spandana
-
గ్రీన్ చాయిసెస్..! ఎంపవర్ వాయిసెస్..!!
విశాఖపట్టణం పీ.ఎం పాలెంలోని ఈస్ట్రన్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్లో మానస తిన్ననూరి, స్పందన అంచల చేతుల మీదుగా పురుడు పోసుకుంది ‘బి ఎర్త్లీ’ అంకుర సంస్థ. కోటి మంది జీవితాలకు చేరువ కావాలనే లక్ష్యంతో వీరు తమ ప్రయాణాన్ని ్రపారంభించారు. ఇటీవల తమ సొంత స్టోర్ ‘వన సంపద’ను తూర్పు కనుమల జీవవైవిధ్య కేంద్రంలో ్రపారంభించారు. డిఎఫ్ఓ అనంత్ శంకర్ అందించిన సహకారంతో తమ కలను సాకారం చేసుకున్నారు.మానస బయోకెమిస్ట్రీలో పీజీ, ఎంబిఏ పూర్తిచేసి హార్వర్డ్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ హెల్త్ సిస్టమ్‌పై కోర్సు చేసింది. స్పందన ఇంజినీరింగ్ పూర్తిచేసి, ఎంఐటి బూట్ క్యాంప్ ్రపోగ్రామ్ చేసింది. గత పదమూడు సంవత్సరాలుగా ఈ ఇద్దరు సామాజికసేవా రంగంలో పనిచేస్తున్నారు. కోవిడ్ సమయంలో వాలెంటీలుగా పనిచేస్తూ పరిచయమయ్యారు.ప్లాస్టిక్‌ను నిరోధించాలి’ అనే నినాదంతో అగిపోకుండా ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి పరిశోధన చేసారు. దీనిలో భాగంగా చెట్ల నుంచి లభించే వివిధ ఉత్పత్తులను ఉపయోగించి, కార్యాలయాలు, ఇంటిలో ఉపకరించే వస్తువులను తయారుచేస్తున్నారు. రీసైకిల్డ్ పేపర్‌తో నోట్ పాడ్స్, డైరీలు, క్యాలెండర్లు తయారు చేస్తున్నారు. వీటిలో కంటికి కనిపించని చిన్న విత్తనాలను ఉంచుతారు. పెన్నులు, పుస్తకాలు వినియోగించిన తరువాత బయట పారవేసినా వాటిలో ఉండే విత్తనాలు సహజంగా మొలకెత్తుతాయి.రాఖీ పౌర్ణమి కోసం కొబ్బరి పెంకుతో సహజసిద్ధమైన రాఖీలు తయారుచేశారు. వెదురుతో టూత్ బ్రష్‌లు, దువ్వెనలు, పెన్‌స్టాండ్, మొబైల్ స్టాండ్, అందమైన రంగులతో కాటన్ చేతి సంచులు, మట్టి ప్రమిదలు, సీడ్ గణేష్, మట్టి, ఆవు పేడతో తయారు చేసిన కుండీలు...ఇలా పర్యావరణహితమైన ఎన్నో ఉత్పత్తులను వీరు తయారు చేసి విక్రయిస్తున్నారు. సంస్థ నినాదం గ్రీన్ చాయిసెస్.. ఎంపవర్ వాయిసెస్. వివిధ సందర్భాలలో బహుమతులుగా ఇవ్వడానికి ఉపయోగపడే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ వస్తువులను విశాఖకు అతి చేరువలో ఉన్న ఆదివాసీ గ్రామం శంభువానిపాలెంకు చెందిన ఆదివాసీ మహిళలతో చేయిస్తు వారికి ఉపాధి కల్పిస్తున్నారు. – వేదుల నరసింహం, ఫోటోలు: ఎం.డి నవాజ్, విశాఖపట్నం -
WhatsApp Scam: వాట్సాప్ లింక్ ద్వారా రూ.1.60 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు..!
కర్నూలు: ట్రేడ్స్ ఎక్స్ కంపెనీ పేరుతో సైబర్ నేరగాళ్లు తన వాట్సాప్‌కు లింక్ పంపి ఫోన్లో ఉన్న డేటా సేకరించి బ్యాంక్ ఖాతా నుంచి రూ.1.60 లక్షలు తీసుకుని మోసగించారని, చర్యలు తీసుకోవాలని ఎస్పీ కృష్ణకాంత్‌కు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన రిజ్వాన్ బాషా ఫిర్యాదు చేశారు. కర్నూలులోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో ఎస్పీ కృష్ణకాంత్ సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పందన కార్యక్రమానికి మొత్తం 66 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాసులు, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు తదితరులు స్పందనలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. స్పందనకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ● కన్సల్టెన్సీ పేరుతో కొంతమంది వ్యక్తులు ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేశారని , విచారణ జరిపి డబ్బులు వాపసు ఇప్పించాల్సిందిగా కర్నూలుకు చెందిన విష్ణు కోరారు. ● ఆస్తి కోసం కుమారుడు తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, రక్షణ కల్పించాల్సిందిగా హొళగుంద మండలం హెబ్బటం గ్రామానికి చెందిన ఈశ్వరప్ప వినతి పత్రం అందించారు. ● భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి సర్వేయర్‌ను కొలతలు వేయనివ్వకుండా శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ అనే వ్యక్తులు అడ్డుపడుతున్నారని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన వెంకటస్వామి ఫిర్యాదు చేశారు. ● పొలం కౌలుకు తీసుకున్న వ్యక్తి నకిలీ అగ్రిమెంట్లు సృష్టించి మోసం చేశాడని, తన పొలానికి కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ ఆరు ఎకరాల జొన్న పంటను దున్ని నాశనం చేసిన నగరూరు గ్రామానికి చెందిన రంగన్న, ప్రభాకర్‌లపై చర్యలు తీసుకోవాలని ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన హుసేనప్ప ఫిర్యాదు చేశారు. ● సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వైఎస్సార్ జిల్లాకు చెందిన మంజునాథ్ రెడ్డి డబ్బులు తీసుకుని నకిలీ నియామక పత్రాలు పంపి మోసం చేశాడని నాగలాపురం గ్రామానికి చెందిన ఉపేంద్ర, కర్నూలుకు చెందిన విష్ణుచరణ్లు ఫిర్యాదు చేశారు. -
నాలుగు కథలతో...
యడ్లపల్లి మహేశ్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని, సుదర్శన్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘కరెన్సీ నగర్’. వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకత్వంలో ముక్కాముల అప్పారావు, డా. కోడూరు గోపాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ‘‘ఈ చిత్రంలో డబ్బుకీ, మనిషికీ ఉన్న సంబంధాన్ని వెన్నెల కుమార్ చక్కగా చూపించారు. నాలుగు కథలతో ఈ చిత్రం సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
హత్యా? ఆత్మహత్యా?
స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధానపాత్రల్లో నటించిన ఇంటరాగేటివ్ ఫిల్మ్ ‘ది ట్రయల్’. రామ్ గన్ని దర్శకత్వంలో స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో శ్రీ విష్ణు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ది ట్రయల్’ ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉంది. రామ్ ఈ సినిమా కథను బాగా డీల్ చేశారనిపిస్తోంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘కథ రీత్యా సబ్ఇన్స్పెక్టర్ రూప, ఆమె భర్త అజయ్ ఓ అపార్ట్మెంట్ టెర్రస్‌పై తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంటారు. అజయ్ కాలుజారి ఆ బిల్డింగ్‌పై నుంచి పడి చనిపోతాడు. తన భర్తను రూపే చంపిదనే అనుమానం తెరపైకి వస్తుంది. అయితే తన భర్తది ఆత్మహత్య అని రూప చెబుతుంది. అసలు.. అజయ్‌ది హత్యా? ఆత్మహత్యా? అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
సరికొత్త ట్రయల్
స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ది ట్రయల్’. స్మృతీ సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ‘‘ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని కంప్లీట్ ఇంటరాగేటివ్ కథతో, సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్, సహనిర్మాత: సుదర్శన్ రెడ్డి. -
ఉద్యోగం పేరుతో మోసం
కర్నూలు(టౌన్): దివ్యాంగుల కోటా కింద కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని ఆదోని పట్టణానికి చెందిన వ్యక్తి డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఏఎస్పీ అడ్మిన్ టి.సర్కార్‌కు పెద్దకడుబూరు మండలం దొడ్డిమేకల గ్రామానికి చెందిన నాగరాజు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 85 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులన్నిటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని అడిషనల్ ఎస్పీ హామీ ఇచ్చారు. స్పందన కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, సీఐలు పాల్గొన్నారు. స్పందనకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ► తమ పొలంలో అక్రమంగా కాల్వ తవ్వి నీరు నిల్వ ఉండే విధంగా చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని చిప్పగిరి మండలం ఖాజీపురం గ్రామానికి చెందిన మాదేవమ్మ ఫిర్యాదు చేశారు. ► తన ఫేస్‌బుక్‌కు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.99కే ఇయర్ బడ్స్ ఆఫర్ ఉందని లింక్ వచ్చిందని, లింక్‌ను క్లిక్ చేసి బ్యాంక్ ఓటీపీ ఎంటర్ చేయగానే తన ఖాతా నుంచి రూ.18,400 నో బ్రోకరేజ్ కింద కట్ అయినట్లు మెసేజ్ వచ్చిందని కర్నూలుకు చెందిన మల్లికార్జున వాపోయారు. తనకు న్యాయం చేయాలని విన్నవించారు. ► మొత్తం 28 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిన కమీషన్ ఏజెంట్, లారీ డ్రైవర్లు 19 క్వింటాళ్లు మాత్రమే ఉందని మోసం చేస్తున్నట్లు నాగలాపురానికి చెందిన సత్యనారాయణ చౌదరి ఫిర్యాదు చేశారు. ► తమకున్న నాలుగు ఎకరాల పొలాన్ని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి దౌర్జన్యంగా లాక్కున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పత్తికొండకు చెందిన శాంతకుమారి ఫిర్యాదు చేశారు. ► తన పొలాన్ని కౌలుకు తీసుకున్న వ్యక్తి అక్రమంగా ఆన్లైన్లో పేరు నమోదు చేసుకుని పాస్‌బుక్ కూడా తీసుకున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని నన్నూరు గ్రామానికి చెందిన ఖాజా మియా ఫిర్యాదు చేశారు. -
స్పందనకు కన్నీటి వీడ్కోలు
కర్ణాటక: ప్రముఖ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య, నటి స్పందన అంత్యక్రియలు బుధవారం బెంగళూరు నగరంలోని హరిశ్చంద్ర ఘాట్‌లో జరిగాయి. ఆదివారం రాత్రి ఆమె థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్ టూర్లో హోటల్లో గుండెపోటుతో మరణించడం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటలకు ప్రత్యేక విమానంలో బెంగళూరుకు భౌతికకాయాన్ని తీసుకువచ్చారు. ప్రముఖుల సందర్శన విజయ్ రాఘవేంద్ర ఇంటి వద్ద ఉంచి సంప్రదాయాలను పూర్తి చేశారు. ఆమె భౌతికకాయానికి విజయ్ పూజలు చేస్తుండగా కుటుంబసభ్యులు బోరుమంటూ విలపించారు. తండ్రి బీకే శివరామ్ ఇంటి వద్ద ఉదయం ఆరు గంటల నుంచి జనం సందర్శన కోసం ఉంచారు. రాఘవేంద్ర రాజ్‌కుమార్, అశ్విని పునీత్ రాజ్‌కుమార్‌లు కుటుంబసమేతంగా అంతిమ దర్శనం చేసుకున్నారు. అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. స్పందన కొడుకు శౌర్యను పలువురు ఓదార్చారు. సాయంత్రం 4 గంటలకు ఊరేగింపుగా తీసుకువచ్చి మల్లేశ్వరం సమీపంలోని హరిశ్చంద్రఘాట్‌లో ఈడిగ కుల సంప్రదాయం ప్రకారం విద్యుత్ దహనవాటికలో అంత్యక్రియలను పూర్తిచేశారు. ఆమె మృతిపై సీఎం, డిప్యూటీ సీఎం సహా అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు. -
నేడు స్పందన భౌతికకాయం తరలింపు?
యశవంతపుర: బ్యాంకాక్‌లో గుండెపోటుతో మృతి చెందిన నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన అంత్యక్రియలు బుధవారం సాయంత్రం జరిగే అవకాశాలున్నాయి. స్పందన తండ్రి బీకే శివరామ్‌కు ఫాంహౌస్‌లో నిర్వహించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. బెంగళూరు మల్లేశ్వరంలోని బీకే శివరామ్ నివాసంలో ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ఉంచి అంత్యక్రియలకు తరలిస్తారు. స్పందన మృతదేహానికి బ్యాంకాక్‌లో పోస్టుమార్టం ఆలస్యం, ఇతర న్యాయ ప్రక్రియల వల్ల ఇంకా బెంగళూరుకు తీసుకురాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. బ్యాంకాక్‌లో బుధవారం ఒంటిగంటకు మృతదేహాన్ని అప్పగించే అవకాశముంది. అక్కడి నుంచి కుటుంబసభ్యులు బెంగళూరుకు ప్రత్యేక విమానంలో తీసుకురానున్నారు. స్పందన, విజయ్రాఘవేంద్ర కుటుంబాలు బ్యాంకాక్‌లో ఉన్నాయి. స్పందన మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. -
భార్య చేతిలో చెయ్యేసి ఏడ్చేసిన నటుడు.. వీడియో వైరల్
కన్నడ నటుడు, సింగర్ విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన గుండెపోటుతో కన్నుమూసింది. బ్యాంకాక్‌లో విహారయాత్రకు వెళ్లిన ఆమె ఆగస్టు 7న ఉదయం తుదిశ్వాస విడిచింది. స్పందన మరణంతో రాఘవేంద్రరావు కుటుంబంలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. భార్యను ప్రాణంగా ప్రేమించే విజయ్‌కు దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి ఫిక్స్ !) వీరిద్దరూ జంటగా ఓ షోలో పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దాదాపు రెండు నెలల క్రితం రాఘవేంద్ర తన భార్యతో కలిసి ఓ షోలో పాల్గొన్నాడు. తను జీవితంలో పడ్డ కష్టాలను, తన కుటుంబం అందించిన సపోర్ట్‌ను తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. తన భార్య చేయిని పట్టుకుని.. 'ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్నో ఇబ్బందులు వస్తాయి.. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ చేయి విడవద్దు. వందేళ్లపాటు కలిసి ప్రయాణిద్దాం' అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో చూస్తుంటే తమ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయంటున్నారు అభిమానులు. కాగా విజయ్ రాఘవేంద్ర సుమారు 50 సినిమాల్లో నటించడమే కాకుండా 20కు పైగా పాటలు పాడారు. ఆ మధ్య బిగ్‌బాస్ షోలోనూ కనిపించారు. స్పందనను ప్రేమించిన ఆయన 2007లో ఆమె మెడలో మూడుముళ్లు వేశాడు. వీరికి శౌర్య అనే కుమారుడు ఉన్నాడు. స్పందన సైతం పలు చిత్రాల్లో నటించగా భర్త రాఘవేంద్ర నటించిన కొన్ని మూవీస్‌కు నిర్మాతగానూ వ్యవహరించింది. చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రస్టింగ్ కామెంట్స్ This was just 2 months back!💔 ಯಾಕ್ ದೇವ್ರು ಒಳ್ಳೆಯವ್ರಿಗೆ ನೋವು ಕೊಡ್ತಾನೆ? ರಾಘು ಸರ್ ಆ ದೇವ್ರು ನಿಮಗೆ ಈ ನೋವು ಭರಿಸೋ ಶಕ್ತಿ ಕೊಡ್ಲಿ🙏🏻#Spandana #VijayRaghavendra pic.twitter.com/AWzHQrnyBj — Ullas (@Ullasshetty48) August 7, 2023 -
జిమ్ చేస్తున్నా గుండెజబ్బులు.. సిద్దార్థ్ నుంచి స్పందన వరకు.. కారణమేంటి?
సాధారణంగానే సెలబ్రిటీలు స్ట్రిక్ట్ డైట్‌ను ఫాలో అవుతుంటారు. వయసు పైబడుతున్నా ఇంకా అదే గ్లామర్‌ను మెయింటైన్ చేస్తున్న వాళ్లు ఎందరో ఉన్నారు. అదే సమయంలో 40ఏళ్లు కూడా నిండకుండానే గుండెపోటుతో ఇటీవల తరచూ సెలబ్రిటీలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.సరైన జీవనశైలి, పౌష్టికాహారం, శారీరక శ్రమ ఉంటే గుండెపోటు నుంచి కశ్చితంగా తప్పించుకోవచ్చు అనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని సెలబ్రిటీల మరణాలను చూస్తే అర్థమవుతుంది.వయసుతో సంబంధం లేకుండా చిన్నవయసులోనే ఎంతోమంది సెలబ్రిటీలు గుండెపోటుతో మరణించిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిద్దార్థ్ శుక్లా నుంచి స్పందన వరకు.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలు వీళ్లే.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలుగతంలో హిందీ ‘బిగ్ బాస్’ సీజన్ 13 విజేత, ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ నటుడు సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చనిపోయేనాటికి ఆయన వయస్సు కేవలం 40 ఏళ్లు మాత్రమే. ఆయన నిత్యం వ్యాయాయం చేస్తూ ఆరోగ్యకరమైన డైట్‌ను ఫాలో అయ్యేవాడు. చనిపోయే ముందురోజు కూడా వర్కవుట్స్ చేశాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్ధార్థ్ దురదృష్టం కొద్దీ ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూశాడు.ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ కూడా 2021లో గుండెపోటుతోనే హఠార్మణం చెందిన విషయం తెలిసిందే. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ 46 ఏళ్ల వయసులోనే హార్ట్ఎటాక్కు గురయ్యారు. యన సినిమాలకంటే కూడా పునీత్ ప్రజలకు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు అలాంటి అభిమానులను సంపాదించుకునేలా చేసింది. పునీత్ మరణ వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.చిన్నవయసులోనే హార్ట్ఎటాక్మరో కన్నడ నటుడు చిరంజీవి సర్జా కూడా గుండెపోటుతోనే మరణించారు. ఈయన ప్రముఖ నటుడు అర్జున్‌కు స్వయానా మేనల్లుడు. 35ఏళ్ల వయస్సులోనే హార్ట్ ఎటాక్‌తో చిరంజీవి సర్జా కన్నుమూశారు. చిరంజీవి సర్జా 2009లో వాయుపుత్ర చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సుమారు 19 సినిమాల్లో నటించాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన గుండెపోటుతో అకాల మరణం చెందాడు. చదవండి: హీరో భార్య మృతి, చిన్నవయసులోనే గుండెజబ్బులు..ఎందుకిలా?టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న కూడా గుండెపోటుతోనే కన్నుమూశారు. 39 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో అర్థంతరంగా తారకరత్న తనువు చాలించాడు. సుమారు 23రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. పునీత్ కుటుంబంలో మరో విషాదంతాజాగా కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించింది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి గుండెపోటుతో కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే ఆమె స్థానిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర దగ్గర బంధువు.2021లో పునీత్ కూడా గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు వారి కుటుంబం నుంచే స్పందన కూడా మరణించడం శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఈనెలలో ఈ జంట తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. కానీ ఆ వేడకకు కొన్నిరోజులు ముందే స్పందన ఇలా హఠాన్మరణం చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.వ్యాయామం చేస్తున్నా ఎందుకీ గుండెజబ్బులు?స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నా చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకొస్తుందనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని వేధిస్తుంది. గతంలో 25-30-40 ఏళ్ల వయస్సులో గుండెపోటు అనేది చాలా అరుదుగా ఉండేది. కానీ ఇటీవలికాలంలో ఈ సంఖ్య పెరుగుతోంది. వర్కవుట్స్ చేస్తే మంచిదే కదా అని అతిగా వ్యాయామాలు చేయకూడదు.దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతంది. యువత చాలా ఎక్కువ జిమ్ చేస్తుంటారు. కానీ జిమ్‌లో చేసే కొన్ని పొరపాట్లు కూడా గుండెపోటుకు కారణమౌతుంటుంది. వ్యాయామం ఎప్పుడూ సాధారణ స్థాయిలో, మితంగా ఉండాలి. పరిమితి దాటితే అనర్థాలు తప్పవు.హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంపై, గుండెపై దుష్ప్రభావం పడుతుంది. గంటల తరబడి వ్యాయామం చేయడం కూడా మంచిది కాదని, వయసు పెరుగుతున్న కొద్దీ డాక్టర్ల సూచనతో వ్యాయామం, డైట్‌ను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. -
‘స్పందన’ ఫిర్యాదుతో అక్రమ మైనింగ్ బట్టబయలు
సాక్షి, అమరావతి: స్పందనలో అందిన ఫిర్యాదు ఆధారంగా నిర్వహించిన తనిఖీల్లో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రూ.వందల కోట్ల విలువైన అక్రమ మైనింగ్ వ్యవహారం బట్టబయలైంది. రోడ్డు మెటల్ తవ్వకాల కోసం లీజుకున్న తీసుకున్న భూమిలో స్టోన్ క్రషర్, వే బ్రిడ్జిలు, క్వార్టర్లు నిర్మించడంతోపాటు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారు. ఒక్క టన్ను మెటల్ తవ్వకున్నా తవ్వినట్లుగా స్థానిక మైనింగ్ అధికారులు పర్మిట్లు జారీ చేసేశారు. చుట్టుపక్కల గడువు ముగిసిన లీజు ప్రాంతాల్లో యధేచ్చగా తవ్వకాలు జరిపారు. రాఘవేంద్ర, గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ దాదాపు 12 లక్షల క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్‌ను అక్రమంగా తవ్వి భారీగా సొమ్ము చేసుకున్నట్లు తేలింది. వీటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.200 కోట్లు కాగా మార్కెట్ విలువ రూ.600 కోట్లకు పైమాటే ఉంది. ప్రత్యేక బృందం తనిఖీలు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం గట్టుపల్లి, అన్నవరంలో రోడ్డు మెటల్ తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నట్లు గత నెలలో కలెక్టరేట్‌కు స్పందన ద్వారా ఫిర్యాదు అందింది. స్థానికంగా రెండు గ్రామాల్లో తవ్వకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నిగ్గు తేల్చేందుకు మైనింగ్ శాఖాధికారులు ప్రతాప్‌రెడ్డి, రామకృష్ణప్రసాద్, శివపార్వతి, గోవిందరావు, షేక్ అబ్దుల్లా సభ్యులుగా మైనింగ్ శాఖ ఒక ప్రత్యేక బృందాన్ని నియమించింది. వారం రోజులపాటు విస్తృతంగా తనిఖీలు జరిపిన బృందం అక్రమాలు నిజమేనని తేల్చింది. ఈమేరకు మైనింగ్ శాఖ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించింది. ♦ జలదంకి మండలం గట్టుపల్లిలో సర్వే నెంబర్ 10, 15లో గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్‌కు 9.8 ఎకరాలను రోడ్ మెటల్ తవ్వకాల కోసం 2008లో మైనింగ్ శాఖ లీజుకిచ్చింది. అయితే ఆ భూమిలో తవ్వకాలు జరపకుండా స్టోన్ క్రషర్ యూనిట్ ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంకులు, వే బ్రిడ్జిలు, సర్వెంట్ క్వార్టర్లను నిర్మించారు. ఒక్క టన్ను ఖనిజం తవ్వకపోయినా మైనింగ్ అధికారులు 28 వేల క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్‌ను తవ్వినట్లు పర్మిట్లు జారీ చేయడం గమనార్హం. ఇతర ప్రాంతాల్లో తవ్విన ఖనిజం కోసం ఈ పర్మిట్లు ఉపయోగించారు. లీజు ప్రాంతాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసినట్లు స్పష్టమైంది. వేరే చోట తవ్విన 700 క్యూబిక్ మీటర్లకుపైగా రోడ్ మెటల్‌ను అక్కడ నిల్వ చేశారు. ♦ జలదంకి మండలం అన్నవరం గ్రామం 851 సర్వే నెంబర్లో రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ లీజు గడువు ముగిసిపోయినా తవ్వకాలు నిర్వహిస్తోంది. అక్కడ సుమారు 5 లక్షలకుపైగా క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్‌ను అక్రమంగా తవ్వినట్లు తేల్చారు. అదే గ్రామంలో కొండారెడ్డి, సుగుణమ్మ, చంద్రశేఖర్‌రెడ్డి పేర్లతో గతంలో పలు రోడ్డు మెటల్ లీజులున్నాయి. వాటి లీజు గడువు ఎప్పుడో ముగిసిపోయింది. అయితే వాటిలో పాగా వేసిన గురు రాఘవేంద్ర కంపెనీ అందులో కూడా యథేచ్చగా తవ్వకాలు జరిపింది. సుమారు 7 లక్షల క్యుబిక్ మీటర్ల రోడ్ మెటల్‌ను తవ్వినట్లు తనిఖీ బృందం నిర్థారించింది. మొత్తం 12 లక్షల క్యూబిక్ మీటర్ల మేర అక్రమ తవ్వకాలు జరిపినట్లు తేలింది. అన్నవరంలో అక్రమంగా తవ్విన రోడ్డు మెటల్‌ను గట్టుపల్లిలో ఏర్పాటు చేసిన క్రషర్‌కి తరలించి విక్రయించారు. ఈ అక్రమ తవ్వకాల మొత్తం విలువ రూ.140 కోట్లుగా తనిఖీ బృందం నివేదిక సమర్పించింది. అయితే స్టోన్ క్రషింగ్ యూనిట్‌ను తాము పెద్దగా వినియోగించలేదని రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ యాజమాన్యం వాదించింది. దీంతో ట్రాన్స్‌కో నుంచి విద్యుత్తు వినియోగం లెక్కలు సేకరించగా 89 లక్షల యూనిట్లు వాడినట్లు తేలింది. ఒక టన్ను ఖనిజం ఉత్పత్తికి 2.5 యూనిట్లు వినియోగం అవుతుంది. ఈ లెక్కన రూ.200 కోట్ల మేర ఆ యూనిట్లో రోడ్డు మెటల్‌ను ప్రాసెస్ చేసినట్లు తేలింది. రాఘవేంద్ర, గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ సంస్థలు అక్రమ తవ్వకాలు నిర్వహించినట్లు స్థానిక రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు స్టేట్మెంట్లు ఇచ్చారు. -
మే 9న ‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష పథకం, నాడు-నేడుపై సీఎం సమీక్షించారు. చాలా ప్రతిష్టాత్మకంగా మే 9న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని.. దీనికోసం 1902 హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశామని సీఎం అన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే? ‘‘చాలా ప్రతిష్ట్మాతకమైన కార్యక్రమం. మనం ఇప్పటికే స్పందన నిర్వహిస్తున్నాం. స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం. ఇండివిడ్యువల్ గ్రీవెన్సెస్‌ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే దీని ఉద్దేశం. హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తే.. దాని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలి’’ అని సీఎం అన్నారు. ►సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్ యూనిట్లు ఉంటాయి ►ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్ చేయాలి ►గ్రీవెన్స్ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలి ►ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యం ►ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుంది ►హెల్ప్‌లైన్‌ద్వారా గ్రీవెన్స్ వస్తాయి ►వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలి ►గ్రీవెన్స్ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం ►ఇండివిడ్యువల్, కుటుంబం స్థాయిలో గ్రీవెన్సెస్ ►రిజ్టసర్ అయిన గ్రీవెన్సెస్ ఫాలో చేయడం ►ప్రభుత్వ సేవలు, పథకాలపై ఎంక్వైరీ ►ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం అన్నది జగనన్నకు చెబుదాం ప్రధాన కార్యక్రమాలు ►ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్ అయి ఉంటారు ►వారి గ్రీవెన్స్‌స్‌ను సలహాలను నేరుగా తెలియజేయవచ్చు: ►ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ గ్రీవెన్స్‌స్‌ను నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చూస్తుంది ►ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు రెగ్యులర్ అప్డేట్స్ అందుతాయి ►అంతేకాక ఇదే హెల్ప్‌లైన్ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటుంది ►గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్ గురించి అవగాహన కల్పిస్తారు ►ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకునేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తారు ►జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమల్లో మూడు కీలక యంత్రాంగాల ఉంటాయి ►సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు ఉంటాయి ►ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారులుప్రత్యేకాధికారులుగా ఉంటారు ►క్రమం తప్పకుండా ఆయా జిల్లాలను వీరు సందర్శించి పర్యవేక్షిస్తారు ►ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను పర్యవేక్షిస్తారు ►కలెక్టర్లతో కలిపి… జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు ►సమస్యల పరిష్కారాల తీరును రాండమ్‌గా చెక్చేస్తారు ►ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల పనితీరును పర్యవేక్షిస్తారు ►ఎక్కడైనా స పట్ల సంతృప్తి లేకపోతే.. దాన్ని తిరిగి ఓపెన్ చేస్తారు ►ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారు ►పరిష్కార తీరుపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తారు ►చీఫ్‌సెక్రటరీ, సీఎంఓ, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్ చేస్తారు ►ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుంది ►ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగారి పేరు పెట్టారు అంటే.. మొత్తం ప్రభుత్వం యంత్రాంగం పేరు పెట్టినట్టే ►అధికారుల మీద ఆధారపడే ముఖ్యమంత్రి తన విధులను నిర్వహిస్తారు ►మీరు అంత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తే… కార్యక్రమం సమర్థవంతంగా సాగుతున్నట్టే లెక్క ►ప్రజలకు నాణ్యంగా సేవలను అదించాలన్నదే దీని ఉద్దేశం ►ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్ల రూపాయలను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుంది ►అవసరమైన చోట.. ఈ డబ్బును ఖర్చు చేయవచ్చు ►వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్‌కు ఇస్తున్నాం: ►దీనివెల్ల వేగవంతంగా గ్రీవెన్స్‌స్ పరిష్కారంలో డెలవరీ మెకానిజం ఉంటుంది: ►అంతేకాకుండా గ్రామ స్థాయిలోని సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్వాడీలు, విలేజ్‌క్లినిక్స్.. అవన్నీకూడా సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న అంశంపైన కూడా దృష్టిపెడతారు ►ఇవి సక్రమంగా పనిచేస్తే… చాలావరకు సమస్యలు సమసిపోతాయి ►అందుకే అవి సమర్థవంతంగా పనిచేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం ఇదీ చదవండి: రామోజీ, రాధాకృష్ణా.. జననేతకు జనమేగా స్వాగతం పలికేది! -
మండల స్థాయిలోనూ ‘స్పందన’
సాక్షి, అమలాపురం: కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత స్పందన కార్యక్రమం అనగానే అర్జీదారులు కలెక్టరేట్ వద్దనే బారులు తీరుతున్నారు. చిన్నచిన్న సమస్యలకు సైతం వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి వస్తున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల్లోని సచివాలయాల్లో రోజూ క్రమం తప్పకుండా స్పందన నిర్వహించాలని గతంలోనే నిర్ణయించింది. అయినప్పటికీ ఇంకా చాలా మంది కలెక్టరేట్‌కు వస్తున్నారు. దీంతో మండల స్థాయిలో కూడా స్పందన కార్యక్రమం నిర్వహించాలని, దీనిని ఈ సోమవారం నుంచి పక్కాగా అమలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఎంపీడీఓ కార్యాలయాల్లో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గ్రీవెన్స్ సెల్ పేరుతో గతంలో మండల, డివిజన్ స్థాయిల్లో అర్జీలు స్వీకరించేవారు. కొత్త జిల్లా ఏర్పడిన తరువాత స్పందన నిర్వహణ మండల స్థాయిలో నిలిచిపోయింది. కలెక్టరేట్ దగ్గర కావడంతో అర్జీదారులు జిల్లా కేంద్రానికే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అమలాపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి స్పందనకు తొలి రోజుల్లో 225 నుంచి 250 వరకూ అర్జీలు వచ్చేవి. శివారు ప్రాంతాలకు తాగునీరు అందడం లేదని, ఇళ్ల ముందు డ్రెయిన్లలో పూడిక తీయడం లేదని, రహదారులు నిర్మించాలనే చిన్నచిన్న సమస్యలు సైతం కలెక్టరేట్‌కు వస్తున్నాయి. వీటి కోసం ఆయా అర్జీదారులు రామచంద్రపురం, మండపేట, కొత్తపేట, రాజోలు నియోజకవర్గాల నుంచి ఇక్కడకు వస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామ/వార్డు సచివాలయాల్లో క్రమం తప్పకుండా ప్రతి రోజూ ప్రభుత్వం స్పందన కార్యక్రమం నిర్వహిస్తోంది. దీంతో కలెక్టరేట్‌కు వచ్చే అర్జీదారుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి స్పందనకు 150 నుంచి 175 మంది వరకూ వస్తున్నారు. ఇలా వస్తున్న అర్జీల్లో కూడా మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీసు, ఇతర శాఖలు పరిష్కరించే సమస్యలే అధికంగా ఉంటున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి మండల స్థాయిలో కూడా స్పందన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సోమవారం నుంచి జిల్లాలోని 22 ఎంపీడీఓ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం ప్రారంభం కానుంది. రెవెన్యూ, న్యాయపరమైన వివాదాలకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి, రోడ్లు, ఇతర చిన్నచిన్న సమస్యలకు వివిధ శాఖల అధికారులు స్థానికంగానే అందుబాటులో ఉండనున్నారు. దీంతో అర్జీదారులకు సైతం కలెక్టరేట్‌కు వచ్చే వ్యయప్రయాసలు తగ్గనున్నాయి. -
కిడ్నీకి రూ.7 కోట్లు ఇస్తామని చెప్పి..
సాక్షి, నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలానికి చెందిన ఓ ఆసామి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని కుమార్తె హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతోంది. సోమవారం తన తండ్రితో కలిసి గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం నిర్వహించిన ‘స్పందన’లో ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్‌ను కలిసింది. కిడ్నీ విక్రయిస్తే రూ.7 కోట్లు ఇస్తామంటూ.. తన నుంచి రూ.16.40 లక్షల మేర వసూలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు తనను మోసగించారంటూ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. తన తండ్రి ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో రూ.20 లక్షలు దాచాడు. తండ్రికి తెలియకుండా ఆ ఖాతాలో ఉన్న సొమ్ములో రూ.2 లక్షలను ఫోన్‌పే ద్వారా సొంతానికి ఖర్చు చేసింది. యూట్యూబ్ వల వేసి.. కాగా, రూ.2 లక్షలు ఖర్చు చేసిన విషయం తండ్రికి తెలిస్తే మందలిస్తాడన్న భయంతో ఆ డబ్బుల్ని తానే సంపాదించి తండ్రికి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. డబ్బు సంపాదించే మార్గం కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 26న యూట్యూబ్‌లో వెదికింది. అందులో కిడ్నీ దానం చేస్తే రూ.7 కోట్లు చెల్లిస్తామనే ప్రకటన ఆమెను ఆకర్షించింది. అందులో ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి.. ఆన్లైన్, వాట్సాప్ ద్వారా ఎదుటి వ్యక్తులతో మాట్లాడింది. శస్త్రచికిత్సకు ముందు రూ.3.50 కోట్లు, శస్త్రచికిత్స తరువాత రూ.3.50 కోట్లు చెల్లిస్తామని మోసగాళ్లు ఆ యువతికి చెప్పారు. పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించాలంటే పన్నుల రూపేణా ముందుగా నగదు చెల్లించాల్సి వస్తుందన్నారు. తండ్రి పేరుతో చెన్నైలోని ఓ బ్యాంక్‌లో ఖాతా తెరిచి, రూ.3.50 కోట్లు జమ చేసినట్టు ఆమెను నమ్మించారు. ఆ యువతి నుంచి విడతల వారీగా రూ.16.40 లక్షలను ఆన్లైన్ ద్వారా పంపించింది. ఎంతకీ డబ్బు రాకపోవడంతో తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయాలని కోరింది. సదరు మోసగాళ్లు ఢిల్లీ రావాలని సూచించగా.. ఆ యువతి అక్టోబర్ 8న విమానంలో ఢిల్లీ వెళ్లింది. వారిచ్చిన చిరునామాలో సంబంధిత వ్యక్తులెవరూ లేకపోవడంతో వెనక్కి వచ్చేసింది. ఇంటికి వెళ్లకుండా మొహం చాటేయడంతో.. ఈ విషయం తండ్రికి తెలిస్తే తిడతాడనే భయంతో సదరు యువతి ఎన్టీఆర్ జిల్లాలోని స్నేహితుల వద్దకు వెళ్లి తలదాచుకుంటోంది. కుమార్తె అదృశ్యంపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమెను గుర్తించి తండ్రికి అప్పగించారు. డబ్బులు విషయమై కుమార్తెను అడగ్గా జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. దీనిపై ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ వేగవంతం చేయాలని కోరుతూ స్పందనలో జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు వినతిపత్రం అందించారు. ఈ విషయమై ఎస్పీ హఫీజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ కోర్ విభాగం ద్వారా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. (చదవండి: సైబరాసురులు దోచేస్తున్నారు..కంపెనీల పేరులో వల) -
లక్షలాది సమస్యలకు పరిష్కార వేదిక స్పందన
-
సామాన్యుడి చేతిలో స్పందనాస్త్రం
ఏపీ నెట్వర్క్: దాదాపు రూ.45 కోట్ల విలువ చేసే ఖరీదైన భూమిని అనంతపురంలో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ సైతం చేసిన వ్యవహారానికి ‘స్పందన’ కార్యక్రమం ద్వారా అడ్డుకట్ట పడింది! అధిక వడ్డీల ఎరతో 40 మంది ఉద్యోగుల నుంచి రూ.25 కోట్లు వసూలు చేసిన ఓ మహిళ బెదిరింపులకు ‘స్పందన’ సత్వరమే తెర దించింది. అధిక ఫీజులు వసూలు చేసి తల్లిదండ్రులను, తిండి పెట్టకుండా చదువుల పేరుతో పిల్లలను కాల్చుకు తింటున్న కార్పొరేట్ కాలేజీల దురాగతాల బారి నుంచి ‘స్పందన’ భరోసా కల్పిస్తోంది. ప్రజా సమస్యలపై నిరంతరం దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమం అనూహ్య ఫలితాలనిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించడంతోపాటు అక్రమాలకు అడ్డుకట్ట వేస్తోంది. అర్హత ఉండి కూడా సంక్షేమ పథకాలు అందకపోవడం, ఎవరికైనా అన్యాయం జరిగిన సందర్భాల్లో ఫిర్యాదుచేస్తే చాలు విచారించి నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాలు, సచివాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమం బాధితులకు కొండంత భరోసానిస్తోంది. స్పందన (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ సహకారంతో స్పందన పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. దీంతోపాటు ఏడాది పొడవునా ఏ సమయంలోనైనా వివిధ అంశాలపై ఫిర్యాదులను స్వీకరించేందుకు వేర్వేరు టోల్‌ఫ్రీ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. పని తీరు ఇలా... కేవలం ఫిర్యాదులను స్వీకరించటంతో సరిపెట్టకుండా సమస్యల పరిష్కారానికి కచ్చితమైన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ‘స్పందన’లో స్వీకరించే ప్రతి ఫిర్యాదుకూ వైఎస్ఆర్ (యువర్ స్పందన రిక్వెస్ట్) నెంబరు కేటాయిస్తారు. ఫిర్యాదులను వర్గీకరించి పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపుతారు. వాటిపై విచారణ జరిపి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటారు. ఒకవేళ ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందకుంటే ఆ విషయాన్ని తెలియజేస్తే అధికారులు మరోసారి క్షుణ్నంగా పరిశీలిస్తారు. 5.85 లక్షల ఫిర్యాదులు పరిష్కారం.. 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 డిసెంబరు 6వ తేదీ వరకు స్పందనలో 6,14,529 ఫిర్యాదులు నమోదు కాగా 5,85,613 పరిష్కారమయ్యాయి. 28,916 ఫిర్యాదులు విచారణలో ఉన్నాయి. కేస్ స్టడీలు... రూ.45 కోట్ల భూమిపై కన్ను.. అనంతపురం వక్కలం వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకట సుబ్బయ్యకు రాచానపల్లి సర్వే నెంబర్ 127లో 14.96 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో దీని విలువ రూ.45 కోట్లకు పైమాటే. ఖరీదైన ఈ భూమిని కాజేసేందుకు అంపగాని శ్రీనివాసులు, సత్యమయ్య, హనుమంతాచారి, వేణుగోపాల్, రమేష్, రామ్మోహన్‌రెడ్డి ఓ ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ సృష్టించారు. టీచర్స్ కాలనీకి చెందిన వడ్డే రాముడు ఆధార్ కార్డును వెంకట సుబ్బయ్య పేరుతో నవీకరించారు. తండ్రి పేరు, అడ్రస్, చివరకు ఫోన్ నంబర్ మార్చేసి సత్యమయ్యకు విక్రయించినట్లు రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అనంతరం దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారి దేవేందర్‌రెడ్డికి ఎకరం రూ.కోటి చొప్పున విక్రయించేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. అడ్వాన్స్ కింద ఈ ముఠా రూ.1.05 కోట్లు వసూలు చేసింది. వెంకటసుబ్బయ్య కుమారులు వెంకటరమణ, నందకిషోర్ ఆగస్టు మొదటి వారంలో అనుమానంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈసీకి దరఖాస్తు చేయడంతో అసలు బాగోతం వెలుగు చూసింది. ఆగస్టు 7న స్పందన కార్యక్రమంలో దీనిపై ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేయడంతో విచారించి ఆగస్టు 24న నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అధిక వడ్డీల ఎర... అధిక వడ్డీల ఎర వేసి రూ.1.5 కోట్లు కాజేసి బెదిరిస్తున్న ఓ మహిళపై నవంబరు 31న న్యాయవాది గుంటుపల్లి చంద్రశేఖర్ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దాదాపు 40 మంది ఉద్యోగుల నుంచి నిందితురాలు మొత్తం రూ.25 కోట్లు వసూలు చేసి మోసగించినట్లు వెల్లడైంది. ఈ కేసును నల్లపాడు పోలీసులు విచారిస్తున్నారు. బ్యాంకు రుణం ఇíప్పిస్తానంటూ రూ.లక్షల్లో వసూలు చేసిన గుంటూరు శ్రీనగర్‌కు చెందిన మరో మహిళ మోసాలపైనా స్పందనలో ఫిర్యాదు అందటంతో అరండల్‌పేట పోలీసులు విచారణ చేపట్టారు. నకిలీ ఎన్వోసీల గుట్టు రట్టు.. ట్రెజరీ మాజీ ఉద్యోగి మనోజ్ రియల్ఎస్టేట్ వ్యాపారులతో కలసి నకిలీ ఎన్ఓసీలు సృష్టించిన వైనం ఇది. అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు 513 సర్వే నంబరులో శంకరరెడ్డికి చెందిన 12 ఎకరాల భూమికి ఎన్ఓసీ ఇప్పించేందుకు మనోజ్‌తో పాటు రాయల శ్రీనివాసులు, దండు వెంకటనాయుడు రూ.2.50 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్సుగా రూ.1.32 కోట్లను తీసుకున్నారు. స్థానిక మండల తహశీల్దార్ శ్రీనివాసులుతో పాటు సబ్‌రిజిస్ట్రార్ త్రినాథ్, డిప్యూటీ తహశీల్దార్ గురుప్రసాద్, ఎస్ఐ రాంప్రసాద్‌కు లంచం ఇచ్చి అక్రమ మార్గాల్లో పని పూర్తి చేశారు. అనంతరం వాటాల పంపకంలో తేడా రావడంతో ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌పై దండు వెంకటనాయుడు, రాయల శ్రీనివాసులు స్పందనలో ఫిర్యాదు చేశారు. పోలీసు దర్యాప్తులో బాగోతం బయటపడింది. ప్రధాన నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఎస్ఐ రాంప్రసాద్, డిప్యూటీ తహశీల్దార్ గురుప్రసాద్ పరారీలో ఉన్నారు. çసస్పెండైన కూడేరు తహశీల్దార్ శ్రీనివాసులుతో పాటు సబ్ రిజిస్ట్రార్ త్రినాథ్ ఊచలు లెక్కిస్తున్నారు. ‘కార్పొరేట్’ వేధింపులపై.. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహించడంతోపాటు రోజూ 16 గంటలు గదుల్లోనే ఉంచడం, నాసిరకం భోజనంపై ‘స్పందన’లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అధ్యాపకులు చావబాదిన ఘటనలపైనా విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవలే అనంతపురంలో నారాయణ కళాశాలను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.5 లక్షల జరిమానా విధించారు. అద్దె కట్టకుండా, ఇల్లు ఖాళీ చేయకుండా పదేళ్లుగా యజమానిని ఇబ్బంది పెడుతున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారం కూడా ఇటీవల ‘స్పందన’ ఫిర్యాదు ద్వారానే బహిర్గతమైంది. బాధితులకు న్యాయం చేసేందుకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఒకరి భూమి మరొకరికి రిజిస్ట్రేషన్.. ఒకరి భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడంపై చిత్తూరుకు చెందిన బాలగురునాథం స్పందనలో ఫిర్యాదు చేయగా కలెక్టర్ హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారించారు. సబ్‌రిజిస్ట్రార్, రెవెన్యూ శాఖ సిబ్బంది కొందరు ముఠాగా ఏర్పడి ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా రూ.కోట్లు విలువ చేసే స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తేలింది. స్థల యజమానికి తెలియకుండా మరొకరి పేరిట అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న ముఠాను అక్టోబర్ 8వ తేదీన చిత్తూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో తహసీల్దార్ ఐ.సుబ్రహ్మణ్యం, చిత్తూరు సబ్‌రిజిస్ట్రార్ శ్రీధర్‌గుప్తా, వీఆర్వోలు ధనుంజయ, శివనారాయణ, కె.బాబు హస్తం ఉన్నట్లు వెల్లడైంది. దొంగ పాస్ పుస్తకాలతో... చిత్తూరు జిల్లా గుడిపాల మండలం సీఎం.కండ్రిగ గ్రామానికి చెందిన రైతు రఘు తన భూమికి రెవెన్యూ సిబ్బంది నకిలీ పాస్ పుస్తకాలను సృష్టించడంపై నవంబర్ 7న కలెక్టర్ హరి నారాయణన్‌కు ఫిర్యాదు చేశారు. రఘుకు చెందిన 4.08 ఎకరాల భూమిని కాజేసేందుకు అదే మండలంలో పనిచేసే వీఆర్వో సుబ్రహ్మణ్యం తన కుమార్తె పేరుతో దొంగ పాసుపుస్తకాలను సృష్టించినట్లు విచారణలో వెల్లడైంది. అక్రమాలకు పాల్పడిన వీఆర్వోపై క్రమశిక్షణ చర్యలు చేపట్టి బాధిత రైతు రఘుకు కలెక్టరేట్ అధికారులు న్యాయం చేశారు. చెరువునే మింగిన పచ్చ తిమింగలం శ్రీకాకుళం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి(బాబ్జీ)కి చెందిన భూబాగోతం స్పందన ఫిర్యాదుతోనే వెలుగు చూసింది. ఎచ్చెర్ల పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కృష్ణ బంద చెరువును పూడ్చి ప్లాట్లుగా విక్రయిస్తున్నట్లు స్పందనలో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఇక్కడ సెంటు స్థలం రూ.5 లక్షలు పలుకుతోంది. ఐదెకరాల చెరువు ఆక్రమణకు గురైనట్లు విచారణలో తేలడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. స్పందన టోల్‌ఫ్రీ నంబర్లు.. 1902 : నవరత్నాలు పథకాలతో సహా అన్ని రకాల ఫిర్యాదులకు 14500 : ఇసుక, ఎక్సైజ్ విభాగంపై ఫిర్యాదులకు 14400 : అధికారుల అవినీతిపై ఫిర్యాదులకు 1907 : వ్యవసాయ రంగం, రైతుభరోసాకు సంబంధించిన ఫిర్యాదులు 14417 : పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, నాడు–నేడు పనులు, టాయిలెట్ల నిర్వహణ, టీచర్ల హాజరుపై ఫిర్యాదులకు.. శాఖల వారీగా స్పందన ఫిర్యాదుల పరిష్కారం ఇలా.. ప్రభుత్వ శాఖ ఫిర్యాదుల సంఖ్య పరిష్కరించినవి రెవిన్యూ(సీసీఎల్ఏ)–154215–142103 గ్రామ, వార్డు సచివాలయాలు–83600–82795 పంచాయతీరాజ్–59878–57307 మున్సిపల్ పరిపాలన–42481–41795 పోలీస్–37019–35992 హౌసింగ్ కార్పొరేషన్–26760–26419 వ్యవసాయం–25223–24353 ఇతర శాఖల ఫిర్యాదులు–1,85,353–1,74,849. -
గది ఖాళీ చేయమంటే.. చంపుతామంటున్నారు
సాక్షి, అనంతపురం: అనంతపురం నగరంలోని నందినీ హోటల్ ఎదురుగా ఉన్న జేసీ ట్రావెల్స్ గదిని ఖాళీ చేయకుండా తమను తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి బెదిరిస్తున్నారని మల్లికార్జున ఆచారి దంపతులు ఎస్పీ ఫక్కీరప్పను కలిసి కన్నీరు మున్నీరయ్యారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్‌కు హాజరైన వారు తమ ఆవేదనను ఎస్పీకి విన్నవించుకున్నారు. గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి పిటీషన్లు స్వీకరిస్తున్న ఎస్పీ తమ షాపును 2000లో బాబాయ్య అనే వ్యక్తికి బాడుగకు ఇచ్చామని, అయితే తమ నుంచి అద్దెకు తీసుకొని అతను షాపును తాడిపత్రి జేసీ ట్రావెల్స్‌కు అద్దెకు ఇచ్చాడన్నారు. ఇప్పుడు వారిద్దరు కుమ్మక్కై నాకు బాడుగ ఇవ్వకుండా ఖాళీ చేయకుండా వేధిస్తున్నారని తెలిపారు. నేరుగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని కలిశామని, స్పందించాల్సిన పెద్దమనిషి బెదిరించారన్నారు. షాపు పగల గొడతా, మర్డర్ చేస్తానన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. స్థానిక కమలానగరులో ఇండిపెండెంట్ బిజినెస్ కన్సల్టర్ సెంటర్ (ఐబీసీసీ) పేరుతో పేద విద్యార్థులకు డబ్బు ఆశ చూపి మోసం చేస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మతి హనుమంతురెడ్డి, ఏపీఎస్ఎఫ్ అధ్యక్షుడు ఆకుల రాఘవేంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర.. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 97 మంది నుంచి ఎస్పీ పిటీషన్లు స్వీకరించారు. అనంతం ఎస్పీ మాట్లాడుతూ ఆస్తులు కాజేయడం, కబ్జాలకు తెగబడటం, డబ్బు ఆశ చూసి చీటింగ్‌కు పాల్పడటం వంటి మోసాలకు పాల్పడివారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అలాంటి వంచకులపై ఫిర్యాదులు అందితే తాట తీస్తామని హెచ్చరించారు. చదవండి: (మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో..) -
స్పందనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
స్పందన స్ఫూర్తి వివాదానికి ముగింపు..సెబీకి రూ.25లక్షలు చెల్లింపు
న్యూఢిల్లీ: నియంత్రణ పరమైన నిబంధనల అమలులో విఫలమైన కేసును స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ పరిష్కరించుకుంది. సెబీకి రూ.25 లక్షలు చెల్లించడం ద్వారా ఈ వివాదానికి ముగింపు పలికింది. ‘‘ప్రతిపాదిత ఉల్లంఘనల ఆరోపణల విషయంలో పరిష్కారానికి స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ సెబీని సంప్రదించింది. సెబీ గుర్తించిన వాస్తవాలను అంగీకరించ లేదు. అలా అని తిరస్కరించ లేదు. నిబంధనల అమలులో వైఫల్యాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న చర్యలపై దరఖాస్తుదారుతో పరిష్కారం కుదిరింది’’అని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ 2015 ఏప్రిల్ నుంచి ఆర్బీఐ వద్ద నమోదిత సంస్థగా ఉంది. 2019 ఆగస్ట్‌లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ఐపీవో ద్వారా లిస్ట్ అయింది. ఆడిటర్ విషయంలో స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ సంస్థ, లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ డిస్క్లోజర్ నిబంధనల అమలులో విఫలమైందన్నది సెబీ ఆరోపణగా ఉంది. -
ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం రూ.240 అందేలా చూడాలి: సీఎం జగన్
-
డిసెంబర్ నాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తి చేయాలి
సాక్షి, తాడేపల్లి: ఎస్డీజీ(స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు) సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయని, ఎస్డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రమాణమని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం స్పందన వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ఈ సందర్భంగా.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కేటాయించిన నిధులపై సమీక్ష జరిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో గడపగడపకూ మన ప్రభుత్వం నిర్వహించిన తర్వాత నెల రోజుల్లో ప్రాధాన్యతా పనులు మొదలు కావాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే.. అక్టోబరు 25న ఈ–క్రాపింగ్ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శించాలని, ఈ మేరకు షెడ్యూల్ వివరించారాయన. అలాగే.. ఉపాధి హామీ పథకం కింద కనీసం వేతనం రూ.240 అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. డిసెంబర్ 21వ తేదీ నాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే.. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్ –3 కింద డిసెంబర్లో ఇళ్ల మంజూరు చేయాలన్నారు. ఎస్డీజీ(స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు) సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయని, ఎస్డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రమాణమని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. స్పందనలో వస్తున్న ఫిర్యాదులు పరిష్కారంపై సమీక్ష నిర్వహించడంతో పాటు జాతీయ రహదారులకు కావాల్సిన భూసేకరణ, వైఎస్సార్ అర్బన్-విలేజ్ క్లినిక్స్ పై సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. చదవండి: గుడ్ న్యూస్.. ఆ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ -
చెత్త బుట్టలో ఉంగరాన్ని పడేసుకున్న మహిళ.. ‘స్పందన’తో స్పందన
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కార్పొరేషన్లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి ఓ చిత్రమైన ఫిర్యాదు అందింది. ఒక మహిళ ఫోన్ చేసి తన ఉంగరం పొరపాటున ప్రభుత్వ చెత్త బుట్టలో పడిపోయిందని చెప్పింది. ఆ ఉంగరాన్ని వెతికించి.. ఇవ్వాలని కోరింది. దీంతో శానిటేషన్ సిబ్బంది చెత్తనంతా జల్లెడ పట్టి.. చివరకు ఉంగరాన్ని ఆమెకు అప్పగించారు. వివరాలు.. ఇన్నీస్‌పేటకు చెందిన నాగలక్ష్మి సోమవారం తన ఇంట్లోని చెత్తను తీసుకెళ్లి.. సమీపంలోని ప్రభుత్వ చెత్త తొట్టెలో వేసింది. ఆ తర్వాత కొంతసేపటికి.. తన చేతికి ఉన్న 6 గ్రాముల బంగారు ఉంగరం కనబడకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. చెత్త బుట్టలో జారిపోయి ఉంటుందన్న సందేహంతో.. అక్కడకు వెళ్లింది. కానీ అదంతా చెత్తతో నిండిపోయి ఉండటంతో.. నాగలక్ష్మి ‘స్పందన’ కార్యక్రమాన్ని ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కమిషనర్ దినేశ్‌కుమార్.. స్థానిక సచివాలయ సిబ్బందిని, పారిశుధ్య కార్మికులను అప్రమత్తం చేశారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ బుద్ధ శ్రీను, శానిటేషన్ సెక్రటరీ ఎం.రాజేశ్, పారిశుధ్య కార్మికులు బంగారు శ్రీను, జయకుమార్, మేస్త్రీ శ్రీను దాదాపు 5 గంటల పాటు చెత్తనంతా వెతికి.. ఉంగరాన్ని బాధితురాలికి అందజేశారు. దీంతో నాగలక్ష్మి వారికి కృతజ్ఞతలు తెలిపింది. -
పొరపాట్లను స్పందనతో సరిదిద్దుకునే అవకాశం
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో దొర్లే పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశాన్ని స్పందన కార్యక్రమం కల్పిస్తోందని, స్పందన అర్జీల పరిష్కారంపై అన్ని స్థాయిల్లో అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. బుధవారం ఉన్నతాధికారులతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా అర్జీల పరిష్కారం, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనపై సీఎం దిశా నిర్దేశం చేశారు. స్పందనను మనమే స్వచ్ఛందంగా చేపడుతున్నామని గుర్తు చేస్తూ సమస్యలను పరిష్కరించాలన్న తపన ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఐఏఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులంతా మన ఎస్డీజీ సూచికల వైపే చూస్తున్నారని ప్రస్తావిస్తూ మన కలెక్టర్లు దేశంలోనే అత్యుత్తమమని గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. తనిఖీల ఫొటోల అప్లోడ్ రోజూ సచివాలయాల పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకూ స్పందన కార్యక్రమాన్ని చేపట్టాలి. జిల్లా, డివిజన్, మండలాల స్థాయిలో స్పందన ప్రతి సోమవారం నిర్వహించాలి. ఈ సమయంలో సంబంధిత అధికారులు కచ్చితంగా ఉండాలి. సంబంధిత అధికారులు స్పందన సమయంలో ఉంటున్నారా? లేదా? అన్నదానిపై సమీక్ష చేస్తాం. స్పందన సమయంలో అధికారులు లేకుంటే అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండదు. స్పందన పోర్టల్‌లో దీనిపై మార్పులు చేర్పులు చేస్తున్నాం. అర్జీలపై క్షేత్రస్థాయిలో జరిపే విచారణలు, తనిఖీలకు సంబంధించిన ఫొటోలను పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఈ సమయంలో ఫిర్యాదుదారు కచ్చితంగా ఉండాలి. అర్జీపై అధికారులు ఫిర్యాదుదారుతో కలసి ఫీల్డ్ ఎంక్వైయిరీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. తన సమస్యను పట్టించుకున్నారన్న తృప్తి అర్జీదారుకి ఉంటుంది. పౌర సమస్యలకు సంబంధించి ఫీల్డ్ ఎంక్వైరీ ఫొటోలే కాకుండా సమస్య పరిష్కరించిన తర్వాత కూడా ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. సమస్యల పరిష్కారంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి గడప గడపకూ.. కార్యక్రమం కింద ప్రతి ఎమ్మెల్యే నెలలో 10 సచివాలయాలను సందర్శిస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్తున్నారు. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలే కాకుండా ప్రజల సమస్యలనూ తెలుసుకుంటారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి సమస్యలు తెలుసుకుంటారు. ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం. ప్రతి ఇంటికి చేకూరిన లబ్ధిని తెలియజేస్తారు. ఎమ్మెల్యేల వద్దకు వచ్చే సమస్యలను పరిష్కరించడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. మీ పనితీరే.. నా పనితీరు, మనందరి పనితీరు మహిళా, శిశు సంక్షేమాన్ని తీసుకుంటే గోరుముద్ద, సంపూర్ణ పోషణ కార్యక్రమంపై పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నాం. గతంలో రూ.500 – రూ.600 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు మనం రూ.1800 – రూ.1900 కోట్లు వెచ్చిస్తున్నాం. దీన్ని సమర్ధంగా వివరించాల్సిన అవసరం ఉంది. విద్య, వైద్య రంగాల్లో చేపడుతున్న పనులను మరింత విస్తృతంగా ప్రచారం చేయాలి. మూడేళ్లలో నేరుగా నగదు బదిలీతో పారదర్శకంగా రూ.1.41 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించాం. ఈ స్థాయిలో డీబీటీ మరే రాష్ట్రంలోనూ లేదు. ఒక్క బటన్ నొక్కడం ద్వారా ఎలాంటి వివక్షకు తావులేకుండా అందించాం. జాతీయ స్థాయిలో ప్రత్యేక ముద్ర వేయగలిగాం. దేశవ్యాప్తంగా ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులంతా మన ఎస్డీజీ సూచికల వైపే చూస్తున్నారు. వీటన్నింటితో మన కలెక్టర్లు దేశంలోనే ఉత్తమమని గుర్తింపు పొందాలి. మీరే నా కళ్లూ, చెవులు. మీ పనితీరే .. నా పనితీరు, మనందరి పనితీరు. మరింత సమర్థంగా.. స్పందన చాలా ప్రాధాన్యం కలిగిన కార్యక్రమం. దీన్ని మరింత సమర్థంగా, మెరుగ్గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి సీఎస్ ఇప్పటికే జీవో ద్వారా మార్గదర్శకాలు స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సాధన చాలా ముఖ్యమైన అంశం. స్పందన, ఎస్డీజీల ఆధారంగా మీ పనితీరు మదింపు ఉంటుంది. -
పంటలు కాపాడుకునేందుకే ముందుగా సాగునీరు
సాక్షి, అమరావతి: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయకట్టుకు సాగునీటిని ముందుగా విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బుధవారమే గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశామని గతంలో ఇది ఎప్పుడూ జరగలేదన్నారు. తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా పంటలను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బుధవారం స్పందన సమీక్ష సందర్భంగా సీఎం జగన్ పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ... షెడ్యూల్ ప్రకారం నీటి విడుదల.. జూన్ 10న కృష్ణాడెల్టాకు, గుంటూరు చానల్‌కు, గండికోట కింద, బ్రహ్మంసాగర్, చిత్రావతి, వెలిగల్లు కింద పంట భూములకు సాగునీరు ఇస్తున్నాం. ఎస్సార్బీసీ కింద గోరకల్లు, అవుకుకు జూన్ 30న సాగునీరు ఇస్తున్నాం. ఎన్ఎస్పీ కింద జూలై 15న నీటిని విడుదల చేస్తున్నాం. ఈ షెడ్యూల్ ప్రకారం నీటిని విడుదల చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ సలహా మండళ్లు... వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలి. ఆర్బీకే స్థాయిలో తొలి శుక్రవారం, మండలస్థాయిలో రెండో శుక్రవారం, జిల్లా స్థాయిలో మూడో శుక్రవారం సమావేశాలు తప్పనిసరిగా జరగాలి. సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కృషి చేయాలి. పంటల ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలి. పారదర్శకంగా విత్తనాలు, ఎరువుల పంపిణీ ఆర్బీకేల్లో ఎరువులు, విత్తనాల పంపిణీ పారదర్శకంగా జరగాలి. నాణ్యతకు మనం భరోసాగా ఉండాలి. పరీక్షించి రైతులకు అందించాలి. జూన్, జూలైలో ఎక్కువ ఎరువులు అవసరం అవుతాయి. ఆమేరకు అందుబాటులో ఉంచాలి. డిమాండ్‌కు సరిపడా సరఫరా చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రతి నెలా బ్యాంకర్ల సమావేశాలు ప్రతి నెలా జిల్లా స్థాయిలో బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించాలి. రైతులకు రుణాలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్‌లో దాదాపు రూ.92 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఈ మేరకు అందించాలి. ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి కౌలురైతు సీసీఆర్సీ కార్డులు పొందాలి. దీనిపై మరింత అవగాహన కల్పించాలి. సేంద్రియ ఉత్పత్తులకు మంచి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తమ సాగు విధానాలపై ఐరాసకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ)తో ఒప్పందం చేసుకుంది. సహజ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో అవగాహన కల్పించాలి. ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దేశంలోనే తొలిసారి సహజ పద్ధతుల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ చేపట్టాం. జాతీయ రహదారులకు వేగంగా భూ సేకరణ.. రాష్ట్రంలో పలు రహదారుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో అనుసంధానిస్తూ 2,400 కి.మీ. మేర రోడ్లకు రూ.6,400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 3,079 కి.మీ.కి సంబంధించి రూ.29,249 కోట్ల విలువైన మరో 99 ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి. 2,367 కి.మీ.కి సంబంధించి రూ.29,573 కోట్లతో మరో 45 ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నాయి. బెంగళూరు –విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవేకు సంబంధించి 332 కి.మీ రోడ్ల నిర్మాణ పనులను రూ.17,500 కోట్లతో చేపడుతున్నాం. భూ సేకరణ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. దాదాపు రూ.80 వేల కోట్లకు పైబడి పనులు చేపడుతున్నాం. ఈ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర జీఎస్డీపీ గణనీయంగా పెరగుతుంది. వీలైనంత త్వరగా భూములను కలెక్టర్లు సేకరించాలి. అత్యంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలి. రోడ్ల వివరాలతో ఫొటో గ్యాలరీలు.. రూ.2,500 కోట్లతో రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ రోడ్ల కోసం సుమారు రూ.1,072.92 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఎక్కడా గుంతలు లేకుండా మరమ్మతులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం రూ.1,400 కోట్లు కూడా ఇవ్వలేదు. నాడు– నేడు కింద అభివృద్ధి చేసిన రోడ్ల వివరాలను ప్రజలకు తెలియచేస్తూ ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలి. సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ భూ సేకరణ, ఆర్అండ్ఆర్పై కార్యాచరణ సిద్ధం చేసేందుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.ప్రాధాన్యత ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. -
Andhra Pradesh: అవినీతిపై పిడుగు
ACB 14400 App, సాక్షి, అమరావతి: అవినీతికి ఏమాత్రం తావులేని స్వచ్ఛమైన పాలన అందించడమే మనందరి కర్తవ్యం కావాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా సరే.. ఎక్కడైనా సరే.. అవినీతికి పాల్పడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అవినీతిని నిరోధించేందుకు ఏసీబీ ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ‘ఏసీబీ 14400’ని సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ‘స్పందన’ సమీక్ష సందర్భంగా ఆవిష్కరించి మాట్లాడారు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఏసీబీ డీఐజీలు అశోక్‌కుమార్, పీహెచ్‌డి రామకృష్ణ ఇందులో పాల్గొన్నారు. ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాట ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి చాలా గట్టిగా, స్పష్టంగా, పదేపదే చెబుతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. వ్యవస్థ ప్రక్షాళన దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రూ.1.41 లక్షల కోట్లను ఎలాంటి అవినీతికి తావు లేకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా జమ చేశామని చెప్పారు. డేటా నేరుగా ఏసీబీకి అవినీతి నిర్మూలనకు మరో విప్లవాత్మక మార్పు తెస్తున్నాం. అది కలెక్టరేట్ అయినా, ఆర్డీవో కార్యాలయమైనా.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు అయినా.. మండల కార్యాలయం అయినా.. పోలీస్‌స్టేషన్ అయినా.. వలంటీర్లు.. సచివాలయం.. 108.. 104 సర్వీసులు అయినా.. ఎవరైనా సరై .. ఎక్కడైనా లంచం అడిగితే మీరు చేయాల్సింది ఒక్కటే.. మొబైల్లో ‘ఏసీబీ 14400’ యాప్ డౌన్లోడ్ చేసుకుని బటన్ నొక్కి వీడియో / ఆడియో సంభాషణ రికార్డు చేయండి. ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుంది. ఏసీబీ నేరుగా సీఎంవోకు నివేదిస్తుంది. అవినీతి నిర్మూలనలో ప్రతి కలెక్టర్, ఎస్పీకి బాధ్యత ఉంది. ఫిర్యాదులపై వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని ఏరిపారేయాలి. మన స్థాయిలో తలచుకుంటే 50 శాతం అవినీతి అంతం అవుతుంది. మిగిలిన స్థాయిలో కూడా ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. ఏసీబీ రూపొందించిన యాప్ ఎలా పని చేస్తుందంటే.. ► గూగుల్ ప్లే స్టోర్‌లో ‘ఏసీబీ 14400’ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయడం ద్వారా వినియోగానికి సిద్ధంగా ఉంటుంది. ► అవినీతి వ్యవహారాలకు సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్ రిపోర్ట్ ఫీచర్ వినియోగించుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ► లాడ్జ్ కంప్లైంట్ ఫీచర్ ద్వారా తమ దగ్గరున్న డాక్యుమెంట్లు, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించవచ్చు. ► ఫిర్యాదు రిజిస్టర్ చేయగానే మొబైల్ ఫోన్‌కు రిఫరెన్స్ నంబరు వస్తుంది. ► త్వరలో ఐఓఎస్ వెర్షన్లోనూ యాప్‌ను సిద్ధం చేస్తున్న ఏసీబీ. గూగుల్ ప్లే స్టోర్‌లో 14400 యాప్: డీజీపీ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఫిర్యాదుల కోసం రూపొందించిన 14400 యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ యాప్‌ను మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని ఓటీపీ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా ఎవరైనా లైవ్ స్ట్రీమింగ్, ఆడియో, వీడియోను రికార్డు చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. గతంలో జరిగిన అవినీతిపై సైతం ఫిర్యాదు చేసే విధంగా యాప్‌ను రూపొందించామన్నారు. అవినీతికి పాల్పడుతున్న అధికారి పేరు, శాఖ వివరాలను పొందుపరిచి పంపితే, తక్షణమే అవినీతి నిరోధక శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. -
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష
-
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందన ఫిర్యాదులతో పాటు ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ నిర్మాణం ప్రగతిపై సీఎం సమీక్షించారు. ఖరీఫ్ సన్నద్ధతపై, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, అర్బీకేల నిర్మాణాలపై అధికారులను ఆయన దిశానిర్దేశం చేశారు. శాశ్వత భూ హక్కు-భూరక్షపై సమీక్ష కూడా నిర్వహించి.. స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై అడిగి తెలుసుకోనున్నారు. వీటితో పాటు ఇరిగేషన్, జాతీయరహదారుల భూసేకరణపైనా సమీక్షించారు. పేదలందరికీ ఇళ్ల పథకం, ఉపాధిహామీ పనులు, విద్య, వైద్యరంగాల్లో నాడు–నేడు పనులపైన కూడా సీఎం ఉన్నతాధికారులతో చర్చించారు. -
ఉన్నతాధికారులతో సీఎం ‘స్పందన’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందన కార్యక్రమం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో పలు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్‌కు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. పేదలందరికీ ఇళ్ల పథకం, ఉపాధి హామీ పనులు, విద్య, వైద్యరంగాల్లో నాడు–నేడు పనులపైన కూడా సీఎం ఉన్నతాధికారులతో చర్చించారు. -
ఫిర్యాదు చేస్తే అవిటితనాన్ని వెక్కిరించి కొట్టి...
అనంతపురం క్రైం: ‘న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళితే.. కుంటి నాయాలా.. వడ్డీ వ్యాపారం చేస్తావా? అంటూ పామిడి సీఐ ఈరన్న కొట్టాడు’ అని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఎదుట ఓ దివ్యాంగుడు కన్నీటి పర్యంతమయ్యాడు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్ప చేపట్టిన స్పందన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పామిడి మండలం కట్టకిందపల్లికి చెందిన దివ్యాంగుడు సుంకిరెడ్డి తనకు జరిగిన అన్యాయంపై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆపద సమయంలో కొందరికి రూ.లక్షల్లో డబ్బు ఇచ్చానని, ప్రస్తుతం వారు ఆ డబ్బు వెనక్కు ఇవ్వకుండా తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వాపోయాడు. దీనిపై పామిడి సీఐ ఈరన్నకు ఫిర్యాదు చేస్తే తన అవిటితనాన్ని వెక్కిరించి కొట్టాడని ఫిర్యాదు చేశాడు. కాగా, స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై మొత్తం 94 ఫిర్యాదులు అందాయి. అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ఎస్బీ సీఐ చక్రవర్తితో కలిసి వినతులను ఎస్పీ స్వీకరించి, పరిశీలించారు. తక్షణ పరిష్కారం నిమిత్తం ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. 79 సెల్ఫోన్ల అందజేత పోగొట్టుకున్న సెల్ఫోన్లను సంబంధీకులకు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అందజేశారు. సోమవారం డీపీఓలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 79 మందికి ఆయన సెల్ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సెల్‌ఫోన్ పోగొట్టుకున్నవారు 94407 96812 వాట్సాఫ్ నంబర్‌కు సమాచారం అందించడంతో వాటిని రికవరీ చేసి అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 541 సెల్ఫోన్లను రికవరీ చేసి, 450 మంది సంబంధీకులకు అందజేసినట్లు పేర్కొన్నారు. మిస్సింగ్ కేసులను నిర్లక్ష్యం చేయొద్దు : ఎస్పీ మిస్సింగ్ కేసుల ఛేదింపులో నిర్లక్ష్యం తగదని పోలీసు అధికారులను ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సూచించారు. పిల్లలు, మహిళలు, యువతులు... ఇలా కనిపించకుండా పోయిన వారిపై సంబంధీకులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించాలన్నారు. మిస్సింగ్ కేసులకు సంబంధించి సోమవారం డీపీఓలో సీఐలతో ఆయన సమీక్షించారు. వివిధ పీఎస్‌ల్లో పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్ కేసులపై ఆరా తీశారు. ఛేదింపులో విఫలమైన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మిస్సింగ్ అయిన వ్యక్తుల ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాట్లాడి దర్యాప్తునకు ఉపయోగపడే వివరాలు సేకరించాలన్నారు. ఈ విషయంగా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. (చదవండి: రెండు రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య) -
ఖాకీ వనం.. న్యాయాలయంగా మార్చిన పోలీస్ బాస్
మలి వయస్సులో బిడ్డలు ఆదరించలేదని.. జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భర్తే హింసిస్తున్నాడని.. భర్త చనిపోతే మెట్టింటి వారు బయటకు నెట్టేశారని.. ఉబికి వస్తున్న కన్నీళ్లతో.. బరువెక్కిన గుండెలతో న్యాయం కోసం పోలీస్ స్పందనకు వచ్చే బాధితులకు జిల్లా పోలీస్ బాస్ బాసటగా నిలుస్తున్నారు. ఖాకీ వనాన్ని.. న్యాయాలయంగా మార్చారు. కుటుంబ సభ్యుల మధ్య భవబంధాలను, ఆప్యాయతా అనురాగాలను, కలిసి జీవించిన మధుర క్షణాలను గుర్తు చేస్తూ కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు తీసుకువస్తున్నారు. ఇతర ఫిర్యాదులపై పరిష్కరించ తగినవి అయితే అక్కడికక్కడే చర్యలు చేపడుతున్నారు. వ్యయప్రయాసలు పడి వచ్చే బాధితులకు ఆకలి తీరుస్తూ ఆదరిస్తూ.. పోలీసుల్లో కాఠిన్యమే కాదు.. కారుణ్యం ఉందని ఆర్తుల పాలిట ఆప్తుడయ్యాడు. సాక్షి, నెల్లూరు: జిల్లా పోలీస్ శాఖను కారుణ్య వనంగా మార్చేశారు. ఇటు ప్రజల సమస్యలతో పాటు సిబ్బంది సమస్యలు, సంక్షేమంపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్పందన’ కార్యక్రమ స్వరూపాన్ని పోలీస్ బాస్ మార్చేశారు. ఎంతో వేదనతో.. కళ్లల్లో కన్నీళ్లు పెట్టుకుని న్యాయం కోసం వచ్చే బాధితులకు బాసటగా మార్చేశారు. కుటుంబ వివాదాలను మానవీయ కోణంలో ఆలోచించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారికి న్యాయం జరిగేలా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మాత్రం దాదాపు 200 పైగా పరిష్కరిస్తుంచారు. ఆర్థిక నేరాలు, వేధింపులు సైబర్ నేరాలుపై మాత్రం ఎఫ్ఐఆర్లు నమోదు చేయిస్తున్నారు. ఈ తరహా 375 ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయించి వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే స్పందనలో ఇలాంటి వందల సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపించారు. గతేడాది జూలై నుంచి ఇప్పటి వరకు 2,811 వినతులు రాగా అందులో 90 మాత్రమే పెండింగ్‌లో ఉన్నవి. మిగిలిన ఫిర్యాదులను పరిష్కరించారు. కన్నీళ్లు తుడిచి.. ఆకలి తీర్చి.. న్యాయం చేసి.. మానసికంగా వేదనకు గురై న్యాయం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ఎస్పీ కార్యాలయానికి వచ్చే బాధితులకు పోలీస్ బాస్ విజయారావు ముందు వారి కన్నీళ్లు తుడుస్తున్నారు. ఆ తర్వాత ఆకలి తీరుస్తున్నారు. అప్పుడే వారి కష్టాన్ని తీర్చి న్యాయం చేసి పంపిస్తున్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితులు వారి సహాయకులకు మధ్యాహ్నం వేళ భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఏ పోలీస్ బాస్ ఇలా చేయని విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎవరూ ఆకలితో వెళ్లకూడదని తన సొంత ఖర్చుతోనే వారికి భోజనం పెట్టేలా ఏర్పాటు చేశారు. గతంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో న్యాయం జరుగుతుందని ఎంతో ఆశగా వచ్చిన కొందరు బాధితులకు చేతిలో డబ్బులేక మధ్యాహ్నం సమయంలో ఆకలితోనే ఉండి వెళ్లిన పలు ఘటనలు ఎస్పీ దృష్టికి రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వేసవి కాలంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి చల్లని మజ్జిగ బాధితులకు అందించారు. సిబ్బంది సంక్షేమంపై ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న ఎస్పీ విజయారావు, తమ శాఖలోని ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించారు. సొంత శాఖలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల్లో ఆత్మçస్థైర్యం నింపేందుకు సత్వర చర్యలు చేపట్టారు. పోస్టింగ్‌లు లేక వీర్ఆలో ఉన్న ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. అంతే కాదు ప్రతి శుక్రవారం సిబ్బంది కోసం ప్రత్యేక గ్రీవెన్స్‌డే నిర్వహించి వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ వారికి న్యాయం చేస్తున్నారు. వింజమూరుకు చెందిన వై.వెంకటేశ్వర్లు (74)కు ముగ్గురు కుమారులు. బిడ్డల భవిష్యత్ కోసం ఉన్నత చదువులు చదివించాడు. పెద్ద కుమారుడు హైదరాబాద్‌లో శాస్త్రవేత్త. రెండో కుమారుడు కూడా పీహెచ్డీ చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. మూడో కుమారుడు బీటెక్ పూర్తిచేసి విదేశాల్లో స్థిరపడ్డాడు. వారి బంగారు భవిష్యత్ కోసం ఆయన అష్టకష్టాలు పడి విద్యావంతులుగా తీర్చిదిద్ది, వివాహాలు చేశాడు. అందరూ స్థిరపడ్డారు. కానీ వారికి తండ్రి భారమయ్యాడు. ఆదరించమని వెళ్తే∙హింసించి పంపారు. బతకడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో న్యాయం కోసం స్పందన మెట్లు ఎక్కాడు. స్పందించిన ఎస్పీ కలిగిరి సీఐ ద్వారా ఆయన న్యాయం జరిగేలా చేశారు. నెల్లూరునగరంలోకి ఖుద్దూస్‌నగర్‌కు చెందిన ఎస్కే సబనా, రవితేజ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 7 ఏళ్లు, 4 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. తొలుత అన్యోన్యంగా సాగిన ఆ కుటుంబంలో తర్వాత కలతలు రేగాయి. భర్త ఆమెను వేధించడం ప్రారంభించాడు. భరించలేని ఆమె స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ విజయారావు వెంటనే దిశ పోలీస్‌స్టేషన్‌కు అటాచ్ చేసి ఆమెకు న్యాయం చేయమని ఆదేశించారు. దిశ స్టేషన్లో వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ప్రస్తుతం వారి కాపురం సజావుగా సాగుతుంది. కొండాపురం మండలానికి చెందిన వెంకటరమణమ్మ (21) భర్త చనిపోయాడు. ఆదరించాల్సిన ఆమె మెట్టింటి వారు నిర్దాక్షిణ్యంగా బయటకు గెట్టేశారు. భర్త ఆస్తిలో కూడా ఏమీ ఇవ్వమని తెగేసి చెప్పి పుట్టింటికి పంపారు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె స్పందనలో ఎస్పీ విజయారావు ఎదుట తన ఆవేదన వెలిబుచ్చుకుంది. స్పందించిన ఎస్పీ కలిగిరి సీఐ ద్వారా ఆమెకు న్యాయం జరిగేలా చేశారు. న్యాయం జరిగేలా చేయడం నా బాధ్యత ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో న్యాయం జరుగుతుందని జిల్లా నలుమూలల నుంచి నా దగ్గరకు వస్తున్నా రు. వారి సమస్యలు విని సత్వరమే వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలి. అక్కడ న్యాయం జరగలేదంటేనే నా వద్దకు రావాలి. జిల్లాలో మా పోలీస్ శాఖ సమర్థవంతంగా పని చేస్తుంది. ఎవరైనా నిర్భయంగా స్టేషన్‌కు వెళ్లి సమస్యలు చెప్పుకోవచ్చు. ప్రతి సోమవారం జిల్లా కార్యాలయానికి వచ్చే బాధితులకు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాం. – విజయారావు, ఎస్పీ, నెల్లూరు -
మనం ప్రజా సేవకులం
సాక్షి, అమరావతి: మనం బాస్‌లం కాదు.. ప్రజా సేవకులమనే విషయాన్ని నిరంతరం దృష్టిలో ఉంచుకోవాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించేందుకే 26 జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజల సమస్యల పట్ల మరింత మానవీయ దృక్పథంతో ఉండాలని, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించిన అధికార యంత్రాగానికి తానిచ్చే సలహా ఇదేనని కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలనుద్దేశించి ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘స్పందన’లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరింత మెరుగ్గా స్పందన కార్యక్రమం అమలుతోపాటు ఉపాధి హామీ, కలెక్టర్లు, ఎస్పీలు, జేసీల పనితీరు మదింపునకు సంబంధించి సీఎం జగన్ మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ స్పందన అర్జీల పరిష్కారంపై వివిధ స్ధాయిల్లో పర్యవేక్షణ జరగాలి. సచివాలయం నుంచి మండల స్ధాయి, జిల్లా స్ధాయి వరకు వివిధ దశల్లో పర్యవేక్షణ ఉండాలి. ప్రస్తుతం జిల్లాల పరిణామం తగ్గింది.స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత ముఖ్యం. మా కలెక్టర్ బాగా పనిచేస్తున్నారని ప్రజలు చెబుతున్నారంటే అర్జీలు నాణ్యతతో పరిష్కారమైనట్లే. ప్రధానంగా నాలుగైదు అంశాలపై కలెక్టర్లు దృష్టి సారించాలి. నిర్దేశిత కాలపరిమితిలోగా పరిష్కరించాలి. నిర్ణీత సమయానికి మించి పెండింగ్‌లో పెట్టకూడదు. ఒకే సమస్యపై తిరిగి రెండోసారి అర్జీ వస్తే కలెక్టర్ దృష్టికి రావాలి. ఈసారి అదే అధికారితో కాకుండా ఆపై అధికారితో అర్జీని పరిష్కరించాలి. నాణ్యతతో పరిష్కరించలేకపోతే మొత్తం ప్రక్రియ అంతా అర్థంలేనిది అవుతుంది. గ్రామ సచివాలయాల దగ్గర నుంచి అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ఉండాలి. మనం సక్రమంగా చేస్తున్నామా? లేదా? అన్నది పరిశీలించుకోవాలి. అర్జీలను పరిష్కరిస్తున్న విధానాన్ని పరిశీలించేందుకు జిల్లా, డివిజన్, మండలాల స్థాయిలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి. ఆయా స్ధాయిల్లో వారానికి ఒకసారి అర్జీల పరిష్కారానికి సమయం కేటాయించాలి. ఆ విధులను మరొకరికి అప్పగించరాదు. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇతరులకు అప్పగించొద్దు.. స్పందనపై కలెక్టర్ల మార్కు కచ్చితంగా ఉండి తీరాలి. ఇది మీ కార్యక్రమం.. మీరు మాత్రమే దీనిపై దృష్టి సారించాలి. ఇతరులకు అప్పగించొద్దు. మీరే స్వయంగా పర్యవేక్షించండి. కలెక్టర్లు సక్రమంగా వ్యవహరిస్తేనే స్పందన విజయవంతం అవుతుంది. సచివాలయాల్లో రోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు స్పందన నిర్వహిస్తున్నారు. అలా ఎవరైనా నిర్వహించకుంటే సంబంధిత నివేదికలు తెప్పించుకుని పరిశీలించాలి. అర్జీలు తీసుకున్న రోజే రశీదు ఇచ్చి మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. అర్జీపై విచారణ జరుగుతున్నప్పుడు పిటిషనర్‌ను ఈ ప్రక్రియలో భాగస్వామిగా చేయాలి. క్షేత్రస్థాయి విచారణ సమయంలో తప్పనిసరిగా పిలవాలి. ఫొటో తీసి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. తమ సమస్యను పట్టించుకుంటున్నారనే భరోసా పిటిషనర్‌కు కలుగుతుంది. అర్జీని పరిష్కరిస్తున్నామా? తిరస్కరిస్తున్నామా? అన్నది తెలియజేయాలి. దృష్టి సారిస్తే మరింత సమర్థంగా.. సచివాలయాలపై ఎంత దృష్టి పెడితే అంత సమర్థంగా పనిచేస్తాయి. కలెక్టర్లు, జేసీలు వారానికి రెండు సచివాలయాల్లో పర్యటించాలి. మిగతా అధికారులు వారానికి కనీసం నాలుగు సచివాలయాలను సందర్శించాలి. సచివాలయ సిబ్బంది పనితీరును పరిశీలించాలి. మీరు వెళ్లినప్పుడు వచ్చే నెలలో పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ చేశారా.. లేదా? అన్నది పరిశీలించాలి. అంతకు ముందు నెలలో అమలైన పథకానికి సంబంధించి మిగిలిపోయిన అర్హులు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. మూడు నెలలు ముమ్మరంగా ‘ఉపాధి’.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉపాధిహామీ పనులను ముమ్మరంగా చేసేందుకు అవకాశం ఉంటుంది. నిర్దేశించుకున్న లక్ష్యంలో కనీసం 60 శాతం పనులను ఈ మూడు నెలల్లోనే పూర్తి చేసేలా కలెక్టర్లు దృష్టి సారించాలి. ఏప్రిల్‌లో 250 లక్షల పనిదినాలను లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటికే 185 లక్షల పనిదినాలు చేశాం. మిగిలినవి వేగంగా చేపట్టాలి. లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి జిల్లాలో రోజూ కనీసం లక్ష పని దినాలు చేయాలి. నెలలో కనీసం 25 లక్షల పని దినాలను ప్రతి జిల్లాలో చేపట్టాలి. కలెక్టర్లు విస్తృతంగా పర్యటించి సమీక్షిస్తూ లక్ష్యాలను సాధించాలి. కలెక్టర్లు, జేసీలు, పీడీలు, ఎంపీడీఓలు.. ప్రతి అధికారీ దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. బిల్లులు క్లియర్.. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్.. భవనాల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేశాం. ఈ నెలలో కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. నెలాఖరులోగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉపాధి హామీ నిధులను ఈ నెలాఖరులోగా తెచ్చేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు.. అన్నింటినీ పూర్తి చేయాలి. కంపెనీల నుంచి సిమెంట్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణకు కలెక్టర్లు నోడల్ అధికారిని నియమించాలి. సిమెంట్, స్టీలు, ఇసుక, మెటల్ సరఫరా సవ్యంగా సాగేలా నోడల్ అధికారికి బాధ్యతలు అప్పగించాలి. దీనిపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి సచివాలయం పరిధిలో మరోసారి పునఃపరిశీలన చేసి భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి. డిసెంబర్ నాటికి 4,545 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తి కావాలి. అదే సమయానికి ఇంటర్నెట్ కేబుల్ కూడా సంబంధిత గ్రామాలకు సమకూరుతుంది. తద్వారా గ్రామాల్లోనే వర్క్‌ఫ్రం హోమ్ అందుబాటులోకి వస్తుంది. ప్రగతి ఆధారంగా పనితీరు మదింపు ఏడు రకాల ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రగతి ఆధారంగా కలెక్టర్లు, జేసీల పనితీరును మదింపు చేస్తాం. ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ స్కూళ్లు – ఆస్పత్రుల్లో నాడు–నేడు, సమగ్ర భూసర్వే, స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత, ఎస్డీజీ లక్ష్యాలు, ఉపాధిహామీ పనులు, సచివాలయాల పనితీరు... ఈ అంశాల్లో ప్రగతి ఆధారంగా వారి పనితీరును మదింపు చేస్తాం. ఏసీబీ, ఎస్ఈబీ, దిశ, సోషల్ మీడియా ద్వారా వేధింపుల నివారణ అంశాల్లో ప్రగతి ఆధారంగా ఎస్పీల పనితీరును మదింపు చేస్తాం. ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు సాగాలి. కానీ సమీక్ష పేరుతో అనవసరంగా కాలహరణం వద్దు. గంట లోపలే ముగించి పనిలో ముందుకుసాగాలి. సిటిజన్ అవుట్ రీచ్తో ప్రతి ఇంటికీ.. ప్రతి నెలలో చివరి శుక్రవారం, శనివారం వలంటీర్లు, సచివాలయ సిబ్బంది సిటిజన్ అవుట్‌రీచ్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఇంటికీ వెళ్లాలి. వచ్చే నెలలో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. ప్రతి వారం రెండు రోజులపాటు కలెక్టర్లు, జేసీలు గ్రామ సచివాలయాలను పర్యవేక్షించాలి. మే నెలలో పథకాలు ఇవీ జగనన్న విద్యా దీవెన, ఉచిత పంటల బీమా పథకం, వైఎస్సార్ రైతు భరోసా, మత్స్యకార భరోసా పథకాలను మే నెలలో అమలు చేస్తున్నాం. ఈ నాలుగు కార్యక్రమాల గురించి సిటిజన్ అవుట్రీచ్లో వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది ప్రజలకు వివరించాలి. సిటిజన్ అవుట్ రీచ్‌ను కూడా కలెక్టర్లు పర్యవేక్షించాలి. మీరు మంచి చేస్తే.. నేను మంచి చేసినట్లవుతుంది. మీరే నా కళ్లు, చెవులు. రాష్ట్రంలో ఎలాంటి అవినీతి, వివక్షకు తావు లేకుండా పథకాలను అమలు చేస్తున్నాం. రూ.1.37 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బటన్ నొక్కి పారదర్శకంగా జమ చేశాం. ఇదంతా మీ పర్యవేక్షణ వల్లే సాధ్యమైంది. – ఉన్నతాధికారులతో సీఎం జగన్ -
ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో స్పందనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందనలో భాగంగా ఉపాధి హామీ కార్యక్రమం కింద చేపట్టిన పనులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్, డిజిటిల్ లైబ్రరీలు, ఏఎంసీలు, బీఎంసీలు, గృహనిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష, ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భూ సేకరణ, నాడు-నేడు, స్పందన కింద అర్జీల పరిషారం తదితర అంశాలపై సీఎం సమీక్ష జరిపారు. ఈ వార్త కూడా చదవండి: మంత్రి కారుమూరి ఔదార్యం ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, 26 జిల్లాలను ఎందుకు ఏర్పాటు చేశామన్న విషయం అందరికీ తెలియాలన్నారు. ‘‘పరిపాలన అనేది సులభతరంగా ఉండాలి. ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలి. మరింత మానవీయ దృక్పథంతో ప్రజల పట్ల ఉండాలి. ఈ విషయాలను ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ’’ సీఎం సూచించారు. ఉపాధిహామీ పనులు: ►ఏప్రిల్, మే, జూన్... నెలల్లో ముమ్మరంగా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది ►కనీసం 60 శాతం పనులను ఈనెలల్లో చేయాలి ►కలెక్టర్లు ఈ మూడు నెలల్లో పనులు ముమ్మరంగా పనిచేయడంపై దృష్టిపెట్టాలి ►ప్రతిజిల్లాలో కూడా ప్రతిరోజూ కనీసం 1 లక్షల పనిదినాలు చేయాలి ►నెలలో కనీసంగా 25 లక్షల పని దినాలు చేపట్టాలి ►క్షేత్రస్థాయిలో లక్ష్యాలు పెట్టుకుని ఉపాధిహామీ పనులు చేపట్టాలి ►విస్తృతంగా పర్యటనలు చేసి, సమీక్షలు చేసి... ఈ లక్ష్యాలను సాధించాలి ►కలెక్టర్లు, జేసీలు, పీడీలు, ఎంపీడీఓలు.. ఇలా ప్రతి అధికారి ప్రత్యేక దృష్టిపెట్టాలి ►గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్కులు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు.. అన్నింటినీకూడా పూర్తిచేయాలి ►కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉపాధి హామీ నిధులు ఈనెలాఖరులోగా వచ్చేలా అధికారులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ►కంపెనీల నుంచి సిమ్మెంటు సప్లైలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి కలెక్టర్లు ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి: ►సిమెంటు, స్టీలు, ఇసుక, మెటల్ సరఫరా సవ్యంగా సాగేలా నోడల్ అధికారికి బాధ్యతలు అప్పగించాలి ►గ్రామాల్లో ఈ భవనాల నిర్మాణ బాధ్యతలను ఒకరికన్నా ఎక్కువ మందికి అప్పగించడం వల్ల పనులు చురుగ్గా సాగుతాయి ►ప్రతి సచివాలయం పరిధిలో మరోసారి పునఃపరిశీలన చేసి.. భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి ►డిసెంబర్ నాటికి 4545 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తి కావాలి ►అదే సమయానికి ఇంటర్నెట్ కేబుల్‌కూడా సంబంధిత గ్రామాలకు చేరుకుంటుంది: ►గ్రామాల్లోనే వర్క్‌ఫ్రం హోం అందుబాటులోకి వస్తుంది ఇళ్లనిర్మాణం: ►తొలిదశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం ►లే అవుట్లలో 11.9 లక్షలు, సొంతప్లాట్లు లేదా పొసెషన్ సర్టిఫికెట్లు పొందన వారి స్థలాల్లో 3.7 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలి ►ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలి ►కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణం పెండింగులో పండింది ►ఈ కేసుల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలి ►వీలుకాని పక్షంలో ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలి ►అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం అందాలి ►అర్హులకు ఇళ్లు రాకుండా కత్తిరించడం అన్నది సరైనది కాదు ►అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాల్సిందే, దీనికి ఎంత ఖర్చైనా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ►కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి ►ఆప్షన్ 3 ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణంపైనా కలెక్టర్లు దృష్టిపెట్టాలి ►ప్రతి వేయి ఇళ్లకూ ప్రత్యేకంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ను పెట్టాలి ►ఇళ్ల నిర్మాణం పూర్తచేసే బాధ్యతను వారికి అప్పగించాలి ►రోజూ వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి ►లే అవుట్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పన పనులు శరవేగంగా పూర్తిచేయాలి ►ఆప్షన్ 3 కింద ఇళ్ల నిర్మాణాన్ని ఈనెల 28న ప్రారంభిస్తున్నాం ►అదే రోజు 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం: ►అదే రోజున 1.79 లక్షల పీఎంఏబై, వైఎఎస్సార్-గామీణ్ ఇళ్ల నిర్మాణంకూడా ప్రారంభిస్తున్నాం ►తద్వారా మొత్తంగా చూస్తే మొదటి విడత ఇళ్ల నిర్మాణంలో భాగంగా 15.6 లక్షలు, టిడ్కోలో 2.62 లక్షలు, విశాఖపట్నంలో 1.23 లక్షలు, పీఎంఏవై-వైఎస్సార్ గ్రామీణ్ ద్వారా 1.79లక్షల ఇళ్లు నిర్మాణాలు జరుగుతాయి ►అంటే 21.24 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతున్నట్టు లెక్క ►అలాగే పెద్ద లే అవుట్లలో బ్రిక్ తయారీ యూనిట్లు నెలకొల్పడంపైనా దృష్టిపెట్టాలి ►ఇళ్ల నిర్మాణం జరుగుతున్న లే అవుట్లలో నీరు, కరెంటు సదుపాయాలను కల్పించాలి ►మురుగునీరు పోచే సదుపాయాలను కూడా కల్పించాలి ►ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులను సత్కరిస్తాం: ►మండలానికో సర్పంచి, మున్సిపాల్టీలో కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, జిల్లాకు ఒక జడ్పీటీసీ చొప్పున వారికి అవార్డులు ఇస్తాం ►ఇళ్ల నిర్మాణం, స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు – నేడు, సమగ్ర భూసర్వే, స్పందనలో అర్జీల పరిష్కారంలో నాణ్యత, ఎస్డీజీ లక్ష్యాలు, ఉపాధిహామీ పనులు, సచివాలయాల పనితీరు... ఈ అంశాల్లో ప్రగతి ఆధారంగా కలెక్టర్లు, జేసీల పనితీరును మదింపు చేస్తాం ►ఏసీబీ, ఎస్ఈబీ, దిశ, సోషల్‌మీడియా ద్వారా వేధింపుల నివారణ అంశాల్లో ప్రగతి ఆధారంగా ఎస్పీల పనితీరును మదింపు చేస్తాం ►ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి ముందుకు సాగాలి ►ఒక గంటలోపలే సమీక్షచేసుకుని.. పనిలో ముందుకుసాగాలి ►సమీక్ష పేరుతో అనవసరంగా కాలహననం వద్దు ►సమీక్షలు క్రమం తప్పకుండా ముందుకు సాగాలి -
‘స్పందన’ తలుపులు తెరిచే ఉంటాయ్..
సాక్షి, విశాఖపట్నం : దేశానికి అన్నం పెట్టే రైతు కుటుంబం.. చదువు ఇంజినీరింగ్.. మంచి కంపెనీలో ఉద్యోగం.. అయినా ఏదో లోటు.. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడంలో ఆత్మ సంతృప్తి ఉందంటూ అర్థం చేసుకున్న ఆమె లక్ష్యం వైపుగా అడుగులు వేశారు. ఆమె అకుంఠిత దీక్ష ఫలితమే ఐపీఎస్. వినేందుకు మూడక్షరాలే అయినా.. ఆ స్థాయికి చేరుకునేందుకు కొండంత తెగువ కావాలి.. గుండెల నిండా ధైర్యం ఉండాలి. ఆ రెండింటినీ మేళవిస్తూ.. గౌతమి ఐపీఎస్‌గా లక్ష్యానికి చేరువయ్యారు. ప్రతి పోస్టింగ్‌లోనూ సవాళ్లని ఎదుర్కొంటూ అనకాపల్లి జిల్లాకు మొట్టమొదటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుకు.. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేశారు.. ఈ విషయాలను ఎస్పీ గౌతమి సాలి ‘సాక్షి’తో పంచుకున్నారు. నన్ను మా నాన్నగారే ముందుండి నడిపించారు. చిత్తూరు జిల్లా పెద్ద కన్నెలి గ్రామంలో పుట్టాను. జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి వరకూ, ఇంటర్ ప్రైవేట్ కాలేజీలో చదివిన తర్వాత ఎస్వీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ (ఈసీఈ) చదివాను. ఫైనలియర్లో ఉన్నప్పుడు కాగ్నిజెంట్‌లో ప్లేస్మెంట్ సాధించాను. చెన్నైలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించాను. ప్రతి అడుగులోనూ నాన్న వేణుగోపాల్, అమ్మ కల్యాణి ఆత్మస్థైర్యాన్ని నూరిపోసేవారు. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత నాన్నే మమ్మల్ని నడిపించారు. ఎంఏ ఎంఫిల్ చేసినా.. వ్యవసాయం చేస్తూనే మమ్మల్ని పెంచి పోషించారు. రెండోసారి ర్యాంకు సాధించాను జాబ్ చేస్తూ.. మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ జీవితంలో ఏదో వెలితి ఉన్నట్లుగా అనిపించింది. సమాజానికి దగ్గరవ్వాలంటే ఐఎఎస్, ఐపీఎస్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. జాబ్ చేస్తూనే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. తొలిసారి 2012లో రాశాను. కానీ ర్యాంకు సాధించలేకపోయాను. ఆ తర్వాత ఇంట్లో వాళ్ల మీద ఆధారపడకుండా.. నాకు వస్తున్న జీతంతోనే జీవితాన్ని సాగిస్తూ.. వీకెండ్స్ కోచింగ్ తీసుకుంటూ.. కష్టపడి చదివాను. 2013లో పరీక్ష రాయలేదు. 2014లో 783 ర్యాంకు సాధించాను. మొదటి పోస్టింగ్ కడపలో.. కడప జిల్లాలో ఏఎస్పీ ట్రైనీగా మొదటి పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత విశాఖపట్నంలో అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్, బొబ్బిలి ఏఎస్పీ.. ఆ తర్వాత కర్నూలు అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా, ఆ తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించాను. తర్వాత విశాఖపట్నం డీసీపీగా పనిచేశాను. ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఎస్పీగా వ్యవహరిస్తున్నాను. స్థానిక పరిస్థితులపై దృష్టి సారిస్తాను... ఇప్పటి వరకూ నగర పరిధుల్లో విధులు నిర్వర్తించాను. కానీ.. అనకాపల్లి జిల్లా దానికి పూర్తి విభిన్నం. ముందుగా స్థానిక పరిస్థితుల్ని అర్థం చేసుకుంటున్నాను. అనకాపల్లితో పాటు ప్రతి మండలం, గ్రామ స్థితిగతులు, సమస్యాత్మక ప్రాంతాలు మొదలైన అంశాలన్నింటినీ వీలైనంత త్వరగా ఆకళింపు చేసుకొని.. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మరింత గౌరవం పెరిగేందుకు కృషి చేస్తాను. ఎప్పుడైనా వచ్చి ఫిర్యాదులందివ్వండి.. జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎప్పుడైనా వచ్చి ప్రజలు తమ ఫిర్యాదుల్ని స్పందన సెల్లో అందించవచ్చు. ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ముందుగా స్పందన సెల్‌ని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రారంభించాం. అదేవిధంగా జిల్లాలోని ప్రతి పౌరుడు 24 గంటల్లో ఎప్పుడు ఏ శాంతిభద్రతలకు సంబంధించిన సహాయం కావాలన్నా ప్రతి పోలీస్ స్టేషన్ తలుపులు తెరిచే ఉంటాయి. వచ్చే ఫిర్యాదుని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించాను. ‘అక్రమం’పై ఉక్కుపాదం గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్రమ మద్యం రవాణా, నాటుసారా, గంజాయి, గుట్కా, ఖైనీ మొదలైన వాటిన్నింటిపైనా ఉక్కుపాదం మోపుతాం. సరిహద్దుల్లో నిరంతర నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ జరగకుండా నిరోధిస్తాం. చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించాం. నాటుసారా తయారు చేసే గ్రామాల జాబితాని తీసుకున్నాను. దానికనుగుణంగా ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నాం. మూడు రోజుల వ్యవధిలో 4 వేల లీటర్ల బెల్లంపులుపుని ధ్వంసం చేశాం. ‘దిశ’పై దృష్టి సారిస్తాం... దిశ పోలీస్ స్టేషన్ ఇప్పటికే అనకాపల్లిలో ఉంది. దిశ యాప్‌ని మహిళలందరి ఫోన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. దానికనుగుణంగా ప్రతి కాలేజీలు, ఇతర ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నాం. మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటాం. అదేవిధంగా.. జిల్లాలో సైబర్ క్రైమ్ రేట్ ఎలా ఉంది అనే గణాంకాల ఆధారంగా ప్రత్యేక సెల్‌ఏర్పాటు చేయాలా లేదా అనేదానిపై నిర్ణయం తీసుకుంటాం. మండలాల వారీగా అధ్యయనం.. అనకాపల్లి పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతం మిళితమై ఉంటుంది. ఆయా ప్రాంతాలకు తగినట్లుగా పోలీసింగ్ వ్యవస్థ సేవల్లో మార్పులు చేర్పులు చేపట్టాలి. జిల్లా కేంద్రంగా ఏర్పాటైన తర్వాత.. ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. ఏ టైమ్‌లో ట్రాఫిక్ పెరుగుతోంది, స్కూల్స్ దగ్గర ట్రాఫిక్ ఎలా ఉంది.? ఎక్కడ సమస్య ఉత్పన్నమవుతోంది.. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకొని క్రమబద్ధీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మండలాల వారీగా ఆయా ప్రాంతాల పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్నాం. దానికనుగుణంగా మార్పులు చేయాలని భావిస్తున్నాం. సమయం దొరికినప్పుడల్లా వారంలో రెండు మూడు పోలీస్ స్టేషన్లని సందర్శించి.. ప్రజలకు సేవలు అందుతున్నాయా లేదా అనేది నిరంతరం పర్యవేక్షిస్తా. జిల్లాలో శాంతి భద్రతల పరరిక్షణకు అనునిత్యం శ్రమించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం అడుగులు వేస్తుంది. టీచర్ ప్రోత్సాహంతోనే.. సివిల్ సర్వీస్ అనేది ఒకటి ఉంటుందని నాకు పరిచయం చేసింది మాత్రం విజయశ్రీ మేడం. ఆమె ఇంట్లో సాయంత్రం పూట చదువుకునేటప్పుడు సివిల్ సర్వీసెస్ అనేది చాలా కష్టమైన పరీక్ష. అందులో పాసైతే.. ప్రజలకు సేవ చేయవచ్చు అని చెప్పారు. అప్పటి నుంచి నా మనసులో సివిల్స్‌పై బీజం నాటుకుంది. ఆ బీజానికి అమ్మ నీరు పోసి పెంచింది. అమ్మాయిలు బాగా చదువుకుంటేనే సమాజంలో గొప్పగా గౌరవం పొందగలరని మమ్మల్ని ప్రోత్సహించేవారు. ఆమె వెన్నుతట్టి ప్రోత్సహించడం వల్లనే నేను ఐపీఎస్‌గా, మా సోదరి మౌనిక కెనరాబ్యాంక్‌లో ఉద్యోగిగా గౌరవం పొందగలిగాం. -
మరీ ఇంత దారుణమా: ఆస్తులు రాయించుకుని..
సాక్షి, కృష్ణలంక (విజయవాడ తూర్పు): నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్‌చంద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు ఆలకించి, అర్జీలు స్వీకరించారు. మొత్తం 97 అర్జీలు అందాయి. అనంతరం సబ్ కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న స్పందన అర్జీలన్నింటిని పునఃపరిశీలన చేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ►‘నాకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నా. మందులు కొనేందుకు కూడా డబ్బులు లేవు. 74 సెంట్లు, 43 సెంట్ల స్థలాలను నా పెద్ద కుమారుడు బర్రె వెంకటేశ్వరరావు తన పేరుతో రాయించుకున్నాడు. స్థలాలు ఇస్తే మా బాధ్యతలు తీసుకుంటానన్నాడు. ఇప్పుడు స్థలాలు కాజేసి మోసం చేశాడు. ఆ స్థలాలను తిరిగి ఇప్పించి న్యాయం చేయండి’ అంటూ పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన వృద్ధురాలు బర్రె నాగమణి అర్జీ ఇచ్చి వేడుకున్నారు. బాధితుల సమస్యలను ఆలకించి, అర్జీలు స్వీకరిస్తున్న సబ్‌కలెక్టర్ ప్రవీణ్‌చంద్ ►తమ కుమారుడు పొలం మీద వచ్చే పంట గానీ డబ్బు గానీ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాడని కవులూరు గ్రామానికి చెందిన వృద్ధులు నాగేంద్రమ్మ, ఆమె భర్త కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. అనంతరం అక్కెడే చెట్టు కింద ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం చేశారు. ►వీరులపాడు మండలం కొణతాలపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 217/1లో తాను కొనుగోలు చేసిన 76సెంట్ల భూమికి సర్వే చేయాలని రెండు సార్లు మీ–సేవలో దరఖాస్తు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని, తన పొలం సర్వే చేసి హద్దులు చూపించాలని కంచికచర్ల గ్రామానికి చెందిన ఎస్కే చాందిని అర్జీ ఇచ్చారు. ►గత వారం స్పందనలో అర్జీ ఇచ్చిన విజయవాడకు చెందిన విభిన్న ప్రతిభావంతుడైన ఎం.శ్రీనివాస్‌కు సబ్‌కలెక్టర్ పెన్షన్ మంజూరు చేసి, వీల్‌చైర్ అందజేశారు. సబ్‌కలెక్టర్ కార్యాలయ ఏఓ ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, డీఎల్పీఓ చంద్రశేఖర్, వివిధ శాఖల డివిజనల్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
చిన్న మామయ్య లైంగికంగా వేధిస్తున్నాడు..
‘మా నాన్న అనారోగ్యంతో ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు.. టెలికాలర్‌గా పనిచేసి అమ్మకు డబ్బులిస్తున్నాం.. అయినా భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదు.. అమ్మ, ఆమె సోదరుడైన చిన్న మామ, తాత వేధిస్తున్నారు. చిన్న మామ చెప్పినట్లు వినకపోతే చంపుతామని బెదిరిస్తున్నారు. లైంగికంగా వేధిస్తున్న చిన్న మామ నుంచి రక్షణ కల్పించాలి’.. స్పందనలోనగరానికి చెందిన అక్కాచెల్లెలు ఆవేదన. సాక్షి, నగరంపాలెం(గుంటూరు): రూరల్, అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం స్పందన(గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహించారు. అర్బన్‌లో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేశారు. అర్జీదారులు అర్జీలను పెట్టెలో వేశారు. రూరల్‌లో స్పందన సీఐ శ్రీనివాసరావు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. స్పందనలో అందిన కొన్ని ఫిర్యాదులు.. ►నగరంలోని ఓ ఏరియాలో ఉంటున్న హిజ్రా కొంత మంది మందు బాబులు, బ్లేడ్‌బ్యాచ్‌తో కలసి, రాత్రిళ్లు డబ్బులు కోసం బెదిరిస్తున్నట్లు ఓబులునాయుడుపాలెంలో ఉంటున్న కొందరు హిజ్రాలు ఆరోపించారు. సదరు హిజ్రా బస్టాండ్, రైల్వేస్టేషన్ పరిసరాల్లో దౌర్జన్యానికి పాల్పడుతుందని అర్జీలో పేర్కొన్నారు. సదరు హిజ్రా చేస్తున్న అరాచకాలకు వత్తాసుగా ఉండాలని, లేనిచో చనిపోయే ముందు తమ పేర్లు రాస్తానని బెదిరిస్తుందని, ఆ హిజ్రా నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. ►ఆంధ్రా లూథరన్ సంఘం ఎన్నిక కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా నిర్వహించారని, వారిపై చర్య తీసుకోవాలని ఏఈఎల్సీ కార్యదర్శి కిశోర్, ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్, కోశాధికారి కె.మోజెస్అర్నాల్డ్ పలువురు పాస్టర్లతో కలసి అర్జీ అందించారు. సంఘంతో సంబంధంలేని వారితో ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న ప్యానల్‌ను రద్దు చేసి పాత ప్యానల్‌ను కొనసాగించాలని విన్నవించారు. ►కొత్త ఇంటి నిర్మాణం కోసం ఓ కన్స్ట్రక్షన్కు రూ.20 లక్షలు కాంట్రాక్టు ఇచ్చినట్లు ఆనందపేట మేకలవారివీధికి చెందిన ఎన్.బాలు తెలిపారు. గతేడాదిలో ఇంటి పనులు ప్రారంభించగా, విడతల వారీగా సుమారు రూ.17 లక్షలు చెల్లించాను. పనులు మొదలెట్టిన రెండు నెలలకే రెండు అంతస్థులు కూలిపోయింది. ప్రస్తుతం ఇల్లు కట్టించి ఇవ్వకపోగా డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు. ►ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇద్దరు మోసగించారని వసంతరాయపురం వాసి చక్రవర్తి, లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన శివనాగచారి, పొన్నూరు రోడ్డుకి చెందిన కనకమహాలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఒంగోలుకి చెందిన ఇద్దరు పరిచయమై, ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ గార్డెనర్‌గా, జిల్లా/ మండల సమన్వయకర్తలుగా ఉద్యోగాలు కల్పిస్తామంటే ముగ్గురం విడతల వారీగా వారికి రూ.3.75 లక్షలు చెల్లించాం. ఇద్దరిలో ఒకరు చిత్రపరిశ్రమలో పనిచేస్తానని, మరొకరు ప్రభుత్వ టెండర్లు నిర్వహిస్తామని నమ్మబలికారని, తమకు న్యాయం చేయాలని కోరారు. ►పదేళ్ల క్రితం తన కొడుకుకి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానంటే తెలిసిన వారికి రూ.3 లక్షలు ఇచ్చినట్లు ప్రకాశం జిల్లా కంభం వాసి ఏ మహేశ్వరరావు తెలిపారు. గతంలో అతడు ప్రకాశం జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారుల కార్యాలయాల్లో పనిచేసే వాడని పేర్కొన్నారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలిసిందని, తాను చెల్లించిన డబ్బులు ఇప్పించాలని అర్జీ అందించారు. -
Andhra Pradesh: సుస్థిర ప్రగతిపై దృష్టి
సుస్థిర ప్రగతి లక్ష్యాల కోసం చేస్తున్న పని, సాధిస్తున్న ప్రగతి నమోదు కావాలి. మనం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం. మన కలెక్టర్లు.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న కంటే బాగా పని చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీని వల్ల మన ప్రమాణాలు మరింత పెరుగుతాయి. దేశంలో అత్యుత్తమంగా నిలుస్తాం. దేశం మొత్తం మనవైపు చూస్తుంది. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్డీజీ –సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్)పై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. 43 సూచికలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలన్నారు. ఈ రంగాల్లో ప్రగతి ఎస్డీజీ లక్ష్యాలకు చేరువయ్యేలా ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలతో కలిసి ముందుకు సాగాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పలు విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం పోటీ ప్రపంచంలో ఉన్నామని, కేవలం మన పని మనం చేయడమే కాకుండా చేసిన పనికి, సాధించిన లక్ష్యాలకు ప్రమాణాలు అందుకోవడం కూడా అవసరమని చెప్పారు. తద్వారా ఆయా జిల్లాలు జీవన ప్రమాణాలు, సుస్థిర ప్రగతి దిశగా ముందుకు సాగుతూ అంతర్జాతీయ ప్రమాణాలను సాధిస్తాయన్నారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో 43 సూచికలపై కలెక్టర్ల ప్రమేయం నేరుగా ఉంటుందని, నవరత్నాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతగా అమలు చేయడం ద్వారా ఈ సూచికలు గణనీయంగా మెరుగు పడతాయని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయం మొదలు జిల్లాలు.. రాష్ట్ర సచివాయలం వరకు ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు. అమ్మ ఒడి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా పాఠశాలల్లో చేరికలు పెరగడంతో పాటు, బడి మానేయకుండా నియంత్రించగలుగుతామని చెప్పారు. ఒక పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా 2 సూచికల్లో మన రాష్ట్ర పని తీరు గణనీయంగా కనిపిస్తుందని, ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని వివరించారు. సుస్థిర ఆర్థిక ప్రగతి సూచికలపై కలెక్టర్లు జిల్లాలో అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. జగనన్న హౌసింగ్‌తో ఆర్థిక వృద్ధి ► హౌసింగ్ వల్ల ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. జిల్లా స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది. సిమెంటు, స్టీలు వినియోగం పెరుగుతుంది. చాల మందికి ఉపాధి లభిస్తుంది. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 15.60 లక్షల ఇళ్లు నిర్మాణం అవుతున్నాయి. ఇంకా ప్రారంభంకాని ఇళ్లు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి. కోర్టు కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టండి. లే అవుట్లలో ఇంకా పనులు ఏమైనా పెండింగ్ ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి. ► అప్రోచ్ రోడ్లు ఏర్పాటుపై కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలి. విద్యుత్ లైన్ల ఏర్పాటు, గోదాముల నిర్మాణం పూర్తి కావాలి. మార్చి 31లోగా మొదటి విడతలో అన్ని ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాలి. పనులు మొదలు కాని ఇళ్లు అంటూ ఉండకూడదు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు అధికారులు చేదోడుగా నిలవాలి. ► బ్యాంకర్లతో మాట్లాడి లబ్ధిదారులకు రూ.35 వేల రుణాలు వచ్చేట్టు చేయాలి. వారికి అవసరమైన సామగ్రి అందేలా చర్యలు తీసుకోవాలి. సబ్సిడీపై సిమెంటు, స్టీలు, ఇసుక అందిస్తున్నాం. సక్రమంగా అవి లబ్ధిదారులకు చేరేలా తగిన చర్యలు తీసుకోవాలి. ► 3.27 లక్షల మంది ఆప్షన్ 3 కేటగిరీ ఎంచుకున్నారు. ప్రభుత్వమే నిర్మించాలంటూ ఆప్షన్ ఉంచుకున్న లబ్ధిదారుల్లో 3.02 లక్షల మంది గ్రూపులుగా ఏర్పాటయ్యారు. మిగిలిన 25,340 మంది గ్రూపులుగా ఏర్పాటయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. వెంటనే పనులు మొదలు పెట్టేలా చూడాలి. లే అవుట్ల తనిఖీలు తప్పనిసరి ► కలెక్టర్లు ప్రతి వారం ఒక లే అవుట్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. జేసీలు, మున్సిపల్ కమిషనర్ల స్థాయి అధికారులు వారానికి ఒకసారి తనిఖీ చేయాలి. జేసీ– హౌసింగ్‌కు సంబంధించిన అధికారి, ఆర్డీఓ, సబ్కలెక్టర్లు వారానికి 4 సార్లు తనిఖీ చేయాలి. ఇళ్ల నిర్మాణంలో ఖర్చును తగ్గించడంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ► లే అవుట్ల సమీపంలోనే ఇటుక తయారీ యూనిట్లు పెట్టాలి. 500 ఇళ్ల కంటే ఎక్కువ ఉన్న లే అవుట్లలో తప్పనిసరిగా గోడౌన్లు పెట్టాలి. దీనివల్ల ఇళ్ల నిర్మాణ ఖర్చు నియంత్రణలో ఉంటుంది. మెటల్ రేట్లపైనా దృష్టి పెట్టాలి. గృహ నిర్మాణంపైనా ప్రతి వారం కలెక్టర్లు సమీక్ష చేయాలి. గ్రామాలు, పట్టణాలు, మండలాలు, లే అవుట్ల వారీగా క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలి. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ► డిసెంబర్ 21న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పథకాన్ని ప్రారంభించాం. ఉగాది నుంచి దీపావళి వరకు ఈ పథకం గడువు పొడిగించాం. ఈ పథకం ద్వారా పూర్తి హక్కులు వారికి లభిస్తాయి. లబ్ధిదారుల్లో అవగాహన కల్పించండి. ► డాక్యుమెంట్లు ఉన్న ఆస్తికీ, డాక్యుమెంట్లు లేని ఆస్తికీ ఉన్న తేడాను వారికి వివరించాలి. డాక్యుమెంట్లు లేకపోతే దక్కాల్సిన విలువలో 25 శాతమో, 30 శాతానికో కొనుగోలు చేసి.. వారిని దోపిడీ చేసే పరిస్థితి ఉంటుంది. పూర్తి హక్కులు ఉంటే వారి ఆస్తికి మంచి విలువ ఉంటుంది. ► గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులు ఓటీఎస్ కింద రుసుము చెల్లించడానికి 2 వాయిదాల అవకాశం కూడా కల్పించాం. ఒక వాయిదాలో రూ.5 వేలు, ఇంకో వాయిదాలో రూ.5 వేలు కట్టి పూర్తి హక్కులు పొందవచ్చు. ఆస్తి బదలాయింపు జరిగిన వారికి కూడా ఇలాంటి అవకాశాలే ఇచ్చాం. ► ఈ పథకాన్ని ఇప్పటి వరకు 9.41 లక్షల మంది వినియోగించుకున్నారు. 2.8 లక్షల మందికి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యింది. మిగిలిన వారికీ రిజిస్ట్రేషన్ చేసి, మండలాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి రిజిస్ట్రేషన్ పత్రాలు అందించాలి. 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాలు ► ఇప్పటి వరకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆ తర్వాత 2,01,648 దరఖాస్తులు ప్రాసెస్ చేశాం. వీరిలో 1,05,322 మందికి సరిపడా భూములు గుర్తించాం. 91,229 మందికి పట్టాలు ఇచ్చాం. ► భూమి బదలాయింపు విధానాన్ని వాడుకుని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. మిగిలిన 96,325 మందికి పట్టాలు ఇవ్వడానికి కలెక్టర్లు అన్ని చర్యలూ తీసుకోవాలి. 26 కోట్ల పని దినాల లక్ష్యం ► ఇంకా 2 నెలల సమయం ఉంది. ప్రతి జిల్లాలో లక్ష పని దినాలు రోజుకు నమోదు చేయాలి. అప్పుడే మనం మరోసారి 26 కోట్ల పని దినాల లక్ష్యాన్ని చేరుకుంటాం. రానున్న రెండు నెలల్లో మెటీరియల్ కాంపొనెంట్ ఎక్స్‌పెండేచర్‌పై దృష్టి పెట్టాలి. లేకపోతే నిధులు మురిగిపోయే అవకాశం ఉంటుంది. ► సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీల పనులు చాలా ముఖ్యమైనవి. వీటి నిర్మాణం ద్వారా గ్రామీణ అర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. తద్వారా రాష్ట్ర జీడీపీ పెరుగుతుంది. స్పందన అర్జీల పరిష్కారం ముఖ్యం ► ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆర్జీలను నాణ్యతతో పరిష్కరిస్తున్నారా.. లేదా? నిర్ణీత సమయంలోగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉంటున్నాయా? ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయి? అనే అంశాలపై వారానికి రెండు సార్లు కలెక్టర్లు సమీక్ష చేపట్టాలి. కొత్తగా మనం ఆధునీకరించిన పోర్టల్‌ను ప్రారంభించాం. అర్జీ ఎక్కడ ఉందనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది. ► నిర్దేశిత సమయం కన్నా.. ఆ ఫైలు ఎందుకు పెండింగులో ఉందనే దానిపై దృష్టి పెట్టాలి. 11 శాతం అర్జీలు తిరిగి వస్తున్నాయి. వాళ్లు మళ్లీ దరఖాస్తు చేస్తున్నారు. ఒకే ఫిర్యాదుపై తిరిగి అర్జీ వస్తే.. తిరిగి అదే అధికారికి ఆ అర్జీ వెళ్లకుండా ఎస్ఓపీ పాటించాలి. ఈ విధానంపై కలెక్టర్లు మరింత ధ్యాస పెట్టాలి. ► అర్జీల పరిష్కారంలో మానవత్వం ప్రదర్శించడం ద్వారా 90 శాతం సమస్యలు పూర్తిగా సమసిపోతాయి. ఉద్యోగులు అందుబాటులో ఉన్నప్పుడు, ప్రజల పట్ల మానవతా దృక్పథంతో ఆర్జీని అర్థం చేసుకున్నప్పుడు చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ► ప్రతి నెలా మూడు రోజులు ఆర్డీఓ కార్యాలయాలను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించాలి. ప్రధానంగా రెవిన్యూ, భూములకు సంబంధించిన అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్ష చేయాలి. ► గ్రామ సచివాలయం నుంచీ శాఖల వారీగా శిక్షణ, అవగాహన ఉండాలి. ఈ శిక్షణ సక్రమంగా కొనసాగుతుందా.. లేదా? అనే దానిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ఫిబ్రవరి, మార్చిలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ► ఫిబ్రవరి 8న జగనన్న చేదోడు (రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు లబ్ధి) ► ఫిబ్రవరి 15న వైఎస్సార్ ఇన్పుట్ సబ్సిడీ (తాజాగా వరదల్లో నష్టపోయిన రైతులకు.. ఒక సీజన్లో జరిగిన నష్టం.. అదే సీజన్‌లోగా ఇవ్వాలన్న లక్ష్యానికి అనుగుణంగా, డిసెంబర్లో నష్టం జరిగితే.. ఫిబ్రవరిలో ఇస్తున్నాం) ► ఫిబ్రవరి 22న జగనన్న తోడు (చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం). ఇప్పటికే 10 లక్షల మందికి వర్తింపు. అదనంగా మరో 6 లక్షల మందికి వర్తింపు. ► మార్చి 8న విద్యా దీవెన ► మార్చి 22న వసతి దీవెన ఫిబ్రవరి, మార్చిలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ► ఫిబ్రవరి 8న జగనన్న చేదోడు (రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు లబ్ధి) ► ఫిబ్రవరి 15న వైఎస్సార్ ఇన్పుట్ సబ్సిడీ (తాజాగా వరదల్లో నష్టపోయిన రైతులకు.. ఒక సీజన్లో జరిగిన నష్టం.. అదే సీజన్‌లోగా ఇవ్వాలన్న లక్ష్యానికి అనుగుణంగా, డిసెంబ ర్లో నష్టం జరిగితే.. ఫిబ్రవరిలో ఇస్తున్నాం) ► ఫిబ్రవరి 22న జగనన్న తోడు (చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం). ఇప్పటికే 10 లక్షల మందికి వర్తింపు. అద నంగా మరో 6 లక్షల మందికి వర్తింపు. ► మార్చి 8న విద్యా దీవెన ► మార్చి 22న వసతి దీవెన. -
కృష్ణా జిల్లా ఎస్పీకి జాతీయ స్థాయి అవార్డు
సాక్షి, కోనేరు(విజయవాడ): కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌కు డీజీ.బీపీఆర్–డీ (డైరెక్టర్ జనరల్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) డిస్క్ అవార్డు లభించింది. కోవిడ్ కంటే ముందే వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని అందరికీ పరిచయం చేసి, స్పందన కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. నేషనల్ పోలీస్ మిషన్‌లో భాగంగా గతేడాది డిసెంబర్ 4వ తేదీన డీజీ, ఐజీలకు నిర్వహించిన కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ లెవల్ బెస్ట్ ప్రాక్టీసెస్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా నలుగురు ఎస్పీ స్థాయి అధికారులను ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఎంపికయ్యారు. వీరు తమ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్రమోదీ ముందు ప్రదర్శించగా, అందులో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రదర్శించిన ‘వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి – స్పందన ప్రాజెక్టు’ మైక్రోమిషన్ కింద ఎంపికైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు స్వయంగా అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి చేసిన కృషికి గానూ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందించటంతో పాటు డిస్క్ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డుకు ఎంపికైన జిల్లా ఎస్పీని పలువురు అధికారులు అభినందించారు. జిల్లాలోని పోలీస్ సిబ్బంది ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
స్పందన స్ఫూర్తి క్యూ2 ఫలితాలు
న్యూఢిల్లీ: మైక్రోఫైనాన్స్ కంపెనీ స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్(ఎస్‌ఎస్‌ఎఫ్‌ఎల్) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసిక ఫలితాలను ఆలస్యంగా విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో లాభాలను కోల్పోయి నష్టాలలోకి ప్రవేశించింది. వెరసి రూ. 58 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2020–21) క్యూ2లో దాదాపు రూ. 67 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లోనూ కంపెనీ రూ. 54 కోట్ల నికర లాభం సాధించింది. అయితే క్యూ2లో మొత్తం ఆదాయం మాత్రం రూ. 354 కోట్ల నుంచి రూ. 396 కోట్లకు పుంజుకుంది. క్యూ1లో అందుకున్న రూ. 435 కోట్లతో పోలిస్తే ఆదాయం క్షీణించింది. అప్పటి ఎండీ, వ్యవస్థాపకురాలి రాజీనామాతో యాజమాన్యంలో చేపట్టిన మార్పుల కారణంగా క్యూ2 ఫలితాలను ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ 2021 నవంబర్ 12నే వెల్లడించింది. వెంటనే అమల్లోకి వచ్చే విధంగా కంపెనీ ఎండీ, వ్యవస్థాపకురాలు పద్మజ గంగిరెడ్డి 2021 నవంబర్ 2న రాజీనామా చేసిన విషయం విదితమే. దీంతో కంపెనీ వెనువెంటనే మేనేజ్మెంట్ కమిటీని పునర్వ్యవస్థీకరించింది. ఫలితాల విడుదల నేపథ్యంలో స్పందన స్ఫూర్తి షేరు బీఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 415 వద్ద ముగిసింది. -
ఉద్యోగం ఒకరిది.. జీతం మరొకరికి!
కాజులూరు(తూర్పుగోదావరి): ‘నాకు ఉద్యోగం వచ్చిన విషయం నాకే తెలియకుండా’ఏడాదిన్నర కాలంగా మరొకరు నా విధులు నిర్వహిస్తూ నా పేరుతో జీతం కాజేస్తున్నారని’, తన ఉద్యోగం తనకు ఇప్పించాలంటూ కాజులూరు శివారు రాంజీనగర్‌కు చెందిన బిల్లా రోజా సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందన కార్యక్రమంలో ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2020 మే నెలలో కాజులూరులో డ్వాక్రా యానిమేటర్ పోస్టుకి నోటిఫికేషన్ పడటంతో బిల్లా రోజా దరఖాస్తు చేసుకున్నారు. 16 మే 2020న రోజాను యానిమేటర్‌గా ఎంపిక చేస్తూ తీర్మానం చేశారు. ఆ మరుసటి రోజున ఆమె విధులకు వెళ్లగా కొన్ని సాంకేతిక ఇబ్బందుల కారణంగా నీ పేరు ఎంపిక కాలేదని తర్వాత కబురు చేస్తామని అధికారులు చెప్పారు. ఇటీవల రోజా ఇంటర్నెట్ సెంటరుకి వెళ్లి మరో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా ఆన్లైన్లో ఆమె యానిమేటర్‌గా ఏడాదిన్నర కాలంగా ఉద్యోగం చేస్తూ ప్రభుత్వం నుంచి నెలకు 8,000 చొప్పున జీతం తీసుకుంటున్నట్టు కనిపించింది. దీంతో ఆమె అవాక్కయి డ్వాక్రా కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా గతంలో మందపల్లి జ్యోతి అనే మహిళ ఈ ఉద్యోగం చేసేదని, ఉన్నత చదువుల కోసం యానిమేటర్ ఉద్యోగం మానివేయటంతో నోటిఫికేషన్ ఇచ్చారని, ప్రస్తుతం ఆమె తల్లి మందపల్లి నిర్మలకుమారి తన పేరున ఉన్న ఉద్యోగం అనధికారికంగా నిర్వహిస్తూ జీతం తీసుకుంటోందని తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి తన ఉద్యోగం తనకు ఇప్పించాలని బిల్లా రోజా కోరుతున్నారు. -
Andhra Pradesh: పింఛన్ రూ.2,500
స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత కీలకం. ఒకే సమస్యపై తిరిగి రెండోసారి అర్జీ వస్తే గతంలో ఆ దరఖాస్తును పరిశీలించిన వారే మళ్లీ వెరిఫికేషన్ చేయకూడదు. ఆ అర్జీని పై అధికారి కచ్చితంగా పరిశీలించాలి. ఈ కీలక అంశాలు నిర్దిష్ట నిర్వహణ ప్రణాళిక (ఎస్వోపీ)లో ప్రధానం కావాలి. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజల పట్ల మానవతా థృక్పథంతో ఉండాలి. స్పందనపై కలెక్టర్లు పూర్తిగా మనసు పెట్టాలి. కార్యక్రమం మరింత మెరుగుపడాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షల మంది అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులు విరబూసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త ఏడాది కానుక ప్రకటించారు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద పెద్ద వయసువారు ప్రస్తుతం అందుకుంటున్న మొత్తాన్ని మాట ప్రకారం ముఖ్యమంత్రి మరింత పెంచారు. ప్రస్తుతం ప్రతినెలా మొదటి రోజే రూ.2,250 చొప్పున ఇస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుకను జనవరి 1వతేదీన రూ.2,500కు పెంచి అవ్వా తాతల చేతిలో పెడతామని తెలిపారు. ‘స్పందన’లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ కానుకను పెంచుతున్నామని, ఇది చాలా పెద్ద కార్యక్రమం అని తెలిపారు. ఈ సందర్భంగా డిసెంబర్, జనవరిలో అమలు చేసే పలు పథకాలు, కార్యక్రమాల వివరాలను సీఎం ప్రకటించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, స్పందన సమస్యల పరిష్కారంపై ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ... మనస్ఫూర్తిగా ‘స్పందన’ స్పందన కార్యక్రమంలో కలెక్టర్లు మనస్ఫూర్తిగా నిమగ్నం కావాలి. స్పందన అమలు యంత్రాంగాన్ని మరోసారి పరిశీలించాలి. రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి సచివాలయంలో స్పందన ద్వారా అర్జీలు స్వీకరిస్తున్నాం. దీంతోపాటు వారానికి ఒక రోజు అర్జీలు తీసుకుంటున్నాం. ఒక సచివాలయం స్థాయిలో ప్రతి రోజూ వస్తున్న అర్జీలను ఎలా పరిష్కరిస్తున్నారనే అంశంపై అధికారుల సమీక్ష అవసరం. మండల స్థాయిలో కూడా అధికారులు పరిశీలించాలి. వారంలో ఒకరోజు మండల అధికారులతో కలెక్టర్ సమీక్ష చేయాలి. మరింత మెరుగ్గా మన లక్ష్యాలు ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో, పారదర్శక పద్ధతిలో ప్రయోజనాలను అందించడం ఎస్డీజీ లక్ష్యాల వెనుక ప్రధాన ఉద్దేశం. నవరత్నాల ద్వారా అందరినీ మ్యాపింగ్ చేశాం. ఆశించిన లక్ష్యాలను సాధించాలి. దేశంతో పోలిస్తే మన లక్ష్యాలు మెరుగ్గా ఉండాలి. ఎస్డీజీ లక్ష్యాల సాధనపై కలెక్టర్లు దృష్టిపెట్టి పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి జిల్లా ఎస్డీజీ లక్ష్యాల సాధనలో ముందుకు సాగాలి. ఉగాది నాటికి పూర్తి కావాలి సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలన్నీ ఉగాది నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. డిజిటల్ లైబ్రరీలు కూడా త్వరలో అందుబాటులోకి రావాలి. నాడు –నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు పునరుజ్జీవం పొందాయి. మరోవైపు విలేజ్ క్లినిక్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నింటి ద్వారా మొత్తం గ్రామాల ముఖచిత్రం మారిపోతోంది. డిసెంబర్, జనవరిలో కార్యక్రమాలు ఇవీ.. పేదలకు ఎంతో మేలు చేకూర్చే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని డిసెంబర్ 21న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ► ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన అర్హులకు డిసెంబర్ 28న ప్రయోజనాలను అందచేస్తామని తెలిపారు. గతంలో చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఇంకా అర్హులెవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఇచ్చామని, ఇప్పుడు వారికి ప్రయోజనాలు పంపిణీ చేస్తామన్నారు. సామాజిక తనిఖీ కోసం లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాలని అధికారులకు సీఎం సూచించారు. జనవరి 9న ఈబీసీ నేస్తం... అగ్రవర్ణ నిరుపేద మహిళలకు (45 – 60 ఏళ్లు) ఏడాదికి రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు చొప్పున ఆర్థిక సాయం అందచేసే ఈబీసీ నేస్తం పథకాన్ని జనవరి 9వతేదీన ప్రారంభించనున్నారు. ► జనవరిలోనే వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత చెల్లింపులు చేస్తామని, త్వరలోనే తేదీని ప్రకటిస్తామని సీఎం తెలిపారు. అర్హులందరికీ పథకాలు అందాలి.. అనర్హులకు అందకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ► ఈ కార్యక్రమంలో సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై. మధుసూదన్‌రెడ్డి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: కొత్త ఏడాదిలో పెన్షన్ రూ.2500కు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. జనవరి 1, 2022 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. సీఎం జగన్ మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం.. డిసెంబర్, జనవరిలో నిర్వహించే కార్యక్రమాలను వెల్లడించారు. డిసెంబర్ 21న సంపూర్ణ గృహహక్కు పథకం, డిసెంబర్ 28న ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద వివిధ కారణాలవల్ల మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. చదవండి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేస్తామని.. అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు (45–60ఏళ్లు)3 ఏళ్లలో రూ.45వేలు లబ్ధి చేకూరనుందన్నారు. జనవరిలోనే రైతు భరోసా అమలు చేస్తామని.. తేదీ త్వరలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు. కోవిడ్‌లో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిందని.. కొత్త వేరియంట్‌కు విస్తృతంగా వ్యాపించే లక్షణం ఉందని సీఎం అన్నారు. ఏపీలో కరోనా రికవరీ రేటు 99.21 శాతంగా ఉందన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్ పథకం ద్వారా మధ్య తరగతికి లబ్ధి చేకూరుతుందన్నారు. సరసమైన ధరలకు లిటిగేషన్ లేని భూములు కేటాయింపులు చేస్తున్నామన్నారు. పథకం విజయవంతం చేయడానికి అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును నిత్యం పర్యవేక్షించాలన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర కచ్చితంగా అందాలన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. చదవండి: AP: రాబడిని మించిన జీతాలు -
స్పందనతో భరోసా
-
కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులిచ్చాం: సీఎం జగన్
-
అక్టోబర్ 26న రైతు భరోసా రెండో విడత: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల నిర్మాణ ప్రగతి, జగనన్న శాశ్వత గృహహక్కు పథకంపై సమీక్ష నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు, ఆర్బీకేల నిర్మాణాల ప్రగతి గురించి సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలపై కూడా ఈ సమీక్షలో సీఎం జగన్ చర్చించారు. ఖరీఫ్ అవసరాలు, రబీ సన్నద్ధతపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంపై సమీక్ష నిర్వహించారు. ఉపాధిహామీ: ►ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టండి ►విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురంజిల్లాల్లో మెటీరియల్ కాంపొనెంట్ వినియోగంపై తగిన దృష్టిపెట్టండి ► కృష్ణా, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు గ్రామ సచివాలయాల నిర్మాణాల విషయంలో వెనకబడి ఉన్నారు ►వెంటనే సచివాలయాల భవనాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి ►రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి భవనాలను కూడా పూర్తిచేయాలి ►కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కలెక్టర్లు దృష్టిపెట్టాలి ►వైయస్సార్ హెల్త్ క్లినిక్స్‌పైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం ►గ్రామాల్లో డిజిటిల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నాం ►అవాతంరాలు లేకుండా ఇంటర్నెట్ను సరఫరాచేస్తాం ►దీనివల్ల వర్క్‌హోం కాన్సెప్ట్ సాకారం అవుతుంది ►డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలి ►తొలివిడతలో భాగంగా 4314 లైబ్రరీలను నిర్మిస్తున్నాం ►ఈ లైబ్రరీల నిర్మాణానికి సంబంధించి అన్నిరకాల చర్యలు తీసుకోండి ►అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది ►పంట కొనుగోలు జరగాలంటే ఇ– క్రాపింగ్‌చేయాలి ►ఇ– క్రాపింగ్ చేయించడమన్నది ఆర్బీకేల ప్రాథమిక విధి ►ఇ– క్రాపింగ్‌పైన కలెక్టర్లు, జాయంట్ కలెక్టర్లు దృష్టిపెట్టాలి ►యాప్ పైనకూడా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలి ►ఎక్కడ రైతులకు ధరల విషయంలో నిరాశజనక పరిస్థితులు ఉన్నా.. సీఎం యాప్‌ద్వారా... పర్యవేక్షణ చేసి వెంటనే రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలి ►ఇ– క్రాపింగ్‌చేసిన తర్వాత డిజిటల్ రశీదుతోపాటు, భౌతికంగా కూడా రశీదు ఇస్తున్నారా? లేదా?చూడాలి ►గ్రామంలోని ప్రతి ఎకరా కూడా ఇ–క్రాపింగ్జరగాల్సిందే ►ఇ– క్రాపింగ్ఉంటనే పంటలబీమా, సున్నావడ్డీ, పంటకొనుగోళ్లు, ఇన్‌పుట్‌సబ్పిడీ ... ఇవన్నీకూడా సవ్యంగా జరుగుతాయి ►అగ్రికల్చర్ అడ్వైయిజరీ మీటింగ్స్ కచ్చితంగా జరిగేలా చూడాలి ►నెలలో మొదటి శుక్రవారం ఆర్బీకేల స్థాయిలో, రెండో శుక్రవారం మండలస్థాయిలో, మూడో శుక్రవారం జిల్లాల స్థాయిలో అడ్వైయిజరీ సమావేశాలు జరగాలి ►నాలుగో శుక్రవారం వ్యవసాయశాఖకార్యదర్శి సమక్షంలో రాష్ట్రస్థాయిలో సమావేశం జరగాలి: ►ఈ సమావేశాల్లో వచ్చే సలహాలు, సూచనలు కొనసాగాలి ►విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు నాణ్యమైన వాటిని ఆర్బీకేల ద్వారా పంపిణీచేయాలి ►నెల్లూరులో జరిగిన ఘటన నాదృష్టికి వచ్చింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోమని చెప్పాం ►ఎంప్యానెల్ అయిన కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులనే ఇవ్వాలి ►సీడ్కార్పొరేషన్.. ఈ ఉత్పత్తులను సమగ్రంగా పరిశీలించాలి ►ఆర్బీకేల ద్వారా ఇస్తున్నవాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్న విషయాన్ని మరిచిపోవద్దు ►కలెక్టర్లు నుంచి అందరూ కూడా సమిష్టిగా బాధ్యత వహించాలి ►విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఉంచడానికి ఆర్బీకేల్లోనే గోడౌన్లను ఏర్పాటు చేస్తున్నాం ►అప్పటివరకూ స్టోరేజీకోసం... అద్దె ప్రాతిపదికన భవనాలు తీసుకోండి ►నాకు పలానాది కావాలని రైతులు అడిగితే.. కచ్చితంగా సంబంధిత ఆర్బీకే ద్వారా ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సరఫరా కావాలి ►అందుకనే వీలైనంత త్వరగా ఆర్బీకేలను పూర్తిచేయాలి ►అంతవరకూ తాత్కాలిక ఏర్పాట్లు పూర్తిచేసుకోండి ►ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఉంచమని చెప్పాం ►వారి విధులు, కార్యకలాపాలపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలి ►అన్ని ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉండేలా చర్యలు తీసుకోండి ►కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇచ్చాం ►వారికి పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి ►వారికి రైతు భరోసా సహా.. అన్నిరకాలుగా అండగా ఉంటున్నాం ►ఇన్‌పుట్‌సబ్సిడీ ఇస్తున్నాం, బీమా ఇస్తున్నాం, పంట కొనుగోలుకు కూడా భరోసా ఇస్తున్నాం ►ఇలాంటి సందర్భాల్లో వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు వెనకడుగు వేయాల్సిన పనిలేదు: ►అందుకే వారికి రుణాలు అందేలా కలెక్టర్లు దృష్టిపెట్టాలి ►నవంబర్ నుంచి రబీ పనులు ఊపందుకుంటాయి ►రబీకి అవసరమైన విధంగా అధికారులు సన్నద్ధంకావాలి ►62శాతం మంది ప్రజలు పరోక్షంగా, ప్రత్యక్షంగా వ్యవసాయ రంగంపైన ఆధారపడి ఉన్నారు: ►ఈ రంగం ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు: ►దీన్ని ప్రతిక్షణం మీరు మనసులో పెట్టుకోవాలి ►గ్రామీణఆర్థిక వ్యవస్థదీనిమీదే ఆధారపడి ఉంది ►జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం విప్లవాత్మకమైనది ►100 సంవత్సరాల క్రితం సర్వే అయ్యింది ►100 ఏళ్ల తర్వాత సర్వే, రికార్డులను అప్డేట్ చేస్తున్నాం ►గ్రామాల్లో భూ వివాదాలకు పూర్తిగా చెక్‌పడుతుంది ►గ్రామ సచివాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు ఉంటుంది ►పైలట్‌ప్రాజెక్టుగా 51 గ్రామాల్లో జరుగుతోంది ►మరో 650 గ్రామాల్లో డిసెంబర్‌కల్లా పూర్తవుతుంది ► 2023 జూన్‌కల్లా మొత్తం సర్వే ప్రక్రియ ముగుస్తుంది ►కలెక్టర్లు, జాయింట్‌కలెక్టర్లు అంకిత భావంతో దీన్ని అమలు చేయాలి ►సర్వే అవగానే రికార్డులు అప్డేట్ అవుతాయి, కొత్త పాసుపుస్తకాలు యజమానులకు ఇస్తాం జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సీఎం సమీక్ష ►ఈ పథకం వల్ల లక్షలమందికి ఉపయోగం ►47.4 లక్షల మంది లబ్ధి పొందుతారు ►పట్టాలు వీరిచేతికి అందుతాయి ►వారి ఇంటి స్థలంమీద వారికి అన్నిరకాల హక్కులు వస్తాయి ►దీనిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి ►ఈ పథకంమీద క్రమం తప్పకుండా సీఎస్‌గారు కూడా రివ్యూ చేస్తారు ►డిసెంబర్ 21న ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది ►గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు బాగా మెరుగుపడ్డాయి ►తనిఖీలకు వెళ్లినప్పుడు రిజిస్టర్ పరిశీలన తప్పనిసరి ►తనిఖీలకు వెళ్లినప్పుడు గతంలో వ్యక్తంచేసిన సమస్యలను పరిష్కరించామా? వాటిని సరిచేశామా? లేదా?చూడాలి ►రిజిస్టర్‌లోపేర్కొన్న అంశాలను సచివాలయాల విభాగాధిపతికి పంపించాలి ►అలాగే ఏదైనా పరిష్కరించాల్సిన కొత్త అంశాన్ని గుర్తిస్తే.. వాటిని కూడా రిజస్టర్‌లో నమోదు చేయాలి ►గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీచేసినప్పుడు గుర్తించిన అంశాలు, సమస్యలను పరిష్కరిస్తున్నారా? లేదా?వాటిపై దృష్టిపెడుతున్నారా? లేదా? అన్నదానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి ►దీనికి సంబంధించిన ప్రోటోకాల్‌ను తయారుచేయాలి ►ఆ ప్రోటోకాల్‌ను పాటిస్తున్నారా? లేదా?కచ్చితంగా చూడాలి ►దాదాపు 80శాతం సచివాలయాల ఉద్యోగులు మంచి పనితీరు కనపరుస్తున్నారని తనిఖీల ద్వారా వెల్లడైందని చెప్తున్నారు ►మిగిలిన 20 శాతం మంది సచివాలయాల సిబ్బందికి కూడా వారు పనితీరును మెరుగుపరిచేలా మనం వారికి తోడ్పాటును అందించాలి ►నూటికి నూరు శాతం గ్రామ, వార్డు సచివాలయాలు పనితీరును చూపించేలా సిబ్బందికి తగిన చేయూతను, తోడ్పాటును అందించాలి వాలంటీర్ల సేవలపైనా కూడా దృష్టిపెట్టాలి ►వారు మెరుగైన సేవలు అందించేలా వారికి కౌన్సెలింగ్ చేయాలి ►వారు అప్‌గ్రేడ్ అయ్యేలా చూడాలి ►అందుకు వారికి చేయూతనిచ్చి.. తీర్చిదిద్దాలి ►అప్పటికీ కూడా సేవలను అందించడంలో వారు ప్రమాణాలను అందుకునే రీతిలో లేకపోతే వారిని తొలగించి కొత్తవారిని పెట్టాలి ►ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులను కూడా భర్తీచేయాలి ►అలాగే సచివాలయాలకు అందుతున్న విజ్ఞాపనలు, వినతుల పరిష్కారంపైకూడా దృష్టిపెట్టండి ►రిడ్రెసల్ యంత్రాంగం సమర్థవంతంగా ఉండాలి ►సిటిజన్ అవుట్‌రీచ్ కార్యక్రమం అక్టోబరు 29, 30 తేదీల్లో చేపట్టాలి ►సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు.. బృందాలుగా ఏర్పడి వారి పరిధిలోని ప్రతి కుటుంబాన్ని కలవాలి ►గతలో జరిగిన అవుట్‌రీచ్ కార్యక్రమంలో కొన్నిచోట్ల కేవలం వాలంటీర్లు మాత్రమే కలిసినట్టు నా దృష్టికి వచ్చింది ►కచ్చితంగా సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల బృందాలుగా ఏర్పడి... కుటుంబాలను కచ్చితంగా కలవాలి ►నెలలో ప్రతి బుధవారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కచ్చితంగా సమావేశాలు జరగాలి ►ఇందులో సిబ్బంది, వాలంటీర్లు ఈ సమావేశాల్లో పాల్గొనాలి ►సచివాలయాల్లోని మౌలిక సదుపాయాలు, పరికరాలు కచ్చితంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి ►మొబైల్స్, గౌరవవేతనం, సీఎఫ్ఎంస్ ఐడీలు, సిమ్‌కార్డులు, ఫింగర్‌ప్రింట్ స్కానర్లు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించాలి ►నెలలో రెండో బుధవారం మండలం లేదా యూఎల్బీ స్థాయిలో సమావేశం జరగాలి ►నెలలో మూడో బుధవారం జిల్లా స్థాయిలోసమావేశం కావాలి ►నాలుగో బుధవారం రాష్ట్ర స్థాయిలో సచివాలయాల విభాగానికి చెందిన కార్యదర్శి సమావేశం కావాలి ►ప్రతి ఏటా రెండు సార్లు జూన్, డిసెంబరుల్లో పెన్షన్లు, రేషన్‌కార్డులు, పట్టాలు తదితర పథకాలకు సంబంధించి మంజూరు ఉంటుంది ►దీన్ని కచ్చితంగా అమలు చేయాలి అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత: ►2020 ఖరీఫ్‌కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాలు ►ఈ కార్యక్రమాల అమలుకు సంబంధించి చర్యలు తీసుకోండి ►నవంబర్‌లో విద్యా దీవెనకు సంబంధించి కూడా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేయాలి ►10 రోజుల ఆసరా కార్యక్రమాలను నిర్వహించిన కలెక్టర్లు, అధికారులందరికీ అభినందనలు -
సమస్యల పరిష్కార వేదిక స్పందన..
కర్నూలు(సెంట్రల్) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకొంటోంది. అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం రాకపోయినా, నిర్దేశించిన గడువులోగా ఇవ్వకపోయినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందనలో అర్జీలు తప్పక దానికి సమాధానం చేయాల్సి ఉంటుంది. 2019 జూన్ 1 నుంచి 2021 అక్టోబర్ 03వ తేదీ నాటికీ స్పందనకు రాష్ట్ర వ్యాప్తంగా 3,27,8,844 అర్జీలు రాగా, అందులో 3,20,9,919 అర్జీలకు పరిష్కారం చూపారు. 68,325 అర్జీల పరిష్కార మార్గాలు ప్రాసెస్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పందన అర్జీలను ఎన్ని మార్గాల ద్వారా ఇవ్వచ్చో చుద్దాం. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయాలు, 1902 కాల్ సెంటర్, స్పందన మొబైల్ యాప్, వెబ్ అప్లికేషన్, ప్రతీ సోమవారం కలెక్టరేట్లలో కలెక్టర్లకు అర్జీలు ఇవ్వవచ్చు. గ్రామ, వార్డు సచివాలయాలు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం అర్జీలను స్వీకరిస్తారు. అక్కడ డిజిటల్ అసిస్టెంట్‌కు అర్జీలు ఇస్తే వాటిని స్పందన లాగిన్‌లో అప్లోడ్ చేస్తారు. తద్వారా మనం ఉన్న ప్రాంతం నుంచే అర్జీలు ఇచ్చేందుకు వీలు అవుతుంది. 1902 కాల్ సెంటర్.. ఈ కాల్ సెంటర్ కూడా స్పందనకు సంబంధించిందే. ఇది 24 గంటలు పనిచేస్తుంది. 1902 కాల్ ఉచితంగా ఫోన్ చేసి మాట్లాడి మన సమస్యను అధికారికి తెలపాలి. దీనికి ఫోన్ చేసే సమయంలో ఆధార్‌నంబర్ కచ్చితంగా ఉండాలి. ఈ కాల్ సెంటర్‌కు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఏపీలోని మన సమస్యలకు పరిష్కారం కొనుగోనవచ్చు. మొబైల్ యాప్, వెబ్ అప్లికేషన్... ఈ రెండింటికి ఆన్లైన్ ద్వారా అర్జీలు ఇవ్వవచ్చు. మొబైల్యాప్, వెబ్ అప్లికేషన్లను మన సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని మన పూర్తి వివరాలను నమోదు చేసి పంపవచ్చు. కలెక్టరేట్లలో నేరుగా ఇవ్వచ్చు... స్పందనకు ఎక్కువ సంఖ్యలో అర్జీలు వచ్చే మార్గం కలెక్టరేట్లలో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్. ఇక్కడ సమస్యను ఏ అధికారి అయితే పరిష్కరించగలుగుతాడో నేరుగా అతనికే మన అర్జీని ఇస్తే అక్కడిక్కడే చాలా సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. ఇక్కడ కలెక్టర్, జేసీలు, జిల్లా ఉన్నతాధికారులు ఉండి అర్జీలు స్వీకరిస్తారు. ఇక్కడే ఇచ్చే అర్జీలకు చాలా వరకు పరిష్కారాలు అప్పటికప్పుడు వచ్చేస్తాయి. -
AP: ‘పురసేవ’లో సర్కార్ సక్సెస్
సాక్షి, అమరావతి: వెలగని వీధి లైట్లు.. అస్తవ్యస్తంగా చెత్త సేకరణ.. అపరిశుభ్ర పరిసరాలు.. పొంగుతున్న డ్రైన్లు.. ఇలా పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు అందిన వెంటనే ప్రభుత్వం స్పందిస్తోంది. ఆయా సమస్యలను నిర్దేశించిన గడువులోగా మున్సిపల్ శాఖ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, ఆరు సెలక్షన్ గ్రేడ్, ఏడు స్పెషల్ గ్రేడ్, 15 ఫస్ట్ గ్రేడ్, 30 సెకండ్ గ్రేడ్, 19 థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీలు, 30 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 40.83 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేయడానికి మున్సిపల్ శాఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాలను అందుబాటులో ఉంచింది. అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా పర్యవేక్షిస్తోంది. 95.85 శాతం ఫిర్యాదుల పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పందన కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, నగరాల్లో ప్రజల నుంచి వార్డు సచివాలయాల్లో ఆఫ్‌లైన్ విధానంలో సమస్యలపై ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అదేవిధంగా ఆన్లైన్లో స్పందన పోర్టల్ ద్వారా ఫిర్యాదులను తీసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 24 వరకు స్పందనలో 14,610 ఫిర్యాదులు అందగా ఇప్పటివరకు 14,005 (95.85 శాతం) ఫిర్యాదులను అధికారులు పరిష్కరించారు. 99.17 శాతం పరిష్కారం ఇక ఆన్లైన్ విధానంలో ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 24 వరకు 45,043 ఫిర్యాదులు అందగా 44,671 (99.17 శాతం) ఫిర్యాదులను పరిష్కరించారు. ఇందులో 61.39 శాతం ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగానే పరిష్కరించారు. ఆన్లైన్లో అందే ప్రతి ఫిర్యాదు వార్డు సచివాలయంలోని సంబంధిత ఉద్యోగికి చేరుతుంది. నిర్దేశిత గడువులోగా ఫిర్యాదు పరిష్కారం కాకపోతే.. ఆ మరుసటి రోజే సచివాలయ ఉద్యోగిపై అధికారికి ఆన్లైన్లోనే ఫిర్యాదు బదిలీ అవుతుంది. ఆన్లైన్ ఫిర్యాదులపై పర్యవేక్షణకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలను అనుసంధానిస్తూ సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ఫిర్యాదులు పరిష్కరిస్తున్న వి«ధానాన్ని మునిసిపాలిటీల వారీగా పర్యవేక్షిస్తున్నారు. cdma. ap. gov. inలో, పురసేవ మొబైల్ యాప్ ద్వారా ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదు చేయొచ్చు. సమస్యను తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలను జత చేయాలి. ప్రతి ఫిర్యాదుకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. ఫిర్యాదుదారులు రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎం.ఎం. నాయక్ తెలిపారు. -
స్పదనతో భరోసా
-
‘దిశ’తో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ
సాక్షి, అమరావతి: దిశ అమలుతో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకోనుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు 70,00,520 మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. ఇందులో 3,78,571 ఎస్ఓఎస్ రిక్వెస్టులు వచ్చాయని, ఇందులో చర్యలు తీసుకోదగ్గవి 4,639 ఉన్నాయని తెలి పారు. బుధవారం ఆయన స్పందన సమీక్షలో మాట్లాడుతూ.. ‘దిశ’ మీ మానస పుత్రిక అని, ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు, ఎస్పీలు ఓన్ చేసుకోవాలని సూచించారు. ప్రతి మహిళ తన ఫోన్లో దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవడం లక్ష్యం కావాలని, దీన్ని సవాలుగా తీసుకోవాల్సిందిగా పోలీసు యంత్రాంగానికి సూచించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. కలెక్టర్లు, ఎస్పీల ప్రతిష్ట పెరుగుతోంది ► దిశ యాప్ ద్వారా మూడు నెలల్లో దాదాపు 900 సక్సెస్ స్టోరీలు ఉన్నాయి. సక్సెస్ స్టోరీ అంటే.. ఏదైనా జరగకముందే దాన్ని నివారించి, మహిళలకు అండగా నిలవడం. ఫోన్‌ను షేక్ చేస్తే చాలు.. సగటున 6 నిమిషాల్లోగా మహిళకు భద్రత కల్పించేలా యాప్‌ను తీర్చిదిద్దాం. ► గత ప్రభుత్వం హయాంలో చార్జిషీటు వేయడానికి సగటున 300 రోజులు పడితే, ఇప్పుడు 42 రోజుల్లోగా వేస్తున్నాం. దేశంలో మహిళల మీద నేరాల్లో 91 శాతం కేసుల్లో కేవలం 2 నెలల వ్యవధిలోనే చార్జిషీటు దాఖలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రికార్డుల ప్రకారం జాతీయ సగటు 35 శాతంగా ఉంది. తిరుగులేని రీతిలో పోలీసు విభాగం పని చేస్తోంది. è కలెక్టర్లు, ఎస్పీల ప్రతిష్ట గణనీయంగా పెరుగుతుంది. దేశం మొత్తం మీ గురించి మాట్లాడుకుంటుంది. ప్రతి సచివాలయంలో మహిళా పోలీసు ఉన్నారు. వలంటీర్లు ఉన్నారు. వీరి సేవలను వినియోగించుకోండి. మహిళల వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లో తప్పకుండా దిశ యాప్ ఉండేలా చర్యలు తీసుకోండి. దీన్నొక సవాల్‌గా తీసుకోండి. గ్రామ, వార్డు సచివాలయాల్లో తని ఖీలకు వెళ్తున్నప్పుడు దిశ యాప్, దిశయాప్ డౌన్‌లోడ్‌ను ఒక అంశంగా తీసుకోండి. ఎఫ్ఐఆర్ నమోదులో వెనకడుగు వద్దు ► అధిక సంఖ్యలో ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయని పోలీసులు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. దిశ యాప్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా మనం ప్రోత్సహిస్తున్నాం. ► ఏపీలో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఎవరైనా వ్యాఖ్యలు చేసినా వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరంలేదు. ► కేరళలో ఏడాదికి 7 లక్షలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు అవుతున్నాయి. మహిళలు చైతన్యంగా ఉన్నప్పుడు, పోలీసులు స్నేహ పూర్వకంగా ఉన్నప్పుడే.. ఫిర్యాదుదారులు ముందుకు రాగలుగుతారు. అలాంటి సందర్భాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతాయి. ► 70 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారంటే.. దాని అర్థం ఏంటంటే.. ఏ ఘటన జరిగినా ఫిర్యాదు చేయడానికి, కేసులు నమోదు చేయడానికి ఆ మహిళలకు అండగా ఉంటున్నట్టే లెక్క. ప్రతి మహిళ తన ఫోన్లో దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవడం లక్ష్యం కావాలి. -
7 నుంచి రెండో విడత ఆసరా
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు అక్టోబర్ 7వ తేదీ నుంచి వరుసగా 10 రోజుల పాటు విజయ దశమి కానుకగా రెండో విడత ఆసరా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 7 నుంచి 10 రోజుల పాటు ఆసరా పథకంపై నిర్వహించే అవగాహన, చైతన్య కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొంటారని చెప్పారు. ఆ రోజుల్లో ఆసరా చెక్కుల పంపిణీయే కాకుండా ఆసరా, చేయూత, దిశ ద్వారా మహిళా సాధికారతకు ఏ విధంగా అడుగులు వేశామో ప్రజలకు వివరిస్తారన్నారు. ఆసరా, చేయూత ద్వారా జీవితాలను మెరుగు పరుచుకున్న వారి విజయాలను మహిళలకు వివరిస్తారని చెప్పారు. ఈ పథకాల ద్వారా వారి జీవితాలను ఎలా మార్చుకోవచ్చో కూడా వివరిస్తారని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ అతిపెద్ద కార్యక్రమం మండలం యూనిట్‌గా జరుగుతుందని, దాదాపు రూ.6,500 కోట్లు వైఎస్సార్ ఆసరా కింద ఇస్తున్నామని స్పష్టం చేశారు. తద్వారా దాదాపు 80 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మలు లబ్ధిపొందుతారని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ► పట్టణాలు, గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ‘క్లాప్’ అక్టోబర్ 1న ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 19న జగనన్న తోడు కార్యక్రమం ఉంటుంది. దీని కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందజేస్తాం. ► అక్టోబర్ 26న రైతులకు ‘వైఎస్సార్ సున్నావడ్డీ రుణాలు’ కార్యక్రమం ఉంటుంది. దీంతోపాటు ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత అమలు చేస్తాం. కలెక్టర్లు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి ► కోవిడ్ తీవ్రత తగ్గింది. ఉధృతంగా ఉన్న కాలంలో పాజిటివిటీ రేటు 25.56 శాతం నమోదైంది. ప్రస్తుతం 2.5 శాతం కన్నా తక్కువగా ఉంది. రికవరీ రేటు కూడా 98.63 శాతంగా ఉంది. అయినా, కోవిడ్ పట్ల ఎలాంటి అలసత్వం వద్దు. మాస్కుల వినియోగం తప్పనిసరి. ఆంక్షలు కొనసాగించాలి. మలేరియా, డెంగీ, డయేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులపైనా దృష్టి పెట్టండి. ► 104 నంబర్ అనేది వన్‌స్టాప్ సొల్యూషన్‌గా నడవాలి. టీచింగ్ ఆస్పత్రులు, ఆస్పత్రుల్లో అన్నిరకాలుగా సిద్ధం కావాలి. మీ జిల్లాల్లోని టీచింగ్ ఆస్పత్రులకు జాయింట్ కలెక్టర్ హౌసింగ్‌ను అడ్మిన్ ఇన్చార్జిగా నియమించాలి. ► నవంబర్ 15 నుంచి విలేజ్ క్లినిక్స్ నుంచి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో కావాల్సిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. డిప్యుటేషన్లను పూర్తిగా రద్దు చేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ డిప్యుటేషన్లకు అనుమతి ఇవ్వొద్దు. ఎక్కడ సిబ్బంది లేకపోయినా ఆరోగ్య శాఖ కార్యదర్శి, కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ పీఎస్ఏ ప్లాంట్లు ► 100 బెడ్లకు మించి ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఉంచేలా చూడాలి. ప్రైవేటు ఆస్పత్రులకు 30 శాతం సబ్సిడీ కూడా ఇస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సదుపాయం లేదు. ప్రైవేటు ఆస్పత్రులు డి–టైప్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లను అందుబాటులో ఉంచుకునేలా చూడాలి. ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో 143 ప్రాంతాల్లో పీఎస్ఏ ప్లాంట్లు పెడుతున్నాం. అక్టోబర్ 10 నాటికి పీఎస్ఏ ప్లాంట్లన్నీ ఏర్పాటవుతాయి. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడంలో ఇవన్నీ సన్నాహకాలు. ఫిబ్రవరి నాటికి సంపూర్ణ వ్యాక్సినేషన్ లక్ష్యం ► ప్రస్తుతం మనం 2,59,55,673 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చాం. వీరిలో 1,24,25,525 మందికి రెండు డోసులు, 1,35,30,148 మందికి సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయింది. 18 సంవత్సరాలు దాటిన వారికి నవంబర్ 30 నాటికి 3.5 కోట్ల మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ ఇవ్వగలుగుతాం. ► వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రజలందరికీ పూర్తిగా 2 డోసులు ఇవ్వగలుగుతాం. వ్యాక్సినేషన్‌పైనా కలెక్టర్లు దృష్టి సారించాలి. రెండో డోసును సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలి. వచ్చే 10 రోజుల్లో 26,37,794 మందికి సెకండ్ డోసు వ్యాక్సిన్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం. ► గుంటూరు, విజయనగరం, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కలెక్టర్లు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. -
‘పరిషత్’ ఫలితాల్లో ప్రతిబింబించిన ప్రభుత్వ పనితీరు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పనితీరు పరిషత్ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వివిధ పథకాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టర్లు, జిల్లాల యంత్రాంగం, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు.. ఇలా అందరి పని తీరు కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు. నాడు– నేడు నుంచి మహిళా సాధికారత, రైతు సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలన్నీ చక్కటి ఫలితాలనిస్తున్నాయని చెప్పారు. అన్ని పథకాలను, ప్రభుత్వ కార్యక్రమాలను అంకిత భావంతో అమలు చేస్తున్నారని, తద్వారా ఏపీ చరిత్రలోనే కాదు, బహుశా దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ ఇలాంటి ఫలితాలను చూసి ఉండరని అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఆది నుంచి ఇవే ఫలితాలు ► మొదటి నుంచీ ఇలాంటి ఫలితాలే వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 86 శాతం సీట్లు, పార్లమెంటు స్థానాల్లో 88 శాతం సీట్లు సాధించాం. ఇదే ట్రెండ్ సర్పంచి ఎన్నికల్లోనూ కొనసాగింది. మా పార్టీ మద్దతుదారులు 81 శాతం చోట్ల గెలుపొందారు. ► తర్వాత మునిసిపల్ ఎన్నికల్లోనూ ఇదే కొనసాగింది. 75 మునిసిపాల్టీల్లో 74 చోట్ల అంటే 98 శాతం గెలుపొందాం. కార్పొరేషన్లలో 12కు 12 చోట్ల అంటే 100 శాతం గెలిచాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. 100 శాతం జెడ్పీలు గెలిచాం. ► దేవుడి దయ వల్ల మంచి పనితీరు చూపుతున్నాం. ప్రతి పథకాన్ని ప్రజల ముంగిటకు చేరుస్తున్నాం. వివక్ష, అవినీతి లేకుండా అత్యంత పారదర్శక పద్ధతిలో వారికి ప్రయోజనాలు అందిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగేలా చూడాలి. ► ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను అంకిత భావంతో అమలు చేస్తున్న మీకందరికీ అభినందనలు. మీ పనితీరు ద్వారానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మీరు అక్కడ మంచిగా పని చేస్తే, అది ప్రజల గుండెల్లో ప్రభుత్వ పనితీరు కింద ప్రతిబింబిస్తుంది. తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ► ఇతరత్రా ఎక్కడైనా అవినీతి ఉంటే ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. అక్కడా మంచి వ్యవస్థను, సుపరిపాలనను తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంతిమంగా దేవుడి దయవల్ల 2024లో కూడా ఇవే ఫలితాలు కొనసాగడమే కాదు.. భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. -
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం
-
ప్రతి పర్యటనలోనూ సచివాలయాల పనితీరు గమనిస్తా : సీఎం జగన్
-
ఇళ్ల పట్టాల దరఖాస్తులను వెరిఫికేషన్ చేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: నెల రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీపై కోర్టుల్లో పెండింగ్ కేసులన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. లబ్ధిదారులకు లే అవుట్ల వారీగా వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం స్పందన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెండింగ్ దరఖాస్తులను వెరిఫికేషన్ చేయాలని తెలిపారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకంలో రిజిస్ట్రేషన్ పట్టాలిచ్చే కార్యక్రమం డిసెంబర్‌లోగా చేయాలన్నారు. లే అవుట్లలో విద్యుత్, నీటి వసతిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. మహిళలకు రూ.35 వేలు పావలా వడ్డీకే బ్యాంకర్లు రుణాలు ఇచ్చేలా చూడాలని పేర్కొన్నారు. వారానికొకసారి ఇళ్ల నిర్మాణంపై కలెక్టర్లు సమీక్ష చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. హౌసింగ్: నెల రోజుల్లో ఈ కేసులన్నీ పరిష్కారమవుతాయని ఆశిస్తున్నానని సీఎం జగన్ తెలిపారు. పెండింగ్ కేసుల్లో 395 కేసులు తాత్కాలిక స్టేలు ఉన్నాయని చెప్పారు. వాటిపైన కూడా దృష్టిపెడితే.. పేదలకు మేలు జరుగుతుందని, లే అవుట్ వారీగా, ప్లాట్ల వారీగా లబ్ధిదారుల వివరాలను తెలియజేస్తూ మ్యాపింగ్ చేశామని అన్నారు. ప్రభుత్వం తయారు చేసిన యాప్‌లో ఈ వివరాలన్నింటినీ ఉంచాలని తెలిపారు. లే అవుట్ల వారీగా వివరాలు తెలపాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దాని వల్ల మిగిలిన ప్లాట్లను కొత్తగా లబ్ధిదారులకు కేటాయించడానికి వీలు కలుగుతుందన్నారు. మిగిలిపోయిన 12.6 శాతం మ్యాపింగ్ పనులను కలెక్టర్లు వెంటనే పూర్తిచేయాలని సూచించారు. ఇళ్ల పట్టాల కోసం పెట్టుకున్న దరఖాస్తుల్లో పెండింగ్ ఉంటే వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు ఇదివరకే ఉన్న లే అవుట్లలో 45,600 మందికి, ప్రభుత్వ లే అవుట్లలో 10,851 మందికి డిసెంబర్లో పట్టాలు అందించాలన్నారు. 1,48,398 మందికి పట్టాలు ఇవ్వడానికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. వన్ టైం సెటిల్మెంట్ పథకానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంగా పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా డిసెంబర్లో చేయాలని తెలిపారు. పేదలందరికీ ఇళ్ల పథకలో భాగంగా మొదటివిడతలో 15.6 లక్షల ఇళ్లు కడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకూ 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్ అయ్యాయని, అక్టోబరు 25 నాటికల్లా బిలో బేస్మెంట్ లెవల్ ఇళ్లను బేస్‌మెంట్‌లెవల్‌పై స్థాయికి తీసుకువచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్షన్ -3ని ఎంపిక చేసుకున్న ఇళ్ల పనులు అక్టోబరు 25 నుంచి మొదలుపెట్టడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారులతో కలిపి గ్రూపులు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే 2.25 లక్షల లబ్ధిదారులతో 18,483 గ్రూపులు ఏర్పాటు చేశారని, ఈ నెలాఖరు కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తికావాలన్నారు. లే అవుట్లలో నీటి వసతిని ఏర్పాటు చేయడంపై దృష్టిపెట్టాలని సూచించారు. మిగిలిపోయిన లే అవుట్లలో విద్యుత్తు, నీటి వసతిని కల్పించడంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. సిమెంటు, బ్రిక్స్, ఐరన్ స్టీల్, మెటల్.. వాటి వినియోగం విపరీతంగా పెరుగుతుందని, ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని తెలిపారు. ఆప్షన్ –3 ఎంచుకున్న ప్రాంతాల్లో 1.75 లక్షలకే ఇంటి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు రూ.35 వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని తెలిపారు. బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారికి రుణాలు అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు వారానికి ఒకసారి ఇళ్ల నిర్మాణంపై సమీక్ష చేయాలన్నారు. మున్సిపాలిటీ స్థాయి, మండలాల స్థాయి, పంచాయతీల స్థాయి, లే అవుట్ స్థాయిల్లో కూడా సంబంధిత అధికారులు ఇళ్ల నిర్మాణ ప్రగతిపై రివ్యూ చేయాలన్నారు. అలా చేయగలిగితేనే వేగంగా నిర్మాణాలు సాగుతాయని తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తేనే అక్కడ సమస్యలు ఏంటో తెలుస్తాయన్నారు. పెద్ద లే అవుట్లలో నిర్మాణసామగ్రిని ఉంచడానికి, సైట్ ఆఫీసులకోసం గోడౌన్లను నిర్మించాలని తెలిపారు. ఉపాధిహామీ పనుల కింద ఈ గోడౌన్లను నిర్మించాలని సీఎం పేర్కొన్నారు. ఉపాధి హామీ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, బీఎంసీయూలు, డిజిటల్ లైబ్రరీల పనులు చురుగ్గా సాగాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం ఇవ్వని బిల్లులకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తోందని, కేంద్రం నుంచి వచ్చిన డబ్బు కన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికంగా ఖర్చు చేశామని తెలిపారు. నిధులకు ఇబ్బంది లేకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైన కూడా దృష్టి పెడుతున్నామని తెలిపారు. కలెక్టర్లు ఈ పనులపై దృష్టిపెట్టి ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిజిటల్ లైబ్రరీలు డిసెంబర్ 31 నాటికల్లా 4,530 పంచాయతీల్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తోందని తెలిపారు. అన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్, వర్క్ ఫ్రం హోం సౌకర్యం గ్రామాల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఆలోగా డిజిటల్ లైబ్రరీలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విలేజ్, వార్డు సచివాలయాల్లో తనిఖీలు విలేజ్, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమైనవని, అలసత్వం వహించిన వారిపై చర్యలకూ వెనుకాడమని సీఎం జగన్ అన్నారు. కలెక్టర్లు ప్రతివారం 2 సచివాలయాలు, జాయింట్ కలెక్టర్లు వారానికి 4 సచివాలయాలు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్ కలెక్టర్లు వారానికి నాలుగు సచివాలయాలను తప్పని సరిగా సందర్శించాలన్నారు. స్వయంగా రంగంలోకి సీఎం వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు కూడా వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలని చెబుతామని సీఎం జగన్ అన్నారు. డిసెంబర్ నుంచి తాను కూడా సచివాలయాలను సందర్శిస్తూ ప్రతి పర్యటనలో సచివాలయాలను చూస్తానని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన చేస్తున్న సమయంలో ఏయే అంశాలపై దృష్టి పెట్టాలో మార్గదర్శకాలు కూడా ఇచ్చామని పేర్కొన్నారు.ప్రతి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిపి బృందాలుగా ఏర్పడి ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించేలా ఆ గ్రామంలో పర్యటించాలని చెప్పామని అన్నారు. ప్రతినెలా చివరి శుక్రవారం, చివరి శనివారం సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం, సెప్టెంబరు 24, 25 తేదీల్లో సిటిజన్ అవుట్‌రీచ్ కార్యక్రమం, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలు, ముఖ్యమైన ఫోన్ నంబర్లతో కూడిన పాంప్లెట్లను వారికి అందించాలన్నారు. ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కలిగించాలని తెలిపారు. నిర్దేశించుకున్న రోజుల్లోగా అర్హులైన వారికి మంజూరు జరగాలని సీఎం జగన్ సూచించారు. కోవిడ్, సీజనల్ వ్యాధులు కోవిడ్ తీవ్రత తగ్గిందని, ఉద్ధృతంగా ఉన్న కాలంలో పాజిటివిటీ రేటు 25.56 శాతం ఉందని తెలిపారు. ప్రస్తుతం 2.5 శాతం కన్నా తక్కువగా ఉందని, రికవరీ రేటు కూడా 98.63శాతంగా ఉందని పేర్కొన్నారు. కోవిడ్ పట్ల ఎలాంటి అలసత్వం వద్దని, 2 డోసుల వ్యాక్సినేషన్ 100శాతం పూర్తయ్యేంతవరకూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దని సీఎం అధికారులకు సూచించారు. కోవిడ్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ నిబంధనలను ఉల్లఘించే వారికి కఠినంగా వ్యవహరించాలని, జరిమానాలు విధించాలని తెలిపారు. మాస్కులు వినియోగించకపోతే కచ్చితంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 104 నంబర్ అనేది వన్‌స్టాప్ సొల్యూషన్‌గా నడవాలని, 104 నంబర్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రతివారం కూడా 104 నంబర్ పనితీరుపై సమీక్ష చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ధర్డ్ వేవ్ సన్నద్ధత థర్డ్‌వేవ్ వస్తుందో, లేదో తెలియదని కానీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. టీచింగ్ ఆస్పత్రులు, ఆస్పత్రుల్లో కావాల్సిన పరికరాలను, మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. జిల్లాల్లోని టీచింగ్ ఆస్పత్రులకు జాయింట్ కలెక్టర్ హౌసింగ్‌ను అడ్మిన్ ఇన్ఛార్జిగా నియమించాలని అన్నారు. నవంబర్ 15 నుంచి విలేజ్ క్లినిక్స్ నుంచి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో కావాల్సిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. డిప్యుటేషన్లను పూర్తిగా రద్దు చేయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ డిప్యుటేషన్లకు అనుమతి ఇవ్వొద్దన్నారు. 100 బెడ్లకు మించి ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఉంచేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. వ్యాక్సినేషన్ నవంబర్ 30 నాటికి 3.5 కోట్ల మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ ఇవ్వగలుగుతామని సీఎ జగన్ అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రజలందరికీ పూర్తిగా 2 డోసులు ఇవ్వగలుగుతామని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌పైనా కలెక్టర్లు దృష్టిసారించాలని, రెండో డోసును సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మలేరియా, డెంగ్యూ, డయేరియా, టైఫాయిడ్ వ్యాధులపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. దిశ యాప్ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని, ఫోన్‌ను షేక్ చేస్తే చాలు 6 నిమిషాల్లోగా మహిళకు భద్రత కల్పించేలా దిశ యాప్‌ను తీర్చిదిద్దామని సీఎం జగన్ అన్నారు. దిశ యాప్ ద్వారా మహిళల్లో విశ్వాసాన్ని నింపగలిగామని, 70,00,520 మంది ఇప్పటివరకూ దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. ఇందులో 3,78,571 ఎస్ఓఎస్ రిక్వెస్టులు వచ్చాయని, ఇందులో చర్యలు తీసుకోదగ్గవి 4,639 అని అన్నారు. మూడు నెలల్లో దాదాపు 900 సక్సెస్ స్టోరీలు దిశ యాప్ ద్వారా ఉన్నాయని తెలిపారు. ఏదైనా జరగకముందే మహిళలకు అండగా నిలిచామని, సగటున 6 నిమిషాల్లోగా దిశ బృందం బాధితులను చేరుకుంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఛార్జిషీటు వేయడానికి సగటున 300 రోజులు పడితే, ఇప్పుడు 42 రోజుల్లోగా ఛార్జిషీటు వేస్తున్నామని చెప్పారు. పోలీసు విభాగం అత్యద్భుతంగా పనిచేస్తోందని, మహిళల మీద నేరాల్లో 2 నెలల్లోపు ఛార్జిషీటు వేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉందని తెలిపారు. 91శాతం 2 నెలల్లోపే ఛార్జిషీటు వేస్తున్నామని, దిశ కార్యక్రమాన్ని కలెక్టర్లు ఓన్ చేసుకోవాలని సూచించారు. ప్రతి సచివాలయంలో మహిళా పోలీసు, వాలంటీర్లు ఉన్నారని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పకుండా దిశ యాప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫిర్యాదు చేయడానికి వచ్చేవారిని ప్రోత్సహించాలని, ఎప్ఐఆర్లు ఎక్కువగా నమోదైనా ఎలాంటి ఇబ్బంది లేదని తలిపారు. ఎఫ్ఐఆర్లు నమోదైతే మనం విధులను సక్రమంగా నిర్వర్తించడానికి వీలుంటుందని సీఎం జగన్ తెలిపారు. వ్యవసాయం ఇ క్రాపింగ్‌పై కలెక్టర్లు దృష్టిసారించాలని, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు 10శాతం ఇ-క్రాపింగ్‌ను తనిఖీలు చేయాలన్నారు. జేడీఏలు, డీడీఏలు 20శాతం క్రాపింగ్‌ను తనిఖీ చేయాలని, అగ్రికల్చర్ అధికారులు, హార్టికల్చర్ అధికారులు 30 శాతం ఇ- క్రాపింగ్‌ను తనిఖీ చేయాలని సీఎం జగన్ సూచించారు. ఇ- క్రాపింగ్ అనేది చాలా ముఖ్యమని, ఇ- క్రాపింగ్ కింద డిజిటల్, ఫిజికల్ రశీదులు ఇవ్వాలన్నారు. ఇ- క్రాపింగ్ అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ల్యాండు వివరాలు, డాక్యుమెంట్ల కోసం రైతులను ఇబ్బంది పెట్టొద్దని, అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ సమావేశాలపై దృష్టిపెట్టాలన్నారు. ఆర్బీకేలు, మండల, జిల్లా స్థాయిల్లో సమావేశాలు జరగాలని, ఆర్బీకే స్థాయి సమావేశాల్లో వస్తున్న అంశాలపై మండలస్థాయిలో, మండలస్థాయిలో వస్తున్న అంశాలపై జిల్లా స్థాయి సమావేశాల్లో చర్చ జరగాలన్నారు. సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులు దృష్టిపెట్టాలన్నారు. జిల్లా స్థాయిల్లో వస్తున్న అంశాలపై విభాగాధిపతులు, కార్యదర్శులు దృష్టిపెట్టాలని సూచించారు. క్రాప్ ప్లానింగ్‌పైన అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో దృష్టిపెట్టాలని, ఉత్తమ యాజమాన్య పద్ధతులపైనా చర్చించాలని తెలిపారు. ఆర్బీకేల పనితీరు, సీహెచ్‌సీల పనితీరుపైనా చర్చించాలని పేర్కొన్నారు. ఇతర జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉత్తమ యాజమాన్య పద్ధతులపైనా అడ్వైజరీ కమిటీలకు అవగాహన కల్పించే కార్యక్రమంపై దృష్టిపెట్టాలని తెలిపారు. ప్రైవేటు వ్యాపారులు, వారి దుకాణాలపై పరిశీలన చేయాలని, నాణ్యమైనవి అమ్ముతున్నారా? లేదా?ధరలు అదుపులో ఉన్నాయా? లేదా? పరిశీలన చేయాలని సూచించారు. ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలు ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఉంచుతున్నారని, విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? రైతులకు వారి నుంచి సేవలు అందుతున్నాయా? లేవా? అన్నదానిపై పరిశీలన చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లడానికి వీలుంటుందన్నారు. కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాలని, వారిని ఇ- క్రాపింగ్‌తో లింక్చేశామని తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ, బీమా, పంటలకు ధరలు కల్పించడం వంటివన్నీ కూడా కౌలు రైతులకు అందాలని తెలిపారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తున్న రాష్ట్రం కూడా ఏపీ అని తెలిపారు. అక్టోబరులో ప్రభుత్వ పథకాలు విజయదశమి రోజున ఆసరా పథకం అమలు అవుతుందని, అక్టోబరు 7 నుంచి 10 రోజలు పాటు ఆసరా పథకంపై అవగాహన, చైతన్య కార్యక్రమాలుఉంటాయని సీఎం జగన్ తెలిపారు. అవగాహన, చైతన్య కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సహా ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇందులో పాల్గొంటారని చెప్పారు. ఆసరా చెక్కుల పంపిణీయే కాకుండా ఆసరా, చేయూత, దిశలు మహిళా సాధికారిత దిశగా ఏ విధంగా అడుగులు వేశామో వారికి చెబుతారని వివరించారు. ఆసరా, చేయూత ద్వారా జీవితాలను మెరుగుపరుచుకున్న వారి విజయాలను మహిళలకు వివరిస్తారని అన్నారు. మండలం ఒక యూనిట్‌గా ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. రూ. 6500 కోట్లలను వైయస్సార్ ఆసారా కింద ఇస్తున్నామని, దాదాపు 80 లక్షల మందికిపైగా మహిళలు లబ్ధిపొందుతారని చెప్పారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ‘క్లాప్’ అక్టోబరు 1న ప్రారంభం అవుతుందని, అక్టోబరు 19న జగనన్న తోడు కార్యక్రమం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, అక్టోబరు 26న రైతులకు ‘వైయస్సార్ సున్నావడ్డీ రుణాలు’ కార్యక్రమం దాంతో పాటు ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత అమలు కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరిషత్ ఎన్నికల్లో విజయంపై ప్రభుత్వ పరిపాలను బాగా జరుగుతున్నందు వల్లే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించామని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను అమలు చేయడంలో కలెక్టర్లు దగ్గరనుంచి వాలంటీర్ వరకూ అందరూ బాగా పనిచేస్తున్నారని అన్నారు. మంచి పనితీరు కనపరచడం వల్లే ప్రజల ఆదరాభిమానాలు పొందుగలుగామని తెలిపారు. అవినీతి లేకుండా పథకాలు అమలవుతున్నాయని, వివక్షకు తావు లేకుండా అర్హులకు ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. చదవండి: రాజకీయ నేతలకు భిన్నంగా విద్యకు సీఎం జగన్ ప్రాధాన్యం పెట్టుబడులు పెట్టండి.. రాష్ట్రంతో పాటు మీరూ వృద్ధి చెందండి: సీఎం జగన్ -
స్పందన కార్యక్రమం: పుట్టిన బిడ్డ తనది కాదంటున్నాడయ్యా !
కోనేరుసెంటర్: ప్రతిరోజు స్పందనలో వచ్చిన అర్జీలను చట్టపరిధిలో విచారణ జరిపించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రతిరోజు స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా పోలీసులను ఆశ్రయించవచ్చనన్నారు. సమస్య తీవ్రతను బట్టి పరిష్కార చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుడివాడకు చెందిన ఓ మహిళ తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని అధిక కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. తనకు కలిగిన బిడ్డ కూడా తనది కాదంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. భర్తపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ విన్నవించింది. బాధితురాలి ఆవేదన ఆలకించిన ఎస్పీ గుడివాడ సీఐకు ఫిర్యాదును బదిలీ చేసి ఆమెకు తక్షణమే న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ఫింగర్ ప్రింట్స్ సమస్య.. తక్షణమే స్పందించిన గుంటూరు కలెక్టర్ మీరే మాకు కళ్లు, చెవులు.. మీరే మా బలం: సీఎం జగన్ -
పింఛన్ రాలేదని స్పందనకు ఫిర్యాదు చేసిన దివ్యాంగుడు షేక్ బాజీ
-
ఫింగర్ ప్రింట్స్ సమస్య.. తక్షణమే స్పందించిన గుంటూరు కలెక్టర్
గుంటూరు: దివ్యాంగుడి సమస్యపై గుంటూరు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. ఫింగర్ ప్రింట్స్ అరిగిపోవడంతో పింఛన్ రాలేదని కేవీపీ కాలనీకి చెందిన దివ్యాంగుడు షేక్ బాజీ ‘ముఖ్యమంత్రి స్పందన సెల్’కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ వివేక్ యాదవ్ తక్షణమే స్పందించి.. దివ్యాంగుడికి పింఛన్‌తో పాటు ట్రైసైకిల్ అందించారు. కలెక్టర్ వివేక్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలో 5లక్షల 73 వేల మందికి పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో రూ.133 కోట్లు ప్రతి నెల ఇస్తున్నామని తెలిపారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా 99 శాతం పెన్షన్లు ఒకే రోజు అందిస్తున్నామన్నారు. ఈకేవైసీ అప్డేట్ కాలేనివారిని గుర్తించి వారికి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంకా ఎవరికైనా పింఛన్ రాకపోతే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. ఇవీ చదవండి: కామారెడ్డి వివాహిత కేసులో ట్విస్ట్.. ఏం జరిగిందో తెలిస్తే షాక్.. అడక్కుండానే పానీ పూరి తెచ్చిన భర్త.. కోపంతో ఊగిపోయిన భార్య.. -
Andhra Pradesh: ఉధృతి తగ్గినా.. జాగ్రత్త
సాక్షి, అమరావతి: కోవిడ్ ప్రభావం ప్రస్తుతం తగ్గినప్పటికీ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ మార్గదర్శకాలను ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కరోనా ఉధృతి తగ్గింది కాబట్టి నిర్లక్ష్యం వహించే పరిస్థితి తలెత్తకూడదని స్పష్టం చేశారు. థర్డ్ వేవ్ వస్తుందో లేదో తెలియదు కానీ సర్వ సన్నద్ధంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాల్సిందేనని జాగ్రత్తలు సూచించారు. కరోనాతో సహజీవనం చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నందున నిరంతరం అప్రమత్తత, సమీక్ష అవసరమన్నారు. ఇంటింటి సర్వేలు కొనసాగాలని, ఎవరికి లక్షణాలున్నా పరీక్షలు చేయాలన్నారు. చదవండి: మిగిలిపోయిన అర్హులకు గడువులోగా ఇవ్వాలి: సీఎం జగన్ ఇదే సమయంలో సీజనల్ వ్యాధులపై కూడా అప్రమత్తంగా ఉంటూ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికున్‌గున్యా తదితర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని, తాగునీటి నాణ్యతపై శ్రద్ధ తీసుకుని 15 రోజులకొకసారి సమీక్షించాలని నిర్దేశించారు. కోవిడ్‌పై ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు..ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. రికవరీ రేటు ఎలా ఉన్నప్పటికీ.. కలెక్టర్లతో ఎప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినా కోవిడ్‌పై చర్చ జరగని రోజు లేదు. పూర్తి స్ధాయిలో వ్యాక్సినేషన్ జరిగే వరకు వరకు దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది. పాజిటివిటీ రేటు, రికవరీ రేటు ఎలా ఉన్నా కోవిడ్‌పై నిరంతర పర్యవేక్షణ, సమీక్ష చేయాలి. రాష్ట్రంలో సగటున 1,300 కేసులకు పడిపోయినప్పటికీ మనం జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. రివకరీ రేటు 98.63 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.07 శాతం ఉన్నప్పటికీ అప్రమత్తంగానే ఉండాలి. కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. మాస్కులు ధరించడం తప్పనిసరి. నిబంధనలు అతిక్రమించే దుకాణాలు, ఇతర సముదాయాలకు జరిమానాలు విధించాలి. పెళ్లి వేడుకల్లో 150 మందికి మించి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చదవండి:AP: ఇళ్లకు పావలా వడ్డీ రుణాలు సమర్థంగా 104 నిర్వహణ అన్ని సమస్యలను పరిష్కరించేలా 104 కాల్‌సెంటర్ నంబర్ వన్ స్టాప్ సొల్యూషన్ కావాలి. ఇది చాలా సమర్థవంతంగా పనిచేయాలి. నిరంతరం పర్యవేక్షణ చేయాలి. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు నిర్దేశించిన ప్రోటోకాల్స్ పాటించాలి. కోవిడ్ తగ్గింది కాబట్టి పట్టించుకోకుండా ఉండే పరిస్థితి ఉండకూడదు. థర్డ్ వేవ్ సన్నద్ధత థర్డ్ వేవ్ వస్తుందో లేదో తెలియదు కానీ మనం సన్నద్ధంగా ఉండాలి. కార్యాచరణ ప్రకారం ముందుకు సాగాలి. ఆస్పత్రులను, సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలి. నర్సులకు శిక్షణ ఇవ్వాలి. అందుబాటులో వైద్యులు, తగినన్ని బెడ్లను, ఆస్పత్రులను ఉంచుకోవాలి. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో పీఎస్ఏ ప్లాంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఆక్సిజన్ సిలెండర్లు, కాన్సన్ట్రేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి. 100 బెడ్లు దాటిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా పీఎస్ఏ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలి. దీనిపై పర్యవేక్షణ చేయాలి. విద్యా సంస్థలు ఎస్‌వోపీలను పాటించాలి రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభమైనందున విద్యాసంస్థల్లో పాటించాల్సిన ఎస్‌వోపీలను విడుదల చేశాం. వాటిని తప్పకుండా పాటించాలి. ఒకవేళ పాఠశాలలో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయని టీచర్లు సమాచారం ఇస్తే మార్గదర్శకాల ప్రకారం అక్కడ ఫోకస్డ్గా పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థులకే కాదు వారి తల్లిదండ్రులకు కూడా వెంటనే కోవిడ్ టెస్టులు చేయాలి. సచివాలయం యూనిట్‌గా.. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,90,93,476 మందికి వ్యాక్సిన్లు ఇచ్చాం. 72,18,532 మందికి డబుల్ డోస్, 1,18,74,944 మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్లు ఇచ్చాం. 80 శాతం మంది ప్రజలకు డబుల్ డోస్ ఇచ్చేంతవరకూ అప్రమత్తంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. 45 సంవత్సరాలు దాటిన కేటగిరీలో 90 శాతానికిపైగా వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. ప్రస్తుతం 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్లపై దృష్టి పెట్టాలి. సచివాలయాన్ని యూనిట్‌గా పెట్టుకుని ప్రతి ఇంటికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. దీనివల్ల అందరికీ టీకాలతోపాటు వృథాను అరికట్టగలుగుతాం. ఏజన్సీల్లో ఇన్సెంటివ్‌లు.. డిప్యుటేషన్లు వద్దు వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రుల్లో సిబ్బంది ఎంత మంది ఉండాలి? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? దీనిపై 90 రోజుల్లోగా వివరాలు ఖరారు చేయాలి. ఎంతమంది సిబ్బంది అవసరమో నిర్ధారించాలి. ఈ మేరకు గడువులోగా నియామకాలు పూర్తి కావాలి. గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వహించే వారికి ఇన్సెంటివ్‌లు ఇవ్వాలి. డిప్యుటేషన్లు వద్దు. డాక్టర్లు, సిబ్బంది కచ్చితంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని చికిత్స అందించే స్థాయికి ప్రభుత్వ ఆస్పత్రులను తీసుకెళ్లాలి. నాడు – నేడు ద్వారా టీచింగ్ ఆస్పత్రులను జాతీయ ప్రమాణాల స్ధాయిలో నిర్మిస్తున్నాం. దీనికి అవసరమైన సిబ్బందిని కూడా నియమించాలి. కలెక్టర్లు ఈ టాస్క్ పూర్తి చేయాలి. మొత్తం 125 మున్సిపాల్టీలలో 528 అర్బన్ క్లినిక్స్ నిర్మాణంపై మరింత దృష్టి సారించాలి. -
గణాంకాలు, అంకెలతో సంబంధం లేకుండా అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్
-
స్వప్రయోజనాల కోసం ఓ వర్గం మీడియా దుష్ప్రచారం : సీఎం జగన్
-
మిగిలిపోయిన అర్హులకు గడువులోగా ఇవ్వాలి: సీఎం జగన్
సాక్షి అమరావతి: పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు వైఎస్సార్ చేయూత, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా తదితర పథకాలకు సంబంధించి ఇంకా మిగిలిపోయిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారి అర్హతను 90 రోజుల్లోగా నిర్ధారించి ఆర్నెల్ల్లకు ఒకసారి చొప్పున ఏడాదిలో రెండు సార్లు మంజూరు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇక పెన్షన్, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే అర్హులను 21 రోజుల్లోగా నిర్ధారించడంతో పాటు ప్రతి మూడు నెలలకు (90 రోజులకు) ఒకసారి చొప్పున ఏడాదిలో 4 సార్లు మంజూరు చేయాలని సూచించారు. దీనివల్ల వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందన్నారు. సచివాలయాల్లో తనిఖీలు, దరఖాస్తుల పరిష్కారం, పథకాల మంజూరు, ఉపాధి హామీ పనులపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. నెలలో రెండు రోజులు ఇంటింటికీ వెళ్లాలి నెలలో చివరి శుక్రవారం, శనివారం రోజు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది వలంటీర్లతో కలసి బృందంగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలి. వాటిపట్ల అవగాహన కల్పించాలి. పౌరుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవాలి. సచివాలయాల సిబ్బంది ఫోన్‌నంబర్లను వారికి ఇవ్వాలి. కరపత్రాలను కూడా అందజేయాలి. చురుగ్గా భవనాల నిర్మాణం 10,408 ఆర్బీకేల నిర్మాణంపై మరింత చురుగ్గా పనిచేయాలి. వీటిని డిసెంబర్ 31 కల్లా పూర్తి చేయాలి. తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో మరింత ధ్యాస పెట్టాలి. మొత్తం 8,585 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మిస్తున్నాం. వీటిని కూడా డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలి. భవనాల నిర్మాణంపై కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారులు మరింత శ్రద్ధ చూపాలి. తొలిదశలో 2,541 ఏఎంసీయూలు, బీఎంసీయూల భవనాల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 2,253 భవనాల పనులు పురోగతిలో ఉన్నాయి. తూర్పు గోదావరి, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో పనులు గ్రౌండింగ్ చేయాలి. డిసెంబర్ 31 నాటికి ఇవి కూడా పూర్తవ్వాలి. అమూల్ ఆధ్వర్యంలో సేకరణ జరుగుతున్న ప్రాంతాల్లో పాలరేటు రూ.5 నుంచి రూ.15 వరకు రైతులకు అదనంగా లభిస్తుంది. అమూల్, బీఎంసీయూల వల్ల ఇది సాధ్యమవుతోంది. డిజిటల్ లైబ్రరీలు తొలిదశలో మొత్తం 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణ లక్ష్యం కాగా 4,150 మంజూరయ్యాయి. 1,106 లైబ్రరీల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇంకా 380 గ్రామాల్లో మొదలు కాలేదు. ఆగస్టు 31 నాటికి కచ్చితంగా నిర్మాణ పనులు ప్రారంభించాలి. డిసెంబర్ 31 నాటికి నిర్మాణ పనులు పూర్తి కావాలి. దీనివల్ల వర్క్‌ఫ్రమ్ హోం కాన్సెప్ట్‌ను అమలు చేయగలుగుతాం. మొక్కలు నాటే కార్యక్రమంపై దృష్టి సారించడమే కాకుండా ఏపుగా ఎదిగేలా శ్రద్ధ వహించాలి. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యం) ఆళ్ల నాని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, అడిషనల్ డీజీపీ ఎ.రవిశంకర్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి పనులపై దృష్టి గత సర్కారు బకాయి పెట్టిన ఉపాధి హామీ డబ్బులను మన ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. కేంద్రం నుంచి కూడా మనకు నిధులు రావాల్సి ఉంది. ఉపాధి హామీ పనులపై పూర్తిగా దృష్టి పెట్టాలి. గ్రామం రూపురేఖలు పూర్తిగా మార్చబోయే వ్యవస్ధను మనం ఏర్పాటు చేస్తున్నాం. గ్రామాల్లోకి అడుగుపెట్టిన వెంటనే ఓ రకమైన సంతృప్తి కలుగుతుంది. గ్రామ సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవలందించే వలంటీర్లు, ఇంగ్లిష్ మీడియం స్కూలు, మరో నాలుగు అడుగులు వేస్తే కనిపించే వైఎస్సార్ విలేజ్ క్లినిక్, ఆర్బీకే, మరో నాలుగడుగులు వేస్తే డిజిటల్ లైబ్రరీ, ఇంగ్లిష్ మీడియం ఫౌండేషన్ స్కూల్.. వీటితో పాటు పాల సేకరణకు సంబంధించి ఏఎంసీయూ, బీఎంసీయూలు కనిపిస్తాయి. ఇవన్నీ గ్రామాల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తాయి. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణాలకు సంబంధించి అక్టోబర్ 2 నాటికి 75 శాతం భవనాలు పూర్తి చేసేలా ధ్యాస పెట్టాలి. అప్పటికి పూర్తి చేయగలిగితే మంచి సానుకూల సందేశాన్ని ఇచ్చినట్లవుతుంది. సిటిజన్ అవుట్ రీచ్... తనిఖీల సమయంలో అధికారులు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సిటిజన్ అవుట్‌రీచ్ కార్యక్రమంపై పర్యవేక్షణ చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వివిధ సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించాలి. సచివాలయాల సిబ్బంది లబ్ధిదారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పథకం అమలుకు ఒకరోజు ముందు ఈ సమావేశం జరగాలి. పథకం ప్రయోజనాలు అందిన తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ వలంటీర్‌తో కలిసి లబ్ధిదారుడి వద్దకు వెళ్లి డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్తోపాటు భౌతికంగా రశీదు కూడా ఇవ్వాలి. తిరస్కరణకు కారణాలను పరిశీలించాలి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్ కలెక్టర్లు అందరినీ గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చేయాలని చెప్పాం. తనిఖీల విషయంలో అందరూ మంచి పురోగతి చూపారు. వీటి ద్వారా సచివాలయాల సమర్థత మరింత పెరిగి ప్రజలకు మెరుగ్గా సేవలు అందించాలి. వివిధ శాఖల పోస్టర్లు, సంక్షేమ పథకాల క్యాలెండర్లు, బయోమెట్రిక్ హాజరు, రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణ తీరుతోపాటు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల పనితీరును కూడా తనిఖీల సమయంలో పరిశీలించాలి. వారికి అవగాహన కల్పించాలి. ఫిర్యాదుల (గ్రీవెన్స్) నంబర్‌ను ప్రదర్శిస్తున్నారో లేదో గమనించాలి. తిరస్కరించిన అర్జీలను ఏ ప్రాతిపదికన నిరాకరించారో చూడాలి. ఒక అర్జీని తిరస్కరించినప్పుడు దరఖాస్తుదారుడు మళ్లీ దరఖాస్తు చేస్తే అది జేసీ వద్దకు వెళ్లాలి. దీనిపై ఆ అధికారి పరిశీలన చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. చదవండి: సీఎం జగన్ సమక్షంలో న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ డ్రైవ్ -
CM YS Jagan : తనిఖీలు తప్పనిసరి
ఆగస్టు నెలలో అమలయ్యే పథకాలు ఇవీ.. ఆగస్టు 10: నేతన్న నేస్తం ఆగస్టు 16: విద్యాకానుక ఆగస్టు 24: రూ. 20 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఆగస్టు 27: ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్‌మిల్స్‌కు ఇన్సెంటివ్‌ల చెల్లింపు ఉద్యోగానికి న్యాయం చేస్తున్నామా? క్షేత్రస్థాయి తనిఖీల ఉద్దేశ తీవ్రతను మీరు సరిగా అర్థం చేసుకున్నట్లు లేదు. అధికారులుగా మనం ఏం చేస్తున్నట్లు? మనం సరిగానే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నామా? చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేస్తున్నామా? సచివాలయాల పర్యటనలకు వెళ్లకపోతే క్షేత్రస్థాయి సమస్యలు ఎలా తెలుస్తాయి? పెన్షన్ సకాలంలో అందుతుందా? లేదా? ఎలా తెలుస్తుంది? మనం వెళ్లకపోతే సకాలానికి రేషన్ కార్డు వస్తుందా? లేదా? ఎలా తెలుస్తుంది? ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో వీటిని ప్రారంభించాం. అవి సరిగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న విషయం తనిఖీలకు వెళ్లకుంటే ఎలా తెలుస్తుంది? అసలు మనం క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లకపోతే మన విధులకు ఏం న్యాయం చేసినట్లు? ఇది ఆమోదయోగ్యం కాదు. మొదట మనం మనుషులం. ఆ తర్వాతే అధికారులం. మనలో మానవీయ దృక్పథం ఉండాలి. పేదలను పట్టించుకోకపోతే మనం విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లు కాదు. వచ్చే స్పందన కల్లా ప్రతి ఒక్కరూ 100 శాతానికి పైగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ కలిగిస్తున్నా.. మీకు మెమోలు జారీచేయడం నాకు చాలా బాధ కలిగించే విషయం. మీరంతా మన ఉద్యోగులు. కానీ క్రమశిక్షణ పాటించాలంటే వేరే మార్గం లేదు. మీకు మెమోలు ఇవ్వడం అంటే నా పని తీరుమీద నేను మెమో ఇచ్చుకున్నట్టే. – ‘స్పందన’లో సీఎం జగన్ సాక్షి, అమరావతి: ప్రజలకు పలు రకాల సేవలందించే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు జిల్లా అధికార యంత్రాంగం చేరువ కావాలని, అప్పుడే వీటి సమర్ధత మెరుగుపడుతుందని, వీటి పనితీరుపై కలెక్టర్లు, జేసీలు, సబ్ కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, మునిసిపల్ కమిషనర్లు నిర్దేశించిన ప్రకారం తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. తనిఖీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి మెమోలు జారీ చేయాల్సిందిగా తన కార్యాలయాన్ని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటానని.. ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తేనే తప్పులు, పొరపాట్లు ఏమైనా ఉంటే తెలుస్తాయని, వాటిని అంతా కలసి సరిచేసుకుందామన్నారు. ‘స్పందన’లో భాగంగా సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం 1,098.. తనిఖీలు 733 సచివాలయాలు మన మానస పుత్రికలు. వాటి సమర్థత పెరగాలంటే తనిఖీలు చాలా ముఖ్యం. కలెక్టర్లు, జేసీలు, ఐటీడీఏ పీవోలు, సబ్కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలను తప్పకుండా తనిఖీ చేయాలి. తనిఖీలు చేయకపోతే మన అంతట మనమే వాటి సమర్థతను తగ్గించినట్లు అవుతుంది. కలెక్టర్లు వారానికి 2 గ్రామ/వార్డు సచివాలయాలను తనిఖీ చేయాలి. జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్కలెక్టర్లు.. వీరంతా వారానికి కనీసం 4 గ్రామ/వార్డు సచివాలయాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు తప్పకుండా చేయాలని చెప్పాం. తనిఖీలపై సీఎం కార్యాలయం పర్యవేక్షణ చేస్తుందని కూడా చెప్పాం. కానీ పురోగతి చూస్తే.. 1,098 క్షేత్రస్థాయి తనిఖీలు చేయాలని నిర్దేశిస్తే 733 తనిఖీలే జరిగాయి. అంటే 66.75% మాత్రమే చేశారు. ఇందులో కలెక్టర్లు 78 చోట్ల క్షేత్రస్థాయి తనిఖీలు చేయాల్సి ఉండగా 83 చోట్ల నిర్వహించి 106% లక్ష్యాన్ని సాధించారు. జేసీ (గ్రామ, వార్డు సచివాలయాలు)లు 156 చోట్ల తనిఖీలు చేయాల్సి ఉండగా 167 చోట్ల జరిపారు. అంటే 107% లక్ష్యాన్ని చేరుకున్నారు. వీరంతా క్షేత్రస్థాయి తనిఖీల్లో బాగానే పని చేశారు. వీరందరికీ మెమోలు.. జేసీ రెవెన్యూ 78 శాతం, జేసీ హౌసింగ్ 49 శాతం, జేసీ (ఏ అండ్ డబ్ల్యూ) 85 శాతం, మునిసిపల్ కమిషనర్లు 89 శాతం, ఐటీడీఏ పీవోలు 18 శాతం, సబ్ కలెక్టర్లు 21 శాతం మాత్రమే తనిఖీలు చేశారు. వీరందరి పనితీరు చాలా బ్యాడ్‌గా ఉంది. ఇది అంగీకార యోగ్యం కాదు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయని వారందరికీ మెమోలు జారీ చేయాలని సీఎంవో అధికారులను ఆదేశించా. వీరందరికీ మెమోలు వస్తాయి. మనకు ఓటు వేయకున్నా... క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్నప్పుడు అర్హులందరికీ డీబీటీ పథకాలు వస్తున్నాయా? లేదా? చూడండి. సామాజిక తనిఖీల కోసం ప్రదర్శిస్తున్న జాబితాలను ఒకసారి పరిశీలించండి. జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారో లేదో చూడండి. ప్రతి నెల వేర్వేరు పథకాలను అమలు చేస్తున్నాం. అర్హుల జాబితాలను అక్కడ ప్రదర్శిస్తున్నాం. కొంతమందికి సమయం కూడా ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నాం. వారంతా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని వెరిఫికేషన్ చేస్తున్నారా? లేదా? అని పరిశీలించండి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పథకాలు వస్తున్నాయా? లేదా? మళ్లీ పరిశీలన చేయండి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్లు, బియ్యంకార్డులు, ఇంటి పట్టాలు, ఆరోగ్యశ్రీ... నిర్దేశిత సమయంలోగా వెరిఫికేషన్ పూర్తిచేసి అర్హులకు ఇస్తున్నామా? లేదా? చూడండి. మనకు ఓటు వేయని వారికి కూడా, అర్హులైతే పథకాలు తప్పకుండా అందాల్సిందే. అనర్హులకు అందకూడదు. ఇది కూడా ముఖ్యమైన అంశం. వీటిని స్వయంగా పర్యవేక్షించాలి. నిర్వహణ సరిగా ఉందా? సచివాలయాలకు ఇచ్చిన ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలు, స్కానర్లు... ఈ హార్డ్‌వేర్ అంతా సరిగా పని చేస్తోందో లేదో చూడండి. రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణ సరిగా ఉందా? ఉద్యోగుల బయోమెట్రిక్, వలంటీర్ల హాజరు ఇవన్నీ సరిగా నమోదవుతున్నాయా? అని పరిశీలించండి. సచివాలయాల్లో సిబ్బంది అటెండెన్స్ తరువాత అందుబాటులో ఉంటున్నారా? లేదా? చూడండి. సచివాలయ విధివిధానాలను సక్రమంగా అమలు చేస్తున్నారా? లేదా? వీటన్నింటిపైనా పర్యవేక్షణ చేయాలి. లేకపోతే వీటి సమర్థతకు గ్యారెంటీ ఇవ్వలేం. తనిఖీలతో మెరుగైన సేవలు.. సచివాలయాల సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించుకుంటున్నారా? లేదా? అనేది అధికారులు తనిఖీల్లో భాగంగా పరిశీలించాలి. ప్రొబేషన్ నుంచి రెగ్యులర్ ఉద్యోగులు అవుతున్నప్పుడు నైపుణ్యాలను నేర్పించే కార్యక్రమాలను చేపట్టడం మన బాధ్యత. వారికి సరైన శిక్షణ కూడా ఇవ్వడం మన బాధ్యత. తనిఖీలు చేస్తున్నకొద్దీ అవన్నీ మనకు అవగతమవుతాయి. తనిఖీలు చేస్తున్నకొద్దీ ప్రజలకు సేవలు మెరుగుపడతాయి. చిరునవ్వుతో ప్రజలను స్వాగతించాలి ప్రజలు ఏదైనా వినతితో మన దగ్గరకు వచ్చినప్పుడు వారిని చిరునవ్వుతో స్వాగతించడం చాలా ముఖ్యం. ఆమేరకు గ్రామ, వార్డు, సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలి. 2 శాతం.. అంటే 230 గ్రామ సచివాలయాల్లో ఇంకా హాజరును గణించడంలేదు. వివరాలు తెప్పించుకుని వెంటనే దీనిపై దృష్టి పెట్టండి. 1.42 లక్షల మందిలో 10 శాతం అటెండెన్స్ మార్కింగ్ ఇంకా జరగడం లేదు. వీటిని సరిదిద్దితే మంచి ఫలితాలు వస్తాయి. మీరే నాకు కళ్లు, చెవులు.. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అర్హులని తేలితే, అప్పటిదాకా వారికి పథకం రాకపోతే కచ్చితంగా ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. ఈ అంశాలను మా దృష్టికి తీసుకురావాలి. దీనివల్ల వెంటనే తప్పులను సరిదిద్దే అవకాశం ఉంటుంది. మీరే నా కళ్లు, చెవులు. తప్పకుండా క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లాలి. మీరు విఫలం అయితే.. నేను విఫలం అయినట్లే. ఒక జట్టు మాదిరిగా మనం కలసి పనిచేయడం చాలా ముఖ్యం. మీరు క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్తే ప్రజలకు మంచి జరుగుతుంది. క్షేత్రస్థాయి తనిఖీలు చేస్తున్నప్పుడు వివిధ పథకాలకు సంబంధించిన పోస్టర్లను సచివాలయాల్లో ఉంచుతున్నారా? లేదా? అర్హుల జాబితాలను అతికిస్తున్నారా? లేదా? సంక్షేమ క్యాలెండర్ ఉందా?లేదా? ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన ఫోన్ నంబర్లు అక్కడ ఉన్నాయా? లేదా? అనేవి పరిశీలించండి. అర్హులైనప్పటికీ వారికి ఏదైనా పథకం వర్తించకుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలో సూచించే నంబర్లను అక్కడ పొందుపరిచారో లేదో చూడండి. సచివాలయాల ద్వారా అందుతున్న సేవల జాబితాను తెలియచేసే వివరాలను ప్రదర్శిస్తున్నారో లేదో చూడండి. ఆ సేవలన్నీ నిర్దేశిత సమయంలోగా అందుతున్నాయో లేదో పరిశీలించండి. -
కోవిడ్‌పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్
-
కోవిడ్‌పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నివారణా చర్యలు, రాష్ట్రంలో వర్షాలు, సహాయ కార్యక్రమాలు, ఖరీఫ్‌కు సన్నద్ధత, ఉపాధి హామీ పనులు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, గృహ నిర్మాణం, గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు, ఆగష్టులో అమలు చేయనున్న పథకాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. స్పందనతో ప్రజలకు మేలు జరుగుతుందని, స్పందన కార్యక్రమం మళ్లీ ప్రారంభించడం సంతోషకరం ఉందని సీఎం అన్నారు. కోవిడ్కారణంగా ఇన్నాళ్లుగా జరగలేదని, మళ్లీ పునఃప్రారంభం కావడం ఆనందంగా ఉందని సీఎం అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ♦కోవిడ్ –19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితి: ♦వ్యాక్సినేషన్‌తోనే పరిష్కారం ♦దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ల సంఖ్య తక్కువగా ఉంది ♦కేంద్రం మనకు ఇచ్చే కేటాయింపుల మేరకే ఇవ్వగలుగుతాం ♦ఉత్పత్తి పెరిగేదాకా... కోవిడ్‌తో కలిసి బతకాల్సిన పరిస్థితి ♦కోవిడ్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది ♦ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.82 శాతం: ♦రెండో వేవ్‌లో కొన్ని జిల్లాల్లో 25శాతం పాజిటివిటీ రేటు చూశాం.. క్రమంగా తగ్గుకుంటూ వచ్చింది: కోవిడ్ నివారణలో సమిష్టి కృషి ♦కలెక్టర్లు నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ఆశావర్కర్లు, డాక్టర్లు, ఏఎన్ఎంలు అందరుకూడా కలిసికట్టుగా పనిచేశారు ♦ప్రతి ఒక్కరూ బాగా పనిచేశారు ♦13 సార్లు ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే చేశారు ♦ఇది ఒక రికార్డు అనవచ్చు ♦లక్షణాలు ఉన్నవారికి వెంటనే పరీక్షలు చేసి, వైద్యం అందించారు ♦ఫోకస్‌గా టెస్టింగ్ చేశారు ♦ముందుగానే వైరస్‌ను గుర్తించి.. సరైన సమయంలో తగిన విధంగా చికిత్స అందించారు ♦మరణాల రేటును తగ్గించగలిగి, కోవిడ్ విస్తరణను అరికట్టగలిగాం ♦అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా ఇక ముందూ ఫోకస్డ్గా టెస్టులు ♦పరీక్షల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ♦ఫోకస్‌గా పరీక్షలు చేయాలి, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలి ♦ఎవరైనా అడిగితే.. వారికి కూడా పరీక్షలు చేయాలి ♦చేసే పరీక్షలన్నీ కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలి ♦ఇవి కచ్చితంగా చేసుకుంటూ పోవాలి ♦104 కాల్‌సెంటర్ నుంచి జిల్లాలకు పోవాలి, జిల్లాల్లో ఉండే కాల్‌సెంటర్ల నుంచి కోవిడ్‌తో బాధపడుతున్న వారికి కచ్చితంగా సర్వీసులు అందాలి ♦ఇంటింటి సర్వేలు జరగాలి, 104 కాల్‌సెంటర్‌ను సమర్థవంతంగా నడపడం కచ్చితంగా జరగాలి ♦మాస్క్‌లు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి ♦ఇవి కచ్చితంగా అమలు కావాలి ♦కోవిడ్ ప్రోటోకాల్స్‌పై నిరంతర పర్యవేక్షణ ఉండాలి ♦కేసులు తగ్గుతున్న దృష్ట్యా అవసరాల మేరకు ఆస్పత్రులను పెట్టుకోవాలి ♦ప్రస్తుతం 302 ఆస్పత్రుల్లో సేవలు అందుతున్నాయి ♦కేసుల సంఖ్యను బట్టి అవసరమైన ఆస్పత్రులను అందుబాటులో ఉంచుకోవాలి ♦అలాగే కోవిడ్కేర్సెంటర్ల విషయంలో కూడా వ్యవహరించాలి ♦ప్రస్తుతం 123 కోవిడ్‌కేర్ సెంటర్లు ఉన్నాయి థర్డ్‌వేవ్ సన్నద్ధత ♦మూడోవేవ్ వస్తుందన్న సమాచారంతో గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం అప్రతమతగా ఉండాలి: కలెక్టర్లకు స్పష్టం చేసిన సీఎం ♦థర్డ్‌వేవ్ వస్తుందో, లేదో తెలియదు కాని, మనం అప్రమత్తంగా ఉండాలి ♦జిల్లాల వారీగా మనం వేసుకున్న ప్రణాళికలు ప్రకారం ఆగస్టు చివరినాటికి అన్నిరకాలుగా సిద్ధం కావాలి: ♦ఆస్పత్రుల్లో అవసరాలమేరకు మౌలిక సదుపాయాలను, ఆక్సిజన్‌బెడ్లను పెంచుకోవాలి ♦అన్నిరకాలుగా మందులు, బయోమెడికల్ ఎక్విప్మెంట్లను సిద్ధంచేసుకోవాలి ♦స్టాఫ్ నర్సులకు పీడియాట్రిక్ కేర్‌లో శిక్షణ ఇవ్వని సందర్భాలు ఉంటే.. వారికి కూడా శిక్షణ ఇవ్వండి: వ్యాక్సినేషన్ ♦1.53 కోట్ల మందికి ఇప్పటివరకూ ఒక డోసు వాక్సిన్ ఇచ్చాం ♦దాదాపు 7 కోట్ల డోసులు అవసరం ఉంటే.. .1.53 కోట్ల డోసులు వేశాం ♦వ్యాక్సినేషన్ విషయంలో ఇంకా మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంది ♦45 ఏళ్లకు పైబడ్డ వారికి 75.89 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చాం ♦దీన్ని 90శాతం వరకూ తీసుకెళ్లాల్సి ఉంది ♦తర్వాత మిగిలిన ప్రాధాన్యతా వర్గాలకు వ్యాక్సిన్లు ఇవ్వాలి ♦టీచర్లకు, గర్భవతులకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలి ♦కాలేజీలుకూడా ప్రారంభమవుతున్నందున ఈచర్యలు తీసుకోవాలి ♦టీచర్లకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వండి ♦మొదటి డోసు ఇచ్చన వారికి, రెండో డోసు ఇవ్వడం చాలా అవసరం ♦కోవిడ్కారణంగా ముప్పుఉన్న వారికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వడంపై దృష్టి పెట్టండి ♦వ్యాక్సినేషన్‌పై అధికారులకు సీఎం దిశా నిర్దేశం వర్షాలు, అప్రమత్తత, పునరావాసం ♦శ్రీశైలంలో డెడ్‌స్టోరేజీ నుంచే విద్యుత్ ఉత్పత్తిని స్టార్ట్చేశారు ♦796 అడుగుల నుంచే నీటిని విడుదల చేయడం మొదలుపెట్టారు ♦దేవుడు చాలా గొప్పవాడు.. అందుకనే వర్షాలు బాగా కురిశాయి.. ♦నీళ్లు బాగా వస్తున్నాయి, శ్రీశైలం నిండుతోంది ♦వీటితోపాటు వర్షాలవల్లే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో జలాశయాలు నిండే పరిస్థితి వచ్చింది ♦రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో అదనపు వర్షపాతం నమోదైంది ♦చిత్తూరు జిల్లాలో 77 శాతం, కడప జిల్లాలో 93.6 శాతం, అనంతపురంలో 82.4శాతం, కర్నూలులో 42.9 శాతం, ప్రకాశం జిల్లాలో 25 శాతం అదనపు వర్షపాతం నమోదైంది ♦రాష్ట్ర వ్యాప్తంగా 23 శాతం అదనపు వర్షపాతం నమోదైంది అల్పపీడనం– అప్రమత్తంగా అధికారులు ♦వాతావరణశాఖ సమాచారం ప్రకారం జులై 28న అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు: ♦అధికారులు అప్రమత్తంగా ఉండాలి ♦వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశాలు నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలి ♦ధవళేశ్వరం వద్ద 5 లక్షల క్యూసెక్కులకుపైగా నీళ్లు కిందకు వెళ్తున్నాయి ♦కాపర్‌డ్యాం నిర్మాణం పూర్తైన నేపథ్యంలో దీని ప్రభావం వల్ల... వరదనీరు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ముంపు ఉండే అవకాశాలు ఉంటాయి ♦లెక్కలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ♦గతంలో 10 లక్షల క్యూసెక్కులకు ముంపు ఉంటే.. ఇప్పుడు 6–7 లక్షలకే ముంపు ఉండే అవకాశాలు ఉంటాయి ♦ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోండి ♦సహాయ కార్యక్రమాలకోసం వెంటనే నిధులు కూడా విడుదలచేశాం ♦ఉభయగోదావరి జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఉన్నాయి ♦మెడికల్‌క్యాంపులు, లైఫ్ జాకెట్లు, సహాయ కార్యక్రమాలకోసం బోట్లు... వీటన్నింటినీ సిద్ధంచేసుకోవాలని కలెక్టర్లును ఆదేశించిన సీఎం ♦కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, దాన్ని 24 గంటలపాటు పర్యవేక్షించాలి ఖరీఫ్ సన్నద్ధత: ♦మంచి వర్షాల వల్ల ఖరీఫ్ విస్తీర్ణం కూడా పెరుగుతోంది ♦సాధారణ విస్తీర్ణం 92.26 లక్షల ఎకరాలు అయితే ఇప్పటికే 27.46 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు ♦ఇ–క్రాపింగ్ అధిక ప్రాధాన్యత ♦కలెక్టర్లు ఇ–క్రాపింగ్‌పై దృష్టిపెట్టాలి ♦కలెక్టర్లు, జేసీలు ఆర్బీకేల పరిధిలో ఇనస్పెక్షన్లు చేయాలి ♦కలెక్టర్లు, జేసీలు కనీసం 10శాతం ఇ–క్రాప్ బుకింగ్‌ను ఇనస్పెక్షన్లు చేయాలి ♦జేడీఏలు, డీడీఏలు 20శాతం తప్పనిసరిగా చేయాలి ♦వ్యవసాయాధికారులు 30శాతం ఇనస్పెక్షన్లు చేయాలి ♦మరింత వేగంగా ఇ–క్రాపింగ్ చేపట్టాలి ♦ఇ– క్రాపింగ్ జరగని రైతు ఉండకూడదు ♦భౌతికంగా రశీదు, డిజిటల్ రశీదు ఉండాలి ♦దీనిపై రైతు సంతకం, అగ్రికల్చర్ అసిస్టెంట్ సంతకం ఉండాలి ♦డాక్యుమెంట్లు కావాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఎలాంటి బలవంతం చేయొద్దు ♦పంట వేసిన ప్రతిచోటా ఇ–క్రాపింగ్ చేయాలి ♦ఒక పొలంలో ఏ పంట ఏశారు, ఎవరు వేశారు, ఎన్ని ఎకరాలు వేశారు అన్నది ఇ–క్రాపింగ్‌లో నమోదు చేయాలి ♦పంటల బీమా చేయాలన్నా, సున్నా వడ్డీ ఇవ్వాలన్నా.. పంటల కొనుగోలు చేయాలన్నా.. ఇలా అన్ని రకాల అంశాల్లో ఇ– క్రాపింగ్ కీలకం ♦అందుకే రైతుల్లో అవగాహన కల్పించి.. ఇ–క్రాపింగ్‌పై దృష్టిపెట్టాలి వ్యవసాయ సలహా మండలి సమావేశాలు ♦వ్యవసాయ సలహా మండలి సమావేశాలపై కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం ♦వ్యవసాయ సలహా మండలి సమావేశాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి ♦ఆర్బీకే స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ సమావేశాలు జరగాలి ♦కలెక్టర్లు దీనిపై పర్యవేక్షణచేయాలి ♦పంటల ప్రణాళికను అమలు చేయడానికి ఈ సమావేశాలు మంచి మార్గాన్ని కల్పిస్తాయి ♦మార్కెట్లో డిమాండు ఉన్న పంటలు సాగు చేసేలా చేయాలి ♦లేకపోతే రైతులకు నష్టాలు వస్తాయి ♦ఏ పంట వేయాలి, ఏ రకం వేయాలి, ఏ పంట వేయకూడదు అనేది రైతులకు చెప్పాలి ♦బోర్ల కింద వరి పంట సాగు లాభదాయకం కాదు ♦ఇవన్నీ రైతులకు చెప్పాలి: ♦వరితోపాటు.. అదే స్థాయిలో ఆదాయాలు వచ్చే మార్గాలను రైతులకు చూపించాలి ♦ఖరీప్ సన్నద్థతతో పాటు ఇలాంటి అంశాలన్నింటిపైనా వ్యవసాయ సలహామండలి సమావేశాల్లో చర్చ జరగాలి ♦ఆర్బీకే స్థాయిలో మొదటి శుక్రవారం, రెండో శుక్రవారం మండలస్థాయి, మూడో శుక్రవారం జిల్లాస్థాయిలో వ్యవసాయ సలహామండలి సమావేశాలు జరగాలి ♦సలహామండలిల్లో ఇచ్చే సలహాలను పరిగణలోకి తీసుకుని జిల్లాస్థాయి సమావేశాల్లో ఆ అంశాలకు పరిష్కారం చూపాలి ♦కొన్ని జిల్లాల్లో ఈ సమావేశాల నిర్వహణలో వెనుకబడ్డాయి ♦దీనిపై మరింత ధ్యాస పెట్టండి రైతు బాగుంటేనే జిల్లా బాగుంటుంది ♦62 శాతం మంది వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు ♦రైతుల విషయంలో అన్ని రకాలుగా మనం సహాయకారిగా ఉండాలి ఫీడ్, సీడ్, ఫెర్టిలైజర్ కల్తీలపై కొరడా ♦నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉండాలి ♦దీని మీద కూడా ధ్యాస పెట్టాలి ♦మొత్తం 15.4 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం ♦ఫెర్టిలైజర్స్‌కు సంబంధించి 20.20 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉంది ♦విత్తనాల్లోనూ, ఎరువుల్లోనూ కల్తీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు ♦క్వాలిటీ గ్యారెంటీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ♦అప్పుడే రైతు బాగుపడతాడు ♦రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలి ♦నాణ్యతతో ఉన్నాయా? లేవా? అన్నది కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షణ చేయాలి ♦బయట మార్కెట్లో అమ్ముతున్న విత్తనాలు, ఎరువులు, పురుగు మందులపై కూడా నాణ్యతను పరిశీలించాలి: ♦కలెక్టర్లు, ఎస్పీలు వారానికొసారి కూర్చుని ప్రజా సమస్యలపై చర్చించాలి ♦అందులో నాణ్యత లేని విత్తనాలు, ఎరువులు, ఫెర్టిలైజర్స్ దుకాణాలపై దృష్టి పెట్టాలి ♦అలాంటి వాటిపై కలెక్టర్లు, ఎస్పీలు కలిసి.. సంయుక్తంగా దాడులు నిర్వహించాలి ♦అప్పుడే కల్తీలు ఆగుతాయి: ఆర్బీకేల స్ధాయి వరకూ బ్యాంకింగ్ సేవలు ♦ఆర్బీకేల వరకూ బ్యాకింగ్సేవలు అందాలి ♦ఆర్బీకేలను సమర్థవంతంగా వాడుకోవాలి ♦బ్యాంకులు చుట్టూ రైతులు తిరగడం కాదు, ఆర్బీకేల వద్దే వారికి బ్యాంకింగ్ సేవలు అందాలి ♦దీనివల్ల బ్యాంకింగ్‌లో మోసాలు తొలగిపోతాయి ♦రైతులకు మంచి సేవలు అందుతాయి కౌలు రైతులకూ రుణాలు ♦కౌలు రైతులకు కచ్చితంగా మేలు జరగాలి ♦కౌలు రైతులకు రుణాలు అందడంపై దృష్టిపెట్టండి ♦వారికి రుణాలు అందేలా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోండి గ్రామ–వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు–ఎస్ఓపీ ♦గ్రామ, వార్డు సచివాలయాలకు, ఆర్బీకెలకు వెళ్లినప్పుడు కచ్చితంగా ఎస్ఓపీ పాటిస్తున్నారా?లేదా?చూడాలి ♦మధ్యాహ్నం 3 గంటలనుంచి 5 గంటలవరకూ ప్రజలకు అందుబాటులో ఉండి వారినుంచి విజ్ఞప్తులను స్వీకరించాలి ♦ఎస్ఓపీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలి ♦అక్కడ ఉన్న సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి ♦రోజుకు రెండు దఫాలుగా హాజరు నమోదు కావాలి ♦ఈ వ్యవస్థబతకాలి, మంచి ఫలాలు అందాలి ♦మంచి పర్యవేక్షణ, సమీక్షలు, తనిఖీలు ద్వారానే ఇది సాధ్యం ధాన్యం బకాయిలు విడుదల ♦మొత్తం ధాన్యం బకాయిలను విడుదల చేస్తున్నాం ♦మొత్తం రూ.3300 కోట్లుకు గాను, రూ.1800 కోట్లు పది రోజుల క్రితమే చెల్లించాం ♦మిగిలిన బకాయిలను ఇవాళ విడుదల చేస్తున్నాం ♦రైతు చేతులోకి డబ్బులు వచ్చి ఖరీప్‌కు ఉపయోగపడాలని భావించాం ♦అది నెరవేరుతుంది: ♦రైతులకు ఎంత వేగంగా డబ్బులు ఇవ్వగలిగితే.. అంత మంచి జరుగుతుందని తాపత్రయం పడుతున్నాం ♦కొనుగోలు చేసిన 21 రోజుల్లో పేమెంట్లు ఇవ్వడానికి నానా తాపత్రయం పడ్డాం ♦గతంలో ఎప్పుడు లేనంతంగా మనం కొనుగోళ్లు చేశాం ♦గడిచిన రెండేళ్లలో సగటున మనం 83 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం ♦అంతకు ముందు ఐదేళ్లలో రాష్ట్రంలో సగటున ప్రతిఏటా కొనుగోలు చేసేది కేవలం 55 నుంచి 57 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే జగనన్న పచ్చతోరణం: ♦ఆగస్టు 15 నుంచి ఆగస్టు 31 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ♦దీన్ని అందుకోవడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి ♦ఆగస్టు 5 నాటికి మొక్కల కొనుగోలుకు సంబంధించి టెండర్లు ఖరారు కావాలి ♦మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ♦గ్రామాల్లో సర్పంచులు, వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలి ♦మొక్కలు నాటగానే సరిపోదు, వాటì కి నీరు పోయడం, సంరక్షణపై దృష్టిపెట్టాలి ♦వేసిన మొక్కలు బతికేట్టుగా చర్యలు తీసుకోండి: సీఎం వైయస్.జగన్ స్పష్టీకరణ నిర్మాణ పనులు వేగవంతం కావాలి ♦గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్ హెల్త్‌క్లినిక్స్, ఏఎంసీ, బీఎంసీల నిర్మాణంపై దృష్టిపెట్టండి ♦రాష్ట్ర వ్యాప్తంగా 10,929 గ్రామ సచివాలయాలను నిర్మిస్తున్నాం ♦గ్రామ సచివాలయాల నిర్మాణంలో కృష్ణా, నెల్లూరు, తూ.గో.జిల్లాలో వెనకబడి ఉన్నాయి ♦కలెక్టర్లు వీటిపై ధ్యాస పెట్టాలి: ♦సెప్టెంబరు 30 కల్లా నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి ♦నిర్మాణాలు దాదాపు పూర్తి చేసుకున్న స్ధితిలో అనంతపురం, తూ.గో, కృష్ణా జిల్లాలున్నాయి ♦వీటిపైనా ఆయా కలెక్టర్లు ధ్యాసపెడితే చాలావరకూ నిర్మాణాలు పూర్తవుతాయి ఆర్బీకేలు ♦10,408 ఆర్బీకేలు నిర్మిస్తున్నాం: ♦ఆర్బీకేలలో ఇంకా బేస్మెంట్లెవల్లో తూ.గో. కృష్ణా, కర్నూలు జిల్లాలో నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి ♦ఈ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ♦డిసెంబరు 31 కల్లా పూర్తిచేసేలా కలెక్టర్లు దృష్టిపెట్టాలి వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ♦వైఎస్సార్ హెల్త్‌క్లినిక్స్‌లో కర్నూలు, తూ.గో, కృష్ణా జిల్లాలు వెనుకబడి ఉన్నాయి ♦మొత్తం 8585 భవనాల్లో 76 శాతం బేస్మెంట్ లెవల్, గ్రౌండ్ ఫ్లోర్ శ్లాబ్ లెవల్ వరకు పూర్తయ్యాయి ♦కేవలం ఒకటే శ్లాబ్ కాబట్టి, శ్రద్ధ పెడితే వెంటనే పూర్తవుతాయి ♦సెప్టెంబరు 30 కల్లా ఇవి పూర్తయ్యేలా చర్యలు తీసుకోండి ♦కర్నూలు,తూ.గో, కృష్ణా జిల్లాల్లో వీటిపై ధ్యాస పెట్టాలి ♦ఏఎంసీ, బీఎంసీల నిర్మాణంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి ♦తూ.గో, కడప, కృష్ణా జిల్లాలు ప్రత్యేక దృష్టిపెట్టాలి డిజిటల్ లైబ్రరీలు ♦డిజిటల్ లైబ్రరీల విషయంలో 4530 గ్రామ పంచాయతీలకు ఫైబర్ కనెక్షన్ వస్తుంది ♦డిసెంబర్‌కల్లా వీటికి కనెక్షన్లు వస్తాయి ♦ఆ సమయానికి డిజిటల్ లైబ్రరీలను పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలి ♦డిజిటల్ లైబ్రరీలను పూర్తిచేస్తే సంబంధిత గ్రామాలనుంచే వర్క్‌ఫ్రం హోం అవకాశాలను కల్పించగలుగుతాం ♦ఆగస్టు 15 కల్లావీటి నిర్మాణాలు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలి ♦యుద్ధ ప్రాతిపదికన వీటి నిర్మాణాలను పూర్తిచేయాల్సి ఉంది: వైఎస్సార్ అర్భన్ క్లినిక్స్ ♦534 అర్బన్‌క్లినిక్స్ తీసుకు వస్తున్నాం ♦వీటి నిర్మాణాలు కూడా త్వరగా పూర్తి చేయాలి ♦నవంబర్ 15 కల్లా వీటి నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి ఇళ్ల పట్టాల పంపిణీ ♦మొదటి దశలో 30 లక్షలకుపైగా ఇళ్లపట్టాలు ఇచ్చాం: ♦3,69,448 మందికి కోర్టు కేసులు కారణంగా అందలేదు: ♦ఈ కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా చూడండి: ♦వాళ్లకి త్వరగా మంచి జరగాలని దేవుడిని కోరుకుంటున్నాను: ♦90 రోజుల్లోగా ఇళ్లపట్టాల కార్యక్రమాన్ని సమీక్షించిన సీఎం ♦10,007 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి ♦వీటిని వెంటనే పరిశీలించి అర్హులను గుర్తించాలి ♦1,90,346 మందిని అర్హులుగా తేల్చారు. వీరికి వెంటనే పట్టాలు ఇవ్వాలి: ♦ఇందులో ప్రస్తుతం ఉన్న లే అవుట్లలో దాదాపు 43వేల మందికి పట్టాలు ♦మరో 10,652 మందికి ప్రభుత్వ స్థలాల్లోనే పట్టాలు: ♦మరో 1.36 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు భూ సేకరణ చేయాల్సి ఉంది ♦భూ సేకరణ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలి ఇళ్ల నిర్మాణ పనులపైనా సమీక్ష ♦మొదటి విడతలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం ♦ఇందులో 10.01 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి ♦లే అవుట్లలో నీరు, కరెంటు చాలా వరకూ కల్పించారు ♦మిగిలిపోయిన సుమారు 600కుపైగా లే అవుట్లలో నీటి వసతిని కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి ♦ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న ఆప్షన్‌ను 3.18 లక్షల మంది ఎంచుకున్నారు ♦వీరిలో 20 మందితో ఒక గ్రూపు ఏర్పాటు చేయాలి ♦స్థానికంగా మేస్త్రిలను గుర్తించి పనులును ఆ గ్రూపులకు అనుసంధానం చేయాలి ♦ఆగస్టు 10 కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తికావాలి ♦సిమ్మెంటు, స్టీలు, ఇసుక అందుబాటులో ఉన్నాయా? లేవా? చూడాలి ♦వర్షాలు ప్రారంభం అవుతున్నందున ఇసుక పంపిణీలో అవాంతరాలు లేకుండా చూసుకోవాలి ♦మండల స్థాయిలో, గ్రామ సచివాలయ స్థాయిలో, అలాగే మున్సిపాల్టీ స్థాయిలో, వార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులు సమీక్ష చేయాలి ♦కలెక్టర్లు కూడా దీనిపై పర్యవేక్షణ, సమీక్షచేయాలి ♦ఇళ్ల నిర్మాణం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది ♦సిమ్మెంటు, స్టీలు, బ్రిక్స్.. ఇలా ఇళ్లనిర్మాణ సామగ్రి కొనుగోలు ఊపందుకుంటుంది... తద్వారా ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుంది ♦కాలనీల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి డీపీఆర్‌లు కూడా సిద్ధంచేయాలి: ♦టిడ్కో ఇళ్లకు సంబంధించి అనర్హులైన వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయాలి ♦వచ్చే స్పందన లోగా ఈ పని పూర్తికావాలి: ఆగష్టు నెలలో చేపడుతున్న కార్యక్రమాలు ♦ఆగస్టు 10న నేతన్న నేస్తం ♦ఆగస్టు 16న విద్యాకానుక ప్రారంభం ♦ఆగష్టు 24న అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపు ♦రూ. 20వేల లోపు డిపాజిట్‌చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపు ♦ఆగష్టు 27న ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్‌మిల్స్‌కు ఇన్సెంటివ్‌లు చెల్లింపు ఈమేరకు కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలి -
మీరే మాకు కళ్లు, చెవులు.. మీరే మా బలం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్ చేసుకోవాలని, వీటి సమర్థత మెరుగుపడాలంటే తనిఖీలు జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై ఆయన మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్కలెక్టర్లు తనిఖీలు చేయాలన్నారు సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ►వారానికి రెండు సార్లు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు 4 సార్లు, మున్సిపల్కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్ కలెక్టర్లు వారానికి 4 సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించమని చెప్పాం ►733 ఇనస్పెక్షన్లు మాత్రమే జరిగాయి ►66.75శాతం మాత్రమే ఇనస్పెక్షన్లు చేశారు ►కలెక్టర్లు 106శాతం, జేసీలు ( గ్రామ సచివాలయాలు) 107 శాతం ఇనస్పెక్షన్లు చేశారు ►వీరంతా బాగానే ఇనస్పెక్షన్లు చేశారు ►కాని మిగిలిన వారు సరిగ్గా చేయలేదు ►జేసీ రెవిన్యూ 78శాతం, జేసీ హౌసింగ్49శాతం, జేసీ ( ఏ అండ్ డబ్ల్యూ) 85శాతం, కార్పొరేషన్లలో మున్సిపల్కమిషనర్లు 89శాతం, ఐటీడీఏ పీఓలు 18శాతం, సబ్కలెక్టర్లు 21శాతమే ఇనస్పెక్షన్లు చేశారు ►వీరి ఫెర్మానెన్స్ చాలా బ్యాడ్‌గా ఉంది ►వీరికి మెమోలు జారీచేయమని ఆదేశాలు జారీచేశాను ►వీరు ఇనస్పెక్షన్లు చేయకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ఎలా తెలుస్తాయి ►సకాలంలో పెన్షన్లు వస్తున్నాయా? రేషన్‌కార్డులు వస్తున్నాయా? లేదా అని ఎవరికి తెలుస్తుంది ►మనం వెళ్లపోతే ఎలా తెలుస్తాయి ►తప్పులు జరిగాయని తెలిస్తే.. వాటిని రిపేరు చేసుకునే అవకాశం ఉంటుంది ►అసలు వెళ్లకపోతే.. ఎలా తెలుస్తాయి ►మొదట మనం మనుషులం.. ఆతర్వాతే అధికారులం ►మానవత్వం చూపడం అనేదిమన ప్రాథమిక విధి ►పేదల గురించి మొదట మనం ఆలోచించాలి ►వచ్చే స్పందన నాటిని నిర్దేశించిన విధంగా నూటికి నూరుశాతం గ్రామ, వార్డు సచివాలయాలను పర్యవేక్షణ చేయాలి ►డీబీటీ పథకాల్లో సోషల్‌ఆడిట్‌కోసం జాబితాను ప్రదర్శిస్తున్నారా? లేదా? చూడాలి ►బియ్యంకార్డు, పెన్షన్ కార్డు, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాలు అత్యంత ముఖ్యమైనవి ►నిర్దేశించుకున్న సమయంలోగా అర్హులకు అవి అందాలి ►ప్రతి అర్హుడికీ ఇవి అందాలి ►మనకు ఓటు వేయని వారికి కూడా అందాలి ►అనర్హులకు అందకూడదు ►వీటిని స్వయంగా పరిశీలించాలి, పర్యవేక్షణ, సమీక్ష చేయాలి ►గ్రామ, వార్డు సచివాయాలను సందర్శించి వెరిఫికేషన్ ప్రాసస్ సరిగ్గా జరుగుతుందా? లేదా? చూడాలి ►ఏమైనా లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి ►వెంటనే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది ►మీరే మాకు కళ్లు, చెవులు, మీరే మా బలం ►అందుకనే మీరు క్షేత్రస్థాయికి వెళ్లి.. పరిశీలనలు చేయాలి ►పథకాలకు సంబంధించి పోస్టర్లు ఉంచుతున్నారా?లేదా? సంక్షేమ క్యాలెండర్ ఉంచారా లేదా? ముఖ్యమైన ఫోన్‌నంబర్లు ప్రదర్శిస్తున్నారా? లేదా? సోషల్ ఆడిట్ కోసం జాబితాలు ఉంచుతున్నారా? లేదా? సర్వీసులన్నీ... నిర్దేశిత సమయంలోగా అందిస్తున్నారా? లేదా?హార్డ్ వేర్ సరిగ్గా ఉందా? లేదా? ఇవన్నీ పరిశీలనలు చేయాలి ►రిజిస్టర్లు, రికార్డులు సరిగ్గా చేస్తున్నారా? లేదా? చూడండి ►బయోమెట్రిక్ అటెండెన్స్ సరిగ్గా జరుగుతోందా?లేదా చూసుకోండి ►వీటిని పట్టించుకోకపోతే గ్రామ, వార్డు సచివాలయాలు సమర్థవంతంగా పనిచేయవు ►అధికారులు వస్తున్నారంటే... సేవలు సమర్థవంతంగా అదించడానికి ప్రయత్నిస్తారు ►ఇంకా 2 శాతం గ్రామ, వార్డు సచివాలయాల్లో హాజరు గణనే ఉండడంలేదు ►1.42 లక్షలమంది సిబ్బంది ఉంటే... 1.28 మంది హాజరు గణించడంలేదు ►ఇక్కడ సరిదిద్దాల్సి ఉంది ►ఇలా ఉంటే ఆశించిన ఫలితాలను అందుకోలేం వచ్చే స్పందనలోగా మళ్లీ ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు ►మీకు మెమోలు ఇవ్వడం అన్నది నాకు చాలా బాధ కలిగించే విషయం ►నా పనితీరుమీద నేను మెమో ఇచ్చుకున్నట్టే ►వచ్చే స్పందన లోగా కచ్చితంగా అనుకున్న విధంగా అధికారులు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలి ►ఆగస్టు 10న నేతన్న నేస్తం ►విద్యాకానుక ఆగస్టు 16న ►రూ. 20వేల లోపు డిపాజిట్‌చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న డబ్బు ఇస్తాం ►ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్‌మిల్స్‌కు ఆగస్టు 27న ఇన్సెంటివ్‌లు ఇస్తాం ►ఈ మేరకు కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలి -
వారానికి రెండుసార్లు సచివాలయాలను సందర్శిస్తా: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: కరోనా తగ్గుముఖం పట్టగానే వారానికి రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రేపటి నుంచి అధికారులు చురుగ్గా గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారనే మాట రావాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరో 200 సేవలను అదనంగా ప్రజలకు అందించబోతున్నామని, మొత్తంగా వీటిద్వారా 740 సేవలు అందుతాయన్నారు. మంగళవారం ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వారానికి రెండుసార్లు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శిస్తానని తెలిపారు. అదే సమయంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని, అర్హులైన వారికి 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 104 కాల్ సెంటర్.. వన్ స్టాప్ సొల్యూషన్ కావాలని, థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ సెకండ్ డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. -
థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి : సీఎం జగన్
-
ఆర్బీకేల స్థాయికి బ్యాంకింగ్ సేవలు
సాక్షి, అమరావతి: బ్యాంకింగ్ సేవలను ఆర్బీకేల స్థాయికి తీసుకు వచ్చేందుకు కలెక్టర్లు బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కౌలు రైతులకు నష్టం జరగకుండా కొత్త చట్టం తీసుకొచ్చామని, తద్వారా వారికి మేలు చేసే ప్రక్రియపై అవగాహన కలిగించాలని, వారికి రుణాలు వచ్చేలా చేయడం కలెక్టర్ల బాధ్యత అని స్పష్టం చేశారు. ఇ–క్రాపింగ్ అనేది చాలా ముఖ్యమని, ఇ–క్రాపింగ్ చేయకపోతే కలెక్టర్లు విఫలం ఆయ్యారని భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కనీసం 10 శాతం ఇ–క్రాపింగ్‌ను కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలని, లేదంటే రైతులు నష్టపోతారన్నారు. స్పందనలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖరీఫ్ సన్నద్ధత, ఇ–క్రాపింగ్, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాపై జిల్లా అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇ– క్రాపింగ్ చాలా ముఖ్యం. వివాదంలో ఉన్న భూముల్లో పంట సాగు చేసినా.. ఇ–క్రాపింగ్ చేయాలి. లేదంటే రైతు నష్టపోతాడు. ఇ– క్రాపింగ్ పూర్తి స్థాయిలో చేయకపోతే.. కలెక్టర్ విఫలం అయ్యారని భావించవచ్చు. దిగువనున్న సిబ్బంది కూడా ఇ–క్రాపింగ్‌ను పర్యవేక్షించాలి. లేకపోతే సేవల్లో నాణ్యత ఉండదు. ఇ– క్రాపింగ్‌పై శిక్షణ కార్యక్రమం ఆర్బీకే లెవల్లో జూన్ 3 నుంచి 8 వరకు ఏర్పాటు చేశాం. ఎవరైనా మిస్ అయి ఉంటే తిరిగి శిక్షణ ఇప్పిస్తాం’ అని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. వ్యవసాయ సలహా మండలి ► ఆర్బీకేలు మొదలు మండల, జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు కావాలి. వాటి సమావేశాలు కచ్చితంగా జరగాలి. ధర వచ్చే పంటలు, డిమాండ్ ఉన్న పంటలు వేయడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషించాలి. ► ఏ పంట వేయవచ్చు, ఏ వెరైటీ వేయకూడదన్న దానిపై కమిటీల సహాయంతో పంటల ప్రణాళిక వేసుకోవాలి. బోరుబావుల కింద, మెట్ట ప్రాంతాల్లో వరి వేయడం అన్నది చాలా రిస్క్. అలాంటి సందర్భాల్లో మంచి ఆదాయాలు వచ్చే పంటలను వారికి చూపించాలి. ► కొర్రలు, రాగులు వంటి ప్రత్యామ్నాయ పంటలను, మెరుగైన ఆదాయాన్నిచ్చే పంటలను చూపించాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న వంగడాలపై రైతులకు చైతన్యం కలిగించాలి. అది రైతుకు, ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుంది. కస్టమ్ హైరింగ్ సెంటర్లు.. హబ్స్ ► కస్టమ్ హైరింగ్ సెంటర్లు, హబ్స్ అనేవి వ్యవసాయ రంగంలో పెనుమార్పులకు దారి తీస్తాయి. స్థానిక రైతులకు అందుబాటు ధరల్లో యంత్రాలు సేవలు అందిస్తాయి. జిల్లా స్థాయిలో రైతులతో కమిటీలను ఏర్పాటు చేసి వారి సహకారంతో ఏ యంత్రాన్ని ఎంత ధరకు అద్దెకు ఇవ్వొచ్చన్నదానిపై నిర్ణయించాలి. ► జూలై 8న మొదటి విడతగా 3 వేల ఆర్బీకేల పరిధిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నాం. అక్టోబర్‌లో 2వ విడత, జనవరిలో మూడో విడత కస్టమ్ హైరింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నాం. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందాలి ► రైతులకు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలే అందాలి. నకిలీలకు ఆస్కారం ఉండకూడదు. ఈ విషయంలో కలెక్టర్లు దృష్టి పెట్టాలి. మిర్చి, పత్తి, తదితర పంటలకు సంబంధించి ప్రీమియం విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందించాలి. అప్పుడు రైతులకు మరింత భరోసా ఉంటుంది. బ్లాక్ మార్కెటింగ్ కూడా ఉండదు. ► విత్తనాలు, ఎరువులు అమ్మే దుకాణాలపై క్రమం తప్పకుండా తనిఖీలు జరగాలి. డీలర్లు అమ్మే వాటిలో నాణ్యత ఉన్నాయా? లేదా? కచ్చితంగా పరిశీలించాలి. పోలీసుల సహకారంతో ఈ రెయిడ్స్ జరగాలి. అప్పుడే బ్లాక్ మార్కెటింగ్, కల్తీలకు మనం అడ్డుకట్ట వేయగలుగుతాం. ► కర్ఫ్యూ సమయంలో కూడా వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలు కొనసాగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ► నాణ్యత పరీక్షించిన ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు అందించాలి. ఎక్కడా కొరత రానీయొద్దు. కాంప్లెక్స్ ఎరువులు కూడా అందుబాటులో ఉంచాలి. పురుగు మందుల విషయంలో కచ్చితంగా నాణ్యత పరీక్షలు జరగాలి. రైతులకు భౌతిక రశీదు ► ఇ–క్రాపింగ్ వివరాల నమోదులో జాగ్రత్తగా వ్యవహరించాలి. మన అలసత్వం వల్ల రైతులకు నష్టం రాకూడదు. మనల్ని ప్రశ్నించే అవకాశం రైతులకు ఉండాలి. అందుకే ఇ–క్రాపింగ్‌పై ప్రతి రైతుకు డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్తోపాటు భౌతికంగా కూడా రశీదు ఇవ్వాలి. ఈ వివరాల ఆ«ధారంగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, బీమా వస్తుంది. ఈ విషయంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ► ఇ– క్రాపింగ్ చేసేటప్పుడు ప్రతి ఎకరం, ప్రతి పంట వివరాలు నమోదు చేయాలి. హార్టికల్చర్ విషయంలో సీజన్‌తో సంబంధం లేకుండా ఇ–క్రాపింగ్ చేయాలి. -
స్పందనపై కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
-
అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణ విషయంలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ మంచి ఫలితాలను ఇచ్చిందని సీఎం తెలిపారు. కేసుల సంఖ్య తగ్గుతుండటంతోపాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందన్నారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ ప్రగతి.. ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులు, రుణాల అందుబాటు.. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్ నిర్మాణంపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కోవిడ్ ఎప్పటికీ కూడా జీరోస్థాయికి చేరుతుందని అనుకోవద్దన్నారు. మనం జాగ్రత్తలు తీసుకుంటూనే.. కోవిడ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని, మాస్కులు, శానిటైజర్లు తదితర చర్యలన్నీ కొనసాగాలి. ఇవి మన జీవితంలో భాగం కావాలన్నారు. ఫోకస్‌గా టెస్టులు చేయాలని, గ్రామాల్లో చేస్తున్న ఫీవర్‌సర్వే కార్యక్రమాలు ప్రతి వారం కొనసాగించాలన్నారు. ఎవరు కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నా.. పరీక్షలు చేసి వెంటనే వైద్యం అందించాలని ఆదేశించారు. ఫీవర్ సర్వే కార్యక్రమం ప్రతి వారం కొనసాగాలన్నారు. సీఎం ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘టెస్టులు ఇష్టానుసారం కాకుండా ఫోకస్‌గా, లక్షణాలు ఉన్నవారికి చేయాలి. ఎవరైనా కోవిడ్‌పరీక్షలు చేయమని అడిగితే వారికి కూడా చేయాలి. అన్ని టెస్టులు కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలి. ఆరోగ్య శ్రీ అమల్లో కలెక్టర్లను అభినందిస్తున్నా. 89శాతం మంది కోవిడ్ ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీ కింద తీసుకున్నారు. పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా భారంపడకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నారు. అందరికీ అభినందనలు తెలియచేస్తున్నా. ఈరోజు 16వేలమందికిపైగా కోవిడ్ ట్రీట్ మెంట్‌జరుగుతుంటే.. 14 వేలమందికిపైగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారు. ప్రయివేటు ఆస్పత్రులపై కూడా కలెక్టర్లు దృష్టిపెట్టాలి. 104 అనేది ఒన్‌స్టాప్ సొల్యూషన్ వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రేట్లుకన్నా.. ఎక్కువ ఛార్జి చేయకూడదు. ఎవరైనా వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలి. అలా చేసిన ఆస్పత్రులను మూసివేయడానికి కూడా కలెక్టర్లు సంకోచించవద్దు. మహమ్మారి సమయంలో ప్రజలను పీడించుకుతినే ఆలోచనలు ఉన్నవారిపై కఠినంగా వ్యవహరించాలి. మొదటిసారి ఉల్లంఘిస్తే పెనాల్టీలు వేయాలి. రెండోసారి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. 104 నంబర్‌ను తప్పనిసరిగా ఓన్ చేసుకోవాలి. కోవిడ్ సంబంధిత అంశాలకు 104 అనేది ఒన్‌స్టాప్ సొల్యూషన్ కావాలి. కలెక్టర్లు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. కేసులు తగ్గినప్పుడు కాస్త రిలాక్స్ మూడ్వస్తుంది. ఇలాంటి సమయంలో ఒకసారి మొత్తం సమీక్షించుకుని తిరిగి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 439 ఆస్పత్రులు ప్రస్తుతం ఆపరేట్ చేస్తున్నాం. ఈ ఆస్పత్రుల్లో సూపర్ విజన్, పర్యవేక్షణ అన్నది చాలా ముఖ్యం. ప్రతివారం ఫీవర్ సర్వే నిర్వహించాలి: వారానికి ఒకసారి ఫీవర్‌క్లినిక్స్ కూడా కచ్చితంగా నిర్వహించాలి. మనం గుర్తిస్తున్న అంశాలను కూడా ఫాలోఅప్ చేయాలి.థర్డ్‌వేవ్ వస్తుందో, లేదో మనకు తెలియదు. మనం ప్రిపేర్‌గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశం. వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. థర్డ్‌వేవ్‌లో పిల్లలు ప్రభావితం అవుతారని చెప్తున్నారు. ఈ అంశాలను కలెక్టర్లు దృష్టిలో ఉంచుకోవాలి. చక్కటి కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. పిల్లలకు చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. జిల్లాస్థాయిలో వచ్చే 2 నెలలకు కార్యాచరణ సిద్ధంచేసి అమలు చేయాలి. పిల్లల వైద్యం కోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులను తీసుకొస్తున్నాం. వైజాగ్‌లో ఒకటి, కృష్ణా–గుంటూరు ప్రాంతంలో ఒకటి తిరుపతిలో ఒకటి తీసుకు వస్తున్నాం. దీనికి సంబంధించి అవసరమైన భూములను కలెక్టర్లు గుర్తించాలి. ఇ– క్రాపింగ్‌పై రైతులకు భౌతికంగా రశీదు ఇవ్వాలి ఇ– క్రాపింగ్‌బుకింగ్‌అనేది చాలా ముఖ్యం. ఇ– క్రాపింగ్ చేయకపోతే... కలెక్టర్ విఫలయం అయ్యారని భావించవచ్చు. కనీసం 10శాతం ఇ– క్రాపింగ్‌ను కలెక్టర్, జేసీలు పరిశీలించాలి. దిగువనున్న సిబ్బంది కూడా ఇ– క్రాపింగ్‌ను పర్యవేక్షించాలి. డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్తోపాటు భౌతికంగా రశీదు కూడా ఇవ్వాలి. ఇ– క్రాప్ వివరాలన్నీ కూడా ఇందులో ఉండాలి. ఈ వివరాలు ఆధరంగా నే ఇన్‌పుట్‌సబ్సిడీ వస్తుంది, బీమా వస్తుంది. మన అలసత్వం వల్ల రైతులకు నష్టం రాకూడదు. వివరాల నమోదులో జాగ్రత్తలు అవసరం. తప్పులు ఉంటే.. రైతులకు నష్టం జరుగుతుంది. మనల్ని ప్రశ్నించే అవకాశం రైతులకు ఉండాలి. అందుకనే డిజిటల్ రశీదుతోపాటు, ఫిజికల్ రశీదుకూడా ఇవ్వాలి. దీనిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. ఇ– క్రాపింగ్ చేసేటప్పుడు ప్రతి ఎకరం, ప్రతి పంట... కూడా నమోదు చేయాలి. వివాదాస్పదమైన భూమి అయినా సరే పర్వాలేదు. కాని కచ్చితంగా ఇ– క్రాపింగ్ నమెదు కావాలి. పంటల కొనుగోలులో గాని, ఇతరత్రా అంశాల్లో రైతుకు నష్టం రాకూడదు. పంట వేస్తే కచ్చితంగా ఇ– క్రాపింగ్ జరగాలి. హార్టికల్చర్ విషయంలో సీజన్‌తో సంబంధం లేకుండా ఇ–క్రాపింగ్‌చేయాలి. రైతులకు నాణ్యమైన విత్తనాలే అందాలి నకిలీలకు ఆస్కారం ఉండకూడదు. ఈవిషయంలో కలెక్టర్లు దృష్టిపెట్టాలి. నాణ్యమైన విత్తనాలు రైతులకు ఆర్బీకేలద్వారా అందాలి. ప్రీమియం విత్తనాలు కూడా ఆర్బీకేలద్వారా రైతులకు అందించేలా చేయగలిగితే.. రైతులకు భరోసా ఉంటుంది. నకిలీలకు ఆస్కారం ఉండదు. బ్లాక్‌మార్కెటింగ్ కూడా ఉండదు. మిర్చి, పత్తి, తదితర పంటలకు సంబంధించి ప్రీమియం విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందించాలి. విత్తనాలు, ఎరువులు అమ్మే దుకాణాలపై క్రమం తప్పకుండా పరిశీనలు జరగాలి. డీలర్లు అమ్మే వాటిలో నాణ్యత ఉన్నాయా? లేదా? కచ్చితంగా పరిశీలించాలి. పోలీసుల సహకారంతో ఈరెయిడ్స్ జరగాలి. అప్పుడే బ్లాక్‌మార్కెటింగ్, కల్తీలకు మనం అడ్డుకట్ట వేయగలుగుతాం. అనైతిక కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు.కర్ఫ్యూ సమయంలో కూడా వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరిచిపోకూడదు.ఆమేరకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. అక్టోబరులో 2వ విడత కస్టమ్ హైరింగ్ సెంటర్లు, హబ్స్ అనేవి వ్యవసాయరంగంలో పెనుమార్పులకు దారితీస్తాయి. స్థానిక రైతులకు అందుబాటు ధరల్లో యంత్రాల సేవలు అందిస్తాయి. జిల్లాస్థాయిలో కమిటీలను, రైతులే ఏర్పాటుచేసి వారి సహకారంతో రేట్లను నిర్ణయించాలి. ఏ యంత్రాన్ని ఎంత ధరకు అద్దెకు ఇవ్వొచ్చన్నదానిపై నిర్ణయించాలి. ప్రకటించిన ధరలకే ఈపరికరాలన్నీకూడా అందుబాటులో ఉంటాయి. జులై 8న మొదట విడత 3వేల ఆర్బీకేల పరిధిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నాం. అక్టోబరులో 2వ విడత, జనవరిలో మూడో విడత కస్టర్ హైరింగ్సెంటర్లు ప్రారంభిస్తున్నాం. బ్యాంకింగ్సేవలను ఆర్బీకేల స్థాయికి తీసుకు రావాలి. ఈమేరకు బ్యాంకులతో కలెక్టర్లు మాట్లాడాలి. జూన్ 17 నుంచి జులై 2వరకూ వివిధ కార్యక్రమాల కింద కడుతున్న భవనాలపై భవన నిర్మాణ పక్షోత్సవాలు. భవనాల వారీగా విశ్లేషణ, రోజువారీ సమీక్షలు పనులు శీఘ్రగతిన జరిగేలా టీంలు సెకండరీ ఫుడ్‌ప్రాససింగ్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల్లో భూమలు గుర్తింపు పూర్తికావాలి. వచ్చే స్పందన నాటికి అన్ని జిల్లాల్లో పూర్తికావాలి. 3.7లక్షలకుపైగా కుటుంబాలకు ఎనలేని మేలు జగనన్న శాశ్వత భూహక్కు కార్యక్రమం కోవిడ్కారణంగా ఆశించినంత వేగంగా కదల్లేదు. ఇది పూర్తయితే వివాదాలకు పూర్తిగా చెక్ పడుతుంది. ఇప్పుడు ఈకార్యక్రమంపై దృష్టిపెట్టాలి. క్రమం తప్పకుండా స్పందనలో దీనిపై రివ్యూ చేస్తాను. ఈ కార్యక్రమం ప్రగతిని పర్యవేక్షిస్తాను. కోర్టు కేసుల కారణంగా 3,70,201 మందికి ఇళ్లస్థలాలు రాలేదు. పేదవాడికి ఇంటి పట్టాలు రాకూడదని టీడీపీ లాంటి ప్రతిపక్షాలు అన్యాయంగా కేసులువేసి అడ్డుకున్నాయి. ఇప్పుడు హైకోర్టు సెలవులు కూడా ముగిశాయి. ఇప్పుడు ఇలాంటి కేసులమీద దృష్టిపెట్టండి. ప్రతిరోజూ రివ్యూ చేసి చర్యలు తీసుకోండి. కలెక్టర్లు, జేసీలు ఈ కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోండి. దీనిమీద ప్రత్యేకమైన ధ్యాసపెట్టాలి. దీనివల్ల 3.7లక్షలకుపైగా కుటుంబాలకు ఎనలేని మేలు జరుగుతుంది. అలాగే 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు ఇవ్వడంపై దృష్టిపెట్టాలి. 1.72 లక్షలమందికిపైగా అర్హులని అధికారులు తేల్చారు. ఇందులో 38వేల మందికి ఇప్పుడున్న ఉన్న లేఅవుట్లలోనే పట్టాలు ఇస్తున్నారు. మరో 9,794 మందికి కొత్త లే అవుట్లలో ఇస్తున్నారు. వీరికి వచ్చే స్పందనలోగా పట్టాలు ఇవ్వాలి. పెండింగులో 11,741 దరఖాస్తులను వచ్చే స్పందనలోగా పరిష్కరించాలి. 1.24లక్షల మందికి వీలైనంత త్వరగా భూసేకరణ చేసి పట్టాలు ఇవ్వాలి. ఇళ్లనిర్మాణం తొలివిడతలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. జగనన్నకాలనీల్లో 4,120 కాలనీల్లో తాగునీరు, కరెంటు ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన కాలనీల్లో జూన్ నెలాఖరు కల్లా తాగునీరు, కరెంటు సౌకర్యాలను ఏర్పాటు పూర్తికావాలి. సొంత స్థలాలు ఉన్నవారికి 3.84 ఇళ్లు ఇచ్చాం. వాటిని శరవేగంగా పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలి: ఇళ్లనిర్మాణం విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలి. దీనివల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుస్తాయి. తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో సమీక్షా సమావేశాలు ఏర్పాటు కావాలి. జూన్ 22న చేయూత పథకాన్ని అమలు చేస్తున్నాం. దీనికి కలెక్టర్లు అంతా సిద్ధంకావాలి.జులైలో విద్యాదీవెన, కాపు నేస్తం పథకాలు అమలు చేస్తాం. దీనికి సంబంధించి కూడా కలెక్టర్లు సిద్ధంకావాలి. వైఎస్సార్ బీమా జులై 1న ప్రారంభం అవుతుంది.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
రుయా ఘటన తీవ్రంగా కలచివేసింది
కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. బాధాకరమైన ఘటనలు కూడా జరుగుతున్నాయి. నిన్న (సోమవారం రాత్రి) తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. ఆ ఘటనతో నాకు చాలా బాధ వేసింది. మనం ఎంత బాగా కష్టపడుతున్నప్పటికీ, మన తప్పు లేకపోయినప్పటికీ.. తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాకపోవడం వల్ల 11 మంది చనిపోవడం బాధాకరం. కొన్ని మన చేతుల్లో లేని అంశాలకు కూడా మనం బాధ్యత తీసుకుంటున్నాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రుయాలో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రుయా ఘటనతో పాటు కోవిడ్–19 నియంత్రణ, చికిత్స, వ్యాక్సినేషన్ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రుయా లాంటి ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని, కలెక్టర్లు మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లాల్లో ఆక్సిజన్ వార్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, ఎస్ఓఎస్.. ఎమర్జెన్సీ మెసేజ్ రాగానే వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. కలెక్టర్లు జాగ్రత్తగా పర్యవేక్షణ చేయగలిగితే.. సమర్థవంతంగా ముందుకు సాగే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాల్లో ఆక్సిజన్ స్టోరేజీ కెపాసిటీలు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడైనా పరిశ్రమల్లో ఆ సదుపాయం ఉందా.. అన్నదానిపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే నేవీ బృందాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్తున్నాయని, ఈ సమయంలో వారు చాలా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. నేవీ బృందాల సేవలను బాగా వినియోగించుకోవాలని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఇది మనకు పరీక్షా సమయం ► కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల నుంచి మనకు ఆక్సిజన్ వస్తోంది. 3 రాష్ట్రాలకు ముగ్గురు అధికారులను పంపిస్తున్నాం. ఆక్సిజన్ çసఫ్లై పెంచడంపై వీరు దృష్టి పెడతారు. తమిళనాడుకు కరికాల వలవన్, కర్ణాటకకు అనంతరాములు, ఒడిశాకు ఏకే పరీడాను పంపిస్తున్నాం. రేపటి (బుధవారం) నుంచి ఈ వ్యవస్థ పని చేస్తుంది. ► ఆక్సిజన్ పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే... నిన్న (సోమవారం) 6 ట్యాంకర్లను గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశాకు విమానంలో పంపాం. రవాణా సమయాన్ని ఆదా చేయడానికి ఎయిర్‌లిఫ్ట్ చేశాం. అక్కడ ఆక్సిజన్ నింపి.. రోడ్డు మార్గంలో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ► విదేశాల్లో కూడా ఆక్సిజన్ కొనుగోలు చేసి.. షిప్స్ ద్వారా తెప్పిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పడు మనం ఉన్నాం. ఇంత సమష్టిగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాల వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. ► ఇది మనకు పరీక్షా సమయం. కలెక్టర్లందరికీ చెబుతున్నా.. జరిగిన ఘటన పట్ల మీరు సడలిపోవాల్సిన పని లేదు. కానీ అత్యంత అప్రమత్తత, జాగరూకతతో వ్యవహరించాలి. ఇంకా మానవత్వం చూపించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ కారణంగా నెలకొన్న సమస్యలను మానవత్వంతో, సానుభూతితో ఎదుర్కోవాల్సి ఉంది. మన బాధ్యత కాకపోయినా, మానవత్వంతో.. ► నిన్నటి (సోమవారం) ఘటనలో మరణించిన వారందరికీ పరిహారం ఇస్తున్నాం. మన తప్పు కాకపోయినా, పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన ట్యాంకర్ సకాలానికి రాకపోయినా సరే.. బాధ్యత తీసుకుని రుయా ఘటనలో మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని చిత్తూరు కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాం. కలెక్టర్ గానీ, జేసీ గానీ వారి కుటుంబాల వద్దకు స్వయంగా వెళ్లి పరిహారం ఇవ్వండి. వారితో మాట్లాడి, ఓదార్చి ధైర్యం చెప్పండి. వారికి బాసటగా నిలవండి. ► తప్పు ఎవరి వల్ల జరిగినా తప్పు జరిగింది. ఇలాంటి తప్పులు మళ్లీ జరక్కుండా.. భవిష్యత్తులో, ఇంకా ఎలా చేయగలుగుతాం అన్నదానిపై దృష్టిపెట్టాలి. తప్పును ఒప్పుకోవడం అన్నది చిన్నతనం కాదు. ప్రతి అడుగులోనూ పారదర్శకంగా వ్యవహరించే ప్రభుత్వం మనది. దేశంలో ఎలా ఉన్నా సరే.. మన రాష్ట్రంలో పారదర్శకతకు పెద్దపీట వేశాం. కోవిడ్ టెస్టుల్లో, ట్రీట్మెంట్లో ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామో దేశానికి చూపించాం. ప్రతి అడుగులోనూ పారదర్శకంగా ఉన్నాం. బెడ్లు.. సీసీసీలు ► రాష్ట్రంలో 648 ఆస్పత్రులను ఎంప్యానెల్ చేశాం. 47,947 బెడ్లను అందుబాటులోకి తీసుకువచ్చాం. 41,315 బెడ్లు భర్తీలో ఉన్నాయి. ఆస్పత్రి ఆవరణలో టెంపరరీ జర్మన్ హ్యాంగర్స్‌ను ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఆస్పత్రిలో వేచిచూసే పరిస్థితులు ఉండవు. డాక్టర్లు వెంటనే వచ్చి వైద్యం చేసే అవకాశం ఉంటుంది. ► కోవిడ్ కేర్ సెంటర్లపై దృష్టి పెట్టాలని కోరుతున్నాం. కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా ఆక్సిజన్ సఫ్లై గురించి అధికారులు ఆలోచించాలి. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కొనుగోలుపై దృష్టి పెట్టింది. త్వరలోనే ఇవి అందుబాటులోకి వస్తాయి. ► ఆస్పత్రుల్లో ఉండే ఆక్సిజన్ పైపులైన్లను చెక్ చేయడంతో పాటు పర్యవేక్షణ చేయండి. టెక్నికల్ స్టాఫ్‌ను కచ్చితంగా నియమించండి. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సరైన ఒత్తిడితో ఆక్సిజన్ వెళ్లేలా చేయాలి. ఐసీయూలో కూడా ప్రెజర్ బూస్టర్స్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి. 104 వ్యవస్థను ఓన్ చేసుకోవాలి ► 104 వ్యవస్థను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకోవాలి. 104కు అనుసంధానంగా ప్రతి జిల్లా స్థాయిలో కూడా వ్యవస్థ ఉండాలి. 104కు కాల్ చేస్తే రెస్పాన్స్ లేదనే మాట రాకూడదు. సంబంధిత జేసీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. 104కు కాల్చేస్తే మంచి సేవలు అందుతున్నాయనే ప్రజలు భావించాలి. ► మందులు ఇవ్వడం, క్వారంటైన్ సెంటర్లో చేర్పించడం, ఆస్పత్రుల్లో బెడ్లు ఇవ్వడం ఇవన్నీ కూడా మన బాధ్యత. మొదటిసారి దేశంలో ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ చికిత్సను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాం. 104కు కాల్చేస్తే ఉచితంగా వైద్యం అందించే రాష్ట్రాల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ► 104 ద్వారా 16 వేల నుంచి 17 వేల కాల్స్ వస్తున్నాయి. కాల్స్ రిసీవ్ చేసుకునే కెపాసిటీని కూడా పెంచాం. దీనికి అనుగుణంగా జిల్లాల్లో అనుసంధాన వ్యవస్థల్లో వనరులను పెంచుకోవాల్సి ఉంటుంది. ► మన ఇంట్లో మనకు కావాల్సిన వ్యక్తి ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన ఆశిస్తారో.. అలాంటి స్పందనే యంత్రాంగం నుంచి ఉండాలి. టెస్టింగ్, మెడికల్ కన్సల్టేషన్, ట్రాన్స్‌పోర్టేషన్.. ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేలా చూడాలి. 3 గంటల్లో వారికి సేవలందించే బాధ్యత తీసుకోవాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కోవిడ్ వైద్య సేవలు ► కోవిడ్ వైద్యం కోసం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులను కూడా తీసుకున్నాం. మంచి ఆహారం అందుతోందా? లేదా? మందులు సక్రమంగా అందుతున్నాయా? రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయా? లేవా? సిబ్బంది తగినంత సంఖ్యలో ఉన్నారా? లేదా? చూడండి. ఈ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్ర ఉండేలా చూసుకోండి. సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి నంబర్‌ను ఉంచండి. ► అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందుబాటులో ఉంచాలని కోరాం. ఇక్కడ కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేవా? చూడాలి. ప్రతి రెండు మూడు ఆస్పత్రులకు ఒక నోడల్ ఆఫీసర్ కచ్చితంగా ఉండాలి. 648 ఆస్పత్రులకు కచ్చితంగా నోడల్ అధికారులను నియమించాలి. ఆరోగ్య శ్రీ, ఆక్సిజన్ సఫ్లై ఆస్పత్రుల పనితీరు, శానిటేషన్, ఫుడ్ క్వాలిటీపై నోడల్ అధికారులు దృష్టి పెట్టాలి. మనకు నివేదికలు కూడా అందిస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతరం తనిఖీలు చేపట్టాలి. వైద్యులను వెంటనే నియమించాలి. ఇందుకు వాక్ ఇన్ ఇంటర్వూ్యలను వెంటనే నిర్వహించండి. ► ఉదయం 6 నుంచి 12 వరకు ప్రజలు వారి పనులు చేసుకోవచ్చు. అదే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 12 గంటలు దాటిన తర్వాత నూరు శాతం కర్ఫ్యూ పాటించాలి. -
'ఉపాధి'లో రికార్డు: సీఎం వైఎస్ జగన్
ఏప్రిల్, మే, జూన్ మొదటి వారం వరకు ఉపాధి పనులు ముమ్మరంగా చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇదే వేగంతో పనులు ముమ్మరంగా చేపట్టాలి. ఉపాధి హామీ పథకాన్ని కలెక్టర్లు ఓన్ చేసుకోవాలి. నాలుగైదు రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా సమీక్షించాలి. జాయింట్ కలెక్టర్లు కూడా ఈ పథకంపై దృష్టి పెట్టాలి. కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఆవశ్యకత ఎంతో ఉంది. ఆగస్టు 15న వీటిని ప్రారంభించాలనుకుంటున్నాం. అందుకే వీలైనంత త్వరగా యుద్ధ ప్రాతిపదికన వీటి నిర్మాణ పనులు పూర్తి చేయాలి. గ్రామ స్థాయిలో ఆరోగ్య శ్రీ రిఫరెల్ పాయింట్‌గా విలేజ్ క్లినిక్స్ ఉంటాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులను రికార్డు స్థాయిలో చేపట్టడం ద్వారా కోవిడ్ కష్ట కాలంలో రూ.5,818 కోట్లు నేరుగా కూలీలకు ఇవ్వగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. తద్వారా కూలీలకు 25.42 కోట్ల పని దినాలను కల్పించి ఆదుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని.. చిన్న రాష్ట్రమైనా, దేశంలో మనం మూడో స్థానంలో ఉండడం గర్వకారణమని అన్నారు. ఇందుకు అందరినీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు. స్పందనలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు పథకాలు, కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల నిర్మాణంలో రెండు, మూడు జిల్లాలు ఇంకా మెరుగు పడాల్సి ఉందని, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆర్బీకేల భవనాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఆలోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని చెప్పారు. ఖరీఫ్ ప్రారంభం సందర్భంగా ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల (బీఎంసీలు) నిర్మాణాలు ఆగస్టు 31 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, సెప్టెంబర్‌లో వీటిని ప్రారంభించబోతున్నామని తెలిపారు. 9,899 చోట్ల బీఎంసీలను ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందులో 3,841 చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల కూడా వెంటనే పనులు మొదలు పెట్టాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. మే నాటికి గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి ► గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు తదితర భవన నిర్మాణాలు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతోంది కాబట్టి, ఈ భవనాల నిర్మాణంపై పూర్తిగా దృష్టి పెట్టాలి. ► గ్రామ సచివాలయాల నిర్మాణంలో కొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఆ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మే నాటికల్లా గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలి. 25 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ► రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందు కోసం 15 ఎకరాల భూమిని గుర్తించాలి. అక్కడ యూనిట్ ఏర్పాటు చేయాలి. ► ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం, ఇతరత్రా పంటలను ప్రాసెస్ చేయడానికి ఈ యూనిట్లు ఉపయోగపడతాయి. రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ కోసం గత సంవత్సరం రూ.4,300 కోట్లు ఖర్చు చేశాం. 90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇవ్వాలి ► ఇప్పటి దాకా 94 శాతం ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయ్యింది. మిగిలిన 1,69,558 ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయడంపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. టిడ్కోలో సుమారు 47 వేల ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలి. ► ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా వారికి ఇంటి పట్టా ఇవ్వాల్సిందే. ► పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లను వెంటనే వెరిఫికేషన్ చేసి, పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి. కొత్తగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి అవసరమైన చోట వెంటనే భూమిని సేకరించాలి. ► ఇళ్ల పట్టాల దరఖాస్తులను తిరస్కరించేటప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నామో కారణం చెప్పగలగాలి. ఒకవేళ దరఖాస్తు తిరస్కరించిన తర్వాత కూడా, తగిన కారణాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి దరఖాస్తులను మళ్లీ రీ వెరిఫికేషన్ చేయాలి. ► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాల కొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ ఆర్ అనురాధ, పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, సివిల్ సప్లైస్ కమిషనర్ కోన శశిధర్, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లిఖార్జున, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు ► ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కింద తొలి విడతలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాం. 8,682 కాలనీల్లో ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుంది. ఆలోగా బోరు, కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ► ఇళ్ల నిర్మాణానికి సన్నాహకంగా మ్యాపింగ్, జియో ట్యాగింగ్, ఏపీ హౌసింగ్ వెబ్సైట్లో లబ్ధిదారుని రిజిస్ట్రేషన్, ఉపాధి హామీ కింద జాబ్ కార్డుల జారీ.. ఈ పనులన్నీ ఏప్రిల్ 10 లోగా పూర్తి చేయాలి. ► గృహాల నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి జిల్లా, డివిజన్ స్థాయి అధికారులను ప్రతి మండలానికీ, ప్రతి మునిసిపాలిటీకి నోడల్ అధికారులుగా నియమించాలి. ప్రతి లే అవుట్లో కచ్చితంగా ఒక మోడల్ హౌస్‌ను నిర్మించాలి. ► దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో వస్తున్న ఇబ్బందులు, నిర్మాణ ఖర్చు ఎంత అవుతుంది అన్న దానిపై అవగాహన వస్తుంది. కట్టిన ఇల్లు ఎలా ఉందో లబ్ధిదారులకు తెలుస్తుంది. ఏప్రిల్ 15 నాటికి మోడల్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్ల సేవలను ఇళ్ల నిర్మాణంలో వినియోగించుకోవాలి. ► లబ్ధిదారులు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం సిమెంట్, స్టీల్, ఇసుక, మెటల్, ఇటుకలు అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలి. నిర్మాణ సామగ్రిలో కచ్చితంగా నాణ్యత ఉండాలి. ఒకవైపు ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగానే.. మరో వైపు కాలనీలో చేపట్టాల్సిన రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు... ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనపై కార్యాచరణ రూపొందించాలి. -
‘స్పందనే’ ప్రామాణికం
సాక్షి, అమరావతి: స్పందన వినతుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, కలెక్టర్ల పని తీరుకు ఈ కార్యక్రమాన్ని ప్రామాణికంగా భావిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పౌరుడు వినతిపత్రం ఇచ్చాక అది పరిష్కారం అయ్యే తీరును నేరుగా అధికారులు, ఉన్నతాధికారులు ట్రాక్ చేయాలని సూచించారు. ఈ ట్రాకింగ్ మెకానిజం చాలా పటిష్టంగా ఉండాలన్నారు. పౌరుల గ్రీవెన్స్‌లను పరిష్కరించకుండా పక్కన పడేసే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. నేరుగా సీఎం కార్యాలయ అధికారులు కూడా గ్రీవెన్స్‌ల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పరిశీలన, సమీక్ష చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలే లక్ష్యంగా మరింత ఆధునీకరించిన స్పందన నూతన పోర్టల్‌ను శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులు.. పరిష్కారానికి అర్హమైనవిగా గుర్తించిన తర్వాత తప్పకుండా వాటిని పరిష్కరించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా పరిష్కారం కాకపోతే అది ఏస్థాయిలో నిలిచిపోయిందన్నది తెలియాలని, సంబంధిత సిబ్బంది, అధికారికి అలర్ట్స్ వెళ్లాలని సూచించారు. ఒకవేళగ్రీవెన్స్‌ను తిరస్కరిస్తున్నప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నారో కచ్చితంగా కారణం చెప్పగలగాలన్నారు. పటిష్టంగా నవరత్నాల అమలు ► నవరత్నాల్లో ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, నవరత్న పథకాల సోషల్ ఆడిట్ సమయంలోనే అర్హులైన వారి పేర్లు రాలేదని తెలిసిన వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ► అయినప్పటికీ ఎవరైనా మిగిలిపోయిన పక్షంలో పథకం అమలు చేసిన తేదీ నుంచి నెల రోజుల పాటు వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు. తర్వాత నెలలో వెరిఫికేషన్ చేసి, మూడో నెలలో వారికి నిధులు విడుదల చేయాలని చెప్పారు. అప్పటితో ఆ స్కీం సంపూర్ణంగా ముగిసినట్టు అవుతుందని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు ► దరఖాస్తు చేసిన 90 రోజుల్లో అర్హులైన వారికి కచ్చితంగా ఇంటి స్థలం పట్టా అందాల్సిందేనని సీఎం పునరుద్ఘాటించారు. నిర్ణీత సమయంలోగా ఇంటి స్థలం పట్టా అందించాల్సిన బాధ్యత అధికారులదే అని చెప్పారు. పింఛన్, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇతరత్రా అన్నీ కూడా నిర్ణీత వ్యవధిలోగా మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ► సుమారు లక్ష వరకు ఇంటి స్థలాల కోసం మళ్లీ దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన కూడా పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం దరఖాస్తులన్నంటినీ కూడా మరోసారి వెరిఫై చేసి, అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ► ఇంటి స్థలాల పట్టాల కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించాలని, వచ్చే నెలలో ఈ దరఖాస్తులకు సంబంధించి రీ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ► ఈ కార్యక్రమంలో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఐటీ, ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి విజయకుమార్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ.మల్లిఖార్జున, ఆరీ్టజీఎస్ సీఈఓ జే విద్యాసాగర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్పందన నూతన పోర్టల్ పనితీరు ఇలా ► పాత పోర్టల్‌లో 2,677 సబ్జెక్టులు, 27,919 ఉప సబ్జెక్టులు ► అప్డేషన్ చేసిన పోర్ట్ల్లో 858 సబ్జెక్టులు, 3,758 ఉప సబ్జెక్టులు ► దీనివల్ల చాలా వరకూ సమయం ఆదా. గ్రామ, వార్డు సచివాలయాలే లక్ష్యంగా రూపకల్పన. పౌరులు నేరుగా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం. ► గ్రామ సచివాలయాలు, కాల్ సెంటర్, వెబ్ అప్లికేషన్, మొబైల్ యాప్, ప్రజా దర్బార్ల ద్వారా వినతులు ఇచ్చే అవకాశం. ► స్వీకరించిన వినతుల్లో అత్యంత తీవ్రమైనవి, తీవ్రమైనవి, సాధారణమైనవిగా వర్గీకరణ. ► వినతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మూడు ఆప్షన్లు. వెబ్ లింక్ ద్వారా, 1902కు కాల్చేసి, గ్రామ సచివాలయాల ద్వారా తెలుసుకునే అవకాశం. ► వినతి పరిష్కారం పట్ల పౌరుడు సంతృప్తి చెందకపోతే తిరిగి మళ్లీ అదే ఫిర్యాదును ఓపెన్ చేసి జిల్లా స్థాయిలో లేదా విభాగాధిపతి స్థాయిలో విజ్ఞప్తి చేయవచ్చు. ► సేవల పట్ల ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారు. వినతుల పరిష్కారంలో నాణ్యత ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహిస్తారు. థర్డ్ పార్టీ ఆడిట్ కూడా జరుగుతుంది. -
ట్రాకింగ్ మెకానిజం పటిష్టంగా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో మరింత ఆధునీకరించిన నూతన స్పందన పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ పౌరుడు వినతిపత్రం ఇచ్చాక అది పరిష్కారం అయ్యే తీరును నేరుగా అధికారులు, ఉన్నతాధికారులు ట్రాక్ చేయాలి. ఈ ట్రాకింగ్ మెకానిజం చాలా పటిష్టంగా ఉండాలి. పౌరులనుంచి గ్రీవెన్స్‌లను పరిష్కరించకుండా పక్కనపడేసే పరిస్థితి ఉండకూడదు. నేరుగా సీఎం కార్యాలయ అధికారులు కూడా గ్రీవెన్స్‌ల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పరిశీలన, సమీక్ష చేయాలి. గ్రీవెన్స్‌ను తిరస్కరిస్తున్నప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నారో కచ్చితంగా చెప్పగలగాలి. అలాగే పౌరుడి నుంచి వచ్చిన గ్రీవెన్స్ పరిష్కారానికి అర్హమైనదిగా గుర్తించిన తర్వాత తప్పకుండా దాన్ని పరిష్కరించాలి. నిర్ణీత సమయంలోగా గ్రీవెన్స్ పరిష్కారం కాకపోతే అది ఏ స్థాయిలో నిలిచిపోయింది అన్నది తెలియాలి. సంబంధిత సిబ్బంది, అధికారికి అలర్ట్స్ వెళ్లాలి. స్పందన వినతుల పరిష్కారమనేది కలెక్టర్ల పనితీరుకు ప్రమాణంగా భావిస్తాం’’ అని అన్నారు. పటిష్టంగా నవరత్నాల అమలు నవరత్నాల్లో ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. నవరత్న పథకాల సోషల్ ఆడిట్ సమయంలోనే అర్హులైన వారి పేర్లు రాలేదని తెలిసిన వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. అయినప్పటికీ ఎవరైనా మిగిలిపోయిన పక్షంలో పథకం అమలు చేసిన తేదీ నుంచి నెలరోజుల పాటు వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలి. తర్వాత నెలలో వెరిఫికేషన్ చేయాలి. వాటిని వెంటనే పరిష్కరించి.. మూడో నెలలో వారికి నిధులు విడుదల చేయాలి. అప్పటితో ఆ స్కీం సంపూర్ణంగా ముగిసినట్టు అవుతుంది. అర్హులందరికీ ఇళ్ల పట్టా దరఖాస్తు చేసిన 90 రోజుల్లో ఇంటి పట్టా అందాలి. కచ్చితంగా 90 రోజుల్లో ఇంటి పట్టా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.నిర్ణీత సమయంలోగా ఇంటిపట్టా అందించాల్సిన బాధ్యత అధికారులదే. దరఖాస్తు చేసిన 90 రోజుల్లోగా ఇంటి పట్టా అందించాలన్నది ప్రభుత్వ కృతనిశ్చయం కాగా, పాత స్పందన పోర్టల్‌లో 2677 సబ్జెక్టులు, 27,919 సబ్ సబ్జెక్టులు ఉండేవి. అప్డేషన్ చేసిన పోర్ట్ల్లో 858 సబ్జెక్టులు, 3758 సబ్ సబ్జెక్టులు ఉన్నాయి. దీనివల్ల చాలావరకూ సమయం ఆదా అవుతుంది. గ్రామ, వార్డు సచివాలయాలు లక్ష్యంగా కొత్త స్పందన పోర్టల్‌లో పౌరులు నేరుగా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. గ్రామ సచివాలయాల ద్వారా కాని, కాల్ సెంటర్ ద్వారా కాని, వెబ్ అప్లికేషన్ ద్వారా కాని, మొబైల్ యాప్ ద్వారా కాని, ప్రజా దర్బార్ల ద్వారా కాని వినతులు ఇచ్చే అవకాశం ఉంది. తీసుకున్న వినతులు అత్యంత తీవ్రమైనవి, తీవ్రమైనవి, సాధారణమైనవిగా వర్గీకరిస్తారు. తాము ఇచ్చిన వినతి లేదా, దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మూడు ఆప్షన్స్ ఉంటాయి. వెబ్ లింక్ ద్వారా లేదా 1902కు కాల్చేసి లేదా, గ్రామ సచివాలయాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తాము చేసిన వినతి పరిష్కారం పట్ల పౌరుడు సంతృప్తి చెందకపోతే తిరిగి మళ్లీ అదే ఫిర్యాదును ఓపెన్ చేసి జిల్లాస్థాయిలో లేదా విభాగాధిపతిస్థాయిలో మళ్లీ విజ్ఞాపన చేయవచ్చు. సేవలపట్ల పౌరుడు నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారు. వినతుల పరిష్కారంలో నాణ్యత ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో సర్వేలు థర్డ్ పార్టీ ఆడిట్‌కూడా జరుగుతుంది. -
బిడ్డ కోసం ఎస్పీ ఎదుట స్టాఫ్‌వేర్ ఇంజినీర్ ఆవేదన
సాక్షి, అనంతపురం : ‘అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాబును తన భర్త వెంకటరెడ్డి, అతని బంధువులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఇదే విషయమై ధర్మవరం డీఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పాలు తాగే పసికందు సార్ అంటూ కాళ్లావేళ్లా పడ్డా కనికరం చూపలేదు. కేసు తీసుకునేది లేదంటూ డీఎస్పీ రమాకాంత్ సార్‌తో పాటు ఇతర పోలీసులు నోటికొచ్చినట్లు మాట్లాడారు. నా బాబుకు రెండేళ్లు సార్.. ఇప్పుడు వాడెలా ఉన్నాడో సార్.. దయచేసి నా బాబు (శశాంక్‌రెడ్డి)ని నాకు ఇప్పించండి’ అంటూ ఎస్పీ బి.సత్యయేసుబాబు ఎదుట బుక్కపట్నం మండలం దూపంపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వినయ బోరున విలపించారు. కొత్త చెరువు సీఐపై ఎస్పీ ఆగ్రహం ఎస్పీ సత్యయేసుబాబు ఆధ్వర్యంలో స్థానిక డీపీఓ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన పోలీస్ స్పందన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటరెడ్డితో పెళ్లై మూడేళ్లయిందని, బాబు పుట్టినప్పటి నుంచి తనను డబ్బు కోసం వేధిస్తున్నాడని ఈ సందర్భంగా బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎస్పీ వెంటనే ధర్మవరం డీఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం కొత్త చెరువు సీఐకు ఫోన్ చేసి వినయ ఘటనపై ఆరా తీశారు. సీఐ చెప్పిన సమాధానంతో ఎస్పీ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ‘ఐదేళ్ల వరకూ బిడ్డ తల్లి వద్ద ఉండాలన్న విషయం నీకు తెలియదా? డూ వాట్ ఐ సే... మొదట బిడ్డను తల్లికి అప్పగించే ఏర్పాటు చేయ్’ అంటూ సీఐను ఆదేశించారు. కాగా, ఎస్పీ స్పందన కార్యక్రమానికి మొత్తం 89 ఫిర్యాదులు అందాయి. చదవండి : ‘దేవుడి అనుగ్రహం కలగాలంటే బిడ్డను బలివ్వాల్సిందే’ అత్యాచారం చేసి.. రూ. 5 చేతిలో పెట్టాడు -
‘స్పందన’ సూపర్
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా అమితంగా ఆకర్షించింది. ‘స్పందన’ స్ఫూర్తితో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పందన కార్యక్రమం పనితీరును పరిశీలించడానికి కర్నాటక అధికారుల బృందం సోమవారం రాష్ట్రంలో పర్యటించింది. సచివాలయంలోని స్పందన మానిటరింగ్ యూనిట్‌ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా స్పందన కార్యక్రమం ఆలోచన ఎలా వచ్చింది? దీన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నారన్న విషయాలను సీఎం కార్యాలయంలోని ప్రత్యేక అధికారి డాక్టర్ హరికృష్ణ, ఆర్టీజీఎస్ సీఈవో విద్యాసాగర్‌లు వారికి వివరించారు. స్పందన కార్యక్రమం సీఎం జగన్ మానసపుత్రిక అని.. ఆ పేరును ఆయనే సూచించారని చెప్పారు. అంతేకాకుండా దాని పనితీరును ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. ప్రజల సమస్యలను ఒక విజ్ఞప్తిగా చూడకుండా.. ఒక ఆదేశంగా భావించాలని చెప్పడమే కాకుండా, ఇందుకు అనుగుణంగా పటిష్ట ఏర్పాట్లు చేసి.. ఇప్పుడు గ్రామ సచివాలయాల వరకు తీసుకువెళ్లారని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న స్పందన కార్యక్రమాన్ని మెచ్చుకున్న కర్ణాటక ప్రభుత్వాధికారులు.. గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా సందర్శించేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. కర్ణాటక అధికారుల బృందంలో ఆ రాష్ట్ర సీఎం ఆఫీస్‌కు సంబంధించి ఈ–గవర్నెన్స్ కార్యక్రమాలు పర్యవేక్షించే ప్రాజెక్టు డైరెక్టర్ జి.రషి్మ, ఈ–గవర్నెన్స్ ప్రోగ్రాం మేనేజర్ కేఎస్ రఘునాథ్, అధికారులు రాజేశ్, భారతి, ప్రైస్ వాటర్ కూపర్స్‌కు చెందిన సౌరభ్, సౌరభ్ భట్ ఉన్నారు. -
ఈ ఏడాదే సీబీఎస్ఈ
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షల్లో అత్యుత్తమంగా రాణించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో 2021 – 22 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆ తరువాత తరగతులకు వరుసగా ఒక్కో ఏడాది పెంచుకుంటూ దీన్ని వర్తింప చేస్తామన్నారు. 12వ తరగతి వరకు సీబీఎస్ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తామన్నారు. దీనికి సంబంధించి ఎఫిలియేషన్ కోసం సీబీఎస్ఈ బోర్డుతో చర్చించి ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. కామన్ సిలబస్ వల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం కావడం సులభంగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఆంగ్లంపై మరింత పట్టు సాధించి మన విద్యార్థులు ఎక్కడైనా రాణించే అవకాశం ఉంటుందన్నారు. ఒత్తిడికి గురి కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇది ఉపకరిస్తుందన్నారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు.. ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, ఇళ్ల పట్టాలు, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలలో నాడు –నేడు, మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు, మెడికల్ కాలేజీలు, ఆర్ అండ్ బీ, వైఎస్ఆర్ బీమా, జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరాతోపాటు ఏప్రిల్‌లో అందించనున్న జగనన్న విద్యా దీవెన, రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ, పొదుపు సంఘాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ, జగనన్న వసతి దీవెన, వలంటీర్లకు సత్కార కార్యక్రమాలపై సమీక్షించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలు, పథకాలపై సీఎం జగన్ ఏమన్నారంటే.. ఉపాధిహామీ పనుల్లో రికార్డు సృష్టించాం.. ఉపాధిహామీ పనుల్లో రికార్డు సృష్టించాం. కలెక్టర్లకు అభినందనలు. మార్చి 15 నాటికి 24.27 కోట్ల పనిదినాలు కల్పించాం. 2020–21 ఆర్ధిక సంవత్సరంలో 25.25 కోట్ల పనిదినాలను చేరుకోబోతున్నాం. దాదాపు రూ.6 వేల కోట్లు ఉపాధిహామీ కింద కూలీలకు ఇవ్వగలిగాం. యుద్ధ ప్రాతిపదికన గ్రామ సచివాలయాల నిర్మాణాలను పూర్తి చేయాలి. 2021 మే నాటికి అన్ని భవనాలూ పూర్తయ్యేలా చూడాలి. ఆర్బీకేలను పూర్తి చేయడంపైనా దృష్టి పెట్టాలి. ఆర్బీకేల ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్‌ను పూర్తి చేయడంపైనా దృష్టి సారించాలి. వీటన్నింటిపైనా కలెక్టర్లు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అమూల్‌తో కలిసి గ్రామాల్లో విప్లవాత్మక చర్యలు అమూల్‌తో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాం. పాడి రైతులకు మంచి ధర వచ్చేలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనివల్ల గ్రామీణఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. బీఎంసీ (బల్క్ మిల్క్ కలెక్షన్ సెంటర్లు), ఏంఎంసీ (ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ సెంటర్లు)ల నిర్మాణాలపై దృష్టిపెట్టాలి. నెలాఖారు కల్లా అన్ని ప్రాంతాల్లో వీటి నిర్మాణం మొదలుపెట్టి ఆగస్టు కల్లా పూర్తిచేయాలి. ఉపాధిహామీ కింద ప్రారంభించిన సీసీ రోడ్లు, డ్రైన్స్ వెంటనే పూర్తి చేయాలి. కొత్తగా 11,334 మందికి వెంటనే ఇళ్ల పట్టాలు అక్కడక్కడా మిగిలిపోయిన ఇళ్ల పట్టాల పంపిణీని వెంటనే పూర్తి చేయాలి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు 90 రోజుల్లోగా ఇళ్ల స్థలాల పట్టాలివ్వాలి. కచ్చితంగా నిర్ణీత సమయంలోగా ఇంటి స్థలం పట్టా అందాల్సిందే. కొత్తగా అర్హులుగా గుర్తించిన 11,334 మందికి పట్టాలను వెంటనే అందించాలి. మిగిలిన దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఏప్రిల్ నుంచి వీరికి అవసరమైన భూముల గుర్తింపు, కొనుగోలు ప్రక్రియలపై దృష్టి పెట్టాలి. ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం తొలివిడతలో 15.60 లక్షల ఇళ్లను నిర్మించబోతున్నాం. దీనికి సంబంధించి అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేయాలి. సన్నాహక పనులను ముమ్మరం చేయాలి. ఏప్రిల్ 15 కల్లా లేఅవుట్లలో కరెంటు, నీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలి. ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుంది. ప్రతి కాలనీలో ఒక మోడల్‌హౌస్ కట్టాలి. తామే ఇల్లు కట్టుకుంటామన్న వారికి నిర్మాణ సామగ్రిని అందించాలి. పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిర్మాణ సామగ్రిని కొనుగోలు చేస్తున్నందున లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంటు, స్టీలు, మెటల్ లభిస్తుంది. దీంతో వారికి మేలు జరుగుతుంది. గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలి. స్కూళ్లలో మార్చి 31కి నాడు – నేడు తొలివిడత పనులు పూర్తి నాడు – నేడు కింద స్కూళ్లలో మొదటి విడతలో చేపట్టిన పనులు మార్చి 31 నాటికి పూర్తి కావాలి. పది రకాల సదుపాయాలు స్కూళ్లకు సమకూరుతున్నాయి. పెయింట్ పనులపై దృష్టి పెట్టాలి. అంగన్ వాడీల్లో నాడు–నేడు.. వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూళ్ల కింద అంగన్వాడీ కేంద్రాల్లో నాడు–నేడు పనులు చేపడుతున్నాం. చిన్నారుల్లో 6 ఏళ్ల లోపు వయసులోనే మెదడు 80 శాతం వరకూ అభివృద్ది చెందుతుంది. అందుకనే ఈ వయసులో ఉన్న చిన్నారులపై దృష్టిపెట్టాం. ప్రీ ప్రైమరీ స్కూళ్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. భవనాల నిర్మాణం కోసం స్థలాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఇవ్వనున్న శిక్షణపై అధికారులు శ్రద్ధ చూపాలి. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు.. ఆర్బీకేల పరిధిలో ఏర్పాటయ్యే మల్టీపర్పస్ సెంటర్ల కోసం 50 సెంట్ల నుంచి ఎకరం వరకూ స్థలం అవసరం. వీలైనంత త్వరగా భూములను గుర్తించి సంబం«ధిత శాఖకు అప్పగించాలి. గోడౌన్లు, కోల్డు స్టోరేజీలు, డ్రైయింగ్ ఫ్లాట్‌ఫాం లాంటి సదుపాయాలు గ్రామాల స్థాయి వరకూ రావాలి. రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు రావాలంటే ఈ సదుపాయాలు ఉండాలి. మెడికల్ కాలేజీల నిర్మాణం.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీని తెస్తున్నాం. బోధనాసుపత్రితోపాటు నర్సింగ్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కాలేజీలకు భూములను గుర్తించి సేకరణ పనులు పూర్తి చేయాలి. పులివెందుల, పిడుగురాళ్ల, అమలాపురం, పాలకొల్లు, ఆదోని, మచిలీపట్నంలలో నిర్మాణాలు ఏప్రిల్‌లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. జాతీయ రహదారులు జాతీయ రహదారుల నిర్మాణానికి భూములను త్వరగా సేకరించడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలి. ఏప్రిల్ 6న వైఎస్సార్ బీమాతో 12,039 మందికి పరిహారం బ్యాంకులు ఎన్రోల్ చేయని కుటుంబాల్లో సహజ మరణాలు, ప్రమాదాల కారణంగా మరణించిన 12,039 మంది నామినీలకు వైఎస్ఆర్ బీమా కింద ఏప్రిల్ 6న పరిహారం చెల్లింపులు చేస్తాం. జగనన్న తోడు అర్హులందరికీ పథకం వర్తించేలా డీసీసీల సమావేశం నిర్వహించాలి. వైఎస్ఆర్ చేయూత, ఆసరాపై దృష్టి పెట్టండి వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాలపై దృష్టి పెట్టండి. 98 శాతం మంది దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన 2 శాతం మందితో కూడా దుకాణాలు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలి. చేయూత, ఆసరా కింద సుస్థిర ఉపాధి మార్గాల కోసం చేపట్టిన ఇతర కార్యక్రమాల్లో బ్యాంకు లింకేజీ ప్రక్రియను ముమ్మరం చేయాలి. ఏప్రిల్‌లో ముఖ్యమైన కార్యక్రమాలు ఇవీ ► ఈ ఏడాది ఏప్రిల్‌కు సంబంధించి పలు కార్యక్రమాల తేదీలను ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ ఈమేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఏవైనా దరఖాస్తులు ఉంటే పరిశీలన చేసి జాబితాలను సచివాలయాల్లో ఉంచాలని సూచించారు. అర్హులకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ► ఏప్రిల్ 9న జగనన్న విద్యాదీవెన ► ఏప్రిల్ 13న ఉగాదిరోజు వలంటీర్లను సత్కరించే కార్యక్రమం ప్రారంభం. ప్రతి రోజూ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు వెళ్లాలి. వలంటీర్లను సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులతో సత్కరించాలి. వలంటీర్లు అందిస్తున్న సేవలను గుర్తించాలి. అది వారికి మరింత ఉత్సాహాన్నిస్తుంది. ► ఏప్రిల్ 16న రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ డబ్బులు ► ఏప్రిల్ 20న డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ డబ్బులు ► ఏప్రిల్ 27న జగనన్న వసతి దీవెన సమీక్షలో పాల్గొన్న మంత్రులు, ఉన్నతాధికారులు.. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతం సవాంగ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ అండ్ బీ ఎం.టి.కృష్ణబాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గృహనిర్మాణశాఖ అజయ్ జైన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్ జి.అనంతరాము, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ.ఆర్.అనురాధ, వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వి ఉషారాణి, కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి ఉదయలక్ష్మి, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సునీత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజాశంకర్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హెచ్.అరుణకుమార్, సివిల్ సఫ్లైస్ కమిషనర్ కోన శశిధర్, సెర్ప్ సీఈఓ రాజబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 6 రోజుల్లో ముగిసే ఎన్నికల ప్రక్రియ సాగదీతతో అభివృద్ధికి ఆటంకాలు ► రాష్ట్ర ఎన్నికల కమిషన్ గతేడాది అర్థాంతరంగా మధ్యలో నిలిపివేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇక కేవలం 6 రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని, అది ముగిస్తే వ్యాక్సినేషన్, పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ► దీన్ని పూర్తి చేయకుండా సాగదీయడంతో అభివృద్ధి పనులకు అవరోధాలు ఎదురవుతు న్నాయని సీఎం జగన్ చెప్పారు. ఆరు రోజుల్లో పూర్తయ్యే ఆ ప్రక్రియను ముగిస్తే మిగతా పనులు సజావుగా సాగుతాయన్నారు. ఆ ఎన్నికలను మధ్యలో నిలిపివేసి దీర్ఘకాలం సాగదీయడం, కోడ్ కారణంగా అభివృద్ధి, వ్యాక్సినేషన్ మందగించాయన్నారు. ► అధికార యంత్రాంగం అంతా ఇతర కార్యక్రమాల్లో ఎక్కువ రోజులు నిమగ్నం కావడంతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా చాలా రోజులుగా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించలేకపోయామన్నారు. -
పేదవాళ్ల ఉసురు తగులుతుంది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభం కార్యక్రమం జనవరి 20 వరకూ కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ 39 శాతం ఇళ్లస్థలాలు పంపిణీ పూర్తైందని పేర్కొన్నారు. 17వేలకు పైగా కాలనీల్లోని 9,668 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్లస్థలాల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పాలనలో పారదర్శకతను తారస్థాయికి తీసుకుని వెళ్లామని, ఇక ముందు కూడా దీనిని కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ మంగళవారం సమీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా.. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభ అంశంపై జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు.(చదవండి: ధాన్యం సేకరించిన పక్షంలోగా చెల్లింపులు) మౌలిక సదుపాయాలు కల్పించాలి ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ‘‘ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గొప్ప కార్యక్రమం జరిగింది. ప్రతి కలెక్టర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది. వారి అందరి దీవెనలు మీకు లభిస్తాయి. నాతోపాటు, మీ అందరికీ కూడా ఈ సంతోషం ఉంటుంది. లే అవుట్స్‌లో ఇంటి నిర్మాణాలు కొనసాగించడం ఒక కార్యక్రమమైతే, వాటిలో మౌలిక సదుపాయలు కల్పించడం మరొక కార్యక్రమం. రోడ్లు, కరెంటు, తాగునీరు.. లాంటి కనీస సౌకర్యాలు కల్పించాలి. కాలనీ పరిమాణాన్ని బట్టి.. ఇతర సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా పెట్టాలి. స్కూళ్లు, అంగన్వాడీలు, పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ లాంటివి రావాలి. కాలనీ పరిమాణం, జనాభా బట్టి వీటిని ఏర్పాటు చేయాలి. ఇందుకు సంబంధించి ఎస్ఓపీని తయారు చేయాలి. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేసరికి అవన్నీపూర్తి కావాలి. ఒక లే అవుట్లో పనులు ప్రారంభించిన తర్వాత అవన్నీ పూర్తికావాలి. కాలనీలో పనులు మొదలుపెట్టిన తర్వాత అందులో ఉన్న అన్ని ఇళ్లనూ పూర్తిచేయాలి. ఒకవేళ అదనంగా ఇళ్ల నిర్మాణాన్ని మంజూరు చేయాల్సి వస్తే.. వెంటనే దానికి అనుగుణంగా మంజూరుచేసి కాలనీలో అన్ని ఇళ్లనూ పూర్తిచేసేలా చర్యలు తీసుకుందాం’’ అని దిశా నిర్దేశం చేశారు. ఆహ్లాదకర వాతావరణం ఉండాలి: సీఎం జగన్ వైఎస్సార్ జగనన్న కాలనీలను మురికివాడలుగా మార్చే పరిస్థితి ఉండకూడదని, ప్రతిచోటా ఆహ్లాదకర వాతావరణం ఉండాలని సీఎం జగన్ అన్నారు. రోడ్లను వినూత్న రీతిలో నిర్మించి, బాగా ఎలివేట్ చేయాలని సూచించారు. వీధి దీపాలు, కరెంటు స్తంభాల ఏర్పాటులో కూడా వినూత్న పద్ధతులను అనుసరించాలని, కాలనీలు కట్టేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్లు శ్రద్ధపెట్టి అన్ని పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. డిజైన్లు, ఇతరత్రా అంశాలపై ఇప్పటికే కొన్ని సూచనలు చేశానని, కలెక్టర్లు దీన్ని సవాల్‌గా తీసుకుని, సమర్థతను నిరూపించుకోవాలని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడితే పేదవాళ్ల ఉసురు తగులుతుంది ప్రతి కాలనీ వెలుపల బస్టాప్ ఉండాలి. బస్టాప్‌ను కూడా హైటెక్ రీతిలో తీర్చిదిద్దాలి. కాలనీ ఎంట్రన్స్కూడా వినూత్నరీతిలో ఉండాలి. పెద్ద పెద్ద లేఅవుట్స్‌లో ఎలా ఉంటాయో.. అలాంటివి ఉండాలి. చెట్లు నాటాలి.. ఒక పద్ధతి ప్రకారం నాటాలి. కాలనీల నిర్మాణంలో మన సంతకం కనిపించాలి. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లాంటి వ్యవస్థలను ఇప్పుడే కల్పించడంపై దృష్టిపెట్టాలి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులనుంచి ఆప్షన్లను వెంటనే తీసుకోవాలి. ఇది త్వరగా చేస్తేనే మనం చేయదగ్గ పనులకు కార్యాచరణ పూర్తవుతుంది. ఆప్షన్లు తీసుకునే కార్యక్రమం కూడా 20వ తేదీ నాటికి పూర్తికావాలి. మ్యాపింగ్, జియో ట్యాగింగ్ కూడా ఏకకాలంలో పూర్తిచేయాలి ఎన్ఆర్ఇజీఎస్ కింద లబ్ధిదారులకు జాబ్‌కార్డులు ఇవ్వడం, వారి పేరుతో బ్యాంకు అక్కౌంట్లను ప్రారంభించడం పూర్తిచేయాలి. పేమెంట్ల విడుదలకు ఏపీ హౌసింగ్ వెబ్‌సైట్‌ను వినియోగించుకోండి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నీటి సరఫరా, కరెంటు చాలా ముఖ్యమైన అంశాలు.. మొదటగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కలెక్టర్లు క్రమం తప్పకుండా రివ్యూలు చేపట్టాలి. కాలనీల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలపై డీపీఆర్‌లు తయారుచేయాలి. చాలా పెద్ద పెద్ద కాలనీలు ఇవి.. కొన్ని చోట్ల నగర పంచాయతీలు చేస్తున్నాం. మురుగునీటిని శుద్ధిచేసే ప్లాంట్లకోసం కూడా డీపీఆర్‌లు తయారుచేయాలి. ప్రతి కాలనీలోనూ ఒక మోడల్ హౌస్‌ను కట్టండి. ఇళ్ల నిర్మాణంలో వినియోగించే మెటీరియల్ నాణ్యత చాలా ముఖ్యమైనది పేదవాళ్ల నుంచి ఎవరైనా అవినీతికి పాల్పడితే అది క్షమించరాని నేరం. అవినీతి జరిగితే పేదవాళ్ల ఉసురు తగులుతుంది. ప్రతి అధికారికీ కలెక్టర్లు కమ్యూనికేట్ చేయాలి. ఇంట్లో కరెంటు సరఫరా కోసం వాడే వైరు కూడా క్వాలిటీతో ఉండాలి. ఇళ్ల నిర్మాణం జరుగుతున్న కాలనీ వరకూ ఇసుక సరఫరా జరిగేలా చూడండి. అలాగే మెటల్ సరఫరా కూడా చూసుకోండి. మెటీరియల్‌కు సంబంధించి టెండర్లను 20వ తేదీనాటికి పూర్తిచేసేలా కలెక్టర్లు చర్యలుతీసుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బందిని, వాలంటీర్ల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. వారికి మంచి శిక్షణ ఇవ్వండి. వీరి సేవలను వినియోగించుకోవడంపై ఎస్ఓపీని తయారుచేయండి. డిజిటల్ అసిస్టెంట్లను, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను, వాలంటీర్లను సేవలను వినియోగించుకోవాలి. -
మీడియాతో డీజీపీ గౌతం సవాంగ్ చిట్‌చాట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డీజీపీ గౌతం సవాంగ్ మంగళవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. పలు అంశాల గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘గత సంవత్సరంలో కష్టపడి పనిచేసిన ఏపీఎస్పీ సిబ్బందిని ప్రోత్సహించేందుకు అవార్డులు ఇచ్చాము. డీజీపీ డిస్క్ అనేది కొత్త అవార్డు. విధుల నిర్వహణలో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన వారికి ఈ అవార్డు. ఏపీఎస్పీ అనేది ఒక పారామిలటరీ ఫోర్స్‌లాగా ఏర్పాటయ్యింది. ఈ ఫోర్స్ స్వాతంత్ర్యం ముందు నుంచీ ఉన్నది. ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఏపీఎస్పీ పనిచేస్తోంది. ఈశాన్య రాష్ట్రాలలో కూడా సేవలందించిన చరిత్ర ఏపీఎస్పీకి ఉంది. పోలీసులకు, సెక్యూరిటీలకు ఏపీఎస్పీ ఒక వెన్నెముక. ఏపీఎస్పీ సేవలు ఉన్నచోట పరిస్ధితులు త్వరగా అదుపులోకి వస్తాయి. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సెక్యూరిటీ వింగ్స్‌కు ఏపీఎస్పీ ఒక వెన్నెముక. ఏపీ సెక్యూరిటి వింగ్ దేశానికే ప్రామాణికం. ఎస్డీఆర్ఎఫ్ కూడా ఏపీఎస్పీలో ఒక భాగమే. ఏపీ పోలీస్ దేశంలోనే ఒక అత్యుత్తమ పోలీస్ ఫోర్స్‌గా గుర్తించబడింది. అవసరమైన అన్ని వనరులు లేకపోయినా ఏపీ పోలీస్ పనిచేస్తోంది. బాధ్యత, పారదర్శకత, ప్రతిభ ప్రదర్శిస్తూ ఏపీ పోలీస్ ప్రతి నిత్యం పనిచేస్తున్నారు’ అని తెలిపారు. (చదవండి: సవాంగ్ స్ఫూర్తితోనే అవార్డు) ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీస్ సర్వీసులను ఉత్తమంగా తయారు చేయడానికి అవసరమైన వనరులు ఇస్తున్నారు. పోలీసు వ్యవస్ధలో వచ్చిన మార్పులతో సామాన్య ప్రజలకు సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి. సామాన్య మానవుడికి పోలీసుల ప్రాధాన్యత తెలియాలి. స్పందన ద్వారా ప్రజలు పోలీసులకు నేరుగా పిటిషన్లు పెట్టుకోవచ్చు.. వీటికి సీఎం కార్యాలయం వరకూ పర్యవేక్షణ ఉంటుంది. స్పందనలో వచ్చే పిటిషన్లలో 52 శాతం మహిళలు ఉన్నారు.. వారి భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. దిశ పోలీసులు చాలా బాధ్యతగా పని చేస్తున్నారు. దిశా ఎస్ ఓ ఎస్ యాప్‌ని ప్రతి మహిళా డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఆన్‌లో ఉంచి మూడుసార్లు ఫోన్ షేక్ చేస్తే వీడియోతో సహా దగ్గరలోని పోలీస్ స్టేషనుకు వెళుతుంది. పోలీస్ సేవా యాప్ ద్వారా ఇప్పటి వరకు 1.05లక్షలకు పైగా ఎఫ్ఐఆర్లు డౌన్లోడ్ చేశారు. ఏపీ పోలీసులకు గత సంవత్సర కాలంలో 108 అవార్డులు వచ్చాయి. ఐసీజేఎస్‌లో దేశంలోనే రెండవ స్ధానం ఏపీ పోలీస్ సాధించింది. రాబోయే రోజుల్లో పోలీసులు మేం ఉన్నాం, మీకోసమే ఉన్నాం అనే నమ్మకం బలహీనవర్గాలకు ఇవ్వాలి. వ్యక్తిగతంగా, అందరం దేశానికే గర్వకారణం అయ్యేలా పనిచేయాలి’ అన్నారు. (34 ఏళ్ల సర్వీసులో ఇదే ప్రథమం: ఏపీ డీజీపీ ) మైక్రోఫైనాన్స్ పై ప్రత్యేక దృష్టి పెడతాం అన్నారు డీజీపీ గౌతం సవాంగ్. మొబైల్ లోన్ యాప్‌లు మహిళల్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. మొబైల్ లోన్ యాప్‌లపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తాం. బాధితులు ధైర్యంగా పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాలి. నోయిడా, ఢిల్లీ, గురుగావ్‌ల నుంచి ఎక్కువగా ఈ యాప్‌లనిర్వహణ జరుగుతున్నట్టు గుర్తించాం. మొబైల్ లోన్‌యాప్‌ల మూలాలను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. -
డిసెంబర్ 25న రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ
-
కరోనా సెకండ్ వేవ్ వస్తోంది
సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోందని, ఇప్పటికే పలు దేశాల్లో వ్యాపించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఢిల్లీ మరోసారి లాక్‌డౌన్‌కు సిద్ధమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మనం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్–19 నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏమన్నారంటే.. యూరప్ మొత్తం వణుకుతోంది ► కోవిడ్ సెకండ్ వేవ్‌తో యూరప్ మొత్తం వణుకుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో వ్యాపిస్తోంది. ఫ్రాన్స్, లండన్‌లో షట్‌డౌన్. అమెరికా కూడా తీవ్ర ఇబ్బంది పడుతోంది. ► అక్కడ మొదలు కాగానే ఇక్కడా వస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ► స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నాం కాబట్టి కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి. ► ప్రస్తుతానికి కోవిడ్ పాజిటవ్ కేసులు తగ్గినా, సెకండ్ వేవ్ వస్తుంది కాబట్టి కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. ► రాష్ట్రంలో ఇప్పుడు రోజూ దాదాపు 75 వేల పరీక్షలు చేస్తున్నాం. కొన్నిరోజుల క్రితమే 90 లక్షల మార్కును దాటేశాం. ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1.7 లక్షలకు పైగా పరీక్షలు చేస్తున్నాం. పాజిటివిటీ రేటు తగ్గింది. కోవిడ్ నివారణకు చేసిన కృషికి కలెక్టర్లకు అభినందనలు. 104 నంబర్‌ను అభివృద్ధి చేయాలి ► 104 నంబర్‌ను సింగిల్ పాయింట్ కాంటాక్ట్‌గా అభివృద్ధి చేయాలి. ► ఈ నంబర్‌పై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలి. ► ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే 30 నిమిషాల్లో బెడ్ కేటాయించాలి.