రెండు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ స్టార్ హీరో సినిమా! | Kalyan Ram Devil Streaming In This OTT Platform | Sakshi
Sakshi News home page

Kalyan Ram Devil: రెండు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసిన డెవిల్!

Published Sun, Jan 14 2024 10:02 AM | Last Updated on Sun, Jan 14 2024 11:02 AM

Kalyan Ram Devil Streaming In This OTT Platform - Sakshi

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన చిత్రం ‘డెవిల్‌’. అభిషేక్‌ పిక్చర్స్‌ఫై అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సంయుక్తా మీనన్‌, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అ​ంచనాలు నెలకొన్నాయి. భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది.

తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కల్యాణ్ రామ్ డెవిల్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. బ్రిటీష్‌ కాలంలోని గూఢచారి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ చిత్రం ఈనెల 14 నుంచి స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ట్వీట్‌ చేశారు. థియేటర్లలో చూడడం మిస్సయినవారు ఎంచక్కా కుటుంబంతో కలిసి చూసేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement