SAMYUKTA
-
వాడిన విరులూ పరిమళిస్తాయి
అమ్ముడుపోని పూలు ఏమవుతాయి? కొనేవాళ్ల కోసం ఎదురు చూసే సహనం పూలమ్మాయికి ఉంటుంది, కానీ పూలకు ఉండదు. రెక్కలు విచ్చుకోవడం, ఆ రెక్కలు వాలిపోవడంలో అవి వాటి సమయాన్ని క్రమం తప్పనివ్వవు. మార్పుకు నాంది పూలసాగు రైతుల జీవితాలను సువాసనభరితం చేస్తోందా? మొక్కనాటి, నీరు పెట్టి, ఎరువు వేసి పెంచిన మొక్కలు మొగ్గతొడిగితే ఆనందం. ఆ మొగ్గలు విచ్చేలోపు కోసి మార్కెట్‌కు చేర్చాలి. తెల్లారేటప్పటికి నగరంలోని మార్కెట్‌కు చేరాలంటే పూలను కోసే పని అర్ధరాత్రి నుంచి మొదలవ్వాలి. ఆ సమయంలో ΄పొలంలో పనికి వచ్చే వాళ్లు ఉండరు. వచ్చినా రెండింతల కూలి ఇవ్వాలి. సాగు ఖర్చులు, రవాణా ఖర్చులు, తన శ్రమ కలిపి ధర నిర్ణయించుకోవాలి. చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. మార్కెట్లో పూలు ఎక్కువై΄ోయి డిమాండ్ తగ్గిన రోజుల్లో పూలు కోయడానికిచ్చే కూలి కూడా గిట్టదని ఆ పూలను చెట్లకే వదిలేస్తుంటారు. ఇంజనీరింగ్ టెక్నాలజీతో పరిమళాలను మట్టిపాలు కాకుండా కాపాడుతున్నారు కేజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ సంయుక్త. తక్కువ ఖర్చులో ఆటోమేటిక్ ఇన్సెన్స్ మేకింగ్ మెషీన్‌కు రూపకల్పన చేశారామె. ఇంజనీర్ సమాజంలో మార్పు తీసుకువచ్చే చేంజ్‌మేకర్ కావాలనే ఆశయాన్ని ఆచరణలో పెట్టారామె. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో పరిశోధన చేస్తున్న సంయుక్త పర్యావరణహితమైన ఆవిష్కరణ కోసం గ్రామాల బాట పట్టారు. ఈ మెషీన్ రూపకల్పనకు దారి తీసిన కారణాలను సాక్షితో పంచుకున్నారామె.మహిళలతో ముందడుగు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను ‘‘2020లో స్థాపించాం. సమాజంలో అవసరమైన ఇంజనీరింగ్ ఆవిష్కరణల గురించి అధ్యయనం చేయడానికి 72 గ్రామాల్లో పర్యటించాం. మహిళలు, మగవాళ్లు, రైతులు, ఇతర వృత్తుల్లోని వారు, పిల్లలు, వృద్ధులు... ఇలా అన్ని కేటగిరీల వ్యక్తులతో మాట్లాడాం. అక్కడి సమస్యలు తెలిశాయి, అవసరాలు అర్థమయ్యాయి. వాటిని పరిష్కరించడానికి ఏం చేయాలనే స్పష్టత కూడా వచ్చింది. అన్నింటినీ మేం పరిష్కరించలేం, ప్రభుత్వాలు మాత్రమే చేయగలిగిన వాటిని వదిలేసి, మా స్థాయిలో పరిష్కరించగలిగే పన్నెండు ప్రాజెక్టుల జాబితా తయారు చేసుకున్నాం. వాటిలో మొదటిది అగరువత్తి తయారీ యంత్రం. అప్పటికి మార్కెట్లో ఉన్న అగరువత్తి మేకింగ్ మెషీన్ల ధర నాలుగైదు లక్షల్లో ఉంది. మేము అరవై వేలలో తయారు చేశాం. రైతుల దగ్గర వృథా అయ్యే పూలు, ఆలయాల దగ్గర అమ్ముడు కానివి, దేవునికి పెట్టి తీసిన పూలను సేకరించి అగరువత్తి, సాంబ్రాణి కడ్డీలు తయారు చేస్తున్నాం. స్థానిక మహిళలకు శిక్షణనిచ్చాం. వారే స్వయంగా నిర్వహించుకుంటున్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వస్తే శిక్షణనిచ్చి, వాళ్లకు తగినట్లు మెషీన్ తయారు చేసిస్తాం’’ అన్నారు ్ర΄పొఫెసర్ సంయుక్త.తయారీ ఇలాగ...సేకరించిన పూల నుంచి రెక్కలను వేరు చేసి ఉప్పు నీటిలో కడిగి ఓ గంటసేపు ఎండలో పెడతారు. ఆ పూలను ΄పొడి చేస్తారు. పది కేజీల పూల నుంచి కేజీ ΄పొడి వస్తుంది. ఆటోమేటిక్ మెషీన్ కాబట్టి మెటీరియల్ పెట్టి సెట్ చేసి ఆ మహిళలు మరొక పని చేసుకోవచ్చు. గంటకు అగరువత్తులు 900, సాంబ్రాణి కడ్డీలైతే మూడు వందల వరకు చేయవచ్చు. రా మెటీరియల్ లభ్యత, మార్కెట్ అవసరాలను బట్టి ఇప్పుడు ఈ మహిళలు రోజుకో గంట పని చేస్తున్నారు. వర్షాకాలంలో పూలను ఎండబెట్టడం కష్టం, కాబట్టి ఆ రోజుల్లో గోమయం కడ్డీలను చేస్తారు. గ్రామాల్లో మహిళలు గోమయాన్ని వేసవిలో సేకరించి ఎండబెట్టి నిల్వ చేసి ఉంచుతారు. ఆసక్తి ఉన్న మహిళలు ఇంట్లోనే రోజుకో గంటసేపు పని చేసుకుని తాము ఉంటున్న అపార్ట్మెంట్, ఇరుగు΄పొరుగు ఇళ్లు, దగ్గరున్న ఆలయాలకు సప్లయ్ చేయవచ్చు. ఇందులో భారీ లాభాలను ఇప్పుడే ఆశించలేం. కానీ పర్యావరణహితమైన పని చేస్తున్నామనే సంతోషం ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యాపకంతో ఎకో వారియర్‌గా గుర్తింపు ΄పొందవచ్చు. – సంయుక్త, ఇన్సెన్స్ స్టిక్స్ మెషీన్ ఆవిష్కర్త -
బాలీవుడ్ కాలింగ్
ప్రతి ఏడాది బాలీవుడ్ తారలు కొంతమంది టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే దక్షిణాది హీరోయిన్లు కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటారు. ఈ ఏడాది కొందరు సౌత్ హీరోయిన్లను బాలీవుడ్ పిలిచింది. బాలీవుడ్ నుంచి కాల్ అందుకుని, ప్రస్తుతం అక్కడ సినిమాలు చేస్తున్న దక్షిణాది కథానాయికల గురించి తెలుసుకుందాం. కెరీర్లో యాభైకి పైగా సినిమాల్లో నటించి, దక్షిణాదిన స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయారు సమంత. హిందీలో ‘ఫ్యామిలీ మేన్’ సీజన్ 2 వెబ్ సిరీస్‌లో చేసిన రాజ్యలక్ష్మి పాత్రతో ఉత్తరాదిన కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇదే జోష్‌లో ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌ను కూడా పూర్తి చేశారామె. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ హిందీ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది.ఇలా హిందీలో రెండు వెబ్ సిరీస్‌లు చేసిన సమంత ఇంకా అక్కడ ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్, రాజ్‌కుమార్ రావుల సినిమాల్లో సమంత హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగింది. కానీ అప్పట్లో ఆమె అనారోగ్య పరిస్థితుల కారణంగా కుదర్లేదట. ఇప్పుడు ఆ సమయం వచ్చిందట. ఓ హిందీ చిత్రం కోసం సమంత ఇటీవల కథ విన్నారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. సో... హిందీలో సమంత నటించే తొలి చిత్రంపై స్పష్టత రావడానికి కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.కాస్త ఆలస్యంగా... దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో కీర్తీ సురేష్ ఒకరు. నటిగా సౌత్‌లో తన సత్తా ఏంటో సిల్వర్ స్క్రీన్‌పై చూపించిన కీర్తీ సురేష్ బాలీవుడ్‌లోనూ టాప్ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఈ క్రమంలోనే హిందీ చిత్రం ‘బేబీ జాన్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించారు. హిందీలో కీర్తీకి ఇది తొలి చిత్రం కాగా ఈ చిత్రదర్శకుడు కాలీస్ (తమిళ డైరెక్టర్)కు కూడా హిందీలో ఇదే తొలి చిత్రం. తమిళంలో అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరీ’ సినిమాకు హిందీ రీమేక్‌గా ‘బేబీ జాన్’ తెరకెక్కింది.జ్యోతిదేశ్ పాండే, మురాద్ ఖేతనీ, అట్లీ, ప్రియా అట్లీ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను మే 31న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. కొత్త తేదీ పై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కీర్తీ సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్‌లో హిందీలో ఓ యాక్షన్ వెబ్ సిరీస్ కూడా రూపొందుతోంది. ఇదిలా ఉంటే... ‘బేబీ జాన్’ చిత్రానికన్నా ముందే కీర్తీకి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘మైదాన్’లో ముందు హీరో యిన్‌గా కీర్తీ సురేష్‌ను తీసుకున్నారు ఈ చిత్రదర్శకుడు అమిత్ శర్మ. కానీ ఆ తర్వాత కీర్తీ సురేష్ ఈ ్రపాజెక్ట్ నుంచి తప్పుకోగా, ప్రియమణి నటించారు. ‘మైదాన్’ ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజైంది. ఇలా కీర్తీ సురేష్ బాలీవుడ్ ఎంట్రీ కాస్త ఆలస్యమైంది. ఏక్ దిన్ హీరోయిన్ సాయి పల్లవికి సౌత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను బాలీవుడ్‌లోనూ రిపీట్ చేయాలనుకుంటున్నారీ బ్యూటీ. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన చిత్రం ‘ఏక్ దిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో నటించారు సాయి పల్లవి. హిందీలో సాయి పల్లవి నటించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా మేజర్ షూటింగ్ జపాన్‌లో జరిగింది. ఆమిర్ ఖాన్ ఓ నిర్మాతగా ఉన్న ఈ ‘ఏక్ దిన్’ సినిమా చిత్రీకరణ పూర్తయింది.ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట ఆమిర్ ఖాన్. మరోవైపు మరో హిందీ చిత్రం ‘రామాయణ్’లో సాయి పల్లవి నటిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. సీతారాములుగా సాయి పల్లవి, రణ్‌బీర్ నటిస్తున్న ఈ భారీ చిత్రానికి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్, నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2025 చివర్లో ఈ సినిమా తొలి భాగాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని బాలీవుడ్ టాక్. కబురొచ్చింది ప్రస్తుతం తెలుగులో ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. నటన పరంగా ఈ బ్యూటీకి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. అందువల్లే రవితేజ ‘ధమాకా’, మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించగలిగారు. తాజాగా శ్రీలీలకు బాలీవుడ్ నుంచి కబురొచ్చిందని టాక్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం ఆలీఖాన్ హీరోగా ‘దిలేర్’ అనే సినిమా రూపొందుతోంది. కృణాల్ దేశ్‌ముఖ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌లో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందట. ఓ హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ శ్రీలీలను సంప్రదించారని సమాచారం. కథ నచ్చడంతో శ్రీలీల కూడా ఓకే చెప్పారని వినికిడి. అదే నిజమైతే శ్రీలీలకు ఇదే తొలి హిందీ చిత్రం అవుతుంది. కేరాఫ్ మహారాజ్ఞి ‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్’ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించారు సంయుక్తా మీనన్. అలాగే మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్గా నటించి పాపులర్ అయ్యారామె. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకీ రెడీ అయ్యారు. కానీ హీరోయిన్గా కాదు... ఓ లీడ్ రోల్లో... కాజోల్, ప్రభుదేవా లీడ్ రోల్స్‌లో ‘మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్‌తేజ్ ఉప్పలపాటి ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దర్శకుడు.ఈ సినిమాలో సంయుక్తా మీనన్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజోల్కు చెల్లి పాత్రలో కనిపిస్తారట సంయుక్త. నసీరుద్దీన్ షా, ఆదిత్య సీల్, చాయా కదమ్ వంటివారు ఈ సినిమాలోని ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. వెంకట అనీష్, హర్మాన్ బవేజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దక్షిణాది కథానాయికల జాబితాలో మరికొంతమంది ఉన్నారు. -
స్వయంభూలో ఎంట్రీ
‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. ఈ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు హీరోయిన్ నభా నటేష్. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త ఓ కథానాయికగా నటిస్తుండగా, నభా నటేష్ కీలకమైన, శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో నభా నటేష్ గురువారం జాయిన్ అయిన విషయాన్ని ప్రకటించి, ఆమె పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘స్వయంభూ’ చిత్రంలో ఓ లెజెండరీ యోధుడిగా నిఖిల్ నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో ట్రైనింగ్ తీసుకున్నారాయన. నభా నటేష్ పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఈ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా ఆమె మారిన విధానం అద్భుతం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, సహ నిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జీటీ ఆనంద్. -
స్వయంభూ కోసం స్వారీ
సవాల్ చేసే పాత్ర రావాలే కానీ ఎంత కష్టమైనా పడటానికి రెడీ అంటున్నారు సంయుక్తా మీనన్. ఆమెకు ‘స్వయంభూ’ సినిమా సవాల్ విసిరింది. నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో సంయుక్తా మీనన్ కథానాయిక. ఈ చిత్రంలో చేస్తున్న ఓ లెజెండ్రీ యోధుడి పాత్ర కోసం నిఖిల్ ప్రత్యేకమైన ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ కూడా పోరాట సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది. ఈ స్టంట్స్ చేయడానికి గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు సంయుక్తా మీనన్. ‘‘స్వయంభూ’ కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నా. ఇదొక అద్భుతమైన ప్రయాణం’’ అన్నారు సంయుక్త. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో ప్రస్తుతం నిఖిల్, ఇతర తారాగణం పాల్గొనగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. -
ఈ హిట్‌తో ఈ ఏడాదికి వీడ్కోలు
∙‘డెవిల్’ సినిమా సీక్వెల్‌కి 50 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ‘డెవిల్’ కి వచ్చే స్పందన బట్టి సీక్వెల్ చేయాలా? వద్దా అనేది ప్రకటిస్తాం. తమ్ముడి (ఎన్టీఆర్) ‘దేవర’ సినిమా 85 శాతం షూటింగ్ పూర్తయింది. మేం చేసే సినిమాల ఔట్పుట్ గొప్పగా ఉండాలనుకుంటాం.. అందుకే జాగ్రత్తలు తీసుకుని చేస్తాం. నేను, తారక్ ‘దేవర’ విషయంలో క్లియర్‌గా ఉన్నాం. మేం సంతృప్తి చెందిన వెంటనే సినిమా గురించి అప్డేట్ ఇస్తాం. అంతేకానీ అప్డేట్ ఇవ్వాలనే ఒత్తిడితో పని చేయలేం కదా? ► ‘‘నటుడిగా ఇరవై ఏళ్ల ప్రయాణంలో (మొదటి చిత్రం ‘తొలి చూపులోనే’ – 2003) చాలా సంతోషంగా ఉన్నాను. ఈ వృత్తిలో చాలా నేర్చుకున్నాను.. వేరే వృత్తిలో అయితే ఇంత నేర్చుకోలేకపోయేవాడినేమో? సినిమాల వల్ల ఎంతోమందితో మాట్లాడటం, పని చేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వ్యక్తిగతంగా ఓ మంచి తండ్రిగా, భర్తగా పరిణితి చెందాను’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు.అభిషేక్ పిక్చర్స్ పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘డెవిల్’. కల్యాణ్ రామ్ హీరోగా, సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ చెప్పిన విశేషాలు. ► 2021లో ‘బింబిసార’ షూటింగ్ టైమ్‌లో రచయిత శ్రీకాంత్ విస్సా నాకు ‘డెవిల్’ కథ చెప్పారు. 1940 బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ కథలో హీరో క్యారెక్టర్ కొత్తగా అనిపించింది. నన్ను దృష్టిలో పెట్టుకునే కథ రాశారా? అని అడిగాను. ‘‘నేను ‘డెవిల్’ని కథగానే రాశాను. అభిషేక్ నామాగారు మీకు చెప్పమన్నారు. మీరు కమర్షియల్ హీరో కదా.. ఇలాంటి కథ ఒప్పుకుంటారా?’’ అని శ్రీకాంత్ విస్సా అన్నారు. హీరో క్యారెక్టర్, బ్యాక్‌డ్రాప్ అలాగే ఉంచి, కమర్షియల్ పంథాలో స్క్రిప్ట్‌లో మార్పులు చేయమన్నాను. శ్రీకాంత్ రెండు, మూడు నెలలు సమయం తీసుకుని మార్పులు చేర్పులు చేయడంతో సినిమాప్రారంభించాం. ► ప్రేక్షకులకు కొత్త తరహా చిత్రాలు అందించేందుకు ప్రయత్నిస్తుంటాను. అయితే ఒక్కోసారి వాణిజ్య అంశాలు మిస్ అవుతుంటాను. నా గత చిత్రం ‘అమిగోస్’కి మరికొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలనే ఆలోచన నాకు ఆ రోజు రాలేదు. డైరెక్టర్‌తో మాట్లాడి ఆ పని చేసుండాల్సింది.. ఆ తప్పు నాదే. అందువల్ల మిస్‌ఫైర్ అయిందనుకుంటున్నాను. కానీ, ‘డెవిల్’లో వాణిజ్య అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇన్వెస్టిగేటివ్ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అవడం నాకు కొత్తగా అనిపించింది. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే అనుభూతి చెందుతారు. ‘డెవిల్’ హిట్‌తో 2023కి వీడ్కోలు పలుకుతామనే నమ్మకం ఉంది. ► ‘డెవిల్’లో నా క్యారెక్టర్లో గ్రే షేడ్స్ ఉండవు. ప్రతి విషయాన్ని వివరంగా చూపిస్తున్నాం. ఈ చిత్రాన్ని అభిషేక్ నామాగారు అద్భుతంగా తీశారు. నా అంచనాలకు మించి సౌందర్ రాజన్‌గారు విజువల్స్ ఇచ్చారు. కాస్ట్యూమ్ డిజైనర్ రాజేశ్‌తో 2017 నుంచి వర్క్ చేస్తున్నాను. ‘డెవిల్’లో నా పాత్ర కోసం దాదాపు 90 కాస్ట్యూమ్స్‌ని వాడాం. నా పాత్రకి భారతీయతను ఆపాదించే ప్రయత్నం చేశారాయన. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మంచి నేపథ్య సంగీతం అందించారు. ‘బింబిసార’కి కీరవాణిగారిలా ‘డెవిల్’ విషయంలో హర్షవర్ధన్ న్యాయం చేస్తాడా? అనుకున్నాను. అయితే సినిమా చూసిన తర్వాత సంతోషంగా అనిపించింది. ‘బింబిసార’ హిట్ తర్వాత సంయుక్తా మీనన్‌తో మళ్లీ నటించాను. హీరోకు సమానంగా తన పాత్రకిప్రాధాన్యత ఉంటుంది. మాళవిక పాత్ర కూడా చక్కగా ఉంటుంది. ప్రతి పాత్రకుప్రాధాన్యం ఉంటుంది. నేను ఒకే సమయంలో రెండు పడవల ప్రయాణం (నటుడు–నిర్మాత) చేయాలనుకోను. నటనకు ఎంత కష్టపడాలో.. నిర్మాణంలో అంతకు మించి కష్టపడాలి. ‘ఓం’ సినిమా విషయంలో నాకు ఆ విషయం అర్థమైంది. అప్పటి నుంచి మా బ్యానర్లో చేసే సినిమాలకు సంబంధించిన సినిమాల కథ మాత్రమే నేను వింటాను. మిగిలిన విషయాలన్నీ మా హరిగారు చూసుకుంటారు. -
కామెడీ స్పై
‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన స్పై యాక్షన్ కామెడీ ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ ఓ కీలక పాత్రధారి. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితి సోనీ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఓ కన్ ఫ్యూజ్డ్ స్పై ఓ పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడన్నదే ఈ సినిమా కథనం’’ అన్నారు టీజీ కీర్తీకుమార్, అదితి సోనీ. -
మాయే చేసే...
‘బింబిసార’ వంటి హిట్ మూవీ తర్వాత కల్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘డెవిల్’. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘మాయే చేసే..’ అనే పాటను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. సత్య ఆర్వీ సాహిత్యం అందించిన ఈ పాటను, సిధ్ శ్రీరాం పాడారు. అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘పీరియాడిక్ స్పై థ్రిల్లర్ మూవీ ‘డెవిల్’. నటుడిగా కల్యాణ్ రామ్‌లోని ఓ కొత్త కోణాన్ని ఈ చిత్రంలో ప్రేక్షకులు చూస్తారు. సినిమా కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సీఈఓ: వాసు పొతిని,కెమెరా: సౌందర్ రాజన్ ఎస్. -
స్వయం భూ ప్రారంభం
నిఖిల్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘స్వయం భూ’. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. నిర్మాత ‘ఠాగూర్ మధు’ సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తొలి షాట్‌కి దర్శకత్వం వహించగా, చదలవాడ శ్రీనివాసరావు స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. అలాగే ‘స్వయం భూ’ సినిమాలోని నిఖిల్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘నిఖిల్‌ను ఫెరోషియస్ వారియర్‌గా చూపించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘స్వయం భూ’ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ రోజే (ఆగస్టు 18) స్టార్ట్ చేశాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస, సహనిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జీటీ ఆనంద్. -
డెవిల్ వస్తున్నాడు
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ ఫిల్మ్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించారు. నవీన్ మేడారం దర్శకత్వంలో దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమాను నవంబరు 24న విడుదల చేస్తున్నట్లుగా ఆదివారం చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని చేధించే ఓ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కల్యాణ్‌రామ్ ఆకట్టుకోబోతున్నారు’’ అని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్. -
బిత్తిరి సత్తితో సాయి ధరమ్ తేజ్ ముఖాముఖీ
-
మేం ఎన్నికల్లో పాల్గొనడం లేదు
చండీగఢ్: పంజాబ్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) స్పష్టం చేసింది. అదేవిధంగా, రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్న పంజాబ్‌లోని 22 సంఘాల కూటమి ‘సంయుక్త సమాజ్ మోర్చా’ఎస్కేఎం పేరు వాడుకోరాదని పేర్కొంది. కేవలం రైతు సమస్యల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న 475 వేర్వేరు సంస్థలతో ఏర్పడిన వేదిక ఎస్కేఎం కాగా, పంజాబ్‌లోని 32 రైతు సంఘాలు అందులో ఒక భాగమని పేర్కొంటూ ఎస్కేఎం నేతలు దర్శన్ సింగ్ పాల్, జగ్జీత్ సింగ్ దల్లేవాల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక వేళ ఎస్కేఎం పేరును ఎవరైనా వాడుకుంటే చట్టపరంగా ముందుకు వెళతామన్నారు. ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత ఉద్యమాన్ని వాయిదా వేసినట్లు వారు చెప్పారు. రైతుల ఇతర డిమాండ్లపై తదుపరి కార్యాచరణను జనవరి 15న ఖరారు చేస్తామన్నారు. పంజాబ్‌లో రైతు సంఘాల రాజకీయ వేదిక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు నిరసనలు సాగించిన పంజాబ్‌లోని 22 రైతు సంఘాలు రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయి. రాజకీయ మార్పే లక్ష్యంగా రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని శనివారం ప్రకటించాయి. పంజాబ్‌లోని మొత్తం 32 రైతు సంఘాలకు గాను 22 రైతు సంఘాల ప్రతినిధులు శనివారం ఇక్కడ సమావేశమయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంయుక్త సమాజ్ మోర్చా పేరుతో పోటీ చేస్తామని భేటీ అనంతరం రైతు నేత హర్మీత్ సింగ్ కడియన్ మీడియాకు తెలిపారు. భారతీయ కిసాన్ యూనియన్(రాజేవాల్) నేత బల్బీర్ సింగ్ సింగ్ రాజేవాల్ తమ మోర్చాకు నేతగా ఉంటారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో జట్టుకట్టే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎన్నికల్లో ఎస్కేఎం పేరును మాత్రం వాడుకోబోమన్నారు. -
మట్టి రుణం ఇలాగ తీరింది
రైతుకు తెలిసిందేమిటి? దుక్కి దున్నడం... విత్తు నాటడం. కలుపు తీయడం... పంటను రాశిపోయడం. ఒళ్లు వంచి శ్రమించడం... మట్టిలో బంగారం పుట్టించడం. మరి... అలాంటి రైతుకు చట్టాల కష్టాలేమిటి? తన పొలంలో ఏం నాటాలో ఏం నాటకూడదో ఒకరు చెప్పేదేమిటి? రైతు మీద ఈ ఆంక్షలేమిటి? తనకు తెలియకుండానే తన మీద కేసు పెడితే ఏం చేయాలి? విదేశీ శక్తుల చేతిలో మనరైతు బలవుతుంటే చూస్తూ ఊరుకోవడమేనా? తనకంటూ హక్కులున్నాయని రైతుకు చెప్పేదెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క పోరాటంతో సమాధానం వచ్చింది. ఆ సమాధానమే జాతీయ రైతు హక్కుల కార్యకర్త కవిత కురుగంటి. సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో సింఘు బోర్డర్లో జరిగిన రైతుల ఆందోళనను దేశం యావత్తూ గుర్తించింది. రైతులకు జరుగుతున్న నష్టాన్ని తెలుసుకుంది. మౌనంగానే అయినా మనస్ఫూర్తిగా సంఘీభావం ప్రకటించింది. కార్పొరేట్ శక్తుల కోరల్లో రైతులు చిక్కుకోకూడదని చిత్తశుద్ధితో కోరుతుంది. అయితే అంతకంటే ముందు ఓ దశాబ్ద కాలంపాటు అమాయకమైన రైతులు కొందరు విదేశీ కార్పొరేట్ శక్తితో ఎదురొడ్డి పోరాడలేక, పోరాటం ఆపలేక సతమతమయ్యారు. వారు ఎదుర్కొన్న వాస్తవ పరిస్థితిని న్యాయస్థానానికి తెలియచేయడం కోసం స్వయంగా సదరు విదేశీ కంపెనీ మీద కేసు వేశారు రైతు హక్కుల కార్యకర్త కవిత కురుగంటి. విదేశీ కంపెనీ మనదేశ రైతులను కబళించడానికి పన్నిన కుట్రను న్యాయస్థానానికి విశదపరిచారామె. రైతుల పక్షాన ఉన్న న్యాయం ఏమిటో తెలియచేశారు. ఫలితంగా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రైతులకు రక్షణగా నిలిచింది. లేస్ చిప్స్ తయారు చేయడానికి అవసరమైన ఎఫ్ ఎల్ – 2027 బంగాళాదుంప పండించిన రైతుల మీద పెప్సీ కంపెనీ కేసు పెట్టింది. తమ కంపెనీతో అంగీకారం కుదుర్చుకోకుండా ఆ పంట పండించిన కారణంగా సదరు రైతులు తమకు కోట్లాదిరూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. కవిత న్యాయపోరాటం ఫలితంగా న్యాయస్థానం సదరు కంపెనీకి ఇచ్చిన పీవీపీ సర్టిఫికేట్‌ను కూడా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా. ఒకవైపు ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది ఉన్న బడా కార్పొరేట్ సంస్థ... మరోవైపు అసంఘటితంగా ఉన్న రైతులు. ఇలాంటి స్థితిలో రైతుల పక్షాన పోరాటం చేయడానికి వారి పట్ల సానుభూతి ఉంటే సరిపోదు. అంతకు మించిన ధైర్యం ఉండాలి. అంతకంటే ఎక్కువగా రైతు కష్టాలు, ప్రభుత్వ విధానాలు, కార్పొరేట్ కంపెనీల వ్యవహార ధోరణి పట్ల స్పష్టమైన అవగాహన కూడా ఉండాలి. గుంటూరులో పుట్టిన తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మాత్రమే వ్యవసాయరంగం గురించి తెలుసుకున్నానని చెప్పారామె. మహిళారైతులే స్ఫూర్తి ‘‘నాకు వ్యవసాయం గురించి మెదక్జిల్లాలోని పస్తాపూర్ మహిళలు నేర్పించారు. పీజీలో ఫీల్డ్ స్టడీ కోసం డీడీఎస్ (దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ) తో కలిసి పని చేశాను. నిజానికి నేను కమ్యూనికేషన్స్ స్టూడెంట్‌ని. డాక్యుమెంటరీ కోసం ఆ ఊరికి వెళ్లి వ్యవసాయం చేసే మహిళలను దగ్గరగా చూశాను. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ను కూడా అక్కడ పరిచయం చేశాం. ఒక కొత్త విధానాన్ని చక్కగా అర్థం చేసుకుని సమష్టిగా పని చేసుకుంటారు వాళ్లు. వెనుకబడిన కుటుంబాలకు చెందిన మహిళలు తమ సమస్యలను నేర్పుగా చక్కబెట్టుకోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించేది. మన ఇళ్లలో మగవాళ్లకు ఒకరకం న్యాయం, మహిళలకు మరోరకమైన న్యాయం ఉండడం నాకు మింగుడుపడేది కాదు. బాల్యం నుంచి నన్ను వెంటాడిన అనేక ప్రశ్నలకు సమాధానం అక్కడ దొరికింది. ఇక ఎం.ఏ పూర్తి కాగానే పస్తాపూర్‌కి వెళ్లిపోయాను. ఆరేళ్లపాటు అక్కడ పని చేసి ఢిల్లీకి వెళ్లి అనేక సంస్థలతో పని చేశాను. ప్రస్తుతం బెంగళూరు నుంచి పని చేస్తున్నాను. నేను రైతు కుటుంబంలో పుట్టలేదు, కార్పొరేట్ కంపెనీలకు పని చేయలేదు, ప్రభుత్వ ఉద్యోగమూ చేయలేదు... కానీ ఈ మూడు రంగాల మీద చక్కటి అవగాహన ఉంది. భావసారూప్యం కలిగిన వాళ్లం ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి పని చేస్తున్నాం. అవసరమైన చోట వీథి పోరాటం చేస్తాం, అలాగే ప్రభుత్వానికి విధాన రూపకల్పన కోసం నివేదికలు ఇస్తాం, అవి దుమ్ముకొట్టుకుని పోతున్నాయనిపిస్తే వాటి అమలు కోసం ఉద్యమమూ చేస్తాం’’ అన్నారామె. కేసు ఈ నాటిది కాదు! పెప్సీ కంపెనీ రైతుల మీద 2008లో తొలిసారి కేసు పెట్టింది. నిందితులు విధిలేక తలకెత్తుకున్న న్యాయపోరాటం ఇది. ఇందుకోసం తమ శక్తికి మించి లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. అయినప్పటికీ అప్పట్లో తగినంతగా ప్రజల్లోకి వెళ్లలేదు. వార్తా కథనాలు కూడా పెద్దగా రాలేదు. ‘‘మేము రైతులకు మద్దతుగా పోరాటం మొదలు పెట్టిన వెంటనే చేసిన ప్రధానమైన పని ఈ అంశానికి విస్తృతంగా ప్రచారం కల్పించడమే. మనదేశంలో మంత్రులకు, అనేక సంస్థలకు ఉత్తరాల ద్వారా పోరాటాన్ని ఉధృతం చేశాం. సోషల్ మీడియా ద్వారా యూఎస్, యూరప్, యూకే, ఆఫ్రికా దేశాలకు కూడా తెలిసి వచ్చింది. సదరు కంపెనీ మన రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందనే భావన అందరిలోనూ కలిగింది. మన ప్రభుత్వాల మీద, ఆ కంపెనీ మీద ఇన్ని రకాలుగా ఒత్తిడి తీసుకురాగలిగాం. వాస్తవాల అన్వేషణ కోసం పంజాబ్, గుజరాత్లో మారుమూల ప్రదేశాలకు కూడా వెళ్లాం. ఇంత గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత 2019, జూన్‌లో స్వయంగా కేసు వేశాను. రైతులకు అనుకూలంగా వచ్చిన తీర్పు వెనుక ఇంత ఎక్సర్సైజ్ జరిగింది’’ అని చెప్పారు కవిత కురుగంటి. గడచిన గురువారం నాడు హైదరాబాద్, ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌లో జరిగిన ‘రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల పబ్లిక్ హియరింగ్’ కోసం వచ్చిన సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. ఈ తీర్పు గొప్ప విజయమే... కానీ! ‘ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ – 2001’ ప్రకారం రైతులు తమకు ఇష్టం ఉన్న పంటను పండించుకోవచ్చు. ఈ మేరకు మనదేశం రైతుల ప్రయోజనాలకు విఘాతం కలగని విధంగానే చట్టానికి రూపకల్పన చేసింది. అయితే రైతులకు మాత్రం ఆ విషయం తెలియదు. ఆ కారణంగానే పెప్సీ కంపెనీ రైతుల మీద కేసు వేయగలిగింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ద్వారా రైతులకు తమకు హక్కులున్నాయని తెలిసింది. ఈ విషయంలో పెప్సీ కంపెనీ కేసు వేయడానికి ముందు సదరు రైతులకు తెలియకుండా వారు పండిస్తున్న బంగాళాదుంపల శాంపుల్స్ సేకరించి వాటిని ల్యాబ్‌లో పరీక్షించింది. అది కూడా నేరమే. ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడితే పోరాడే శక్తులున్నాయని కార్పొరేట్ కంపెనీలకు ఈ తీర్పు ద్వారా తెలిసి వచ్చింది. ఇది నిజంగా ఒక హెచ్చరిక వంటిది. ప్రభుత్వాలు కూడా ఇకపై మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటాయని ఆశించవచ్చు. అయితే 30 నెలల పాటు జరిగిన ప్రొసీడింగ్స్నీ, తీర్పు పూర్తి పాఠాన్ని గమనిస్తే కొంత ఊగిసలాట కూడా ఉన్నట్లనిపిస్తోంది. ఆ కంపెనీ అగ్రిమెంట్ పూర్తి కావస్తోంది. ఈ దఫా అగ్రిమెంట్లో మరింత పక్కాగా కంపెనీకి ప్రయోజనకరంగా నిర్ణయం తీసుకునే ప్రమాదం లేకపోలేదనిపిస్తోంది. అందుకే అలాంటిది జరిగితే మళ్లీ పోరాడడానికి సిద్ధమవుతున్నాం. – కవిత కురుగంటి, కన్వీనర్, అలయెన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి -
చట్టాలు ఉపసంహరించాకే ఇళ్లకు
న్యూఢిల్లీ/ఘజియాబాద్/పాల్ఘర్: మూడు సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేసే దాకా రైతులు ఉద్యమ వేదికలను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని రైతు సంఘాల సమాఖ్య.. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) శుక్రవారం స్పష్టంచేసింది. ఎంఎస్పీకి చట్టబద్ధత డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉందని తెలిపింది. సాగు చట్టాల రద్దు నిర్ణయంపై ఎస్కేఎం హర్షం వ్యక్తంచేసింది. అయితే, చట్టాలు రద్దయ్యేదాకా ఉద్యమవేదికలను వదిలే ప్రసక్తే లేదని, రైతులు ఎవరూ ఇళ్లకు వెళ్లబోరని ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ అన్నారు. శని, ఆదివారాల్లో జరిపే ఎస్కేఎం కోర్ కమిటీ సమావేశాల్లో రైతు ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు. చట్టాలను రద్దుచేస్తే ఏడాదికాలంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి చరిత్రాత్మక విజయం దక్కినట్లేనని ఎస్కేఎం తెలిపింది. చేతల్లో చూపండి: తికాయత్ సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేశాక రైతుల ఉద్యమాన్ని విరమిస్తామని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పష్టంచేశారు. రద్దు చేస్తామని మాటల్లోనే కాదు.. చేతల్లోనూ చూపి చట్టాలను వెంటనే రద్దుచేయాలన్నారు. ‘ చట్టాలను పార్లమెంట్లో రద్దుచేసేదాకా రైతులు ఎవ్వరూ సంబరాలు చేసుకోకండి. రైతుల ఆందోళన ఇప్పటికిప్పుడే ఆగిపోదు. పార్లమెంట్లో ఈ చట్టాలను రద్దుచేసే రోజు దాకా వేచి చూస్తాం. పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తోపాటు ఇతర ప్రధాన సమస్యలపైనా రైతు సంఘాలతో మోదీ సర్కార్ చర్చలు జరపాల్సిందే’ అని తికాయత్ హిందీలో ట్వీట్‌చేశారు. ‘ చట్టాలు రద్దయ్యేదాకా రైతులు ఉద్యమ వేదికల నుంచి ఇళ్లకు వెనుతిరిగేదే లేదు. పంటలకు కనీస మద్దతు ధర లభించట్లేదు. ఈ సమస్య దేశం మొత్తాన్నీ పట్టి పీడిస్తోంది’ అనిæ అన్నారు. -
రాష్ట్రస్థాయి ‘టెన్నికాయిట్’కు సంయుక్త
ఇంకొల్లు: రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు సంయుక్త ఎంపికైనట్లు టెన్నికాయిట్ సంఘం జిల్లా కార్యదర్శి పీ బాపూజి తెలిపారు. విజయనగం జిల్లా సీతానగరంలో శుక్రవారం నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఆమె హాజరైంది. చందలూరు గ్రామానికి చెందిన సంయుక్త ఆదర్శ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతుంది. వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్‌కుమార్, పాఠశాల కరస్పాండెంట్ విజయభాస్కర్, ప్రిన్సిపాల్ సునీత సంయుక్తను అభినందించారు.