బుడ్డేడే కదా అనుకుంటే బుగ్గిచేశాడు | Toddler burns down a whole workshop in China | Sakshi
Sakshi News home page

బుడ్డేడే కదా అనుకుంటే బుగ్గిచేశాడు

Published Thu, Apr 3 2014 6:18 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Toddler burns down a whole workshop in China

మూడేళ్ల బుజ్జిగాడు సిగరెట్ లైటర్ తో ఆడుకుంటూంటే ఎవరూ పట్టించుకోలేదు. అలా ఆడుతూ అడుతూ లైటర్ వెలిగించాడు. అక్కడ పడున్న స్పాంజి ముక్కలకు నిప్పంటించాడు. ఆ నిప్పు పెరిగి పెరిగి పెద్దదై ఒక పెద్ద దుస్తుల వర్క్ షాప్ నే బుగ్గి చేసింది.

ఆ పిల్లవాడు వర్క్ షాపు యజమాని. మొత్తం మీద పిల్లవాడు ఏమీ కాకుండా బయటపడ్డాడు కానీ ఈ సంఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. మొత్తం వర్క్ షాపు బూడిదైపోయింది. ఈ సంఘటన చైనాలోని గువాంగ్ డాంగ్ ప్రాంతం లోని జున్ బు లో జరిగింది.


ఇప్పుడు చైనా పోలీసులు వర్క్ షాప్ యజమానిని అరెస్టు చేశారు. ఆయన వర్క్ షాప్ పలు భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించాడు. కనీస అనుమతులు సైతం లేవు. మరోవైపు ప్రమాదం వల్ల చనిపోయిన, గాయపడ్డ వారికి పరిహారం ఇవ్వడం జరిగిందని చైనా మీడియా వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement