కల్యాణ్ రామ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ ఫిల్మ్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించారు. నవీన్ మేడారం దర్శకత్వంలో దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించిన చిత్రం ఇది.
తాజాగా ఈ సినిమాను నవంబరు 24న విడుదల చేస్తున్నట్లుగా ఆదివారం చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని చేధించే ఓ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కల్యాణ్‌రామ్ ఆకట్టుకోబోతున్నారు’’ అని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్.
Comments
Please login to add a commentAdd a comment