
సాక్షి, విజయవాడ: ఫెర్రీ బోటు ప్రమాద ఘటనకు కారణమైన ఏడుగురి నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. కొండలరావు, బోటు డ్రైవర్ గేదెల శ్రీను, శేషగిరిరావు స్నేహితులు. గేదెల శ్రీను భార్య లక్ష్మి, నీలం శేషగిరిరావు, కొండలరావుల పేరిట రివర్‌బోటింగ్ అడ్వంచర్స్ సంస్థను ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ గౌతం సవాంగ్ తెలిపారు. ప్రమాదానికి గురైన పడవలో టూరిజం అధికారుల పెట్టుబడులున్నట్లు చెప్పారు.
పున్నమిఘాట్- వెంకటాయపాలెం వరకు మాత్రమే అనుమతి ఉందని, అనుమతి లేకుండా పవిత్రసంగమం వరకు బోట్లను నడిపారని అన్నారు. బోటు సామర్థ్యం 25 మంది కాగా 44 మందిని ఎక్కించారని సీపీ వెల్లడించారు. ఇక మూడు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment