దిస్‌ ఈజ్‌ లేడీ రోజ్‌..  | Nandamuri Kalyan Ram Devil Second Single This is Lady Rose Out Now | Sakshi
Sakshi News home page

దిస్‌ ఈజ్‌ లేడీ రోజ్‌.. 

Published Tue, Nov 28 2023 12:46 AM | Last Updated on Tue, Nov 28 2023 12:46 AM

Nandamuri Kalyan Ram Devil Second Single This is Lady Rose Out Now - Sakshi

కల్యాణ్‌ రామ్,ఎల్నాజ్‌ నొరౌజి

కల్యాణ్‌ రామ్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘డెవిల్‌’. ‘ది బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ‘దిస్‌ ఈజ్‌ లేడీ రోజ్‌..’ అంటూ సాగే రెండో పాటను సోమవారం విడుదల చేశారు.

చిత్రసంగీత దర్శకుడు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్వరపరచిన ఈ పాటకు శ్రీహర్ష ఇమాని సాహిత్యం అందించగా, రాజకుమారి పాడారు. ఈ పాటలో కల్యాణ్‌ రామ్‌తో కలిసి బాలీవుడ్‌ బ్యూటీ ఎల్నాజ్‌ నొరౌజీ కాలు కదిపారు. ‘‘ప్రేక్షకులకు ఈ పాట ఓ కనువిందులా ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌ రాజన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement