చైనా ఒబామా.. తడాఖా చూద్దామా! | Meet China’s Obama lookalike who makes $1000 per show | Sakshi
Sakshi News home page

చైనా ఒబామా.. తడాఖా చూద్దామా!

Published Tue, Dec 6 2016 5:52 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM

చైనా ఒబామా.. తడాఖా చూద్దామా!

చైనా ఒబామా.. తడాఖా చూద్దామా!

బీజింగ్‌: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను పోలిన చైనా ‘ఒబామా’ అందరినీ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అంతేకాదు ఒబామాలా నటించడానికి ఫీజు కూడా వసూలు చేస్తున్నాడు. ఒబామా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనుండడంతో చైనా ఒబామా భవితవ్యం సందిగ్దంలో పడింది.

అచ్చుగుద్దినట్టు ఒబామా ఉన్న అతడి పేరు జియావొ జిగ్యు. సిచుయన్‌ ప్రాంతానికి చెందిన అతడు గతంలో గ్వాంగ్‌ డాంగ్‌ లో సెక్యురిటీగా పనిచేసేవాడు. 2012లో ఒబామా రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో జియావొకు గుర్తింపు దక్కింది. అచ్చం ఒబామాలా ఉన్నావంటూ సహచరుడు చెప్పడంతో ఉద్యోగానికి టాటా చెప్పేసి ఒబామాను అనురించడం మొదలు పెట్లాడు.

2014లో టీవీలో చేసిన కార్యక్రమంతో అతడికి గుర్తింపు లభించింది. ఒబామాను అనుకరిస్తూ వచ్చిరాని ఇంగ్లీషులో అతడు చేసే ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఒక్కో షోకు దాదాపు 70 వేల రూపాయాల వరకు తీసుకుంటున్నాడు. తన టాలెంట్‌ ను మెరుగు పరుచుకునేందుకు బీజింగ్‌ ఫిల్మ్‌ అకాడమిలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఒబామా పదవి దిగిపోతే తనకు ఉపాధి కరువుతుందన్న బెంగతో ఉన్నాడు చైనా ఒబామా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement