
రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా’ పాట సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అనిరుథ్ రవిచందర్ ఈ పాటకు స్వరాలు సమకూర్చి శిల్పారావుతో కలిసి పాడాడు. ఈ పాటకు తమన్నా భాటియా వేసిన స్టెప్‌లను నెటిజనులు షేర్ చేస్తున్నారు. ఈ క్యాచీ బీట్స్ పాట యూ ట్యూబ్‌లో 74 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఈ పాటలో తమన్నా హుక్ స్టెప్స్‌ను అనుసరిస్తూ మిస్ కేరళ (2017) ప్రియాంక మేనన్ అందమైన వీడియో చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 47.2 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కామెంట్ సెక్షన్ హార్ట్ ఇమోజీలతో నిండిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment