Guangdong
-
చైనా ఒబామా.. తడాఖా చూద్దామా!
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను పోలిన చైనా ‘ఒబామా’ అందరినీ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అంతేకాదు ఒబామాలా నటించడానికి ఫీజు కూడా వసూలు చేస్తున్నాడు. ఒబామా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనుండడంతో చైనా ఒబామా భవితవ్యం సందిగ్దంలో పడింది. అచ్చుగుద్దినట్టు ఒబామా ఉన్న అతడి పేరు జియావొ జిగ్యు. సిచుయన్ ప్రాంతానికి చెందిన అతడు గతంలో గ్వాంగ్ డాంగ్ లో సెక్యురిటీగా పనిచేసేవాడు. 2012లో ఒబామా రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో జియావొకు గుర్తింపు దక్కింది. అచ్చం ఒబామాలా ఉన్నావంటూ సహచరుడు చెప్పడంతో ఉద్యోగానికి టాటా చెప్పేసి ఒబామాను అనురించడం మొదలు పెట్లాడు. 2014లో టీవీలో చేసిన కార్యక్రమంతో అతడికి గుర్తింపు లభించింది. ఒబామాను అనుకరిస్తూ వచ్చిరాని ఇంగ్లీషులో అతడు చేసే ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఒక్కో షోకు దాదాపు 70 వేల రూపాయాల వరకు తీసుకుంటున్నాడు. తన టాలెంట్ ను మెరుగు పరుచుకునేందుకు బీజింగ్ ఫిల్మ్ అకాడమిలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఒబామా పదవి దిగిపోతే తనకు ఉపాధి కరువుతుందన్న బెంగతో ఉన్నాడు చైనా ఒబామా. -
ఈ మెట్లు ఎక్కగలవా...ఓ నరహరి!
బీజింగ్: సాహసం చేస్తే పోయేదేమీ లేదు ప్రాణాలు తప్పా! అన్నట్లుగా ఉంది ఆ దారి. దక్షిణ చైనా, గ్వాంగ్డాంగ్లోని గోల్డ్ మౌంటేన్ పర్వత శిఖరాగ్రంను చేరుకునేందుకు అత్యంత ప్రమాదకర మెట్లదారిని నిర్మించింది చైనా ప్రభుత్వం. సముద్ర మట్టానికి 4,650 అడుగుల ఎత్తులోవున్న పర్వత శిఖరాగ్రంను చేరుకునేందుకు ఏర్పాటు చేసిన మెట్లదారిలో 1640 అడుగుల మేర మెట్లు మాత్రం అచ్చం నిచ్చెనలానే ఉంటాయి. ముందు వెళుతున్న వ్యక్తి పట్టుతప్పి పడిపోతే...ఆ వెనకాలే మెట్లు ఎక్కుతున్నవారంతా పడిపోవడం ఖాయమని చెప్పొచ్చు. దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ మెట్ల దారిని పర్యాటకుల కోసం సెప్టెంబర్ 27వ తేదీన ప్రారంభించారు. కొద్ది రోజులు మాత్రమే పర్యాటకుల కోసం తెరచి ఉంచుతామని, ప్రమాదాలను అంచనా వేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చైనా పర్యాటక శాఖ ప్రకటించింది. దీనిపై చైనాలో ట్విట్టర్‌కు సమానమైన ‘వీబో’ సోషల్ వెబ్సైట్లో కామెంట్స్ విరివిగా వచ్చి పడుతున్నాయి. సాహసం సేయరా డింబకా! అంటూ ట్వీట్ల ద్వారా ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అది ఎంత సురక్షితమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలోనే ఇది ప్రమాదకర దారంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సాహసం చేస్తే రాజకుమారి దక్కుతుందో, లేదోగానీ జీవితానికి సరిపడా ఓ అత్యద్భుత అనుభూతి మాత్రం మిగులుతుంది. అందమైన పర్వతాలకు, లోయలకు, వాటర్ ఫాల్స్‌కు నెలవైన గోల్డ్ మౌంటేన్ ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. -
బుడ్డేడే కదా అనుకుంటే బుగ్గిచేశాడు
మూడేళ్ల బుజ్జిగాడు సిగరెట్ లైటర్ తో ఆడుకుంటూంటే ఎవరూ పట్టించుకోలేదు. అలా ఆడుతూ అడుతూ లైటర్ వెలిగించాడు. అక్కడ పడున్న స్పాంజి ముక్కలకు నిప్పంటించాడు. ఆ నిప్పు పెరిగి పెరిగి పెద్దదై ఒక పెద్ద దుస్తుల వర్క్ షాప్ నే బుగ్గి చేసింది. ఆ పిల్లవాడు వర్క్ షాపు యజమాని. మొత్తం మీద పిల్లవాడు ఏమీ కాకుండా బయటపడ్డాడు కానీ ఈ సంఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. మొత్తం వర్క్ షాపు బూడిదైపోయింది. ఈ సంఘటన చైనాలోని గువాంగ్ డాంగ్ ప్రాంతం లోని జున్ బు లో జరిగింది. ఇప్పుడు చైనా పోలీసులు వర్క్ షాప్ యజమానిని అరెస్టు చేశారు. ఆయన వర్క్ షాప్ పలు భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించాడు. కనీస అనుమతులు సైతం లేవు. మరోవైపు ప్రమాదం వల్ల చనిపోయిన, గాయపడ్డ వారికి పరిహారం ఇవ్వడం జరిగిందని చైనా మీడియా వెల్లడించింది. -
విమానాశ్రయం.. అదుర్స్
ఎయిర్పోర్ట్ టెర్మినల్ అదుర్స్ కదూ.. చైనాలోని గువాంగ్‌డాంగ్‌లో ఇటీవల ప్రారంభమైన షెంజెన్బావో అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ ఇది. టేకు చేప ఆకారంలో దీన్ని కట్టారు. టెర్మినల్ పైకప్పు తేనెపట్టు డిజైన్‌ను తలపిస్తుంది. పైన అద్దాలను అమర్చడం వల్ల టెర్మినల్ లోపలి భాగానికి సూర్యకాంతి ధారాళంగా వెళ్తుంది. దీని వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. అంతేకాదు.. వర్షపు నీటిని నిల్వ చేసి.. దాన్ని రీసైకిల్ చేసి.. బాత్రూంలకు, మొక్కలకు వాడతారు. ఇందులో 10 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ కూడా ఉంది. అంతేనా.. ఇంటీరియర్ డిజైన్‌కు తగ్గట్లు ఏసీలు కూడా తెల్లటి చెట్టు మోడు ఆకారంలో ఉంటాయి. ఇంతకీ దీన్ని కట్టడానికి ఎంత అయిందో తెలుసా? రూ.8,700 కోట్లు.