
సినీ నటుడు రామ్‌చరణ్ విందు వివాదం
పోలీసులకు ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ ఫిర్యాదు
హైదరాబాద్: సినీ హీరో రామ్‌చరణ్ తేజ్ తన ఇంటి వద్ద స్నేహితులకు ఇచ్చిన విందు వివాదానికి దారితీసింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.25లో నివసించే రామ్‌చరణ్‌నివాసంలోని టైపై శనివారం రాత్రి ప్రారంభమైన విందు ఆదివారం తెల్లవారుజాము వరకు సాగింది. ఇందులో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కొడుకు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడు, మరో ఇద్దరు స్నేహితులు పాల్గొన్నారు. వారు అరుపులు, కేకలతో స్థానికులకు చికాకు కలిగించారు. ఆ ఇంటి పక్కనే నివాసముంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ 100కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ ఎస్‌ఐ కె. రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని విందు కార్యక్రమాన్ని ఆపేయాలని రామ్‌చరణ్‌ను కోరగా అందుకాయన నిరాకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.