శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శర్వా 37’ (వర్కింగ్ టైటిల్). ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో హీరోయిన్‌గా సాక్షీ వైద్యని ఖరారు చేసినట్లు ప్రకటించారు మేకర్స్. ‘ఏజెంట్, గాండీవధారి అర్జున’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సాక్షీ వైద్య సుపరిచితురాలే. తాజాగా శర్వానంద్‌కి జోడీగా నటిస్తున్నారామె.
ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా బుధవారం(జూన్ 19) సాక్షీ వైద్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ సెట్‌లోకి స్వాగతించింది యూనిట్. ‘శర్వా 37’లో ఆర్కిటెక్ట్ నిత్య పాత్రలో సాక్షీ వైద్య నటిస్తున్నారు. ‘‘పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: జ్ఞానశేఖర్ వీఎస్.
Comments
Please login to add a commentAdd a comment