menon
-
చదువు శక్తినిస్తుంది
‘ఈ రోజులను చూస్తుంటే మా రోజుల్లోనే అమ్మాయిలకు తగినంత స్వేచ్చ,అనుకున్నవి సాధించే ధైర్యం, సమాజాన్ని అర్ధం చేసుకునే పరిణతిని పొందారు’ అనిపిస్తుంటుంది అన్నారు రిటైర్డ్ ప్రిన్సిపల్ కమలా మీనన్. తిరుపతి పద్మావతి మహిళా కళాశాల మూడవ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహించిన కమలా మీనన్ సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉంటున్నారు. భర్త డగ్లస్ ఎమ్ కాక్రన్ జ్ఞాపకాలతో పాటు, 86 ఏళ్ల జీవితంలో ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు తనను ఎలా నిలబెట్టాయో వివరించారు. ‘‘చదువు అమ్మాయిలను శక్తిమంతులను చేస్తుంది. ఈ విషయాన్ని ఆ రోజుల్లోనే మా అమ్మ గుర్తించారు..’ అంటూ గతకాలపు విషయాలను మన ముందుంచారు. చదువు వేసిన మార్గం.. ‘‘పుట్టి పెరిగింది చెన్నైలో. నాన్నగారు బ్రిటిష్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసేవారు.అమ్మానాన్నలకు ఎనిమిది మంది సంతానం. అక్కతోపాటు ఆరుగురు అన్నలు నాకు. ఆడ, మగ అనే వివక్ష ఏ మాత్రం లేదు. అందరికీ మంచి చదువులు చదువుకునే అవకాశం ఇచ్చారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ఆనర్స్ పూర్తయ్యాక బెంగుళూరు మౌంట్ కార్మెల్ కాలేజీలో లెక్చరర్‌గా ఐదేళ్లు పని చేశాను. ఆ ఎక్స్‌పీరియెన్స్ నాకు చాలా హెల్ప్ అయ్యింది. అప్పుడు చదువుకునే అమ్మాయిల శాతం కూడా బాగానే ఉంది. ఆ తర్వాత మార్పు కోసం తిరిగి మద్రాస్‌కు వచ్చేశాను. తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలలో పొలిటికల్ విభాగంలో టెంపరరీ జాబ్ గురించి పేపర్లో ప్రకటన చూసి, అప్లై చేసి, సెలక్ట్ అయ్యాను. ఆరు నెలల తర్వాత పర్మినెంట్ అయ్యింది. సవాళ్లను తట్టుకుని ఎదుగుతూ.. జీవితంలో సవాళ్లు, బాధలు ఎక్కడి నుంచైనా ఎదురు కావచ్చు. నన్ను విపరీతంగా బాధపెట్టే సంఘటన నుంచి కోలుకోవడానికి సమయం పట్టింది. మా అక్క ఢిల్లీలో ఉండేవారు. జబ్బు పడి అక్క, నాన్న ఇద్దరూ ఒకే రోజు చనిపోయారు. ఈ సంఘటన నన్ను బాగా కదిలించాయి. ఆ టైమ్‌లో డా.రాజేశ్వరి మూర్తి కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉండేవారు. ఆవిడ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినప్పుడు సెలక్షన్ కమిటీ నన్ను ఇన్ఛార్జిగా ఎంపిక చేసింది. నా మైండ్ కూడా ఛేంజ్ కావాలనుకొని, 1975లో ఆ బాధ్యత తీసుకున్నాను. ఇంటర్వ్యూ ద్వారా టెంపరరీ జాబ్ వచ్చింది. తర్వాత పర్మినెంట్ అయ్యింది. ఆ తర్వాత ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా అవకాశం వచ్చింది. నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అదే సమయంలో విదేశాలకు వెళ్లిన మరో సీనియర్ మహిళా లెక్చరర్ తిరిగి వచ్చారు. అప్పుడు మేనేజ్మెంట్ సీనియర్ కాబట్టి ఆవిడను నా ప్లేస్‌లో రీ ప్లేస్ చేశారు. అప్పటికే నన్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది, ఆ తర్వాత మరొకరికి ఇచ్చింది. దీంతో నా పొజిషన్ కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నేను గెలిచాను. అలా యూనివర్శిటీకి 3వ మహిళా ప్రిన్సిపల్‌గా బాధ్యతలు తీసుకున్నాను. ఆ తర్వాత 1993లో రిటైర్ అయ్యేవరకు ప్రిన్సిపల్‌గా చేశాను. 1997 వరకు దేవస్థానం ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా వర్క్ చేశాను. లెక్చరర్‌గా ఎంతో మంది విద్యార్థులను చూశాను. ఎంతోమంది విద్యార్థులతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పటికీ కలిసేవారు, ఫోన్లు చేసి మాట్లాడేవారున్నారు. ఆత్మీయులుగా మారినవారు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన, మొదటి తరం అమ్మాయిలే అక్కడంతా. వారిలో భవిష్యత్తుని చక్కగా మార్చుకోవాలనే పరిణతి బాగా కనిపించేది. వారి భవిష్యత్తుకు ప్రత్యేక క్లాసులు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేర్చాం. లెక్చరర్లు ఎంతో సపోర్ట్‌గా నిలిచేవారు. నాటి ఆ విద్యార్థుల్లో నేడు ఎంతోమంది పెద్ద పెద్ద పొజిషన్లలో, దేశ విదేశాల్లో ఉన్నారు. జీవితంలో ముఖ్యమైన మలుపు 1979–80లో నాటి మద్రాస్‌లో సౌత్ ఇండియా అమెరికా రాయబార కార్యాలయానికి డగ్లస్ ఎమ్ కాక్రన్ కాన్సులేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాలేజీ సెమినార్ సందర్భంగా మద్రాస్ నుంచి తిరుపతికి సెమినార్‌కు వచ్చారు. అక్కడ డిస్కషన్స్ అన్నీ పూర్తయి, వెళ్లిపోయారు. ఆ సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ పొలిటికల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. చెన్నైలోని అమెరికన్ ఎంబసీ ఎదుట నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో సేఫ్‌గా ఉండమని రాసిన నోట్ తిరిగి మమ్మల్ని కలిపింది. ఆ తర్వాత జరిగిన డిస్కషన్స్ మమ్మల్ని మంచి స్నేహితులుగా మార్చాయి. 1985లో మేం పెళ్లి చేసుకున్నాం. ఆ విధంగా శ్రీమతి డగ్లస్ ఎమ్ కాక్రన్ అయ్యాను. జీవితంలో ఒక అద్భుతమైన వ్యక్తిని కలిసాను అనిపించేది. మా అమ్మను ఆమె సొంత కొడుకుల కన్నా డగ్లస్ గొప్పగా చూసుకున్నారు. ఇన్నేళ్ల మా జీవనంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇటీవల డగ్లస్ అనారోగ్యంతో భౌతికంగా దూరమయ్యారు. అయితేనేం.... ఆ జ్ఞాపకాలు ఎంతో పదిలంగా ఉన్నాయి. అవే నన్ను శక్తిమంతురాలిని చేస్తున్నాయి. విశ్రాంత జీవనంలో.. రిటైర్ అయినా కొన్ని విదేశీ కంపెనీలు, సూపర్మార్కెట్స్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించేవారు డగ్లస్. నేను రిటైర్ అయిన తర్వాత ఎక్కడ ఉండాలో ఇద్దరమూ ఆలోచించుకున్నాం. అందుకు, సికింద్రాబాద్‌లోని బోయినపల్లి మాకు అనువైనదిగా అనిపించింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా ఇంట్లోనే కాదు మా చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేసే వారి పిల్లలకు మంచి చదువు చెప్పించాలనే ఉద్దేశ్యంతో వారిని ఒక చోట చేర్చి చదువులు చెప్పేవాళ్లం. కాలనీలోని చదువుకున్న మహిళల చేత ట్యూషన్స్ చెప్పించేవాళ్లం. వారి పిల్లలను కాన్వెంట్ స్కూల్లో చేర్పించి, మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునేవాళ్లం. అలా, ఆ పిల్లలు కూడా ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అమ్మానాన్నల పెంపకంలోనూ, చదువులోనూ, సమాజంలో మనకు లభించే స్వేచ్ఛ దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ స్వేచ్ఛను మనకు అనుకూలంగా మలచుకోవాలి. అదే మనల్ని శక్తిమంతులుగా నిలుపుతుంది అది ఏ దేశమైనా అని నేనూ కాక్రన్ అనుకునేవాళ్లం’’ అంటూ నేటి తరంలో వస్తున్న మార్పులను అన్వయించుకుంటూ తెలియజేశారు’’ కమలా మీనన్. – నిర్మలారెడ్డి -
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? మహేశ్ సూపర్ హిట్ మూవీలో (ఫొటోలు)
-
డెవిల్ డేట్ ఫిక్స్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన పీరియాడికల్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించారు. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లుగా గురువారం చిత్ర యూనిట్ వెల్లడించింది. ‘‘ఈ చిత్రంలో ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కల్యాణ్ రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్. -
మాయే చేసే...
‘బింబిసార’ వంటి హిట్ మూవీ తర్వాత కల్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘డెవిల్’. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘మాయే చేసే..’ అనే పాటను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. సత్య ఆర్వీ సాహిత్యం అందించిన ఈ పాటను, సిధ్ శ్రీరాం పాడారు. అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘పీరియాడిక్ స్పై థ్రిల్లర్ మూవీ ‘డెవిల్’. నటుడిగా కల్యాణ్ రామ్‌లోని ఓ కొత్త కోణాన్ని ఈ చిత్రంలో ప్రేక్షకులు చూస్తారు. సినిమా కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సీఈఓ: వాసు పొతిని,కెమెరా: సౌందర్ రాజన్ ఎస్. -
Mirnaa Menon: ‘జైలర్’ కోడలు బ్యూటీఫుల్ లుక్.. మిర్నా మీనన్ (ఫొటోలు)
-
వెన్నెల నవ్వితే... ఆ అందం నువ్వే!
రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా’ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అనిరుథ్ రవిచందర్ ఈ పాటకు స్వరాలు సమకూర్చి శిల్పారావుతో కలిసి పాడాడు. ఈ పాటకు తమన్నా భాటియా వేసిన స్టెప్లను నెటిజనులు షేర్ చేస్తున్నారు. ఈ క్యాచీ బీట్స్ పాట యూ ట్యూబ్‌లో 74 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ పాటలో తమన్నా హుక్ స్టెప్స్‌ను అనుసరిస్తూ మిస్ కేరళ (2017) ప్రియాంక మేనన్ అందమైన వీడియో చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 47.2 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కామెంట్ సెక్షన్ హార్ట్ ఇమోజీలతో నిండిపోయింది. -
బన్సల్‌కే బాధ్యతలన్నీ..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీని చక్కదిద్దేపనిలో భాగంగా అటు రాజకీయ వ్యవహారాలు, ఇటు సంస్థాగత అంశాలకు సంబంధించిన బాధ్యతలను ఒక్కరికే అప్పగించే దిశలో బీజేపీ జాతీయ నాయకత్వం చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. నలుగురైదుగురు ఇన్చార్జీలు కాకుండా ఒక్కరికే పూర్తిస్థాయి ఇన్చార్జి బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చనే అంచనాకు వచ్చినట్టు సమాచారం. గత లోక్‌సభ ఎన్నికలతో పాటు, యూపీలో పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకుని రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన సునీల్ బన్సల్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలని అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అసంతృప్తిని చల్లార్చే చర్యలేవీ..? తెలంగాణకు ఏకంగా నలుగురైదురు ఇన్చార్జీలను నియమించి వారి ద్వారానే జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి ఎన్నికల దిశానిర్దేశం చేస్తున్న సంగతి విదితమే. జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జిగా, మరో జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జిగా కొనసాగుతుండగా మరో ఇద్దరు జాతీయ నేతలు శివప్రకాష్, అర్వింద్ మీనన్‌లు కూడా ఇన్చార్జిలుగా ఉన్నారు. వీరంతా ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు దాదాపు ఆరేడు నెలలుగా వివిధ కార్యక్రమాలు, పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే గత 20, 30 ఏళ్లుగా పార్టీ కోసం కృషి చేసిన సీనియర్లకు సరైన ప్రాధాన్యత, గౌరవం లేదని, వారికి తగిన బాధ్యతలు కూ డా ఇవ్వడం లేదన్నది ప్రధాన విమర్శ. కాగా సొంత ప్రచారానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పార్టీ నాయకుల్లో అసంతృప్తి వివిధ సందర్భాల్లో బయటపడుతున్నా ఈ సమస్యను అధిగమించే దిశగా ఇన్చార్జిలు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని అసంతృప్త నేతలు భావిస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటున్న జాతీయ నాయకత్వం ఒక్కరికే పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని భావిస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. కేడర్‌లో స్తబ్ధత తొలిగేలా చర్యలు.. ప్రస్తుతం పార్టీలో పాత, కొత్తనేతల మధ్య సమన్వయలేమి, క్షేత్రస్థాయిలో ఎదురౌతున్న సమస్యలతో కేడర్‌లోనూ కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంత స్తబ్ధత కూడా నెలకొంది. రాష్ట్ర పార్టీ నాయకత్వంపై, ముఖ్య నేతల వ్యవహారశైలి, అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తం కావడం, అసమ్మతి కార్యక్రమాలకు తావిచ్చేలా కొందరు వ్యవహరించడం వంటివి క్రమశిక్షణా రాహిత్యంగా జాతీయ నాయకత్వం పరిగణిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో వివిధ స్థాయి నాయకుల్లో అసంతృప్తిని, ముఖ్యంగా కిందిస్థాయి కేడర్‌లో ఏర్పడిన స్తబ్ధతను తొలగించడానికి సత్వరమే చర్యలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది. పార్టీ క్రమశిక్షణ గీతను దాటుతున్న వారికి, పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని హెచ్చరించడంతో పాటు ఒకరిద్దరిపై క్రమశిక్షణ చర్యలకు కూడా దిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు. ఈ మేరకు త్వరలో చేపట్టబోయే చర్యలపై రాష్ట్ర ముఖ్య నేతలకు సంకేతాలు కూడా అందినట్టు తెలుస్తోంది. -
ఉగ్రం మూవీ సక్సెస్ సెలబ్రేషన్...
-
ఈ రెండు సినిమాల పరిస్థితి ఏంటి..? హిట్ అవ్వకపోతే మాత్రం
-
ఆడియన్స్ పెట్టిన కామెంట్స్ విని ఎమోషనల్ అయినా అల్లరి నరేష్
-
ఆ ఏజ్ లో పాప టాలెంట్,యాక్టింగ్ చూసి షాక్...అయ్యా బాబోయ్ చిచ్చరపిడుగు
-
సినిమా నచ్చకపోతే డైరెక్టర్ గా తిడుతున్నారు..
-
డైరెక్టర్ విజయ్ కనకమేడల అతని సినిమా పై కాంఫిడెన్స్
-
Mirna Menon : కళ్లతోనే మాయ చేస్తున్న అల్లరి నరేష్ ‘ఉగ్రం’ హీరోయిన్
-
స్వరాజ్యాన్ని సంపూర్ణం చేసినవాడు....
భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే క్రమంలో ఎన్నో చర్చలు జరిగాయి. ‘స్వరాజ్యం గురించి చర్చలంటూ జరిగితే ఇకపై అందులో పాల్గొనేవి భారత జాతీయ కాంగ్రెస్, బ్రిటిష్ ప్రభుత్వాలలే కాదు. మూడో పక్షం కూడా ఉంది– అది ముస్లిం లీగ్’ అన్నాడు జిన్నా. నిజానికి ముస్లింలీగ్ వైఖరి, పెచ్చరిల్లిన మత హింస, అది అంతర్యుద్ధానికి దారి తీస్తుందన్న అనుమానాలు నాటి చాలా పరిణామాలను ప్రభావితం చేశాయి, తొందరపెట్టాయి. స్వాతంత్య్రం, దేశ విభజన అంశాల మీద ప్రతిష్టంభన ఏర్పడడానికి కారణం కూడా అవే. ఈ దశలోనే కాంగ్రెస్, లీగ్, ప్రభుత్వంతో పాటు నాలుగో భాగస్వామి ఉందన్న సంగతి ఇంగ్లిష్ జాతి మహా మేధస్సుకు తట్టింది. ఆ భాగస్వామి – స్వదేశీ సంస్థానాలు. ఆఖరి వైస్రాయ్ మౌంట్‌బాటన్ బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన చర్చలలో నెహ్రూ, పటేల్, జేబీ కృపలానీ, బల్దేవ్సింగ్; జిన్నా, లియాఖత్ అలీ ఖాన్, నిష్తార్ వంటివారు ఉన్నారు (గాంధీజీ పాత్ర తక్కువే). అంతకు ముందు తేజ్ బహదూర్ సప్రూ, మోతీలాల్ వంటివారు చర్చలలో పాల్గొనేవారు. వీరందరితో పాటు మరొక పేరు కూడా చరిత్రలో ప్రముఖంగా ఉండాలని అనిపిస్తుంది. ఆయన వీపీ మేనన్. భారత్, పాకిస్తాన్ పేరుతో స్వతంత్ర ప్రతిపత్తి కల రెండు భూభాగాలుగా అఖండ∙భారత్‌ను విభజించడమే ప్రతిష్టంభనకు పరిష్కారమని మౌంట్‌బాటన్‌కు, నెహ్రూకు చెప్పినవారే మేనన్. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అఖండ భారత్‌ను ఖండఖండాలుగా చీల్చి వెళ్లాలని అనుకుంది. 562 స్వదేశీ సంస్థానాలకు సంపూర్ణ స్వాతంత్య్రం ఇస్తూ, భారత్, పాక్‌లను ఏర్పాటు చేస్తూ విభజన ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ ఇదెంత ఘోర తప్పిదమో మేనన్‌కు తెలుసు. సంస్థానాలను స్వాతంత్య్రం వచ్చే నాటికే భారత్‌లో అంతర్భాగం చేస్తేనే ఆ చారిత్రక తప్పిదాన్ని సవరించగలమని మొదట గుర్తించినదీ ఆయనే. పటేల్ చొరవ, మేనన్ చాకచక్యం వల్ల మూడు మినహా మిగిలిన సంస్థానాలన్నీ భారత్‌లో విలీనమైనాయి. ఇదే జరగకపోతే, 562 సంస్థానాలతో రాజకీయ ఏకత్వం లేక ఈ దేశం తల్లడిల్లేది. అవి కొనసాగి ఉంటే ఎన్ని అంతర్యుద్ధాలు జరిగి ఉండేవో! ఎన్ని దేశాలు జోక్యం చేసుకునేవో! సాంస్కృతిక ఏకత్వాన్ని రాజకీయ ఏకత్వంతో పరిపూర్ణం చేయాలన్న స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాన్ని అలా పటేల్, మేనన్ గౌరవించారు. దేశాన్ని అంతర్యుద్ధం బెడద నుంచి బారి నుంచి రక్షించారు. వాపాళ్ పంగుణ్ణి మేనన్ (సెప్టెంబర్ 30, 1893–డిసెంబర్ 31, 1965) కేరళలోని కోథాకురస్సి (మలబార్) అనే గ్రామంలో పుట్టారు. ఒక బంధువు సాయంతో 1914లో సిమ్లా వెళ్లి ప్రభుత్వోద్యోగంలో చేరారు. అది కూడా హోం శాఖలో సహాయకునిగా. తరువాత సంస్కరణల విభాగానికి పంపించారు. చివరి ముగ్గురు వైస్రాయ్‌లు లిన్లిత్గో (1936–1943), వేవెల్ (1943–1947), మౌంట్‌బాటన్ (1947–1948) దగ్గర ఆయన రాజకీయ సంస్కరణల కమిషనర్‌గా పనిచేశారు. ఆ ముగ్గురూ మేనన్ మాటకు ఎంతో విలువ ఇచ్చేవారు. 1942లో సంస్కరణల కమిషనర్ హెచ్‌వి హడ్సన్ వెళ్లిపోయిన తరువాత ఆ పదవిలో భారతీయుడిని నియమించడానికి ఇంగ్లండ్ మీనమేషాలు లెక్కపెట్టింది. కానీ లిన్లిత్గో మేనన్‌ను ఆ పదవికి ఎంపిక చేశారు. స్వాతంత్య్రం గురించి, భారత్‌కు చెందిన ఇతర అంశాలను చర్చించడానికి వేవెల్ ఇంగ్లండ్ వెళ్లినప్పుడల్లా మేనన్‌ను తీసుకువెళ్లేవాడు. మౌంట్‌బాటన్ మేనన్‌ను రాజ్యాంగ సలహాదారుగా నియమించారు. మౌంట్‌బాటన్ సొంత బృందంలో మేనన్ ఒక్కరే భారతీయుడు. మిగిలిన ఇస్మే, కాంప్‌బెల్ వంటి వారందరినీ ఆయన ఇంగ్లండ్ నుంచి తెచ్చుకున్నారు. సిమ్లా సమావేశాల (1945–46)కు మేనన్ సహాయ కార్యదర్శి. మౌంట్‌బాటన్, మేనన్ చర్చించుకునే సమయంలో సంస్థానాలకు స్వాతంత్య్రం ఇవ్వాలన్న మాట వచ్చింది. దీనితో మేనన్ అదే మీ అభిప్రాయమైతే నేను పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఇది తెలిసిన ఎడ్వినా మౌంట్‌బాటన్ కలగచేసుకుని మేనన్‌ను వారించారు. అయినా బ్రిటిష్ ప్రభుత్వం ఆ మహా చారిత్రక తప్పిదం చేసింది. అందులో శ్వేతజాతికి లెక్కకు మించి దురుద్దేశాలు ఉన్నాయి. 1947 ఆగస్టులో స్వాతంత్య్రం వస్తుందనగానే, జూన్ నుంచే పటేల్, మేనన్ సంస్థానాల విలీనం పని ఆరంభించారు. కశ్మీర్‌ది ఒక రకం సమస్య. నిజాం పాక్ వైపు మొగ్గాడు. తన దూతని పాక్‌కు పంపాడు. తిరువాన్కూర్కు స్వతంత్రంగా ఉండాలని ఆశ. ఇది ఫ్రాన్స్‌లో రాయబారిని నియమించేసింది. జునాగఢ్ (గుజరాత్) నవాబు పాక్‌లో చేరతానన్నాడు. తిరుగుబాటు వచ్చింది. తరువాత భారత్‌లో విలీనం చేశారు. జో«ద్‌పూర్ రాజా కూడా పాక్‌లో చేరతానన్నాడు. అతడిని కూడా లొంగదీశారు. కశ్మీర్ అంశాన్ని నెహ్రూ తన చేతుల్లోకి తీసుకున్నారు. నిజాం వివాదాన్ని కూడా నెహ్రూ ఐక్య రాజ్యసమితి భద్రతా మండలికి నివేదించాలనే అనుకున్నారు. అక్కడి పరిస్థితులను చక్క దిద్దడానికి సైన్యాన్ని పంపించాలన్న సర్దార్ పటేల్ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించారు. ఇలాంటి పరిస్థితులలో ఒకే ఒక్క లేఖ నెహ్రూ చేతనే వాళ్లకి (రజాకార్లకి) గుణపాఠం చెప్పాల్సిందే అనిపించేటట్టు చేసింది. ఈ ఘట్టం మొత్తం ఎం కె కె నాయర్ (ఐఏఎస్ అధికారి) రాసిన (మలయాళంలో రాశారు. తరువాత ఆంగ్లంలోకి వచ్చింది) ‘ది స్టోరీ ఆఫ్ యాన్ ఎరా టోల్డ్ వితౌట్ ఇల్ విల్’ పుస్తకంలో ఉంది. బీజేపీ అగ్రనేత ఎల్‌కె అడ్వాణీ దీనిని కష్టపడి సేకరించి తన బ్లాగ్‌లో వివరించారు (నవంబర్ 5, 2013). ఇక్కడ తెలుస్తుంది– మేనన్ ముగ్గురు వైస్రాయ్‌ల దగ్గర పని చేసినా తన జాతీయతా భావాన్ని ఎంత పదిలంగా ఉంచుకున్నారో! నాయర్ ఇలా రాశారు: ‘ఏప్రిల్ 30, 1948న హైదరాబాద్ నుంచి మొత్తం భారత సైన్యం వైదొలగింది. తరువాత రజ్వి, రజాకార్లు సకల నీతినియమాలకు స్వస్తి పలికి సంస్థానమంతా స్వైర విహారం చేశారు. మౌంట్‌బాటన్ నిష్క్రమించడÆ , రాజాజీ గవర్నర్ జనరల్ కావడం అప్పుడే జరిగాయి. నెహ్రూ, పటేల్, రాజాజీలకు హైదరాబాద్ పరిస్థితి పూర్తిగా తెలుసు. నిజాం విపరీత ధోరణులకి స్వస్తి పలకాలంటే సైన్యాన్ని పంపించాల్సిందేనని పటేల్ నమ్మకం. అప్పటికే నిజాం పాకిస్తాన్‌కు తన దూతను పంపించాడు. లండన్ బ్యాంకులోని తన ప్రభుత్వ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో నగదు కూడా బదలీ చేయించాడు. సర్దార్ పటేల్ ఈ విషయాలన్నీ మంత్రిమండలి సమావేశంలో ప్రస్తావించి, హైదరాబాద్‌లో సాగుతున్న భీతావహ పాలనకు అంతం పలకడానికి సైన్యాన్ని పంపించాలని కోరారు. సాధారణంగా నెమ్మదిగా, ప్రశాంతంగా, అంతర్జాతీయ మర్యాదలు పాటిస్తూ మాట్లాడే నెహ్రూ అవన్నీ విడిచి పెట్టేసి, ‘మీరొక పూర్తి మతతత్వవాది. మీ సిఫారసులను నేను ఏనాటికీ ఆమోదించను’ అన్నారు. పటేల్ ఏ భావమూ వ్యక్తం చేయకుండానే వెళ్లిపోయారు.’ హైదరాబాద్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. దీనికి ఒక పరిష్కారం చూడడంతో పాటు, నెహ్రూ, పటేల్ నడుమ సయోధ్యను కూడా సాధించాలని రాజాజీ భావించారు. రాజాజీ మొదట మేనన్తోనే సంప్రతించారు. సైన్యం సిద్ధంగానే ఉందనీ, ఆదేశాలు ఇచ్చిన మరుక్షణమే హైదరాబాద్‌కు బయలుదేరగలదని సమాచారం ఇచ్చారు మేనన్. నెహ్రూ, పటేల్ ఇద్దరినీ మరునాడు వైస్రాయ్ హౌస్‌కు (నేటి రాష్ట్రపతి భవన్) రావలసిందని రాజాజీ ఆహ్వానించారు. మేనన్‌ను కూడా ఆహ్వానించారు. మేనన్ రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరుతుండగా హోం శాఖ కార్యదర్శి బచ్ వచ్చి ఒక లేఖ ఇచ్చాడు. అది బ్రిటిష్ హైకమిషనర్ ఇచ్చినది. దానిని నేరుగా రాజాజీకి ఇచ్చారు మేనన్. ఇద్దరూ చూశారు. లేఖను తన దగ్గరే పెట్టుకున్నారు రాజాజీ. సమావేశంలో రాజాజీ నిజాం సంస్థానం పరిస్థితిని వివరించారు. దేశ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నెహ్రూ తనదైన శైలిలో అలా చేస్తే అంతర్జాతీయంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందని బరువైన మాటలతో చెప్పారు. అప్పుడే మేనన్ తెచ్చిన లేఖను నెహ్రూ ముందు పెట్టారు రాజాజీ. నెహ్రూ ముఖం కందగడ్డ అయింది. బట్టతల మీద నరాలు ఉబ్బాయి, కోపం వల్ల. కుర్చీలో నుంచి లేచి, ఎదురుగా బల్లను గుద్ది ‘ఒక్క క్షణం కూడా వృథా చేయవద్దు. వాళ్లకి గుణపాఠం చెప్పాల్సిందే’ అని అరిచారు. ఇంతకీ ఆ ఉత్తరంలో ఏం ఉంది? అప్పటికి రెండురోజుల క్రితమే ఆ సంస్థానంలో పనిచేసే ఇద్దరు క్రైస్తవ సన్యాసినుల మీద రజాకార్లు లైంగిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఒక కాన్వెంట్లో పనిచేస్తున్న ఆ నన్స్ డబ్బయ్ ఏళ్లవాళ్లు. ఇందుకు బ్రిటిష్ హై కమిషనర్ నిరసన ప్రకటిస్తూ రాసిన లేఖ అది. పథకం ప్రకారం సైన్యాన్ని పంపించవలసిందని కమాండర్ ఇన్ చీఫ్‌కు సమాచారం ఇవ్వమని ఆ క్షణంలోనే రాజాజీ మేనన్‌ను ఆదేశించారు. కథ ఇక్కడితో అయిపోలేదు. అప్పటికి భారత్‌కు, పాక్‌కు ఇంగ్లిష్ సైనిక కమాండర్లే ఉన్నారు. పైగా సమాచారం చేరవేసుకునేవాళ్లు. అలాంటి వాళ్లు ఉండగా ఈ ‘ఆపరేషన్’ (పోలో) ఎలా? అప్పుడు భారత కమాండర్ బూషర్. పాక్ సైన్యాధిపతికి కూడా అక్కడి రాజకీయ నాయకుల వలెనే భారత నేతలంటే పగ. మేనన్ ఆదేశం గురించి బూషెర్ రాజేంద్ర సింగ్‌కు చెప్పారు. రాజేంద్రసింగ్ జనరల్ చౌదరికి తెలియచేశారు. మూడు రోజులే సమయం. ఆ మరునాటి రాత్రే బూషెర్ పాక్ కమాండర్‌తో మాట్లాడాడు. ఆ మరునాడు ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయని అడుగుతూ మేనన్ బూషెర్ గదికి వెళ్లారు. ఏర్పాట్ల గురించి చెప్పబోయాడు బూషెర్. ‘అవన్నీ నాకు తెలుసు, నేను వచ్చింది అవి తెలుసుకోవడానికి కూడా కాదు. ఒకమాట చెప్పు. నిన్న రాత్రి నీవు పాక్ కమాండర్‌తో మాట్లాడావు కదా!’ అని నేరుగా అడిగారు మేనన్. బూషెర్ ముఖం పాలిపోయింది. ‘మేనన్! మిత్రులు వాళ్లలో వాళ్లు మాట్లాడుకోకూడదని చెప్పదలిచావా?’ అన్నాడు బూషెర్. ‘దానిని మిత్రుల మధ్య సంభాషణే అంటారా?’ మేనన్ తిరిగి అడిగారు. ‘అయితే శంకిస్తున్నావా?’ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అన్నాడు బూషెర్. ‘మరి.. ఫ్రెంచ్‌లో ఎందుకు మాట్లాడవలసి వచ్చింది?’ రెట్టించారు మేనన్. ‘ ఇంతకీ ఆ సంభాషణ మిత్రుల మధ్య మాటా మంతి అనే అంటావా?’ అడిగారు మేనన్. ‘అదే!’ అన్నాడు గడుసుగా బూషర్. అప్పుడే ఒక పత్రాన్ని తీసి బూషెర్కి ఇచ్చారు మేనన్. ఆ ఇద్దరు ఫ్రెంచ్‌లో జరిపిన సంభాషణకి ఆంగ్లానువాదమది. ఇదీ అసలు సంభాషణ:బూషెర్: ఈ రాత్రికి హైదరాబాద్ మీద దాడి మొదలవుతోంది. ఎక్కువ రోజులేమీ తీసుకోదు. ఏదైనా చేయాలనుకుంటే సరైన పద్ధతిలో చేయండి!’ పాకిస్తాన్ కమాండర్: కృతజ్ఞతలు. ఇది లియాఖత్ అలీఖాన్‌కి చేరవేస్తాను. జిన్నా తుది క్షణాలు లెక్కిస్తున్నారు.....అప్పుడు భేషజమంతా విడిచి పెట్టి, ‘నేను తప్పు చేశాను. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు వీపీ!’ అన్నాడు చెమటలు పట్టేసిన బూషెర్. బూషెర్ దగ్గర నుంచి ఒక పత్రం వెంటనే తీసుకున్నారు మేనన్. ‘వ్యక్తిగత, ఆరోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నాను. దీనిని వెంటనే ఆమోదించవలసింది.’ అంటే రాజీనామా. వెంటనే జనరల్ కరియప్ప భారత సైనిక దళాల ప్రధానాధికారి అయ్యారు. సంస్థానాల విలీనంలో ఇలాంటి ఎన్నో సామదానభేద దండోపాయాలను మేనన్ ప్రయోగించారు. భారత రాజ్యాంగం, సంస్థానాల విలీనం, రాజకీయ సంస్కరణల మీద తనకున్న లోతైన అవగాహనతో మేనన్ చాలా రచనలు చేశారు. వాటిలో ‘టాన్స్‌ఫర్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా’, ‘ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్’, యాన్ ఔట్‌లైన్ ఆఫ్ ఇండియన్ కానిస్టిట్యూషనల్ హిస్టరీ’ పుస్తకాలు ఇప్పటికీ విలువను కోల్పోకుండా ఉన్నాయి. స్వాతంత్య్రం రావడానికి ముందే ఇంతటి నిర్మాణాత్మకమైన పని చేసిన మేనన్ పటేల్ మరణంతోనే ఒక్కసారిగా తెరమరుగైపోయారు. - డా. గోపరాజు నారాయణరావు -
సృజనం : చివరి కాన్క
పొగమంచు లాంటి నిశ్శబ్దాన్ని బూడిదలాగా రాలుస్తూ ఫోన్ రింగ్. ‘‘ఓసారి అర్జంట్‌గా స్టేషన్‌కి రండి’’ ఇంకేమీ చెప్పకుండా కాల్ కట్ చేసిన మీనన్ గొంతు అటు నుంచి. మీనన్! ఎన్నో ఏళ్ల కిందటి జ్ఞాపకం. రూపం.ఆరేళ్ల కిందట ఎవరో కూడా తెలీని అతణ్ని, వెతికి మరీ ఫోన్ నంబర్ని ఓసారీ, అతడినే తీసుకెళ్లి మరోసారీ... నిత్య ముందుంచిన రెండు చేదు జ్ఞాపకాలు మనసులో మెదిలాయి. మళ్లీ ఇప్పుడూ అతనే. గతంలో జరిగిన అనుభవాలే మళ్లీ మళ్లీ జీవితం ముందు ప్రశ్నల్లా నిలబడటం అంటే ఇదేనేమో!ఇంటికి లాక్ వేసి స్టేషన్‌కి వెళ్తే- అతడింకా లావయ్యాడు. నన్ను మాత్రం, ‘‘మీరేమీ మారలేదు. ఇంకా సన్నబడ్డారు. కళ్ల కింద ఆ నల్ల గీతలేంటి?’’ పరీక్షగా చూస్తూ అడిగాడు. ‘‘ఏంటిలా? ఎక్కణ్నుంచి?’’ అని అడిగాను. ‘‘మెయిల్లో నెల్లూరు వెళ్తూ, ఈ స్టేషన్ చూడగానే అందరూ గుర్తొచ్చి దిగిపోయాను’’ అన్నాడు. ఎప్పటికీ కలవని రైలు పట్టాలు. ఎందర్నో కలుపుతాయి. అంతలోనే విడదీస్తుంటాయి! ‘‘పదండి. నెక్స్ట్ ట్రైన్‌కి చాలా టైమ్ ఉంది’’ అన్నాక, నా వెనక బయటికి నడిచాడు. కొన్నేళ్ల కిందటి జ్ఞాపకం. చలిగాలిలో మానని గాయంలాగా రేగింది. కొన్నేళ్ల కిందట ఇతణ్ని ఇలాగే రిసీవ్ చేసుకుని, నిత్య వాళ్లింటికి తీసుకెళ్లడం గుర్తొచ్చింది. మేరీ డిన్నర్ ప్లేట్లు తెస్తే, సర్వింగ్‌లో తల్లికి సహాయపడుతూ నిత్య... ఎప్పుడో పదమూడేళ్ల వయసులో తమ ఫ్యామిలీలో మెంబర్‌గా మసిలి, ఆ తర్వాత తలెత్తిన సమస్యలకి భయపడి, ఎటో వెళ్లిపోయిన మీనన్‌ని తెచ్చి, జీవితం ముందుంచిన నన్ను ప్రేమగా చూసింది. అయితే, అప్పటి నా గుండెలో ఎన్ని తుపాన్లు సుడి తిరిగాయో! అతడి ముందు నా జీవితాన్ని తాకట్టు పెట్టి, వీళ్ల రొటీన్ లైఫ్‌లో ‘ఇగో’ని తృప్తి పరిచే, ఆనందంతో కూడిన జర్క్ ఇవ్వడానికి ఎన్ని కన్నీటి లోయలు దాటాడో ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు ఆరేళ్ల తర్వాత మళ్లీ మీనన్ ఎందుకు వచ్చాడు? ‘‘వెళ్దామా’’ అన్నాడు. ఆలోచనల దారం తెగి, జ్ఞాపకాలు జలజలా రాలాయి ముత్యపు బిందువుల్లా. ‘‘ఏమైనా తిన్నారా?’’ అడిగాను. ‘‘లేదు. వెళ్తాం కదా?’’ నా కళ్లలోకి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు. అతని భావం అర్థమైంది. ఏమీ బదులివ్వకుండా బండి స్టార్ట్ చేసి, అన్ని రోడ్లూ దాటి, మూడు రోడ్ల జంక్షన్లో ఆపితే, కుడివైపున రెండతస్తుల మేడ... నిశ్శబ్దంగా చీకట్లో. కిందకి దిగబోయిన అతణ్ని వారించాను. ప్రశ్నించే కళ్లతో నన్ను చూసి, తలతిప్పి మేడ పైకి చూశాడు. ఆర్చీలతో విశాలంగా ఉన్న వరండాలో ఎవరూ లేరు. బహుశా అతను ఆశపడి ఉంటాడు. ఆరేళ్ల కిందటిలాగా నిత్య, మేరీ అక్కడ ఉంటారని. ఒకసారి జరిగినట్లే మళ్లీ మళ్లీ జరగాలని, సుఖం, సంతోషం మళ్లీ అలాగే రావాలని ఆశపడతాం. కానీ, నాలిక కొనకి తగిలే చేదుని ఊహించలేం. అదేగా జీవితమంటే! ‘‘ఏమైంది? వాళ్లు లేరా?’’ మీనన్ గొంతు వణికింది. తల అడ్డంగా ఊపాను. ఆ మేడమీద, నిత్యవాళ్లు లేరు. ఎక్కడున్నారో తెలీదు. మేరీది తప్ప అన్ని ఫోన్లూ స్విచ్ఛాఫ్. మెసేజ్ ఇచ్చినా, కాల్ చేసినా ఆన్సర్ ఇవ్వని మేరీ, నిత్య బర్త్‌డే ముందురోజు ఫోన్ చేసి, ‘ఇంకోసారి కాల్ చేసినా, కాంటాక్ట్ చేసినా జాగ్రత్త’ అని ఇచ్చిన వార్నింగ్.ఇదే చెప్పాను. అతను మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి తిరిగి స్టేషన్‌కి చేరుకున్నాక, నెల్లూరు వెళ్లే ట్రైన్ అనౌన్స్మెంట్. ఇద్దరమూ మౌనంగా, కాందిశీకుల్లా రెండో ప్లాట్‌ఫామ్ మీదకి చేరాం. ఉక్కు రంగు పట్టాల మీద ఎర్ర చారల్లా సిగ్నల్ లైట్లు. అప్పుడు పెదవులు విప్పాడు మీనన్.‘‘తప్పంతా నాదే. అప్పట్లో ఏదో గందరగోళం. పోలీసులు, కేసు, కోర్టు... ఇవన్నీ ఫేస్ చేయాలేమో అని భయంతో దూరంగా వెళ్లిపోయాను. నాకు నిత్య అంటేనే ఇష్టం. కానీ మధ్యలో ఏవో ప్రలోభాలు. అంతా అలా ముగిసిపోయింది. మర్చిపోయిన జీవితం మీవల్ల మధ్యలో కొంత గుర్తొచ్చింది. అప్పుడు నిత్య ప్రేమని పొందుతున్న మీమీద ద్వేషభావం. కానీ మీరు కూడా ఎందుకు విడిపోయారు?’’ మీనన్ అడిగాడు. ఏమని చెప్పాలి? టీనేజ్ మొదట్లోనే పేరెంట్స్ మీద గొడవలకీ వాళ్లు విడిపోవడానికీ కారణమైన మీనన్‌ని ఇష్టపడిన నిత్య... అమ్మ, నాన్న విడిపోయాక, అమ్మ ఇన్‌ఫ్లుయెన్స్‌లో పెరుగుతూ, సమాజంలోని మృగాల నుంచి తప్పించుకుంటూ, టీనేజ్ ముగిసే చివరి రోజుల్లో, అనుకోకుండా జీవితం ముందు కనిపించిన నన్ను లతలా బలంగా అల్లుకుని, గుండెకి సంకెలుగా మారి, గాఢంగా ప్రేమిస్తూ, అంతలోనే ద్వేషిస్తూ, పరీక్షలు పెడుతూ, ప్రేమించకుండా ఉండలేకపోయా. ఎప్పటికీ వదలనని ప్రామిస్‌లు పొందుతూ, విడిపోయా. మళ్లీ కలిసిపోయా. నిత్యకి కొత్త జీవితాన్ని, వెలుగుతో కూడిన స్వేచ్ఛని ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేస్తున్నందుకు నన్ను ద్వేషించి, కక్ష కట్టిన అమ్మ, అక్కల ఒత్తిడికి లొంగి, వాళ్లవల్ల నాకు ఏ కీడూ జరగకూడదని తపిస్తూ... అలా అలా నాకు దూరమైన నిత్యకీ నాకూ మధ్య ఉన్న నాలుగేళ్ల ప్రేమ, అనుబంధం గురించి చెబితే... మీనన్‌కి మిగిలిన జీవితమంతా విషాదమే! ఇలాగే నయం. నేను కూడా విడిపోయానని తృప్తిగా వెళ్తాడు. మౌనం కన్నా మాటలు ఏమంత గొప్పవని?! ఇంతలో పెద్దగా శబ్దం చేసుకుంటూ వచ్చింది ట్రైన్. ఎదురుగా ఆగిన కంపార్ట్మెంట్లోకి ఎక్కబోతూ షేక్‌హ్యాండ్ ఇచ్చాడు మీనన్. ‘‘ఒకవేళ వాళ్ల గురించి తెలిస్తే, ఫోన్ చేయండి. అయామ్ వెరీ సారీ మిస్టర్ ఐజాక్. ఇలా జరుగుతుందనుకోలేదు’’ చెప్పి లోపలికి ఎక్కాడు. నేనేమీ మాట్లాడలేదు. ఒక్క కుదుపుతో ట్రైన్ కదిలింది. డోర్లో నిలబడి నన్నే చూస్తున్న మీనన్ కళ్లలో ఏదో సంతృప్తి కనిపిస్తోంది. ఎవరూ లేని ప్లాట్‌ఫామ్ మీద శిలావిగ్రహంలా నిలబడిపోయాను. పాత జ్ఞాపకాలు తెరలుతెరలుగా కడుపునొప్పిలా తిరగబెడుతున్నాయి. ఎప్పుడో ఆరేళ్ల కిందటి నిత్య మాటలు - ‘‘మీనన్ ఎక్కడున్నాడు? కనీసం ఫోన్ నెంబరైనా తేవాలి. అలా తేలేకపోతే, నువ్వు సెల్ఫిష్వి అంటోంది అమ్మ. నన్ను నిజంగా ప్రేమిస్తే, మీనన్‌ని వెతుకుతావు. నాకోసం కాదు. అమ్మ నమ్మకాన్ని వమ్ము చేసి, నువ్వు సెల్ఫిష్వి కాదని రుజువు చేయడం కోసం’’ అంది అప్పుడు నిత్య. ఈ మాట కోసం... ఇదే మీనన్‌ని ఆరేళ్ల కిందట నిత్యవాళ్లముందుంచాను. ఆ తర్వాత ఏవో కారణాలు, మరేవో ద్రోహాలు ఆరోపించి, నిత్యని తనకు కాకుండా చేస్తున్నాననే కోపంతో, నన్ను దూరంగా నెట్టేసి, తనని గుప్పెట్లో పెట్టుకుంది మేరీ. నన్ను శత్రువులా ద్వేషించడం మొదలుపెట్టింది. అసలు నా తప్పేముంది? అయితే మాత్రం ఇప్పుడు నేను చేసింది ఏమిటి. వాళ్లు ఎక్కడున్నారో తెలీదని మీనన్‌కి అబద్ధం చెప్పాను. ఇది తప్పు కాదా? సెల్ఫిష్నెస్ కాదా? వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలుసు. ఆ నిజం చెబితే మీనన్ తప్పకుండా అక్కడికి వెళ్లి కలుస్తాడు. అంతకుముందులాగా మేరీ కూడా మళ్లీ అతన్ని దూరం చేసుకోదు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా లేను కాబట్టి, అంటే, మానవ సంబంధాలన్నీ ఇలాగే ఉంటాయన్నమాట. స్వార్థం లేకుండా ఎక్కడా, ఎవరిలోనూ ఏమీ ఉండదా? చివరికి ప్రేమ కూడా ఉండదా? చుట్టూ చీకటి. చలి గాలి. సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఏదో ట్రైన్ ఔటర్లో హారన్ కొడుతోంది. రైల్పేటలోంచి క్రిస్మస్ కేరల్స్, కేరింతలు, పాటలు... ప్చ్!! ఎప్పుడో జీవితంలోంచి తెలీకుండానే మాయమైన ప్యారడైజ్... మళ్లీ తలుపు తట్టి లోపలికి వస్తుందా? లేక ప్యారడైజ్ లాస్ట్? షర్ట్ జేబులో నాలుగైదు నోట్లు. సెల్‌ఫోన్. రెండు కార్డులు. ఒకటి - మోహన్ ఫౌండేషన్‌కి ఆర్గాన్స్ డొనేట్ చేస్తూ సంతకం పెట్టింది, రెండోది నాకేమైనా జరిగితే తెలియజేయమంటూ కొన్ని ఫోన్ నంబర్లు రాసినది. దీనిలో మేరీ పేరు, ఫోన్ నంబర్. నిత్య పేరు, స్విచ్ ఆఫ్ అయిన నంబర్లు. శాంటాక్లాజ్ లాంటి నిత్య - ఇక ఏ చివరి కాన్కనీ జీవితంలోకి తీసుకురాదని అర్థమయ్యాక, ఇక ఇలా బతకడం కూడా అనవసరమేమో! చీకటి వెలుగుల మిశ్రమం లాంటి ఆ ప్లాట్‌ఫామ్ మీద ఒంటరిగా నిలబడిన నాకు, జీవితం శూన్యంగా అనిపించింది. నాకు ఏమన్నా జరిగితే, ఈ లోకంలో ఎవరికీ తెలియజేయాల్సిన అవసరం లేదనిపించింది. ఫోన్ నంబర్లు రాసిన కార్డుని తీసి, ముక్కలుగా చింపి పట్టాలమీద పడేశాను. రైలు పట్టాలు, ఉక్కురంగులో చల్లగా. ఒక్కసారిగా వాటిని చేత్తో తాకితే, ఎన్నోసార్లు ప్రియమైన వ్యక్తుల్ని దూరంగా తీసుకెళ్లి, మళ్లీ దగ్గరగా తెచ్చిన ఈ చలనం లేని పట్టాల్ని... ఒక్కసారి పెదవులానించి ముద్దుపెట్టుకుంటే... ఔటర్లో కదిలిన ట్రైన్ దగ్గరకొచ్చేస్తోంది. పెద్దగా మోగుతున్న హారన్. రెప్పల వెనుక నిత్య రూపాన్నే గుర్తుచేసుకుంటూ, కళ్లు మూసుకుంటే వేగంగా ట్రైన్. విసురుగా శబ్దం, గాలి... అయిపోబోతోంది... అయిపోబోతోంది. ‘‘ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ..’’ శిలువ మీది జీసస్ చివరి మాటలు గుర్తొస్తుంటే, నా జీవితంలో చివరి క్షణాలు... ఒకే ఒక్క అడుగు ముందుకి కదిపితే, గుర్తుపట్టడానికి కూడా వీలులేని శరీరం... ఇంతలో ఉన్నట్టుండి ఎవరో చెయ్యి పట్టుకుని వెనక్కి లాగడం... నేను అమాంతం ప్లాట్‌ఫామ్ మీద వెల్లికిలా పడిపోవడం... అంతా క్షణాల్లోకి. నా వెనుక బెంచీ చాటు నుంచి స్టేషన్లో ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకునే కుర్రాడు నన్నే భయంగా చూస్తున్నాడు. వీడా నా చావుని ఆపింది? నా జీవితాన్ని పొడిగించింది? ఎప్పుడూ స్టేషన్‌ని అంటిపెట్టుకుని ఉండే ఆ కుర్రాడికి రెండు కిడ్నీలు పాడయ్యాయని నాకు తెలుసు. కనీసం ఒక కిడ్నీ అయినా మార్చడానికి దాత లేడు. రేపో మాపో చావుకి సిద్ధపడిన వీడు... నా చావుకి అడ్డం వచ్చి కాపాడతాడా? మరుక్షణం మనసులో ఏదో ఆలోచన. సిమెంట్లా గడ్డ కడుతూ బలపడుతోంది. చెయ్యెత్తి రమ్మని పిలిస్తే, నీరసంగా నడుచుకుంటూ దగ్గరికొచ్చాడు. ఇలాగే ఉంటే వీడు ఎక్కువ కాలం బతకడు. వీడి జీవితాన్ని పొడిగించే కాన్కని ఏ క్రిస్మస్ తాత తీసుకొస్తాడు? ఒకే ఒక్క గుండెతో, బాధల్ని మాత్రమే నింపుకుంటూ ఎన్నాళ్లు ఎదురుచూస్తూ బతకగలమో తెలీదు. కానీ, ఒక్క కిడ్నీతో మాత్రం... జీవితం గడిపేయొచ్చు. మేరీ అనుకున్నట్లుగా నేను సెల్ఫిష్ని కాదని, అందరి ద్వేషానికీ గురైనా, నా గుండె లోపలి ‘ప్రేమ’ ఇంకా అలాగే ఉందని అర్థమైంది. ఔటర్లో కదిలిన ట్రైన్ దగ్గరకొచ్చేస్తోంది. పెద్దగా మోగుతున్న హారన్. రెప్పల వెనుక నిత్య రూపాన్నే గుర్తుచేసుకుంటూ, కళ్లు మూసుకుంటే వేగంగా ట్రైన్. విసురుగా శబ్దం, గాలి... అయిపోబోతోంది... అయిపోబోతోంది.