
రజనీకాంత్ పేరు ఇప్పుడు సినీ ప్రపంచంలో దద్దరిల్లిపోతోంది. కారణం ఆయన తాజాగా నటించిన జైలర్ చిత్రం కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టడమే. కాగా తదుపరి 'లాల్‌సలామ్' చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో రజనీకాంత్ మొయిదీన్ బాబాగా అతిథిపాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరిగింది. దీనిని ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించడం విశేషం.
(ఇదీ చదవండి: ఏళ్ల తరబడి షూటింగ్.. సుజితకు అరకొర పారితోషికం?!)
లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి కొన్ని కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. ముందుగా రజనీకాంత్ గెస్ట్‌గా నటిస్తున్నారన్న ప్రచారం జరగ్గా తాజాగా ఆయనది ఈ చిత్రంలో ఎక్సెంట్ క్యామియో పాత్ర అని తెలిసింది.
ఇంతకు ముందు రజనీకాంత్ భాషాలో పోషించిన పాత్రకు 10 రెట్లు పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఈయన పాత్ర చిత్రం విలువ భాగంలో ఫుల్లుగా ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జైలర్ చిత్రం తరువాత విడుదలవుతున్న లాల్‌సలామ్ చిత్రంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment