goutham savaangh
-
‘ఆ ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది’
సాక్షి, విజయవాడ: లాక్డౌన్లో విధులు నిర్వర్తిస్తూ కరోనా తో మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ... బాధిత కుటుంబానికి చెక్ అందజేసినట్లు చెప్పారు. దేశంలోనే యాభై లక్షల పరిహారం ప్రకటించిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అని గౌతమ్‌సవాంగ్ కొనియాడారు. దేశంలోనే అత్యధిక మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. (‘నాడు-నేడు’పై సీఎం జగన్ సమీక్ష) కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు తగవని హితవు పలికారు. వ్యవసాయ కార్యకలాపాలు, పరిశ్రమలకు అనుమతిచ్చినట్లు తెలిపారు. అన్ని శాఖలతో పోలీసుల వారు సమన్వయం చేసుకుంటున్నారని, పోలీసులకి పీపీఈ కిట్లకోసం 2.89 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఇక ఏపీకి విదేశాల నుంచి 28000 మంది, ఢిల్లీ జమాత్ నుంచి 1185 మంది వచ్చారని తెలిపారు. వారందరిని క్వారంటైన్లో ఉంచినట్లు చెప్పారు. (అష్ట దిగ్భందంలో పాతపట్నం) -
‘ఆగిపోయిన వారిని పరీక్షించి అనుమతించాలి’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్- తెలంగాణ సరిహద్దుల్లో బుధవారం జరిగిన ఘటనల నేపథ్యంలో కొత్తగా ఎవరూ ప్రయాణాలు చేయకుండా చూడాలని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అధికారులను కోరారు. అందరి క్షేమం కోసం దేశమంతా లాక్ డౌన్‌గా ఉన్న నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండేలా చొరవ చూపాలని ఆయన తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి ఏపీలోని స్వగ్రామాలకు పయనమై కొంత మంది ఇంకా ఇబ్బందులు పడుతున్న అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడినట్టు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని ఫోన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పారు. (రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న సీఎం జగన్) గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద ఆగిపోయిన విద్యార్థులు, ప్రజలను తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి ఏపీ రాష్ట్రంలోకి అనుమతించేలా చూడాలని ఆయన అధికారులను కోరారు. గుంటూరు రూరల్ ఎస్పీ విజయ్ కుమార్‌తో మాట్లాడిన మంత్రి పరీక్షల అనంతరం అవసరమైతే సమీపంలోని క్వారంటైన్‌కు తరలి వెళ్లేందుకు సుముఖంగా ఉన్న వారందరినీ అనుమతించి, వారికి అత్యవసరమైన సదుపాయాలు అందించాలని సూచించారు. ఇకపై ఎవరూ, ఎక్కడికి ప్రయాణం చేయవద్దని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. (44 మందిని క్వారంటైన్‌కు తరలింపు) ఎటువంటి అత్యవసరమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలనుసారం మెలగడం ప్రతి పౌరుడి బాధ్యతని గౌతమ్‌రెడ్డి చెప్పారు. ప్రజలకు ఏ లోటు లేకుండా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. కరోనాను ఎదుర్కునేందుకు తమ కుటుంబాలు, ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజల కోసం పని చేస్తున్న వారికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిబంధనలన్నీ.. ప్రజల బంధాలు దూరం కాకూడదనే, ఎవరినీ ఇబ్బంది పెట్టాలని కాదని మంత్రి స్పష్టం చేశారు. (కరోనా.. రూ. 70 లక్షలు విరాళమిచ్చిన రామ్‌చరణ్) కరోనా నేపథ్యంలో అశ్రద్ధతో ఒక్కరు బయటికి వచ్చినా తమతో పాటు ఎన్నో ప్రాణాలకు ముప్పు అని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. యువత అజాగ్రత్తగా ఉండకూడదని.. మిమ్మల్ని చూసి కుటుంబాలు, సమాజం ఆచరించే విధంగా ఆదర్శంగా ఉండాలని కోరారు. దయచేసి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని ఆయన చెప్పారు. సామాజిక దూరం తప్పక పాటించాలని, భయపడవద్దని ఇంట్లోనే ఉండాలని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. -
నలు‘దిశ’లా రక్షణ!
సాక్షి, గుంటూరు: “దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ఓ చరిత్ర.. మహిళల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆరు పోలీస్ స్టేషన్లను ఇప్పటికే ప్రారంభించాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిగిలిన 12 స్టేషన్లను ప్రారంభించాం’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన అర్బన్ దిశ పోలీస్ స్టేషన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మహిళల భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం పోలీస్ శాఖ చరిత్రలో ఓ మైలురాయిగా అభివర్ణించారు. మహిళల భద్రత కోసం దిశ ఎస్ఓఎస్ యాప్, దిశ పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చిన 2020 సంవత్సరం “ఉమెన్ సేఫ్టీ’ సంవత్సరంగా నిలుస్తుందన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని చెప్పారు. దిశ చట్టం అమలులోకి వస్తే దిశ పోలీస్ స్టేషన్లు మరింత బలోపేతం అవుతాయన్నారు. దిశ పోలీస్ స్టేషన్లలో మహిళా డీఎస్పీలను నియమించాలనుకున్నామని, అయితే సరిపడా మహిళా అధికారులు అందుబాటులో లేరన్నారు. రాబోయే రోజుల్లో సమస్యను అధిగమించి మహిళా అధికారులను ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేట్ కార్యాలయాన్ని తలపించేలా దిశ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. ప్రతి ఒక్కరూ ఈ–దిశ ఎస్ఓఎస్ యాప్ గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలీసు గౌరవ వందనం స్వీకరణ దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన డీజీపీ ముందుగా పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. గార్డ్ ఆఫ్ హానర్ ఇన్చార్జిగా వ్యవహరించిన ఆర్ఎస్ఐ బాషాను అభినందించారు. అనంతరం మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని ఆవిష్కరించి, పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. దిశ పోలీస్ స్టేషన్లో పోలీసు ఉన్నతాధికారుల విజిటర్స్ బుక్‌లో డీజీపీ తొలి సంతకం చేశారు. అనంతరం మహిళా పోలీసులతో, మహిళా మిత్ర వలంటీర్లతో మాట్లాడారు. కౌన్సిలింగ్ హాల్లో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది, కుటుంబాలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గుంటూరు రేంజ్ ఐజీ జె. ప్రభాకర్‌రావు, డీఐజీ అర్బన్ ఇన్చార్జి ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, రూరల్ జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు, విజిలెన్స్ ఎస్పీ జాషువా, ఏఎస్పీలు గంగాధరం, ఈశ్వరరావు, మనోహర్‌లు, డీఎస్పీలు బి.సీతారామయ్య, బీవీ రామారావు, సుప్రజ, సౌజన్య, బాలసుంధర్‌రావు, రమణకుమార్, ప్రకాశ్‌బాబు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. దిశ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఆర్థిక సాయం చేసిన ఐటీసీ సీఈవో సంజయ్ రంగరస్, డైరెక్టర్ వీరస్వామిను డీజీపీ ప్రత్యేకంగా అభినందిచి, కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు అర్బన్ కమిషనరేట్ ప్రతిపాదన పెండింగ్‌లో ఉందన్నారు. దీనిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, హోం మంత్రి సుచరితతో చర్చించామన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ సన్నద్ధమై ఉందని డీజీపీ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించామన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత పోలింగ్ నిర్వహించడంపై దృష్టి కేంద్రీకరించామని, ప్రతిరోజూ ఎన్నికల నిర్వహణ, బందోబస్తు తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష చేపడుతున్నట్టు పేర్కొన్నారు. -
కలెక్టర్లు మానవతా దృక్పథంతో ఉండాలి: సీఎం జగన్
-
ఆ మాట ఎక్కడా వినిపించకూడదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే అభ్యర్థనలపై పర్యవేక్షణ అవసరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ప్రతిశాఖ కార్యదర్శి తనకు సంబంధించిన అభ్యర్థనలపై పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. నకిలీ మద్యం, అక్రమ ఇసుక తవ్వకాలు లాంటి అంశాలు ఉన్నప్పుడు స్థానిక ఎస్పీకి, అలాగే డీజీపీకి తెలియజేయాలన్నారు. అలాగే వాటిని నిరోధించడానికి ఏర్పాటైన ప్రత్యేక బృందాలకు కూడా అభ్యర్థనలు వెళ్లాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. సమాధానం ఇచ్చి వెనక్కి పంపించాలని.. అలాగే అలర్ట్స్ కూడా పంపించాలని ఆయన తెలిపారు. వచ్చే స్పందన నాటికల్లా ఈ ఏర్పాట్లు ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమాన్ని మరో స్థాయిలోకి తీసుకువెళ్లాలని సీఎం జగన్ పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో వినతి ఇవ్వగానే రశీదు ఇస్తాం, ఇది కంప్యూటర్లో రెడ్‌ఫ్లాగ్‌తో వెళ్తుందని ఆయన తెలిపారు. ఫలానా తేదీలోగా దీన్ని పరిష్కరిస్తామని రశీదులో పేర్కొంటామని ఆయన వివరించారు. పరిష్కరించిన తర్వాత సమస్య తీరిందని ఎవరైతే వినతి ఇచ్చారో వారి నుంచి అకనాలెడ్జ్మెంట్ తీసుకోవాలన్నారు. ఇలా చేయకపోతే జవాబుదారీతనం లేకుండాపోతుందన్నారు. ఈ మార్పులు తప్పనిసరిగా స్పందనలో చేర్చాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనివల్ల వినతులు ఇచ్చేవారు సంతృప్తి చెందుతారని ఆయన తెలిపారు. సమీక్షా సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, అధికారులు పాల్గొన్నారు. (చదవండి: ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ) సిద్ధం చేసిన ప్లాట్లకు లాటరీ నిర్వహించాలి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని సీఎం జగన్ అన్నారు. పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మార్చి 25న పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. మనకు నెలరోజులు సమయం మాత్రమే ఉందని .. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయకపోతే, లక్ష్యాన్ని చేరుకోలేమని సీఎం జగన్ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఇళ్ల పట్టాల కోసం గుర్తించిన భూములను శరవేగంగా అభివృద్ధి చేసి ప్లాట్లు డెవలప్ చేయాలన్నారు. ఇళ్ల పట్టాల కోసం వీలైనంత త్వరగా భూమిని సమీకరించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే సిద్ధం చేసిన ప్లాట్లలో వెంటనే లాటరీ నిర్వహించి ఏ ప్లాటు.. ఏ లబ్ధిదారుడికి చెందిందో ప్రకటించాలన్నారు. భూసేకరణ సమయంలో కలెక్టర్లు మానవతా దృక్పథంతో ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాల రూపంలో మనం మంచి కార్యక్రమం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఫలానా కలెక్టర్ అన్యాయంగా తీసుకున్నాడనే మాట ఎక్కడా వినిపించకూడదని సీఎం జగన్ ఆదేశించారు. కలెక్టర్లు ఉదారంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాల కార్యక్రమంలో సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి వివిధ జిల్లాలకు సీఎస్ సహా సీఎం కార్యదర్శులను నియమిస్తున్నట్లు తెలిపారు. సీఎస్ నీలం సాహ్ని, సీఎం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, ప్రకాష్‌లకు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను అప్పగించామని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లంకు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను అప్పగించారు. రాయలసీమ జిల్లాలను ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోకియా రాజుకు అప్పగించారు. ఉత్తరాంధ్ర జిల్లాలను ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి అప్పగించినట్లు సీఎం జగన్ తెలిపారు. కలెక్టర్లుకు ఏ సహాయం కావాలన్నా సంబంధిత అధికారులను సంప్రదించాలని సీఎం పేర్కొన్నారు. మార్చి 1 కల్లా ఇళ్ల స్థలాల కోసం భూములన్నీ పొజిషన్లోకి తీసుకునేలా చూడాలని సీఎం జగన్ అధికారులను అదేశించారు. ప్లాట్లు మార్కింగ్ చేసి వెంటనే లాటరీ ద్వారా కేటాయించాలన్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో అదనపు లబ్ధిదారులకు ఒకటో తారీఖున పెన్షన్లు, బియ్యం కార్డులు ఇచ్చేలా ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పెన్షన్లు, బియ్యం కార్డులను రీ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచుతామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. పెన్షన్లకు సంబంధించి ఖరారు చేసిన జాబితాలను రేపటి నుంచి శాశ్వతంగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. బియ్యం కార్డులకు సంబంధించి మూడు నాలుగు రోజుల్లో రీవెరిఫికేషన్ పూర్తి చేసి తుది జాబితా సచివాలయాల్లో ఉంచుతామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. రీ వెరిఫై అయిన తర్వాత పెన్షన్లు, బియ్యం కార్డుల లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పనిసరిగా ఉంచాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. హౌస్ హోల్డ్స్ సర్వే, మ్యాపింగ్ పూర్తిచేయాలని ఆయన అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి వాలంటీర్‌కు యాభై ఇళ్ల కేటాయింపుతో క్లస్టర్ మ్యాపింగ్ చేయాలన్నారు. దీని వల్ల డోర్ డెలివరీ పద్ధతిలో ఒకరోజు వ్యవధిలో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న సీఎం జగన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు హాజరు తప్పనిసరి ఉండాలన్నారు. దీంతో తనకు అప్పగించిన యాభై కుటుంబాల బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా తెలుసుకునే అవకాశం ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. ఎస్పీ సెంథిల్‌కు సీఎం జగన్ అభినందనలు మార్చి 1 కల్లా అన్ని దిశ పోలీస్స్టేషన్లూ సిద్ధం కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసు, మహిళా మిత్రలను పెట్టామని తెలిపారు. వారి సేవలను మహిళలు వినియోగించుకోవాలన్నారు. బెల్టు షాపులు, అక్రమ మద్యం తయారీ, ఇంకా ఏదైనా జరిగితే, ఈ మహిళా పోలీసుల నుంచి సమాచారం తెప్పించుకోవాలన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో బెల్టుషాపులు నడుస్తున్నట్టు సమాచారం వస్తోందని సీఎం అధికారులకు తెలిపారు. వివరాలు తెప్పించుకుని కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారును ఆదేశించారు. సంబంధిత జిల్లాల ఎస్పీలు గట్టి సంకేతాలు పంపించాల్సిన అవసరం ఉందన్నారు. బెల్టు షాపులు నిర్వహించే వారికి, అక్రమ మద్యం తయారీ చేసే వారికి భయం రావాలని సీఎం జగన్ అన్నారు. మహిళా పోలీసుల నుంచి కాల్స్ ఎస్పీలకే కాదు, ప్రత్యేక బృందాలకూ వెళ్తాయన్నారు. గ్రామ సచివాలయాలను, మహిళా పోలీసులను, మహిళా మిత్రల వ్యవస్థలను ఎస్పీలు అధీనంలోకి తీసుకోవాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో బాలిక అత్యాచారం, హత్య ఘటన విషయంలో వెంటనే తీర్పు వచ్చిన విషయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ సీఎం జగన్‌కు వివరించారు. పోలీసులు శరవేగంగా పనిచేసి ఛార్జిషీటు వేశారని, గట్టి ఆధారాలను కోర్టు ముందు ఉంచారని డీజీపీ తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌ను ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్‌కు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. -
డయల్ 100 112
సాక్షి, అమరావతి: ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే రక్షించడానికి ఏర్పాటు చేసిన డయల్ 100, డయల్ 112 టోల్ ఫ్రీ నంబర్లను ఒకే గొడుగు కిందకు తేవాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ రెండు నంబర్లకు ఇప్పటివరకు వేర్వేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఉన్నాయి. ఆపదలో ఉన్న మహిళలు ఈ రెండు నంబర్లకు ఒకేసారి ఫోన్ చేస్తే.. రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్ల పరిధిలో ఉన్న పోలీసులు అప్రమత్తమై రక్షిస్తున్నారు. అయితే.. వేర్వేరుగా ఉండటం వల్ల రెండు సెంటర్ల మధ్య సమన్వయలోపం తలెత్తుతోంది. అలా కాకుండా ఈ రెండు టోల్ ఫ్రీ నంబర్లకు కలిపి ఒకే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటే సమయం కలిసి రావడంతోపాటు సమన్వయలోపాన్ని నివారించవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం చొరవతో పోలీస్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఈ విషయంపై మూడు రోజుల కిందట మంగళగిరిలో అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 100, 112కు ఎవరు ఫోన్ చేసినా ఒకే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వచ్చేలా చేయడంతోపాటు అందుకు అనుగుణమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించాలని ఆదేశించారు. కాగా, దిశ ఘటన జరిగాక ఈ రెండు నంబర్లకు ఫోన్ కాల్స్ బాగా పెరిగాయి. డయల్ 100 రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డయల్ 100కు నేరుగా ఫోన్ (వాయిస్ కాల్) చేసి సమస్యను వివరించాల్సి ఉంటుంది. ఈ నెంబర్‌కు రోజుకు 18 వేల నుంచి 20 వేల కాల్స్ వస్తున్నాయి. వీటిని స్వీకరించే కమాండ్ కంట్రోల్ సిబ్బంది ఆయా జిల్లాల ఎస్పీలకు సమాచారం అందిస్తారు. బాధితులకు తక్షణ సాయం అందించేలా చర్యలు చేపడతారు. డయల్ 112 కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో దేశమంతా నిర్వహిస్తున్న డయల్ 112కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు మహిళలు ఉన్న చోటు, ఫోన్ నెంబర్, చిరునామా అన్నీ నమోదవుతాయి. ఈ వివరాల ఆధారంగా కమాండ్ కంట్రోల్ సిబ్బంది తిరిగి ఫోన్ చేసి సమస్య అడిగి సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేస్తారు. దీనికి రోజూ 3.50 లక్షల కాల్స్ వస్తున్నాయి. రాష్ట్రంలో శనివారం నాటికి 56,142 మంది ‘డయల్ 112 ఇండియా’ మొబైల్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నారు. వీరిలో 32 వేల మంది మహిళలే ఉండటం విశేషం. ఫోన్లో నేరుగా 112కు సందేశం పంపడంతోపాటు యాప్ ద్వారా కూడా డయల్ చేయొచ్చు. ఈ రెండూ కలిపి.. ప్రస్తుతం వాయిస్, మిస్డ్ కాల్‌తోపాటు ఐడియా నెట్వర్క్ నుంచి మాత్రమే మెసేజ్ వెళ్లే వెసులుబాటు ఉంది. రానున్న రోజుల్లో ఆపదలో ఉన్నవారు అన్ని మొబైల్ నెట్‌వర్క్‌ల నుంచి మెసేజ్ ఇచ్చే అవకాశం కల్పించనున్నారు. అలాగే మిస్డ్‌కాల్ ఇస్తే చాలు ఆటోమేటిగ్గా జీపీఆర్ఎస్ అనుసంధానంతో ట్రాకింగ్ చేసేందుకు వీలుగా వారిని త్వరగా చేరుకునే ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా టోల్ ఫ్రీ నంబర్లకు వచ్చే ఫోన్ నుంచి మొబైల్ వీడియో ఆప్షన్ ఆన్ అయ్యి సుమారు 10 సెకండ్ల వీడియో చిత్రీకరణ జరిగేలా కూడా సాంకేతికంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల బాధితులకు తక్షణ సాయం అందించడంతోపాటు నేర స్థలంలో సాక్ష్యాలు, నేరస్తులను గుర్తుపట్టేందుకు వీలుంటుందని పోలీస్ శాఖ భావిస్తోంది. అన్ని సేవలకు ఒకే నంబర్ – డీజీపీ గౌతమ్ సవాంగ్ డయల్ 100, డయల్ 112 టోల్ ఫ్రీ నంబర్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జీపీఎస్ సిస్టమ్ అమర్చిన 1500 పోలీస్ వాహనాలు బాధితులకు తక్షణ సాయం అందిస్తున్నాయి. రెండు టోల్ ఫ్రీ నంబర్లను ఒకే గొడుగు కిందకు తెస్తే మరింత బాగా సేవలు అందించవచ్చని గుర్తించాం. 100, 112లలో దేనికి ఫోన్ చేసినా ఒకే చోటకు కాల్ వచ్చేలా చేయడంతోపాటు వాటిని సాంకేతికంగా మరింత అభివృద్ది చేస్తాం. రానున్న రోజుల్లో అన్ని సేవలకు ఒకే నంబర్ ఉండేలా దశలవారీగా చర్యలు తీసుకుంటాం. -
‘టెక్నాలజీకి రెండు వైపులా పదును ఉంటుంది’
సాక్షి, విజయవాడ : ఆధునిక టెక్నాలజీ ద్వారా అభివృద్ధి ఎంత జరుగుతుందో మోసాలు సైతం అదేవిధంగా పెరిగిపోతున్నాయని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. టెక్నాలజీని తమ పిల్లలు ఎలా ఉపయోగిస్తున్నారో తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని ఆమె సూచించారు. గురువారం విజయవాడలో మహిత ప్లాన్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘మహిళలపై సైబర్ నేరాలు, తీసుకోవాల్సిన చర్యలు’పై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సుచరిత, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మహిళలపై సైబర్ నేరాలు’ పుస్తకాన్ని హోంశాఖ మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..టెక్నాలజీ పెరిగిపోవడంతో మోసాలు చేసే వారి బారిన పడి మహిళలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోసగాళ్లు రకరకాల వీడియోలు తీసి పిల్లలను బెదిరిస్తున్నారని, బ్యాంకు అకౌంట్ల ద్వారా మాయ చేస్తున్నారన్నారు. మహిళా మిత్ర ద్వారా మహిళలకు రక్షణ ఏర్పడుతుందని, ఒక ఫోన్‌కాల్ చేసి వారి సమస్యలను పరిష్కరించే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. టెక్నాలజీని మంచికి ఉపయోగించేలా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలని హితవు పలికారు. మహిళల సమస్యలపై పూర్తిగా సహకరిస్తాం మహిళలపై జరిగే నేరాలు అదుపు చేసేందుకు అనేక చట్టాలు వచ్చినప్పటికీ మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మహిళా మిత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. సైబర్ మిత్ర వల్ల ఏ మహిళ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వరకు రానవసరం లేదని స్పష్టం చేశారు. మహిళల సమస్యలపై పూర్తిగా సహకరిస్తామని, స్పందన కార్యక్రమం ద్వారా 52 శాతం మంది మహిళలు ధైర్యంగా తమకు జరుగుతున్న అన్యాయాల గురించి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. టెక్నాలజీకి మంచి, చెడు రెండు వైపులా పదును ఉంటుందని, దురదృష్టవశాత్తు ఎక్కువ నేరపూరిరతవైపే టెక్నాలజీ వాడకం పెరిగిపోయిందని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని సోషల్ మీడియా ద్వారా ఆడవాళ్లపై అత్యాచారాలు పెరుగుతున్నాయని, సైబర్ క్రైం వ్యవస్థ తమ శాయశక్తుల నేరాలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉందని పేర్కొన్నారు. -
పటేల్ కృషి మరువలేనిది: డీజీపీ సవాంగ్
సాక్షి, విజయవాడ: జాతీయ సమైఖ్యతా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ‘రన్ ఫర్ యూనిట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, కలెక్టర్ ఇంతియాజ్, సీసీ ద్వారక తిరుమలరావుతో పాటు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ హజరయ్యారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ సందర్బంగా పోలీసుల చేత దేశ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంటామంటూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఏకం చేయండంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ కృషి మరువలేనిదని అన్నారు. పోలీసులు కుడా వివిధ విభాగాల్లో కలిసి పనిచేయడం వల్ల మంచి పురోగతి సాధిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేస్తే ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. కాగా విద్యార్ధి దశ నుంచే ఐక్యతా భావం పెంపోందించాలని ఆయన సూచించారు. అనంతరం బెంజిసర్కిల్ నుంచి సీఏఆర్ గ్రౌండ్ వరకు సాగనున్న సమైక్యత పరుగుకు డీజీపీ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ సమైక్యత పరుగులో పోలీసులతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఇక సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు ‘ఏక్తా దినోత్సవం’ లో భాగంగా ‘రన్ ఫర్ యూనిట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ నుంచి కోనేరు సెంటరు వరకు ఈ ఐక్యత పరుగును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు. -
పోలీసులు ప్రజా సేవ కోసమే
-
నెల్లూరు ఘటనపై సీఎం ఆరా
-
అజ్ఞాతంలోనే మాజీ విప్ కూన
సాక్షి, ఆమదాలవలస, (శ్రీకాకుళం) : మాజీ విప్ కూన రవికుమార్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. రెండు రోజులుగా పోలీసులు గాలిస్తున్నా ఆయన ఆచూకీ దొరకడం లేదు. అయితే ఆయనతో పాటు కేసులో ఉన్న పదకొండు మందిలో పది మంది పోలీసులకు లొంగిపోయారు. మరో వ్యక్తి మాత్రం కూనతోపాటే అజ్ఞాతంలో ఉన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలోకి జొరబడి ప్రభుత్వ అధికారులపై దుర్భాషలాడినందుకు కూనతో పాటు 11 మందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై రెండు రోజు లుగా విచారణ నిర్వహిస్తున్నారు. నిందితుల స్వగ్రామాలు కూనజమ్మన్నపేట, తెలికిపెంట, వ్యాసులపేట, పెద్దసవలాపురం, రొట్టవలస, సింధువాడ, సరుబుజ్జిలి, చిగురువలస గ్రామాల్లో సోదాలు కూడా నిర్వహించారు. నిందితుల కుటుంబ సభ్యులను కూడా పూర్తిస్థాయిలో విచారణ చేశారు. ఎట్టకేలకు బుధవారం మధ్యాహ్నం టీడీపీ నాయకులు కళా వెంకటరావు, చౌదరి బాబ్జీరావులు ఆమదాలవలస పోలీస్ సర్కిర్ కార్యాలయంలో డీఎస్పీ చక్రధరరావు ఎదుట పది మంది నిందితులను హాజరుపరిచారు. కూన అమ్మినాయుడు, కూన సంజీవరావు, నందివాడ గోవిందరావు, పల్లి సురేష్, గండెం రవి, తాడేల రమణ, యండ రామారావు, గుర్రాల చినబాబు, ఊడవల్లి రామకృష్ణ, బాన్న గురువులు హాజరయ్యారు. ఈ కేసులో అంబళ్ల రాంబాబు, కూన రవికుమార్‌లు పరా రీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారిని ఆమదాలవలసలోగల సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. జూనియర్ సివిల్ జడ్జి బి.జోత్సత్న తీర్పునిస్తూ వీరికి 14 రోజులు రిమాండ్‌కు పంపించారు. నిందితులను సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం సబ్‌జైల్‌కు తరలించారు. టీడీపీ కార్యకర్తల హడావుడి నిందితులను పోలీస్‌స్టేషన్, కోర్టుకు తరలిస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తలు హడావుడి చేశారు. వీరికి బెయిల్ వస్తుందని ఆశించినా అలా జరక్కపోవడంతో అవాక్కయ్యారు. రిమాండ్‌కు తరలించడంతో ఇక నుంచి గొడలకు దూరంగా ఉండాలని, ఇలా సమావేశాలకు వెళ్లి తమ భవిష్యత్లు పాడు చేసుకోకూడదని పలువురు చర్చించుకున్నారు. తమ నాయకుడు కూన రవికుమార్ వారితో కోర్టుకు హాజరు కాకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కూడా నాయకుడి అండదండలు కార్యకర్తలకు లభించలేదని వారంతా చర్చించుకున్నారు. విశాఖలో ఉన్నారా..? ఎంపీడీఓపై దురుసుగా ప్రవర్తించి కేసు ఎదుర్కొంటున్న మాజీ విప్ కూన రవికుమార్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. బుధవారం ఆయన అనుచరులు పది మంది స్వచ్ఛందంగా లొంగి పోయారు. కానీ మాజీ విప్ మాత్రం జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని పరారీలోనే ఉండిపోయినట్లు సమాచారం. పోలీసులు ఆమదాలవలస, పొందూరు, శ్రీకాకుళం తదితర ప్రాంతా ల్లో నిఘా వేసి ఉంచారు. వాహనాలు కూడా తనిఖీ చేస్తున్నారు. దీనికి బెదిరిపోయిన కూన విశాఖపట్టణంలోని గాజువాక, పెందుర్తి ఏరి యాల్లో మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పల్లా సత్యనారాయణ ఇళ్లలో తలదాచుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిఘా వర్గాలు, ప్రత్యేక బలగాల సాయంతో పోలీసులు వేట ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడతోపాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. స్థానికంగా చేసిన బెయిల్ ప్రయత్నాలు విఫలం కావడంతో అమరావతి స్థాయిలో ఉన్న న్యాయవాదుల ద్వారా టీడీపీ సీనియర్ నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. కూన ఇంటి వద్ద ఉద్రిక్తత శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న మాజీ విప్ కూన రవికుమార్ ఇంటి వద్ద బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ చక్రవర్తి ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, పది మంది పోలీసులు ఆ ఇంటిని తనిఖీ చేసేందుకు వచ్చారు. రవికుమార్ భార్య ప్రమీలతోపాటు ఆయన బంధువులు, అనుచరులు పోలీసులను అడ్డుకున్నా రు. సెర్చ్ వారెంట్ చూపించాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో లోపలికి వెళ్లి పరిశీలించారు. అయితే పూర్తి స్థాయిలో తనిఖీ చేయనివ్వకపోవడంతో ఒకటి రెం డు గదులను మాత్రమే తనిఖీ చేశారు. అక్కడ రవికుమార్ లేకపోవడంతో వెళ్లిపోయారు. అనంతరం రవికుమార్ భార్య కూన ప్రమీల మాట్లాడుతూ పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు చేయడాన్ని తప్పుబట్టా రు. ఇది సరైన విధానం కాదన్నారు. తమ ప్రత్యర్థులే కక్ష గట్టి ఇలా చేయిస్తున్నారని ఆరోపించారు. తాము కూడా రాజకీయాల్లో ఉన్నామని, తన భర్త ఉన్నత పదవిలో కూడా పనిచేశారని, అలాంటి వ్యక్తిని వేధించాలని చూడడం సరి కాదన్నారు. పోలీస్‌స్టేషన్ వద్ద నిందితులను తీసుకువస్తున్న పోలీసులు, అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలుకూన వ్యవహారంపై డీజీపీ ఆరా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ వ్యవహారంపై ఆరా తీశారు. బుధవారం ఆయన ఎస్పీ అమ్మిరెడ్డితో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై ఎస్పీకి సూచనలు ఇచ్చారు. త్వరితగతిన ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా చూడాలని ఆదేశించారు. -
ఆయనకు వ్యతిరేకంగా మంత్రి లోకేష్ కోటరీ
డీజీపీ పోస్టు దక్కక అసంతృప్తితో ఉన్న విజయవాడ సీపీ గౌతం సవాంగ్ తదుపరి పోస్టింగ్ ఏమిటి? ఆయన ఆశిస్తున్నట్లుగా ఏసీబీ డీజీ పోస్టు అయినా దక్కుతుందా లేదా?.. అందుకు కూడా మంత్రి లోకేష్ అడ్డుపడితే ఇక ఆయన కేంద్ర సర్వీసుకు వెళ్లిపోతారా ? ప్రస్తుతం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన వ్యవహారం ఇదే. సీపీ గౌతం సవాంగ్ సీఎం చంద్రబాబుతో బుధవారం భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. విజయవాడ కొత్త సీపీ ఎవరో అన్నది కూడా తేలాల్సి ఉంది. అదనపు డీజీ స్థాయి అధికారి అయితే ద్వారకా తిరుమలరావు, నళినీ ప్రభాత్ ... ఐజీ స్థాయి అధికారి అయితే మహేష్ చంద్ర లడ్హా, రవిశంకర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సాక్షి, అమరావతిబ్యూరో : దాదాపు ఖరారైందనుకున్న డీజీపీ పోస్టు చివరి నిమిషంలో చేజారిపోవడంతో సీపీ గౌతం సవాంగ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆయన్ను మరో పోస్టుకు బదిలీ చేయడం దాదాపు ఖాయమైంది. ఏసీబీ డీజీగా వెళ్లాలని సవాంగ్ భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండే డీజీ క్యాడర్ పోస్టులు రెండే ఉన్నాయి. ఒకటి డీజీపీ కాగా మరొకటి ఏసీబీ డీజీ. డీజీపీగా అవకాశం రానందున ఏసీబీ డీజీగా వెళ్లేందుకే సవాంగ్ మొగ్గుచూపిస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఏసీబీ వ్యవస్థను మంత్రి లోకేష్ ప్రభావితం చేస్తుండటం గమనార్హం. మంత్రి లోకేష్‌తో ఏర్పడిన సాన్నిహిత్యమే ఆర్.పి.ఠాకూర్‌కు సానుకూలంగా మారి డీజీపీగా ఎంపికకు దారితీసిందనే విమర్శలున్నాయి. మరి ఏసీబీ డీజీగా సవాంగ్ నియామకానికి మంత్రి లోకేష్ మొగ్గుచూపుతారా అన్నది ప్రశ్నార్థకమే. సవాంగ్‌ను రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా నియమించాలని లోకేష్ కోటరీ సూచిస్తోంది. ఏసీబీ డీజీ పోస్టు కూడా రాకపోతే గౌతం సవాంగ్ మరింత అసంతృప్తికి గురికావడం ఖాయం. అదే జరిగితే ఆయన కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. సీఎంను కలిసిన సవాంగ్... సీపీ గౌతం సవాంగ్ బుధవారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. డీజీపీ ఎంపిక తరువాత ఆయన సీఎంను కలవడం ఇదే తొలిసారి. ఆయన సోమవారం విజయవాడలో నిర్వహించిన హోంగార్డుల ఆత్మీయ సమావేశానికి కూడా హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబుతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సవాంగ్‌ను ఏ పోస్టుకు బదిలీ చేయాలని భావిస్తున్నామో అన్నదానిపై సీఎం సూచనప్రాయంగా చెప్పి ఉంటారని తెలుస్తోంది. చర్చనీయాంశంగా కొత్త సీపీ నియామకం... గౌతం సవాంగ్‌ను బదిలీ చేస్తే ఆయన స్థానంలో విజయవాడ కొత్త సీపీ ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. సీఐడీ అదనపు డీజీ ద్వారకా తిరుమల రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉండే విజయవాడ సీపీగా వచ్చేందుకు ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. ఆక్టోపస్ అదనపు డీజీగా ఉన్న నళినీ ప్రభాత్ పేరును పరిశీలించే అవకాశాలున్నాయి. మరోవైపు క్యాడర్ తగ్గంచి విజయవాడ సీపీగా ఐజీ స్థాయి అధికారిని నియమించాలన్న అంశం కూడా పరిశీలనలో ఉంది. ప్రభుత్వం రెండున్నరేళ్ల కిందట విజయవాడ సీపీ పోస్టును అదనపు డీజీ స్థాయికి పెంచింది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి సీఆర్డీఏ ప్రాంతాన్ని చేర్చడంతోపాటు జగ్గయ్యపేట వరకు విస్తరించాలనే ఉద్దేశంతోనే అలా చేశారు. రాజధాని నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో సీఆర్డీఏ ప్రాంతంలో కార్యకలాపాలు పెరగలేదు. గుంటూరు జిల్లా టీడీపీ నేతలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. దీంతో విజయవాడ కమిషనరేట్ పరిధిని విస్తరించలేదు. విజయవాడ సీపీ క్యాడర్‌ను అదనపు డీజీ స్థాయి నుంచి ఐజీ స్థాయికి తగ్గించాలనే ప్రతిపాదన ఉంది. అదే జరిగితే ఐజీ స్థాయి అధికారినే సీపీగా నియమిస్తారు. అందుకోసం ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న మహేష్ చంద్ర లడ్హా, డ్రగ్స్ కంట్రోల్ విభాగం ఐజీ రవిశంకర్ పేర్లు పరిశీలనలోకి వస్తాయి. ప్రస్తుత సీపీ గౌతం సవాంగ్ బదిలీ, కొత్త సీపీ నియామకంపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. -
పడవ ప్రమాద నిందితుల అరెస్ట్
సాక్షి, విజయవాడ: ఫెర్రీ బోటు ప్రమాద ఘటనకు కారణమైన ఏడుగురి నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. కొండలరావు, బోటు డ్రైవర్ గేదెల శ్రీను, శేషగిరిరావు స్నేహితులు. గేదెల శ్రీను భార్య లక్ష్మి, నీలం శేషగిరిరావు, కొండలరావుల పేరిట రివర్‌బోటింగ్ అడ్వంచర్స్ సంస్థను ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ గౌతం సవాంగ్ తెలిపారు. ప్రమాదానికి గురైన పడవలో టూరిజం అధికారుల పెట్టుబడులున్నట్లు చెప్పారు. పున్నమిఘాట్- వెంకటాయపాలెం వరకు మాత్రమే అనుమతి ఉందని, అనుమతి లేకుండా పవిత్రసంగమం వరకు బోట్లను నడిపారని అన్నారు. బోటు సామర్థ్యం 25 మంది కాగా 44 మందిని ఎక్కించారని సీపీ వెల్లడించారు. ఇక మూడు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
విందు వివాదంపై స్పందించిన రామ్ చరణ్
హైదరాబాద్: విందు వివాదంపై సినీ హీరో రామ్ చరణ్ స్పందించారు. శనివారం రాత్రి తన ఇంట్లో ఫ్యామిలీ డిన్నర్ మాత్రమే చేశామని, చుట్టుపక్కలవారికి ఇబ్బంది కలిగించినట్టు వచ్చిన వార్తలు ఆశ్చర్యం కలిగించాయని వివరణ ఇచ్చారు. ఇరుగు పొరుగు వారిని గౌరవిస్తానని, వారి ఏకాగ్రతకు భంగం కలింగించేలా ప్రవర్తించనని రామ్ చరణ్ తెలిపారు. ఈ మేరకు ఫేస్బుక్లో పేర్కొన్నారు. పక్కింటివారికి అసౌకర్యం కలిగించినట్టు వచ్చిన వార్తలు అసత్యమని రామ్ చరణ్ కొట్టిపారేశారు. రామ్‌చరణ్ జూబ్లీహిల్స్ రోడ్ నం.25లోని తన నివాసంలో శనివారం రాత్రి స్నేహితులకు ఇచ్చిన విందు వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కొడుకు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడు, మరో ఇద్దరు స్నేహితులు పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి. వీరి అరుపులు, కేకలతో స్థానికులకు చికాకు కలిగించారు. రామ్ చారణ్ ఇంటి పక్కనే నివాసముంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ 100కు ఫోన్‌చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సినీ నటుడు రామ్‌చరణ్ విందు వివాదం
-
సినీ నటుడు రామ్‌చరణ్ విందు వివాదం
పోలీసులకు ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ ఫిర్యాదు హైదరాబాద్: సినీ హీరో రామ్‌చరణ్ తేజ్ తన ఇంటి వద్ద స్నేహితులకు ఇచ్చిన విందు వివాదానికి దారితీసింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.25లో నివసించే రామ్చరణ్నివాసంలోని టైపై శనివారం రాత్రి ప్రారంభమైన విందు ఆదివారం తెల్లవారుజాము వరకు సాగింది. ఇందులో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కొడుకు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడు, మరో ఇద్దరు స్నేహితులు పాల్గొన్నారు. వారు అరుపులు, కేకలతో స్థానికులకు చికాకు కలిగించారు. ఆ ఇంటి పక్కనే నివాసముంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ 100కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ ఎస్ఐ కె. రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని విందు కార్యక్రమాన్ని ఆపేయాలని రామ్‌చరణ్‌ను కోరగా అందుకాయన నిరాకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.