సాక్షి, అమరావతి: స్పందన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విధానాన్ని తీసుకురావాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం సీఎస్ ఆధ్వర్యంలో స్పందన అర్జీల పరిష్కారానికి సంబంధించి వర్క్ షాపు నిర్వహించారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సంబంధింత కార్యదర్శులను సీఎస్ ఆదేశించారు. 12 శాఖలు ద్వారా 92 శాతం స్పందన ఫిర్యాదులను స్వీకరిస్తునట్లు తెలిపారు.
స్పందన అర్జీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని శాఖలు సకాలంలో బాధ్యతాయుతంగా ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు. స్పందన ఫిర్యాదుల పరిష్కారాలపై అక్టోబర్‌లో ఎమ్మార్వో, ఎండీవోలకు జిల్లాస్థాయిలో సెన్సిటైటేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎస్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment