందించాలి. అన్యాయాలపై స్పందించాలి. బాధితులకు అండగా నిలవాలి. మనవైపు నుంచి స్పందన లేకపోతే ఆ అంశం మరుగున పడుతుంది. ప్రజలకు న్యాయం జరగదంటూ నిన్న(గురువారం) జరిగిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌లో వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
మరోవైపు, చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో చర్చ మొదలైంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిగిన మంచిని జనం గుర్తు చేసుకుంటున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వంపై కనిపిస్తోంది. ఒకవైపు హామీల అమలు లేకపోగా, మరోవైపు రాష్ట్రంలో పాలన దారుణంగా తయారైంది. దాదాపు రూ.2,400 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఆస్పత్రులు నిర్వీర్యం అయ్యాయి. ఎక్కడ చూసినా స్కాంలే కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: బలంగా ఎదుగుదాం.. పార్టీని పటిష్టంగా నిర్మిద్దాం: వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment