
నార్త్ నుంచి సౌత్‌కి వచ్చే కథానాయికల సంఖ్య ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అయితే సీన్ మారింది. ఇప్పుడు దక్షిణాదిన పాపులర్ అయిన కథానాయికలను బాలీవుడ్ బులాయా (బాలీవుడ్ పిలిచింది). అలా ఇక్కడ సక్సెస్ అయి, బాలీవుడ్‌కి పరిచయం కానున్న కథానాయికలు కొందరు ఉన్నారు. ఆ తారలు హిందీలో చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.
డబుల్ ధమాకా
దక్షిణాదిలోని అగ్ర కథానాయికల్లో సాయిపల్లవి ఒకరు. అందం, అభినయం పరంగా ఇక్కడ బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె హిందీలో రెండు సినిమాలు అంగీకరించారు. ఆ చిత్రాలు ‘రామాయణ’, ‘ఏక్ దిన్’. రామాయణం ఆధారంగా నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో ‘రామాయణ’ మూవీ రూ΄÷ందుతోంది. ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, లక్ష్మణుడి పాత్రలో రవి దుబే నటిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ కనిపిస్తారని బాలీవుడ్ సమాచారం. యశ్‌తో కలిసి నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది.
2026 దీపావళికి తొలి భాగాన్ని, 2027 దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అలాగే ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హిందీలో ‘ఏక్ దిన్’ (వర్కింగ్ టైటిల్) అనే మూవీ చేశారు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అయితే ‘రామాయణ, ఏక్ దిన్’ చిత్రాల్లో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన రాలేదు. ఆ సంగతలా ఉంచితే... ‘ఏక్ దిన్’ ముందుగా రిలీజవుతుందని, ఈ మూవీతోనే సాయిపల్లవి బాలీవుడ్ ఫస్ట్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని టాక్.
లవ్ ఫిల్మ్‌తో...
తెలుగులో సక్సెస్‌ఫుల్ స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించారు హీరోయిన్ శ్రీలీల. ఈ బ్యూటీ ఇప్పుడు హిందీలో నిరూపించుకోవడానికి రెడీ అయ్యారు. బాలీవుడ్ నుంచి తనకు మంచి స్వాగతమే దక్కినట్లుగా తెలుస్తోంది. ఒకేసారి రెండు ఆఫర్లు అందుకున్నారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు డైరెక్షన్‌లోని ఓ లవ్ ఫిల్మ్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైందట. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, అనురాగ్ బసు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాయే కాకుండా సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా నిర్మాత దినేష్ విజన్ ఓ మూవీని ΄్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా చర్చల్లో కూడా ఆమె పాల్గొన్నారు.
క్వీన్ ఆఫ్ క్వీన్స్
‘బింబిసార, విరూపాక్ష, డెవిల్: ది సీక్రెట్ ఏజెంట్’ వంటి తెలుగు హిట్ మూవీస్‌తో ప్రేక్షకులను అలరించారు హీరోయిన్ సంయుక్త. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకోనున్నారీ బ్యూటీ. కాజోల్, ప్రభుదేవా, నసీరుద్దీన్ షా లీడ్ రోల్స్ చేస్తున్న హిందీ చిత్రం ‘మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్’లో సంయుక్త ఓ లీడ్ రోల్ చేస్తు న్నారు. చరణ్ ఉప్పలపాటి దర్శకత్వంలో వెంకట అనీష్, హర్మాన్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.
తెలుగు హీరోయిన్ అనన్యా నాగళ్ల, కన్నడ హీరోయిన్ తన్వీ వంటి మరికొందరు తారల బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment