Abhishek Nama
-
ప్రభాస్ 'స్పిరిట్' సినిమా ఛాన్స్ నాకే దక్కింది: మ్యూజిక్ డైరెక్టర్
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. సంయుక్తా మీనన్ హీరోయిన్గా, మరో హీరోయిన్ మాళవికా నాయర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రసంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ– ‘‘డెవిల్’ సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. ఇది పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి ప్రత్యేక వాయిద్యాలను వాడాం. ‘దూరమే..’ పాటను బుడాపెస్ట్‌లో షూట్ చేశాం. అలాగే ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ పాటను ర్యాపర్ రాజకుమారితో పాడించాం. ఈ పాట సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. అలాగే నేపథ్య సంగీతం చాలా బాగుంటుంది. అయితే సంగీత దర్శకులు, నటీనటులు ఎంత ఎఫర్ట్ పెట్టినా విజువల్ సపోర్ట్ ఉండాలి. ఈ విషయంలో ఈ చిత్రం కెమెరామేన్ సౌందర్ రాజన్‌గారు ప్రాణం పెట్టి అద్భుతంగా వర్క్ చేశారు. సెకండాఫ్‌లోని ఓ ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్‌లో కల్యాణ్‌రామ్ గారి నట విశ్వరూపాన్ని ఆడియన్స్ చూస్తారు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డులు రావొచ్చని నాకనిపిస్తోంది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘భవిష్యత్‌లో డైరెక్షన్ చేసే అవకాశం ఉంది. ఇద్దరు గిటారిస్ట్స్ మాత్రమే ఉండేలా ఓ సినిమా, డ్రమ్స్ శివమణిగారి బయోపిక్ తీయాలని ఉంది. ‘యానిమల్’ తర్వాత బాలీవుడ్లో చాలా అవకాశాలు వస్తున్నాయి. అవి చర్చల దశలో ఉన్నాయి. ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా గారు చేయనున్న ‘స్పిరిట్’ సినిమాకు సంగీతం అందించనున్నాను’’ అన్నారు. -
దిస్ ఈజ్ లేడీ రోజ్..
కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ అంటూ సాగే రెండో పాటను సోమవారం విడుదల చేశారు. చిత్రసంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరచిన ఈ పాటకు శ్రీహర్ష ఇమాని సాహిత్యం అందించగా, రాజకుమారి పాడారు. ఈ పాటలో కల్యాణ్ రామ్‌తో కలిసి బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ కాలు కదిపారు. ‘‘ప్రేక్షకులకు ఈ పాట ఓ కనువిందులా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్. -
డెవిల్స్ ఏంజిల్
కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డెవిల్’. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. సోమవారం (సెప్టెంబర్ 11) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘డెవిల్’ చిత్రంలో సంయుక్త పోషించిన నైషధ పాత్ర ఫస్ట్ లుక్‌పోస్టర్‌ను ‘డెవిల్స్ ఏంజిల్’ అంటూ మేకర్స్ విడుదల చేశారు. ‘‘తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నవంబర్ 24న విడుదల చేస్తాం’’ అన్నారు అభిషేక్ నామా. -
నా కొడుకును బ్లాక్మెయిల్ చేస్తున్నాడు: విజయ్ దేవరకొండ తండ్రి
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు గడ్డుకాలం నడుస్తోంది. గతకొంతకాలంగా సరైన హిట్ లేక నీరుగారిపోయిన అతడికి ఖుషి సినిమా సక్సెస్‌ను తెచ్చిపెట్టింది, కానీ దాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. కారణం.. ఖుషి హిట్ కొట్టిన ఆనందంలో తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు విజయ్. వంద కుటుంబాలకు కలిపి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. ఇంకేముంది, విజయ్ ప్రకటన చూసిందే ఆలస్యం ఓ నిర్మాణ సంస్థ కౌంటర్‌కు దిగింది. పబ్లిక్‌గా టార్గెట్ 'వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి రూ.8 కోట్లు పోగొట్టుకున్నాం, దీనిపై ఎవరూ స్పందించట్లేదు. ఎలాగో మీరు వంద కుటుంబాలకు కోటి ఇస్తామంటున్నారు. అలాగే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ కుటుంబాలను కూడా ఆదుకుంటారని ఆశిస్తున్నాం' అని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. దీంతో విజయ్‌కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. నిజానికి సినిమా లాభనష్టాలనేది నిర్మాత- డిస్ట్రిబ్యూటర్స్ మధ్య వ్యవహారం. కానీ ఇలా పబ్లిక్‌గా డబ్బులివ్వమని హీరో విజయ్ను టార్గెట్ చేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెమ్యునరేషన్ సగం వెనక్కు తాజాగా ఈ వ్యవహారంపై విజయ్ తండ్రి గోవర్దన్ రావు స్పందించాడు. 'వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఆడనప్పుడు విజయ్ తన రెమ్యునరేషన్లో సగం వెనక్కు ఇచ్చేశాడు. తనకు ఇస్తానన్న ఫ్లాట్ కూడా వద్దన్నాడు. ఇంతకంటే ఇంకేం చేయగలడు. అయినా డిస్ట్రిబ్యూటర్‌కు నష్టాలు వస్తే విజయ్ ఏం చేస్తాడు? అది నిర్మాతతో తేల్చుకోవాల్సిన విషయం. అభిషేక్ చాలాకాలంగా మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నాడు. మేము అతడితో మాట్లాడుతున్న విషయం కూడా విజయ్‌కు తెలియదు. అలాంటిది ఇప్పుడేకంగా సోషల్ మీడియాలో నా కొడుకు పేరు ప్రస్తావించడం బాధాకరం. నిజంగా మేము అతడికి ఏమైనా డబ్బులిచ్చేది ఉంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాల్సింది. విజయ్ అతడితో సినిమాలు చేయడు అభిషేక్ నా కొడుకును బ్లాక్మెయిల్ చేయాలని చేస్తున్నాడు. కానీ అతడి పప్పులేమీ ఉడకవు. ఓసారేమో విజయ్ మార్కెట్ పడిపోయిందంటాడు. మరోసారి విజయ్‌తో సినిమా నిర్మించేందుకు అతడి డేట్స్ కావాలంటాడు. అతడు మాట్లాడే మాటలకు పొంతన కుదరడం లేదు. అయినా ఇప్పటికే విజయ్.. దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో సినిమాలు చేసేందుకు సంతకం చేశాడు. కాబట్టి అతడి డేట్స్ ఖాళీగా లేవు. అభిషేక్ నామాతో విజయ్ సినిమాలు చేయడు' అని చెప్పుకొచ్చాడు. Dear @TheDeverakonda , We lost 8 crs in the distribution of #WorldFamousLover, but no one responded over it!! Now as you are donating 1CR to the families with your big heart, Kindly requesting & Hoping for you to save us and our Exhibitors & Distributors families also 🤗❤️… pic.twitter.com/dwFHytv1QJ — ABHISHEK PICTURES (@AbhishekPicture) September 5, 2023 చదవండి: రిలీజ్ పోస్ట్ పోన్.. కొత్త డేట్ చెప్పు గురూ.. -
ఘన్ను భాయ్ వినోదం
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఘన్ను భాయ్’. ‘ఇస్మార్ట్ కా బాప్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమా ద్వారా ఆదిత్య గంగసాని హీరోగా పరిచయమవుతున్నారు. ప్రణయ్ మైకల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘ఘన్ను భాయ్’. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
హీరోయిన్‌తో డేటింగ్.. స్పందించిన నిర్మాత
సినీఇండస్ట్రీలో లవ్ రూమర్స్ కొత్తేం కాదు, ఏ ఇద్దరు కలిసి కనిపించినా వారు ప్రేమలో ఉన్నారంటూ ముడిపెట్టేస్తుంటారు. అయితే హీరోహీరోయిన్లు, దర్శకుడు హీరోయిన్ లవ్‌లో ఉన్నారంటూ తరచూ ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంటుంది. కానీ నిర్మాత, హీరోయిన్ ప్రేమలో పడ్డారని రూమర్స్ రావడం చాలా అరుదు. అయితే కొంతకాలం క్రితం అభిషేక్ నామా, ఓ పాపులర్ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడంటూ ఫిల్మీదునియాలో పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ రూమర్లపై అభిషేక్ నామా స్పందించాడు. 'హీరోయిన్‌తో డేటింగ్ అనేది వుట్టి మాటే! హీరోయిన్లతో కనీసం స్నేహం కూడా లేదు. వారితో లంచ్‌కు కూడా వెళ్లలేదు. నేను ఏ హీరోయిన్‌తోనూ డేటింగ్లో లేను' అని క్లారిటీ ఇచ్చాడు. కాగా అభిషేక్ నామా, రవితేజతో కలిసి నిర్మించిన రావణాసుర ఏప్రిల్ 7న విడుదల కానుంది. మరోవైపు నందమూరి కళ్యాణ్‌రామ్‌తో డెవిల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. డెవిల్ చిత్రానికి సీక్వెల్ కూడా తీస్తానని ప్రకటించాడు అభిషేక్ నామా. -
‘రావణాసుర’లో రవితేజను చూసి షాకవుతారు: అభిషేక్ నామా
‘ధ్రిల్లర్ జోనర్స్ లో షాకింగ్, వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ముందే ఆడియన్స్‌కి తెలిస్తే.. ఆ కిక్కు రాదు. ‘రావణాసుర’ థ్రిల్లర్ మూవీ. అందుకే ఆ సినిమా కథ గురించి బయటకు చెప్పడం లేదు. థియేటర్స్‌లో రవితేజ నటనను చూసి షాకవుతారు’ అని నిర్మాత అభిషేక్ నామా అన్నారు. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా అభిషేక్ నామా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఇంతవరకూ రవితేజ ‘రావణాసుర’లాంటి సినిమా చేయలేదు. ఈ సినిమా చూసిన తర్వాత రవితేజ ఇలా కూడా చేయగలుగుతారా ? అని ప్రేక్షకులు షాక్ అవుతారు. కొత్త కాన్సెప్ట్ . ఇది వర్కౌట్ అయితే హీరోలు ఇలాంటి మరిన్ని కథలు ప్రయత్నిస్తారు. ►రావణాసుర కథ నచ్చి, దానిపై నమ్మకంతోనే డబ్బుపెట్టాం. నమ్మకం ఉన్నపుడు వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు ? మేము నమ్మిన సినిమా మేమే విడుదల చేస్తున్నాం. ►అనుకున్న బడ్జెట్ లోనే ఈ సినిమా పూర్తి చేశాం. సుధీర్ వర్మ టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్. అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్ కి పూర్తి చేశారు. ►ఈ చిత్రంలో రవితేజను చూసి ప్రేక్షకులు థ్రిల్ అయిపోయి షాక్ లో ఉంటారు. రవితేజ గారిని ఇంత కొత్త కోణంలో చూసే సరికి అదిరిపోయింది కదా అనే ఫ్యాక్టర్ వస్తుంది. ఇంటర్వెల్ అదిరిపోతుంది. ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడ విడుదలైన తర్వాత ఇదే సబ్జెక్ట్ తో పాన్ ఇండియా ప్లాన్ చేయాలనే ఆలోచన ఉంది. ►సుధీర్ వర్మతో ‘కేశవ’ సినిమా చేశాను. అది కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది. అయితే బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది. రావణాసురతో బ్లాక్ బస్టర్ వంద శాతం కొడతాం. ►మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ కుటుంబం అంతా సంగీతకారులు. తనకి చాలా ప్రతిభ ఉంది. మొదట ‘సాక్ష్యం’ సినిమా ఇచ్చాను. తర్వాత రవితేజ గారికి చెప్పాను. రావణాసురతో తన ప్రతిభని మరోసారి నిరూపించుకున్నాడు. ►ప్రస్తుతం నేను నిర్మిస్తున్న డెవిల్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. రెండు మూడు నెలల్లో ఏదైనా మంచి డేట్ చూసి విడుదల చేస్తాం. డెవిల్ 2 కూడా ఉంది. 2024లో దాదాపుగా ఏడు సినిమాలు లాంచ్ చేస్తాం. -
రవితేజగారు హిట్టవుతుందన్నారు
‘‘నా కెరీర్లో ‘రాక్షసన్’ కంటే ముందు కూడా మంచి హిట్స్ ఉన్నాయి. కానీ నా మార్కెట్‌ను పెంచిన చిత్రం ‘రాక్షసన్’. ఈ సినిమా తర్వాత నాకు పెద్ద నిర్మాతలు, దర్శకుల నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? అనే కోపంతోనే నిర్మాతనయ్యాను’’ అని విష్ణువిశాల్ అన్నారు. విష్ణు విశాల్ హీరోగా నటించి, నిర్మించిన తమిళ చిత్రం ‘ఎఫ్ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 11న విడుదల కానుంది. హీరో రవితేజ సమర్పణలో అభిషేక్ నామా ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా విష్ణు విశాల్ చెప్పిన విశేషాలు. ► ముందు మను ఆనంద్ ఓ యాక్షన్ స్టోరీ చెప్పారు. వేరే కథ ఉందా? అని అడిగితే ‘ఎఫ్ఐఆర్’ సినిమా లైన్ చెప్పారు. నేను ఈ లైన్‌కి ఓకే చెప్పడంతో ఆయన ఆశ్యర్యపోయారు. ఎందుకంటే ఇలాంటి ఓ సున్నితమైన కథను నేను ఒప్పుకుంటానని ఆయన ఊహించలేదు. ఈ సినిమాను నా స్నేహితుడు ఒకరు నిర్మించాల్సింది కానీ పరిస్థితుల కారణంగా నేనే నిర్మాతగా మారాల్సి వచ్చింది. నేను ఎప్పుడు కులాలు, మతాలు అని చూడను. ఈ సినిమాలో ఏ మతాన్ని, ఎవ్వర్నీ తక్కువగా చూపించలేదు. మతం కంటే మాన వత్వం గొప్పది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ► నా భార్య జ్వాల (బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల) ఫ్రెండ్ ఒకరు రవితేజ దగ్గర వర్క్ చేస్తున్నారు. అలా ‘ఎఫ్ఐఆర్’ సినిమా గురించి రవితేజతో మాట్లాడటం జరిగింది. ఈ సినిమా రఫ్ కట్ చూసిన రవితేజగారు తప్పకుండా హిట్ అవుతుందన్నారు. ‘మీలా నేను కమర్షియల్ సినిమాలు చేయాలనుకుంటున్నాను’ అని నేను రవితేజతో అంటే.. ‘ నేను నీలా కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయాలనుకుంటున్నాను’ అన్నారు. -
విష్ణువిశాల్ ఎఫ్ఐఆర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
విష్ణు విశాల్ హీరోగా నటించిన చిత్రం ‘ఎఫ్ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వంలో విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 11న విడుదల కానుంది. హీరో రవితేజ సమర్పణలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ‘‘డార్క్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఇర్ఫాన్ అహ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో భయంకరమైన ఐయస్ఐ ఉగ్రవాది అబూ బక్కర్ అబ్దుల్లా పరిశోధన ఆధారంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి? అనేది ‘ఎఫ్ఐఆర్’ మూలకథ’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
‘టాలీవుడ్లో మహేశ్ ఒక్కడే డబ్బులు వెనక్కి ఇస్తాడు’
Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్‌బాబు.. వరుస విజయాలను అందుకుంటూ టాలీవుడ్లో టాప్ హీరోగా కొనసాతున్నాడు. సినిమాలతోనే కాదు సేవాగుణంతోనూ కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నారు. వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి ఆ చిన్నారుల తల్లిదండ్రుల పాలిట దైవంగా మారాడు. తోటి వారికి కష్టాలు వస్తే.. తనకు చేతనైనంతవరకు సాయం అందిస్తున్నాడు. సినిమాల విషయంలో కూడా మహేశ్ ఇదే ఫాలో అవుతాడట. తన సినిమాల వల్ల ఎవరికైనా నష్టం వాటిల్లితే వెంటనే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారట మహేశ్ బాబు. ఈ విషయాన్ని అభిషేక్ ప్రొడక్షన్స్ నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు మాత్రమే తన సినిమా వల్ల నష్టం వచ్చిన వారికి డబ్బులు వెనక్కిచ్చి ఆదుకుంటారని అన్నారు. ‘సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించక ఎవరైనా నిర్మాత నష్టపోతే పిలిచి అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారు మహేశ్ బాబు. అంతేకాకుండా తర్వాతి సినిమా ఆయనతో చేసినా, చేయకపోయినా ప్రొడక్షన్ హౌస్‌తో సంబంధం లేకుండా డబ్బు ఇచ్చేస్తారు. టాలీవుడ్లో ఆయన ఒక్కడే ఇలా చేస్తుంటారు. ప్రొడ్యుసర్, నిర్మాత నష్టపోతున్నాడంటే మహేశ్ బాబు ఊరుకోలేరు. నష్టం వస్తే మనీ వెనక్కి ఇవ్వడమే కాకుండా తరువాత సినిమాలు ఇప్పిస్తాడు’అని అభిషేక్ అన్నాడు. అభిషేక్ విషయానికి వస్తే.. ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘అత్తారింటి దారేది’, ‘వరుడు’ ‘హార్ట్ ఎటాక్’, ‘మనం’, కుమారి 21 ఎఫ్’, లోఫర్, రుద్రమదేవి, శ్రీమంతుడు, కబాలి, బ్రహ్మోత్సవం, సుప్రీమ్, వరల్డ్ ఫేమస్ లవర్, ఇస్మార్ట్ శంకర్‌తో పాటు వందలాది తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. అలాగే ‘బాబు బాగా బిజీ, కేశవ, సాక్ష్యం, గూడఛారి వంటి చిత్రాలను నిర్మాతగా వ్యవహరించాడు. చదవండి: మహేశ్ బాబుకు పిన్నిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్! నందమూరి ఫ్యాన్స్‌కి బాలయ్య బాబు అదిరిపోయే అప్డేట్ -
ఏజెంట్ వినోద్
టాలీవుడ్లో పేరు పొందిన డిస్ట్రిబ్యూషన్ , ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన అభిషేక్ పిక్చర్స్ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ‘ఏజెంట్ వినోద్’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమా ప్రీ లుక్‌ను గురువారం విడుదల చేశారు. ‘హారీపోటర్, పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్ , ప్రి¯Œ ్స ఆఫ్ పర్షియా, 2012, బ్యాట్‌మ్యాన్: ద డార్క్ నైట్’ వంటి దాదాపు 40 హాలీవుడ్ చిత్రాలకు వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్‌గా చేసిన నవీన్ మేడారం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దేవా¯Œ ‡్ష నామా, రవి పుట్టా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీ లుక్‌లో పుస్తకాలు, తాళాలు, లాంతరు, టైపింగ్ మెషీన్ , పెన్ను, కెమెరా, గడియారం, ప్రపంచపటం.. వంటి పాత కాలం నాటి వస్తువులు కనిపిస్తున్నాయి. వాటితో పాటు గన్ , రక్తపు మరకలు, ఒక వ్యక్తి నీడ కనిపిస్తుండటంతో ఇది ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ‘‘ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో టైటిల్ రోల్ చేయబోతున్నారు’’ అని అభిషేక్ నామా తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, కెమెరా: జగదీష్ చీకటి. -
త్వరలో షూటింగ్స్‌కి అనుకూలంగా జీవో
‘‘తలసానిగారితో నాది 30ఏళ్ల అనుబంధం. రాజకీయంగా ఆయన ఎదిగినా మాతో రిలేషన్ మాత్రం అలానే ఉంది. సినీ కార్మికులకు అండగా ఉండి నిత్యావసరాలను ఇచ్చారు. సీఎం కేసిఆర్‌గారు కూడా పరిశ్రమ పరిస్థితులను అర్థం చేసుకున్నారు. త్వరలోనే సినిమా చిత్రీకరణలకు అనుకూలంగా జీవోను ఇవ్వనున్నారు’’ అన్నారు ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్. తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, తలసాని సాయికిరణ్ సినీ కార్మికులకు నిత్యావసరాలు అందిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయికిరణ్ మాట్లాడుతూ –‘‘తెలంగాణాను సాధించటంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా కేసిఆర్‌గారు నడిపిస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమ మీద కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తలసాని శ్రీనివాస్ గారికి సినిమాలంటే ప్రేమ. ప్రతి సినిమానూ తొలి రోజే చూస్తారు. చిరంజీవి, నాగార్జున, మిగతా అసోషియేష¯Œ ్స అంతా కలిసి లీడ్ తీసుకుని సినిమాల చిత్రీకరణ గురించి మాట్లాడటానికి సమావేశాలు ఏర్పాటు చేశారు. సీసీసీ ద్వారా, మా ట్రస్ట్ ద్వారా సినీ కార్మికులను ఆదుకుంటాం’’ అన్నారు. నిర్మాత అభిషేక్ నామా కూడా పాల్గొన్నారు. -
గేమ్ మారిపోయింది
‘‘ఒక సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో బాగుందని టాక్ వస్తే మూడోవారం నుంచి వసూళ్లు పెరిగే రోజులు గతంలో ఉండేవి. కానీ ఈ గేమ్ మారిపోయింది. ఇప్పుడు వారాలు కాదు... త్రీ డేస్ గేమ్ అయిపోయింది. సినిమా శుక్రవారం విడుదలైతే, ఆ శుక్రవారం, శనివారం, ఆదివారం ఎంత గ్రాస్ వస్తుందో చూస్తున్నారు. ఆ తర్వాత సినిమా బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారు’’ అని డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అభిషేక్ నామా అన్నారు. అభిషేక్ పిక్చర్స్ సంస్థ వంద సినిమాల డిస్ట్రిబ్యూషన్ మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఈ ప్రయాణంలోని విశేషాలను హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అభిషేక్ నామా ఇలా చెప్పుకొచ్చారు. ► 19 ఏళ్ల వయసులో ‘హ్యారీ పోటర్’ (తెలుగులో)తో డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టాను. దాదాపు 17 ఏళ్లు గడిచిపోయాయి. ఇన్నేళ్లలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేను బాగా ఆడతాయనుకున్న సినిమాలు ఆడని సందర్భాలు ఉన్నాయి. అలాగే రిలేషన్ కోసం నేను అంగీకరించిన సినిమాలు ఉన్నాయి. అయితే ఏ విషయంలోనూ తొందరపడకూడదని నా ఈ జర్నీలో నేర్చుకున్నాను. డిస్ట్రిబ్యూషన్ పరంగా థియేటర్స్ కొరతతో ఇప్పటివరకు నేను ఇబ్బంది పడింది లేదు. ► కంటెంట్ బేస్డ్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అవి హిట్ సాధిస్తే అందులో మంచి కిక్ ఉంటుంది. స్టార్ హీరోస్ సినిమాల ఓపెనింగ్స్ వసూళ్లు ఎలా ఉంటాయో అందరికీ ఎలాగూ ఓ అంచనా ఉంటుంది. ‘కుమారి 21 ఎఫ్, జార్జిరెడ్డి, 2012’ వంటి సినిమాలను మా సంస్థలో డిస్ట్రిబ్యూట్ చేశాం. ‘శ్రీమంతుడు’ వంటి ఇండస్ట్రీ కమర్షియల్ బ్లాక్బాస్టర్ను చూశాం. ► సినిమా చూశామన్న రియల్ ఫీల్ కావాలంటే థియేటర్స్‌కు వెళ్లడమే. సినిమాలకు ఇప్పుడు శాటిలైట్ మార్కెట్ ఎలా అయితే ఉంటుందో, ఓటీటీలకు కూడా అలా ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఉంటుంది. అంతే కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ థియేటర్స్‌ను ప్రభావితం చేయలేవనే అనుకుంటున్నాను. ఒకసారి థియేటర్స్ ఓపెన్ అయితే ప్రేక్షకులు బాగానే వస్తారనే నమ్మకం ఉంది. సినిమా లవర్స్ థియేటర్స్‌కు వస్తారు. ∙కరోనా కారణంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో మార్పులేవి రావనే అనుకుంటున్నాను. రెండు, మూడు నెలల్లో షూటింగ్స్ తిరిగి ఆరంభం కావొచ్చు. నిర్మాణపరంగా దర్శకుడు సుధీర్‌వర్మతో ఓ సినిమా ఉంది. మరో రెండు,మూడు సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయి. -
ఈ సినిమాకి కనెక్ట్ అయ్యాను
సాయి రోనక్, ప్రీతి అస్రాని జంటగా దర్శకద్వయం సుజోయ్, సుశీల్ తెరకెక్కించిన చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. సుశీల్ సుభాష్ కారంపురి, అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూడగానే కనెక్ట్ అయ్యాను. కొడుకు విదేశాలకు వెళితే ఒక తండ్రి ఎంతగా తల్లడిల్లిపోతాడో ఈ సినిమాలో చూపించారు. సుజోయ్, సునీల్ ఈ సినిమా బాగా తీశారు. ఒక సినిమా రిలీజ్‌కు ఎప్పుడూ పడనంత ప్రెజర్ ఈ సినిమాకు పడ్డాను. మహాశివరాత్రికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘వినోదం, సందేశం మేళవించిన చిత్రం ఇది. పాటలు, రీ రికార్డింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి. రాహుల్ సిప్లిగంజ్ రెండు పాటలు పాడారు’’ అన్నారు అప్పిరెడ్డి. ‘‘ఇది న్యూ ఏజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తండ్రీ కొడుకుల అనుబంధం, పిల్లలు వేరే దేశంలో ఉంటే కుటుంబంపై, సమాజంపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా ప్రధానాంశం. డైరెక్షన్ ఫస్ట్ టైమ్ అయినా ఎక్కడా రాజీ పడలేదు’’ అన్నారు సుజోయ్.‘‘కథ చెప్పగానే నిర్మాణంలో భాగస్వామిగా ఉండటానికి అప్పిరెడ్డి ముందుకొచ్చారు. అభిషేక్ నామాగారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వీరిద్దరికీ థ్యాంక్స్. హైదరాబాద్ వాడుక భాషలో ఉండే సంభాషణలు ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు సుశీల్. ‘‘ఇంతకుముందు అమెరికా నేపథ్యంలో వచ్చిన సినిమాలకు మా సినిమా విభిన్నంగా ఉంటుంది. కుటుంబ విలువలు ఉన్న సినిమా. ముగ్గురు స్నేహితులు కలిసి చేసే అల్లరి ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు సాయి రోనక్. నటుడు రాజై రోవన్, రచయిత శ్యామ్ జడల, మార్కెటింగ్ ప్రమోటర్ అభితేజ తదితరులు మాట్లాడారు. -
ప్రెషర్ కుక్కర్ రెడీ
సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం ‘ప్రెషర్ కుక్కర్’. సుజోయ్, సుశీల్ దర్శకత్వం వహించారు. సునీల్, సుజోయ్, అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ హక్కులను అభిషేక్ పిక్చర్స్ అధినేత, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అభిషేక్ నామా దక్కించుకున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. కాన్సెప్ట్ నచ్చడంతో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మా సినిమా టీజర్‌ను కట్ చేశారు. ఈ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ‘ఇస్మార్ట్ శంకర్, రాక్షసుడు’ వంటి హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చర్స్ తాజాగా ‘జార్జ్‌రెడ్డి’ సినిమా హక్కులను కూడా సొంతం చేసుకున్నారు’’ అన్నారు. రాహుల్ రామకృష్ణ, రజయ్ రోవాన్, తనికెళ్ల, సీవీఎల్ నరసింహారావు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: నగేష్ బానెల్, అనిత్ మడాడి, సంగీతం: సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరణ్, హర్షవర్ధన్ రామేశ్వర్. -
విద్యార్థుల సమస్యలపై పోరాటం
ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జార్జిరెడ్డి కథను ‘జార్జిరెడ్డి’ పేరుతో వెండితెరపైకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ టైటిల్ రోల్ చేస్తున్నారు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో అప్పిరెడ్డి నిర్మించారు. సత్య దేవ్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, వినయ్ వర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్‌ను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అధినేత అభిషేక్ నామా సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్, రాక్షసుడు’ సినిమాలను అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. ‘‘జార్జిరెడ్డి’ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి, కెమెరా: సుధాకర్ యెక్కంటి. -
వసూళ్ల వర్షం పడుతోంది
‘‘ఈ రోజు నాకు చాలా మెమొరబుల్. ఇలాంటి రోజు కోసమే రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాను. నాకు ‘రాక్షసుడు’తో మంచి హిట్ ఇచ్చిన సత్యనారాయణగారికి రుణపడి ఉంటాను’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘రాక్షసుడు’. నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిన్న (శుక్రవారం) విడుదల చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అందరూ సినిమా గురించి పాజిటివ్‌గా చెబుతున్నారు. కమర్షియల్‌గానే కాదు.. క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. సత్యనారాయణగారు ఖర్చుకు వెనకాడకుండా తెలుగు రీమేక్ రైట్స్ కొని మాపై నమ్మకంతో మాకు ఇవ్వడమే బిగ్గెస్ట్ సక్సెస్ అని భావిస్తున్నాం. టీమ్ అంతా బాగా కష్టపడ్డాం. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు.‘‘నాపై నమ్మకంతో సినిమా చేసిన సత్యనారాయణగారికి, బెల్లంకొండ సురేశ్, హీరో సాయి శ్రీనివాస్‌కు థ్యాంక్స్. ఈ సినిమా రిజల్ట్ గురించి మూడు రోజులుగా టెన్షన్ పడ్డాను. సినిమా చూసిన తర్వాత నా శ్రీమతి ఫోన్ చేసి ‘బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు’ అని చెప్పింది. నా సక్సెస్‌లో భాగమైన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు రమేశ్ వర్మ. ‘‘ఈ సినిమాను రమేష్ వర్మ ఓ కసితో డైరెక్ట్ చేశాడు. సాయి కూడా ఈ సినిమాతో హిట్ కొట్టాలని వెయిట్ చేశాడు. మామూలు వర్షమే కాదు.. కలెక్షన్ల వర్షం కూడా పడుతోంది. సత్యనారా యణగారు మమ్మల్ని పట్టుదలగా ముందుకు నడిపించారు’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘సాయి తన ఇమేజ్ను పక్కనపెట్టి కంటెంట్ ఉన్న సినిమా చేయడానికి అంగీకరించినప్పుడే సక్సెస్ డిసైడై పోయింది’’ అన్నారు మల్టీ డైమన్షన్ వాసు. సినిమా టోగ్రఫర్ వెంకట్ మాట్లాడారు. -
రాక్షసుడు నా తొలి సినిమా!
‘‘అల్లుడు శీను’ సినిమా ఐదేళ్ల క్రితం విడుదలైంది. అభిమానుల ప్రేమ, ప్రోత్సాహం వల్లే ఇంత దూరం రాగలిగాను. చిన్న చిన్న తప్పులు చేశాను. ఇకపై ఓటమి లేకుండా ఉండటానికి కృషిచేస్తా. మంచి సినిమాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్ నామా రేపు (ఆగస్ట్ 2) విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ‘రాక్షసుడు’ ట్రైలర్‌ను నిర్మాత నారాయణ్‌దాస్ నారంగ్ విడుదల చేశారు. తొలి టికెట్‌ను సాయిశ్రీనివాస్, అనుపమ, కోనేరు సత్యనారాయణ విడుదల చేయగా, తలసాని సాయి యాదవ్ కొన్నారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అభిమానుల ప్రేమ, ఆదరణ పొందడానికి ఇంకా కష్టపడతాను. ఇప్పటి నుండి మన కెరీర్ స్టార్ట్ అయింది. ‘రాక్షసుడు’ నా మొదటి సినిమా. రెండో సినిమా కోసం వేచి చూడండి. నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన సినిమా ‘రాక్షసుడు’. అరుదుగా దొరికే కథ ఇది. ఇంత మంచి స్క్రిప్ట్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ– ‘‘తొలి సినిమా ‘అల్లుడు శీను’తోనే ఏ ఇతర హీరోల సినిమాలకు తీసిపోని విధంగా రికార్డు కలెక్షన్స్‌ను సాధించాడు మా అబ్బాయి శ్రీనివాస్. సొంత ప్రతిభతో పైకి వస్తున్నాడు. కొన్ని సినిమాలకు తెలిసోతెలియకో తప్పులు చేశాం. ఇకపై ఆ తప్పులు చేయకూడదని, అభిమానులను నిరుత్సాహ పరచకూడదనిపించి ఇంత వరకు మరో సినిమాకి కమిట్ కాకుండా ‘రాక్షసుడు’ సినిమాపైనే ఫోకస్ పెట్టాడు. ఇకపై ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఇష్టపడతారో అలాంటివాటిలోనే నటిస్తాడు. తనను ఓ మెట్టు పైకి ఎక్కించే సినిమా ‘రాక్షసుడు’’ అన్నారు. ‘‘చాలా ఉద్విగ్నంగా ఉండే చిత్రం ‘రాక్షసుడు’. చిత్రీకరణలో అస్సలు రాజీపడలేదు. రీషూట్స్ కూడా చేశాం. ఈ సినిమాకు కథే మూలం. ఇలాంటి కథతో నాలుగేళ్లుగా సౌతిండియాలో ఏ సినిమా రాలేదు’’ అన్నారు కోనేరు సత్యనారాయణ. ‘‘ఈ ఏడాది బెస్ట్ హిట్ మూవీస్‌లో ‘రాక్షసుడు’ ఉంటుంది. ఈసారి వందశాతం గట్టిగా హిట్ కొడుతున్నాం’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘మా సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్’’ అని రమేశ్‌వర్మ పెన్మత్స అన్నారు. ‘‘రాక్షసుడు’ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. శ్రీనివాస్ కెరీర్‌కు ఇది టర్నింగ్ పాయింట్’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. ‘‘బెల్లంకొండ సురేశ్‌గారు నన్ను దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్నారు. కానీ అప్పుడు నేను సిద్ధంగా లేకపోవడంతో కుదరలేదు. హీరోగా ఎదిగే క్రమంలో సాయి ప్రతి సినిమాకు కొత్తగా ప్రయత్నిస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. నిర్మాత మల్టీడైమన్షన్ వాసు, డైరెక్టర్ సాగర్, నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, నల్లమలుపు బుజ్జి, నటులు మాదాల రవి, రాజీవ్ కనకాల, కెమెరామేన్ వెంకట్, ఎడిటర్ అమర్, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
లవ్‌స్టోరీకి క్లాప్
హవీష్ హీరోగా రాఘవ ఓంకార్ శశిధర్ దర్శకుడిగా పరిచయం కానున్న చిత్రం ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. దేవాన్ష్ నామా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ వేడుకకు అతి«థిగా విచ్చేసిన దర్శకుడు సుకుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా, సదానంద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఏషియన్ సునీల్ నారంగ్ స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ– ‘‘నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన తల్లిదండ్రులు ఎంత గొప్పవారో, ఓ దర్శకుడికి తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత, హీరో అంతే గొప్ప. 14 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ‘లడ్డు, నన్ను క్షమించు’ వంటి లఘుచిత్రాలను తీశాను. వాటికి నంది అవార్డులు, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. నన్ను దర్శకుడిగా ఎంపిక చేసిన సుకుమార్‌గారికి ధన్యవాదాలు. అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. జూలై చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను జరపనున్నాం’’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ, రొమాంటిక్ లవ్‌స్టోరీ ఇది. ఇందులో హీరోగా నటిస్తున్నందుకు, ఆనందంగా ఉంది. శశి ప్రతిభ ఉన్న దర్శకుడు. భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు. అభిషేక్‌గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్’’ అన్నారు హీరో హవీష్. ‘‘సుకుమార్, మేం నిర్వహించిన షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో శశిధర్ మొదటి బహుమతిని పొందారు. అలా శశిధర్‌కు దర్శకుడిగా తొలి అవకాశం కల్పించాం’’ అన్నారు అభిషేక్ నామా. ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ స్వరకర్త. -
రొమాంటిక్ డ్రామాలో హవీష్
యువ నటుడు హవీష్ కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై కొత్త సినిమా ప్రారంభమైంది. రొమాటింక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్, ఏసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. హవీష్పై చిత్రీకరించిన తొలి షాట్‌కు సుకుమార్ క్లాప్ ఇవ్వగా సదానంద్ కెమెగా స్వీచ్ఆన్ చేశారు. సునీల్ నారంగ్ దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్‌కు స్క్రిప్ట్ అందచేశారు. త్వరలో పూర్తి నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతమందిస్తుండగా సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. -
అందుకు విజయమే సాక్ష్యం
‘‘కొత్త కాన్సెప్ట్‌ని ఆడియన్స్ ఎలా రీసివ్ చేసుకుంటారు? అనే ప్రశ్నకి కొత్త సక్సెస్‌తో సమాధానం చెబుతున్నారు. ఇంత పెద్ద కథను చెప్పడానికి మా టీమ్ అంతా చాలా కష్టపడ్డాం. థియేటర్ నుంచి ఆడియన్స్ ఎలా బయటకు రావాలని కోరుకున్నామో అదే ఫీలింగ్‌తో వస్తున్నారు’’ అని శ్రీవాస్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్ నామా నిర్మించారు. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీత దర్శకుడు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో శ్రీవాస్ మాట్లాడుతూ – ‘‘అభిషేక్‌గారు కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారు. శ్రీనివాస్ ప్రాణం పెట్టి పని చేశాడు. అందరం కూడా కసిగా పని చేశాం. ట్రెండ్‌ని, ట్రెడీషన్‌ని కలిపి తీసిన చిత్రం ‘సాక్ష్యం’’ అన్నారు. ‘‘టీమ్ అందరి సపోర్ట్‌కి థ్యాంక్స్. చాలా కష్టపడి పని చేశాం. ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందనడానికి సక్సెసే ‘సాక్ష్యం’. శ్రీవాస్‌గారు బాగా తెరకెక్కించారు. అభిషేక్‌గారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది’’ అన్నారు బెల్లంకొండ శ్రీనివాస్. ‘‘కొత్త కాన్సెప్ట్‌ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌నెస్ కనిపిస్తోంది. సాయి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తను మంచి యాక్షన్ హీరో అవుతాడు’’ అన్నారు పూజా హెగ్డే. ‘‘సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. అందరం సినిమాను ప్రేమించి పని చేశాం. థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. హ్యాపీగా ఉంది’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘ఈ విజయంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా చూస్తే తప్పు చేయడానికి భయపడతారు అనే భావన కలుగుతుంది’’ అన్నారు మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా. -
విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి
‘‘అల్లుడుశీను’ సినిమా విడుదలై అప్పుడే నాలుగేళ్లయిందంటే నమ్మలేకపోతున్నా. నిన్ననే షూటింగ్ చేసినట్లుంది. సినిమా సినిమాకి సాయి చాలా మెచ్యూర్డ్‌గా ఎదుగుతున్నాడు. ‘సాక్ష్యం’ ట్రైలర్ చాలా బాగుంది. విజువల్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. అభిషేక్ నామా ‘సాక్ష్యం’ని అంత గ్రాండ్‌గా నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హేగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన ‘సాక్ష్యం’ రేపు విడుదలవుతోంది. ‘సాక్ష్యం’ చిత్రంలోని హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ‘డెస్టినీ’ని వినాయక్ రిలీజ్ చేశారు. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘మా టీమ్ అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాం. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తేనే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. అభిషేక్‌గారు ఈ చిత్రాన్ని లావిష్‌గా నిర్మించారు. శ్రీవాస్‌గారి విజన్‌కి ప్రతి ఒక్కరూ న్యాయం చేశారు’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి పెద్ద విజయం అందించాలి’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ‘సాక్ష్యం’ ఉంటుంది. ఇందులో ఇప్పటివరకూ చేయని కొత్త పాత్ర చేశాను. విజువల్స్ చాలా బాగుంటాయి’’ అని పూజాహెగ్డే అన్నారు. -
మినీ బాహుబలి చేశాం
‘‘జయ జానకి నాయక’ సినిమాకి ముందే శ్రీవాస్‌గారు ‘సాక్ష్యం’ కథ చెప్పారు. పంచభూతాల నేపథ్యంలో అద్భుతమైన కథ రెడీ చేశారాయన. ఇప్పటివరకూ చూడని సరికొత్త కథ.. చాలా బాగుంటుంది. పర్సనల్‌గా నాకు బాగా నచ్చింది’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ పంచుకున్న విశేషాలు... ► పంచభూతాలే ఈ జగతికి సాక్ష్యం. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘సాక్ష్యం’. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ ఇలాంటి కథతో సినిమా రాలేదు. బహుశా.. మా సినిమా విడుదల తర్వాత ఈ జానర్లో మరిన్ని సినిమాలు వస్తాయనుకుంటున్నా. ఈ సినిమా కోసం 150 రోజులు పనిచేశాం. ► పాటలు, ఫైట్లు చక్కగా కుదిరాయి. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు పీటర్ హెయిన్స్‌గారు యాక్షన్స్ డిజైన్ చేశారు. ఈ చిత్రంలో డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్ చేశా. ఎంత కష్టపడితే అంత మంచి భవిష్యత్ ఉంటుందని నా నమ్మకం. అందుకే జెన్యూన్‌గా కష్టపడ్డా. వెరీ హ్యాపీ. యాక్షన్ సీక్వెన్స్ చాలా సహజంగా ఉంటాయి. ► ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఇందులో నేను వీడియోగేమ్ డిజైనర్‌గా చేశా. ‘సాక్ష్యం’ కథ వినగానే హిట్ అని తెలుసు. సూపర్ హిట్ చేయాలని యూనిట్ అంతా చాలా కష్టపడ్డాం. ఓ రకంగా మినీ ‘బాహుబలి’ చేశాం. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ చూడదగ్గ చిత్రమిది. ► ఏ సినిమాకైనా నా వైపు నుంచి బెస్ట్ ఇవ్వడానికి కృషి చేస్తా. మినిమం గ్యారంటీ సినిమాలు ఇస్తాడనే పేరు చాలు. నా మార్కెట్ పరిధికి మించి ఎవరూ ఖర్చు పెట్టరు. వసూళ్లు ఒక్కటే కాదు.. శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపితే నా సినిమాలకు నష్టం రాదు. బడ్జెట్ విషయంలో ఎవర్నీ ఒత్తిడి చేయను. నేనెప్పుడూ నిర్మాతల హీరోనే. ► ‘సాక్ష్యం’ వర్క్‌ని ప్రతిరోజూ ఎంజాయ్ చేస్తున్నా అని శ్రీవాస్‌గారు అన్నారు. మంచి విజన్‌తో ఈ కథ రెడీ చేశారు. రెండు పార్ట్‌లుగా తీయాల్సిన సినిమా ఇది. నా లైఫ్‌లో ‘సాక్ష్యం’ చిత్రాన్ని గర్వంగా ఫీలవుతా అని అభిషేక్ నామాగారు అన్నారు. ► కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నా. ఇందులో కాజల్ హీరోయిన్. 70శాతం షూటింగ్ పూర్తయింది. నవంబర్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తేజగారి డైరెక్షన్లో చేస్తున్న సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ఇది చాలా కొత్త కథ. ఫస్టాఫ్‌లో ఫైట్స్ ఉండవు. ఏడేళ్ల కిందటే ఆయన ఈ కథ తయారు చేసుకున్నారు. ఈ సినిమాలో కూడా కాజలే హీరోయిన్. యాక్చువల్లీ ఈ సినిమాకు నాకన్నా ముందే కాజల్‌ని ఫైనలైజ్ చేశారు. తర్వాత నేను వచ్చా. మా కాంబినేషన్ రెండోసారి అనుకోకుండా కుదిరింది. -
హీరో, హీరోయిన్లు కాదు.. కథే రాజు
‘‘ఇండియన్ ఫిలిం హిస్టరీలో మొదటిసారి పంచ భూతాల మీద వస్తున్న సినిమా ‘సాక్ష్యం’. తప్పు చేసినప్పుడు ఎవరూ చూడకుండా చేసాం, తప్పించుకున్నాం అనుకుంటారు. కానీ, కర్మ సాక్షి అనేది ఒకటి ఉంటుందనీ, దాని నుంచి తప్పించుకోవడం కుదరదనేది మా సినిమా మెయిన్ కాన్సెప్ట్’’ అని నిర్మాత అభిషేక్ నామా అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా అభిషేక్ నామా పంచుకున్న విశేషాలు... ► ‘సాక్ష్యం’ కథని శ్రీవాస్‌గారు మొదట బెల్లంకొండ శ్రీనివాస్‌గారికి చెప్పారు. నిర్మాతగా నేను అయితే బాగుంటుందని వాళ్లు అనుకుని నన్ను కలిశారు. శ్రీవాస్ గత సినిమా ‘డిక్టేటర్’ ఎందుకో ఆ సమయంలో వర్కవుట్ కాలేదు. కానీ, ‘సాక్ష్యం’ కథ మీద నమ్మకంతోనే ఆయనతో ఈ సినిమా చేశా. ► ప్రజెంట్ జనరేషన్ మూవీస్‌లో హీరో, హీరోయిన్ల కంటే కథే మెయిన్ కింగ్. సినిమాలో కాశీలో కొన్ని సీన్స్ ఉన్నాయి. వాటిని హైదరాబాద్‌లో తీయలేం కదా?. కష్టమైనా కాశీలోనే తీయాలి. అందుకే ప్రొడక్షన్ కాస్ట్ కొంచెం పెరిగింది. ► ‘సాక్ష్యం’ లో శ్రీనివాస్ వీడియో గేమ్ డిజైనర్‌గా నటిస్తున్నారు. హీరో మార్కెట్ పక్కన పెడితే మంచి కంటెంట్ ఉన్న సినిమాకి ఈ మాత్రం ఖర్చు కరెక్టే అనిపించింది. పెద్ద హీరోలని పెట్టి సినిమా తీసినా, సరైన కథ లేకపోతే ప్రేక్షకులు చూడరు కదా? ► తన సినిమాల్లో శ్రీవాస్ తొలిసారి హీరోని చాలా డిఫరెంట్‌గా చూపించారు. సాయి శ్రీనివాస్‌గారు కూడా లవ్ సీన్స్‌లో చాలా స్టైలిష్‌గా, ఫైట్ సీన్స్ అప్పుడు బాడీని బాగా బిల్డ్ అప్ చేసి నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ చక్కని సంగీతం అందించారు. కథకు తగ్గట్టు, సందర్భానుసారంగా పాటలు వస్తాయి. పాటలు చిత్రీకరించిన లొకేషన్లు అందర్నీ ఆకట్టుకుంటాయి. ► మొత్తం 48మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. వారందరూ స్క్రీన్‌పై గ్రాండ్‌గా కనిపిస్తారు. మా బ్యానర్‌కి ‘సాక్ష్యం’ చాలా ప్లస్ అవుతుంది. కొత్త కాన్సెప్ట్ కావడంతో తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. -
పంచభూతాలే ఈ జగతికి సాక్ష్యం
‘కర్మ సిద్ధాంతం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవరైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నెక్ట్స్ ఏం జరుగుతుంది?’ అనే అంశాల ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘సాక్ష్యం’. బెల్లకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘పంచభూతాలే ఈ జగతికి సాక్ష్యం... కర్మ సిద్ధాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరు’’ అన్న డైలాగ్స్ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. అభిషేక్ నామా మాట్లాడుతూ–‘‘ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌గా ఉన్నాయి. స్క్రీన్‌ప్లే ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫీ హైలైట్. ప్రస్తుతం న్యూయార్క్, గ్రాండ్ కెన్యాన్, న్యూ జెర్సీలోని అద్భుతమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరుగుతోంది. హర్షవర్ధన్ మంచి సంగీతం అందిస్తున్నారు. మేలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు. జగపతిబాబు, శరత్‌కుమార్, మీనా, ‘వెన్నెల’ కిషోర్, జయప్రకాశ్, రవికిషన్ నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: ఆర్దర్ ఎ.విల్సన్. ∙బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే