Modern techniques
-
29 నుంచి రైతు సంఘం వర్క్‌షాపు
కడప కోటిరెడ్డి సర్కిల్ : ఈ నెల 29వ తేదీ నుంచి 30 వరకు కడప నగరం చిన్నచౌకులోని సప్తగిరి కళ్యాణ మండపంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహించనున్నట్లు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.రామసుబ్బారెడ్డి, ప్రదాన కార్యదర్శి జి.చంద్ర తెలిపారు. మంగళవారం స్థానిక ఎద్దుల ఈశ్వర్రెడి హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే వర్క్‌షాపులో వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు – ప్రభుత్వ పాత్ర , సమస్యలు పరిష్కార మార్గాలు, కరువు, నీటి పారుదల (ఆవశ్యకత), రుణమాఫీ ఆవశ్యకత, ప్రభుత్వం, కౌలుదారి వ్యవస్థ వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తారన్నారు. ఈ వర్క్‌షాపునకు అఖిల భారత కిసాన్ సభ ఉపా«ధ్యక్షుడు రావుల వెంకయ్య, రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి కె.బి.వి. ప్రసాద్, సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య హాజరవుతారన్నారు. -
యువ కృషీవలురు!
మేడ్చల్: ఒకప్పుడు రియల్ ఎస్టేట్ మాయాజాలంలో పడి వ్యవసాయానికి దూరమైన నగర శివారు ప్రాంత రైతులు ప్రస్తుతం సేద్యంపై దృష్టిసారించారు. పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తూ ఆశించిన దిగుబడులు సాధిస్తున్నారు మండలంలోని రాయిలాపూర్ యువ రైతులు. కూరగాయలు, ఆకుకూరల పంటల సాగులో డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను ఉపయోగిస్తూ తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగు చేస్తున్నారు. రాయిలాపూర్‌లో దాదాపు 200 ఎకరాల్లో పలు రకాల కూరగాయలు, ఆకుకూరల పంటలు సాగవుతున్నాయి. గ్రామంలోని 100 మంది రైతుల్లో 50 మంది యువకులే ఉండటం.. వ్యవసాయంపై వారికి ఎంత మక్కువ ఉందో అర్థమవుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి.. కూలీలపై ఆధారపడకుండా కు టుంబ సభ్యులే ఆకుకూరలను కట్టలుగా తయారు చేస్తున్నారు. కూరగాయలను కోసి గంపల్లో వేసి నగరంలోని వివిధ మార్కెట్లకు తరలిస్తున్నారు. చిన్న రైతులు చిరు వ్యాపారులకు పొలం వద్దనే విక్రయిస్తున్నారు. మరికొంత మంది మేడ్చల్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రైతేరాజు అని నిరూపిస్తున్నారు.