శర్వానంద్ హీరోగా, సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
శర్వానంద్ కెరీర్‌లోని ఈ 37వ సినిమా ఫస్ట్‌లుక్‌ను సంక్రాంతి శుభాకాంక్షలతో హీరోలు బాలకృష్ణ, రామ్‌చరణ్ కలిసి విడుదల చేశారు. ‘‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రీకరణ జరుగుతోంది. జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్‌గా ఈ చిత్రం ఆడియన్స్ ను అలరిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సహ–నిర్మాత: అజయ్ సుంకర.
మురారి వినోదం
Published Thu, Jan 16 2025 4:38 AM | Last Updated on Thu, Jan 16 2025 4:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment