14న ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్‌పై ఉచిత వర్క్‌షాప్
Published Mon, Aug 8 2016 11:57 PM | Last Updated on Tue, Oct 2 2018 3:27 PM
అక్కయ్యపాలెం: తక్కువ ఖర్చుతో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి సోషల్ మీడియా సహకారంతో ఇండిపెండెంట్ సినిమా ఏ విధంగా నిర్మించవచ్చు అనే అంశంపై ఈనెల 14న పౌరగ్రంథాలయంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు కార్టూనిస్టు హరి వెంకట్ తెలిపారు. అక్కయ్యపాలెం శాంతిపురంలోని ఆర్.కె.మీడియా హౌస్‌లో సోమవారం ఉదయం ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ ఇండిపెండెంట్ సినిమా దర్శకుడు క్యాంప్ శశి శిక్షణ ఇస్తారని తెలిపారు. మెయిన్ స్ట్రీమ్ సినిమా ఒరవడికి భిన్నంగా ప్రపంచ సినిమా స్ఫూర్తితో సమాంతర, ఇండిపెండెంట్ సినిమా నిర్మాణం జరుగుతోందన్నారు. ఇటీవల కాలంలో ఇండిపెండెంట్ సినిమా విశేష ఆదరణ పొందుతోందన్నారు. అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఇండిపెండెంట్ సినిమాలు ప్రశంసలతోపాటు అవార్డులు గెలుచుకున్నాయని గుర్తుచేసారు. భౌగోళికంగా, సాంస్కతికంగా విభిన్నమైన వాతావరణం ఉన్న విశాఖ నగరంలో ఇటువంటి ఇండిపెండెంట్ సినిమాల నిర్మాణం జరగాలని అభిలాషిస్తూ ఆర్.కె.మీడియా హౌస్, ధరణి సొసైటీ సంయుక్తంగా ఉచిత వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పాల్గొనదలచినవారు మరిన్ని వివరాలకు 9866084124 ఫోన్ నంబరుకు సంప్రదించవచ్చన్నారు.
Advertisement
Advertisement