స్పందన కార్యక్రమాన్ని మరో స్థాయిలోకి తీసుకువెళ్లాలని సీఎం జగన్ పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో వినతి ఇవ్వగానే రశీదు ఇస్తాం, ఇది కంప్యూటర్‌లో రెడ్‌ఫ్లాగ్‌తో వెళ్తుందని ఆయన తెలిపారు. ఫలానా తేదీలోగా దీన్ని పరిష్కరిస్తామని రశీదులో పేర్కొంటామని ఆయన వివరించారు. పరిష్కరించిన తర్వాత సమస్య తీరిందని ఎవరైతే వినతి ఇచ్చారో వారి నుంచి అకనాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలన్నారు.