మాయే చేసే...   | Devil first single launch gets a date | Sakshi
Sakshi News home page

మాయే చేసే...  

Published Fri, Sep 15 2023 1:15 AM | Last Updated on Fri, Sep 15 2023 8:09 PM

Devil first single launch gets a date - Sakshi

కల్యాణ్‌ రామ్, సంయుక్తా మీనన్‌

‘బింబిసార’ వంటి హిట్‌ మూవీ తర్వాత కల్యాణ్‌ రామ్, సంయుక్తా మీనన్‌ జంటగా నటించిన  చిత్రం ‘డెవిల్‌’. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నవంబర్‌ 24న విడుదల కానుంది. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘మాయే చేసే..’ అనే పాటను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌.

సత్య ఆర్‌వీ సాహిత్యం అందించిన ఈ పాటను, సిధ్‌ శ్రీరాం పాడారు. అభిషేక్‌ నామా మాట్లాడుతూ– ‘‘పీరియాడిక్‌ స్పై థ్రిల్లర్‌ మూవీ ‘డెవిల్‌’. నటుడిగా కల్యాణ్‌ రామ్‌లోని ఓ కొత్త కోణాన్ని ఈ చిత్రంలో ప్రేక్షకులు చూస్తారు. సినిమా కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సీఈఓ: వాసు పొతిని,కెమెరా: సౌందర్‌ రాజన్‌ ఎస్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement